
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే చీరలో అందంగా మెరిసింది. తన కొత్త సినిమా వెంచర్ కేసరి చాప్టర్ 2 ప్రీమియర్‌కు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. 26 ఏళ్ల వయసులో తొమ్మిదిగజాల డిజైనర్ చీరను ధరించి స్పెషల్ లుక్‌లో అలరించింది.
ప్రీమియర్ రెడీ లుక్‌తో గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. డిజైనర్ పునీత్ బలనా డిజైన్ చేసిన తొమ్మిది గజాల చీర-టోరియల్‌గా పర్ఫెక్ట్‌గా కనిపించింది. రిచ్ పర్పుల్ సిల్క్ చీరకు గోల్డెన్ అండ్ మిర్రర్‌వర్క్ అలంకరణలతో నిండిన చీరలో ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. బ్యాక్‌లెస్ అండ్ హాల్టర్ నెక్ బ్లౌజ్‌ను జతచేసింది.దీనికి తగ్గట్టుగా పూల డిజైన్ తో గోల్డ్ అండ్ డైమండ్స్ పొదిగిన వాటర్ ఫాల్ స్టైల్ చెవిపోగులు ఆమె అందానికి మరింత సొబగులద్దాయి. ఆ రోజు అనన్య ధరించిన యాక్సెసరీలలో సెలబ్రిటీ స్టైలిస్ట్ ప్రియాంక కపాడియా బదానీ సౌజన్యంతో, ఏస్ హెయిర్ స్టైలిస్ట్ ఆంచల్ ఎ మోర్వానీ స్టైల్ చేయగా, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ రిద్ధిమా శర్మ, దోషరహిత బేస్ అనన్య లుక్ కి గ్లామర్‌కి పర్ఫెక్ట్ స్ట్రోక్స్ ని జోడించారు.
కేసరి చాప్టర్ 2
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనన్య పాండే , మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ 'కేసరి చాప్టర్ 2'. విషాదకరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. సి శంకరన్ నాయర్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అనన్య తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. అలాగే శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించాడంటున్నారు విమర్శకులు.

కాగా 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మరియు పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని బాలీవుడ్ నటుడు చుండీ పాండే కుమార్తె అనన్య పాండే. 1998లో అక్టోబర్‌లో పుట్టిన అనన్య చక్కని పొడుగు, అందంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ,పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తెలుగులో విజయ్ దేవరకొండ జోడిగా లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనన్య. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ అనన్యకు పెద్దగా కలిసి రాలేదు.