న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం 68,898 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29,05,823కు చేరుకుంది. గత 24 గంటల్లో 62,282 మంది కోలుకోగా, 983 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 54,849కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 21,58,946కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,92,028గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 23.82గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 74.30 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మరణాల రేటు 1.89 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 20 వరకు 3,26,61,252 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం మరో 9,18,470 శాంపిళ్లను పరీక్షించినట్లు చెప్పింది. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,34,67,237కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 8 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 1,504 ల్యాబ్‌లు పరీక్షలను జరుపుతున్నట్లు వెల్లడించింది. రికవరీ రేటు ఢిల్లీలో 90.10 శాతం, తమిళనాడులో 83.50 శాతం, గుజరాత్‌లో 79.40 శాతం, రాజస్తాన్‌లో 76.80 శాతం, పశ్చిమబెంగాల్‌లో 76.50 శాతం, బిహార్‌లో 76.30 శాతం, మధ్యప్రదేశ్‌లో 75.80 శాతం ఉన్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment