Kesari
-
ఇంటి పేరు కేసరి.. ఆటలో నేర్పరి..
క్రికెట్ ఈ మాట చెప్పగానే మనలో చాలా మందికి పూనకాలు వచ్చేస్తాయి.. చూసేవాళ్లకే ఆ రేంజ్లో పూనకాలొస్తే.. ఆడేవాళ్ల పరిస్థితి ఏంటి? ఆ మాట అన్నంత ఈజీకాదు ఆడటం.. పైగా గల్లీ టీమ్‌లో ఆడటం ఒకెత్తయితే.. అండర్ –19 జట్టులో ఆడటం మరో ఎత్తు.. అందునా ఓ మహిళ క్రికెట్ టీమ్‌కి సెలక్ట్ కావడం అంటే అదో గొప్ప సక్సెస్‌గానే చెప్పాలి.. అలా క్రికెట్ పట్ల ఎంతో ఆసక్తితో, కఠోరమైన సాధనతో ఐసీసీ అండర్–19 ప్రపంచ మహిళా జట్టుకు ఎంపికైంది రామంతాపూర్‌కు చెందిన కేసరి ద్రితి.. ఈ నేపథ్యంలో ఆమె గురించిన మరికొన్ని విశేషాలు.. - రామంతాపూర్క్రీడల్లో పాల్గొనాలని ఆసక్తి, మక్కువ ఉంటే సరిపోదు.. ఆ క్రీడపై పట్టు సాధించడానికి నిత్యం సాధన చేస్తే ఎటువంటి లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చని నిరూపించింది క్రికెటర్ ద్రితి. తన 13వ ఏట నుంచే మాదాపూర్‌లోని రామానాయుడు క్రికెట్ అకాడమీలో ప్రముఖ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ పర్యవేక్షణలో కఠోర శిక్షణ తీసుకుంటూ పలు క్రికెట్ పోటీల్లో తన ప్రతిభను చూపుతోంది ద్రితి. రామంతాపూర్‌కు చెందిన 18 ఏళ్ల ద్రితి కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూ తనలోని ప్రతిభను చాటుకుంటోంది. ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ద్రితి ప్రతి మ్యాచ్‌లో చిచ్చర పిడుగులా చెలరేగుతూ సునామీల పరుగులు తీస్తూ వికెట్లు తీస్తూ ప్రతిభ చూపుతోంది. తండ్రి శ్రీకాంత్ ప్రోత్సాహంతో.. హైదరాబాద్ క్రికెట్ క్రీడాకారుడైన తన తండ్రి కేసరి శ్రీకాంత్ ఇచి్చన ప్రోత్సాహంతో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్లో ముందుకు కదిలింది. దీంతోపాటు తల్లి సహకారం ద్రితికి ఎంతో మేలు చేసింది. వృత్తిరీత్యా న్యూట్రిషనిస్ట్ అయిన తన తల్లి లావణ్య కేసరి ఆహార నియమాలు, సలహాలు ఫిట్‌గా ఉండటానికి దోహదపడ్డాయి. మాజీ క్రికెటర్ పరమేశ్వర్ భవనాక్ వ్యక్తిత్వ వికాస సూచనలు క్రికెట్లో ద్రితి సంచలనాలను సృష్టించేలా చేస్తోంది. ఇప్పటి వరకూ ద్రితి ఆడిన 115 లీగ్, జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో 695 పరుగులు, అదే విధంగా ఆప్ బ్రేక్ బౌలర్‌గా 155 వికెట్లు తీసి ఆల్‌రౌండర్ ప్రదర్శనతో తన సత్తా చాటుతోంది ద్రితి. క్రికెట్ మ్యాచ్‌లు.. ద్రితి అండర్–19, అండర్–23 వంటి క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొంది. అండర్–19 ఛాలెంజర్ ట్రోఫి ట్రీ సిరీస్ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొంది. మలేíÙయాలో జరిగిన అండర్–19 ఆసియా కప్ పోటీల్లో భారత జట్టులో పాల్గొంది. ఈ పోటీలో భారత్ విజయం సాధించింది. అదే విధంగా జాతీయ క్రికెట్ అకాడమీ దేశంలోని 25 మంది అగ్రశ్రేణి క్రికెట్ క్రీడాకారులతో నిర్వహించిన శిక్షణా శిబిరంలో పాల్గొని శిక్షణలో సీనియర్ల నుంచి క్రికెట్లోని మెళకువలు నేర్చుకుంది.అవార్డులు..పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ద్రితికి పలు మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది బౌలర్ అవార్డులు లభించాయి. – ఐసీసీ అండర్–19 ప్రపంచకప్ మహిళా పోటీలకు కేసరి ద్రితి మలేషియా వేదికగా 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకూ నిర్వహించే అండర్–19 మహిళా టీ 20 ప్రపంచ కప్ పోటీలకు నగరం నుంచి కేసరి ద్రితిని బీసీసీఐ సెలక్ట్ కమిటీ ఎంపిక చేసింది. మలేషియా కౌలాలంపూర్‌లో బయు మస్ ఓవల్‌లో భారత జట్టు (డిపెండింగ్ ఛాంపియన్) అదిత్య మలేíÙయా, వెస్టిండీస్, శ్రీలంక జట్లు గ్రూప్ ఏలో ఉన్నాయి.సీనియర్ మహిళా టీమ్‌లో స్థానమే లక్ష్యంగా.. భారత సీనియర్ మహిళల క్రికెట్ టీమ్ స్థానం సంపాదించి దేశం తరపున పలు అంతర్జాతీయ క్రికెట్లో పాల్గొని అత్యుత్తమ ఆల్ రౌండర్ క్రీడాకారిణిగా నిలబడటమే నా లక్ష్యం. క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో ఆడటానికి కారణం ప్రముఖ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ పర్యవేక్షణలో క్రమశిక్షణతో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఆయన నాకు క్రికెట్లో మెళకువలతోపాటు క్రీడలో ఉన్నప్పుడు ఏ విధంగా మనో నిబ్బరంతో మసలుకోవాలనే ఆదేశాలు, సూచనలు నా ఉన్నత స్థానానికి కారణాలు. – కేసరి ద్రితి -
ప్రతి ఒక్కరి గుండెల్ని తాకే దేశభక్తి పాటలు ఇవే
భారతదేశం తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 15)న జరుపుకుంటుంది. భారతదేశం బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొంది 76 సంవత్సరాలు పూర్తవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వైభవంగా జరుపుకుంటున్నారు. దాదాపు రెండు శతాబ్దాల తర్వాత బ్రిటీష్ వారి నుంచి విముక్తిని సాధించిపెట్టిన నాయకులు, ఇందుకు తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు గుర్తు చేసుకుంటున్నారు. అలా కొన్ని పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 'తేరి మిట్టీ' -కేసరి కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటల్లో తేరి మిట్టి మే మిల్ జవాన్ సాంగ్ ఒక్కటి. ఈ పాట విన్నప్పుడల్లా మనస్సు ఉప్పొంగుతుంది. గీత రచయిత మనోజ్ ముంతాషిర్ ఎంతో గొప్పగా రచించారు. ఈ పాట విన్న తర్వాత అందరిలో దేశభక్తి భావం రాకుండా ఉండదు. ఈ పాటను 1బిలియన్కు పైగా వీక్షించారు. 'మేమే ఇండియన్స్' - ఖడ్గం కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దేశభక్తి మూవీ 'ఖడ్గం'. నేటి తరానికి దేశ భక్తి అంటే ఏంటో తెరపై చూపించిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన 'మేమే ఇండియన్స్' పాట ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని సింగర్ హనీ ఆలపించారు. 'ఎత్తరా జెండా' - RRR విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ పడే సమయంలో 'నెత్తురు మరిగితే ఎత్తరా జెండా' అనే పాట వస్తుంది. దేశభక్తిని చాటిచెప్పే ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పలువురు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్‌లో కనిపిస్తారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఈ సెలబ్రేషన్ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్ కలిసి ఆలపించారు. 'దేశం మనదే తేజం మనదే' - జై తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రం 'జై'. ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన 'దేశం మనదే తేజం మనదే' సాంగ్ ఎవర్ గ్రీన్ దేశభక్తి గీతంగా నిలిచింది. బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్ కలిసి పాడిన ఈ పాటకు కులశేఖర్ సాహిత్యం సమకూర్చారు. 'పాడవోయి భారతీయుడా' -వెలుగు నీడలు 'పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయ గీతికా' అంటూ మహాకవి శ్రీ శ్రీ రాసిన దేశభక్తి గీతం ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున మార్మోగుతూనే ఉంది. ఈ పాట వచ్చిన 13 ఏళ్ల తరువాత అక్కినేని నాగేశ్వరరావు 'వెలుగు నీడలు' చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన ఈ పాటను పి.సుశీల , ఘంటసాల పాడారు. ఈ పాట వచ్చి 60 సంవత్సరాలు గడిచినా నేటికీ క్లాసిక్ దేశభక్తి గీతాల్లో ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది. 'పుణ్యభూమి నాదేశం' -మేజర్ చంద్రకాంత్ ఇక ఎన్టీఆర్ క్లాసిక్ హిట్స్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపాట. మేజర్ చంద్రకాంత్ మూవీలోని 'పుణ్యభూమి నాదేశం నమో నమామి'. దేశం కోసం ప్రాణం అర్పించిన ఎందరో మహానుభావున త్యాగాలను గుర్తు చేస్తూ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈపాటకు కీరవాణి స్వరాలను సమకూర్చారు. 'వినరా.. వినరా' రోజా ఏ.ఆర్ రెహమాన్ దేశభక్తి గీతాలు యూత్‌లో దేశభక్తిని రగిల్చాయి. రోజా చిత్రంలో వినరా.. వినరా.. దేశం మనదేరా అంటూ రాజశ్రీ రాసిన పాటతోపాటు.. మా తేఝే సలాం వందేమాతరం అంటూ రెహమాన్ పాడిన పాట సంచలనం అయ్యింది. -
ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిలించే సినిమాలు ఇవే
సినిమా అనేది వినోదాన్ని మాత్రమే కాదు పంచుతుందనుకుంటే పొరపాటే.. కొన్ని సనిమాలు యువకుల్లో దేశభక్తిని రగిలించింది. అందుకు తగినట్లుగానే కొందరు హీరోలు,దర్శకులు కథలను ఎంచుకుంటుంటారు. ఇలా వారు భారీ విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. మన హీరోలు స్వాతంత్ర సమర యోధులుగా, దేశాన్ని రక్షించే వీరులుగా కనిపించి ఆకట్టుకున్నారు. అలాంటి సినిమాలపై 77వ స్వాతంత్య్రం సందర్భంగంగా కొన్నింటిపై ఫోకస్ చేయండి. గాంధీ (1982) 1982లో వచ్చిన గాంధీ సినిమా రిచర్డ్ అటెన్ బరో తీశారు. అస్కార్ అవార్డు పొందిన సినిమా ఇది. బెన్ కింగ్ స్లే గాంధీగా నటించారు. భారత స్వతంత్ర పోరాటాన్ని, గాంధీ జీవితాన్ని తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే. గాంధీజీ పై చాలా సినిమాలు వచ్చాయి. కానీ 1982లో తెరకెక్కిన గాంధీ సినిమా మాత్రం ప్రత్యేకం. అయితే దానికి ప్రత్యేకమయిన కారణం కూడా ఉంది. ఈ సినిమాను రూపొందించింది ఇంగ్లాండ్‌లో పుట్టిపెరిగిన రిచర్డ్ అటెన్‌బరో అనే ఫిల్మ్ మేకర్. ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ కూడా. ఇక ఆ సినిమాలో గాంధీగా నటించింది కూడా బ్రిటిష్ యాక్టర్ అయిన బెన్ కింగ్స్లే. ఇలా ఏ దేశం పై అయితే గాంధీజీ తన పోరాటాన్ని సాగించారో వాళ్ళే మళ్ళీ ఆయనపై సినిమా తియ్యడం, దాన్ని ఇంగ్లాండ్‌లో కూడా రిలీజ్ చేస్తే అక్కడ అది ఘనవిజయం సాధించడం అనేది సామాన్యమయిన విషయం కాదు. పైగా ఆ సినిమాలో గాంధీజీ పాత్రను అద్బుతంగా పోషించిన బెన్ కింగ్స్లే కి అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. అంటే గాంధీజీ జీవితంలో ఉన్న సారాంశం ఎంత గొప్పది అనేది ఆ సినిమాలో చూపించడం వల్ల, అది అందరి మనసులకు హత్తుకోవడం వల్ల ఆ విజయం సాధ్యమయింది. భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో ఆగష్ట్రు 14వ తేదీ నుంచి 24 వరకు 'గాంధీ' చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ (2000) భీంరావ్ రాంజీ అంబేడ్కర్ పాత్రలో మమ్ముట్టి రోల్ ఔట్‌స్టాండింగ్ అనే చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా జబ్బర్ పటేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదట ఆంగ్లంలో నిర్మించబడింది. తరువాత ప్రాంతీయ భాషలలోకి డబ్ చేయబడింది. ఈ చిత్రంలో మమ్ముట్టి డాక్టర్ అంబేడ్కర్ పాత్రను పోషించారు. అతని నటనకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అంబేద్కర్ యొక్క పోరాటాలను దృశ్యమానం చేసిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్రం, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించాలని పిలుపునిచ్చింది. నిర్మాణాన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. డాక్టర్ అంబేద్కర్గా మమ్ముట్టి నటన మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002) హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ తోటి సభ్యులతో కలిసి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారుడు భగత్ సింగ్ గురించి 2002లో ఈ చిత్రం విడుదల అయింది. ఇందులో అజయ్ దేవగన్ టైటిల్ క్యారెక్టర్‌తో పాటు సుశాంత్ సింగ్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో భారత స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ జీవిత చరిత్రను పూర్తిగా చూపించారు. 1931 మార్చి 24న అధికారిక విచారణకు ముందు జలియన్ వాలాబాగ్ మారణకాండను చూపినప్పటి నుంచి భగత్ సింగ్ ని ఉరి తీసే వరకు ఈ సినిమాలో చూయించారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఉరికంబానికి ఎలా ఎక్కాడో తెలిపే చిత్రమే ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. లగాన్ (2001) బ్రిటీషు పాలనలో భూమి పన్ను రద్దుకు వ్యతిరేకంగా ఓ గ్రామ ప్రజలు క్రికెట్ ఆడటానికి నిర్ణయించుకుంటారు. అప్పటివరకూ అలవాటు లేని ఆట అది. పన్ను భారం తగ్గాలంటే ఆడి గెలవాల్సిందే. ఆడారు.. గెలిచారు. ఆమిర్ ఖాన్ నటించిన ఈ ‘లగాన్’ చిత్రకథను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2001లో ఈ సినిమా విడుదలైంది. అప్పట్లో ఎందరిలోనే దేశభక్తిని రగిలించిన సినిమా ఇది. ఇప్పటికి ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు దాటినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ (2004) నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా వచ్చిన Netaji Subhas Chandra Bose: The Forgotten Hero హిందీ చిత్రం 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ ఎపిక్ బయోగ్రాఫికల్ వార్ని సినిమాగా తెరకెక్కించింది. ఇందులో నేతాజీగా సచిన్ ఖేడేకర్ కరెక్ట్‌గా సెట్ అయ్యారు. బ్రిటీష్ ఇండియాలో మహాత్మా గాంధీతో రాజకీయ విబేధాల తర్వాత, బోస్ అరెస్టు, విడుదలయ్యాక జరిగిన కథను వివరించారు. ఈ చిత్రానికి ఇండియన్ ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ దక్కింది. సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును కూడా దక్కింది. అలాగే 70వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంయుక్తంగా సమర్పించిన ఇండిపెండెన్స్ డే ఫిల్మ్ ఫెస్టివల్లో ఆగష్టు 14, 2016న ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ సినిమాకు శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఎమ్ ఎక్స్ ప్లేయర్,యూట్యూబ్‌లో ఈ సినిమా ఉంది. సర్దార్ (1993) 1993లో ఈ చిత్రం విడుదలైంది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలను ఇండియన్ ఆఫ్ యూనియన్‌లో చేరేలా శ్రమించిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జీవితం ఆధారంగా నిర్మించిందే ఈ చిత్రం. ఈ సినిమాలో పరేష్ రావల్ సర్దార్‌గా నటించారు. ఈ సినిమాలో క్విట్ ఇండియా ఉద్యమంలో జరిగిన అల్లర్లతో పాటు నెహ్రుతో సర్దార్కు ఉన్న విబేధాలను చూపుతుంది. సర్దార్ లాంటి వ్యక్తి లేకుండా ఉండి ఉంటే భారత్ ఇప్పటికి కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని చెప్పవచ్చు. యూట్యూబ్‌లో ఈ సినిమాను చూడొచ్చు కేసరి (2019) కేసరి 2019లో విడుదలైన బాలీవుడ్ సినిమా. 1897న భారత్‌లోకి సుమారు 10 వేలకు పైగా ఆఫ్ఘన్ దళాలు ఒక్కసారిగా చొచ్చుకొని వస్తారు. అప్పుడు వారందరినీ కేవలం 21 మంది సిక్కులు మాత్రమే ఎలా అడ్డుకున్నారు. అనేది ఈ సినిమాలో చూపిస్తారు .ఈ దళాల మధ్య 30 గంటల పాటు జరిగిన భీకర పోరాట సన్నివేశాలు మెప్పిస్తాయి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మంగళ్ పాండే: ది రైజింగ్ (2005) మంగళ్ పాండే జీవితం ఆధారంగా 2005లో కేతన్ మెహతా దర్శకత్వంలో మంగళ్ పాండే: ది రైజింగ్ మూవీ వచ్చింది. ఇందులో ఆమీర్ ఖాన్ లీడ్ రోల్లో నటించారు. మంగళ్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో జులై 19, 1827న జన్మించారు. పాండే బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీలో రెజిమెంట్‌లో సిపాయిగా చేరారు. అప్పట్లో అతను తన అసాధారణమైన ప్రతిభ, తెగువతో సైనిక దళ నాయకుడిగా ఎదిగారు. అయితే ఆ కాలంలో బ్రిటిష్ వారు అందించిన తుపాకీ తూటాలను సిపాయిల వీసమెత్తు నచ్చలేదు. ఈ గుండ్లకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసేవారు. వాటిని పేల్చాలంటే సిపాయిలు నోటితో కొరికి తొక్క తీయాల్సి ఉంటుంది. హిందువులు, ముస్లింల మత విశ్వాసాలకు ఇది విరుద్ధమని భావించిన సిపాయిలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. బ్రిటీషర్లు మొదట జంతువుల కొవ్వును ఉపయోగించలేదని చెప్పారు. కానీ అది కోవ్వేనని పాండే, ఇతర సైనికుల్లో సందేహాలు మరింత బలపడ్డాయి. ఆ సందేహాలే చివరికి బ్రిటిష్ రాజ్యాధిపత్యంపై తిరుగుబాటుకు ఎలా దారితీసింది. పాండే ఉరి శిక్ష సమయంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మణికర్ణిక (2019) 2019లో వచ్చిన ఈ సినిమా ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఆదారంగా బాలీవుడ్లో తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్ ఝాన్సీగా తన నటనతో భారతీయులను మెప్పించింది.1828లో వారణాసిలో తన పుట్టుకతో కథ మొదలౌతుంది. పరాక్రమానికి మారుపేరుగా లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఉంటుంది. ఝాన్సీ రాజు అయిన గంగాధర్ రావుతో ఆమెకు వివాహం అవుతుంది. రాజ్యం గంగాధర్ అన్న అయిన సధాశివ్ బ్రిటీష్ వారితో కలిసి కుట్ర పన్నుతాడు. అందులో భాగంగా గంగాధర్ రావును బ్రిటీష్ వారు చంపేస్తారు. తన భర్తకు ఇచ్చిన మాట కోసం ఝాన్సీ లక్ష్మీ భాయ్‌గా రాజ్యాధికారం అందుకుంటుంది. ఈ క్రమంలో తెల్లవారిపై ఆమె చేసిన దండయాత్ర ఎలా ఉంటుందో చెప్పేదే మణికర్ణిక చిత్రం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. -
‘భగవంత్ కేసరి’.. ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌కు జూన్ 10 పండుగరోజు. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానుల కోసం ‘భగవంత్ కేసరి’ టీజర్‌ను వదిలారు. బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. (ఇదీ చదవండి: అప్పటినుంచే ప్రేమలో ఉన్నామన్న లావణ్య.. పోస్ట్ వైరల్) 'అడవి బిడ్డా .. నేలకొండ భగవంత్ కేసరి' అంటూ తన గురించి తాను చెప్పుకుంటూ బాలకృష్ణ యాక్షన్‌లోకి దిగిపోవడం ఈ టీజర్లో కనిపిస్తుంది. 'ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది' అంటూ తెలంగాణ యాసలో డైలాగులు చెప్తూ బాలయ్య కేక పుట్టించాడు. గత సినిమాల్లోలాగే బాలయ్య రక్తపాతం సృష్టించేందుకు రెడీ అయ్యాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో తమన్ దుమ్ములేపాడు. పవర్ఫుల్ టీజర్‌తో సినిమా రేంజ్‌ను భారీగా పెంచేశాడు బాలకృష్ణ. ‘భగవంత్ కేసరి’ ఈ దసరాకు విడుదల చేస్తున్నట్లు టీజర్లో మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) -
Recipes: శాగూ కేసరి.. పన్నీర్ వైట్ గ్రేవీ ఇలా తయారు చేసుకోండి!
సగ్గు బియ్యంతో కేసరి.. పన్నీర్ వైట్ గ్రేవీ ఇలా ఇంట్లో సులభంగా తయారు చేసుకోండి! శాగూ కేసరి తయారీకి కావలసినవి ►సగ్గుబియ్యం – అరకప్పు ►పంచదార – పావు కప్పు ►నెయ్యి – రెండు టీస్పూన్లు ►యాలకుల పొడి – చిటికడు ►ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికడు ►జీడిపప్పు – ఎనిమిది. తయారీ: ►సగ్గుబియ్యాన్ని రెండు మూడుసార్లు కడిగి ఉడికించాలి. ►సగ్గుబియ్యం పారదర్శకంగా మారాక దించేసి నీటిని వంపేయాలి. ►జీడిపప్పుని నెయ్యిలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి. ►జీడిపప్పు వేయించిన బాణలిలో ఉడికించిన సగ్గుబియ్యం వేసి నిమిషంపాటు మగ్గనివ్వాలి. ►తరువాత పంచదార వేసి కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. ►పంచదార కరిగిన తరువాత ఆరెంజ్ ఫుడ్ కలర్, యాలకుల పొడి వేసి ఐదునిమిషాలు మగ్గనిచ్చి, దించేయాలి. పన్నీర్ వైట్ గ్రేవీ కావలసినవి: ►పనీర్ ముక్కలు – పావుకేజీ ►నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు ►బిర్యానీ ఆకు – ఒకటి ►అనాస పువ్వు – ఒకటి ►నల్ల యాలక్కాయ – ఒకటి ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►పచ్చిమిర్చి – రెండు ►కసూరీ మేథి – టీస్పూను ►జీడిపప్పు – పావు కప్పు ►పాలు – పావు కప్పు ►పెరుగు – అరకప్పు ►ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ►జీడిపప్పుని పాలలో ఇరవై నిమిషాలపాటు నానబెట్టాలి. ►తరువాత పేస్టులా రుబ్బుకోవాలి. ►బాణలిలో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. ►కాగిన నెయ్యిలో పచ్చిమిర్చిని చీల్చివేయాలి. ►దీనిలోనే బిర్యానీ ఆకు, అనాస పువ్వు, యాలక్కాయ, దాల్చిన చెక్క వేసి వేయించాలి. ►ఇప్పుడు కసూరీ మేథి, జీడిపప్పు పేస్టు, పెరుగు, పనీర్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పదిహేను నిమిషాలపాటు సన్నని మంటమీద మగ్గనివ్వాలి. ►నెయ్యి పైకి తేలిన తరువాత దించేసి సర్వ్ చేసుకోవాలి. రోటీ, చపాతీల్లోకి ఈ గ్రేవి మంచి సైడ్ డిష్. ఇవి కూడా ట్రై చేయండి: Beetroot Bajji Recipe: బీట్రూట్ బజ్జీ తయారీ ఇలా! Corn Palak Pakoda Recipe: స్వీట్ కార్న్, పాలకూర.. కార్న్ పాలక్ పకోడి రెసిపీ -
Recipe: నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా..
Poha Kesari Recipe: రవ్వ కేసరి బోర్ కొడితే ఇలా అటుకుల కేసరి ట్రై చేయండి. ఘుమఘుమలాడే సువాసనను ఆస్వాదిస్తూ ఈ మిఠాయిని హాయిగా ఆరగించండి. అటుకుల కేసరి తయారీకి కావలసినవి: ►అటుకులు – 1 కప్పు (పాత్రలో దోరగా వేయించి ఫ్రై చేసుకోవాలి) ►నెయ్యి – 7 టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు, కిస్మిస్ – కొన్ని (నేతిలో దోరగా వేయించి పెట్టుకోవాలి) ►నీళ్లు – 1 కప్పు ►చిక్కటి పాలు – 2 కప్పులు ►పంచదార – ముప్పావు కప్పు ►ఏలకుల పొడి – కొద్దిగా ►ఫుడ్ కలర్ – ఆరెంజ్ కలర్ అటుకుల కేసరి తయారీ విధానం: ►ముందుగా చిన్న మంట మీద పెట్టుకుని, కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ►నెయ్యి కరిగిన తర్వాత, అటుకుల పొడి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►అనంతరం నీళ్లు పోసుకుని దగ్గర పడే వరకూ తిప్పాలి. ►1 టేబుల్ స్పూన్ నెయ్యి, చిక్కటి పాలు వేసుకుని మళ్లీ తిప్పుతూ ఉండాలి. ►దగ్గర పడేలోపు మిగిలిన నెయ్యి, ఫుడ్ కలర్ వేసుకుని కలపాలి. ►చివరిగా ఏలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ►చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి👉🏾Egg Chapati Recipe In Telugu: ఘుమఘుమలాడే ఎగ్ చపాతీ తయారీ ఇలా! చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్‌గా ఇలా ఆవకాయ పెట్టేయండి! -
కుస్తీమే సవాల్..
-
ఇదేంది అక్షయ్.. ఇట్లా చేస్తివి!?
చేసేది దేశభక్తి సినిమాలు.. చెప్పేది ఓటు ఎంతో శక్తిమంతమైనదని నీతులు.. కానీ తీరా పోలింగ్‌నాడు ఆయన కనిపించనే లేదు. వేలికి సిరా గుర్తు పెట్టుకొని.. గర్వంగా ఫొటో దిగలేదు. తోటి సినీ స్టార్లు పెద్ద ఎత్తున కదిలివచ్చి ఓటు వేసినా.. ఆయన మాత్రం ఇంటికి పరిమితమయ్యారు. పోలింగ్‌కు కొద్ది రోజులు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రాజకీయేతర వ్యక్తిగత ఇంటర్వ్యూ చేసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ఓటు వేయకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేసరి, టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్‌కథా, ఎయిర్‌లిఫ్ట్ వంటి దేశభక్తి మేళవించిన కథలతో వరుసగా సూపర్హిట్లు కొడుతున్న అక్షయ్‌కుమార్ తాజాగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. విచిత్రమేమిటంటే.. ప్రధాని నరేంద్రమోదీ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కల్పించాలంటూ ట్విటర్లో విజ్ఞప్తి చేస్తూ.. ట్యాగ్ చేసిన ప్రముఖుల్లో అక్షయ్‌కుమార్ కూడా ఉన్నారు. అంతేకాకుండా మోదీ ట్వీట్‌కు బదులిస్తూ.. ఓటు ఎంతో శక్తిమంతమైనదని, దానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరముందని అక్షయ్ చెప్పుకొచ్చారు. తీరా ఓటు వేయని ఆయన మంగళవారం ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొని.. మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. ఓటు ఎందుకు వేయలేదని మీడియా ప్రశ్నించగా చెలియే.. చెలియే.. (వదిలేయండి) అంటూ దాటవేశారు. -
బాలీవుడ్‌కు కే‘సిరి’
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖిలాడీ అక్షయ్ కుమార్ తాజా చిత్రం కేసరితో భారీ హిట్ కొట్టడానికి రంగంలోకి దూకారు. బాలీవుడ్‌కు గడిచిన మూడు నెలల్లో బంపర్ హిట్ దక్కలేదు. గల్లీబాయ్స్, టోటల్ ధమాల్ లాంటి సినిమాలు మంచి కలెక్షన్లనే సాధించినా అవి అద్భుత విజయాలు కావు. పెద్ద విజయాల కోసం వేచి చూస్తున్న హిందీ చిత్ర పరిశ్రమకు కేసరి చిత్రం సిరులు కురిపిస్తోంది. గురువారం విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 78 కోట్లను కలెక్ట్ చేసింది. దీంతో అక్కీ మరోసారి భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తున్నాడు. ఐపీఎల్ సందడిలో కూడా కేసరి బాలీవుడ్లో ఈ సంవత్సరపు అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది. మొదటి వారాంతం పూర్తయ్యాక ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్ వైపు వడివడిగా పరుగులు పెడుతోంది. సిక్కు సైనికుల పోరాటపటిమను కళ్లకు కట్టిన ‘సారాగఢి’ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటూ ముందుకు సాగుతోంది. మొదటి రోజు రూ. 21 కోట్లు, 3వ రోజుకు 50 కోట్ల క్లబ్లో చేరిన కేసరి చిత్రం.. 4వ రోజుకు 78 కోట్ల మార్క్‌ను అందుకుందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఐపీఎల్ ప్రభావంతో శని, ఆదివారాల్లో కేసరీకి రావాల్సినంత వసూళ్లు రాలేదని, రెండో వారాంతంలో సినిమా నిలకడను బట్టి కలెక్షన్లు, రికార్డులు ఆధారపడతాయని ఆయన విశ్లేషించారు. -
అక్షయ్ అగ్ని ఆట
-
కాలిపోతూ.. టైటిల్ ప్రకటించిన హీరో
బాలీవుడ్లో టాప్ హీరోగా దూసుకుపోతున్నారు అక్షయ్ కుమార్. సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు అక్షయ్. సామాజిక స్పృహతో సినిమాలు చేస్తూ.. రియల్ లైఫ్‌లో కూడా మంచి మనసును చాటుకుంటున్నాడీ రియల్ హీరో. తాజాగా అక్షయ్ చేసిన విన్యాసం అందర్నీ ఆశ్చర్య పరిచేలా చేసింది. అక్షయ్ ప్రస్తుతం కేసరి సినిమాతో బిజీగా ఉండగా.. అదే సమయంలో ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. అక్షయ్ మంటల్లో కాలుతూ.. ఈ టైటిల్‌ను ప్రకటించాడు. ది ఎండ్ అంటూ ఇది కేవలం ఆరంభమే.. అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన అక్షయ్ కేసరి ట్రైలర్ సోషల్ మీడియా వైరల్ అయిన సంగతి తెలిసిందే. Literally, all fired up for my association with @PrimeVideoIN’s THE END (working title). Trust me, this is only the beginning 😉@JSalke @vikramix @Abundantia_Ent pic.twitter.com/BL2PS4iJPQ — Akshay Kumar (@akshaykumar) 5 March 2019 -
శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ కేసరి. ‘బ్యాటిల్ ఆఫ్ సారగడి’ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ హవీల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 1897లో జరిగిన సారాఘరి యుద్ధ నేపథ్యంలో కేసరి చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటీష్ ఆర్మీలో ఉన్న సిక్కు సైనికులకు, పశ్తున్ ఒరక్జై తెగల మధ్య ఈ యుద్ధం జరిగింది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్, అజుర్ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పరిణితీ చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
లెక్క తగ్గదు
ఐదేళ్లుగా ఏడాదికి కనీసం మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఈ ఏడాది ఆల్రెడీ ‘ప్యాడ్‌మ్యాన్, గోల్డ్, 2.ఓ’ చిత్రాలతో థియేటర్స్‌లోకి వచ్చి అలరించారు. ఆల్రెడీ నెక్ట్స్ ఇయర్‌కు కూడా లెక్క తగ్గకుండా ఇంకో మూడు సినిమాలను రెడీ చేస్తున్నారు. అందులో భాగంగానే ‘కేసరి’ అనే సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారాయన. ‘బ్యాటిల్ ఆఫ్ సారగడి’ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో హవీల్దార్ ఇషార్ సింగ్ పాత్రలో అక్షయ్‌కుమార్ కనిపిస్తారు.‘‘కేసరి చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం చేసినందుకు నా ఛాతీ గర్వంతో నిండిపోయింది’’ అన్నారు అక్షయ్. ఇందులో పరిణీతీ చోప్రా కథానాయిక. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 31న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాను కంప్లీట్ చేసిన అక్షయ్ ప్రజెంట్ ‘గుడ్‌న్యూస్, మిషన్ మంగళ్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. -
కేసరి లావణ్య @అంబర్‌పేట
సాక్షి, హైదరాబాద్: శరీర దారుఢ్య పోటీల్లో స్త్రీల ప్రాతినిథ్యం పెరుగుతోంది. కఠిన కసరత్తులతో కండలు పెంచి బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటుతున్నారు. బాడీ పవర్ యునైటెడ్ కింగ్డమ్(యుకె) సంస్థ ఇటీవల నిర్వహించిన ఫిట్ ఫ్యాక్టర్ హైదరాబాద్ పోటీల్లో నగరంలోని అంబర్‌పేటకు చెందిన కేసరి లావణ్య ఎంపికయ్యారు. ఈ నెల 23న నగరంలోని సోమాజిగూడలో గల జయగార్డెన్‌లో స్త్రీలు, పురుషుల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. మహిళా విభాగంలో హైదరాబాద్ నుంచి ఇద్దరు, అస్సాం నుంచి ఒకరు పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొన్న ముగ్గురు మహిళలకు జడ్జీలు కుమార్ మన్నాప్, డాన్ లయన్, బాలకృష్ణ, భరత్తేజ్ల సమక్షంలో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో కేసరి లావణ్య ప్రథమ స్థానానికి ఎంపికైంది. ఈ సందర్భంగా విలేకరులతో కేసరి లావణ్య మాట్లాడుతూ.. ఫిట్ ప్యాక్టర్ పోటీలో తాను ప్రథమ స్థానంలో రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో జాతీయ స్థాయిలో స్క్వాడ్స్ ఫిట్నెస్ సంస్థ ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన జాతీయ స్థాయి ట్రాన్స్ఫర్ మిషన్ చాలెంజీ పోటీలలో మిసెస్ ఇండియా డివోటెడ్ 2017 రన్నర్‌గా నిలిచానని తెలిపారు. ఫిట్‌నెస్‌లో జాతీయ స్థాయిలో అవార్డులు గెలిచేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను ఫిట్నెస్ రంగంలో రాణించేందుకు తన భర్త శ్రీకాంత్ ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడిందన్నారు. -
ఆగస్టు 15న ‘గోల్డ్’
అక్షయ్‌కుమార్ హీరోగా దర్శకురాలు రీమా ఖగ్తి రూపొందిస్తున్న చిత్రం ‘గోల్డ్’. హాకీ ప్లేయర్ బల్బీర్‌సింగ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 1948 లండన్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్ బల్బీర్ సింగ్. బల్బీర్ సింగ్ బెంగాలీ కావటంతో స్పెషల్‌గా ఓ కోచ్‌ను పెట్టుకొని మరి బెంగాలీ నేర్చుకున్నాడు అక్షయ్. అంతేకాదు క్యారెక్టర్లో పర్ఫెక్షన్ కోసం బెంగాలీ కల్చర్, కట్టుబొట్టులపై కూడా చాలా రిసెర్చ్ చేసి ఈ సినిమాలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. కునాల్ కపూర్,మౌనీరాయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రటించారు. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను తన ట్విటర్లో పోస్ట్ చేశారు అక్షయ్. అక్షయ్ ప్రతినాయక పాత్రలో నటించిన 2.ఓ ఆగస్టులో రిలీజ్ అవుతుందన్న టాక్ వినిపించటంతో గోల్డ్ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని భావించారు. అయితే 2.ఓ రిలీజ్ ఇప్పట్లో లేకపోవటంతో ముందుగా ప్రకటించినట్టుగానే గోల్డ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. -
సినిమా షూటింగ్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, ముంబై: ‘ఖిలాడి’ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘కేసరి’ చిత్ర షూటింగ్లో అపశృతి చోటుచేసుకుంది. సినిమా షూటింగ్లో భాగంగా మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని పింపోడి బుద్రుక్ గ్రామంలో చిత్రీకరణ జరుగుతుండగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారని, ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని పోలీసు కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు. క్లైమాక్స్‌లో వచ్చే బాంబు పేలుడు సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అగ్గిరవ్వలు ఎగిసి సెట్ మీద పడటంతో మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. ప్రమాద సమయంలో హీరో అక్షయ్ కుమార్ అక్కడ లేరని చెప్పారు. 21సిక్ రెజిమెంట్‌కు చెందిన మిలిటరీ కమాండర్ హవల్దార్ ఇశ్రా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా ‘కేసరి’ చిత్రం తెరకెక్కుతుంది. 1897, సెప్టెంబర్ 12న జరిగిన ‘సారాగర్హి’ యుద్ధంలో హవల్దార్ సింగ్ ఆఫ్గానీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడాడు. ఆ అమరవీరుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్ హవల్దార్ పాత్రలో నటిస్తుండగా, పరిణీతి చోప్రా హవల్దార్ కుతూరు ఇషా పాత్రలో కనిపించనుంది. ప్రముఖ టెలివిజన్ నటుడు మోహిత్ రైనా ఇషాకు కాబోయే భర్త పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు తొలుత ‘దబాంగ్ హీరో’ సల్మాన్ ఖాన్ సహ నిర్మాతగా ఉండాలని భావించారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సల్మాన్ తప్పుకోవాల్సి వచ్చింది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే రణ్‌దీప్ హుడా హీరోగా రాజ్‌కుమార్ సంతోషి ఇదే కథాంశంతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. -
పుకార్లపై స్పందించిన అక్షయ్ కుమార్
సాక్షి, సినిమా : పాడ్‌మన్ చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లుక్కు గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి బట్టతల అవతారంలోనే ఈ స్టార్ హీరో కనిపిస్తున్నాడు. దీంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కృత్రిమ జుట్టు కోసం చేయించుకున్న ఆపరేషన్ వికటించిందని.. అందులో ఇలా బట్టతలతోనే కొనసాగాలని అక్షయ్ నిర్ణయించుకున్నాడని... కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక కథనం వెలువరించింది. అయితే అదంతా రూమర్ అని అక్కీ ఖండించాడు. తాజాగా ఓ టీవీషోలో ఆయన మాట్లాడుతూ అసలు విషయాన్ని వెల్లడించాడు. ‘‘కేసరి చ్రితంలో పాత్ర కోసం తలపై పెద్ద పాగా ధరించాల్సిన అవసరం ఉంది. అది ఇబ్బందికరంగా ఉండటంతోనే ఇలాంటి హెయిర్ స్టైల్ కొనసాగిస్తున్నా.. అంతేతప్ప వేరే కారణం ఏదీ లేదు’’ అని అక్షయ్ స్పష్టత ఇచ్చేశాడు. 1897లో జరిగిన సారాఘరి యుద్ధ నేపథ్యంలో కేసరి చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటీష్ ఆర్మీలో ఉన్న సిక్కు సైనికులకు, పశ్తున్ ఒరక్జై తెగల మధ్య ఈ యుద్ధం జరిగింది. కరణ్ జోహర్-అక్షయ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 2019 హోలీకి కేసరి విడుదల కానుంది. -
సల్మాన్ అవుట్.. హిస్టారికల్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్
సాక్షి, సినిమా : బాలీవుడ్ లో మరో భారీ ప్రాజెక్టుకు సంబంధించి స్పష్టత వచ్చింది. కరణ్ జోహార్ నిర్మాతగా భారీ బడ్జెట్‌తో కేసరి అనే చిత్రం రాబోతుందని కొంత కాలం అఫీషియల్ ప్రకటన వెలువడింది. అక్షయ్ కుమార్ హీరోగా.. సల్మాన్-కరణ్ జోహర్-అక్షయ్ కుమార్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టు నుంచి సల్మాన్ ఇప్పుడు తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ప్రకటించాడు. పాడ్‌మన్ చిత్ర ప్రమోషన్లో పాల్గొంటున్న అక్షయ్ ఈ విషయంపై మాట్లాడుతూ... ‘‘ఈ ప్రాజెక్టులో సల్మాన్ లేడు. నేను, కరణ్ మాత్రమే నిర్మాతలుగా తీయబోతున్నాం అని తేల్చేశాడు. సారఘరి యుద్ధ నేపథ్యంలో కేసరి చిత్రం తెరకెక్కబోతోంది. పాడ్‌మన్ రిలీజ్ అయ్యాక ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు అక్కీ ప్రకటించాడు. చిత్ర తారాగణం పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారంట. -
కేసరి చిన్ననాటి ముచ్చట్లు
కె.నరసింహం అన్న పేరు మరో విద్యార్థికీ ఉన్న కారణంగా, అర్థం చెడకుండా ఈయన పేరును నరకేసరి చేశారు వాళ్ల మాస్టారు. ఆ ఈయనే డాక్టర్ కె.ఎన్.కేసరి. చిన్ననాటే తండ్రిని పోగొట్టుకుని, పేదరికం అంతుచూసే ఉద్దేశంతో ఒంగోలు దగ్గరి ఇనమనమెళ్లూరు నుంచి మద్రాసుకు పారిపోయి, స్వయంకృషితో చదువుకుని, క్రమంగా ఆయుర్వేద వైద్యుడై, 1900లో మద్రాసులో లేండ్మార్క్లాంటి ‘కేసరి కుటీరం, ఆయుర్వేద ఔషధశాల’ స్థాపించి, లోధ్ర, అమృత, అర్క వంటి మందులతో లక్షలు గడించి, మహిళాభ్యున్నతి కోసం 1926లో గృహలక్ష్మి పత్రిక ప్రారంభించి, సాహిత్యలక్షు్మలకు ప్రతియేటా ‘గృహలక్ష్మి స్వర్ణకంకణం’ తొడిగి, ఎన్నో సేవా కార్యక్రమాలకు బూరి విరాళాలిచ్చి, 1943లో మైలాపూర్ తెలుగు ఎలిమెంటరీ స్కూలును హైస్కూలు స్థాయికి పెంచి, కేసరి కన్యావిద్యాలయము నెలకొల్పి, కేసరి ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించి మరెన్నో విద్యాలయాలు నడిచేలా చేసిన వైద్యుడు, సంపాదకుడు, సంస్కర్త, మహాదాత కోట నరకేసరి(1875–1953). ఆయన ఆత్మకథ ‘నా చిన్ననాటి ముచ్చట్లు’ వరుసగా మంచి పాత పుస్తకాలను ప్రచురిస్తున్న రాజాచంద్ర ఫౌండేషన్–తిరుపతి వల్ల మరోసారి అందుబాటులోకి వచ్చింది. నా చిన్ననాటి ముచ్చట్లు (కె.ఎన్.కేసరి ఆత్మకథ) పేజీలు: 218; వెల: 200; ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ, హైదరాబాద్. -
మృత్యువుతో పోరాడి ఓడిన యువ క్రికెటర్
కోల్ కతా: ఆస్ట్రేలియన్ క్రికెటర్ హ్యూస్ మృతి చెందిన ఘటన మరువక ముందే మరో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. అదే తరహాలో కోల్‌కతాలో అంకిత్ కేసరీ(20) అనే యువ క్రికెటర్ మృత్యువుతో పోరాటం చేసి సోమవారం తుదిశ్వాస విడిచాడు. గత శుక్రవారం ఈస్ట్ బెంగాల్ - భావన్ పురీ జట్ల మధ్య జరిగిన స్థానిక మ్యాచ్ లో భాగంగా క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన సమయంలో ఆ క్రికెటర్ మైదానంలో వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి మరో క్రికెటర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆ యువ ఆటగాడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే అతని తలకు బలమైన గాయం కావడంతో డాక్టర్ సలహామేరకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే నాలుగు రోజుల పాటు మృత్యువుతూ పోరాటం చేసిన ఆ యువ క్రికెటర్ ఈరోజు ప్రాణాలు కోల్పోయాడు. గత రెండేళ్ల నుంచి బెంగాల్-19 కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేస్రీ.. ఈ సంవత్సరం బెంగాల్ అండర్-23 విభాగానికి ఎంపికయ్యాడు. కాగా, యువ క్రికెటర్ అంకిత్ కేసరి మృతిపట్ల బాలీవుడ్ హీరో, కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అతడి కుటుంబానికి సంతాపం తెలిపాడు. ట్విట్టర్లో కూడా తన ఆవేదనను పంచుకున్నాడు. Too young to go…extremely unfortunate & sad. Condolences & prayers for Ankit Keshri & his family. May Allah bless his soul. R.I.P. — Shah Rukh Khan (@iamsrk) April 20, 2015 -
గాడ్సే.. నెహ్రూను లక్ష్యంగా చేసుకోవాల్సింది
ఆర్ఎస్ఎస్ మలయాళ వారపత్రికలో వివాదాస్పద వ్యాసం న్యూఢిల్లీ/తిరువనంతపురం: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను కించపరిచేలా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందిన మలయాళ వారపత్రిక ‘కేసరి’లో వ్యాసం ప్రచురితం కావడం దుమారం రేపింది. జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే.. గాంధీకి బదులుగా దేశ విభజనకు కారణమైన నెహ్రూను లక్ష్యంగా చేసుకొని ఉండాల్సిందంటూ గోపాలకృష్ణన్ అనే బీజేపీ నేత (లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు) ఈ నెల 17 నాటి సంచికలో రాసిన వ్యాసం వివాదానికి దారితీసింది. ఈ వ్యాసంతో తమకు ఎటువంటి సంబంధం లేదని, హింస ఏ రూపంలో ఉన్నా తాము ఖండిస్తామని ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య శనివారం ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం ఆర్ఎస్ఎస్, బీజేపీలపై విరుచుకుపడింది. నెహ్రూను కించపరచడం ద్వారా చరిత్రను వక్రీకరించేందుకు సంఘ్ పరివార్ మరోసారి ప్రయత్నించిందని దుయ్యబట్టింది.