
ఎవరికైనా సరే, అకాల వార్థక్యం వచ్చి మీదపడడానికి వారి అలవాట్లే కారణమంటున్నారు పరిశోధకులు. ఎప్పుడూ యంగ్‌గా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ చెబుతున్నారు. అవి ఫాలో అయితే సరి!
యాంటీ ఏజింగ్ టిప్స్‌లో ముందుగా చెప్పుకునేది మెడిటేషన్ గురించే... మెడిటేషనా... మాకేం సంబంధం అని అసలు అనుకోవద్దు... ఏదో ఒక దాని గురించి కాసేపు ధ్యానం చేసుకోవాలి. మెడిటేషన్ వల్ల మనసు తేలికవుతుంది. శరీరం కూడా రిలాక్స్ అవుతుంది.
ఒత్తిడి నివారణ: ఒత్తిడి లేని వాళ్లు మంచి ఆరోగ్యవంతులని చెక్ చెప్పవచ్చు. అందువల్ల ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులనడిగి తెలుసుకుని వాటిని ఫాలో అయి పోవడమే ఉత్తమం!
సానుకూల భావనలు: నకారాత్మకమైన మాటలు, భావాలు, ఆలోచనల స్థానంలో సకారాత్మకంగా ఉండే మాటలు అలవాటు చేసుకోవాలి. అలా సానుకూల భావనలతో మనసును నింపుకోవడం వల్ల వార్థక్య లక్షణాలు త్వరగా దరి చేరవు.
ఆహారపు అలవాట్లు: ఆకుకూరలు, అల్లం, జీలకర్ర, ధనియాలు, పసుపు, మిరియాలు, తేనె వంటివి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందించి యాంటీ ఏజింగ్ లక్షణాలను పెంపొందిస్తాయి. అందువల్ల నిత్యాహారంలో అవి ఉండేలా చూసుకోవడం అవసరం.
జంక్ ఫుడ్‌కి దూరంగా: కొన్నిరకాల ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం ద్వారా వార్థక్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. అలాంటి వాటి కేటగిరీలో భారీ ఎత్తున మసాలాలు దట్టించి, డీప్ ఫ్రైస్, స్వీట్స్, ఊరబెట్టిన మాంసం, నిల్వపచ్చళ్లకు దూరంగా ఉండాలి.
మసాజ్: శారీరక ఆరోగ్యానికి మసాజ్ లేదా మర్దనా చేయడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే.క్రమపద్ధతిలో చేసే మర్ధన వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి కొత్తకణాలు పుట్టుకొస్తుంటాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా మిసమిసలాడుతుంటుంది. ఇది ఎవరికి వారు చేసుకోవచ్చు లేదా నిపుణుల ఆధ్వర్యంలో మసాజ్ థెరపీ తీసుకోవచ్చు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇదీ చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!
ఉన్నత లక్ష్యాలు... ఉత్తమ అభిరుచులు..
మడిసన్నవాడికి కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్టు ఎవరికైనా సరే, జీవితంలో కొన్ని ఉన్నత లక్ష్యాలు ఉండాలి. వాటిని చేరుకోవడానికి సోపానాలుగా కొన్ని ఉత్తమ అభిరుచులు ఉండాలి. అప్పుడే బుర్ర చురుగ్గా ఉంటుంది. శరీరమూ యాక్టివ్‌గా ఉంటుంది. దాంతో అకాల వార్థక్యం వచ్చి మీద పడదు.
Comments
Please login to add a commentAdd a comment