యువ డిజైనర్‌గా రాణిస్తున్న ముప్పిడి రాంబాబు | Young designer Muppidi Rambabu From andhrapradesh success story | Sakshi
Sakshi News home page

యువ డిజైనర్‌గా రాణిస్తున్న ముప్పిడి రాంబాబు

Jan 29 2025 12:27 PM | Updated on Jan 29 2025 12:38 PM

Young designer Muppidi Rambabu From andhrapradesh success story

డిజైనర్‌.. డిజైర్‌

కష్టే ఫలి.. కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిత మైన సత్యం. చిన్న తనం నుంచే అదే సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ.. కష్టపడి పనిచేయడానికి అలవాటుపడి యువడిజైనర్‌గా డాక్టర్‌ ముప్పిడి రాంబాబు గుర్తింపు సాధించాడు. బొమ్మల తయారీలో కళాకారుడు తన కళకు నైపుణ్యాన్ని జతచేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంతే కాకుండా శిల్పకారుడు, రచయిత, అధ్యాపకుడుగానూ పనిచేస్తున్నాడు. శిల్పకారుల కుటుంబానికి చెందిన ముప్పిడి చెక్క, తాటి ఆకు, జనపనార, రాతి ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అనేక కళాకృతులను రూపొందించడంలో దిట్టగా పేరొందారు. ప్రస్తుతం రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఆర్ట్, క్రాఫ్ట్, డిజైన్‌ ప్రొడక్ట్‌ డిజైనింగ్, ఫ్యాషన్‌ డిజైనింగ్, ఆర్కిటెక్చర్‌గా  గుర్తింపు సాధించారు.  – రాయదుర్గం

పేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి.. 
పేటెంట్‌ పొందిన డిజైన్లను పేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతను అందించాలనేదే నా తపన. మాది కళాకారుల కుటుంబం. కళాకారుల పరిస్థితులు నాకు బాగా తెలుసు. పేటెంట్‌ పొందిన డిజైన్లు ఉచితంగానే అందిస్తా. వాటి తయారీ గురించి వివరిస్తాను. నిర్మల్, కొండపల్లి బొమ్మల తయారీ దారులు కూడా నూతన డిజైన్లలో బొమ్మలు తయారు చేసేలా తగిన సూచనలు అందించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నా.. 
– డాక్టర్‌ ముప్పిడి రాంబాబు, ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ రాయదుర్గం

 మంజూరైన పేటెంట్స్‌.. 
2025లో టేబుల్‌టాప్‌ ఆర్టిక్రాఫ్ట్స్, ఫిల్లింగ్‌ 
2024లో లెదర్, వుడ్‌బర్డ్‌ టాయ్, ఫిల్లింగ్, వుడ్‌ పెన్‌స్టాండ్, ఫిల్లింగ్, డాల్, లెదర్‌ వాల్‌ హ్యాంగింగ్, న్యూస్‌పేపర్‌ బాస్కెట్, డెకరేటివ్‌ యాక్సెసరీస్‌ ఫర్‌ టేబుల్‌టాప్‌ టాయ్స్, ట్రెక్కింగ్‌ బ్యాక్‌ప్యాక్, జ్యువెలరీ బాక్స్‌కేస్‌. 

పీహెచ్‌డీ పూర్తి చేసి.. ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెంలో నిరుపేద కళాకారుల కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించారు. మొదటి, రెండో తరాలకు చదువులేదు. కానీ మూడో తరం వారు జీవనోపాధి కోసం చేతి వృత్తులు చేస్తున్నా, తండ్రి సూచన మేరకు పీహెచ్‌డీ పూర్తి చేశారు. రచయిత, కళాకారుడు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, హెచ్‌ఓడీ, అకడమిక్‌ కన్సల్టెంట్, జూట్‌బోర్డు ప్యానెల్‌ డిజైనర్, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్, తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్, ప్రొడక్షన్‌ డిజైనర్‌ వంటి ఉద్యోగాలు చేశారు. కేంద్ర జూట్‌ బోర్డులో జైనర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఎఫ్‌డీడీఐలో ఫ్యాకల్టీగా చేస్తున్నాడు. 

అవార్డులు, పురస్కారాలు.. 
2024లో పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్‌ (పోట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ) 
2023లో పికాక్‌ అవార్డు (తిరుపతి ఆర్ట్‌ సొసైటీ, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ రివ్యూ అవార్డు) 
2018 జాతీయ సంజీవ్‌దేవ్‌ అవార్డు
2017లో ప్రమోద్‌ కుమార్‌ చటర్జీ జాతీయ అవార్డు 
2016లో విశిష్ట కళా సేవారత్న, రోటరీ యువజన అవార్డు, గురుబ్రహ్మ అవార్డు.

వీటితో పాటు మరికొన్ని అవార్డులు.. పేటెంట్ల సాధనలో తనకంటూ ప్రత్యేకత సాధించిన ఎఫ్‌డీడీఐ ఫ్యాకల్టీ డాక్టర్‌  రాంబాబు 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement