professional course
-
మూడు సంవత్సరాల్లో 351 కాలేజీలు మూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడేళ్లలో వివిధ వృత్తి విద్యా కోర్సులను నిర్వహించే 351 కాలేజీలు మూత పడ్డాయి. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి వచ్చిన ఫీజు ప్రతిపాదనలతో ఈ విషయం వెల్లడైంది. వచ్చే మూడేళ్లలో ఆయా కాలేజీల్లోని వివిధ కోర్సులకు నిర్ణయించాల్సిన ఫీజుల కోసం కాలేజీ ఆదాయ, వ్యయాలు, కొత్త ఫీజు ప్రతిపాదనలు ఇవ్వాలని టీఏఎఫ్ఆర్సీ కాలేజీల నుంచి ప్రతిపాదనలను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించింది. తాజాగా ఈ నెల 27వ తేదీ వరకు గడువును పెంచింది. అయితే ఇకపై కొత్తగా దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకొని, నిర్ణీత ఫీజు చెల్లించి, హార్డ్ కాపీలను అందజేయాల్సి ఉండటంతో ఈ గడువును పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, గడిచిన మూడేళ్లలో వసూలు చేసిన ఫీజులకు ప్రతిపాదనలు అందజేసిన కాలేజీల సంఖ్యతో పోల్చితే 351 కాలేజీలు మూత పడినట్లుగా తెలుస్తోంది. 2016–17, 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో రాష్ట్రంలోని వృత్తి విద్యా కాలేజీల్లో నిర్వహించే కోర్సులకు వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేసేందుకు కాలేజీల నుంచి అంతకుముందు మూడేళ్ల ఆదాయ వ్యయాలను, కొత్త ఫీజల ప్రతిపాదనలను 2015లో ఏఎఫ్ఆర్సీ స్వీకరించింది. వాటి ఆధారంగా ఫీజులను నిర్ణయించింది. అయితే అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 1,586 కాలేజీలు ఫీజుల ప్రతిపాదనలను ఇచ్చాయి. కానీ ఈసారి 1,235 కాలేజీలు మాత్రమే ఫీజుల ప్రతిపాదనలను ఇవ్వడంతో మిగిలిన 351 కోర్సులను నిర్వహించే కాలేజీలు మూత పడినట్లుగానే అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం ఫీజుల నిర్ణయం కోసం ఏఎఫ్ఆర్సీకి దరఖాస్తు చేసుకుంటేనే ఆ కాలేజీల్లో ఆయా కోర్సులు కొనసాగుతున్నట్లు లెక్క. లేదంటే ఆ కాలేజీలో ఆ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు. అత్యధికంగా బీటెక్, ఎంటెక్‌లోనే.. రాష్ట్రంలో బీటెక్, ఎంటెక్ కాలేజీలే ఎక్కువగా మూత పడ్డాయి. 2015–16 విద్యా సంవత్సరం వరకు 268 కాలేజీలు బీటెక్ కోర్సును నిర్వహిస్తున్నాయి. ఆ కాలేజీలో కొత్త ఫీజుల కోసం అప్పట్లో దరఖాస్తు చేసుకున్నాయి. ఇపుడు 2019 నుంచి 2022 వరకు మూడేళ్ల పాటు వసూలు చేయాల్సిన కొత్త ఫీజుల కోసం కేవలం 197 కాలేజీలే దరఖాస్తు చేసుకున్నాయి. అంటే 71 బీటెక్ కాలేజీలు మూత పడ్డాయి. మరోవైపు ఎంటెక్‌ను నిర్వహిస్తున్న 235 కాలేజీలలో ఇపుడు 130 కాలేజీలు మాత్రమే కొత్త ఫీజుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 105 కాలేజీలు మూత పడ్డాయి. అలాగే గతంలో 228 బీఈడీ కాలేజీలు ఫీజులకు దరఖాస్తు చేసుకోగా, ఇపుడు 196 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. మిగతావన్నీ మూత పడ్డట్టుగానే భావిస్తున్నారు. -
ఇంటర్న్‌షిప్ కెరీర్‌కు తొలిమెట్టు..
ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో తప్పనిసరిగా మారిన జాబ్ రెడీ స్కిల్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, రియల్ టైం ఎక్స్‌పీరియన్స్‌ను అందించేదే ఇంటర్న్‌షిప్. దీనివల్ల ఇటు విద్యార్థులు, అటు కంపెనీలకు మేలు చేకూరుతుంది. ఒక అభ్యర్థి కంపెనీలో ఇంటర్న్‌గా చేరిన తర్వాత అతని పనితీరు, యాటిట్యూడ్ నచ్చితేనే రిక్రూట్ చేసుకునే వెసులుబాటు కంపెనీలకు; పని, కంపెనీ వర్క్ కల్చర్ నప్పుతుందనుకుంటేనే ఉద్యోగంలో చేరే అవకాశం అభ్యర్థులకు ఉంటుంది. విద్యార్థుల్లో జాబ్‌రెడీ స్కిల్స్ పెంపొందించుకోవడంతోపాటు, ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడం.. వాస్తవ పరిస్థితులపై అవగాహన పొందడానికి ఇంటర్న్‌షిప్ ఉపకరిస్తుంది. మేనేజ్మెంట్ నిపుణులకు అకడమిక్స్ పరంగా క్లాస్‌రూంలో బోధించిన అంశాలను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించగలిగే అవకాశం కల్పిస్తుంది ఇంటర్న్షిప్స్. ఎంబీఏ విద్యార్థులకు మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ఇంటర్న్షిప్స్ అవకాశాలు విస్తృతం. ఇంటర్న్‌షిప్ ప్రధాన ఉద్దేశం.. కోర్సు సమయంలోనే నిర్దిష్ట వ్యవధిలో ఓ కంపెనీలో పని చేయడం. ఇంటర్న్‌షిప్ సమయంలో సంస్థలు విద్యార్థుల అకడమిక్ నేపథ్యానికి అనుగుణంగా ఏదైనా విభాగంలో నియమించుకుంటాయి. కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థికి సదరు విభాగంలోని టీంలో ఇంటర్న్ ట్రైనీగా అవకాశం కల్పిస్తాయి. ఆ టీంకు కంపెనీ ఇచ్చిన అసైన్‌మెంట్‌లో పాల్పంచుకునే అవకాశం ఇంటర్న్ ట్రైనీలకు లభిస్తుంది. దాంతో విద్యార్థులకు తమ అకడమిక్ నేపథ్యానికి సరితూనే ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకునే వీలు లభిస్తోంది. ఇంటర్న్షిప్స్ కేవలం ఫైనల్ ఇయర్లోనే కాదు.. కాలేజీలో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా చేసుకోవచ్చు. ప్లేస్‌మెంట్స్ ద్వారానే ఎంబీఏ విద్యార్థులకు వాస్తవ నైపుణ్యాలు ఉండడం లేదు. అధికశాతం మందిలో ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల్లో మారుతున్న అవసరాలకు తగ్గట్లు పనిచేయడానికి పూర్తిస్తాయి సామర్థ్యం లేదు. తాజాగా వివిధ నివేదికలు వెలువరిచిన సమాచారం ఇది. మరోవైపు ఐఐఎంలు వంటి ప్రముఖ బీస్కూల్స్‌లో కోర్సు పూర్తిచేస్తే లక్షల్లోనే ప్యాకేజీలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) లాంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో చేరే విద్యార్థులు భారీ వేతనాలతో కేరీర్ ప్రారంభిస్తుంటే.. స్థానిక కాలేజీల్లో చేరే విద్యార్థులు ఉద్యోగాల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థలు పేరున్న కాలేజీల నుంచే విద్యార్థులను ఎంపిక చేసుకోవడం తెలిసిందే. కొంతమందికి ఇంటర్న్‌షిప్ పేరుతో ఆఫర్ లెటర్లు ఇచ్చి, తర్వాత స్వల్ప కాలవ్యవధిలో పనితీరు నచ్చితే భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. మరి కొంతమందికి నేరుగా ఆఫర్ లెటర్లు జారీ చేస్తుంది. మొత్తమ్మీద టాప్ కంపెనీలు తమతో టచ్‌లో ఉండే ఇన్స్టిట్యూట్లకు వెళ్లి వారికి అవసరమైన, మెరుగైన మానవ వనరులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇంటర్నెట్ ఆయుధంగా టాప్ ఇన్స్టిట్యూట్ల్లోకి కంపెనీలు రిక్రూట్మెంట్ కోసం వస్తున్నాయి.. సరే మిగతా కాలేజీల్లో చదివే విద్యార్థుల పరిస్థితి ఏంటి? వీరికి టాప్ కంపెనీల్లో అవకాశాలు రావా? అంటే.. కొంత కష్టమే అయినా అసాధ్యమైతే కాదని అంటున్నారు నిపుణులు. ఎప్పటికప్పుడు సంబంధిత కంపెనీల వెబ్సైట్లను చూస్తూ ఖాళీలు ఏర్పడినప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్న్‌షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్స్ చేయాలనుకునే అభ్యర్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని.. వాటిని అందిపుచ్చుకోవడానికి ఇంటర్నెట్ సరైన మార్గం అంటున్నారు. దీనిద్వారా టాప్ కంపెనీలు మొదలు స్టార్టప్ కంపెనీలు పోస్ట్ చేసే ఖాళీల గురించి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జాబ్‌పోర్టల్స్ విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ వెతిక పెట్టడంలో ముందుంటున్నాయి. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ మేనేజ్మెంట్ విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా, దాని నేపథ్యానికి సరితూగే సంస్థలు, విభాగాల్లో ఇంటర్న్‌షిప్ కోసం ప్రయత్నించాలి. ఇంటర్న్‌షిప్ ద్వారా రియల్ టైం నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్‌తోపాటు డెసిషన్ మేకింగ్, అనలిటికల్ స్కిల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. కంపెనీలకు ఎదురవుతున్న సమస్యలు, వాటికి ఆ రంగంలోని నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు తెలుసుకునే వీలు లభిస్తుంది. ఇంటర్న్‌షిప్‌లో ఇలా రియల్ టైం ఎక్స్పోజర్, ప్రాక్టికల్ నాలెడ్జ్‌తోపాటు ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థుల పనితీరు కూడా కెరీర్‌కు చక్కటి మార్గం వేస్తుంది. ఇంటర్న్‌షిప్ సమయంలో సదరు టీం మెంబర్‌గా చొరవ, అంకిత భావం, నేర్చుకునే తత్వం, బృందంతో కలిసి పనిచేసే నైపుణ్యంతో చక్కగా వ్యవహరిస్తే సంస్థ యాజమాన్యం నుంచి ఆఫర్ లెటర్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఐఐఎంలు, ప్రముఖ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ పేరిట ఈ సంస్కృతి ఇప్పటికే ఉంది. ఇంటర్న్‌షిప్ వ్యవధి కొద్ది రోజులే ఉన్నప్పటికీ.. విద్యార్థులకు బంగారు అవకాశమిది. ఇంటర్న్‌గా అభ్యర్థులను కంపెనీ ప్రతినిధులు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. ఇంటర్న్‌షిప్ సమయంలో అభ్యర్థులకు ఆర్థిక సహకారం కూడా అందిస్తారు. కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్ తర్వాత ఉద్యోగం ఆఫర్ చేసినా, చేయకున్నా రికమెండ్ చేస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తాయి. ఇవి భవిష్యత్తు ఉద్యోగాన్వేషణలో కీలకంగా ఉంటాయి. కాలేజీల పాత్ర కీలకం మేనేజ్మెంట్ విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ తీసుకురావడంలో ఆయా కాలేజీల పాత్ర కీలకం. సదరు కాలేజీకి ఉండే ఇండస్ట్రీ రిలేషన్‌షిప్స్‌తో కంపెనీలు కాలేజీ విజిట్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసుకుంటాయి. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో ఇంటర్న్షిప్స్ కోసం ప్రయత్నించాలి. కోర్సులో చేరినప్పటి నుంచి ఈ దిశగా ప్రయత్నించాలి. ఫైనలియర్ విద్యార్థులు నవంబర్, డిసెంబర్ కల్లా దరఖాస్తు చేసుకోవాలి. పెరిగిన విద్యార్థుల సంఖ్య దృష్ట్యా అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. సీరియస్‌గా ప్రయత్నించే వారే అవకాశాలను అందిపుచ్చుకోగలరు. ప్రస్తుతం బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రిటైల్ ఇండస్ట్రీల్లో మెరుగైన ఇంటర్న్ అవకాశాలు ఉన్నాయి. -
ఎంసెట్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
► 48 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ► అవాంఛనీయ సంఘటనలు ► చోటుచేసుకోకుండా చర్యలు గుణదల : ప్రొఫెషనల్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే శుక్రవారం నిర్వహించే ఎంసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష) కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు కమిషనర్ గౌతం సవాంగ్ చెప్పారు. వన్‌టౌన్, టూ టౌన్, మాచవరం, సత్యనారాయణపురం, పాయకాపురం, నున్న, పెనమలూరు, సూర్యారావుపేట పరిధిలోని 48 పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్నాహ్నం రెండు గంటల వరకు జరిగే ఇంజినీరింగ్ విభాగానికి, మధ్నాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్ష జరుగుతున్న సమయంలో 250 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడినా, కర్రలు, రాళ్లు తదితర ఆయుధాలతో సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఉపాధి కోర్సులకు ఊతమేదీ?
గుంటూరు ఎడ్యుకేషన్: ‘విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవాలి.. నైపుణ్యాలు లేనిదే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావు. నైపుణ్యాలను అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం విశేషకృషి చేస్తోంది..’ ఇవి టీడీపీ ప్రభుత్వం ప్రతి సందర్భంలో వల్లెవేస్తున్న మాటలు. కానీ వాస్తవంలో పాఠశాల స్థాయిలోని వృత్తివిద్య (ఒకేషనల్ ఎడ్యుకేషన్)పై పూర్తి నిర్లక్ష్యం కనబరుస్తోంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 1984 నుంచి అమల్లో ఉన్న వృత్తివిద్యకు ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. ప్రాక్టికల్ మెటీరియల్, సర్వీసింగ్‌కు బడ్జెట్‌ను నిలిపివేసింది. ఇన్‌స్ట్రక్టర్ల పోస్టుల భర్తీ చేయడం లేదు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులు ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. విద్యార్థుల్లో చేతివృత్తులపై నైపుణ్యాలను పెంచేందుకు 1984-85లో వృత్తివిద్యా కోర్సులను ప్రవేశపెట్టారు. మొదటి సంవత్సరంలో 60 స్కూళ్లలో 8, 9, 10 తరగతుల్లో విద్యుత్ వైరింగ్, గృహోపకరణాల రిపేరు కోర్సులను ప్రారంభించారు. 1985-86 నుంచి ప్రతి జిల్లాలోను 15 హైస్కూళ్లలో ఒక్కోదాన్లో కుట్టుపని-దుస్తుల తయారీ, తోటల పెంపకం, చేపల పెంపకం, ఆరోగ్యం-సాధారణ చికిత్స, గృ హ విద్యుదీకరణం-గృహ విద్యుత్ యంత్రా లు, రేడియో అండ్ టీవీ మెకానిజమ్, వ్యవసాయ యంత్రాలు, సాధారణ మెకానిజం, కంపోజింగ్-ముద్రణ బ్లాక్‌మేకింగ్, బుక్ బైండింగ్, వడ్రంగం వంటి కోర్సులు ప్రవేశపెట్టారు. వృత్తివిద్యా కోర్సును ఎంపిక చేసుకున్న విద్యార్థులకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు ఒకేషనల్ పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణులకు ఎస్ఎస్సీ బోర్డు ప్రత్యేక సర్టిఫికెట్ ఇస్తోంది. దీని ఆధారంగా 10వ తరగతి పూర్తిచేయగానే ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండేవి. దీంతో గ్రా మీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. కరువైన ప్రభుత్వ ప్రోత్సాహం పాఠశాల స్థాయిలో వృత్తివిద్యను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నాలుగేళ్లుగా ప్రాక్టికల్ మెటీరియల్, సర్వీసింగ్‌కు నిధుల్విడంలేదు. వృత్తివిద్య బోధించే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లకు దశాబ్దాలుగా సదుపాయాల్లేవు. పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు ఉద్యోగ విరమణ చేసిన తరువాత పెన్షన్ సదుపాయం లేదు. 60 ఖాళీలను భర్తీ చేయడం లేదు. వృత్తి విద్య అమల్లో ఉన్న పాఠశాలల్లో టైం టేబుల్ 20 శాతం కేటాయించి బోధిస్తున్నారు. -
యువతరం..
‘రాజకీయూలు కుళ్లిపోయూరుు.. అవినీతి పెరిగిపోరుుంది.. వృద్ధ నేతల మూసపద్ధతితో విసిగిపోతున్నాం.. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాం.. ఇక దేశం బాగుపడదు’.. ఇవి నలుగురు Young కలిస్తే మాట్లాడుకునే మాటలు... రాజకీయూల్లోకి రమ్మంటే పారిపోయేవారూ ఉన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో తాము సమాజాన్ని మారుస్తామంటూ ముందుకొస్తోంది యువతరం. దేశభవిష్ర్యత్కు పునాదులుగా నిలవాలని పరితపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజకీయ రంగం వైపు అడుగులేస్తున్నారు. తాము గెలిస్తే నీతినిజాయితీ గల పాలనను అందిస్తామని, అభివృద్ధి పనుల్లో ముందుంటామని హామీ ఇస్తున్నారు. పీజీలు, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన పలువురు పురపోరులో తలపడుతున్నారు. అందులో మహిళలు కూడా ఉండడం విశేషం. ఇన్నాళ్లు కుటుంబం.. చదువుకే పరిమితమైన వారు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా తమ భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు. పారదర్శకమైన సేవలందిస్తా... పేరు : నందాల కవిత విద్యార్హత : ఎంబీఏ, డివిజన్: 25వ డివిజన్, టీడీపీ అభ్యర్థి, కరీంనగర్ ఎందుకు పోటీచేస్తున్నారు: ఏదో జరిగిపోతుందని ప్రజలను భయపెట్టి రాజకీయ నాయకులు లబ్ధిపొందే ప్రయత్నం చేయడం చూసి బాధపడ్డాను. కుటిల రాజకీయాలను ఎదిరించేందుకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కలిగింది. ప్రజా సేవ చేయాలని భావనతో పోటీచేస్తున్నా.. గెలిస్తే ప్రజలకు ఏంచేస్తారు: చెప్పేదొకటి, చేసేదొకటి కాకుండా... ఎన్నికల్లో గెలిచేందుకు ఓట్లు అడిగేటప్పుడు ప్రజలకు ఇచ్చే హామీలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తా. డివిజన్ అభివృద్ధిలో భాగస్వామినవుతా. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవచేస్తా. స్థానికుల నా దృష్టికి తీసుకొచ్చిన వాటిని అధికారులకు వివరిస్తా. ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా పేరు : అంగడి పురుషోత్తం విద్యార్హత : ఎంఏ, బీఈడీ వార్డు నంబర్ : 24వ, టీఆర్ఎస్ మెట్పల్లి ఎందుకు పోటీ చేస్తున్నారు: తెలంగాణ సాధన కోసం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాను. స్థానిక సమస్యలపై అవగాహన ఏర్పడింది. వాటి పరిష్కారానికి రాజకీయాలే అసలై న వేదిక అని అనిపించింది. తెలంగాణ పునర్నిర్మాణం కోసం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు : వార్డులో ప్రధానంగా మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రోడ్లు దెబ్బతిన్నాయి. డ్రెరుునేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. వీటి పరిష్కారానికి పాటుపడుతా. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వార్డును అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. - న్యూస్‌లైన్, మెట్పల్లి యువతతోనే మార్పు.. పేరు : ఎర్రం క్రాంతిప్రియాపటేల్ విద్యార్హత : బీటెక్ ఇంజినీరింగ్(ఫైనలియర్) వార్డు నం: 18వ, టీఆర్ఎస్ అభ్యర్థి, వేములవాడ ఎందుకు పోటీ చేస్తున్నారు: ప్రస్తుత రాజకీయాల్లో యువత పాత్ర ఆవశ్యమైంది. ఎంతసేపూ వృద్ధ రాజకీయాలంటూ నిందించకుండా బరిలోకి దిగడమేసరి అనిపించింది. నాన్న టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు. నాకున్న ఆలోచనను నాన్నకు వివరించి చర్చించా. అందుకు ఆయన సంతోషంగా అంగీకరించారు. పూర్తిస్థాయిలో ప్రజాసేవ చేయాలన్నది నాకోరిక. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు: గెలిచాక జనంతోనే ఉంటా. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటా. చదువుకున్న వారు రాజకీయాల్లో ఉండడంతో ప్రజలకు మేలు జరుగుతుందన్న విశ్వాసం నాకుంది. అప్పుడే నవతెలంగాణ నిర్మాణం మెరుగ్గా సాగుతుందని నమ్ముతున్నా. - న్యూస్‌లైన్, వేములవాడ విద్యాభివృద్ధికి పాటుపడతా... పేరు: గుర్రం జయశ్రీ విద్యార్హత: ఎం.ఫార్మసీ వార్డు: 13వ, టీడీపీ అభ్యర్థి హుజూరాబాద్ ఎందుకు పోటీచేస్తున్నారు: ప్రజాసేవ చేయూలని.. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు: వార్డుల్లో కనీస సౌకర్యాలు కల్పిస్తా. వార్డులో ఉన్న చిన్నారులు, విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహిస్తా. ఆరోపణలు లేకుండా పారదర్శకంగా అభివృద్ధి చేస్తా. నా పనితీరుతో వచ్చే ఎన్నికల్లోనూ వార్డు ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నిక చేసేలా మార్పు చేసి చూపెడతా. - న్యూస్‌లైన్, హుజూరాబాద్