వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అది యవ్వనంలో ఉండే మెరుపును, బిగుతును కోల్పోతుంది. చర్మంలోని బిగుతూ, మిసమిస పది కాలాల పాటు ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం...
చర్మంపై వయసు ప్రభావం కనపడనివ్వకుండా చేసుకోడానికి అన్నిరకాల పోషకాలు ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోండి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఈ పోషకాలు ఎక్కువ.
ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటంతో పాటు శరీరంలోని లవణాలను కోల్పోకుండా చూసుకోండి. దీనివల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారు. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మేని మెరుపు తో నిగారిస్తూ ఉంటుంది.
గోరువెచ్చని నీళ్లతో... తక్కువ గాఢత ఉన్న మైల్డ్ సోప్‌లు వాడటమే మంచిది.
మంచి మాయిశ్చరైజేషన్ లోషన్స్‌తో చర్మాన్ని పొడిబారకుండా చూసుకోవాలి.
రోజూ ఎండకు వెళ్లే వారు మంచి సస్‌స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి.
శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి.
చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్‌ను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి.
ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ చర్మం ఏజింగ్ ప్రభావానికి గురికాకుండా ఉంటుంది.
(చదవండి: గంటలకొద్ది కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కట్‌లివే..!)
Comments
Please login to add a commentAdd a comment