Union Health Ministry
-
మంగళగిరి ఎయిమ్స్‌లో 107 అధ్యాపక పోస్టులు ఖాళీ!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎయిమ్స్‌లలో బోధనా సిబ్బంది పోస్టుల్లో భారీగా ఖాళీలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ఏడు ఎయిమ్స్‌లలో అధ్యాపక ఖాళీలు 24 శాతం నుంచి 39 శాతం వరకు ఉన్నాయని పార్లమెంట్లో ఆరోగ్య శాఖ సమాధానమిచ్చింది. పన్నెండు నగరాల్లో పాక్షికంగా పనిచేస్తున్న ఎయిమ్స్‌లు సైతం ఈ కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో 1,235 బోధనా సిబ్బందికి గాను కేవలం 810 మాత్రమే ఉండగా, 425 ఖాళీలు(34శాతం) ఉన్నాయని, నాన్ ఫ్యాకల్టీ విభాగంలో 14,343 సిబ్బందికి గాను 12,101 మంది పనిచేస్తుండగా, మరో 2,242 ఖాళీలున్నాయని వెల్లడించింది. ఇదే మాదిరి భోపాల్‌లో 24శాతం, భువనేశ్వర్‌లో 25శాతం, జో«ద్‌పూర్‌లో 28, రాయ్‌పూర్‌లో 38, పాట్నాలో 27, రిషికేశ్‌లో 39శాతం ఖాళీలున్నాయంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాక్షికంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎయిమ్స్‌లో 259 మంది బోధనా సిబ్బందికి గాను కేవలం 152 మందే ఉండగా.. మరో 107 ఖాళీలు(41శాతం) ఉన్నాయని తెలిపింది. ఇక 1,469 మంది బోధనేతర సిబ్బందిలో 1,021 మంది పనిచేస్తుండగా 448 పోస్టులు ఖాళీలుగా పేర్కొంది.తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్‌లోనూ 183 మంది బోధనా సిబ్బందికి గాను 118 మంది(36శాతం) మంది పనిచేస్తుండగా, 65 పోస్టుల్లో సిబ్బంది లేరని తెలిపింది. ఇక బోధనేతర సిబ్బందిలోనూ 1,374 మందిలో 898 మంది ఉండగా.. 476 ఖాళీలున్నట్లు తెలిపింది. -
భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌లో తొలి మంకీపాక్స్(ఎంపాక్స్) కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేసింది. ఢిల్లీలో ఇద్దరు వ్యక్తుల్లో లక్షణాలు గుర్తించిన ఆరోగ్య శాఖ.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే నిర్ధారణ పరీక్షల్లో ఇద్దరిలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు తేలింది.బాధితుడిని ఆదివారం ఐసోలేషన్‌లో ఉంచి నమూనాలు సేకరించామని, ఎంపాక్స్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. అయితే.. అతనికి సోకిన వేరియెంట్ క్లేడ్-2 అని, అది అంత ప్రమాదకరం కాదని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గతంలో( (జులై 2022 టైంలో) భారత్‌లో ఇలాంటి కేసులే 30 దాకా నమోదయ్యాయి. ఇక.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అందుకు కారణం క్లేడ్-1 రకం. పశ్చిమాఫ్రికా నుంచి ఈ వేరియెంట్ విజృంభించి.. ప్రపంచ దేశాలను వణికించింది. #UPDATE | The previously suspected case of Mpox (monkeypox) has been verified as a travel-related infection. Laboratory testing has confirmed the presence of Mpox virus of the West African clade 2 in the patient. This case is an isolated case, similar to the earlier 30 cases… https://t.co/R7AENPw6Dw pic.twitter.com/ocue7tzglR— ANI (@ANI) September 9, 2024మంకీపాక్స్ లక్షణాలు.. జ్వరం, చర్మం మీద నొప్పితో కూడిన దద్దు, పొక్కులు ఏర్పడటం ప్రధాన లక్షణాలు. పొక్కులకు చీము కూడా పట్టొచ్చు. వైరస్ ఒంట్లోకి ప్రవేశించిన 717 రోజుల తర్వాత దద్దు రూపంలో బయటపడుతుంది. ఎంపాక్స్‌లో ముందు తీవ్రమైన జ్వరం, తర్వాత చర్మం మీద దద్దు తలెత్తుతుంది. మొదట్లో జ్వరంతో పాటు తీవ్ర అలసట, ఒళ్లునొప్పులు, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆకలి లేకపోవటం, గొంతులో గరగర, గొంతునొప్పి ఉంటాయి. ఇవి తీవ్రంగానూ ఉంటాయి. జ్వరం తగ్గిన తర్వాత దద్దు మొదల వుతుంది. ఇది చాలావరకు ముఖం లేదంటే చేతుల మీద ఆరంభ మవుతుంది.ఆపై ఛాతీ, పొట్ట, వీపు మీదికి విస్తరిస్తుంది. అరిచేతులు, అరికాళ్లలోనూ పొక్కులు ఏర్పడొచ్చు. శరీరం మీద దద్దు చాలా నెమ్మదిగా విస్తరిస్తుంది. పొక్కులు కూడా నెమ్మదిగా వస్తాయి కాబట్టి మానటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దురద అంత ఎక్కువగా ఏమీ ఉండదు. 46 రోజుల తర్వాత కొత్త పొక్కులేవీ ఏర్పడవు. పొక్కులు మానిన తర్వాత మచ్చలు పడతాయి. పొక్కులు మాని, చెక్కు కట్టిన తర్వాత వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. లింఫ్‌గ్రంథులు పెద్దగా అవటం మరో ప్రత్యేక లక్షణం. దద్దు రావటానికి ఒకట్రెండు రోజుల ముందు మెడ, చంకలు, గజ్జల వద్ద బిళ్లలు కడతాయి. ఇవి బాగా నొప్పి పెడతాయి. ఇదీ చదవండి: మంకీపాక్స్ ఎంపాక్స్‌గా ఎందుకు మారిందంటే..జాగ్రత్తలు ఎంపాక్స్ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పీసీఆర్ పరీక్ష చేయించు కోవాలి. బయట తిరగకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులంతా మాస్కు ధరించాలి. ఇన్ఫెక్షన్ గలవారు వాడే దుస్తులు, వస్తువుల వంటివి విడిగానే ఉంచాలి. మిగతా వాటితో కలపకూడదు. వీరికి సపర్యలు చేసేవారు గ్లౌజులు, మాస్కు విధిగా ధరించాలి. తొలిసారి గుర్తించారిలా.. మంకీపాక్స్ వ్యాధిని 1958లో తొలిసారి గుర్తించినప్పటికీ.. మొదటిసారి 1970లో ఓ మనిషికి ఇది వ్యాప్తి చెందింది. ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా ఈ వ్యాధి కనిపించేది. అయితే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేయడంతో.. 2022లో భారీ స్థాయిలో మంకీపాక్స్ వ్యాపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలను స్టార్ట్ చేశాయి. మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.. ఒకటి క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్), రెండు క్లాడ్-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్)ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్-1 ఐబీ వేరియంట్ విజృంభిస్తోంది. లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఎంపాక్స్ ఎలా సోకుతుందంటే.. ఇన్ఫెక్షన్కు గురైన జంతువులకు గానీ మనుషులకు గానీ సన్నిహితంగా మెలిగినప్పుడు ఎంపాక్స్ సంక్రమిస్తుంది. ఇన్ఫెక్షన్కు గురైనవారి ఉమ్మి, మూత్రం వంటి శరీర స్రావాలు చర్మానికి తగిలినప్పుడు ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తుంది. ముఖానికి ముఖం, చర్మానికి చర్మం, నోటికి నోరు, నోటికి చర్మం తగలటం.. ఇలా ఏ రూపంలోనైనా సోకొచ్చు. ఇది ఒంట్లోకి ప్రవేశించటానికి తగిన పరిస్థితులూ కలిసి రావాలి. చర్మం ఎక్కడైనా గీసుకుపోయినా, గాయాలైనా, పుండ్లు పడినా.. అక్కడ ఇన్ఫెక్షన్కు గురైనవారి శరీర స్రావాలు అంటుకుంటే వైరస్ ప్రవేశిస్తుంది. పెద్దవాళ్ల కన్నా పిల్లలకు.. ముఖ్యంగా పదేళ్ల లోపు వారికి ముప్పు ఎక్కువ. ఇన్ఫెక్షన్ గలవారితో లైంగిక సంపర్కంలో పాల్గొన్నా సంక్రమించొచ్చు. చికిత్స ఉంది, కానీ.. ఇప్పుడు ఎంపాక్స్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నప్పటికీ కొత్త జబ్బేమీ కాదు. దీని గురించి ఇంతకు ముందే తెలుసు. చికిత్సలూ ఉన్నాయి. జ్వరం తగ్గటానికి పారాసిటమాల్ ఉపయోగపడుతుంది. పొక్కులు చీము పట్టే అవకాశముంది కాబట్టి యాంటీబయాటిక్స్ అవసర మవుతాయి. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా తగినంత నీరు, ద్రవాహారం తీసుకోవాలి. మంచి పోషకాహారం తినాలి. కొందరికి రక్తనాళం ద్వారా సెలైన్ ఎక్కించాల్సి రావొచ్చు. ఉపశమన చికిత్సలతోనే చాలా మంది కోలుకుంటారు. భయమేమీ అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండటం అవసరం. సమస్య తీవ్రమైతే ప్రాణాంతకంగా పరిణమించొచ్చు. -
భారత్‌లో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదు
భారత్‌లో తొలి మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసు నమోదైందనే వార్తలు కలకలం రేపుతుంది. ఆ వార్తలపై కేంద్రం స్పందించింది. ఇటీవల విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన ఓ వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆ వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మంకీ పాక్స్ వైరస్ లక్షణాలు అతనిలో ఉన్నాయా? లేవా అని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొంది. Suspected #Mpox case under investigation; patient put under isolation, no cause for alarmA young male patient, who recently travelled from a country currently experiencing Mpox (monkeypox) transmission, has been identified as a suspect case of Mpox. The patient has been…— PIB India (@PIB_India) September 8, 2024ఏర్పాటు చేసిన ప్రోటోకాల్‌లకు అనుగుణంగా సదరు వ్యక్తిపై పరీక్షలు జరుగుతున్నాయని, వైరస్ మూలాలను గుర్తించడానికి, కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతుందని చెప్పింది. ఎంపాక్స్ విషయంలో అనవసర ఆందోళన చెందవద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. -
దేశంలో వైద్య సిబ్బంది భదత్ర కోసం కేంద్ర కమిటీ
న్యూఢిల్లీ: కోల్‌కతా యువవైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత.. దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాట పట్టారు. తమపై దాడుల్ని అరికట్టాలంటూ నిరసనలతో రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా ఓపీ సేవలు నిలిపేసి 24 గంటల సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల భద్రత కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ ఫెడరేషన్,ఇండియన్ మెడికల్ అసోషియేషన్, ఢిల్లీ రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ ప్రతినిధులు, కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అధికారుల్ని కలిశారు. ఈ నేపథ్యంలోనే ఈ భద్రతా హామీ ప్రకటన వెలువడింది. ‘‘వైద్య రంగానికి చెందిన ప్రతినిధులు మమ్మల్ని కలిశారు. తమపై జరుగుతున్న దాడులపై వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత, రక్షణ కల్పన ప్రధానాంశాలుగా ప్రస్తావించారు. కేంద్రం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించదు. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ల భద్రత కోసం ఎలాంటి ప్రమాణాలు పాటించాలి? అనేది ఆ కమిటీ మాకు సూచిస్తుంది. దానిని బట్టి విధివిధానాలను రూపొందిస్తాం. ఇప్పటికే దేశంలో 26 రాష్ట్రాలు వైద్య సిబ్బంది రక్షణ చట్టాల్ని రూపొందించినట్లు మా దృష్టికి వచ్చింది. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భద్రత కోసం అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’’ అని తన ప్రకటనలో ఆరోగ్య మంతత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో.. ఒకవైపు దేశంలో డెంగీ, మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరసనలకు దిగిన వైద్యులు తమ విధులకు హాజరు కావాలని తన ప్రకటనలో విజ్ఞప్తిచేసింది. వారం కిందట పశ్చిమ బెంగాల్ కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో యువ వైద్యురాలిని అత్యంత కిరాతంగా లైంగిక దాడి జరిపిన హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. వైద్య రంగ సిబ్బంది నేరుగా నిరసనలు తెలుపుతుండగా.. ప్రముఖులు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్టుల ద్వారా ఘటనను ఖండిస్తూ వస్తున్నారు. -
మూసేవాలా తల్లి ఐవీఎఫ్ చికిత్సపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్‌కు 58 ఏళ్ల వయసులో ప్రసవానికి కారణమైన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) చికిత్సపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ సేవలు పొందే మహిళ వయసు 21– 50 మధ్య ఉండాలి. మూసేవాలా హత్యకు గురైన రెండేళ్లకు ఆయన తల్లి చరణ్ కౌర్ మార్చి 17న మగబిడ్డను ప్రసవించారు. -
కోవిడ్ కొత్త కేసులు 774
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 774 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. అదే సమయంలో, యాక్టివ్ కేసుల సంఖ్య 4,187గా ఉందని తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో తమిళనాడు, గుజరాత్‌లలో ఒక్కరేసి చొప్పున బాధితులు చనిపోయారని పేర్కొంది. శీతల వాతావరణం, కోవిడ్–19 వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి కారణంగా కేసులు వేగంగా పెరుగుదల నమోదవుతోందని తెలిపింది. -
619కి చేరిన జేఎన్.1 కేసులు
న్యూఢిల్లీ: దేశంలోని 12 రాష్ట్రాల్లో జనవరి 4వ తేదీ వరకు కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు 619 నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో కర్ణాటకలో అత్యధికంగా 199 కేసులు నమోదయ్యాయన్నారు. ఆ తర్వాత కేరళలో 148, మహారాష్ట్రలో 110, గోవాలో 47, గుజరాత్లో 36, ఏపీలో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్తాన్‌లో 4, తెలంగాణలో 2, ఒడిశా, హరియాణాల్లో ఒక్కటి చొప్పున కేసులు వెలుగు చూశాయి. -
భారత్‌లో కరోనా: 17 రాష్ట్రాల్లో కేసులు
సాక్షి, ఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ జేఎన్.1 వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న వేళ.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటేసింది. తాజాగా.. శనివారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం 423 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి చేరింది. మొత్తం 17 రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. తెలంగాణలో 9, ఏపీలో 8 కేసులు నమోదు అయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటక..రాజస్థాన్‌లో ఒకరి చొప్పున వైరస్ బారినపడి మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే.. 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1.18గా ఉంది. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీల సంఖ్య 4,44,71,212 కాగా.. రికవరీ శాతం 98.81గా తేలింది. జేఎన్.1 వ్యాప్తి ముందు వేరియెంట్‌లలానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత.. పలు రాష్ట్రాలు కూడా జేఎన్.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి.. కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి. ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియంట్.. అదే జరిగితే తట్టుకోగలమా? -
CPR: ఒకేసారి 20 లక్షల మందికి సీపీఆర్ నేర్పిస్తే..
ఢిల్లీ: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వచ్చి ఎక్కడికక్కడే కుప్పకూలి మరణిస్తున్న ఘటనల్ని ఈ రెండు మూడేళ్ల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. కానీ, సీపీఆర్ Cardiopulmonary resuscitation (CPR) చేసి బతికిస్తున్న ఘటనలు మాత్రం అరుదుగా చూస్తున్నాం. గణాంకాల్లో పాతికేళ్లలోపు వాళ్లు కూడా ఉంటుండగా.. ఒబెసిటీ లాంటి సమస్యలు లేనివాళ్లు కూడా సడన్‌గా చనిపోతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. అందుకే ఆపద సమయంలో రక్షించే.. సీపీఆర్‌పై దేశవ్యాప్త అవగాహన కోసం కేంద్రం నడుం బిగించింది. గుండెపోటు హఠాన్మరణాల్ని తగ్గించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక కార్యక్రమం నిర్వహించింది. సీపీఆర్‌పై చదువుకున్న వాళ్లకూ అవగాహన లేదని భావిస్తున్న కేంద్రం.. సీపీఆర్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి ఈ కార్యక్రమంలో 20 లక్షల మంది పాల్గొన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్షుఖ్ మాండవీయ అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. సీపీఆర్ టెక్నిక్‌పై శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. आज देश के हर कोने से 20 लाख से अधिक लोगों के साथ नेशनल बोर्ड ऑफ एग्जामिनेशन द्वारा आयोजित CPR प्रशिक्षण में भाग लिया। इस अभियान के माध्यम से अचानक कार्डियक अरेस्ट होने की स्थिति में हम दूसरे की मदद कर सकते ह pic.twitter.com/SOMLvsdBGl — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 6, 2023 అధికారిక గణాంకాల ప్రకారం.. 2021 నుంచి 2022 మధ్య ఈ తరహా హఠాన్మరణాలు 12.5 శాతం పెరిగాయి. మంచి ఆహారం తీసుకోవాలని, అయినా ఈ తరహా మరణాలు సంభవిస్తుండడంతో సీపీఆర్పైనా అవగాహన ఉండాలని అన్నారాయన. కొవిడ్-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నవారు తర్వాత ఒకటి నుంచి రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. ఈ మేరకు ఆయన భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అధ్యయనాన్ని ఉదహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 20 లక్షల మందికి సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. దాదాపు రెండు లక్షల మంది టీచర్లు, కాలేజీ ఫ్రొఫెసర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. గుర్తింపు పొందిన వెయ్యికి పైగా వైద్యకేంద్రాల ద్వారా ఈ శిక్షణ అందుతుంది. జిమ్‌లో పనిచేసేవారూ ఈ శిక్షణలో భాగమవుతారు. -
చైనాలో నిమోనియా కలకలంపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ: చైనాలో కొత్తగా నిమోనియా కేసులు వెలుగుచూస్తుండటంపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలో సమగ్రస్థాయిలో ఆరోగ్య సంసిద్ధతపై సమీక్ష నిర్వహించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన జారీచేసింది. ‘ఉత్తర చైనాలో చిన్నారుల్లో శ్వాససంబంధ కేసుల ఉధృతి కనిపిస్తోంది. ఈ పరిస్థితిని భారత సర్కార్ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పుటికిప్పుడు భయపడాల్సిన పని లేదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా మీమీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్య సన్నద్ధతపై సమీక్ష నిర్వహించుకోండి’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలకు లేఖ రాశారు. ‘‘ ఇంఫ్లూయెంజా తరహా కేసు(ఐఎల్ఐ), అత్యంత తీవ్రమైన శ్వాస(ఎస్ఏఆర్ఐ) కేసుల విషయంలో కోవిడ్‌కాలంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు పాటించండి. ఈ తరహా కేసులు, ముఖ్యంగా చిన్నారుల్లో కనిపిస్తే జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమగ్ర వ్యాధి నిఘా వ్యవస్థల నేతృత్వంలో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోండి. ఈ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత పోర్టల్‌లో అప్లోడ్ చేయండి. అనుమానిత కేసుల శాంపిళ్లను వైరస్ రీసెర్చ్, డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీలకు పంపించండి. ఇలాంటి ముందస్తు, అప్రమత్త చర్యల ద్వారానే ఆరోగ్య అత్యయక స్థితి దాపురించకుండా పౌరులను కాపాడగలం’’ అని లేఖలో కార్యదర్శి పేర్కొన్నారు. ఉత్తర చైనాలో శ్వాస సంబంధ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడైంది. ఇన్‌ఫ్లూయెంజా, మైకోప్లాస్మా నిమోనియా, సార్స్–కోవ్–2 కేసుల ఉధృతి ఎక్కువగా ఉంది. చలికాలం కావడంతో చైనాలో సాధారణంగానే మైకోప్లాస్మా నిమోనియా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తుంటాయి. ‘‘కేసులపై అదనపు సమాచారం ఇవ్వాలని చైనా యంత్రాంగాన్ని డబ్ల్యూహెచ్ఓ కోరింది. అంతమాత్రాన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కాదు’’ అని కార్యదర్శి స్పష్టంచేశారు. -
ఓటీటీల్లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు వ్యతిరేక హెచ్చరికల ప్రకటనను ఇకపై ఓటీటీలో కూడా ప్రసారం చేయాలని ఉత్తర్వూలు జారీ చేసింది. ఈ మేరకు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రచారాన్ని నిషేదిస్తూ 2004నాటి చట్టంలో నిబంధనలను సవరిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘పొగాకు వినియోగం క్యాన్సర్ కారకం’, ‘పొగాకు వినియోగం ప్రాణాంతకం’అని థియేటర్స్‌లో ప్రదర్శించినట్లే..ఇకపై ఓటీటీ కార్యక్రమాల్లోనూ కనీసం 30 సెకన్ల పాటు ప్రదర్శించాలని ఉత్తర్వూల్లో పేర్కొంది. అంతేకాదు ఈ హెచ్చరిక ప్రకటన ఓటీటీ కంటెంట్ ప్రసారమయ్యే భాషలోనే ఉండాలని ఆదేశించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆరోగ్య, సమాచార ప్రసార శాఖ ప్రతినిధులు కఠిన చర్యలు తీసుకుంటారని కేంద్రం హెచ్చరించింది. దీంతో ఇప్పటి వరకు సినిమా థియేటర్లు, టీవీల్లో కనిపిస్తున్న ఈ పొగాకు వ్యతిరేక యాడ్స్ ఇక ఓటీటీల్లోకి కూడా రానున్నాయి. పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్పలితాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఓటీటీల్లో పొగాకు వ్యతిరేక హెచ్చరికలను ప్రదర్శించాలనే నిబంధన తీసుకొచ్చింది. -
భారత్‌లో కొత్తగా 6వేల కరోనా కేసులు
ఢిల్లీ: భారత్‌లో కొత్తగా ఆరు వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. నానాటికీ కేసుల సంఖ్య ముందుకే పోతోంది. నిన్నటితో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. కేంద్రం తాజాగా శుక్రవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భారత్‌లో కొత్తగా 6,050 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. నిన్న(గురువారం) ఈ సంఖ్య 5,300గా ఉంది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు యూపీ, ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక కేసుల సంఖ్య పోను పోను పెరుగుతుండంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మాన్షుక్ మాండవియా ఇవాళ అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా కేసులు పెరుగుతాయనే ఆందోళనల నడుమ గతంలో కేంద్రం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది కూడా. అయినప్పటికీ వైరస్‌ను ప్రజలు తేలికగా తీసుకుంటుడడం వల్లే కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైలెవల్ మీటింగ్ జరగనుంది. దేశంలో ఎక్స్‌బీబీ.1.16 వేరియెంట్ విజృంభణ కొనసాగుతోంది. వైరస్ తీవ్రత తక్కువే అయినా.. వ్యాప్తి వేగంగా ఉంటోంది. హైబ్రిడ్ ఇమ్యూనిటీ(వ్యాక్సినేషన్, ఇదివరకే ఇన్ఫెక్షన్ సోకి తగ్గిపోవడం) వల్ల పెద్దగా ముప్పు ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ప్రజలు వైరస్‌ను తేలికగా తీసుకోవడం, జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయి. ఒకవేళ వేరియెంట్లో గనుక విపరీతమైన మార్పులు సంభవిస్తే మాత్రం పరిస్థితి ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు సైంటిస్టులు. తెలంగాణ గురుకులంలో 15 కేసులు ఇదిలా ఉంటే.. తెలంగాణ మహబూబాబాద్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. గురుకుల పాఠశాలలో చదువుకునే 15 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. కొవిడ్ సోకిన విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు సూచించారు. జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు గురుకుల పాఠశాలలో పారిశుధ్య పనులు, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. -
COVID-19: కరోనా కొత్త కేసులు 1,805
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,805 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం సోమవారం తెలిపింది. అదే సమయంలో, యాక్టివ్ కేసులు 134 రోజుల తర్వాత 10 వేల మార్కు దాటాయంది. రోజువారీ పాజిటివిటీ రేట్ 3.19%, వీక్లీ పాజిటివిటీ రేట్ 1.39 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 10,300కు పెరిగినట్లు వెల్లడించింది. చండీగఢ్, గుజరాత్, హిమాచల్, యూపీ, కేరళల్లో ఆరుగురు చనిపోయారు. -
కరోనా పెరుగుదల.. కేంద్రం హైఅలర్ట్
సాక్షి, ఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో.. హైఅలర్ట్ ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కరోనా అలర్ట్ జారీ చేసింది. కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేసింది. దేశంలో కేసులు పెరుగుతున్న వేళ.. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఎల్లుండి(సోమవారం) రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నుట్లు తెలుస్తోంది. అలాగే.. ఏప్రిల్ 10, 11వ తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో 1,590 తాజా కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. గత 146 రోజుల తర్వాత ఇదే హయ్యెస్ట్ కేసుల సంఖ్య కావడం గమనార్హం. ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ ఎక్స్‌బీబీ.1.16 విజృంభణ వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం చెబుతోంది. అలాగే.. ఆరు కరోనా మరణాలు సంభవించాయని గణాంకాల్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. DG ICMR Dr Rajiv Bahl and Secy, MoHFW Rajesh Bhushan write to all States/UTs on maintaining optimum testing for Covid-19 pic.twitter.com/xS5ycvqYa1 — ANI (@ANI) March 25, 2023 -
కరోనా విజృంభించొచ్చు.. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: భారత్‌లో మరోసారి కొత్త వేరియెంట్ రూపేణా కరోనా విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. మరోవైపు ఫ్లూ కేసులు గణనీయంగా నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. హఠాత్తుగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున.. అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ మీద దృష్టిసారించాలని ఆ లేఖలో పేర్కొంది. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు బుధవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖలు రాశారు. టెస్టుల సంఖ్యను పెంచాలని, చికిత్స, ట్రాకింగ్‌తో పాటు వ్యాక్సినేషన్ పైనా దృష్టిసారించాలని ఆరోగ్య శాఖ లేఖల్లో ఆయా రాష్ట్రాలను కోరింది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, కాబట్టి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించింది ఆరోగ్య శాఖ. ఈ పర్యవేక్షణ కేత్ర స్థాయి (గ్రామాలు, మండలాలు, జిల్లాలు) నుంచే కొనసాగాలని, కోవిడ్-19 నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకే కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇదిలా ఉంటే.. గత శనివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సైతం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని కోరారాయన. చివరగా.. ఒక్కరోజులో దేశవ్యాప్తంగా నవంబర్ 12వ తేదీన 734 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత.. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత బుధవారం 700కి పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల(4,623) పైకి చేరింది. యాక్టివ్ కేసుల శాతం 0.01 శాతంగా ప్రస్తుతానికి ఉండగా, రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. దేశంలోకి ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్ ఇదే! -
H3N2: సీజనల్ ఇన్‌ఫ్లూయెంజాపై కేంద్రం కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా కారణంగా కర్ణాటక, హర్యానాలో ఒక్కొక్కరు మరణించిన తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఇండిగ్రేటెడ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్(ఐడీఎస్పీ) ద్వారా సీజనల్ ఫ్లూ పరిస్థితిని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపింది. వాస్తవ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఇన్‌ఫ్లూయెంజా కారణంగా ఎంతమంది అనారోగ్యం బారినపడుతున్నారు, ఎంత మంది మరణిస్తున్నారో కూడా ట్రాకింగ్ చేస్తున్నట్లు కేంద్రం చెప్పింది. ఈ ఫ్లూ వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న పిల్లలు, వృద్ధులు ఎక్కువ ప్రభావితం అవుతున్నట్లు తెలిపింది. హెచ్3ఎన్2 కారణంగా కర్ణాటక, హర్యానాలో ఒక్కొక్కరు మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరించింది. అయితే ఈ ఫ్లూ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. మార్చి చివరి నాటికి కేసుల్లో తగ్గుదల నమోదవుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 90 హెచ్3ఎన్2 కేసులు వెలుగుచూశాయి. 8 హెచ్1ఎన్1 కేసులు నమోదయ్యాయి. గొత కొద్దినెలలుగా ఈ కేసుల్లో పెరుగుదల కన్పిస్తోంది. 'హాంగ్ కాంగ్ ఫ్లూ'గా పేరున్న ఈ హెచ్3ఎన్2 వైరస్ వల్ల ఇతర ఫ్లూలతో పోల్చితే ఆస్పత్రిలో చేరాల్సిన ముప్పు అధికంగా ఉంటుంది. చదవండి: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? నిజమేనా? ఇదిగో డాక్టర్ల క్లారిటీ..! -
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. వాళ్లకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ఉదయం కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశారు. అయితే చైనా, దక్షిణకొరియా, జపాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్యాసెంజర్లకే ఇది వర్తిస్తుంది. పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తారు. ఆక్సిజన్‌పై ఆరా.. అలాగే దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతపైనా కేంద్రం ఆరా తీసింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల విషయంపై ప్రతివారం సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. హాస్పిటల్స్‌లో లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సరిగా పనిచేస్తున్నాయా లేదో మాక్ డ్రిల్ నిర్వహించాలంది. ఆక్సిజన్ డిమాండ్ సరఫరా వినియోగంపై ప్రత్యేక యాప్ నిర్వహించాలని లేఖలో పేర్కొంది. చదవండి: హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు.. -
తెలంగాణకు గుడ్ న్యూస్.. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కేంద్రం ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్కు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో.. బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరినప్పుడు.. కేంద్రమంత్రి సమాధానమిస్తూ దేశంలో 12వేలకుపైగా దేశంలో ఫార్మా సంస్థలున్నాయని వివరించారు. పీఎల్ఐ పథకంలో భాగంగా 2020–21 నుంచి 2024–25 మధ్య దేశంలో మూడు చోట్ల బల్క్ డ్రగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క పార్కుకు రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్ పార్కులకు ఆమోదం తెలిపామన్నారు. ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్‌కు రూ.584.04 కోట్లు దేశంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్‌కు 2021–22లో గత నవంబర్ 28 నాటికి రూ.584.04 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మిషన్‌కు రూ.4,176.84 కోట్లు కేటాయించినట్లు ఎంపీ నామా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు రూ.102.91 కోట్లు కేటాయించామన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఏపీలో 43137 మంది, తెలంగాణలో 32854 మంది ఆశా వర్కర్లు ఉన్నారని టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. ఇదీ చదవండి: బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటులో రాష్ట్రంపై వివక్ష -
మంకీపాక్స్‌తో కేరళ వాసి మృతి.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతూ భయాందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్ కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరిస్థితిని పర్యవేక్షించడమే గాక, ఈ మహమ్మారిని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయనుంది. అలాగే దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరీక్షా కేంద్రాలను విస్తరించడం, వ్యాక్సినేషన్ వంటి విషయాలపై సూచనలు ఇవ్వనుంది. యూఏఈ నుంచి కేరళ వచ్చిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో శనివారం మృతి చెందాడు. దేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు ఇప్పటికే కోలుకున్నారు. అయితే ఈ వ్యాధి దేశవ్యాప్తంగా విస్తరించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జులై 26న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఆ భేటీలోనే మంకీపాక్స్‌పై టాస్క్‌ఫోర్స్‌ను నియమించినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ దీనికి నేతృత్వం వహించనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 15 ఐసీఎంఆర్ ల్యాబుల్లో మంకీపాక్స్ పరీక్షలు నిర్వహించేలా సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు సమాచారం. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటికే 75 దేశాలకు విస్తరించిన ఈ వ్యాధి.. 16వేల మందికి సోకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్‌లా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..? -
Monkeypox: మంకీపాక్స్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ హైలెవల్ మీటింగ్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జరనల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరిగింది. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మరునాడే సమావేశం జరగడం గమనార్హం. ఈ భేటీలో మంకీపాక్స్ నివారణకు, ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో మరో కొత్త వ్యాధి వెలుగుచూస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఢిల్లీలో ఆదివారం నమోదైన కొత్త కేసుతో కలిపి దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే తాజాగా ఈ వ్యాధి సోకిన 34 ఏళ్ల వ్యక్తికి విదేశాల్లో పర్యటించిన చరిత్ర లేదు. జ్వరం, చర్మంపై దద్దుర్లతో రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేరాడు. శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా.. ఆదివారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తికి ప్రత్యేక శిబిరంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. అంతకుముందు నమోదైన మూడు మంకీపాక్స్ కేసులు కేరళలోనే వెలుగుచుశాయి. వీరిలో ఇద్దరు యూఏఈలో పర్యటించగా.. ఒకరు దుబాయ్ నుంచి వచ్చారు. మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా శనివారం ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. అన్ని దేశాలు అప్రమత్తమై తక్షణమే వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించింది. అంతర్జాతీయ సమాజమంతా ఏకమై ఈ వ్యాధిపై పోరాడాలని, వ్యాక్సిన్లు, మందుల సాయం అందించుకోవాలని పేర్కొంది. చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్ -
నీట్ పీజీ కటాఫ్‌లో...15 పర్సంటైల్ తగ్గింపు
న్యూఢిల్లీ: పీజీ మెడికల్ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 నీట్–పీజీలో అన్ని కేటగిరీల్లోనూ కటాఫ్‌ను 15 పర్సంటైల్ మేరకు తగ్గించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ను ఆదేశించింది. ఎన్బీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మినూ బాజ్‌పాయ్‌కి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సభ్య కార్యదర్శి బి.శ్రీనివాస్ ఈ మేరకు లేఖ రాశారు. అన్ని అంశాలనూ చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ మేరకు క్వాలిఫయింగ్ కటాఫ్ జనరల్ కేటగిరీకి 35వ పర్సెంటైల్‌కు, ఫిజికలీ హాండీక్యాప్డ్ (జనరల్)కు 30కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వుడ్ కేటగిరీలకు 25 పర్సెంటైల్‌కు తగ్గించాలని పేర్కొన్నారు. ఆలిండియా, రాష్ట్రాల కోటాల్లో రెండేసి రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత కూడా దాదాపు 8,000 సీట్లు మిగిలిపోనున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ మెడికల్ కమిషన్‌తో విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ‘‘దీనివల్ల సీట్ల వృథాకు అడ్డుకట్ట పడుతుంది. తాజా నిర్ణయం వల్ల కనీసం మరో 25 వేల మంది అభ్యర్థులు ప్రస్తుత కౌన్సెలింగ్‌లో మాప్ రౌండ్లో పాల్గొనగలరు’’ అని చెప్పారు. (చదవండి: భారత్‌లో చదువుతామంటూ...‘ఉక్రెయిన్’ విద్యార్థుల పిటిషన్) -
గుడ్ న్యూస్: విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్లో ఉండక్కర్లేదు!
ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రమాదం అంచున ఉన్న దేశాలను తప్పించి మిగతా దేశాల నుంచి రాకపోకలు సాగించే వారికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి వచ్చేవాళ్లు క్యారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని, కేవలం 14 రోజుల స్వీయ పర్యవేక్షణ సరిపోతుందని పేర్కొంది. అయితే ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. అంతేకాదు నిరంతరం మార్పు చెందుతున్న ఈ కోవిడ్ -19 వైరస్‌ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. కానీ ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. కొత్త మార్గదర్శకాలు... విదేశీయులందరూ తప్పనిసరిగా గత 14 రోజుల ప్రయాణ చరిత్రతో సహా ఆన్లైన్లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాలి తప్పనిసరిగా ప్రయాణ తేదీ నుండి 72 గంటలలోపు నిర్వహించబడిన ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్షను కూడా అప్లోడ్ చేయాలి. రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. వ్యాక్సిన్ ప్రోగ్రాంలో భాగంగా భారత్ నిర్దేశించిన 72 దేశాల వారికి మందికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి. ఆయా దేశాల్లో కెనడా, హాంకాంగ్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, బహ్రెయిన్, ఖతార్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సహా కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి. "ఈ మేరకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌లో మొత్తం సమాచారాన్ని నింపి... ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నివేదిక లేదా కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను అప్లోడ్ చేసిన ప్రయాణికులను మాత్రమే ఎయిర్‌లైన్స్ (విమానయాన సంస్థలు) బోర్డింగ్‌కి అనుమతిస్తాయి. ఫ్లైట్ సమయంలో తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్‌ని పాటించాలి " అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. డ్రోన్ల దిగుమతిపై నిషేధం.. కారణం ఇదే) -
కోవిడ్ కట్టడిలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ, నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్న చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశంసించింది. ముఖ్యంగా 15–18 ఏళ్ల వయస్సు వారికి అత్యధికంగా వ్యాక్సినేషన్ ఇస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని పేర్కొంది. కోవిడ్ థర్డ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ వారు వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ విస్తరణ పరిస్థితులను ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. యువతకు అధికంగా వ్యాక్సిన్ ఇస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండటంతో పాటు మొదటి డోస్ 100 శాతం పూర్తి చేసిన రాష్ట్రాల్లో కూడా ఏపీ ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆ ప్రజెంటేషన్‌లో పేర్కొంది. థర్డ్‌వేవ్ అధికంగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడిన తర్వాత ప్రధాన మంత్రి మాట్లాడారు. ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్) రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కోవిడ్‌పై ఈసీ సమీక్ష
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలకు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రమాదకరంగా పరిణమించిన కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సమీక్ష నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ స్థితిగతులను ఈసీకి కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఆ 5 రాష్ట్రాల్లో కోవిడ్ టీకాకు అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాల్సి ఉందని వారు ఈసీకి తెలిపారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవలతో ఈసీ చర్చలు జరిపింది. దేశంలో ప్రస్తుతమున్న కోవిడ్ పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలు ఆమోదయోగ్యం కాదని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ ఈసీకి వివరించారు. ఇలాంటి ఎన్నికల కార్యక్రమాలకు అనుమతిని ఇవ్వకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల షెడ్యూళ్లను ఈసీ త్వరలో ప్రకటించనుంది. కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో యూపీలో పార్టీ ఎన్నికల ర్యాలీలను రద్దుచేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం ప్రకటించింది. డిజిటల్ వేదికగా వర్చువల్ ర్యాలీలు మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. -
2 రోజుల కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘన జరిమానాలు అక్షరాలా రూ. 1.5 కోట్లు!
Omicron Scare న్యూఢిల్లీ: గడచిన 24 గంటల్లో దేశ రాజధానిలో 180 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ హెల్త్ బులెటన్ శుక్రవారం తెలియజేసింది. జూన్ 16 తర్వాత నిన్న ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ దృష్ట్యా కోవిడ్ ప్రోటోకాల్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఐతే గడచిన రెండు రోజుల వ్యవధిలో ప్రొటోకాల్ ఉల్లంఘనల వల్ల సుమారు 1.5 కోట్ల రూపాయల జరిమానాను వసూలు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం శనివారం తెలిపింది. ఉల్లంఘనలకు సంబంధించి 163 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయని పేర్కొంది. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, గుమిగూడినందుకు గాను ఈ జరిమానాలు విధించినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. కాగా గత 24 గంటల్లో దేశంలో 7,189 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 415 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో, 115 మంది కోలుకున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 108 ఒమిక్రాన్ కేసులు నమోదవగా, ఢిల్లీలో 79, గుజరాత్లో 43, తెలంగాణాలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31 కేసులు నమోదయ్యాయి. చదవండి: మద్యం తాగే వయసు 21 ఏళ్లకు కుదింపు! ఆ రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధం.. -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ. 19,675 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ల కొనుగోలుకు ఈనెల 20వ తేదీ దాకా రూ. 19,675 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేశామని సామాజిక కార్యకర్త అమిత్ గుప్తా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్లను కేటాయించింది. ఈ ఏడాది జనవరి 16న మనదేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. కోవిన్ పోర్టల్ ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 140 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. మే 1 నుంచి డిసెంబరు 20వ తేదీ దాకా 117.56 కోట్ల డోసులను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో (సీవీసీ) ప్రజలకు ఉచితంగా అందజేశామని, 4.18 కోట్ల డోసులను మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ వివరించింది. జూన్ 21న మార్చిన నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ నెలవారీ ఉత్పత్తి సామర్థ్యంలో 25 శాతం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవచ్చు. 60 శాతం మందికి డబుల్ డోస్ దేశంలో అర్హులైన వారిలో (18 ఏళ్లకు పైబడిన వారిలో) 60 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు. 89 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని తెలిపారు. కాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గురువారం 300 దాటింది. -
ఒక్కరోజులో 2.26 కోట్ల డోసులు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సినేషన్లో భారత్ కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం దేశవ్యాప్తంగా 2 కోట్లకుపైగా టీకా డోసులు ప్రజలకు వేశారు. కో–విన్ పోర్టల్ గణాంకాల ప్రకారం దేశంలో శుక్రవారం ఒక్కరోజే 2.26 కోట్లకుపైగా డోసులు ఇచ్చారు. అత్యధికంగా కర్ణాటకలో 26.9 లక్షల డోసులు, బిహార్‌లో 26.6 లక్షల డోసులు, ఉత్తరప్రదేశ్‌లో 24.8 లక్షల డోసులు, మద్యప్రదేశ్‌లో 23.7 లక్షల డోసులు, గుజరాత్లో 20.4 లక్షల డోసులు ఇచ్చారు. ఈ రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ ప్రధానమంత్రికి ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజల తరపున తాము అందజేసిన జన్మదిన కానుక అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 79.25 కోట్లకు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఒక్క రోజులో కోటికిపైగా డోసులు ఇవ్వడం గత నెల వ్యవధిలో ఇది 4వసారి కావడం విశేషం. ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ.. ప్రధానమంత్రి మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, టిబెట్ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాలు శుభాకాంక్షలు తెలిపారు. సేవా ఔర్ సమర్పణ్.. ప్రధాని మోదీ జన్మదినంతోపాటు ఆయన గుజరాత్ సీఎంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా 20 రోజులపాటు సాగే ‘సేవా ఔర్ సమర్పణ్’ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 7 దాకా దేశవ్యాప్తంగా కొనసాగనుంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి సేవా కార్యక్రమాలు చేపడతారు. 14 కోట్లకుపైగా రేషన్ కిట్లు పంపిణీ చేస్తారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లో జన్మించిన నరేంద్ర మోదీ తొలుత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరారు. అనంతరం బీజేపీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ఆరంభించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రతి భారతీయుడికి గర్వకారణం: మోదీ దేశంలో ఒక్కరోజులో 2.26 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయడంలో పాల్గొన్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కృషి మరువలేనదని ప్రశంసించారు. -
కరోనాపై కేంద్రం కీలక ప్రకటన: సెకండ్ వేవ్ ఇంకా పోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: వరుస పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరిస్తూ కొన్ని సూచనలు చేసింది. ఉత్సవాలు, పర్వదిన వేడుకల్లో జాగ్రత్తలు పాటిస్తూ చూసుకోవాలని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితిని వివరించారు. గతవారంతో పోలిస్తే కేరళలో 68శాతం కేసులు పెరిగాయని వెల్లడించారు.. దేశవ్యాప్తంగా 35 జిల్లాల్లో పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. కరోనా జాగ్రత్తలు ఇంకా పాటించాలని పండుగలు, ఉత్సవాలు అంటూ గుమికూడొద్దని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని తెలిపారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మళ్లీ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. చదవండి: పెళ్లి చేసుకోవాల్సిన వీరు ఏం చేస్తున్నారో తెలుసా? ముఖ్యంగా కేరళలో కరోనా విజృంభణపై రాజేశ్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోందని గుర్తుచేశారు. ఇది ఇంకా ముగిసిపోలేదని ప్రకటించారు. కాగా దేశంలో కరోనా కేసుల వివరాలు వెల్లడించారు. 24 గంటల్లో 43,263 కొత్తగా కేసులు నమోదయ్యాయని, 338 మంది మృతి చెందారని తెలిపారు. అయితే ఆ కేసుల్లో ఒక్క కేరళలోనే 30,196 పాజిటివ్ కేసులు, 181 మృతులు సంభవించాయని వివరించారు. -
4 వారాల తర్వాత కోవిషీల్డ్ రెండో డోస్‌కు చాన్సివ్వండి
కొచ్చి: కోవిడ్ నుంచి ముందస్తు రక్షణలో భాగంగా తొలి కరోనా టీకా తీసుకున్న కేవలం 4 వారాల తర్వాత రెండో డోస్ కోవిషీల్డ్ టీకా కోరే పౌరులకు ఆ అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం దేశంలోని పౌరులు మొదటి డోస్ కరోనా టీకా తీసుకున్న కనీసం 12 వారాల (84 రోజుల) తర్వాతే రెండో డోస్ తీసుకోవాలి. ఆలోపు రెండో డోస్ ఇవ్వరు. అయితే, తొలి డోస్ తీసుకున్న కేవలం 4 వారాల తర్వాత రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవాలనుకునే వారు కోవిన్ పోర్టల్ ద్వారా వ్యాక్సినేషన్‌ను షెడ్యూల్ చేసుకునేందుకు అనుమతించాలని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు సూచించింది. తమ సంస్థలో పనిచేసే 5,000 మందికిపైగా ఉద్యోగులకు తొలి డోస్ కోవిషీల్డ్ టీకా ఇప్పించామని, ప్రభుత్వ నిబంధనల కారణంగా 84 రోజుల్లోపే రెండో డోస్ ఇవ్వడం కుదరడం లేదని, 4 వారాల టీకా గ్యాప్ తర్వాత రెండో డోస్‌కు అనుమతించాలని కైటెక్స్ గార్మెంట్స్ అనే సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ పీబీ సురేశ్ కుమార్ విచారించారు. ‘విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే వారికి ముందస్తు టీకా అనుమతులు ఇస్తున్నారు. భారత్‌లోనే ఉంటూ ఇక్కడే ఉద్యోగం, విద్య కోసం ఇల్లు దాటే పౌరులు తమకూ ముందస్తు టీకా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. స్వదేశంలో ఉండే వారికీ ఈ వెసులుబాటు ఎందుకు ఇవ్వడం లేదు? అనే ప్రశ్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం రావట్లేదు’ అని జడ్జి అన్నారు. -
Covid-19:అసలైన కరోనా వ్యాక్సిన్లను గుర్తించడం ఇలా..
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లకు నకిలీలు పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లతో ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిïÙల్డ్ వ్యాక్సిన్లను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రెండు వారాల క్రితం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలైన టీకాలను కనిపెట్టడం ఎలా అన్నదానిపై కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్‌లో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుతి్నక్–వి టీకాలను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్‌ను పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్, కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్నాయి. అసలైన టీకాలను ఎలా గుర్తించాలో చూద్దాం.. కోవిషీల్డ్ ► లేబుల్ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► వయల్‌పై అల్యూమినియం మూత పైభాగం కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ► ట్రేడ్‌మార్కుతో సహా కోవిషీల్డ్ అనే బ్రాండ్ నేమ్ స్పష్టంగా కనిపిస్తుంది. ► జనరిక్ పేరు బోల్డ్ ఆక్షరాల్లో కాకుండా సాధారణంగా ఉంటుంది. ► సీజీఎస్ నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాలి. ► వయల్‌పై లేబుల్ అతికి ఉన్నచోట ఎస్ఐఐ లోగో కనిపిస్తుంది. ► ఎస్ఐఐ లోగో నిట్టనిలువుగా కాకుండా కొంత వంపుగా ఉంటుంది. ► లేబుల్‌పై కొన్ని అక్షరాలను ప్రత్యేకమైన తెల్ల సిరాతో ముద్రిస్తారు. ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. సులభంగా చదవొచ్చు. ► మొత్తం లేబుల్‌పై తేనెపట్టు లాంటి చిత్రం ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తే కనిపిస్తుంది. కోవాగ్జిన్ ► లేబుల్‌పై డీఎన్ఏ నిర్మాణం లాంటి చిత్రం అతినీలలోహిత కాంతిలోనే కనిపిస్తుంది. ► లేబుల్‌పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్ అని రాసి ఉంటుంది. కోవాగ్జిన్ అని రాసి ఉన్న హోలోగ్రామ్ కూడా అతికించి ఉంటుంది. -
ఫిరోజాబాద్‌లో డెంగ్యూ మహమ్మారి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో డెంగ్యూ మహమ్మారి చెలరేగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన నిపుణులు బృందం నిర్ధారించింది. ఫిరోజాబాద్ పరిసర ప్రాంతాల్లో 200 శాంపిళ్లు సేకరించి పరీక్షించగా వాటిలో 50 శాతం మందికి డెంగ్యూ పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో గత 10 రోజుల్లో 60 మందికి పైగా డెంగ్యూ కారణంగా మరణించగా, అందులో 50 మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారులకు ప్రమాదకరమైన హీమరాజిక్ ఫీవర్ వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. హీమరాజిక్ డెంగ్యూ ఫీవర్‌లో ప్లేట్లెట్ల సంఖ్య ఉన్నట్టుండి పడిపోతుంది. దీంతో పాటు రక్తస్రావం కూడా అవుతుంది. దీంతో చిన్నారులు తక్కువ సమయంలోనే మరణిస్తున్నట్లు నిపుణులు బృందం తెలిపింది. యూపీలో చిన్నారులకు వ్యాపిస్తున్న జ్వరాలు హీమరాజిక్ డెంగ్యూ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు తెలిపినట్లు ఫిరోజాబాద్ కలెక్టర్ ఇటీవలే వెల్లడించారు. జనావాసాల పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే వెంటనే వాటిని శుభ్రం చేయాలని తాజాగా ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బృందం ఫిరోజాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. ఈ బృందంలో ఎంటొమాలజిస్టులు సహా పలు వెక్టర్–బోర్న్ వ్యాధుల నిపుణుల ఉన్నారు. వారు పరిశీలించిన అంశాలను కేంద్రానికి సోమవారం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఎన్సీడీసీకి చెందిన తుషార్ ఎన్ నేల్ ఆధ్వర్యంలోని బృందం తమ ప్రాంతాన్ని పర్యటించి పరిస్థితులను పరిశీలించినట్లు ఫిరోజాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ అలోక్ కుమార్ శర్మ చెప్పారు. కేవలం ఫిరోజాబాద్‌లో మాత్రమేగాక మథుర, ఆగ్రా వంటి చోట్ల కూడా డెంగ్యూ ప్రబలుతోంది. మథురలో కేవలం 15 రోజుల్లోనే 11 మంది చిన్నారులు కన్నుమూశారు. కోవిడ్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏ మాత్రం నేర్చుకోలేదని, ఇప్పటికే వైరల్ ఫీవర్ కారణంగా 100 మందికి పైగా మరణించారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించారు. -
42.78 కోట్లు దాటిన వ్యాక్సినేషన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడి కోసం జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటిదాకా అందించిన వ్యాక్సిన్ డోస్‌ల సంఖ్య 42.78 కోట్లు దాటింది. శనివారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 42,78,82,261 వ్యాక్సిన్ డోస్‌లను ఇచ్చారు. గత 24 గంటల్లో 42,67,799 వ్యాక్సిన్ డోస్‌లను అందించారు. కాగా దేశంలో మహమ్మారి ప్రారంభం నుంచి వైరస్ సోకిన వారిలో 3,05,03,166 మంది ఇప్పటికే కోవిడ్–19 నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో 35,087 మంది రోగులు కోలుకున్నారు. ఇది మొత్తం రికవరీ రేటుని 97.35%కి చేర్చింది. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 39,097 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 27 రోజుల నుంచి 50వేల కంటే తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో 4,08,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు శనివారం 2.40% వద్ద ఉంది. -
పలు మెడికల్ పరికరాలపై భారీ తగ్గింపు..!
న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు మెడికల్ పరికరాల ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పల్స్ ఆక్సిమీటర్లు, బీపీ చెకింగ్ మెషిన్, నెబ్యూలైజర్, డిజిటల్ థర్మో మీటర్,గ్లూకో మీటర్ వంటి మెడికల్ పరికరాలకు కరోనా నేపథ్యంలో గణనీయంగా డిమాండ్ పెరిగింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఐదు మెడికల్ పరికరాలపై ట్రేడ్ మార్జిన్‌ను ప్రభుత్వం పరిమితం చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. దీంతో పలు మెడికల్ పరికరాల ధరలు గణనీయంగా తగ్గనున్నట్లు తెలిపారు. ఈ ధరలు జూలై 20 నుంచి అమలులోకి వస్తుందన్నారు. 2022 జనవరి 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ధరలు అమలులో ఉండనున్నాయి. ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, సంబంధిత పరికరాల ధరలను నియంత్రించే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ), ప్రైజ్ టూ డిస్ట్రిబ్యూటర్ (పిటిడి) స్థాయిలో 70 శాతం ధరలను పరిమితం చేసింది. పరిశ్రమల సంఘాలైన ఫిక్కీ, అద్వామెడ్, అమ్చామ్ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఐదు మెడికల్ పరికరాలకు చెందిన 684 ఉత్పత్తులు, 620 ఇతర ఉత్పత్తులు ఎమ్ఆర్పీ ధరల్లో సుమారు 88 శాతం తగ్గనున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి కోవిడ్-19 సంబంధిత మెడికల్ ఉత్పత్తులను తగ్గించిన విషయం తెలిసిందే. పీపీఈ కిట్, మాస్క్‌లు, పల్స్ ఆక్సిమీటర్లు, బీపాప్ యంత్రాలు, శానిటైజర్లు, ఇతర పరికరాలతో సహా కోవిడ్-19 ముఖ్యమైన వస్తువులపై ఆదాయపు మంత్రిత్వ శాఖ పన్ను మాఫీ చేసింది. అంతేకాకుండా రెమ్‌డెసివిర్, హెపారిన్ సహా అన్ని కరోనావైరస్ మెడిసిన్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. In larger public interest, Government caps Trade Margin for 5 Medical Devices, effective from July 20; -Pulse Oximeter -Blood Pressure Monitoring Machine -Nebulizer -Digital Thermometer -Glucometer It will hugely reduce prices of Medical devices.https://t.co/4YA2zay5yl — Mansukh Mandaviya (@mansukhmandviya) July 24, 2021 -
గర్భిణీలకు వ్యాక్సినేషన్.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ తీసుకునేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై గర్భిణీ స్త్రీలు టీకాలు వేసుకోవడానికి కోవిన్‌లో నమోదు చేసుకోవచ్చునని.. లేదా సమీప టీకా కేంద్రానికి నేరుగా వెళ్లి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
Covid-19: ఉద్యోగుల కుటుంబాలకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణకు జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా పరిశ్రమల్లో, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగి కుటుంబ సభ్యులు, డిపెండెంట్లకు వారితో పాటే వ్యాక్సిన్లు వేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వికాస్ షీల్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు శనివారం లేఖ రాశారు. పరిశ్రమల్లో, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేసే సమయంలో వారితోపాటు కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ వేయాలని వచ్చిన విజ్ఞప్తులపై సమీక్ష జరిపి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే వారి కోసం ఆయా సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ ఆసుపత్రులే వ్యాక్సిన్లను సేకరించాలని తెలిపారు. ఈ మేరకు శనివారం కేంద్రం ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ వేయాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొంది. ప్రభుత్వ సంస్థల్లో మాత్రం వ్యాక్సిన్ అవసరమైన వాళ్లలో 45 సంవత్సరాలు పైబడిన వారి కోసం కేంద్రం రాష్ట్రాలకు అందించే కోటా నుంచి ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. అదే క్రమంలో 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రం వ్యాక్సిన్ తయారీదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన కోటా నుంచి ఇవ్వాల్సిందిగా మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: కరోనా థర్డ్ వేవ్, సెంట్రల్ యాక్షన్ ప్లాన్ -
CoronaVirus Vaccine: రాష్ట్రాలకు 5.86 కోట్ల డోస్‌లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా జూన్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉండే వ్యాక్సిన్ డోస్‌ల వివరాలతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి మొదలుకొని జూన్ 15 వరకు మొత్తంగా 5,86,29,000 కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను రాష్ట్రాలు, యూటీలకు ఉచితంగా అందిస్తుందని లేఖలో సమాచారం అందించింది. ఇవి కాకుండా వ్యాక్సిన్ తయారీదారుల నుంచి 4,87,55,000 డోసులు జూన్ నెలాఖరులోగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నేరుగా కొనుగోలు చేసుకోవటానికి అవకాశముందని ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రతీ నెలా సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ అనుమతులు పొందిన వ్యాక్సిన్ టీకాల్లో 50 శాతం టీకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా ఇచ్చే ప్రక్రియ ఇకమీదటా కొనసాగనుందని తెలిపింది. మిగతా 50 శాతం టీకాలను రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సందర్భంగా అమలు చేయాల్సిన పలు మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. రాష్ట్రాలు జిల్లా వారీగా, కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రా(సీవీసీ)ల వారీగా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలంది. తమ టీకా ప్రణాళికపై ప్రజల్లో అవగాహన పెంచాలని, అందుకు ప్రచార మాధ్య మాలను వినియోగించుకోవాలని పేర్కొంది. కోవిన్ ద్వారా అపాయింట్మెంట్ తేలికగా లభిస్తుం దని, దాంతో సీవీసీల వద్ద భారీ రద్దీని పూర్తిగా అరికట్టవచ్చని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలని ఆరోగ్య శాఖ సూచించింది. రాష్ట ప్రభుత్వ వ్యాక్సినే షన్ కేంద్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు తమ వ్యాక్సి నేషన్ కేంద్రాల్లో ముందస్తు వ్యాక్సిన్ క్యాలెండర్‌ను కోవిన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలకు ముం దస్తుగా తెలపాలని ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రభు త్వ, ప్రైవేట్ కోవిడ్ కేంద్రాలు ఆ రోజు వ్యాక్సిన్ క్యాలెండర్‌ను అదే రోజున వెల్లడించకూడదని ముందస్తుగా వెల్లడించాలని ఆదేశించింది. -
పాజిటివ్ కేసులు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగం కాస్త నెమ్మదించినట్లుగా కనిపిస్తోంది. గత వారంలో మే 10 నుంచి 16 వరకు 23.02 లక్షల కరోనా పాజిటివ్ కేసులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ సంఖ్య గత 3 వారాల్లో అతి తక్కువ. అంతకుముందు మే 3 నుంచి మే 9వ తేదీ మధ్య 27.42 లక్షల పాజిటివ్ కేసులను గుర్తించారు. అయితే మరణాల సంఖ్యలో మాత్రం మార్పు ఏమాత్రం కనిపించట్లేదు. గత వారం కరోనా కారణంగా దేశంలో 28,266 మంది మరణించారు. అంతేగాక ఈ మరణాల సంఖ్య ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అత్యధికం. సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 2,81,386 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 26 రోజుల్లో ఒకే రోజులో 3 లక్షల కన్నా తక్కువ పాజటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అంతకుముందు ఏప్రిల్ 20న 2.94 లక్షల కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల్లో 75.95% శాతం కేసులు కేవలం పది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 34,389 కేసులు, తమిళనాడులో 33,181, కర్ణాటకలో 31,531, కేరళలో 29,704, ఆంధ్రప్రదేశ్‌లో 24,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 31కోట్ల 64లక్షల 23వేల 658 కరోనా టెస్ట్‌లను నిర్వహించగా అందులో ఆదివారం 15లక్షల 73వేల 515 పరీక్షలు చేశారు. అంటే గత 24 గంటల్లో దేశంలో నమోదైన పాజిటివిటీ రేటు 17.88%గా నమోదైంది. దేశంలో 479 జిల్లాల్లో 10% కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉండగా, 244 జిల్లాల్లో 20% కంటే ఎక్కువ ఉంది. -
కోవిడ్ మరణాల్లో మరో రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌తో ప్రాణాలుపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,48,421 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,33,40,938 కు పెరిగింది. దేశంలో ఒక్కరోజులోనే ఏకంగా 4,205 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,54,197కు చేరింది. అదే సమయంలో దేశంలో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 3,55,338 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,93,82,642కు పెరిగింది. రికవరీ రేటు సైతం 83.04 శాతానికి పెరిగింది. రోజువారీ కొత్త కేసులతో పోలిస్తే రోజువారీగా రికవరీ అయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. వరసగా రెండో రోజూ ఇలా రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 37,04,099కు చేరింది. గత 24 గంటల్లో దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 40,956 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 793 కోవిడ్ బాధితుల మరణాలు నమోదయ్యాయి. భారతదేశంలో కరోనా కారణంగా సంభవించిన మరణాలు 2.5 లక్షలను దాటాయి. అయితే మరణాల విషయంలో అమెరికా, బ్రెజిల్‌లు భారత్ కంటే ముందంజలో ఉన్నాయి. అమెరికాలో మరణాల రేటు 1.8 శాతంకాగా, బ్రెజిల్లో 2.7 శాతంగా, దక్షిణాఫ్రికాలో 3.4 శాతంగా ఉంది. ఇక భారత్‌లో జాతీయ మరణాల రేటు 1.09 శాతంగా నమోదైంది. ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాల్లో అమెరికాలో 18 శాతం, బ్రెజిల్లో 12.8%, భారత్‌లో 7.6% నమోదయ్యాయి. అక్టోబర్‌లో ప్రారంభమైన కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తిని అమెరికా ఇప్పటికీ ఎదుర్కొంటోంది. మే 11న అమెరికాలో 693 మంది, బ్రెజిల్లో 2311 మంది, మెక్సికోలో 234 మంది కోవిడ్‌తో మరణించారు. కానీ అదే సమయంలో భారత్‌లో 4,205మంది మృత్యువాత పడ్డారు. అంటే మే 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్యలో 47.72% మరణాలు భారత్‌లోనే నమోదయ్యాయి. అమెరికాలో కరోనా ఫస్ట్ వేవ్‌లో ఒకేరోజులో అత్యధికంగా 2759 మంది ప్రాణాలు కోల్పోయారు. -
Corona Cases in India: కరోనా విస్ఫోటం
సాక్షి, న్యూఢిల్లీ: రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలోని భయానక పరిస్థితులకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,92,488 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య 1,95,57457కు పెరిగింది. కరోనా సంక్రమణ కొత్త కేసులలో 73.71 శాతం 10 రాష్ట్రాల్లో నమోదయ్యాయి. 76 శాతం మరణాలు ఈ 10 రాష్ట్రాల్లోనే సంభవించాయి. శనివారం గణాంకాలతో పోలిస్తే పాజిటివ్ కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. గత 24 గంటల్లో చికిత్సతో కరోనా వైరస్ నయం చేసుకున్న వారి సంఖ్య 3,08,522కు చేరింది. దేశంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 33 లక్షలను దాటేశాయి. గత 24 గంటల్లో, కరోనా కారణంగా రికార్డు స్థాయిలో 3689 మంది మరణించారు.మహారాష్ట్రలో 802 మంది, ఢిల్లీలో 412, ఉత్తర్ ప్రదేశ్‌లో 304, ఛత్తీస్‌గఢ్‌లో 229, కర్ణాటకలో 271, గుజరాత్లో 172, రాజస్తాన్‌లో 160, ఉత్తరాఖండ్‌లో 107, పంజాబ్‌లో 138, తమిళనాడులో 147 మంది మరణించారు. దీంతో దేశంలో మరణాల సంఖ్య 2,15,542కు పెరిగింది. ప్రతీరోజు లక్షల్లో కొత్త రోగుల సంఖ్య పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య ఆదివారం 33,49,644కు పెరిగింది. మొత్తం వైరస్ సోకిన వారిలో ఇది 17.06 శాతం. అయితే రోగుల రికవరీ రేటు 81.84 శాతానికి తగ్గింది. దేశంలో సంక్రమణ తర్వాత కోలుకున్న వారు 1,59,92,271కు పెరిగారు. మరణాల రేటు 1.11%గా ఉం ది. ఢిల్లీలో కరోనా వినాశనం కొనసాగిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ ఢిల్లీలో సుమారు 25 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కరోనా ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోం దనేది ప్రపంచవ్యాప్తంగా నమోదైన గణాంకాలు తెలియచేస్తున్నాయి. ప్రపంచంలో కరోనా వైరస్ సోకిన టాప్–50 దేశాలలో శనివారం 3.91 లక్షల మందికి వైరస్ సోకినట్లు గుర్తించగా భారత్‌లోనే 3,92,459 మంది రోగులను గుర్తించారు. అంటే మొత్తం 50 దేశాల కేసుల కంటే 1000మంది ఎక్కువ రోగులకు దేశంలో వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మూడో దశతో కలిపి ఇప్పటిదాకా 15.68 కోట్లు కోవిడ్ టీకా డోసులు చేశారు. 18–44 ఏళ్ళ మధ్య ఉన్న వారిలో 11 రాష్ట్రాలలో మూడోదశ తొలిరోజు 86,023 మంది మొదటి డోస్ తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ (987), ఢిల్లీ (1,472), గుజరాత్ (51,622), జమ్మూకశ్మీర్ (201), కర్ణాటక (649), మహారాష్ట్ర (12,525), ఒడిశా (97), పంజాబ్ (298), రాజస్తాన్ (1853), తమిళనాడు (527), ఉత్తరప్రదేశ్ (15,792) రాష్ట్రాల్లో మొదటి డోస్ తీసుకున్నారు. -
Coronavirus: భారత్‌లో కొత్తగా 3,92,488 కేసులు
సాక్షి, ఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల దేశంలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,92,488 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 3689 మంది ప్రాణాలు విడిచారు. 3,07,865 మంది ఈ వైరస్‌ను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తంగా 1,59,92,271గా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,95,57,457 కరోనా కేసులు నమోదవగా ఇందులో 33,49,644 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 15,68,16,031 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 2,15,542 మంది కరోనాకు బలయ్యారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7430 కరోనా కేసులు నమోదవగా 56 మంది మరణించారు.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. ఇప్పటివరకు 3,67,727 మంది డిశ్చార్జ్ అవగా 2368 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 80,695 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీలో 1546, మేడ్చల్‌లో 533, రంగారెడ్డిలో 475, నల్లగొండలో 368, సంగారెడ్డిలో 349 కరోనా కేసులు నమోదవగా వరంగల్ అర్బన్‌లో 321, నిజామాబాద్‌లో 301 కేసులు వెలుగుచూశాయి. చదవండి: బాబోయ్... 4 లక్షలూ దాటేశాం -
బాబోయ్... 4 లక్షలూ దాటేశాం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సృష్టిస్తున్న తీవ్ర కలకలంతో దేశంలో పరిస్థితులు రోజురోజుకీ అదుపు తప్పుతున్నాయి. కరోనా సంక్రమణ కేసులు రిక్డార్డు స్థాయిలో నమోదవుతున్న తీరు, మరణాల సంఖ్యలో పెరుగుదల ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రోగులు పెరుగుతున్న కారణంగా ఆరోగ్య వ్యవస్థ అతలాకుతలమవుతోంది. వరుసగా 9 రోజులపాటు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన మన దేశంలో గత 24 గంటల్లో 4 లక్షల కంటే అధికంగా సంక్రమణ కేసులను గుర్తించారు. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 4,01,993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 62,919, కర్ణాటకలో 48,296 పాజిటివ్ కేసులు వచ్చాయి. గత కొద్దిరోజులగా ప్రపంచంలో ఏ దేశంలోని రానన్ని (ఒకేరోజు) అత్యధిక కేసులు భారత్‌లో వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒకేరోజు కొత్త కేసుల సంఖ్య ఏకంగా నాలుగు లక్షలు దాటేసింది. ఈ సంఖ్య కరోనా ఎక్కువగా సోకిన అమెరికాలో శుక్రవారం నమోదైన కేసుల కంటే ఏడురెట్లు ఎక్కువ. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం గుర్తించిన 8.66 లక్షల మంది కొత్త రోగుల్లో దాదాపు సగం (46%) పాజిటివ్ కేసులు భారతదేశంలోనే గుర్తించారు. దీంతో ప్రస్తుతం దేశంలో వైరస్ సోకిన వారి మొత్తం సంఖ్య 1,91,64,969కు చేరుకుంది. దేశంలో కరోనాతో మరణించే వారి సంఖ్య సైతం ప్రతీరోజు పెరుగుతోంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా దేశంలో 3,523 మంది తుదిశ్వాస విడిచారు. దీంతో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 2,11,853 కు చేరుకుంది. అంటే, ప్రపంచంలో గత 24 గంటల్లో సంభవించిన ప్రతి నాలుగు కరోనా మరణాల్లో ఒకటి భారత్‌లో నమోదైంది. ప్రస్తుతం దేశంలో 32,68,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అమెరికా తరువాత భారతదేశంలోనే అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోలుకున్న వారు 3 లక్షలు! అయితే గత 24 గంటల్లో 2,99,988 మంది కరోనా రోగులు చికిత్స తీసుకొని కోలుకోవడం గమనార్హం. ప్రతీరోజూ నమోదవుతున్న కరోనా కొత్త కేసులతో పోలిస్తే కోలుకుంటున్న రోగుల సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 81.84%గా నమోదైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19.45 లక్షల కరోనా టెస్టులు నిర్వహించగా 4,01,993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే 20.66% పాజిటివిటీ రేటు ఉంది. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 15,49,89,635 వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. -
Covid-19 India Update: కరోనా సునామీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పెను ఉప్పెనలా దేశాన్ని ముంచేస్తోంది. ప్రతి రోజూ సునామీలా కేసులు వెల్లువెత్తుతూ ఉండడంతో ఒక రోజు నమోదైన రికార్డులు మర్నాడే తుడిచిపెట్టుకుపోతున్నాయి. కరోనా కరాళ నృత్యంతో ఎన్నో రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క, కరోనాతో మరణిస్తే అంతిమ సంస్కారానికి జానెడు జాగా దొరక్క జనం నానా అవస్థలు పడుతున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో 2 లక్షలకు చేరువలో కేసులు నమోదు కావడం కరోనా పతాక స్థాయికి చేరుకున్నట్టైంది. కరోనా కాటుకి వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం (మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు) 1,84,372 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,38,73,825కి చేరుకుంది. (బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి లోపు కొత్తగా మరో 1,99,531 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం). ఇక యాక్టివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా 13.65.704కి చేరుకుంది. కరోనా మరణాలు కూడా భయాందోళనలు రేపుతున్నాయి. ఒక్క రోజులోనే 1,027 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,72,085కి చేరుకుంది. యూపీ మరో మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌లో నిర్వహించిన కుంభమేళా ఆ రాష్ట్రం కొంప ముంచేలా కనపడుతోంది. గంగానదిలో పవిత్ర స్నానాలకు వెళ్లి వచ్చిన వారిలో కేవలం రెండు రోజుల్లోనే వెయ్యి మందికిపైగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక యూపీలో ఒకే రోజు 20,512 కేసులు నమోదయ్యాయి. సీఎం యోగికి పాజిటివ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌నీ కరోనా వదిలి పెట్టలేదు.కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని యోగి తన ట్విట్టర్ ద్వారా బుధవారం వెల్లడిం చారు. గత కొద్ది రోజులుగా తనను కలుసుకున్న వారంతా కోవిడ్ పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. యూపీ ప్రభుత్వంలో కొంతమంది అధి కారులు మంగళవారం కరోనా బారిన పడడంతో యోగి ఆదిత్యనాథ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ‘‘నాకూ కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సలహా మేరకు స్వీయ నిర్బంధంలో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధు లు నిర్వహిస్తున్నాను’’ అని యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 5న ఆదిత్యనాథ్ భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, యూపీ మంత్రి అశుతోష్ టాండన్ కూడా కరోనా బారినపడ్డారు. -
దేశాన్ని హడలెత్తిస్తోన్న కరోనా సెకండ్ వేవ్
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని హడలెత్తిస్తోంది. ప్రతి రోజూ ఒక కొత్త రికార్డు నమోదవుతోంది. గత 24 గంటల్లో 1,26,789 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.29 కోట్లకు చేరుకుంది. ఒకే రోజు లక్షకు పైగా కేసులు నమోదవడం ఇది మూడో సారి. కరోనాతో 685 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,66,862కి చేరుకుంది. క్రియాశీలక కేసుల సంఖ్య 9,10,319కి చేరుకుంది. మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కేవలం ఆ ఒక్క రాష్ట్రంలో ఒకేరోజు 59,907 కేసులు నమోదయ్యాయి. టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని ప్రధాని∙మోదీ కోవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నారు. టీకా మొదటి డోసు తీసుకున్న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో రెండో డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణాలే కరోనా హాట్‌స్పాట్స్ కరోనా సెకండ్ వేవ్‌లో కూడా పట్టణ ప్రాంతాలే వైరస్‌కు హాట్ స్పాట్స్‌గా మారాయి. మార్చిలో వెలుగులోకి వచ్చిన కోవిడ్–19 కేసుల్లో 48% పట్టణ ప్రాంతాల నుంచే వచ్చాయి. దేశ జనాభాలో ఈ ప్రాంతాల్లో 14%మంది నివసిస్తున్నారు. ఇక ఏప్రిల్‌లోని మొదటి నాలుగు రోజుల్లో కూడా అత్యధికంగా 51.9%కేసులు పట్టణ ప్రాంతాల నుంచే వచ్చినట్టుగా ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక నగరాల్లోనూ కరోనా ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. ముంబై, పుణె, నాగపూర్, చెన్నై, బెంగుళూరు ఢిల్లీ వంటి నగరాల నుంచే 42% కేసులు వస్తున్నాయి. కేసులు అధికంగా వస్తున్న ప్రాంతాల్లో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ► ఉత్తరప్రదేశ్ ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, ఘజియాబాద్‌లలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఈ నెల 17వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లో నైట్ కర్ఫ్యూ విధించారు. యూపీలో ఒక రోజు 6,023 కేసులు నమోదు కావడంతో అత్యధిక కేసులు వస్తున్న పట్టణాల్లో ఆంక్షల్ని కట్టుదిట్టం చేశారు. ► మధ్యప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో మూడు రోజులు సంపూర్ణంగా లాక్డౌన్ విధిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ లాక్డౌన్ అమల్లో ఉంటుంది. సంక్షోభ నివారణ కమిటీతో చర్చల అనంతరం వీకెండ్లో సమస్తం బంద్ చేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో ఒకే రోజు నాలుగు వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మూడు రోజుల కఠినమైన లాక్డౌన్ నిబంధనలు విధిస్తున్నట్టుగా చెప్పారు. ► అస్సాంలో విమానాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఇవ్వాలి. కర్ణాటకలో రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రెండోదఫా కరోనా కేసులు విస్తరిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 8 జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 10 నుంచి 20 వరకు రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. బెంగళూరు, మైసూరు, మంగళూరు, కలబురిగి, బీదర్, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, తుమకూరు జిల్లా కేంద్రాల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం యడియూరప్ప తెలిపారు. కేరళ సీఎం పినరయి విజయన్ కరోనా వైరస్ సోకింది. తమిళనాడులో మినీ లాక్డౌన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతుండడంతో ప్రభుత్వం మినీ లాక్డౌన్ విధించింది. కరోనాను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ నెల 10వ తేదీ నుంచి పలు ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. గురువారం అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4,276 పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. రాజధాని నగరం చెన్నైలో 1,520 పాజిటివ్ కేసులు, 6 మరణాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గురువారం ప్రధాని నరేంద్రమోదీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పలు ఆంక్షలతో కూడిన మినీ లాక్డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ ప్రధాన లక్షణమైన జ్వరం బారినపడిన వారిని గుర్తించేందుకు ఇంటింటా పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తి లాక్డౌన్ ఉంటుంది. -
దేశంలో దడ పుట్టిస్తోన్న కరోనా విస్ఫోటనం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విస్ఫోటనం దడ పుట్టిస్తోంది. మూడు రోజుల తేడాలో మరోసారి రికార్డు స్థాయిలో లక్షకి పైగా కేసులు నమోదై రికార్డుల్ని తిరగరాశాయి. 24 గంటల్లో 1,15,736 కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కి చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. క్రియాశీల కేసుల సంఖ్య 8,43,473కి చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 6.59 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. కొత్తగా 630 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,66,177కి చేరుకుంది. రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు ► పంజాబ్‌లో రాత్రి కర్ఫ్యూ విధించారు. రాజకీయ సమావేశాలపై నిషేధం విధించారు. రాజకీయ నేతలు సమావేశాలు నిర్వహిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సీఎం అమరీందర్ హెచ్చరించారు. ఆంక్షలు ఈ నెల 30 వరకు అమల్లో ఉంటాయి. ► మహారాష్ట్ర ప్రభుత్వం 9, 11వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్ అయినట్టుగా ప్రకటించింది ► బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. భారీ ర్యాలీలు, ప్రదర్శనలకి అనుమతినివ్వరు. అపార్ట్మెంట్లు, విల్లాలలో ఉండే స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, పార్టీ హాళ్ల వినియోగాన్ని నిషేధించారు. 20 వరకు బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రార్థనలపై కూడా నిషేధం. క్లబ్బులు, పబ్‌లు, రెస్టారెంట్ల సగం సామర్థ్యంతో మాత్రమే నడపాలి. మూడు రెట్లు వేగంతో... కరోనా మొదటి వేవ్‌తో పోల్చి చూస్తే యాక్టివ్ కేసుల సంఖ్య 3 రెట్ల వేగంతో పెరిగిపోతోంది. కేవలం 2 రోజుల్లోనే యాక్టివ్ కేసులు 7 లక్షల నుంచి 8లక్షలు దాటేశాయి. ఏడాది ఆగస్టు 22 నాటికి 7 లక్షలున్న యాక్టివ్ కేసులు సెప్టెంబర్ 2 కల్లా 8 లక్షలు దాటాయి. లక్ష యాక్టివ్ కేసులు నమోదు కావడానికి 8 రోజులు పట్టింది.సెప్టెంబర్ 17న యాక్టివ్ కేసులు అత్యధికంగా 10,17,705 నమోదైతే అతి తక్కువగా ఫిబ్రవరి 11న 1,33,079గా ఉన్నాయి. ఇక పని చేసే చోట వ్యాక్సిన్ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీరు పని చేసే ప్రాంతానికే వైద్య అధికారులు వచ్చి కోవిడ్–19 వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఏప్రిల్ 11 నుంచి టీకా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ బుధవారం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఏదైనా కార్యాల యంలో 45 ఏళ్ల వయసు పైబడిన వారు 100 మందికి పైగా వ్యాక్సిన్ తీసుకోవడానికి సుము ఖంగా ఉంటే అక్కడే వారికి టీకా ఇవ్వడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆ లేఖ లో స్పష్టం చేశారు. ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి వారి కార్యా లయాల్లోనే టీకా కేంద్రాలు ప్రారంభించాలని రాజేశ్ భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు. -
కేసులు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఏకంగా 27,126 కొత్త కేసులు బయటపడటంతో, దేశవ్యాప్తంగా ఈ రోజు నమోదైన కొత్త కేసుల సంఖ్య 40 వేలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 40,953 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గత 111 రోజుల్లో ఒక రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,15,55,284కు చేరుకుందని కేంద్రఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా 188 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,558కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,11,07,332కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 96.12 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,88,394గా ఉంది. క్రమంగా పెరుగుదల ఇటీవల దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. ప్రత్యేకించి 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పెరుగుదల కనిపిస్తోందని తెలిపింది. వాటిలోనూ మహారాష్ట్ర, కేరళ పంజాబ్ రాష్ట్రాల్లోనే 76.22 శాతం యాక్టివ్ కేసులు కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. మహారాష్ట్రలోని పుణే, నాగ్‌పూర్, ముంబై, థానే, నాసిక్ జిల్లాల్లో కోవిడ్ ప్రబలం ఎక్కువగా ఉండగా, కేరళలోని ఎర్నాకులం, పథానంతిట్ట, కన్నూర్, పాలక్కడ్, త్రిస్సూర్ జిల్లాల్లో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. మరోవైపు పంజాబ్‌లోని జలంధర్, ఎస్ఏఎస్ నగర్, పటియాలా, లూధియానా, హొషిర్‌పూర్‌లలో కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో వీటితో పాటు తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హరియాణాలు ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేకు కరోనా సోకింది. నాగ్‌పూర్‌లో నిబంధనలు మహారాష్ట్రలో కోవిడ్ విస్తరిస్తున్న వేళ నాగ్‌పూర్ జిల్లాలో లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకూ పొడిగిస్తున్నట్లు మంత్రి నితిన్ రౌత్ చెప్పారు. ఇటీవల మార్చి 15 నుంచి 21 వరకూ కోవిడ్ ఆంక్షలను విధిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. నేటితో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో లాక్‌డౌన పొడిగిస్తున్నట్లు చెప్పారు. అయితే కొద్దిమేర నిబంధనలను సడలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యవసర వస్తువులను సాయంత్రం 4 గంటల వరకు అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని, సాయంత్రం 7 వరకూ రెస్టారెంట్లను తెరచి ఉంచేలా నిబంధనలు సడలించినట్లు చెప్పారు. రాత్రి 11 వరకూ ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. నాగపూర్ జిల్లాలో శనివారం 3,679 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. (చదవండి: వ్యాక్సిన్ వేయించుకోండి.. వివాహానికి రండి!) -
వ్యాక్సినేషన్‌కు గూగుల్ సాయం
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ సెంటర్ల సమాచారం ఇకపై గూగుల్‌లో కూడా లభ్యం కానుంది. ఈ మేరకు గూగుల్ సంస్థ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. గూగుల్ సెర్చ్, మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్ వంటి టెక్నాలజీ యాప్స్ ద్వారా వ్యాక్సినేషన్ సెంటర్ల సమాచారాన్ని యూజర్లకు అందించనున్నారు. దీనికోసం కేంద్ర ఆరోగ్యశాఖ, బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్లతో కలసి పనిచేసినట్లు గూగుల్ చెప్పింది. అంతేగాక వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, ఫేక్ న్యూస్‌ను అడ్డుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ బృందాల ద్వారా ప్రజలు ప్రభుత్వం అందించిన అధికారపూర్వకమైన సమాచారాన్ని పొందుతున్నట్లు తెలిపింది. ఇంగ్లిష్తో పాటు తెలుగు, తమిళం, హిందీ వంటి స్థానిక భాషల్లో కూడా సమాచారాన్ని అందుబాటులో తీసుకువచ్చినట్లు చెప్పింది. గూగుల్ ట్రెండ్స్‌లో సైతం వ్యాక్సినేషన్ సమాచారాన్ని అప్డేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. -
కోవిడ్ ముప్పు తొలగిపోలేదు
న్యూఢిల్లీ/ ముంబై: మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతూ ఉండడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించింది. ఇంకా కోవిడ్ –19 సంక్షోభం సమసిపోలేదని, ముప్పు పొంచే ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె. పాల్ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్రలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. నాగపూర్ వంటి ప్రాంతాల్లో మళ్లీ లాక్డౌన్ విధించాల్సి రావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పరిస్థితులు చూస్తుంటే మళ్లీ కరోనాపై పోరాడిన తొలి రోజుల్లోకి వెళ్లిపోతున్నామని అనిపిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,854 కేసులు నమోదయ్యాయి. 2021లోకి అడుగు పెట్టాక నమోదైన రోజువారీ కేసుల్లో ఇవే అత్యధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,85,561కి చేరుకుంది. ఇక ఒకే రోజు 126 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,58,189కి చేరుకుంది. వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోండి మçహారాష్ట్రలో అనూహ్యంగా కేసులు పెరిగిపోతూ ఉండడంపై మనం పాఠాలు నేర్చుకోవాలని వి.కె. పాల్ అభిప్రాయపడ్డారు. ఈ వైరస్ ఎప్పుడు, ఎందుకు, ఎలా విజృంభిస్తుందో ఇంకా అర్థం కావడం లేదన్నారు. వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ తీసుకుంటూ నిబంధనల్ని పాటిస్తేనే కరోనాని కట్టడి చేయగలమని చెప్పారు. 10 జిల్లాల నుంచి అత్యధిక కేసులు దేశంలో 10 జిల్లాల నుంచి అత్యధిక కేసులు వస్తున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు. పుణే, నాగపూర్, థానే, ముంబై, అమరావతి, జలగావ్, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, ఎర్నాకులం జిల్లా నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయని, ఈ జిల్లాల్లో ఎనిమిది మహారాష్ట్రలోనే ఉన్నాయని వెల్లడించారు. మహారాష్ట్ర తర్వాత కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు నుంచి అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో ఈ 6 రాష్ట్రాల నుంచే 86 శాతం కేసులు వస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నాగ్‌పూర్‌లో లాక్డౌన్ మహారాష్ట్రలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. బుధవారం ఒక్క రోజే 13,659 కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యధికంగా కేసులు వస్తున్న నాగ్‌పూర్‌లో మార్చి 15 నుంచి 21 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ ప్రకటించారు. కరోనా కట్టడికి మరిన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాల్సి ఉంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ప్రభుత్వ జేజే ఆస్పత్రిలో గురువారం కోవిడ్ తొలి డోస్ తీసుకున్నారు. పనేమి లేకుండా బయటకి రావద్దని విజ్ఞప్తి చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కఠినంగా లాక్డౌన్ అమలు చేసే ముందు ప్రభుత్వ అధికారులతో సమావేశమవుతామని ఠాక్రే తెలిపారు. -
భయం లేకే కోవిడ్ వ్యాప్తి
న్యూఢిల్లీ: కోవిడ్ వైరస్ సోకుతుందన్న భయం లేకపోవడం, స్థానిక సంస్థల ఎన్నికలు, పెళ్లిళ్ల సీజన్ వెరసి మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదవుతున్నాయని కేంద్రం ఆదివారం తెలిపింది. కోవిడ్ కేసుల పెరుగుదలను పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణుల బృందం గతవారంలో రాష్ట్రంలో పర్యటించింది. చాలా అంశాలున్నాయి.. కోవిడ్ వ్యాప్తికి నిర్ణీత కారణాన్ని చెప్పలేమని, కేసుల పెరుగుదల చాలా అంశాల మిళితం వల్ల జరుగుతోందని చెప్పారు. వాటిలో రోగం పట్ల భయం లేకపోవడం, మహమ్మారి పట్ల ఉదాసీనత, సూపర్ స్ప్రెడర్లను గుర్తించలేకపోవడం, ఎన్నికల్లో సరైన కోవిడ్ నిబంధనలు పాటించలేకపోవడం, పెళ్లిళ్ల సీజన్ కావడం, పాఠశాలలు తెరవడం, గుంపులు గుంపులుగా ప్రయాణాలు చేయడం వంటి కారణాల వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని కేంద్రం నివేదిక ద్వారా వెల్లడించింది. ప్రస్తుత కేసుల్లో చాలా వరకు లక్షణాలు లేని రోగులే ఉంటున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించడంలో విఫలం కావడం కూడా కారణమని చెప్పింది. ఇప్పటికైనా మేలుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. డాక్టర్లలోనూ ఉదాసీనత.. డాక్టర్లలో ప్రత్యేకించి ప్రైవేటు డాక్లర్లు కొన్ని కేసులను కేవలం ఫ్లూగా కొట్టిపారేస్తూ టెస్టుల వరకూ వెళ్లనివ్వట్లేదని.. కోవిడ్ రోగులను జూనియర్ డాక్టర్లకు వదిలేస్తున్నారని దీంతో కోవిడ్ తీవ్రత పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. కోవిడ్ నియంత్రణ కోసం కంటితుడుపు చర్యలు తీసుకోకుండా పని చేయాలని, ప్రత్యేకించి రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో పని చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఉంటాయని తెలిపింది. ఎంత మందికి వ్యాక్సినేషన్ చేస్తామన్నారో, ఎందరికి వ్యాక్సిన్ వేశారో చెప్పాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరిందని మహారాష్ట్రలో పర్యటించిన బృందం తెలిపింది. కేంద్రం స్థాయిలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ఈ వివరాలు తెలుస్తాయని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పింది. -
కరోనా: కేంద్రం తాజా మార్గదర్శకాలు.. పూర్తి వివరాలు
సాక్షి, న్యూఢిల్లీ: కార్యాలయాలు ఇతరత్రా పని చేసే ప్రాంతాలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా ప్రామాణిక నియమావళి విడుదల చేసింది. కారిడార్లు, ఎలివేటర్లు, స్టెయిర్‌కేస్, వాహనాలు నిలుపదల చేసే చోటు, క్యాంటీన్, కేఫటేరియా, సమావేశాల మందిరాలు తదితర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రామాణిక నియమావళి పాటించాలని మంత్రిత్వశాఖ ఆదేశాల్లో పేర్కొంది. నియమావళి ఇదీ... ► కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు అన్నివేళలా ఉండాలి. ► కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ ఇతరులతో ఆరు అడుగుల దూరం పాటించాలి. ► అన్నివేళలా మాస్కులు ధరించాలి. ముక్కు, నోరు మూసి ఉండేలా మాస్కుల ధరించేలా చూడాలి. మాస్కు ముందుభాగం పదేపదే తాకకుండా చూసుకోవాలి. ► కార్యాలయంలోకి ప్రవేశించే ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ వినియోగించాలి. ► కరోనా లక్షణాలు లేని వారినే కార్యాలయాల్లోకి అనుమతించాలి ► అధికారి లేదా సిబ్బంది కంటైన్మెంట్ జోన్లలో నివశిస్తున్నట్లైతే వారు డీనోటిఫైఅయ్యే వరకూ కార్యాలయానికి రాకూడదు. వారికి ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించాలి. ► డ్రైవర్లు వారికి కేటాయించిన గదుల్లో సామాజిక దూరం పాటించాలి. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. కంటైన్మెంట్ జోన్లలో నివసించే వారిని వాహనం నడపడానికి అనుమతించకూడదు. ► వాహనం లోపలి భాగాన్ని రోజుకి రెండుసార్లు సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ లేదా స్ప్రేతో శుభ్రం చేయాలి. ► డోర్ హ్యాండిళ్లు, తాళాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ► వయసు ఎక్కువ ఉన్నవారు, గర్భిణులు, వైద్య సేవలు పొందుతున్న వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యాలయాల్లో ఫ్రంట్‌లైన్ పనులకు వారి సేవలు వినియోగించకూడదు. ► మాస్కు ధరించిన వారినే కార్యాలయాల్లోకి రానివ్వాలి. ► సందర్శకులను పూర్తిగా పరిశీలించిన అనంతరమే అనుమతించాలి. ► వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహించాలి. ► వ్యాలెట్ పార్కింగ్ నిర్వహించే వారు గ్లౌజ్‌లు, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ► కార్యాలయం లోపల , బయట ఉన్న దుకాణాలు, స్టాళ్లు, కేఫటేరియా, క్యాంటీన్లలో సామాజిక దూరం పాటించేలా చూడాలి. ► కనీసం రోజుకి రెండుసార్లు కార్యాలయాల ప్రాంగణం శానిటైజ్ చేయాలి. ► వాష్‌రూమ్‌ల్లో ఎళ్లవేళలా శానిటైజర్, సబ్బులు, నీటిప్రవాహం ఉండేలా చూసుకోవాలి. ► సీపీడబ్ల్యూడీ నిబంధనలు అనుసరించి ఏసీలు ఎప్పుడూ 24–30డిగ్రీలు, తేమ 40–70శాతం మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ప్రాంగణం ఎలా ఉండాలి... ► కార్యాలయాల్లో కేసులు నమోదైతే కనక సదరు రోగి 48 గంటల క్రితం సందర్శించిన లేదా పనిచేసిన ప్రాంతాలను శానిటైజేషన్ చేయాలి. ► ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మార్గదర్శకాలు అనుసరించి పనులు కొనసాగించొచ్చు. ► ఒకవేళ ఆయా కార్యాలయాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైతే సదరు బ్లాక్ లేదా భవనం మొత్తాన్ని శానిటైజ్ చేసి తర్వాత కార్యకలాపాలు ప్రారంభించాలి. కంటైన్మెంట్ జోన్లలో నివసించే అధికారులు, సిబ్బంది కార్యాలయానికి సంబంధించిన పర్యవేక్షక అధికారికి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలి. ► కంటైన్మెంట్ జోన్ డీనోటిఫై అయ్యే వరకూ కార్యాలయాలకు హాజరుకాకూడదు. ఆయా సిబ్బంది ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలి. కేసులు వస్తే ఏం పాటించాలి... ► ఆయా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కార్యాలయాల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు వస్తే ... అనారోగ్యానికి గురైన వ్యక్తి గది లేదా ప్రాంతం ఇతరులకు దూరంగా ఉంచాలి. ► అనారోగ్యానికి గురైన వారిని వైద్యుడి వద్దకు తీసుకెళ్తే ఆ సమయంలో వారు మాస్కు లేదా ఫేస్ కవర్ ధరించేలా చూడాలి. ► వెంటనే దగ్గర్లోని వైద్య సదుపాయం ఉన్న ప్రాంతాలకు వారి సమాచారం చేరవేయాలి. వైద్యుల సలహాలు పాటించాలి. ► ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం కేసుల నిర్వహణ ఉండాలి. ఇవి కూడా చదవండి: ఇలాగైతే కరోనా వ్యాప్తి చెందదా? టీకా తీసుకున్న 20 రోజులకు పాజిటివ్! -
చాపకింద నీరులా యూకే కరోనా స్ట్రెయిన్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా దేశంలో యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగతుండటంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. జనవరి 14 నాటికి ఈ రకం వైరస్ కేసుల సంఖ్య 109కి చేరిందని వెల్లడించింది. జనవరి 11 నాటికి ఈ రకం కేసుల సంఖ్య 96గా ఉండగా, తాజాగా 109కి చేరడం కలవరపెడుతోంది. దీన్ని బట్టి చూస్తే దేశంలో కొత్త రకం కరోనా వైరస్, చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతేడాది చివర్లో బ్రిటన్‌లో రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా వైరస్‌పై అప్రమత్తమైన భారత ప్రభుత్వం.. యూకే నుంచి భారత్‌కు విమాన సర్వీసులను డిసెంబర్ 22 వరకు రద్దు చేసింది. అయినప్పటికీ దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. జనవరి 8 నుంచి యూకే విమాన సర్వీసులను పునరుద్దరించిన భారత ప్రభుత్వం..అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి,14 రోజులు క్వారంటైన్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటోంది. కాగా, యూకే స్ట్రెయిన్ ప్రభావం బ్రిటన్ సహా అమెరికా,స్పెయిన్, ఫ్రాన్స్, స్వీడన్, స్విడ్జర్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలపై పడింది. దీంతో ఆయా దేశాల్లో సైతం కొత్తగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. -
టీకా పంపిణీలో ‘కోవిన్’ కీలకం
న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీలో ‘కోవిన్’ యాప్ కీలక పాత్ర పోషించనుందని కేంద్రం ఆదివారం ప్రకటించింది. వ్యాక్సిన్ అందరికీ, అన్ని వేళలా అందుబాటులో ఉండేందుకు ఈ ఆన్లైన్ వేదిక వీలు కల్పిస్తుందని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ భారత్‌లో 16న ప్రారంభం కానుంది. తొలుత సుమారు 3 కోట్ల మంది వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇవ్వనున్నారు. ఆ తరువాత 50 ఏళ్లు దాటినవారికి, 50 లోపు వయస్సున్న దీర్ఘకాల ప్రాణాంతక వ్యాధులున్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. టీకా పంపిణీ సంసిద్ధతలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ‘ఎంపవర్డ్ గ్రూప్ ఆన్ టెక్నాలజీ అండ్ డేటా మేనేజ్మెంట్ టు కంబాట్ కోవిడ్–19’ చైర్మన్ రామ్ సేవక్ శర్మ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం కూడా ఇందులో పాల్గొంది. టీకా పంపిణీకి ప్రాతిపదికగానే కాకుండా, బ్యాక్అప్గా కూడా ‘కోవిన్’ సాఫ్ట్వేర్ సమర్ధవంతంగా పనిచేస్తుందని శర్మ తెలిపారు. సులువుగా వినియోగించేలా దీన్ని రూపొందించామన్నారు. ఇది ఆధార్ డేటాను కూడా వినియోగించుకుంటుందని, పౌరులంతా తమ ప్రస్తుత మొబైల్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో అనుసంధానించుకునేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. తద్వారా వారికి వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారం అందించడం సులువవుతుందన్నారు. -
వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం రూల్స్
న్యూఢిల్లీ : దేశంలో టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త సంవత్సరంలో మొదలయ్యే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం తొలివిడత జూలై వరకు కొనసాగుతుందని, ఈ విడతలో 25 నుంచి 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో తొమ్మిది వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా మూడు కంపెనీల వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి. మార్గదర్శకాలు.. ► ఒక్కో వ్యాక్సిన్ కేంద్రంలో ఒకే రోజు వంద మందికి, అవసరమైతే 200 మందికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ► వ్యాక్సిన్ తీసుకునేవారు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన కో–విన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ► హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 50 ఏళ్ల వయసుపైబడిన వారికి తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వాలి. ఎన్నికల ఓటర్ల జాబితాను బట్టి 50 ఏళ్ల వయసు పైబడిన వారిని గుర్తించాలి. ► 50 ఏళ్ల వయసు ఉన్న వారిని కూడా మళ్లీ రెండు గ్రూపులుగా విభజించాలి. తొలుత 60 ఏళ్లకి పైబడిన వారికి ఇవ్వాలి. ► వ్యాక్సినేషన్ బృందంలో వ్యాక్సినేటర్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్, ఆగ్జిలరీ నర్స్ మిడ్వైఫ్, లేడీ హెల్త్ విజిటర్లు ఉంటారు. వీరే కాకుండా పోలీసు శాఖకు చెందిన వారు సహాయకులుగా ఉంటారు. ► వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. జనవరి నుంచి వ్యాక్సినేషన్‌కు చాన్స్ : సీరమ్ చీఫ్ అదార్ పూనావాలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) చీఫ్ అదార్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ నాటికి మళ్లీ కరోనా ముందు నాటి పరిస్థితులు వస్తాయన్నారు. ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సంబంధించి అనుమతులు లభించే అవకాశం ఉందన్నారు. దేశ జనాభాలో 20% మందికి వ్యాక్సిన్ ఇవ్వగానే సాధారణ పరిస్థితులు వస్తాయని అంచనా వేశారు. -
వ్యాక్సిన్ పంపిణీకి కమిటీలు
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా పంపిణీలో సమన్వయం, పర్యవేక్షణకు వెంటనే కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇతర సాధారణ ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవడంతోపాటు, సామాజిక మా«ధ్యమాల్లో టీకా సామాజిక ఆమోదంపై ప్రతికూల ప్రభావం చూపే పుకార్లను ముందుగానే కనిపెట్టి, అడ్డుకునేందుకు ఈ కమిటీలు సాయపడతాయని తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలతో ప్రారంభమై, పలు గ్రూపుల వారికి దశలవారీగా సాగే టీకా పంపిణీ ఏడాది పొడవునా సాగే అవకాశం ఉందని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీలు, స్థానిక అవసరాలు, వివిధ భౌగోళిక పరిస్థితులకు తగినట్లుగా నిల్వ సదుపాయాలు, కార్యాచరణ వ్యూహాలను సమీక్షిం చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కొత్త కేసులు 50 వేల లోపే.. గత 24 గంటల్లో 48,648 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,88,851కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 563 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,21,090కు చేరుకుంది. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 73,73,375కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,94,386 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 7.35 శాతం ఉన్నాయి. రికవరీ రేటు 91 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. -
తగ్గుతున్న కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ/లండన్: దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 50 వేల లోపే నమోదవుతోంది. గత 24 గంటల్లో 43,893 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,90,322కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 508 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,20,010కు చేరుకుందని ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 72,59,509కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,10,803గా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు 90.85శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.50గా ఉంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా సోకింది. తొలి టీకాలు అంతంతమాత్రమే కరోనా వైరస్ నియంత్రణ కోసం అభివృద్ధి చేస్తున్న తొలి తరం వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో అందరికీ పనిచేసే అవకాశాలు తక్కువేనని కోవిడ్ వ్యాక్సిన్లపై యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ అధ్యక్షుడు కేట్ బింగమ్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌పై అతిగా ఆశలు పెంచుకోవడం కంటే.. నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నివారించడం చాలా ముఖ్యమని తెలిపారు. వ్యాక్సిన్ తయారీ, సేకరణ, పంపిణీ వంటి అంశాలపై కేట్ ద లాన్సెట్ కోసం రాసిన కథనంలో ఈ విషయాలను పేర్కొన్నారు. తొలి తరం వ్యాక్సిన్ల సమర్థతపై సందేహాలు ఉన్న నేపథ్యంలో అవి వ్యాధిని నియంత్రించకపోయినా లక్షణాలు తగ్గిస్తుందని, అందరికీ అన్నివేళలా పనిచేయదు అన్న వాస్తవానికి సిద్ధమై ఉండాలని అన్నారు. అరవై ఐదేళ్ల పైబడ్డ వృద్ధుల్లోనూ రోగ నిరోధక వ్యవస్థ స్పందనను కలుగ చేసే టీకాలపై తాము దృష్టి కేంద్రీకరించామని, కోవిడ్ కారణంగా మరణించిన వారిలో మూడొంతుల మంది ఈ వయసు వారేనని ఆమె పేర్కొన్నారు. సనోఫి, గ్లాక్సో స్మిత్ క్లైన్ ఔషధ తయారీ సంస్థలు 20 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను కోవాక్స్ ఫెసిలిటీకి అందించడానికి అంగీకరించాయి. కోవాక్స్ ఫెసిలిటీ అన్ని దేశాలకూ సమానంగా కరోనా వ్యాక్సిన్లను అందించే వ్యవస్థ. సనోఫి, జీఎస్కె ప్రయోగాలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఈ సంవత్సరం చివరినాటికి మూడో దశ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ఆ కంపెనీలు తెలిపాయి. పేద దేశాల్లో మరణాలు తక్కువ పుణే: అన్ని వసతులు ఉన్న ధనిక దేశాలతో పోల్చుకుంటే, తక్కువ పరిశుభ్రత, తక్కువ పారిశుద్ధ్యం, సురక్షిత నీటి సరఫరాలేని దేశాల్లోనే కోవిడ్ 19 మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు భారతీయ పరిశోధకులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ (ఎన్‌సీసీఎస్), చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్లకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దీన్ని మెడ్రిక్సివ్ అనే జర్నల్‌లో ప్రచురిం చారు. వీరు 106 దేశాల్లో జనాభా సంఖ్య, ప్రస్తుతం ఉన్న వ్యాధులు, బీసీజీ వ్యాక్సి నేషన్, పారిశుద్ధ్యం, ప్రతి పది లక్షలకు కోవిడ్ మరణాలు లాంటి 25 నుంచి 30 ప్రమా ణాలను పరిగణనలోనికి తీసుకొని ఈ అధ్యయనం చేశారు. ధనిక దేశాల్లో కోవిడ్ బారిన పడేవారి సంఖ్య తక్కువాదాయ దేశాలకంటే ఎక్కువగా ఉందన్నారు. -
స్విగ్గీ, జొమాటోతో టీకా డెలివరీ!
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ మరో కొద్ది నెలల్లో భారత్‌లో అందుబాటులోకి రావచ్చనే అంచనాల నేపథ్యంలో టీకా పంపిణీకి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీకా డోసుల్ని ఉంచడానికి దేశవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీ యూనిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే పనిలో పడింది. దీనికి సంబంధించి జాతీయ నిపుణుల కమిటీ ఫార్మాసూటికల్, ఆహార రంగాలలో ఉన్న కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ స్టార్టప్‌లతో ఒప్పందాలు కుదర్చుకొని తాలూకా స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. టీకా డోసుల పంపిణీకి సంబంధించి ఒక ముసాయిదా ప్రణాళికను వచ్చేవారంలో విడుదల చేయనున్నట్టుగా ఆ వర్గాలు తెలిపాయి. భారత్ తాను సొంతంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌తో పాటు 3 విదేశీ వ్యాక్సిన్లు మరి కొద్ది నెలల్లో అందుబాటులోకి రావచ్చు. వ్యాక్సిన్ డోసుల్ని ఉంచడానికి మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు అవసరం. కేంద్ర ఆరోగ్య శాఖ భారీ కోల్డ్ స్టోరేజ్‌లను రెండు నెలల పాటు వాడుకోవడానికి వీలుగా వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. -
మహారాష్ట్రలో మిలియన్ కేసులు
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో 24,886 కేసుల నమోదుకావడంతో రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 10,15,681కి చేరింది. ఇలా దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో ముందున్న మహారాష్ట్ర ప్రపంచంలోని అనేక దేశాలను వెనక్కినెట్టింది. కేసుల సంఖ్యలో మహారాష్ట్రను ఒక దేశంగా లెక్కిస్తే ప్రపంచ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. గతంలో అత్యధిక కేసులతో ముందున్న చైనా, కెనడా, ఇటలీ, జర్మనీ తదితరాలను మహారాష్ట్ర ఎప్పుడో అధిగమించింది. తాజాగా ప్రస్తుతం 66.47 లక్షలతో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, 46.59 లక్షల కేసులతో భారత్ రెండో స్థానంలో ఉంది. 42.83 లక్షల కేసులతో బ్రెజిల్ మూడవ స్థానం. 10.57 లక్షల కేసులతో రష్యా నాల్గో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో నిల్చిన పెరూ దేశంలో 7.16 లక్షల కేసులున్నాయి. అయితే, మహారాష్ట్రలో 10 లక్షలు దాటడం గమనార్హం. మహారాష్ట్రలో రికవరీ సైతం గణనీయంగా ఉంది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,15,023కు చేరింది. ఇది 70.4 శాతం కావడం విశేషం. మరోవైపు మృతుల సంఖ్య సెప్టెంబర్ 12వ తేదీ నాటికి మృతి చెందినవారి సంఖ్య 2.83 శాతం (28,724) ఉంది.ఇక యాక్టివ్ కేçసుల సంఖ్య 2,71,566గా ఉంది. దాదాపు నెల రోజుల్లో మరో 5 లక్షలు.. ఆగస్టు తొమ్మిదవ తేదీకి 5 లక్షలు దాటిన కరోనా మళ్లీ నెల రోజుల్లో సెప్టెంబర్ 12వ తేదీనాటికి మరో 5 లక్షల కేసులు పెరిగాయి. మరోవైపు, ఇలా కేవలం 5 రోజుల్లోనే లక్ష కొత్త కేసులు నమదయ్యాయి. 33 వేల చిన్నారులకూ.. సెప్టెంబర్ 7నాటి గణాంకాల ప్రకారం నవజాత శిశువుల నుంచి 10 ఏళ్లలోపు వయసున్న 33 వేల మందికి పిల్లలకు కరోనా సోకింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో సుమారు నాలుగు శాతం. 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసున్న కరోనా బాధితుల సంఖ్య 60 వేలు దాటింది. ఈ సంఖ్య మొత్తం కరోనా బాధితుల సంఖ్యలో ఏడు శాతాన్ని మించింది. దేశంలో ఒక్కరోజులో 97 వేలు దేశంలో గత మూడు రోజుల నుంచి వరుసగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 97,570 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 46,59,984 కు చేరుకుంది. గత 24 గంటల్లో 81,533 మంది కోలుకోగా.. 1,201 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 77,472 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 36,24,196 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,58,316 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.56 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 77.77 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.66 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 11 వరకు 5,51,89,226 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం మరో 10,91,251 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 5.4 కోట్లకు పైగా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 442 మంది మరణించారు. మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. -
40 లక్షలకు చేరువలో..
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం తాజాగా 83,341 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39,36,747కు చేరుకుంది. రెండు రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 66,659 మంది కోలుకోగా, మరో 1,096 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 68,472కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 8 రోజుల నుంచి దేశంలో వరుసగా రోజుకు 60 వేలకు పైగా కోలుకుంటున్నారని తెలిపింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 29,70,492కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,31,124గా ఉంది. రికవరీ రేటు 77.15 శాతానికి పెరిగిందని కేంద్రం తెలిపింది. జూన్ తర్వాతే వ్యాక్సిన్ జెనీవా/మాస్కో : వచ్చే ఏడాది జూన్ వరకు కరోనా వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకివచ్చే అవకాశాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. అన్ని ప్రయోగాలను దాటుకొని వ్యాక్సిన్ ఎంత సమర్థంగా ఎంత సురక్షితంగా పని చేస్తుందో తేలడానికి సమయం పడుతుందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ చెప్పారు. ఇప్పటివరకు తుది దశ ప్రయోగాల్లో ఉన్న వ్యాక్సిన్లన్నీ సమర్థవంతంగా పని చేస్తాయని నిర్ధారణ కాలేదని జెనీవాలో అన్నారు. డబ్ల్యూహెచ్‌వో అంచనాల ప్రకారం ఈ టీకాలేవీ 50% కూడా సురక్షితం కాదని మార్గరెట్ చెప్పారు. రెండు నెలల్లోనే మానవ ప్రయోగాలు పూర్తి చేసి వ్యాక్సిన్‌కు రష్యా అనుమతులు మంజూరు చేయడం, అమెరికా కూడా నవంబర్‌కి వ్యాక్సిన్ సిద్ధంగా చేస్తామని వెల్లడించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రష్యా వ్యాక్సిన్ సురక్షితమే.. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ సురక్షితమేనని లాన్సెట్ జర్నల్ ఓ పరిశోధనను వెలువరించింది. మొత్తం 76 మందిపై జరిపిన ట్రయల్స్ వివరాలను వెల్లడించింది. ఈ ట్రయల్స్‌లో తీవ్రమైన సైడ్ ఎఫెక్టులేమీ కనపడలేదని తెలిపింది. -
రికార్డు స్థాయిలో పరీక్షలు.. కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గురు వారం తాజాగా రికార్డు స్థాయిలో 83,883 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,53,406కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,043 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 67,376కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 6 రోజుల నుంచి దేశంలో వరుసగా రోజుకు 60 వేలకు పైగా కోలుకుంటున్నారని తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 29,70,492కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,15,538గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 21.16 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. మంగళవారానికి ఇది 77.09 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.75 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 1 వరకు 4,55,09,380 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మంగళవారం మరో 11,72,179 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ 24 గంటల్లో నిర్వహించిన అత్యధిక పరీక్షలు ఇవే కావడం గమనార్హం. తాజా 1,043 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 292 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో మొత్తం 1,623 ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దేశంలో ప్రతి పది లక్షల మందికి 31వేలకు పైగా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. కోవిడ్ మరణాల్లో 51 శాతం మంది 60కి పైగా వయసు ఉన్నవారని చెప్పింది. కోవిడ్–19 మరణాల్లో 69 శాతం మంది పురుషులే ఉన్నారని గురువారం వెల్లడించింది. -
రికవరీ రేటు 75.27%
న్యూఢిల్లీ: దేశంలో సోమవారం మరో 61,408 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,06,348కు చేరుకుంది. కరోనా కేసులు 30 లక్షల నుంచి 31 లక్షలకు కేవలం ఒక్క రోజులోనే చేరుకున్నాయి. 24 గంటల్లో 57,469 మంది కోలుకోగా, 836 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 57,542కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,38,035కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,10,771గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 22.88గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే మూడు రెట్లు కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు 75.27 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.85 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 22 వరకు 3,52,92,220 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శనివారం మరో 8,01,147 శాంపిళ్లను పరీక్షించినట్లు చెప్పింది. ఆదివారం మరో 6,09,917 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,59,02,137 కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 8% కంటే తక్కువగా ఉంది. హరియాణా సీఎంకు కోవిడ్ చండీగఢ్/పణజి: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోవిడ్ బారిన పడ్డారు. వారం క్రితం ఆయన కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత షెకావత్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. తన రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా వచ్చిందంటూ సీఎం ఖట్టర్ సోమవారం ట్విట్టర్లో తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్‌చంద్ గుప్తా, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా పాజిటివ్‌గా తేలింది. కేంద్ర మంత్రికి తగ్గిన ఆక్సిజన్ స్థాయిలు కోవిడ్–19తో చికిత్స పొందుతున్న కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. ఆయన్ను పరీక్షించేందుకు ఢిల్లీ నుంచి వైద్యాధికారుల బృందం రానుందన్నారు. -
కోవిడ్ కేసులు @ 30 లక్షలు
న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం మరో 69,239 కోవిడ్–19 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 30,44,940కు చేరుకుంది. గత 24 గంటల్లో 62,282 మంది కోలుకోగా, 912 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 56,706కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,80,566కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,07,668గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 23.24గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 74.90 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.86 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 22 వరకు 3,52,92,220 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శనివారం మరో 8,01,147 శాంపిళ్లను పరీక్షించినట్లు చెప్పింది. తాజా 912 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 297 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,34,67,237కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 7.67 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇటీవల రోజుకు దాదాపుగా 8 లక్షలకు పైగా టెస్టులు చేస్తున్నట్లు తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1,515 ల్యాబులు పరీక్షలను జరుపుతున్నట్లు వెల్లడించింది. భారత్ లో కరోనా కేసులు 10 లక్షల నుంచి 20 లక్షలు చేరుకోవడానికి 21 రోజులు పట్టగా, 20 లక్షలు దాటిన 16 రోజుల్లోనే 30 లక్షల మార్కును చేరడం గమనార్హం. ఏడాది చివరికి వ్యాక్సిన్: హర్షవర్థన్ అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికి దేశంలో కోవిడ్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో రెండు భారత్‌కు చెందిన సంస్థలు తయారు చేస్తుండగా, ఇంకోటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తోంది. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా టీకా ప్రయోగాలు మొదటి దశ మానవ ప్రయోగాలను ముగించుకొని, రెండో దశలోకి ప్రవేశించాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకా రెండు, మూడు దశల మానవ ప్రయోగాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది. -
24 గంటల్లో 68,898 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం 68,898 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29,05,823కు చేరుకుంది. గత 24 గంటల్లో 62,282 మంది కోలుకోగా, 983 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 54,849కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 21,58,946కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,92,028గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 23.82గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 74.30 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.89 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 20 వరకు 3,26,61,252 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం మరో 9,18,470 శాంపిళ్లను పరీక్షించినట్లు చెప్పింది. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,34,67,237కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 8 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 1,504 ల్యాబ్‌లు పరీక్షలను జరుపుతున్నట్లు వెల్లడించింది. రికవరీ రేటు ఢిల్లీలో 90.10 శాతం, తమిళనాడులో 83.50 శాతం, గుజరాత్లో 79.40 శాతం, రాజస్తాన్‌లో 76.80 శాతం, పశ్చిమబెంగాల్లో 76.50 శాతం, బిహార్‌లో 76.30 శాతం, మధ్యప్రదేశ్‌లో 75.80 శాతం ఉన్నట్లు తెలిపింది. -
20 లక్షల మంది కోలుకున్నారు..
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20 లక్షలు దాటింది. మరోవైపు బుధవారం 64,531 కొత్త కేసులు వెలుగు చూడటంతో మొత్తం కేసుల సంఖ్య 27,67,273కు చేరుకుంది. గత 24 గంటల్లో 60,091 మంది కోలుకోగా, 1,092 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 52,889 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,37,870కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,76,514 గా ఉంది. మొత్తం కేసుల్లో యా క్టివ్ కేసుల సంఖ్య 24.45 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగింట ఒక వంతుగా ఉంది. దేశంలో రికవరీ రేటు 73.64 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.91 శాతానికి పడిపోయిందని తెలి పింది. ఆగస్టు 18 వరకు 3,17,42,782 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. తేమతో కరోనా మరింత ప్రమాదకరం వాషింగ్టన్: గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే కరోనా వైరస్ మనిషికి వెలుపల జీవించే సమయం 23 రెట్లు ఎక్కువగా ఉంటుంద నిఓ పరిశోధనలో తేలింది. ఈ వివరాలు ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. గాలి వదిలే సమయంలో, దగ్గినా, తుమ్మినా వైరస్ తుంపరల ద్వారా బయటకు వస్తుంది. ‘మనిషి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ సులువుగా వ్యాప్తి చెందుతుంది. వైరస్‌కు గాలిలో తేమ తోడైతే చాలా ప్రమాదరకరం. ఎక్కువ పరిమాణం ఉన్న మైక్రాన్లు ఎక్కువ వైరస్‌ను కలిగి ఉంటాయి. 50 మైక్రాన్లు ఉన్న తుంపరలు 16 అడుగుల దూరం వ్యాపించగలవు. 100 మైక్రాన్లు ఉన్న తుంపరలు ఆరడుగుల దూరం ప్రయాణించగలవు. అయితే 3.5 మీటర్లను దాటి ఏ తుంపరలు ప్రయాణించలేవు. భౌతిక దూరం పాటించడం ఒక్కటే తప్పించుకునే మార్గం’ అని తెలిపింది. -
23 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో గురువారం కొత్తగా 66,999 కేసులు బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 23,96,637కు చేరుకుంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 56,383 కోలుకోగా, 942 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 47,033కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 16,95,982కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,53,622గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 27.27 శాతంగా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 70.77 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.96 శాతానికి పడిపోయిం దని తెలిపింది. మొత్తం మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. ఆగస్టు 12 వరకు 2,68,45,688 శాంపిళ్లను పరీక్షించి నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. బుధవారం రికార్డు స్థాయిలో 8,30,391 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 1,433 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. భారత్‌లో ప్రతి మిలియన్ మందికి 19,453 పరీక్షలు జరుగుతున్నాయి. -
23 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో బుధవారం కొత్తగా 60,963 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 23,29,638కు చేరుకుంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 56,110 కోలుకోగా, 834మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 46,091 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 16,39,599కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,43,948గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 27.64గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 70.38 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.98 శాతానికి పడిపోయిందని తెలిపింది. గత 12 రోజులుగా ప్రతి రోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల11 వరకు 2,60,15,297 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు చేస్తున్న పరీక్షల సంఖ్య 18,852కు చేరిందని, ప్రస్తుతం 1,421 ల్యాబ్‌ల్లో పరీక్షలు జరుపుతున్నట్లు వెల్లడించింది. -
రికార్డు స్థాయిలో రికవరీ
న్యూఢిల్లీ: భారత్‌లో వరుసగా నాలుగో రోజూ 60 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. సోమవారం కొత్తగా 62,064 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 22,15,074కు చేరుకుంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 54,859 కోలుకోగా, 1,007 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 44,386కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కేసులు పది లక్షల నుంచి 22 లక్షలకు చేరుకోవడానికి కేవలం 24 రోజులు పట్టింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,35,743కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,34,945 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల రేటు 28.66%గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు దాదాపు 70 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2 శాతానికి పడిపోయిందని తెలిపింది. గత 12 రోజులుగా ప్రతి రోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. ఆగస్టు 9 వరకు 2,45,83,558 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. -
దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ కష్టం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా నియంత్రించవచ్చునని ఇన్నాళ్లూ పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. భారత్‌లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో నివసించే జనాభాలో వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయని వెల్లడించింది. టీకా కార్యక్రమం ద్వారా మాత్రమే ఇమ్యూనిటీని సాధించగలమని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి రాజేష్ భూషణ్ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘హెర్డ్ ఇమ్యూనిటీతో కరోనాని జయించవచ్చునని మన దేశం భావించడం సరైంది కాదు. అధిక జనసాంద్రత, సామాజిక ఆర్థిక పరిస్థితులతో ఒకేసారి దేశవ్యాప్తంగా హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదు. ఒక్కో సమయంలో కొన్ని ప్రాంతాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ కనిపిస్తుంది. టీకాతో మాత్రమే కరోనాను జయించగలం’’అని ఆయన స్పష్టం చేశారు. అప్పటివరకూ ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో ఉండాలని రాజేష్ హితవు పలికారు. హెర్డ్ ఇమ్యూనిటీపై భిన్నాభిప్రాయాలు ఒక ప్రాంతంలో ఉండే జనాభాలో ఎంత మందిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందితే హెర్డ్ ఇమ్యూనిటీని సాధించవచ్చునన్న అంశంలో శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 70 నుంచి 90 శాతం ప్రజల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అయితే దానిని హెర్డ్ ఇమ్యూనిటీగా పరిగణించవచ్చునని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే 60 శాతం మందిలో వచ్చినా దానిని హెర్డ్ ఇమ్యూనిటీగా చెప్పుకోవచ్చునని వైరాలజిస్టు షాహిద్ జమీల్ చెప్పారు. ఇటీవల జర్నల్ సైన్స్‌లో ప్రచురించిన అధ్యయనం కూడా గతంలో ఉన్న అంచనాల కంటే తక్కువ మందిలో యాంటీబాడీలు ఉన్నా హెర్డ్ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చునని వెల్లడించింది. అయితే కోట్లలో జనాభా ఉన్న భారత్‌లో సాధారణ ప్రక్రియ ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ అసాధ్యం అన్న అంశంలో శాస్త్రవేత్తలో ఏకాభిప్రాయం నెలకొని ఉంది. కాగా, భారత్ వంటి దేశాల్లో జాతీయ స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించాలనుకోవడం తప్పిదం అవుతుందని వైరాలజిస్టు జమీల్ అభిప్రాయపడ్డారు. దేశంలో 70శాతం మందికి కరోనా సోకి వారిలో ఇమ్యూనిటీ పెరగాలని కోరుకోవడం సరికాదన్నారు. ఈ ప్రక్రియలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించారు. ఒకే రోజు 52 వేల కేసులు దేశంలో కరోనా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. గురువారం ఒక్క రోజే ఏకంగా 52 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,83,792కు చేరుకుంది. ఇందులో 10 లక్షల మందికి పైగా కోలుకోగా, 5,28,242 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో 52,123 కొత్త కేసులు వచ్చాయని, 775 మంది మరణించారని వెల్లడించింది. కోలుకునే వారి రేటు 64.44గా ఉండగా, మరణాల రేటు 2.21గా ఉంది. జూలై 29 వరకు 1,81,90,382 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ చెప్పింది. బుధవారం మరో 4,46,642 కేసులను పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. 10 లక్షల టెస్టులు చేస్తాం.. దేశంలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, రానున్న రెండు నెల్లలో ఆ సంఖ్యను 10 లక్షలకు పెంచాలని భావిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ చెప్పారు. కరోనాతో పోరాడుతున్న శాస్త్రవేత్తలను, వైద్యులను ఆయన కొనియాడారు. 6 నెలల క్రితం భారత దేశం వెంటిలేటర్లను దిగుమతి చేసుకునేదని, కానీ ఇప్పుడు సొంతగా మూడు లక్షల వెంటిలేటర్లు తయారు చేయగల స్థాయికి ఎదిగిందని చెప్పారు. అంతేగాక హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను 150 దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. వ్యాక్సిన్ తయారీలో సైతం భారత్ ఇతరదేశాలతో పోటీ పడుతోందని వెల్లడించారు. -
ఒకే రోజు 49 వేల కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా.. ఎక్స్ ప్రెస్ కంటే వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధికంగా 49,310 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 12,87,945కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో 740 మంది మరణించారని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శుక్రవారానికి కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,17,208కి చేరుకుంది. దీంతో మొత్తం కోలుకున్న వారి వాతం 63.45కు చేరుకుంది. మరణాల రేటు 2.38కి పడిపోయింది. పరీక్షల సంఖ్య జూలై 20 నాటికి ప్రతి 10 లక్షల మందిలో 10,180 మందికి చేరింది. లేబొరేటరీల సంఖ్య 1290కి పెంచడంతో భారీగా పరీక్షలు పెరిగినట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో 4,40,135 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. గత 24 గంటల్లో మరణించిన వారిలో 298 మంది మహారాష్ట్రకు, 97 మంది కర్ణాటకకు, 88 మంది తమిళనాడుకు, 34 పశ్చిమ బెంగాల్ కు, 28 మంది గుజరాత్ కు, 26 మంది ఉత్తరప్రదేశ్ కు, మరో 26 మంది ఢిల్లీకి, 11 మంది రాజస్తాన్ కు, 10 మంది మధ్యప్రదేశ్ కు, 9 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారని తెలిపింది. జూలై 23 వరకూ మొత్తం 1,54,28,170 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. గురువారం 3,52,901 శాంపిళ్లను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. అత్యధిక కేసుల్లోనూ, అత్యధిక కరోనా మరణాల్లోనూ మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. కోల్ కతాకు విమానాల్లేవు.. లాక్డౌన్ అమలవుతుండటంతో కోల్‌కతా విమానాశ్రయంలో జూలై 25 నుంచి 29 వరకూ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వారానికి రెండు సార్లు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో ‘కోవాగ్జిన్’ తొలి డోసు భారత్ బయోటెక్ సంస్థ ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ తొలి దశ మానవ ప్రయోగాలు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో(ఎయిమ్స్) శుక్రవారం ప్రారంభమయ్యా యి. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చారు. ఎయిమ్స్‌లో ఈ ప్రయోగం కోసం ఇప్పటికే 3,500 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కోవాగ్జిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను ఎంపి క చేసింది. ఈ ప్రయోగాన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు. కోవాగ్జిన్‌లో మూడు రకాల ఫార్ములేషన్స్ ఉన్నాయి. మొదట 50 మం దిపై తక్కువ తీవ్రత కలిగిన వ్యాక్సిన్ ప్రయోగిస్తారు. వారిలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకపోతే మరో 50 మందికి కొంత ఎక్కువ తీవ్రత కలిగిన వ్యాక్సిన్ ఇస్తారు. -
12 లక్షలకు చేరువగా..
న్యూఢిల్లీ: దేశంలో బుధవారం కొత్తగా 37,724 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,92,915కు చేరుకుంది. మరో వైపు గత 24 గంటల్లో 28,432 మంది కోలుకున్నారు. ఒకే రోజులో ఇంత మంది కోలుకోవడం ఇప్పటి వరకూ అత్యధికం కావడం గమనార్హం. అంతేగాక గత వారం రోజుల నుంచి ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 648 మంది మరణించారని, దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 28,732కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 4,11,133 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 7,53,049 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని చెప్పింది. రికార్డు స్థాయిలో రికవరీలు.. దేశంలో బుధవారం 28,478 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన అత్యంత ఎక్కువ రికవరీ కేసులు ఇదే కావడం గమనార్హం. అంతేగాక రికవరీ రేటు 63.13 శాతానికి పెరిగింది. మరణాల రేటు 2.41కి పడిపోయింది. మరణాల రేటు తగ్గుతూ వస్తోందని, రికవరీ రేటు పెరుగుతోందని తెలిపింది. జూన్ 17న మరణాల రేటు 3.36 శాతంగా ఉండగా అది బుధవారానికి 2.41కి పడిపోయింది. -
కరోనా కేసుల్లో కొత్త రికార్డు
న్యూఢిల్లీ/సాక్షి, ముంబై: కరోనా రక్కసి దేశం మొత్తం శరవేగంగా విస్తరిస్తోంది. పాజిటివ్ కేసుల విషయంలో రోజుకో కొత్త రికార్డు నమోదవుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. ఒక్క రోజు వ్యవధిలో రికార్డు స్థాయిలో 38,902 కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో 543 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. అలాగే 23,672 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. దేశంలో ఒక్క రోజులో ఇంతమంది కోలుకోవడం ఇదే తొలిసారి. ఇండియాలో ఇప్పటిదాకా మొత్తం కేసులు 10,77,618కు, మరణాలు 26,816కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 3,73,379 కాగా, ఇప్పటిదాకా మొత్తం 6,77,422 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రపంచంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న అమెరికా, బ్రెజిల్, రష్యా, పెరూ, చిలీ, మెక్సికో, దక్షిణాఫ్రికా, యూకే, ఇరాన్, పాకిస్తాన్, స్పెయిన్‌ల్లో నమోదైన మొత్తం కరోనా కేసులు భారత్‌లోని కేసుల కంటే 8 రెట్లు అధికం. మొత్తం మరణాలు 14 రెట్లు అధికం అని కేంద్రం తెలిపింది మహారాష్ట్రలో మూడు లక్షలకుపైగా కేసులు మహారాష్ట్రలో ఇప్పటిదాకా 3,00,937 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,596 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా బాధితుల సంఖ్య ఒక లక్ష దాటింది. దేశవ్యాప్తంగా తగ్గుతున్న మరణాల రేటు కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం మరణాల రేటు కేవలం 2.49 శాతం మాత్రమేనని తెలిపింది. దేశంలో 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని తెలిపింది. నెల క్రితం దేశంలో కోవిడ్ మరణాల రేటు 2.82 శాతం కాగా, జూలై 10కి 2.72 శాతానికి, జూలై 19 నాటికి 2.49 శాతానికి పడిపోయింది. -
ఒక్కరోజులో 34,884
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతరూపం దాలుస్తోంది. వరుసగా మూడో రోజు 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు.. 24 గంటల వ్యవధిలో కొత్తగా 34,884 కేసులు నమోదయ్యాయి. 671 మంది బాధితులు కరోనాపై పోరాడుతూ మృత్యుఒడికి చేరుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. భారత్‌లో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 10,38,716కు, మరణాలు 26,273కు చేరుకున్నాయి. ప్రస్తుతం 3,58,692 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 6,53,750 మంది చికిత్సతో పూర్తిగా కోలుకొని, ఇళ్లకు చేరుకున్నారు. రికవరీ రేటు 62.94 శాతానికి పెరగడం కొంత ఊరట కలిగించే పరిణామం అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా 1,34,33,742 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. బాధితులందరికీ వైద్య సహాయం హోం ఐసోలేషన్తోపాటు ఆసుపత్రుల్లో ఉన్న కరోనా బాధితులందరికీ వైద్య సహాయం అందజేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలతో దేశంలో కరోనా రికవరీ రేటు 62.94 శాతానికి పెరిగిందని పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల కంటే రికవరీలు 2.95 లక్షలు అధికంగా ఉన్నాయని తెలియజేసింది. గత 24 గంటల్లో 17,994 మంది బాధితులు కోలుకున్నారని వివరించింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 9,734 కరోనా టెస్టులు చేస్తున్నట్లు తెలిపింది. చికిత్సకు స్పందిస్తున్న బచ్చన్ ఫ్యామిలీ కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్య చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారని ముంబైలోని నానావతి ఆసుపత్రి వర్గాలు శనివారం వెల్లడించాయి. అమితాబ్, అభిషేక్ జూలై 11 నుంచి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. -
10 లక్షలకు చేరువలో..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకొని భారత్ విలవిలలాడుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో శరవేగంగా 10 లక్షలకు చేరువలో నిలిచి భయపెడుతోంది. ఒకే రోజు రికార్డు స్థాయిలో ఏకంగా 32,695 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 9,68,876కి చేరుకుందని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక 24 గంటల్లో 606 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 24,915కి చేరుకుంది. కేసుల ఉధృతి ఎంత పెరుగుతున్నా రికవరీ రేటు 63.25%గా ఉండడం ఊరటనిస్తోంది. ఇప్పటివరకు 6,12,814 మంది వైరస్ నుంచి కోలుకుంటే యాక్టివ్ కేసులు 3,31,146గా ఉన్నాయి. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కరోనాని బాగానే కట్టడి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. రికవరీ రేటు 63.25శాతంగా ఉండడం సామాన్యమైన విషయం కాదన్నారు. మృతుల రేటు కూడా ఇతర దేశాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా 2.75%గా ఉందని చెప్పారు. వైద్య సిబ్బందిలో భయం భయం రోగులకు చికిత్స అందించాల్సిన వైద్యులే కోవిడ్ బారిన పడుతూ ఉండడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 99 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1300 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. వైద్య సిబ్బంది మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. క్వారంటైన్లోకి సీఎం, డిప్యూటీ సీఎం కోహిమా: నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియూ రియో, డిప్యూటీ సీఎం వై.పట్టోన్తోపాటు నలుగురు మంత్రులు క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. అధికార సమావేశాల నిమిత్తం ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే వీరు పరీక్షలు చేయించుకోగా కరోనా నెగెటివ్ అని తేలింది. అయిన్పటికీ, ముందు జాగ్రత్తగా క్వారంటైన్లో గడపనున్నాననీ, అధికారిక విధులు కొనసాగిస్తానని సీఎం తెలిపారు. మార్చి 2021నాటికి 6 కోట్ల మందికి ? కరోనా కేసుల తీవ్రతపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) కొన్ని అంచనాలు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో కనీసం 37.4 లక్షల కేసులు నమోదవుతాయని, అదే వైరస్ అడ్డూ అదుçపూ లేకుండా విస్తరిస్తే 6.18 కోట్ల వరకు కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. మార్చి 23 నుంచి జూన్ 18 వరకు దేశంలో కరోనా వైరస్ విస్తరణ, రెట్టింపు అవడానికి పట్టే రోజులు, వివిధ రాష్ట్రాలకి పాకుతున్న తీరుతెన్నులు వంటివి పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాలు వేసింది. సెప్టెంబర్ రెండోవారం లేదంటే అక్టోబర్ మొదటివారంలో కరోనా కేసులు అత్యధిక స్థాయికి చేరుకుంటాయని ఆ సంస్థ తెలిపింది. వారంలో మూడు రోజులు దేశవ్యాప్త లాక్డౌన్ అమలుతో కరోనాని కట్టడి చేయవచ్చునని పేర్కొంది. కర్ణాటకను దేవుడే రక్షించాలి –మంత్రి బి.శ్రీరాములు వ్యాఖ్య కర్ణాటకలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రజా సహకారం చాలా ముఖ్యమని, వైరస్ వ్యాప్తి నుంచి రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడగలడని ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు అన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం తన మాటలను ఒక వర్గం మీడియా వక్రీకరించిందని శ్రీరాములు విమర్శించారు. -
లాక్డౌన్ సడలింపులతో డేంజర్ బెల్స్
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత రోజురోజుకీ ఎక్కువవుతోంది. గత అయిదు రోజులుగా సగటున రోజుకి 9 వేలకు పైగా కేసులు నమోదు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. లాక్‌డౌన్‌ని సడలిస్తూ ఉండడంతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 9,971 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,46,628కి చేరుకుంది. ఒకే రోజులో 287 మంది ప్రాణాలు కోల్పోవడంతో మరణాల సంఖ్య 6,929కి చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. రికవరీ రేటు స్థిరంగా కొనసాగుతూ ఉండడం ఊరటనిస్తోంది. కోవిడ్ రోగుల రికవరీ రేటు 48.37 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఒకే రోజు దాదాపు లక్షన్నర పరీక్షలు కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వానికి చెందిన పరీక్షా ల్యాబ్స్ 531 ఉంటే, ప్రైవేటు ల్యాబ్స్ 228కి పెంచారు. దీంతో దేశవ్యాప్తంగా వైరస్ శాంపిల్స్‌ని పరీక్ష చేసే ల్యాబ్స్ సంఖ్య 759కి చేరుకుంది. గత 24 గంటల్లో లక్షా 42వేల 69 పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు భారత్ 46,66,386 పరీక్షలు నిర్వహించినట్లయింది. మృతుల రేటు తక్కువే 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరణిస్తున్న వారి సంఖ్య ప్రతీ లక్ష మందిలో 0.49గా నమోదయింది. ఇది ప్రపంచ సగటు (5.17) కంటే చాలా తక్కువ. డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం యూకేలో అత్యధికంగా ప్రతీ లక్ష మందికి 59.62 మరణాలు నమోదు కాగా స్పెయిన్ (58.06), ఇటలీ (55.78), జర్మనీలో 10.35 మరణాలు నమోదయ్యాయి. కేసులు, మరణాల్లోనూ మహారాష్ట్ర టాప్ భారత్‌లో కోవిడ్–19 కేసుల్లోనూ, మరణాల్లోనూ మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 82,968కి చేరుకుంటే ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (30,152), ఢిల్లీ (27,654), గుజరాత్ (19,592) ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,969 మంది మరణిస్తే, గుజరాత్ (1,219), ఢిల్లీలో 761 మరణాలు నమోదయ్యాయి. -
రికార్డు స్థాయిలో మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోన రక్కసి జనం ప్రాణాలను బలిగొంటూనే ఉంది. కరోనా సంబంధిత మరణాలు వెయ్యి మార్కును దాటేశాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు.. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో 71 మంది కన్నుమూశారు. కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాలు 1,008కు, మొత్తం పాజిటివ్ కేసులు 31,787కు ఎగబాకాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారత్‌లో యాక్టివ్ కరోనా కేసులు 22,982 కాగా, 7,796 మంది బాధితుల కోలుకున్నారు. అంటే మొత్తం బాధితుల్లో 24.52 శాతం మంది ఆరోగ్యవంతులైనట్లు స్పష్టమవుతోంది. కేవలం 0.33% మంది వెంటిలేటర్లపై దేశంలో మొత్తం కరోనా వైరస్ బాధితుల్లో కేవలం 0.33 శాతం మంది వెంటిలేటర్లపై ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ చెప్పారు. 1.5 శాతం మంది ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నారని, 2.34 శాతం మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారన్నారు. హర్షవర్దన్ బుధవారం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో సరిపడా ఐసోలేషన్ పడకలు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. దేశంలో ప్రస్తుతం 288 ప్రభుత్వ ల్యాబ్‌లు 97 ప్రైవేట్ ల్యాబ్‌లతో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. 16,000 కరోనా నమూనా సేకరణ కేంద్రాలు ఉన్నాయన్నారు. నిత్యం 60 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించేలా టెస్టింగ్ కెపాసిటీని పెంచుతామన్నారు. అందుబాటులో ఉన్న సోషల్ వ్యాక్సిన్లు లాక్డౌన్, భౌతిక దూరం అని స్పష్టం చేశారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో లయన్స్ క్లబ్ సభ్యులు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారని హర్షవర్దన్ కొనియాడారు. 129కి తగ్గిన హాట్‌స్పాట్ జిల్లాలు దేశంలో కరోనా హాట్‌స్పాట్ జిల్లాలు గత 15రోజుల్లో 170 నుంచి 129కి తగ్గాయి. అలాగే కరోనా ప్రభావం ఏమాత్రం లేని గ్రీన్జోన్లు 307 నుంచి 325కు పెరిగాయి. నాన్–హాట్‌స్పాట్ జిల్లాలు(ఆరెంజ్ జోన్లు) 207 నుంచి 297కు చేరాయి. ఏప్రిల్ 15వ తేదీన కేంద్ర ప్రభు త్వం 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా ల్లోని 170 జిల్లాలను కరోనా వైరస్ హాట్స్పాట్లుగా గుర్తించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 325 జిల్లాల్లో కరోనా కేసులేవీ నమోదు కాలేదని కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి లాక్డౌన్ కంటే ముందు 3 నుంచి 3.25 రోజులు పట్టగా, ప్రస్తుతం 10.2 నుంచి 10.9 రోజులు పడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. -
ఎగబాకుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: ఒకే రోజు భారత్ మొత్తమ్మీద 60 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 283కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. వీరిలో వ్యాధి కారణంగా మరణించిన ఐదుగురితోపాటు 39 మంది విదేశీయులు (ఇటలీ 17, ఫిలిప్పీన్స్ 3, యూకే 2, కెనడా, ఇండోనేసియా, సింగపూర్ల నుంచి ఒక్కొక్కరు) కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో వైరస్ బాధితుల సంఖ్య 63కు చేరుకోగా ఇందులో నలుగురు విదేశీయులు ఉన్నారు. కేరళలో ఏడుగురు విదేశీయులతో కలిపి 40 మంది వ్యాధి బారిన పడ్డారు. ఢిల్లీలో ఒక విదేశీయుడితో కలిపి 26 మంది, ఉత్తరప్రదేశ్‌లో ఒక విదేశీయుడు, 24 మంది, తెలంగాణలో 11 మంది విదేశీయులతో కలిపి 21 మంది, రాజస్తాన్‌లో ఇద్దరు విదేశీయులతో కలిపి 17 మంది హరియాణాలో 14 మంది విదేశీయులు, ముగ్గురు భారతీయులు వ్యాధి బారిన పడినట్లు అధికారులు చెప్పారు. కర్ణాటకలో మొత్తం 15 మంది కోవిడ్ బాధితులు ఉండగా, పంజాబ్, లడాఖ్‌లలో 13 మంది చొప్పున, గుజరాత్లో ఏడుగురు, కశ్మీర్లో నలుగురు ఉన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ముగ్గురు చొప్పున వ్యాధి బారిన పడ్డారు. పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్, చండీగఢ్‌లలో ఒక్కో కేసు నమోదైంది. విద్యా సంస్థల హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను అక్కడే ఉండనివ్వాలని, తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ దేశంలోని విద్యా సంస్థలకు సూచించింది. యూపీ మంత్రికి నెగెటివ్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గాయని కనిక కపూర్‌తో ఒక పార్టీలో గడిపిన ఉత్తరప్రదేశ్ మంత్రి జై ప్రతాప్ సింగ్ కోవిడ్ బారిన పడలేదని శనివారం స్పష్టమైంది. కనిక కపూర్ పార్టీలో గడిపిన తర్వాత జై ప్రతాప్ ఇంటికే పరిమితం కాగా.. ఆయన రక్త నమూనాల్లో వైరస్ లేనట్లు పరీక్షలు స్పష్టం చేశాయి. జై ప్రతాప్‌తో సన్నిహితంగా మెలిగిన 28 మందికీ వ్యాధి సోకనట్లు స్పష్టమైందని కింగ్ జార్జ్ మెడికల్ వర్సిటీ అధికార ప్రతినిధి డాక్టర్ సుధీర్ సింగ్ తెలిపారు. తనకు కరోనా సోకినట్లు కనిక కపూర్ ప్రకటించిన తరువాత ఆ గాయనితో సన్నిహితంగా మెలిగిన రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే, కుమారుడు దుష్యంత్ సింగ్‌లు సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లడం తెల్సిందే. ఆన్లైన్లో విలేకరుల సమావేశం కరోనా వైరస్ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఇకపై విలేకరుల సమావేశాలన్నింటినీ ఆన్లైన్ మార్గంలో నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విలేకరులు వ్యాధి బారిన పడకుండా నివారించవచ్చునన్నది ప్రభుత్వ ఉద్దేశం. ‘కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న విలేకరులు తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇకపై ఢిల్లీ ప్రభుత్వపు అన్ని విలేకరుల సమావేశాలను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తాం’ అని సీఎం కేజ్రీవాల్ ట్వీట్‌చేశారు. ఢిల్లీలో పేదలను ఆదుకునేందుకు వచ్చే నెల యాభై శాతం రేషన్ సరుకులు ఎక్కువగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు వితంతు, దివ్యాంగుల, వృద్ధాప్య పింఛన్లను రెట్టింపు చేశారు పలు రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో మార్చి 31వరకు నియంత్రణలు విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాల సీఎంలు తెలపగా గోవా మొత్తం 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో స్టార్హోటళ్లతోపాటు అన్నిచోట్ల మద్యం అమ్మకాలను నిలిపివేశారు. బెంగాల్లో అన్ని బార్లు, పబ్‌లు, హోటళ్లను బంద్ చేశారు. అత్యవసర వైద్యం కోసం శిక్షణ కరోనా వైరస్ ప్రభావం మరింత తీవ్రతరమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వ్యాధిపీడితులకు తగిన చికిత్స అందించేందుకు దేశంలోని వెయ్యి ప్రాంతాల్లో కొంతమందికి వీడియో ద్వారా శిక్షణ ఇచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలన్న అంశంపై ఆదివారం ఒక డమ్మీ డ్రిల్ చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు జరిగాయని, లక్షణాలు లేకున్నా వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న వారికి ఐదు, 14వ రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. మాస్కులు, శానిటైజర్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని, డియోడరెంట్లు తయారు చేసే కంపెనీలు శానిటైజర్లు తయారు చేసేందుకు రాష్ట్రాలు అనుమతివ్వాలని సూచించారు. మాస్కుల వాడకంపై చాలా అపోహలు ఉన్నాయని, ఇవి అందరికీ అవసరం లేదని మనుషులకు కొంచెం దూరంగా ఉండటం వైరస్ వ్యాప్తి నిరోధానికి ముఖ్యమని వివరించారు. ప్రభుత్వం ఇప్పటివరకు విదేశాల్లో చిక్కుకుపోయిన 1700 మంది భారతీయులను తిరిగి తెచ్చిందని తెలిపారు. సామూహిక వ్యాప్తి జరుగుతోందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అలా జరిగినప్పుడు ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కోవిడ్ బారిన పడ్డ వారికి సన్నిహితంగా ఉన్న స్ముఆరు 7000 మందిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణాలు వద్దు: మోదీ వలసదారులు సహా ప్రజలంతా ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని, కరోనా భయంతో సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చేయవద్దని ప్రధాని కోరారు. ఇలాంటి సమయాల్లో ప్రయాణాలు చేసే వారు, తమతోపాటు కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసినట్లేనని హెచ్చరించారు. ఎవరూ ఎక్కడికీ వెళ్లవద్దని కోరారు. నగరాల్లో కరోనా కేసులు బయటపడటంతో జనం భయంతో సొంతూళ్లకు వెళుతున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో మోదీ మాట్లాడారు. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లడం వల్ల వైరస్ ముప్పు మరింత పెరుగుతుందన్నారు. అలాగే, సొంతూళ్లకు వెళితే అక్కడి వారికి కూడా ఈ వ్యాప్తి విస్తరించే ప్రమాదముందని పేర్కొన్నారు. అందుకే, అత్యవసరమైతేనే బయటకు అడుగుపెట్టాలని దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. -
సూడో డాక్టర్ల స్పూఫింగ్ దందా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థల పేరుతో స్పూఫ్డ్ మెయిల్స్ సృష్టించి నాలుగు రాష్ట్రాల్లో డాక్టర్లను రూ.కోట్లకు ముంచిన ముఠా గుట్టును నగర పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశామని, 11 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేశామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. అదనపు సీపీ, సీసీఎస్ డీసీపీలు షికా గోయల్, అవినాష్ మహంతితో కలసి తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంతోష్‌రాయ్, మనోజ్‌కుమార్ పాథక్, సునీల్‌కుమార్ మెహతో, అమిత్ కుమార్ స్నేహితులు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురాశతో సూడో డాక్టర్ల అవతారమెత్తారు. డాక్టర్లుగా నకిలీపత్రాలు సృష్టించి ఢిల్లీలో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. అయితే, ఈ దందాలో నష్టాలు రావడంతో రూటు మార్చారు. మెడిసిన్ పీజీ సీట్ల దందాకు పూనుకున్నారు. సీట్లు ఇప్పిస్తామంటూ వైద్యులకు భారీ మొత్తంలో టోకరా వేసేందుకు పథకం వేశారు. పీజీ వైద్య సీట్ల వివరాల కోసం ఇంటర్నెట్లోని వివిధ ఫోరమ్స్‌లో రిజిస్టర్ చేసుకున్న వారి ఫోన్ నంబర్లు సేకరించారు. ఎంట్రన్స్‌లతో పని లేదంటూ... ఎలాంటి ఎంట్రన్స్ పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వ పూల్, ఎన్ఆర్ఐ కోటాల్లో భారత్, నేపాల్‌లోని ప్రముఖ కళాశాలల్లో మెడిసిన్ పీజీ సీట్లు ఇప్పిస్తామంటూ ఈ ముఠా తమ ఫోన్ నంబర్‌తో బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపింది. ఆకర్షితులై స్పందించినవారితో మాట్లాడి తొలుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేరుతో డీడీ కట్టించింది. నమ్మకం పొందిన తర్వాత ముఠాసభ్యులే నేరుగా బాధితులున్న ప్రాంతాలకు వెళ్లి ఈ డీడీతోపాటు దరఖాస్తులు తీసుకునేవారు. ఆపై ఇంటర్నెట్లో ఉన్న స్పూఫింగ్ సాఫ్ట్‌వేర్స్‌ను ఆశ్రయించేవారు. నిర్ణీత రుసుం తీసుకుని స్పూఫింగ్ సాఫ్ట్వేర్ సదుపాయాన్ని అందించే వెబ్సైట్లు ఇంటర్నెట్లో అనేకమున్నాయి. దీనిలోకి ఎంటర్ అయిన తరవాత మెయిల్ అందుకోవాల్సిన వ్యక్తి ఈ–మెయిల్‌తోపాటు దాన్ని అందుకున్నప్పుడు ఏ మెయిల్ ఐడీ డిస్ప్లే కావాలో అది కూడా పొందుపరుస్తారు. ఇలా చేయడం వల్ల సదరు వ్యక్తి తనకు ప్రభుత్వరంగ సంస్థల నుంచే ఈ–మెయిల్ వచ్చినట్లు భావిస్తాడు. దఫదఫాలుగా భారీగా దండుకుని... పీజీ మెడిసిన్ సీట్లు ఆశించినవారిని మోసం చేయడానికి ఈ ముఠా(addir@mohfw.nic.in, noreply @mohfw.nic.in, www.rguhs. ac. in) తదితర మెయిల్స్ స్పూఫింగ్ చేసింది. దీంతో వారు తమకు ఆయా కళాశాలల్లో సీట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి శాఖ ద్వారానే వచ్చినట్లు భావించేవారు. ఇలా పూర్తిగా వలలో పడినవారి నుంచి ఒక్కో సీటుకు రూ.కోటి వరకు వసూలు చేసి తమ సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుంటారు. దాదాపు ఏడాది కాలంలో ఈ గ్యాంగ్ హైదరాబాద్‌తోపాటు కర్ణాటక, ఢిల్లీ, ముంబైలో మోసాలు చేయడంతో 16 కేసులు నమోదయ్యాయి. సిటీకి చెందిన వైద్యురాలు ఫాతిమా రజ్వీ కుమార్తెకు పీజీ మెడిసిన్ సీటు ఇప్పిస్తామని రూ.81 లక్షలు, ఢిల్లీలోని రాజేంద్రనగర్‌కు చెందిన మరొకరి నుంచి రూ.68 లక్షలు దండుకున్నారు. ఫాతిమా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ ఏసీపీ చక్రవర్తి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ చాంద్‌పాషా, ఎస్సై డి.మదన్ గౌడ్ దర్యాప్తు చేశారు. ఢిల్లీలో నిందితుల ఆచూకీ గుర్తించారు. సంతోష్ రాయ్, మనోజ్‌కుమార్‌లను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. మిగిలినవారు తప్పించుకున్నారు. పోలీసులు వీరికి చెందిన 11 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. స్కామ్ రూ.కోట్లలో ఉంటుందని, దర్యాప్తు చేస్తున్నామని కొత్వాల్ అంజనీకుమార్ తెలిపారు. -
బ్లాక్‌లిస్టులో 82 మెడికల్ కాలేజీలు..
సాక్షి, న్యూఢిల్లీ : 2018-19 విద్యా సంవత్సరానికి గానూ 82 వైద్య కళాశాలల ప్రవేశానుమతులపై నిషేధం విధించాల్సిందిగా జాతీయ వైద్య మండలి(ఎమ్సీఐ)... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఈ విషయంపై స్పందించిన సంబంధిత శాఖ ప్రభుత్వాధికారి మాట్లాడుతూ.. వివిధ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది, ఇతర వనరులు తదితర అంశాల ఆధారంగా ఎమ్సీఐ తనిఖీలు నిర్వహించిందన్నారు. తనిఖీల్లో భాగంగా సంబంధిత అంశాల్లో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఎమ్సీఐ ఆయా కళాశాలలను బ్లాక్ లిస్టులో చేర్చాల్సిందిగా సూచించిందని తెలిపారు. ఈ మేరకు 2018- 19 సంవత్సరానికి గానూ ప్రవేశాలు నిషేధించాల్సిందిగా సిఫారసు చేసిందన్నారు. బ్లాక్‌లిస్టులోని 82 మెడికల్ కాలేజీల్లో 70 ప్రైవేట్, 12 ప్రభుత్వ కళాశాలలు ఉన్నట్లు తెలిపారు. ఈ కళాశాలలపై నిషేధం విధించడం ద్వారా అందుబాటులో ఉన్న 64 వేల సీట్లలో సుమారు 10వేల సీట్లు విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా కొత్తగా 31 ప్రభుత్వ, 37 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతించాల్సిందిగా వచ్చిన ప్రతిపాదనలు కూడా ప్రస్తుతానికి తిరస్కరించినట్లు తెలిపారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 2021-22 నాటికి కొత్తగా 24 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. -
అయితే.. అది సమతులమైనదైతేనే సుమా
మీ టూత్‌పేస్టులో ఉప్పుందా?ఇదో ఫేమస్ యాడ్‌లోని ప్రశ్న.. నిజానికి ఇప్పుడు మనోళ్లను అడగాల్సిన ప్రశ్నమీ తిండిలో బలముందా అనే.. ఎందుకంటే.. భారతీయులు ఏది పడితే అది తినేస్తున్నారట.. జనాభాలో సగం మంది సమతుల ఆహారం తీసుకోవడమే లేదట. 2015–16 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశ జనాభాలో సగం మంది.. ముఖ్యంగా మహిళలు సమతుల ఆహారానికి దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి తోడ్పడే పళ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, మాంసం, పాల ఉత్పత్తులు చాలా తక్కువగా తీసుకుంటున్నారు. పది శాతం మంది నిత్యం వేయించిన ఆహార పదార్థాలే తింటుంటే.. మరో 36 శాతం మంది వారానికోసారి ఫ్రైడ్ ఫుడ్ తింటున్నారు. సమతుల ఆహారం అంటే.. సమతుల ఆహారం అంటే సరిపడా ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, విటమిన్లు, మినరల్స్ మొదలైన వాటిని సమపాళ్లలో తీసుకోవడమే. అయితే 45 శాతం మంది మహిళలు మాత్రమే రోజూ పప్పు ధాన్యాలు, బీన్స్ మొదలైనవి తింటున్నారని, పాలు, పెరుగు నిత్యం తీసుకునేవారి సంఖ్య 45 శాతమే అని వారానికి ఒకసారి వీటిని వినియోగించే వారి సంఖ్య 23 శాతమని సర్వే పేర్కొంది. 7 శాతం మంది అసలు పెరుగుగానీ, పాలుగానీ తీసుకోవడం లేదని, మరో 25 శాతం మంది వీటిని అప్పుడప్పుడే తీసుకుంటున్నారని స్పష్టం చేసింది. 54 శాతం మంది మహిళలు వారానికి ఒకసారి కూడా తాజా పళ్లు తినడం లేదని, చాలా తక్కువ మంది మహిళలే రోజువారీగా చికెన్, మటన్, చేప, కోడిగుడ్డు వంటివి తింటున్నారని తేలింది. పురుషుల పరిస్థితీ ఇంత తీవ్రంగా లేకున్నా.. వీళ్లతో పోలిస్తే.. కొంచెం బెటర్‌గా ఉందట. దేశ జనాభాలోని మొత్తం మహిళల్లో 47 శాతం మంది నిత్యం కూరగాయలను, ఆకు కూరలను తింటున్నారు. మరో 38 శాతం మంది వారానికి ఒకసారి మాత్రమే వీటిని తీసుకుంటున్నారని వెల్లడైంది. పేదరికం..వివక్ష.. జంక్‌ఫుడ్.. మహిళలు అసమతుల ఆహారం తీసుకోవడానికి ప్రధాన కారణం పేదరికం, వివక్ష, జంక్‌ఫుడ్ అని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్ రంజనా కుమారి చెప్పారు. దేశ ఆహార అలవాట్లలో కూడా లింగ వివక్ష ఉందన్నారు. ఇక్కడ మహిళలు తక్కువ ఆహారం తినడానికి అలవాటు పడిపోయారని, వారి ఆహార అవసరాలను గుర్తించే పరిస్థితులు కూడా లేవని, దీని వల్ల అనేక మంది రక్తహీనతతో బాధపడుతున్నారని వెల్లడించారు. మరోవైపు ఇటీవలి కాలంలో మార్కెట్ పరిణామాలు మారిపోయాయని, దీంతో జంక్‌ఫుడ్‌కు ప్రాధాన్యత పెరిగిందని, ఎక్కువ మంది మహిళలు ముఖ్యంగా యువతులు ఈ అనారోగ్యకర ఆహారం తీసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. సమతుల ఆహారం తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశముంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
బర్డ్‌ఫ్లూపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ: దేశంలోని కొన్నిప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ(ఏహెచ్5ఎన్8 వైరస్) కలకలం రేపుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలకు సూచనలు జారీచేసింది. ఢిల్లీ, గ్వాలియర్(మధ్యప్రదేశ్), కేరళలోని కొన్ని పక్షులకు ఈ వైరస్ సోకినట్లు తేలింది. ఏహెచ్5ఎన్8 వైరస్ మనుషులకు అంటుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయినప్పటికీ కేంద్రం ముందుజాగ్రత్తగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సూచనలు జారీచేసిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రా చెప్పారు. చనిపోయిన, గాయాలైన పక్షుల విషయంలో సంబంధిత వ్యక్తులు రక్షణాత్మక చర్యలు తీసుకోవాలన్నారు. -
పొగరాయుళ్ల కోసం కేంద్రం వినూత్న ప్రయోగం
న్యూఢిల్లీ: పొగత్రాగడం మానేయాలనికునే వారికి గుడ్ న్యూస్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వారి కోసం ప్రత్యేకంగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. మొబైల్ కౌన్సిలింగ్ ఇచ్చి స్మోకింగ్ మానేయడానికి సహకారం అందించడానికి ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఓ మొబైల్ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే వారి డేటాను రిజిస్టర్ చేసుకుంటారు.ఆ తర్వాత ఎసెమ్మెస్ రూపంలో మూడు నుంచి నాలుగు ప్రశ్నాలకు సమాధానం పంపించాల్సి ఉంటుంది. వాటిలో వయస్సు, విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు, ఎన్నేళ్ల నుంచి ధూమపానం అలవాటుంది లాంటి వివరాలు పంపించాలి. స్మోకింగ్ మానడానికి సూచనలిస్తూ ప్రతిరోజు 4 మెసేజ్‌లు వస్తాయి. ఉదాహరణకు దేవుని పట్ల నమ్మకం ఉన్న వారికి దేవి నవరాత్రుల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచిస్తారు. దీంతో వారిలో మార్పు రావడానికి అవకాశముంటుందని భావిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల కొంత వరుకైనా మార్పు చేయవచ్చునని కేంద్ర ఆరోగ్యాధికారి అరోరా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల్లో చైతన్యపరచడానికి టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోనికి తేనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ధూమపానం చేసేవారిలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఏటా 10 లక్షల మంది వరకు స్మోకింగ్ చేయడం వల్ల క్యాన్సర్, టీబీ వ్యాధులతో మరణిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. ప్రతి ఏటా దశల వారిగా స్మోకింగ్‌ను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. -
‘అనంతలక్ష్మి’కి అనుమతులు
పోచమ్మమైదాన్ : వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు 2014- 15 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు లభిం చాయి. ఈ మేరకు కేంద్ర ఆయూష్ కార్యదర్శి జాస్మిన్ జేమ్స్ నుంచి కళాశాలకు సోమవారం ఉత్తర్వుల కాపీ అందింది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం)నిబంధనల ప్ర కారం అన్ని సదుపాయాలు ఉన్నందున అనుమతి ఇచ్చినట్లు జేమ్స్ లేఖలో పేర్కొన్నారు. గతంలో రెండేళ్ల కాలానికి ఆయుర్వేద వైద్య కళాశాలకు సీసీఐఎం అనుమతి నిరాకరించడంతో విద్యార్థులు నిరుత్సాహానికి లోనయ్యారు. 2013-14 విద్యా సంవత్సరానికి గాను ఇప్పటి వరకు ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు మాత్రమే కండిషనల్ అనుమతి ఉంది. ఈ ఏడాది సైతం కండిషనల్ అనుమతిని ఇచ్చారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ జూలై 17వ తేదీన హియరింగ్ నిమిత్తం ఢిల్లీకి రావాల ని సమచారం అందించిన సీసీఐఎం అధికారులు వారి నుంచి పలు అంశాలపై వివరణ తీసుకున్నారు. వరంగల్‌కు 50 బీఏఎంఎస్ సీట్లు మంజూరు చేశారు. త్వరలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ జరగనుంది.కళాశాలకు అనుమతి రావడంతో కళాశాలలో విద్యార్థులు, బోధన సిబ్బంది స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ కళాశాలలో ప్రవేశాల కోసం అనుమతులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరి కీ కృతజ్ఞతలు తెలిపారు. ఫలించిన డిప్యూటీ సీఎం కృషి కళాశాలలో ప్రవేశాల అనుమతి కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. సీసీఐఎం అనుమతి నిరాకరించిన విషయాన్ని జూలైలో సాక్షి దినపత్రికలో ప్రచురించడంతో రాజయ్య స్పందించి జోక్యం చేసుకున్నా రు. వెంటనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి చర్చిం చారు. ఢిల్లీ స్థాయిలో కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఎట్టకేలకు కళాశాలకు అనుమతులు వచ్చాయి.