Massive Fire Breaks Out At Private Pharma Unit In Chennai - Sakshi
Sakshi News home page

ఫార్మా గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిన జ్వాలలు

Published Mon, Oct 24 2022 4:30 PM | Last Updated on Mon, Oct 24 2022 9:04 PM

Massive Fire Breaks Out At Private Pharma Unit In Chennai - Sakshi

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై మహా నగరంలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ఫార్మా సంస్థలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని కార్లు, ఇతర వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేసింది. 

‘సోమవారం ఉదయం 8 గంటలకు మాకు సమాచారం అందింది. అది ఫార్మా సంస్థకు చెందిన గోదాం. మంటలను అదుపు చేశాం.’ అని అగ్నిమాపక విభాగం అధికారి ఒకరు తెలిపారు. నగరంలోని అశోక్‌ నగర్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు... అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నహర్లాగున్ అటవీ ప్రాంతంలోని ఓ గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక విభాగం వెల్లడించింది.

ఇదీ చదవండి: ‘మహా’ పాలిటిక్స్‌.. షిండేకు పదవీ గండం.. బీజేపీలోకి 22 మంది ఎమ్మెల్యేలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement