సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా జూన్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉండే వ్యాక్సిన్ డోస్‌ల వివరాలతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి మొదలుకొని జూన్ 15 వరకు మొత్తంగా 5,86,29,000 కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను రాష్ట్రాలు, యూటీలకు ఉచితంగా అందిస్తుందని లేఖలో సమాచారం అందించింది. ఇవి కాకుండా వ్యాక్సిన్ తయారీదారుల నుంచి 4,87,55,000 డోసులు జూన్ నెలాఖరులోగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నేరుగా కొనుగోలు చేసుకోవటానికి అవకాశముందని ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రతీ నెలా సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ అనుమతులు పొందిన వ్యాక్సిన్ టీకాల్లో 50 శాతం టీకాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా ఇచ్చే ప్రక్రియ ఇకమీదటా కొనసాగనుందని తెలిపింది. మిగతా 50 శాతం టీకాలను రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు.
రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సందర్భంగా అమలు చేయాల్సిన పలు మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. రాష్ట్రాలు జిల్లా వారీగా, కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రా(సీవీసీ)ల వారీగా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలంది. తమ టీకా ప్రణాళికపై ప్రజల్లో అవగాహన పెంచాలని, అందుకు ప్రచార మాధ్య మాలను వినియోగించుకోవాలని పేర్కొంది. కోవిన్ ద్వారా అపాయింట్‌మెంట్ తేలికగా లభిస్తుం దని, దాంతో సీవీసీల వద్ద భారీ రద్దీని పూర్తిగా అరికట్టవచ్చని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలని ఆరోగ్య శాఖ సూచించింది. రాష్ట ప్రభుత్వ వ్యాక్సినే షన్ కేంద్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు తమ వ్యాక్సి నేషన్ కేంద్రాల్లో ముందస్తు వ్యాక్సిన్ క్యాలెండర్‌ను కోవిన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలకు ముం దస్తుగా తెలపాలని ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రభు త్వ, ప్రైవేట్ కోవిడ్ కేంద్రాలు ఆ రోజు వ్యాక్సిన్ క్యాలెండర్‌ను అదే రోజున వెల్లడించకూడదని ముందస్తుగా వెల్లడించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment