massive fire broke
-
బుర్జ్ ఖలీఫా సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
దుబాయి: ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా ప్రసిద్ధిగాంచిన దుబాయిలోని బుర్జ్ ఖలీఫా సమీపంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుర్జ్ ఖలీఫాకు అతి సమీపంలో ఉన్న ఎమార్ అపార్ట్మెంట్లో మంటలు అంటుకున్నాయి. పదుల సంఖ్యలోని అంతస్తుల్లో అగ్ని కీలలు చెలరేగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరైనా బాధితులు ఉన్నారా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదని స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. దుబాయి ప్రభుత్వ అధీనంలోని ఎమార్ సంస్థ నిర్మించిన 8 బౌలెవార్డ్ వాక్ అపార్ట్మెంట్లో ప్రమాదం జరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. మంటలను అదుపు చేసిన తర్వాత పలు అంతస్తులు పూర్తిగా కాలిపోయి, నల్లగా మారిపోయినట్లు వీడియోలు, ఫోటోల్లో కనిపిస్తోంది. In #Dubai, the #Emaar skyscraper caught fire near the #BurjKhalifa, the tallest building in the world. At the moment the fire was extinguished, there is no information about victims. pic.twitter.com/QtPmRBHSTq — NEXTA (@nexta_tv) November 7, 2022 ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కోటిశ్వరులుగా మారిన పోలీసులు..దెబ్బకు అకౌంట్ బ్లాక్! -
భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 700 దుకాణాలు
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాహర్లాగున్ ప్రాంతంలో మంటలు చెలరేగి సుమారు 700లకుపైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. మొదట రెండు దుకాణాల్లోనే మంటలు అంటుకున్నాయని స్థానికులు తెలిపారు. సుమారు రెండు గంటల తర్వాత.. మిగితా దుకాణాలు వ్యాపించాయని, ఎగిసిపడుతున్న జ్వాలలను అదుపు చేయటంలో అగ్నిమాపక విభాగం విఫలమవటం కారణంగానే పెద్ద సంఖ్యలో దుకాణాలు దగ్ధమైనట్లు ఆరోపించారు. #WATCH | Arunachal Pradesh: A massive fire broke out in Itanagar's Naharlagun due to unknown reasons. Over 700 shops burnt to ashes; however, no casualties reported yet As per sources, fire engulfed only 2 shops in the initial 2hrs, but the fire dept failed to control the spread pic.twitter.com/edeFudEXHl — ANI (@ANI) October 25, 2022 ఇదీ చదవండి: కలిచివేసే ఘటన: చావుబతుకుల మధ్య ఉంటే చుట్టూ చేరి ఫోటోలు తీస్తూ... -
ఫార్మా సంస్థలో భారీ అగ్ని ప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై మహా నగరంలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ఫార్మా సంస్థలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని కార్లు, ఇతర వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేసింది. ‘సోమవారం ఉదయం 8 గంటలకు మాకు సమాచారం అందింది. అది ఫార్మా సంస్థకు చెందిన గోదాం. మంటలను అదుపు చేశాం.’ అని అగ్నిమాపక విభాగం అధికారి ఒకరు తెలిపారు. నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు... అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్లాగున్ అటవీ ప్రాంతంలోని ఓ గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక విభాగం వెల్లడించింది. ఇదీ చదవండి: ‘మహా’ పాలిటిక్స్.. షిండేకు పదవీ గండం.. బీజేపీలోకి 22 మంది ఎమ్మెల్యేలు! -
ఆటో విడిభాగాల తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బిలాస్పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఆందోళన రేపాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 12కు పైగా ఫైర్ ఇంజీన్ మంటల్ని అదుపు చేసుందుకు కృషిచేస్తున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. Haryana | Fire breaks out in an auto parts manufacturing company in Bilaspur Industrial area, Gurugram. Fire tenders are present at the spot. pic.twitter.com/tj0NVMv4Lz — ANI (@ANI) October 15, 2022 -
సికింద్రాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. పలువురి మృతి
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ఉవ్వెత్తున ఎగిసిన మంటలు.. దట్టమైన పొగ.. వివిధ పనుల మీద నగరానికి వచ్చి లాడ్జీలో బస చేసినవారు ఉక్కిరిబిక్కిరయ్యారు. మిగతావారు ఎలాగో తప్పించుకునా ఏడుగురు కాలినగాయాలు, పొగతో ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 13 మంది గాయపడినట్లు సమాచారం కాగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర దుర్ఘటన సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి సేద తీరుతుండగా..: ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. సెయింట్ మేరీస్ రోడ్డులోని మనోహర్ థియేటర్ ఎదురుగా రంజిత్ సింగ్ బగ్గా అనే వ్యక్తి రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్ పేరుతో బైక్‌ల షోరూమ్ నిర్వహిస్తున్నా రు. ఈ షోరూమ్ సెల్లార్లో ఉండగా, ఆపై నాలుగు అంతస్తుల్లో రూబీ డీలక్స్ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో సెల్లార్‌లోని షోరూమ్ నుంచి మంటలు చెలరేగాయి. ఇందులో ఎలక్ట్రికల్ బైక్‌ల బ్యాటరీలు పేలి భారీ శబ్దాలతో పాటు మంటలు వ్యాపించాయి. నాలుగు అంతస్తుల్లోని లాడ్జీ గదుల్లోకి మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన కొంతమంది హోటల్ గదుల నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు మాత్రం దట్టమైన పొగల కారణంగా బయటకు రాలేక గదుల్లో చిక్కుకుపోయారు. లాడ్జీలో 23 మంది..: హోటల్లో వ్యాపారాల నిమిత్తం ఉత్తర భారత దేశం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 23 మంది ఉన్నట్లు తేలింది. దట్టమైన పొగలు పైన ఉన్న గదుల్లోకి వ్యాపించడంతో చాలామంది పై నుంచి కిందకు దిగేందుకు వీలులేకుండా పోయింది. ఓ మహిళతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు డ్రైనేజీ పైప్‌ల ద్వారా నాలుగు, మూడో అంతస్తుల నుంచి కిందకు దిగారు. వీళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే దీన్ని ఆనుకుని ఉండే యాత్రి ఇన్ హోటల్ మీదుగా మరికొంత మంది ప్రాణాలతో బయట పడ్డారు. వీరికి సైతం ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో గాలి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ఫైర్ సిబ్బంది స్నారికల్ వాహనం ద్వారా కొంత మందిని కిటికీల నుంచి బయటకు రప్పించి రక్షించారు. ఒక మహిళతో పాటు మరో ముగ్గురు గదుల్లో అపస్మారక స్థితిలో పడిఉండగా బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. కాలిన గాయాలైన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా మిగతా వారిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. మార్కెట్ పోలీసులు, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బంది, పెద్దసంఖ్యలో స్థానికులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులు కిటికీల నుంచి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుండగా అక్కడికి చేరుకున్న స్థానికులు వారికి నిచ్చెనలు అందించి, పైప్‌ల ద్వారా దిగేలా సహాయం చేశారు. మరికొంత మంది పొగలోనే లోపలికి వెళ్లి గదుల్లో ఉండే వారిని బయటకు తీసుకుని వచ్చారు. అగ్ని ప్రమాద ఘటన తెలియగానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. అంతా క్షణాల్లోనే: కేశవులు, చెన్నై చెన్నై నుంచి వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ వచ్చాను. రాత్రి 9 గంటలకు హోటల్లో దిగాను. అంతలోపే ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. స్థానికుల సహాయంతో 4వ అంతస్తు నుంచి పైౖౖపులు పట్టుకుని కిందకు దిగాను. ఇది మరో జన్మ: ఉమేష్ ఆచార్య, ఒడిశా ఒడిశా నుంచి ఆఫీస్ పనిమీద హైదరాబాద్ వచ్చాను. 4వ అంతస్తులో ఉన్నాను. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది. మెట్ల నుంచి వెళ్లే అవకాశం కనిపించలేదు. వెంటనే ప్రాణాలు కాపాడుకోవాలంటే పైపులు పట్టుకుని దిగాలని «ధైర్యం చేశా. పైపులు పట్టుకుని కిందికి దిగాను. ఇది నాకు మరో జన్మ. పొగ పీల్చుకోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఇదీ చదవండి: మళ్లీ.. గోదావరి ఉగ్రరూపం -
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం
-
ముంబై: స్క్రాప్‌యార్డ్‌లో అగ్ని ప్రమాదం
ముంబై: ఆర్థిక రాజధాని ముంబై, మంఖుర్ద్ ప్రాంతంలోని స్క్రాప్‌యార్డ్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ వివరాలు.. మంఖుర్ద్‌లో ఉన్నస్క్రాప్‌యార్డ్‌లో ఈ తెల్లవారుజామున ఉన్నట్లుండి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ 6 ఫైర్ ఇంజన్లను ఘటనా స్థలానికి తరలించింది. (చదవండి: తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు) ఇప్పటి వరకు, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఇక అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: కళ్ల ముందే అగ్గి భగ్గుమంటోంది. ఏమిటీ మాయా, ఎవరు చేస్తున్నారు? Maharashtra: Fire breaks out at a scrapyard in Mankhurd area of Mumbai; six fire engines pressed into action — ANI (@ANI) September 16, 2021 -
ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం..
-
ఢిల్లీలో అగ్ని ప్రమాదం: 9మంది మృతి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో ఉన్న వస్త్ర గోడౌన్లో జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు అంతస్తుల భవనంలో ఈ వస్త్ర గోడౌన్ మొదటి అంతస్తులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన అర్ధరాత్రి 12. 30 సమయంలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా ఫైర్ సిబ్బంది, అధికారులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. -
సినిమా షూటింగ్లో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, ముంబై: ‘ఖిలాడి’ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘కేసరి’ చిత్ర షూటింగ్లో అపశృతి చోటుచేసుకుంది. సినిమా షూటింగ్లో భాగంగా మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని పింపోడి బుద్రుక్ గ్రామంలో చిత్రీకరణ జరుగుతుండగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారని, ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని పోలీసు కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు. క్లైమాక్స్‌లో వచ్చే బాంబు పేలుడు సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అగ్గిరవ్వలు ఎగిసి సెట్ మీద పడటంతో మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. ప్రమాద సమయంలో హీరో అక్షయ్ కుమార్ అక్కడ లేరని చెప్పారు. 21సిక్ రెజిమెంట్‌కు చెందిన మిలిటరీ కమాండర్ హవల్దార్ ఇశ్రా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా ‘కేసరి’ చిత్రం తెరకెక్కుతుంది. 1897, సెప్టెంబర్ 12న జరిగిన ‘సారాగర్హి’ యుద్ధంలో హవల్దార్ సింగ్ ఆఫ్గానీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడాడు. ఆ అమరవీరుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్ హవల్దార్ పాత్రలో నటిస్తుండగా, పరిణీతి చోప్రా హవల్దార్ కుతూరు ఇషా పాత్రలో కనిపించనుంది. ప్రముఖ టెలివిజన్ నటుడు మోహిత్ రైనా ఇషాకు కాబోయే భర్త పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు తొలుత ‘దబాంగ్ హీరో’ సల్మాన్ ఖాన్ సహ నిర్మాతగా ఉండాలని భావించారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సల్మాన్ తప్పుకోవాల్సి వచ్చింది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే రణ్‌దీప్ హుడా హీరోగా రాజ్‌కుమార్ సంతోషి ఇదే కథాంశంతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. -
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబై కొలాబాలోని రీగల్ సినిమా థియేటర్ సమీపంలోని మెట్రో హౌస్ బిల్డింగ్‌లో ఈ రోజు మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు. ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా మంటల్లో చిక్కుకున్న ఇద్దరిని రెస్క్యూ టీమ్ కాపాడినట్లు డీసీపీ మనోజ్ శర్మ తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ఎవరూ గాయపడిన సమాచారం లేదన్నారు. కాగా అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం స్థానికులతో పాటు టూరిస్టులు ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉంటుంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.