
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి వేళ డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఫార్మా సంస్థ బయోలాజికల్–ఈ.. 12–18 ఏళ్ల గ్రూపు వారి కోసం రూపొందించిన కరోనా టీకా కోర్బెవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది.
కోర్బెవాక్స్‌ను పరిమితులతో వినియోగించేందుకు బయోలాజికల్–ఈకి అనుమతి లభించినట్లు సోమవారం అధికారవర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా కరోనా టీకాను 15 ఏళ్ల లోపు వారికి వేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని విషయం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment