Recipes: శాగూ కేసరి.. పన్నీర్‌ వైట్‌ గ్రేవీ ఇలా తయారు చేసుకోండి! | Recipes In Telugu: How To Make Shagun Kesari And Paneer White Gravy | Sakshi
Sakshi News home page

Recipes: శాగూ కేసరి.. పన్నీర్‌ వైట్‌ గ్రేవీ ఇలా తయారు చేసుకోండి!

Published Thu, Aug 11 2022 1:19 PM | Last Updated on Thu, Aug 11 2022 1:27 PM

Recipes In Telugu: How To Make Shagun Kesari And Paneer White Gravy - Sakshi

శాగూ కేసరి, పన్నీర్‌ వైట్‌ గ్రేవీ

సగ్గు బియ్యంతో కేసరి.. పన్నీర్‌ వైట్‌ గ్రేవీ ఇలా ఇంట్లో సులభంగా తయారు చేసుకోండి!
శాగూ కేసరి తయారీకి కావలసినవి 
►సగ్గుబియ్యం – అరకప్పు
►పంచదార – పావు కప్పు
►నెయ్యి – రెండు టీస్పూన్లు
►యాలకుల పొడి – చిటికడు
►ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ – చిటికడు
►జీడిపప్పు – ఎనిమిది.

తయారీ:
►సగ్గుబియ్యాన్ని రెండు మూడుసార్లు కడిగి ఉడికించాలి.
►సగ్గుబియ్యం పారదర్శకంగా మారాక దించేసి నీటిని వంపేయాలి.
►జీడిపప్పుని నెయ్యిలో వేసి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి.
►జీడిపప్పు వేయించిన బాణలిలో ఉడికించిన సగ్గుబియ్యం వేసి నిమిషంపాటు మగ్గనివ్వాలి.
►తరువాత పంచదార వేసి కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి.
►పంచదార కరిగిన తరువాత ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్, యాలకుల పొడి వేసి ఐదునిమిషాలు మగ్గనిచ్చి, దించేయాలి. 

పన్నీర్‌ వైట్‌ గ్రేవీ
కావలసినవి:
►పనీర్‌ ముక్కలు – పావుకేజీ
►నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు
►బిర్యానీ ఆకు – ఒకటి
►అనాస పువ్వు – ఒకటి
►నల్ల యాలక్కాయ – ఒకటి
►దాల్చిన చెక్క – అంగుళం ముక్క

►పచ్చిమిర్చి – రెండు
►కసూరీ మేథి – టీస్పూను
►జీడిపప్పు – పావు కప్పు
►పాలు – పావు కప్పు
►పెరుగు – అరకప్పు
►ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ:
►జీడిపప్పుని పాలలో ఇరవై నిమిషాలపాటు నానబెట్టాలి.
►తరువాత పేస్టులా రుబ్బుకోవాలి.
►బాణలిలో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి.
►కాగిన నెయ్యిలో పచ్చిమిర్చిని చీల్చివేయాలి.
►దీనిలోనే బిర్యానీ ఆకు, అనాస పువ్వు, యాలక్కాయ, దాల్చిన చెక్క వేసి వేయించాలి.
►ఇప్పుడు కసూరీ మేథి, జీడిపప్పు పేస్టు, పెరుగు, పనీర్‌ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పదిహేను నిమిషాలపాటు సన్నని మంటమీద మగ్గనివ్వాలి.
►నెయ్యి పైకి తేలిన తరువాత దించేసి సర్వ్‌ చేసుకోవాలి. రోటీ, చపాతీల్లోకి ఈ గ్రేవి మంచి సైడ్‌ డిష్‌. 
ఇవి కూడా ట్రై చేయండి: Beetroot Bajji Recipe: బీట్‌రూట్‌ బజ్జీ తయారీ ఇలా!
Corn Palak Pakoda Recipe: స్వీట్‌ కార్న్‌, పాలకూర.. కార్న్‌ పాలక్‌ పకోడి రెసిపీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement