‘రాజకీయూలు కుళ్లిపోయూరుు.. అవినీతి పెరిగిపోరుుంది.. వృద్ధ నేతల మూసపద్ధతితో విసిగిపోతున్నాం.. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాం.. ఇక దేశం బాగుపడదు’.. ఇవి నలుగురు Young కలిస్తే మాట్లాడుకునే మాటలు... రాజకీయూల్లోకి రమ్మంటే పారిపోయేవారూ ఉన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో తాము సమాజాన్ని మారుస్తామంటూ ముందుకొస్తోంది యువతరం. దేశభవిష్ర్యత్‌కు పునాదులుగా నిలవాలని పరితపిస్తున్నారు.
ఉన్నత చదువులు చదివి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజకీయ రంగం వైపు అడుగులేస్తున్నారు. తాము గెలిస్తే నీతినిజాయితీ గల పాలనను అందిస్తామని, అభివృద్ధి పనుల్లో ముందుంటామని హామీ ఇస్తున్నారు. పీజీలు, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన పలువురు పురపోరులో తలపడుతున్నారు. అందులో మహిళలు కూడా ఉండడం విశేషం. ఇన్నాళ్లు కుటుంబం.. చదువుకే పరిమితమైన వారు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా తమ భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు.
పారదర్శకమైన
సేవలందిస్తా...
పేరు : నందాల కవిత
విద్యార్హత : ఎంబీఏ,
డివిజన్: 25వ డివిజన్, టీడీపీ అభ్యర్థి, కరీంనగర్
ఎందుకు పోటీచేస్తున్నారు: ఏదో జరిగిపోతుందని ప్రజలను భయపెట్టి రాజకీయ నాయకులు లబ్ధిపొందే ప్రయత్నం చేయడం చూసి బాధపడ్డాను. కుటిల రాజకీయాలను ఎదిరించేందుకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కలిగింది. ప్రజా సేవ చేయాలని భావనతో పోటీచేస్తున్నా..
గెలిస్తే ప్రజలకు ఏంచేస్తారు:
చెప్పేదొకటి, చేసేదొకటి కాకుండా... ఎన్నికల్లో గెలిచేందుకు ఓట్లు అడిగేటప్పుడు ప్రజలకు ఇచ్చే హామీలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తా. డివిజన్ అభివృద్ధిలో భాగస్వామినవుతా. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవచేస్తా. స్థానికుల నా దృష్టికి తీసుకొచ్చిన వాటిని అధికారులకు వివరిస్తా.
ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా
పేరు : అంగడి పురుషోత్తం
విద్యార్హత : ఎంఏ, బీఈడీ
వార్డు నంబర్ : 24వ, టీఆర్‌ఎస్ మెట్‌పల్లి
ఎందుకు పోటీ చేస్తున్నారు: తెలంగాణ సాధన కోసం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాను. స్థానిక సమస్యలపై అవగాహన ఏర్పడింది. వాటి పరిష్కారానికి రాజకీయాలే అసలై న వేదిక అని అనిపించింది. తెలంగాణ పునర్నిర్మాణం కోసం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.
గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు : వార్డులో ప్రధానంగా మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రోడ్లు దెబ్బతిన్నాయి. డ్రెరుునేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. వీటి పరిష్కారానికి పాటుపడుతా. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వార్డును అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. - న్యూస్‌లైన్, మెట్‌పల్లి
యువతతోనే మార్పు..
పేరు : ఎర్రం క్రాంతిప్రియాపటేల్
విద్యార్హత : బీటెక్ ఇంజినీరింగ్(ఫైనలియర్)
వార్డు నం: 18వ, టీఆర్‌ఎస్ అభ్యర్థి, వేములవాడ
ఎందుకు పోటీ చేస్తున్నారు: ప్రస్తుత రాజకీయాల్లో యువత పాత్ర ఆవశ్యమైంది. ఎంతసేపూ వృద్ధ రాజకీయాలంటూ నిందించకుండా బరిలోకి దిగడమేసరి అనిపించింది. నాన్న టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నారు. నాకున్న ఆలోచనను నాన్నకు వివరించి చర్చించా. అందుకు ఆయన సంతోషంగా అంగీకరించారు.
పూర్తిస్థాయిలో ప్రజాసేవ చేయాలన్నది నాకోరిక.
గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు: గెలిచాక జనంతోనే ఉంటా. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటా. చదువుకున్న వారు రాజకీయాల్లో ఉండడంతో ప్రజలకు మేలు జరుగుతుందన్న విశ్వాసం నాకుంది. అప్పుడే నవతెలంగాణ నిర్మాణం మెరుగ్గా సాగుతుందని నమ్ముతున్నా.
- న్యూస్‌లైన్, వేములవాడ
విద్యాభివృద్ధికి పాటుపడతా...
పేరు: గుర్రం జయశ్రీ
విద్యార్హత: ఎం.ఫార్మసీ
వార్డు: 13వ, టీడీపీ అభ్యర్థి హుజూరాబాద్
ఎందుకు పోటీచేస్తున్నారు: ప్రజాసేవ చేయూలని..
గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు: వార్డుల్లో కనీస సౌకర్యాలు కల్పిస్తా. వార్డులో ఉన్న చిన్నారులు, విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహిస్తా. ఆరోపణలు లేకుండా పారదర్శకంగా అభివృద్ధి చేస్తా. నా పనితీరుతో వచ్చే ఎన్నికల్లోనూ వార్డు ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నిక చేసేలా మార్పు చేసి చూపెడతా.
- న్యూస్‌లైన్, హుజూరాబాద్
యువతరం..
Published Thu, Mar 20 2014 4:02 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement