భారత్‌లో తొలి మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసు నమోదైందనే వార్తలు కలకలం రేపుతుంది. ఆ వార్తలపై కేంద్రం స్పందించింది. ఇటీవల విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన ఓ వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆ వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మంకీ పాక్స్ వైరస్ లక్షణాలు అతనిలో ఉన్నాయా? లేవా అని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొంది.
Suspected #Mpox case under investigation; patient put under isolation, no cause for alarm
A young male patient, who recently travelled from a country currently experiencing Mpox (monkeypox) transmission, has been identified as a suspect case of Mpox. The patient has been…— PIB India (@PIB_India) September 8, 2024
ఏర్పాటు చేసిన ప్రోటోకాల్‌లకు అనుగుణంగా సదరు వ్యక్తిపై పరీక్షలు జరుగుతున్నాయని, వైరస్ మూలాలను గుర్తించడానికి, కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతుందని చెప్పింది. ఎంపాక్స్ విషయంలో అనవసర ఆందోళన చెందవద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment