సినిమా షూటింగ్‌లో భారీ అగ్నిప్రమాదం | A Massive Fire Broke In Akshay Kumars Kesari Shooting | Sakshi
Sakshi News home page

‘కేసరి’ షూటింగ్‌లో అపశృతి

Published Wed, Apr 25 2018 11:17 AM | Last Updated on Wed, Apr 25 2018 11:53 AM

A Massive Fire Broke In Akshay Kumars Kesari Shooting - Sakshi

కేసరి సినిమాలో హవల్దార్‌ సింగ్‌ పాత్రలో అక్షయ్‌ కుమార్‌

సాక్షి, ముంబై: ‘ఖిలాడి’ హీరో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న ‘కేసరి’ చిత్ర షూటింగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. సినిమా షూటింగ్‌లో భాగంగా మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని పింపోడి బుద్రుక్‌ గ్రామంలో చిత్రీకరణ జరుగుతుండగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారని, ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని పోలీసు కంట్రోల్‌ రూమ్‌ అధికారులు తెలిపారు. క్లైమాక్స్‌లో వచ్చే బాంబు పేలుడు సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అగ్గిరవ్వలు ఎగిసి సెట్‌ మీద పడటంతో మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. ప్రమాద సమయంలో హీరో అక్షయ్‌ కుమార్‌ అక్కడ లేరని చెప్పారు.

21సిక్‌ రెజిమెంట్‌కు చెందిన మిలిటరీ కమాండర్‌ హవల్దార్‌ ఇశ్రా సింగ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ‘కేసరి’ చిత్రం తెరకెక్కుతుంది. 1897, సెప్టెంబర్‌ 12న జరిగిన ‘సారాగర్హి’ యుద్ధంలో హవల్దార్‌ సింగ్‌ ఆఫ్గానీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడాడు. ఆ అమరవీరుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ హవల్దార్‌ పాత్రలో నటిస్తుండగా, పరిణీతి చోప్రా హవల్దార్‌ కుతూరు ఇషా పాత్రలో కనిపించనుంది. ప్రముఖ టెలివిజన్‌ నటుడు మోహిత్‌ రైనా ఇషాకు కాబోయే భర్త పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల కానుంది.

అయితే ఈ సినిమాకు తొలుత ‘దబాంగ్‌ హీరో’ సల్మాన్‌ ఖాన్‌ సహ నిర్మాతగా ఉండాలని భావించారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సల్మాన్‌ తప్పుకోవాల్సి వచ్చింది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే రణ్‌దీప్‌ హుడా హీరోగా రాజ్‌కుమార్‌ సంతోషి  ఇదే కథాంశంతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement