బాలీవుడ్‌కు కే‘సిరి’ | Kesari Rocking At The Box Office | Sakshi
Sakshi News home page

కలెక్షన్లు కొల్లగొడుతున్న అక్షయ్‌ చిత్రం

Mar 25 2019 5:27 PM | Updated on Apr 3 2019 6:34 PM

Kesari Rocking At The Box Office - Sakshi

కేసరి చిత్రంలో అక్షయ్‌ కుమార్‌

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌  తాజా చిత్రం కేసరితో భారీ హిట్‌ కొట్టడానికి రంగంలోకి దూకారు. బాలీవుడ్‌కు గడిచిన మూడు నెలల్లో బంపర్‌ హిట్‌ దక్కలేదు. గల్లీబాయ్స్‌, టోటల్‌ ధమాల్‌ లాంటి సినిమాలు మంచి కలెక్షన్లనే సాధించినా అవి అద్భుత విజయాలు కావు. పెద్ద విజయాల కోసం వేచి చూస్తున్న హిందీ చిత్ర పరిశ్రమకు కేసరి చిత్రం సిరులు కురిపిస్తోంది. గురువారం విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 78 కోట్లను కలెక్ట్‌ చేసింది. దీంతో అక్కీ మరోసారి భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తున్నాడు.

ఐపీఎల్‌ సందడిలో కూడా కేసరి బాలీవుడ్‌లో ఈ సంవత్సరపు అత్యధిక ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది. మొదటి వారాంతం పూర్తయ్యాక ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌ వైపు వడివడిగా పరుగులు పెడుతోంది. సిక్కు సైనికుల పోరాటపటిమను కళ్లకు కట్టిన ‘సారాగఢి’ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటూ ముందుకు సాగుతోంది. మొదటి రోజు రూ. 21 కోట్లు, 3వ రోజుకు 50 కోట్ల క్లబ్‌లో చేరిన కేసరి చిత్రం.. 4వ రోజుకు 78 కోట్ల మార్క్‌ను అందుకుందని బాలీవుడ్‌ ట్రేడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తెలిపారు. ఐపీఎల్‌ ప్రభావంతో శని, ఆదివారాల్లో కేసరీకి రావాల్సినంత వసూళ్లు రాలేదని, రెండో వారాంతంలో సినిమా నిలకడను బట్టి కలెక్షన్లు, రికార్డులు ఆధారపడతాయని ఆయన విశ్లేషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement