Maiden Pharma Blamed For 66 Deaths In Gambia A Repeat Offender In India - Sakshi
Sakshi News home page

చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు

Published Sat, Oct 8 2022 3:58 PM | Last Updated on Sat, Oct 8 2022 5:53 PM

Maiden Pharma Blamed For 66 Deaths In Gambia A Repeat Offender In India - Sakshi

న్యూఢిల్లీ:  భారతదేశంలో తయారైన  మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు  చెందిన దగ్గు మందు తాగి  పశ్చిమ ఆఫ్రికా దేశం  గాంబియాలో 66 మంది చిన్నారులు మృతిచెందిన  ఘటన విషాదం నింపింది. నాలుగు రకాల కాఫ్ సిరప్‌లు చిన్నారుల మృతికి కారణమంటూ  డబ్ల్యూహెచ్ఓ మెడికల్ అలర్ట్ జారీ చేసింది. డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్  మోతాదు పరిమితికి మించి ఉన్నాయని తెలిపింది. ఇది  విషపూరితమైందనీ,  తీవ్రమైన మూత్రపిండాల ‍వ్యాధులకు దారితీస్తుందని  తెలిపిన డబ్ల్యూహెచ్ఓ  మైడెన్‌పై సమగ్ర విచారణకు ఆదేశించింది.

అయితే  ఈ ఘటన తరువాత దేశీయ ఫార్మా కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు సంబంధించి  సంచలన విషయాలు వెలుగుచూశాయి.ఈ  ఫార్మా కంపెనీకి చెందిన అనేక మందులు దేశంలోని నాలుగు రాష్ట్రాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. ప్రజారోగ్య కార్యకర్త దినేష్ ఠాకూర్‌ని ఉటంకిస్తూ ఎన్టీటీవీ ఒక కథనాన్ని ప్రచురించింది.  (Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ)

 వియత్నాం చెత్త రికార్డు ఉన్న ఫార్మా కంపెనీలు బ్లాక్‌ లిస్ట్‌  చేసిందనీ, అందులో మైడెన్‌ కూడా  ఒకటని ఠాకూర్‌ విమర్శించారు. వియత్నాం 2011లో కంపెనీని నిషేధించిందన్నారు. ఇంత పేలవమైన రికార్డును కలిగి ఉన్నప్పుడు అనుమతి ఎలా ఇచ్చారని ఠాకూర్ ప్రశ్నించారు. కంపెనీలో తీవ్రమైన నాణ్యత నియంత్రణా లోపాలున్నాయని,సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సెంట్రల్ రెగ్యులేటర్  ఉన్నప్పటికీ కానీ ప్రతి రాష్ట్రానికి దాని స్వంత రెగ్యులేటర్  లేదన్నారు. కేరళ, గుజరాత్‌లోని రెగ్యులేటర్లు మైడెన్‌  మందులు నాణ్యత లేనివిగా తేలియాని గుర్తు చేశారు.  బిహార్‌ ఇప్పటికే దీన్ని బ్లాక్‌ లిస్ట్‌ చేసిందని  ఆయన పేర్కొన్నారు.  ఎగుమతుల అనుమతిని కేంద్ర నియంత్రణ సంస్థ మాత్రమే ఇస్తుంది. కంపెనీ డైరెక్టర్లకు సంబంధించిన కొన్ని కేసులు కూడా కోర్టులో ఉన్నాయన్నారు. ఇవన్నీ దేశంలోని ఔషధ నియంత్రణ వ్యవస్థల పరిస్థితికి అద్దం పడుతున్నాయని ఠాకూర్‌ మండిపడ్డారు.  (Infosys: మాజీ ఎగ్జిక్యూటివ్‌ ఫిర్యాదు, కోర్టులో ఇన్ఫోసిస్‌కు షాక్‌)

మైడెన్ ఫార్మాస్యూటికల్‌ మందులు, నాణ్యతా లోపాలు, చర్యలు
బిహార్ (2008) : ఎరిత్రోమైసిన్ స్టీరేట్ 125ఎంజీ సిరప్ (4 బ్యాచ్‌లు నాణ్యత లేనివిగా గుర్తించారు
బిహార్ (2011) : మిథైలెర్గోమెట్రిన్ ట్యాబ్ (నకిలీ)
వియత్నాం: కంపెనీ 2011 నుండి 2013 వరకు నిషేధం
గుజరాత్ (2013) : మాసిప్రో ట్యాబ్ (రద్దు సమస్యలు)
జమ్మూ  కాశ్మీర్ (2020) : సైప్రోహెప్టాడిన్ హైడ్రోక్లోరైడ్ సిరప్ ఐపీ (నాణ్యతాలోపం)
కేరళ (2021) : మెట్‌ఫార్మిన్ 1000 ట్యాబ్ (రద్దు సమస్య)
కేరళ (2021) : ఈసిప్రిన్ (ఐపీ ప్రమాణానికి అనుగుణంగా లేదు)
కేరళ (2021): మెట్‌ఫార్మిన్ 500 mg (రద్దు సమస్య)
కేరళ (2021) : మైకల్ డి ట్యాబ్ (తక్కువ నాణ్యత)

ఇదీ చదవండి:  ఫెస్టివ్‌ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త!

కాగా నవంబర్ 1990లో కార్యకలాపాలను ప్రారంభించిన మైడెన్, గాంబియాకు మాత్రమే సిరప్‌ను తయారు చేసి ఎగుమతి చేసిందని భారత మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. గాంబియా విషాదం తరువాత, మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్‌ల నమూనాలను ఇండియా పరీక్షిస్తోంది. నమూనాలను సెంట్రల్ ఫార్మాస్యూటికల్ లాబొరేటరీకి పంపామని, నేరం నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మైడెన్ ఫ్యాక్టరీలున్న హర్యానా రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement