pharmasuticals
-
ఫార్మా సంస్థలో భారీ అగ్ని ప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై మహా నగరంలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ఫార్మా సంస్థలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని కార్లు, ఇతర వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేసింది. ‘సోమవారం ఉదయం 8 గంటలకు మాకు సమాచారం అందింది. అది ఫార్మా సంస్థకు చెందిన గోదాం. మంటలను అదుపు చేశాం.’ అని అగ్నిమాపక విభాగం అధికారి ఒకరు తెలిపారు. నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు... అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్లాగున్ అటవీ ప్రాంతంలోని ఓ గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక విభాగం వెల్లడించింది. ఇదీ చదవండి: ‘మహా’ పాలిటిక్స్.. షిండేకు పదవీ గండం.. బీజేపీలోకి 22 మంది ఎమ్మెల్యేలు! -
చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు
న్యూఢిల్లీ: భారతదేశంలో తయారైన మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన దగ్గు మందు తాగి పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారులు మృతిచెందిన ఘటన విషాదం నింపింది. నాలుగు రకాల కాఫ్ సిరప్లు చిన్నారుల మృతికి కారణమంటూ డబ్ల్యూహెచ్ఓ మెడికల్ అలర్ట్ జారీ చేసింది. డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ మోతాదు పరిమితికి మించి ఉన్నాయని తెలిపింది. ఇది విషపూరితమైందనీ, తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తుందని తెలిపిన డబ్ల్యూహెచ్ఓ మైడెన్‌పై సమగ్ర విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఘటన తరువాత దేశీయ ఫార్మా కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూశాయి.ఈ ఫార్మా కంపెనీకి చెందిన అనేక మందులు దేశంలోని నాలుగు రాష్ట్రాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. ప్రజారోగ్య కార్యకర్త దినేష్ ఠాకూర్‌ని ఉటంకిస్తూ ఎన్టీటీవీ ఒక కథనాన్ని ప్రచురించింది. (Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ) వియత్నాం చెత్త రికార్డు ఉన్న ఫార్మా కంపెనీలు బ్లాక్ లిస్ట్ చేసిందనీ, అందులో మైడెన్ కూడా ఒకటని ఠాకూర్ విమర్శించారు. వియత్నాం 2011లో కంపెనీని నిషేధించిందన్నారు. ఇంత పేలవమైన రికార్డును కలిగి ఉన్నప్పుడు అనుమతి ఎలా ఇచ్చారని ఠాకూర్ ప్రశ్నించారు. కంపెనీలో తీవ్రమైన నాణ్యత నియంత్రణా లోపాలున్నాయని,సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సెంట్రల్ రెగ్యులేటర్ ఉన్నప్పటికీ కానీ ప్రతి రాష్ట్రానికి దాని స్వంత రెగ్యులేటర్ లేదన్నారు. కేరళ, గుజరాత్‌లోని రెగ్యులేటర్లు మైడెన్ మందులు నాణ్యత లేనివిగా తేలియాని గుర్తు చేశారు. బిహార్ ఇప్పటికే దీన్ని బ్లాక్ లిస్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఎగుమతుల అనుమతిని కేంద్ర నియంత్రణ సంస్థ మాత్రమే ఇస్తుంది. కంపెనీ డైరెక్టర్లకు సంబంధించిన కొన్ని కేసులు కూడా కోర్టులో ఉన్నాయన్నారు. ఇవన్నీ దేశంలోని ఔషధ నియంత్రణ వ్యవస్థల పరిస్థితికి అద్దం పడుతున్నాయని ఠాకూర్ మండిపడ్డారు. (Infosys: మాజీ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు, కోర్టులో ఇన్ఫోసిస్‌కు షాక్) మైడెన్ ఫార్మాస్యూటికల్ మందులు, నాణ్యతా లోపాలు, చర్యలు బిహార్ (2008) : ఎరిత్రోమైసిన్ స్టీరేట్ 125ఎంజీ సిరప్ (4 బ్యాచ్‌లు నాణ్యత లేనివిగా గుర్తించారు బిహార్ (2011) : మిథైలెర్గోమెట్రిన్ ట్యాబ్ (నకిలీ) వియత్నాం: కంపెనీ 2011 నుండి 2013 వరకు నిషేధం గుజరాత్ (2013) : మాసిప్రో ట్యాబ్ (రద్దు సమస్యలు) జమ్మూ కాశ్మీర్ (2020) : సైప్రోహెప్టాడిన్ హైడ్రోక్లోరైడ్ సిరప్ ఐపీ (నాణ్యతాలోపం) కేరళ (2021) : మెట్ఫార్మిన్ 1000 ట్యాబ్ (రద్దు సమస్య) కేరళ (2021) : ఈసిప్రిన్ (ఐపీ ప్రమాణానికి అనుగుణంగా లేదు) కేరళ (2021): మెట్ఫార్మిన్ 500 mg (రద్దు సమస్య) కేరళ (2021) : మైకల్ డి ట్యాబ్ (తక్కువ నాణ్యత) ఇదీ చదవండి: ఫెస్టివ్ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త! కాగా నవంబర్ 1990లో కార్యకలాపాలను ప్రారంభించిన మైడెన్, గాంబియాకు మాత్రమే సిరప్‌ను తయారు చేసి ఎగుమతి చేసిందని భారత మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. గాంబియా విషాదం తరువాత, మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్‌ల నమూనాలను ఇండియా పరీక్షిస్తోంది. నమూనాలను సెంట్రల్ ఫార్మాస్యూటికల్ లాబొరేటరీకి పంపామని, నేరం నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మైడెన్ ఫ్యాక్టరీలున్న హర్యానా రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో వెలుగులోకి రూ.400 కోట్ల నల్లధనం
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీగా నల్లడబ్బు వెలుగులోకి వచ్చింది. బోగస్ కంపెనీల ద్వారా అవకతవకలకు పాల్పడుతోన్న ఓ ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ కంపెనీ వద్ద ఐటీ అధికారులు సుమారు 400 కోట్ల రూపాయల నల్లడబ్బును గుర్తించారు. వివరాలు.. గత నెల 24న ఐటీ అధికారులు నగరంలో ప్రసిద్ధి చెందిన ఓ ఫార్మస్యూటికల్ కంపెనీపై దాడులు చేశారు. బోగస్ కంపెనీల ద్వారా ఈ కంపెనీ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం 400 కోట్ల రూపాయల నల్లధనం ఉన్నట్లు కనుగొన్నారు. ఈ క్రమంలో అధికారులు 1.66 కోట్ల రూపాయల నగదు, కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: చెన్నైలో పట్టుబడ్డ రూ. 220 కోట్ల నల్లధనం యశోదా ఆసుపత్రులపై ఐటీ దాడులు.. -
భారతీయ ఫార్మా కంపెనీలపై దావా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ కంపెనీలు యూఎస్‌లో ఓ దావాను ఎదుర్కొంటున్నాయి. వీటిలో సన్ ఫార్మా, లుపిన్, అరబిందో సహా 26 కంపెనీలు ఉన్నాయి. కుట్రపూరితంగా ధరలను కృత్రిమంగా పెంచడం, పోటీని తగ్గించడం, యూఎస్‌లో జరుగుతున్న జనరిక్ డ్రగ్స్ వ్యాపారాన్ని అడ్డుకున్నాయని ఆరోపిస్తూ మేరీల్యాండ్ అటార్నీ జనరల్ బ్రియాన్ ఇ ఫ్రోష్ కనెక్టికట్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించారు. జనరిక్ డ్రగ్ మార్కెట్ తిరిగి గాడిలో పడేందుకై ఈ కంపెనీలతోపాటు 10 మంది వ్యక్తులను ఇందుకు బాధ్యులుగా చేస్తూ వీరి నుంచి నష్టపరిహారం, జరిమానాతోపాటు తగు చర్యలు తీసుకోవాలని దావాలో కోరారు. 80 రకాల జనరిక్ డ్రగ్స్ విషయమై విచారణ సాగనుంది. మేరీల్యాండ్‌తోపాటు యూఎస్‌లోని అన్ని రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఈ దావా దాఖలులో సహ పార్టీలుగా ఉన్నారు. ఈ కంపెనీల ధర నియంత్రణ పథకాలు రోగులకు, బీమా కంపెనీలకు భారంగా మారాయి అని ఫ్రోష్ వెల్లడించారు. ఇప్పటికే కొనసాగుతున్న విచారణకుతోడు తాజాగా వేసిన దావా మూడవదికాగా, కంపెనీలు ఇలా ఏకమై ధరలు పెంచిన కేసు యూఎస్ చరిత్రలో అతిపెద్దది అంటూ వ్యాఖ్యానించారు. -
దగ్గు మందు తాగి 9మంది మృతి
సాక్షి, శ్రీనగర్: ఫార్మాసుటికల్ కంపెనీలు మందులు తయారు చేసే ప్రదేశాలు ఎక్కడున్నా ఉత్పత్తులు మాత్రం దేశం నలుమూలలకి వెళ్తుంటాయి. ఏ కొంత నిర్లక్ష్యం వహించినా వాటి వలన జరిగే నష్టం అంచనా వేయలేం. తాజాగా జమ్మూలో చిన్నారులకు దగ్గు మందు కావాల్సి వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీ వాటి ఉత్పత్తులను జమ్ములోని ఉదంపూర్ జిల్లా చిన్నారులకు పంపింది. అందులో పాయిజన్ కాంపౌండ్ కలిపిన సంగతి తెలియని చిన్నారులు 17 మంది తాగి అస్వస్థతకు గురయ్యారు. గత నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి 9మంది ప్రాణాలు కోల్పోయారు. 'ప్రైమా ఫేసీ', 'డై ఇథిలీన్ గ్లైకాల్' అనే రెండు విష పదార్థాలు కోల్డ్ బెస్ట్ పీసీ టానిక్‌లో కలిశాయి. వీటి కారణంగానే ఉదంపూర్, ఛండీఘర్లోని చిన్నారుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని' డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ వెల్లడించారు. ఈ దగ్గుమందు కారణంగా ఊపిరితిత్తులు చెడిపోయి మరణాలు సంభవించినట్లు డైరక్టర్ హెల్త్ సర్వీస్‌కు చెందిన డా.రేణు శర్మ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆ కంపెనీ ఉత్పత్తులను 8 రాష్ట్రాల్లో మొత్తంగా 5,500 మందు బాటిళ్లను సీజ్ చేశారు. తయారీ యూనిట్‌ను కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ కంపెనీ మందులు సరఫరా అయ్యే ఉత్తరాఖండ్, హర్యానా, తమిళానాడు, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, త్రిపురలో తనిఖీలు చేపడుతున్నట్లు హిమాచల్‌ప్రదేశ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
నో.. స్టాక్!
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలో సీజనల్ వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉంది. మురికివాడల ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాలు మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. నగరంలో 10 పట్టణ ఆరోగ్య కేంద్రాల (యూహెచ్‌సీ)తో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉంది. ఒక్కో పట్టణ ఆరోగ్యకేంద్రంలో 40–50 మంది వైద్య సేవల కోసం వస్తుండగా, జనరల్ ఆస్పత్రిలో ఆ సంఖ్య 320కి పైగా ఉంది. ఇందులో జ్వరాలు, డయేరియా, మలేరియా, డెంగీ తదితర కేసులే అధికంగా ఉన్నాయి. నగరంలోని మాలపల్లిలో వారం క్రితం ఐదు డెంగీ కేసులు నమోదయ్యాయి. జనరల్ ఆసుపత్రిలో 100–150 వరకు జ్వరాలకు సంబంధించి కేసులు నమోదవుతుండగా, డయేరియా కేసులు 50 వరకు ఉంటున్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 10–15 విష జ్వరాలు, డయేరియా కేసులు నమోదవుతున్నాయి. వీరికి తప్పనిసరిగా ఆర్ఎల్ సైలెన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవి అందుబాటులో లేవు. సిప్రో ప్లబ్ జేషన్ యాంటీ బయోటిక్ మెట్రోమోడజైల్ (ఐవీ వ్లూయిడ్స్) ఎన్ఎస్ సెలైన్ బాటిళ్లు కావాల్సినంత స్టాక్ లేవు. జెంటిమెడిసిన్ (యాంటి బయోటిక్) 100 ఎం.జీ. కొరతగా ఉంది. నొప్పులకు ఉపయోగించే మాత్రలు కూడా అందుబాటులో లేవు. వచ్చిన రోగుల కల్లా పారాసెటిమల్ మాత్రలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మందుల కొరత ప్రభావం తీవ్రంగా ఉంది. రోజూ 600–700 ఆర్ఎల్ సెలైన్ బాటిళ్లు అవసరం కాగా, ప్రస్తుతం 100లోపే అందుబాటులో ఉన్నాయి. ఐవీ ఫ్లూయిడ్స్ 25 వేలు అవసరం ఉండగా, స్టాక్ అస్సలే లేదు. ఏప్రిల్ నుంచి ఆస్పత్రికి మందుల కొరత ఉన్నా అధికారులు స్పందించలేదు. అత్యవసర మందులను ప్రతిరోజు కొనుగోలు చేస్తున్నారు. మందులు అందుబాటులో లేక రోగులు బయటకు వెళుతున్నారు. మందులను కొనుగోలు చేస్తున్నాం.. ఆస్పత్రిలో మందుల కొరత ఉంది. అవసరమైన మందులను కొనుగోలు చేస్తున్నాం. ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం, మరో 2–3 రోజుల్లో అవసరమైన మందులు అందుబాటులోకి రానున్నాయి. కొరత తీరనుంది. – నరేంద్రకుమార్, సూపరింటెండెంట్, జనరల్ ఆస్పత్రి