DCGI
-
'డైజీన్ సిరప్' వాడుతున్నారా? వెంటనే ఆపేయండి! లేదంటే..
ప్రముఖ ఔషధాల తయారీదారు 'అబాట్ ఇండియా' (Abbott India) తన గోవా ఫెసిలిటీలో తయారు చేసిన యాంటాసిడ్ సిరప్ 'డైజీన్ జెల్'కి సంబంధించిన అన్ని బ్యాచ్‌లకు రీకాల్ చేసింది. కంపెనీ రీకాల్ చేయడానికి గల కారణం ఏంటి? దీని వినియోగం వల్ల వచ్చే ప్రమాదమేంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పింక్ కలర్లో ఉన్న ఈ మెడిసిన్‌ని వినియోగదారులు ఆగస్టు ప్రారంభంలో కొనుగోలు చేసినప్పుడు సీసాలోని ద్రవం తెల్లగా మారిందని, చేదుగా, ఘాటైన వాసన కలిగి ఉన్నట్లు తెలిసింది. దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అబాట్ యాంటాసిడ్ డైజీన్ జెల్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అబాట్ గోవా ప్లాంట్‌లో తయారు చేసిన యాంటాసిడ్ జెల్ వాడకాన్ని నిలిపివేయాలని డీసీజీఐ వినియోగదారులను కోరింది. ఆ సిరప్ సురక్షితమైనది కాదని, దీని వల్ల రోగి ప్రతికూల ప్రభావాణ్ణి ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపింది. ఇదీ చదవండి: 25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్పీరియన్స్! నిజానికి డైజీన్ సిరప్ లేదా మాత్రలు అసిడిటీ, గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు నొప్పి, గ్యాస్ వంటి వాటిని నివారించడంలో ఉపయోగిస్తారు. అయితే ఈ సమస్యల కోసం ఈ ఔషధం ఉపయోగించే వారు వెంటనే నిలిపివేయాలి. ప్రస్తుతం కంపెనీ కూడా ఈ ప్రొడక్ట్‌కి రీకాల్ ప్రకటించింది. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా దీనిని ఎవరైనా విక్రయిస్తే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఔషధం వినియోగించిన వ్యక్తికి ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే దాని గురించి తెలియజేయాలని DCGI ఆదేశించింది. -
ఐఐఎల్ మీజిల్స్–రూబెలా టీకాకు అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీజిల్స్–రూబెలా టీకా తయారీకి ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ల నుంచి అనుమతులు లభించినట్లు ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ (ఐఐఎల్) తెలిపింది. ఇండో–వియత్నాం భాగస్వామ్యంతో దీని తయారీ, మార్కెటింగ్ హక్కులను దక్కించుకోవడం సాధ్యపడినట్లు వివరించింది. ఇందుకోసం వియత్నాంకు చెందిన పాలీవాక్ సంస్థతో జట్టు కట్టినట్లు ఐఐఎల్ ఎండీ కె. ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం మీజిల్స్ టీకాకు సంబంధించిన భాగాన్ని పాలీవాక్ అందించనుండగా, రూబెల్లా టీకా భాగాన్ని ఐఐఎల్ స్వంతంగా తయారు చేసి సంయుక్తంగా ఎంఆర్ వేక్సిన్‌ను రూపొందిస్తుంది. -
లైసెన్స్ లేకుండా అమ్ముతారా..? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు నోటీసులు!
మందుల అమ్మకాల్లో నిబంధనల ఉల్లంఘనపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ సహా 20 ఆన్లైన్ విక్రయ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2018లో ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లైసెన్స్ లేకుండా ఆన్లైన్లో మందుల అమ్మకాలు సాగించకూడదు. ఈ మేరకు డీసీజీఐ 2019లోనే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం-1940 చట్టాన్ని ఉల్లంఘించి లైసెన్స్ లేకుండా మందులు విక్రయిస్తున్నందుకు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని డీసీజీఐ ఈ-మెయిల్ ద్వారా ఆన్లైన్ విక్రయ సంస్థలను హెచ్చరించింది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ సంస్థ స్పందిస్తూ తాము నాణ్యమైన మందులు, ఇతర హెల్త్ కేర్ ఉత్పత్తులను స్వతంత్ర అమ్మకందారుల నుంచి సేకరించి లక్షలాది మంది వినియోగదారులకు తక్కువ ధరకు అందిస్తున్నామని తెలిపారు. డీసీజీఐ నుంచి తమకు నోటీసు అందిందని, దీనికి తగినవిధంగా స్పందిస్తామని వివరించారు. స్థానిక చట్టాలు, నిబంధనలను తాము గౌరవిస్తామని, వాటికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: ఐఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. భారీ డిస్కౌంట్!) -
కోర్బేవ్యాక్స్ టీకాకు అత్యవసర అనుమతి
హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ బయోలాజికల్ -ఇ కంపెనీ రూపొందించిన కోర్బేవ్యాక్స్ టీకా ఉపయోగానికి అత్యవసర అనుమతులను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మంజూరు చేసింది. కోవిడ్ రాకుండా అడ్డుకునేందుకు ఈ వ్యాక్సిన్‌ను 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు ఉపయోగించవచ్చు. కోర్బేవ్యాక్స్కి సంబంధించి ఫేజ్ 2, 3 ట్రయల్స్‌లో 312 మంది పిల్లలకు 0.5 ఎంఎల్ వ్యాక్సిన్ అందించి పరిశీలించగా సానుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో వీటిని పరిశీలించిన డీసీజీఐ కోర్బేవ్యాక్స్ వినియోగానికి అత్యవసర అనుమతులు జారీ చేసింది. ఐదేళ్ల వయసు పైబడిన పిల్లలకు దేశీయంగా తొలి వ్యాక్సిన్‌ను బయోలాజికల్ - ఇ సంస్థ తయారు చేసింది. పిల్లలకు సైతం వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం వల్ల కోవిడ్ పూర్వ స్థితికి పరిస్థితులు వస్తున్నట్టే అంటూ ఆ కంపెనీ ఎండీ మహిమ దాట్ల తెలిపారు. చదవండి: మనదేశంలో రుణం..'కొందరికే' పరిమితం! -
6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మంగళవారం అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ అత్యవసర వినియోగానికి కొన్ని పరిమితులు విధించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంతవరకు డీసీజీఐ12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్ టీకాలు వేసేందేకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 21న ఆమోదం లభించింది. అంతేకాదు టీనేజ్ టీకా కార్యక్రమం ఈ ఏడాది జనవరి మూడు నుంచి ప్రారంభించింది. తదనంతరం మార్చి 16న 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం ప్రారంభించింది. అయితే గతంలో డీసీజీఐ నిపుణుల కమిటీ 2 నుంచి 12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మరిన్ని వివరాలను సమర్పించాలని కోరిన సంగతి తెలిసిందే. (చదవండి: 2 వేలకు పైగా కొత్త కేసులు...మళ్లీ మాస్క్ ధరించాల్సిందే) -
కోవోవ్యాక్స్‌కు అనుమతివ్వండి
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా కోవోవ్యాక్స్‌ను బూస్టర్ డోస్‌గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని సీరం ఇన్స్టిట్యూట్ డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)ని కోరింది. కోవోవ్యాక్స్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో నిబంధనలకు లోబడి వాడొచ్చంటూ డిసెంబర్ 28వ తేదీన డీసీజీఐ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా పూర్తి డోసులు తీసుకుని కనీసం మూడు నెలలు పూర్తయిన వారికి బూస్టర్ డోసుగా కోవోవ్యాక్స్‌ను ఇచ్చేందుకు ఫేజ్–3 ట్రయల్స్ జరుపుతామంటూ ఎస్ఐఐ దరఖాస్తు చేసుకుందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)లో ప్రభుత్వ రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ ఆదివారం చెప్పారు. -
దేశంలో12-18 ఏళ్ల పిల్లలకు కొత్త కోవిడ్ వ్యాక్సిన్..
-
గుడ్ న్యూస్.. దేశంలో కోర్బెవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతి
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి వేళ డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఫార్మా సంస్థ బయోలాజికల్–ఈ.. 12–18 ఏళ్ల గ్రూపు వారి కోసం రూపొందించిన కరోనా టీకా కోర్బెవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది. కోర్బెవాక్స్‌ను పరిమితులతో వినియోగించేందుకు బయోలాజికల్–ఈకి అనుమతి లభించినట్లు సోమవారం అధికారవర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా కరోనా టీకాను 15 ఏళ్ల లోపు వారికి వేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని విషయం గమనార్హం. -
గుడ్‌న్యూస్: భారీగా తగ్గనున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు!
కొవిడ్ వ్యాక్సిన్లు త్వరలో రెగ్యులర్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయన్న విషయం తెలిసిందే. డ్రగ్ నియంత్రణ విభాగం నుంచి అప్రూవల్ దక్కిన వెంటనే టీకాలు మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నాయి ఆయా కంపెనీలు. ఈ క్రమంలో ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఈ రెండు కొవిడ్ వ్యాక్సిన్ల ధరలు భారీగా తగ్గనున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ల ధరలు ఒక్కో డోసు రూ. 275గా నిర్ధారణ కానున్నాయని, అదనంగా సర్వీస్ ఛార్జీ మరో 150 రూపాయలతో మొత్తం.. రూ. 425గా ఉండొచ్చని ఆ కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు నేషనల్ ఫార్మాసుటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ధరల నియంత్రణ.. తగ్గింపు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 19న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ‘కోవిడ్-19పై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ’ కొన్ని షరతులకు లోబడి వయోజన జనాభాలో ఉపయోగించడానికి కోవిషీల్డ్ మరియు కోవాగ్జిన్‌లకు సాధారణ మార్కెట్ ఆమోదం ఇవ్వాలని సిఫార్సు చేసింది. అలాగే పనిలో పనిగా ధరల నిర్ధారణపై కూడా ఎన్‌పీపీఏను కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్‌కు 1,200రూపాయలుగా ఉండగా.. కోవిషీల్డ్ ధర రూ. 780గా ఉంది. వీటికి అదనంగా రూ. 150 సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ రెండూ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతులు ఉన్న వ్యాక్సిన్లు. ఒకవేళ వ్యాక్సిన్ కు మార్కెట్ ఆథరైజేషన్ లేబుల్ దక్కితే కేవలం అత్యవసర పరిస్థితులు, రిజర్వ్ డ్ కండిషన్స్ లో మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండదు. భారత్‌లో వ్యాక్సినేషన్ ఉధృతిగా సాగుతున్న టైంలోనే కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ కంపెనీలు రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. -
Covid: యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్సకు అద్భుతమైన ఔషధంగా పేర్కొంటున్న ‘మోల్నుపిరావిర్’ను ప్రముఖ ఔషధ దిగ్గజ సంస్థ ఆప్టిమస్ ఫార్మా గురువారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. బంజారాహిల్స్ హోటల్ పార్క్‌హయత్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారు. మోల్నుపిరావిర్ 3 దశల్లో క్లినికల్ ట్రయల్స్ ముగించుకుని, ఇటీవలే డీసీజీఐ అనుమతి పొందిందన్నారు. 5 రోజుల్లోనే వైరస్లోడును పూర్తిగా అదుపులోకి తెస్తుందన్నారు. మోల్ను పిరావిర్ టాబ్లెట్లను ఆవిష్కరిస్తున్న ఆప్టిమస్ ఫార్మా సీఎండీ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఒక్కో ప్యాకెట్లో 5 స్ట్రిప్‌లు ఉంటాయని, వీటిలో 40 మా త్రలు ఉంటాయన్నారు. ఒక్కో మాత్ర 200 ఎంజీ డోసుతో తయారైందని వెల్లడించారు. ఈ మాత్ర రోజుకు రెండు చొప్పున తీసుకోవాలని తెలిపారు. ఒక్కోమాత్ర ఖరీదు రూ.63 ఉంటుందని తెలిపారు. ఈ మందులు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆప్టిమస్ ఫార్మా జీఎం శ్రీధర్, మేనేజర్ అంకూర్, డాక్టర్ ముఖర్జీ పాల్గొన్నారు. చదవండి: చాలా మంది అగ్ర సీఈవోల వేతనం ఒక డాలరే.. ఎందుకు? -
‘జైకోవ్–డి’ టీకా ధర తగ్గిస్తాం
న్యూఢిల్లీ: తమ కోవిడ్–19 టీకా ధరను తగ్గించేందుకు అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిలా సంస్థ అంగీకరించింది. ఒక్కో డోసును రూ.265 చొప్పున విక్రయిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు జైడస్ క్యాడిలా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. అయితే, టీకా ధరపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. ఈ వారంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. 12 ఏళ్లు పైబడిన వారికోసం జైడస్ క్యాడిలా సంస్థ ‘జైకోవ్–డి’ పేరిట కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించింది. దేశంలో 12 ఏళ్లు పైబడిన వారి కోసం అనుమతి లభించిన తొలి టీకా ఇదే కావడం గమనార్హం. జైకోవ్–డి టీకా వేయడానికి సూది అవసరం లేదు. డిస్పోజబుల్ పెయిన్లెస్ జెట్ అప్లికేటర్ ఉపయోగించాల్సి ఉంది. దీని ధర రూ.93. ఒక్కో డోసుకు ఒక అప్లికేటర్ కావాలి. దీంతో ఒక్కో డోసు ధర మొత్తం రూ.358కు చేరనుంది. ‘జైకోవ్–డి’ టీకాను మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. మూడు డోసులను రూ.1,900కు విక్రయిస్తామని(ఒక్కో డోసు రూ.633.3) జైడస్ క్యాడిలా గతంలో ప్రతిపాదించింది. ప్రభుత్వంతో చర్చల అనంతరం ఒక్కో డోసును రూ.358కి విక్రయించేందుకు ముందుకొచ్చింది. -
18 ఏళ్లలోపు వారికి కరోనా టీకా..
హైదరాబాద్: హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ 18 ఏళ్లలోపు వారికి ఇచ్చే కోవాగ్జిన్ టీకా ఫేజ్ 2/3 ట్రయల్స్ పూర్తి చేసింది. 18 ఏళ్లు పైబడిన వారి కోసం ఇదే సంస్థ ఇప్పటికే కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. పిల్లల కోసం అభివృద్ధి చేస్తున్న టీకాకు సంబంధించిన ఫేజ్ 2/3 ట్రయల్స్ వివరాలను వచ్చేవారం డీసీజీఐ(డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)కి సమర్పించనున్నట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా మంగళవారం తెలిపారు. 18 ఏళ్లు దాటిన వారి కోసం కోవాగ్జిన్ టీకాల ఉత్పత్తి అక్టోబర్‌లో 55 మిలియన్ డోసులకు చేరుతుందని అన్నారు. ఒక్క సెప్టెంబర్‌లోనే 35 మిలియన్ డోసులు ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా అభివృద్ధి ప్రక్రియ కొనసాగుతోందని, ఫేజ్ –2 ట్రయల్స్ వచ్చే నెలలో ముగియనుందని వివరించారు. వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించేందుకు ముఖద్వారం ముక్కేనని చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకాతో ముక్కులో ఇమ్యూన్ రెస్సాన్స్ పెరుగుతుందని వెల్లడించారు. తద్వారా వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకా ట్రయల్స్‌ను 650 మంది వలంటీర్లపై నిర్వహించామని చెప్పారు. కేంద్రం అనుమతిస్తే కోవాగ్జిన్ వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కృష్ణ ఎల్లా తెలిపారు. ఇప్పటికిప్పుడు విదేశీ మార్కెట్లలో పాగా వేయాలన్న ఆరాటం తమకు లేదన్నారు. -
మిక్సింగ్ కరోనా టీకా భేషుగ్గా పనిచేస్తుందంట, పరిశోధనకు అనుమతి
న్యూఢిల్లీ: కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను మిక్సింగ్ పద్ధతిలో ఇచ్చి ఫలితాలను విశ్లేసించేందుకు ఉద్దేశించిన ఓ పరిశోధనకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు జారీ చేసింది. తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ), వెళ్లూర్ ఈ పరిశోధనలకు వేదిక కానుంది. దాదాపు 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ఈ పరిశోధన జరగనుంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నిపుణులు బృందం జూలై 29న ఈ అనుమతులు జారీచేసింది. పరిశోధనలో భాగంగా వాలంటీర్లకు ఒక డోసు కోవిషీల్డ్, మరో డోసు కొవాగ్జిన్ ఇవ్వనున్నారు. ఇటీవలే ఐసీఎంఆర్ కూడా ఇలాంటి ఓ పరిశోధన చేసింది. మొత్తం 98 మందిపై జరిపిన ఆ మిక్సింగ్ ప్రయోగంలో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తేలింది. ఒకే కంపెనీకి చెందిన వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవడం కంటే రెండు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్ డోసులను ఒక్కొక్కటిగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగినట్లు తెలిసింది. అంతేగాక కోవిషీల్డ్, కొవాగ్జిన్‌ల మిక్సింగ్ సురక్షితమేనని రుజువైంది. -
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి..!
-
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మన దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పూత్నిక్-వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో మరో వ్యాక్సిన్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించింది. టీకాను అత్యవసర వినియోగానికి వాడవచ్చునని కేంద్రం అనుమతి ఇచ్చింది. కరోనాబారి నుంచి రక్షించుకోవడానికి ప్రజలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు ఆగస్టు 5న దరఖాస్తు చేసింది. ఈ సంస్థ ‘జాన్సన్’ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్‌ను తయారు చేసింది. తమ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తోనే కరోనాను కట్టడి చేయవచ్చని కంపెనీ అధికారులు తెలిపారు. -
‘సింగిల్ డోస్‌తో వైరస్ కట్టడి.. మా టీకాకు అనుమతివ్వండి’
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కట్టడికి ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైతే మన దేశంలో ఎక్కువగా కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పూత్నిక్ వ్యాక్సిన్లను 18 ఏళ్లు పైబడిన వారికి పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఇవన్ని రెండు డోసులు తీసుకోవాలి. కానీ త్వరలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు ఆగస్టు 5న దరఖాస్తు చేసుకుంది. ఈ సంస్థ ‘జాన్సన్’ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. తమ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తో కరోనాను కట్టడి చేయవచ్చని కంపెనీ అధికారులు తెలిపారు. ఈ మేరకు జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అత్యవసర వినియోగ ప్రామాణీకరణ అనేది మూడో దశ క్లినికల్ ట్రయల్‌కు సంబంధించిన అత్యంత సమర్థవంతమైన, సురక్షితమైన డాటా మీద ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం మా వ్యాక్సిన్ పంపిణీ చేసిన అన్ని ప్రాంతాల్లో సింగిల్ డోస్ తీవ్రమైన వ్యాధిని నివారించడంలో 85 శాతం ప్రభావవంతమైనదని నిరూపితమైంది. అంతకాక వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత మరణాల రేటును తగ్గించడంలో, కోవిడ్ వల్ల ఆస్పత్రిలో చేరే కేసులను తగ్గించడంలోనూ ప్రభావవంతంగా పని చేసినట్లు క్లినికల్ ట్రయల్ డాటా వెల్లడిస్తుంది’’ అని పేర్కొంది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థతో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ ఫార్మా కంపెనీ భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలో బయోలాజికల్ ఈ తమ గ్లోబల్ సప్లై చైన్ నెట్‌వర్క్‌లో ఒక ముఖ్యమైన భాగం అని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అధికారులు తెలిపారు. తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన మైలురాయి అని.. బయోలాజికల్ ఈ సహకారంతో భారతదేశంలోనే కాక, ప్రపంచంలోని ప్రజలందరికి తమ సింగిల్-డోస్ కోవిడ్-19 టీకాను పంపిణీ చేయడానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు. అయితే.. గతంలో ఈ సంస్థ భారత్‌లో ట్రయల్స్ నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకొని దానిని ఉపసంహరించుకుంది. పలు దేశాల్లో ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నారు. కాగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు దేశాలు అనుమతించిన వ్యాక్సిన్లను.. ట్రయల్స్ నిర్వహణ అవసరం లేకుండానే నేరుగా అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
2-డీజీ కోసం డీఆర్డీఓతో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఒప్పందం
భారతదేశంలో 2 - డీయోక్సీ-డీ-గ్లూకోజ్(2-డీజీ) తయారీ, పంపిణీ కోసం ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్.. డీఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఆర్‌డీఈ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డీఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) సంస్థలతో లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ రోజు ప్రకటించింది. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీకి దేశంలో మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. కరోనా బారినపడి ఆసుపత్రుల్లో చేరిన బాధితులు త్వరగా కోలుకోవడానికి, ఆక్సిజన్‌పై ఆధారపడడాన్ని తగ్గించడానికి 2-డీజీ యాంటీ–కోవిడ్ డ్రగ్ ఉపయోగపడుతుంది. ఎంఎస్ఎన్ ల్యాబ్‌లు 2-డీజీని రోజుకు రెండుసార్లు సాచెట్ రూపంలో 2.34 గ్రాముల శక్తితో ఎంఎస్ఎన్ 2డీ బ్రాండ్ పేరుతో విడుదల చేయనున్నాయి. కరోనా చికిత్సలలో భాగంగా, ఎంఎస్ఎన్ ఇప్పటికే ‘‘OSELOW’’ బ్రాండ్ పేరుతో ఒసెల్టామివిర్ క్యాప్సూల్స్ వంటి ఇతర యాంటీ-వైరల్ ఔషధాలను విడుదల చేసింది. 'ఫావిలో' బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ వంటి యాంటీ కోవిడ్ మందులు, 'బారిడోజ్' బ్రాండ్ పేరుతో బారిసిటినిబ్, పోసాకోనజోల్ వంటి యాంటీ ఫంగల్ మందులను 'పోసాన్' బ్రాండ్ పేరుతో తీసుకొచ్చింది. -
రెండు రోజుల్లో మోడెర్నా టీకాల రాక!
న్యూఢిల్లీ: అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ ‘మోడెర్నా’ అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్లు భారత్‌కు చేరుకోనున్నాయి. మరో రెండు రోజుల్లో మొదటి బ్యాచ్ టీకాలు మన దేశానికి చేరుకుంటాయని భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మోడెర్నా టీకాకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇప్పటికే లభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రారంభించిన కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా మోడెర్నా టీకాలు భారత్‌కు అందనున్నాయి. భారత్‌లో డీసీజీఐ నుంచి అనుమతి లభించిన నాలుగో టీకా ఇదే కావడం విశేషం. -
స్పుత్నిక్ లైట్‌కి నో
న్యూఢిల్లీ/హైదరాబాద్: సింగిల్ డోస్ కోవిడ్ టీకా ‘స్పుత్నిక్ లైట్’ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి నిరాకరించింది. దీనికి సంబంధించి నిపుణుల కమిటీ చేసిన సిఫారసులను డీసీజీఐ ఆమోదించింది. స్పుత్నిక్ లైట్’ టీకా ‘స్పుత్నిక్ వీ’ టీకాలోని కాంపొనెంట్ 1కి సమానమేనని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఈ టీకాకు సంబంధించి భద్రత, రోగ నిరోధక శక్తిని పెంపొందించే విషయంలో క్లినికల్ ట్రయల్స్ డేటా తగినంత లేదని పేర్కొంది. నిపుణుల కమిటీ సిఫారసులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో గురువారం పోస్ట్ చేశారు. స్పుత్నిక్ లైట్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ డీసీజీఐకి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. చదవండి: జాగ్రత్తగా ఉంటే మూడో వేవ్ రాకపోవచ్చు.. -
గుడ్‌న్యూస్: మోడర్నాకు గ్రీన్ సిగ్నల్, 90 శాతం సమర్థత
-
గుడ్‌న్యూస్: మోడెర్నా వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వినియోగానికి పరిమితం చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ మోడెర్నా దిగుమతికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ముంబైకి చెందిన సిప్లా సంస్థకు అనుమతి ఇచ్చింది. దీంతో, ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవిïÙల్డ్, కోవాగ్జిన్, స్పుతి్నక్ వ్యాక్సిన్ల తర్వాత త్వరలో మోడెర్నా ప్రజలకు అందుబాటులోకి రానుంది. మోడెర్నా వ్యాక్సిన్ భారతీయ భాగస్వామి సిప్లా ఇచి్చన దరఖాస్తును పరిశీలించి అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సిన్‌ను వాడేలా డీసీజీఐ నిర్ణయం తీసుకుందని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ మంగళవారం తెలిపారు. ఈ వ్యాక్సిన్ త్వరలోనే దిగుమతి అవుతుందన్నారు. దీంతోపాటు, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను కూడా దేశంలోకి ఆహా్వనించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. అమెరికా ప్రభుత్వం తన కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను కోవాక్స్ ద్వారా భారతదేశానికి విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించిందన్న విషయాన్ని మోడెర్నా సంస్థ జూన్ 27న డీసీజీఐకి తెలిపింది. ఈ విషయంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అనుమతి కోరింది. కాగా, సోమవారం అమెరికా వ్యాక్సిన్ తయారీ సంస్థ తరపున వ్యాక్సిన్ల దిగుమతి, మార్కెటింగ్ కోసం అనుమతి ఇవ్వాలని సిప్లా సంస్థ కోరింది. అయితే మోడెర్నాకు ఇచ్చే అనుమతి అత్యవసర పరిస్థితులలో పరిమిత ఉపయోగం కోసం ఉద్దేశించిందని అధికారవర్గాలు తెలిపాయి. కాగా, దేశంలో వ్యాక్సినేషన్ వేగవంతానికి, యూఎస్ ఎఫ్‌డీఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ లేదా డబ్ల్యూహెచ్ఓ వంటి అంతర్జాతీయ డ్రగ్ రెగ్యులేటర్ల ఆమోదం పొందిన విదేశీ టీకాలకు సీడీఎల్ వద్ద బ్యాచ్‌ల వారీ పరీక్షను మినహాయించాలని డీసీజీఐ నిర్ణయించింది. చదవండి : Flipkart Monsoon Sale 2021: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు -
కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు!
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురైంది. కోవాగ్జిన్‌కు పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డీసీజీఐ అంగీకరించలేదు. మరింత క్లినికల్ ట్రయల్స్ డేటా కావాలని భారత్ భారత్ బయోటెక్‌కు డీసీజీఐ తెలిపినట్లు సమాచారం. దీంతో ఫుల్‌లైసెన్స్ పర్మిషన్ ఇచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కోవాగ్జిన్‌ను గర్బిణీలకు వాడొద్దని డీసీజీఐ తెలిపింది. ఇక ప్రస్తుతం అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్ వినియోగిస్తున్నారు. కాగా, తాజాగా 77.8శాతం సమర్ధత ఉందంటూ డీసీజీఐకి కొవాగ్జిన్ డేటా ఇచ్చింది. మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై చేసిన భారత్ బయోటెక్ సంస్థ తన డేటాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం పంపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై ఇప్పటి వరకు భారత్ బయోటెక్ స్పందించలేదు. ఇప్పటికే అమెరికాలో కోవాగ్జిన్ సరఫరాకు యూఎప్‌ఎఫ్‌డీఏ అంగీకరించని సంగతి తెలిసిందే. చదవండి: వైరల్: చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ.. కాలితో తన్నిన సీఎం పీఎస్ఓ -
కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతం
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతంగా తేలింది. మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై చేసిన సంస్థ తన డేటాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం పంపింది. ఈ డేటాను సమీక్షించిన కోవిడ్–19 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) దానికి ఆమోదం తెలిపినట్టు మంగళవారం డీసీజీఐ వర్గాలు వెల్లడించాయి. కొవాగ్జిన్ సామర్థ్యాన్ని ఆమోదించిన ఎస్ఈసీ తన సిఫారసులను డీసీజీఐకి పంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతి జాబితా (ఈయూఎల్)లో కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను చేర్చడానికి ఎప్పట్నుంచో భారత్ బయోటెక్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ టీకా సామర్థ్యాన్ని పరిశీలించి అనుమతులు ఇవ్వడానికి ఈ నెలæ 23న డబ్ల్యూహెచ్ఓ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంస్థ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇదే సమయంలో మూడో దశ ప్రయోగాల డేటాకు నిపుణుల కమిటీ అనుమతి లభించడం భారత్ బయోటెక్‌కు ఊరట కలిగించే అంశం. చదవండి: సహకారంతోనే సంస్కరణలు -
కోవిడ్ ఔషధం అనుమతికి బయోఫోర్ దరఖాస్తు
న్యూఢిల్లీ: కోవిడ్ సీరియస్ కేసుల్లో తాము రూపొందించిన ‘అవిప్టడిల్’ అనే ఔషధం అత్యవసర వినియోగం కింద అనుమతి కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకున్నట్లు బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ సంస్థ శుక్రవారం తెలిపింది. డీజీసీఐ నుంచి అనుమతి లభించిన వెంటనే వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని పేర్కొంది. తమ ఔషధ వినియోగంతో కోవిడ్ సీరియస్ కేసుల్లో రోగులు వేగంగా కోలుకుంటున్నట్లు రుజువైనట్లు తెలిపింది. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో యాంటీ వైరల్ ఔషధం ‘ఫావిఫిరవిర్’ ఉత్పత్తికి అనుమతి పొందిన అతికొద్ది కంపెనీల్లో హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్ ఒకటి. చదవండి:Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ! -
డీసీజీఐ సూచనల మేరకే చర్యలు
సాక్షి, అమరావతి: కొన్ని ప్రభుత్వాస్పత్రుల్లో కొందరు సిబ్బంది కోవిడ్ రోగుల చికిత్సలో నకిలీ స్టిక్కర్లతో గడువు ముగిసిన మందులను వినియోగిస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు కాల పరిమితిని 6 నుంచి 12 నెలలకు పెంచవచ్చునంటూ వాటి తయారీ కంపెనీ అయిన మైలాన్ చెప్పడంతో ఆ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇచ్చిన సూచనల మేరకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వివరించారు. అందులో భాగంగానే స్టిక్కర్లు ఉపయోగించడం జరిగిందన్నారు. దీనిని తప్పుగా అర్థం చేసుకోవడంతోనే సమస్య వచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారంలో ఎలాంటి తప్పు లేదన్నారు. డీసీజీఐసూచనల కాపీని కోర్టు ముందుంచారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై డీసీజీఐ వివరణ కోరాలని నిర్ణయించిన కోర్టు ఆ సంస్థను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఎంహెచ్సీ’ అమలుకు ఏం చేస్తున్నారు? మతిస్థిమితం కోల్పోయి రోడ్ల వెంబడి తిరిగే వారిని మెంటల్ కేర్ హెల్త్ (ఎంహెచ్సీ ) చట్టం అమలుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఎంహెచ్సీ చట్టాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాఖపట్నం ప్రభుత్వ మెంటల్ కేర్ ఆస్పత్రి సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ రామానంద్ సతాపతి రాసిన లేఖను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది (హోం) వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఈ నెల 17కి ధర్మాసనం వాయిదా వేసింది. -
స్పుత్నిక్ వీ: సీరంకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్‌తో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం మరో ఊరటనిచ్చింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీకి అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతినిచ్చింది. మహారాష్ట్ర పుణేలోని హడాస్పార్ తయారీ కేంద్రంలో ఈ టీకాను పరీక్షించి, విశ్లేషించి, తయారు చేస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందుకు సీరంకు ప్రాథమిక అనుమతినిచ్చామనీ, తయారీకి కొన్ని నెలలు పడుతుందని వెల్లడించింది. అయితే ఈ టీకాలను విక్రయించుకునేందుకు సీరం అనుమతి లేదని వెల్లడించాయి. దేశీయంగా అదర్ పూనావాలా నేతృత్వంలోని సీరం ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకా కోవీషీల్డ్‌ను తయారు చేస్తోంది. వ్యాక్సిన్ తయారీకి రష్యాలోని మాస్కోలో ఉన్న గమాలియా పరిశోధనా సంస్థ, సీరంతో జత కట్టింది. దీనికి సంబంధించిన పత్రాలను ఆ కంపెనీ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. వ్యాక్సిన్ తయారీకి డీసీజీఐ అనుమతి ఇవ్వడంతో జెనెటిక్ మానిపులేషన్ రివ్యూ కమిటీ (ఆర్సీజీఎం) సీరమ్‌కు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ బ్యాంక్‌ను దిగుమతి చేసుకోవడం, వైరస్ స్టాక్ వివరాలను ఎలా సేకరించి భద్రపరుస్తారన్న విషయం ఆర్సీజీఎంకు తెలపాలి. అయితే ఈ అనుమతుల కోసం సీరమ్ గత నెల 18నే ఆర్సీజీఎమ్కు దరఖాస్తు పెట్టుకుంది. కాగా భారతదేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లతో పోలిస్తే స్పుత్నిక్ వీ టీకా 91.6 శాతం సామర్థ్యం ఉందని గమాలియా ఇదివరకే ప్రకటించింది. చదవండి: vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు -
Vaccination : గుడ్‌న్యూస్ చెప్పిన డీసీజీఐ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న సమయంలో మహమ్మారి అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విదేశీ టీకాలకు అనుమతి ప్రక్రియల్లో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఉన్న ఆంక్షలను సవరించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో )ఆమోదించిన అన్ని టీకాలకు దేశంలో వర్తించేలా చేసింది. దీనికి ప్రకారం ఇప్పటికే వివిధ దేశాలు, డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన వ్యాక్సిన్లకు ఇండియాలో మళ్లీ ట్రయల్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఫైజర్, మోడెర్నాలాంటి విదేశీ కంపెనీల వ్యాక్సిన్లకు ఇండియాలో మార్గం సుగమం చేసింది. దేశంలో వ్యాక్సిన్ల భారీ డిమాండ్, కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీసీజీఐ చీఫ్ వీజీ సోమానీ వెల్లడించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ల కోసం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం డీసీజీఐకి ఈ సిఫారసు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తీసుకున్న వ్యాక్సిన్లు, యూఎస్ ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ, జపాన్ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ యూజ్ లిస్ట్‌లో ఉన్న వ్యాక్సిన్లకు ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని నిర్ణయించినట్లు సోమానీ ఒక లేఖలో తెలిపారు. గతంలో విదేశాల్లో ట్రయల్స్ పూర్తి చేసి అనుమతి పొందిన వ్యాక్సిన్లు కూడా ఇండియాలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ లేదా పరిమిత స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడా నిబంధనను ఎత్తివేయడం విశేషం. భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశలో ఫైజర్, మోడెర్నా టీకాల ఆమోదాన్ని వేగవంతం చేయనున్నామనీ, ప్రభుత్వం వారు కోరిన ప్రధాన రాయితీని కూడా ఇచ్చేందుకు సిద్ధమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ కంపెనీలు భారతదేశంలో అత్యవసర వినియోగ అధికారం కోసం దరఖాస్తు చేసుకుంటే తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్నందున ఫైజర్, మోడెర్నా భారత్‌కు చేరడానికి కొంత సమయం పడుతుందని అంచనా. జూలై , అక్టోబర్ మధ్య భారతదేశానికి 5 కోట్ల మోతాదులను అందించడానికి ఫైజర్, సిద్ధంగా ఉంది. చదవండి: Coronavirus: మమ్మీ, డాడీ.. ఎప్పుడొస్తారు? -
కోవిడ్ చికిత్సలో మరో ముందడుగు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 చికిత్సలో ఉపయోగించే యాంటీవైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్ విషయంలో భారత్‌లో మరో ముందడుగు పడింది. మూడవ దశ ఔషధ పరీక్షలకై అయిదు కంపెనీలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ జాబితాలో తాము కూడా ఉన్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్ ఫార్మా బుధవారం ప్రకటించింది. స్వల్ప, మోస్తరు కోవిడ్–19 లక్షణాలున్న 2,500 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు ఆప్టిమస్ సీఎండీ డి.శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మోల్నుపిరావిర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ (ఏపీఐ), ఫార్ములేషన్స్‌ను తాము సొంతంగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఔషధ పరీక్షల్లో భాగంగా రోగులకు గరిష్టంగా అయిదు రోజుల చికిత్స ఉంటుందని, 29 రోజులపాటు అధ్యయనం కొనసాగుతుందని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఔషధ సామర్థ్యం తెలుస్తుందని వివరించారు. అయిదు రోజుల్లోనే..: యూఎస్‌లో జరిగిన ఔషధ పరీక్షల్లో మోల్నుపిరావిర్ తీసుకున్న స్వల్ప, మోస్తరు కోవిడ్–19 లక్షణాలున్న రోగులు అయిదు రోజుల్లోనే కోలుకున్నారని ఆప్టిమస్ ఫార్మా డైరెక్టర్ పి.ప్రశాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘చికిత్సలో భాగంగా 800 ఎంజీ మోతాదులో ఉదయం, రాత్రి 5 రోజులపాటు మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో రోగి శరీరం నుంచి వైరస్ పూర్తిగా తొలగిపోతుంది. ఔషధాన్ని తీసుకున్న రోజు నుంచే రోగి ద్వారా వేరొకరికి వైరస్ వ్యాపించకపోవడం దీని ప్రత్యేకత. మోల్నుపిరావిర్ ఏపీఐ, ఫార్ములేషన్స్ అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్‌కు భారీగా ఖర్చు ఉంటుంది. ఇతర ఔషధాల మాదిరిగానే మార్కెట్లోకి వచ్చిన నెల తర్వాత ధర తగ్గుతుంది. జూలై ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కు ఔషధ పరీక్షల ఫలితాల నివేదిక సమర్పించే అవకాశం ఉంది’ అని చెప్పారు. ఆప్టిమస్ ఫార్మా మోల్నుపిరావిర్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్‌కై సీడీఎస్‌సీవోకు ఏప్రిల్ 26న దరఖాస్తు చేసుకుంది. -
Covaxin: పిల్లలపై ప్రయోగం.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బకు దేశం అతలాకుతలం అయ్యింది. రానున్న రోజుల్లో థర్డ్ వేవ్ రానుందని.. దాని వల్ల పిల్లలకే ఎక్కువ ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుండటంతో డీసీజీఐ కోవాగ్జిన్ 2-18 ఏళ్ల వారిపై క్లినకల్ ట్రయల్స్‌కి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీసీజీఐ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలయ్యింది. బుధవారం ఈ పిల్ విచారణ సందర్భంగా కోర్టు డీసీజీఐ ఇచ్చిన అనుమతిపై స్టే విధించేందుకు నిరాకరించింది. కేంద్రం, డీసీజీఐలకు నోటీసులు జారీ చేసింది. డీసీజీఐ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సంజీవ్ కుమార్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. దీనిలో ట్రయల్స్‌లో పాల్గొంటున్న పిల్లలు తమకు తామే రిజిస్టర్ చేసుకుంటున్నారని తెలిపారు. అయితే వారికి టీకా ప్రయోగాల వల్ల తలెత్తే పరిణామాలపై పూర్తి స్థాయి అవగాహన ఉండదని.. కనుక ఉత్తర్వులపై స్టే విధించాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో కోర్టు స్టే ఇవ్వడం కుదరదని.. దీనిపై కేంద్రం, భారత్ బయోటెక్ల వైఖరి ఏంటో జూలై 15లోగా తెలపాలని చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం ఆదేశించింది. 2 నుంచి 18ఏళ్ల వారిపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు అనుమతి కోరుతూ భారత్ బయోటెక్ ఈ ఏడాది ప్రారంభంలో దరఖాస్తు చేసుకుంది. అనుమతుల విషయంలో కేంద్ర ఔషధ ప్రమాణ స్థాయి సంస్థ(సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. మరి కొద్ది రోజుల్లో ఇవి ప్రారంభం కానున్నాయి. 525 మంది వలంటీర్లపై టీకాను ప్రయోగించనున్నారు. చదవండి: పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం -
కరోనా విలయం: డీఆర్డీవో డ్రగ్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి,న్యూడిల్లీ : కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీవో)కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో ఢిల్లీలోని ఐఎన్ఎంఏఎస్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్) ల్యాబ్ రూపొందించిన యాంటీ కరోనా డ్రగ్‌కు అనుమతి సాధించింది. ఇప్పటికే నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ అద్భుతమైన ఫలితాల నేపథ్యంలో అత్యవసర ఉపయోగం కోసం యాంటీ-కోవిడ్ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధానికి డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. తీవ్రమైన కోవిడ్ బాధితుల్లో ఈ మందు అమోఘంగా పని చేస్తుందని, వేగంగా కోలుకోవడంతోపాటు ఆక్సిజన్‌పై అధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుందని డీఆర్డీవో తాజాగా ప్రకటించింది. గ్లూకోజ్ రూపంలో ఉండే 2-డీజీ ఔషధాన్ని దేశంలో సులభంగా ఉత్పత్తి చేయడంతోపాటు, విరివిగా అందుబాటులో తీసుకరాచ్చని కంపెనీ చెబుతోంది. ఈ డ్రగ్ సాజెట్‌లలో పొడి రూపంలో లభిస్తుంది. దీన్ని నీటిలో కరిగించి నోటి ద్వారా తీసుకోవాలి. ఇది వైరస్ వ్యాపించిన భాగాల్లోకి చేరి అక్కడ సెల్స్‌లోని కరోనా శక్తిని అడ్డుకోవడంతోపాటు, విస్తరణను గణనీయంగా నిరోధిస్తుంది. దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి విస్తరణ, బాధితులు ఆక్సిజన్‌పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ డ్రగ్ ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే రోగులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని కూడా బాగా తగ్గిస్తుందని అంచనా. ఐఎన్ఎంఏఎస్- డీఆర్డీవో శాస్త్రవేత్తలు హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహాయంతో ప్రయోగాల్లో వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. దీంతో గత ఏడాది మేలో కోవిడ్ -19 రోగులలో పరీక్షలకు డీసీజీఐ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) రెండో దశకు అనుమతినిచ్చింది. వీటి ఫలితాల ఆధారంగా డిసెంబర్ 2020 - మార్చి 2021 మధ్య 220 మంది రోగులపై మూడో క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు గుజరాత్‌కు చెందిన 27 కోవిడ్ ఆసుపత్రులలో ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. '2-డియోక్సీ-డి-గ్లోకోజ్' (2-డీజీ)గా వ్యవహరిస్తున్న ఈ యాంటీ-కోవిడ్-19 చికిత్స ఔషధాన్ని కోవిడ్ బాధితుల మీద పరీక్షించినప్పుడు వారిలో అత్యధిక శాతం మందికి ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాల వచ్చాయి. ఈ ఫలితాల వివరణాత్మక డేటాను డీసీజీఐకి సమర్పించిన నేపథ్యంలో తాజా అనుమతి లభించింది. చదవండి : కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే! An anti-COVID-19 therapeutic application of the drug 2-deoxy-D-glucose (2-DG) has been developed by INMAS, a lab of DRDO, in collaboration with Dr Reddy’s Laboratories, Hyderabad. The drug will help in faster recovery of Covid-19 patients. https://t.co/HBKdAnZCCP pic.twitter.com/8D6TDdcoI7 — DRDO (@DRDO_India) May 8, 2021 -
భారీ ఊరట: మూడో వ్యాక్సిన్ అందుబాటులోకి
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశ ప్రజలకు ఊరటనిచ్చే పరిణామం చోటు చేసుకుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ కరోనా వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి లభించింది. అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ)కు చెందిన విషయ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) సిఫార్సు మేరకు డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో మూడో కరోనా టీకా అందుబాటులోకి చ్చింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ చేసిన విజ్ఞాపనను నిపుణుల కమిటీ పరిశీలించింది. అనుమతి ఇవ్వొచ్చంటూకు సిఫార్సు చేసింది. దీనికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్పుత్నిక్ టీకా భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. మరోవైపు దేశంలో రెండో దశలో కరోనా వైరస్ కేసుల ఉధృతికొనసాగుతోంది. అయితే దేశవ్యాప్తంగా కేసుల నమోదు బుధవారం స్వల్పంగా తగ్గినప్పటికీ రోజు వారీ కేసుల నమోదు లక్షన్నరు పైనే ఉండటం గమనార్హం. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24గంటల్లో 1,61,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 879 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453కి, మొత్తం మరణాల సంఖ్య 1,71,058కి చేరింది. మరణాల రేటు 1.26 శాతానికి చేరింది. . కొత్తగా 97,168మంది వైరస్ బారి నుండి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,22,53,697గా ఉంది. కాగా రికవరీ రేటు 89.86శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసుల సంఖ్య 12,64,698గా ఉంది. చదవండి : ‘స్పుత్నిక్’ అత్యవసర వినియోగానికి అనుమతివ్వండి క్యా కరోనా: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి! -
‘స్పుత్నిక్’ అత్యవసర వినియోగానికి అనుమతివ్వండి
న్యూఢిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ)కు చెందిన విషయ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) సిఫార్సు చేసింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంస్థ చేసిన విజ్ఞాపనను నిపుణుల కమిటీ పరిశీలించింది. అనుమతి ఇవ్వొచ్చంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. డీసీజీఐ సైతం ఆమోదిస్తే స్పుత్నిక్ టీకా భారత్‌లో అందుబాటులోకి వస్తుంది. దేశంలో ప్రజలకు అందే మూడో కోవిడ్–19 టీకా ఇదే అవుతుంది. అన్ని అనుమతులు లభిస్తే స్పుత్నిక్ టీకాను అత్యవసర వినియోగం కోసం రష్యా నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇండియాలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, సరఫరా హక్కులను డాక్టర్ రెడ్డీస్ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు గత ఏడాది సెప్టెంబర్‌లో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్)తో భాగస్వామిగా మారింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ 91.6 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో నిర్ధారణ అయ్యింది. డీసీజీఐ భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిని ప్రస్తుతం లబ్ధిదారులకు అందజేస్తున్నారు. -
COVID-19 Vaccine: 45 ఏళ్లు దాటితే టీకా..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఉధృతరూపం దాలుస్తుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 45 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా కరోనా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 (గురువారం) నుంచే దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతూ వ్యాక్సినేషనల్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్న ప్రాంతాలను వెంటనే గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. అలాంటి ప్రాంతాల్లో కరోనా టీకా పంపిణీని వేగవంతం చేయాలని సూచించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఏ) సీఈవో డాక్టర్ ఆర్.ఎస్.శర్మ బుధవారం రాష్ట్రాలు, యూటీల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టర్లు, ఇమ్యూనైజేషన్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 45 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సినేషన్‌పై చర్చించారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కేటగిరీలో అర్హులైన వారికే టీకా అందేలా చూడాలని పేర్కొన్నారు. కో–విన్ పోర్టల్‌లో తప్పుడు, డూప్లికేట్ ఎంట్రీలను నివారించాలన్నారు. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్ల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని కోరారు. వ్యాక్సిన్ స్టాక్ పాయింట్లలో టీకా డోసులు చెడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ వృథాను తగ్గించండి పెద్ద సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా అవుతుండడం పట్ల రాజేష్ భూషణ్, డాక్టర్ ఆర్.ఎస్.శర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 6 శాతం డోసులు వృథా అవుతున్నట్లు అంచనా. దీన్ని ఒకటి కంటే తక్కువ శాతానికి తీసుకురావాలని రాష్ట్రాలు, యూటీలను వారు ఆదేశించారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ స్టాక్‌ను సమయానుగుణంగా ఉపయోగిస్తే వేస్టేజీ తగ్గుతుందన్నారు. తద్వారా కాలం చెల్లే వ్యాక్సిన్ల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని తెలిపారు. వ్యాక్సిన్ వినియోగ డేటాను ఎప్పటికప్పుడు కో–విన్, ఈవిన్ పోర్టళ్లలో అప్లోడ్ చేయాలన్నారు. రెండో డోసు ఇచ్చే వరకూ టీకాలను దాడి పెట్టాలన్న ఆలోచన సరైంది కాదని చెప్పారు. కోవిషీల్డ్ షెల్ఫ్‌లైఫ్ ఇక 9 నెలలు ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా ‘కోవిషీల్డ్’ ప్రస్తుతం ఉన్న షెల్ఫ్‌లైఫ్‌ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) 6 నెలల నుంచి తాజాగా 9 నెలలకు పెంచింది. ఈ టీకాను భారత్‌లోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్పత్తి తేదీ నుంచి కాలంచెల్లే తేదీ వరకు ఉన్న గడువును షెల్ఫ్‌లైఫ్ అంటారు. ఆక్స్ఫర్డ్–అస్ట్రాజెనెకా వారి కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రస్తుత షెల్ఫ్‌లైఫ్ 6 నెలలు. తాజాగా డీసీజీఐ దీన్ని 9 నెలలకు పెంచింది. అంటే కోవిషీల్డ్ టీకాను తయారు చేసిన తర్వాత 9 నెలల్లోగా ఉపయోగించవచ్చు. 9% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే కేవలం మహారాష్ట్రలోనే 61 శాతం యాక్టివ్ కేసులు దేశంలో ఐదు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్‌లోని మొత్తం యాక్టివ్ కరోనా కేసుల్లో 79.30 శాతం కేసులు ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్ల డించింది. ఇందులో 61 శాతం కేసులు కేవలం మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. ఇక కొత్త కరోనా కేసుల్లో 84.73 శాతం కేసులు ఎనిమిది రాష్ట్రాలు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 5,52,566. దేశంలో కొత్తగా 53,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,21,49,335కు చేరుకుంది. గత 24 గంటల్లో 354 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దేశంలో మొత్తం కరోనా సంబంధిత మరణాల సంఖ్య 1,62,468కి చేరింది. 6.30 కోట్ల మందికి కరోనా టీకా భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ వేగం పంజుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా అర్హులకు 10,46,757 సెషన్లలో 6,30,54,353 కరోనా వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్లు పేర్కొంది. -
కోవిషీల్డ్ సేఫ్ కాదు: కేంద్రానికి హైకోర్టు నోటీసులు
చెన్నై: సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తన సృజనాత్మకత దెబ్బతిన్నదని.. ఈ వ్యాక్సిన్‌ని సురక్షితం కాదని ప్రకటించండి అంటూ చెన్నైకి చెందిన ఓ వలంటీర్ గతేడాది డిసెంబర్లో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీరం.. సదరు వలంటీర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని ఖండించింది. అతడిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మద్రాస్ హై కోర్టు ఈ పిటిషన్‌ని విచారించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి నోటీసులు జారీ చేసింది. 2021, మార్చి 26 వరకు దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా హై కోర్టు ఆదేశించింది. కేసు వివరాలు.. చెన్నైకి చెందిన అసిఫ్ రియాజ్(41) అనే వలంటీర్ గతేడాది అక్టోబర్ 1న సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఓ పది రోజలు తర్వాత అతడికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు వెల్లడించాడు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని వైద్య పరీక్షలో స్పష్టమైందన్నాడు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నాడు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నాడు. ఇందుకు పరిహారంగా తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. ఇప్పడేమంటున్నాడు.. కోర్టు తీర్పు అనంతరం అసిఫ్ రియాజ్ మాట్లాడుతూ.. "నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నేను తీసుకున్న (కోవిషీల్డ్) వ్యాక్సిన్ వల్లనే నాకు అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు వైద్యులు వెల్లడించారు. దీని గురించి ఎవరికి చెప్పినా ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. ఇక కోర్టును ఆశ్రయించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఈ కేసులోని వాస్తవాల ఆధారంగా కోర్టు దీన్ని విచారిస్తుందని నేను ఆశిస్తున్నాను. టీకా కారణంగా నేను బాధపడ్డానని నన్ను పరీక్షించిన వైద్య నిపుణలు వెల్లడించారు. నాకు న్యాయం జరగుతుందని నేను భావిస్తున్నాను’’ అన్నాడు. చదవండి: వ్యాక్సిన్‌పై వార్.. 100 కోట్లకు దావా! వ్యాక్సిన్: ‘అలాంటివారిపై ఓ కన్నేసి ఉంచండి’ -
ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని మోదీ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వారితో విస్తృతంగా చర్చించనున్నారు. కరోనా టీకా సరఫరా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనే టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీ సీఎంలతో భేటీ అవుతుండడం ఇదే తొలిసారి. వ్యాక్సినేషన్ సన్నద్ధతలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు దఫాలు డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. మొదట కోటి మంది ఆరోగ్య సిబ్బందికి, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి డోసు ఇస్తామని ప్రకటించింది. అంటే కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్న 27 కోట్ల మందికి ముందుగా టీకా అందనుంది. -
కోవాగ్జిన్ తీసుకున్న వలంటీర్ మృతి
భోపాల్: కరోనా వైరస్ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో టీకా తీసుకున్న వారు మృతి చెందారనే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని ఇద్దరు నర్సులు మృతి చెందారని విన్నాం. తాజాగా ఈ జాబితాలోకి దేశీయ వ్యాక్సిన్ కోవాగ్జిన్ కూడా చేరింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ తీసుకున్న ఓ వలంటీర్ పది రోజుల తర్వాత మృతి చెందాడనే వార్త ప్రస్తుతం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే మూడోదశ ట్రయల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సిన్ వినియోగానికి అనుమతివ్వడం పట్ల విపక్షాలు విమర్శలు చేస్తుండగా.. తాజాగా వలంటీర్ మృతి చెందడం వివాదాన్ని మరింత పెంచుతోంది. వివరాలు.. భోపాల్‌కు చెందిన దీపక్ మరవి (42) గతేడాది డిసెంబర్ 12న పీపుల్స్ మెడికల్ కాలేజీ అండ్ హస్పిటల్లో నిర్వహించిన కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొని కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత పది రోజులకు అతడు మరణించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కోవాగ్జిన్ ట్రయల్‌లో పాలు పంచుకున్న మెడికల్ కాలేజీ వైస్ చాన్సిలర్ మాట్లాడుతూ.. ‘దీపక్ మరవి వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా కోవాగ్జిన్ డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు మరణించినట్లు తెలిసింది. విష ప్రయోగం వల్ల చనిపోయాడని అనుమానిస్తున్నాం.. కానీ మరణానికి అసలు కారణం ఇంకా తెలియలేదు. విసెరా పరీక్షతో మరవి ఎందువల్ల చనిపోయాడనే విషయం తెలుస్తుంది’ అన్నారు. (మా వ్యాక్సిన్ చాలా డేంజర్: చైనా ఎక్స్పర్ట్) ఇక మధ్యప్రదేశ్ మెడికో లీగల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ శర్మ మాట్లాడుతూ.. ‘దీపక్ మరవికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు.. విషప్రయోగం వల్ల అతడు చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నాడు. కానీ అసలు కారణం ఇంకా తెలియలేదు. ఇక మరవి గతేడాది డిసెంబర్ 21న చనిపోయాడు. ఈ విషయాన్ని డీసీజీఐ, భారత్ బయోటెక్ దృష్టికి తీసుకెళ్లాం. ఇక వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొనడాకి ముందు మరవికి అన్ని పరీక్షలు చేశాం. అంతా బాగుంది అనుకున్నాకే వ్యాక్సిన్ డోసు తీసుకునేందుకు అనుమతిచ్చాం. ఇక ట్రయల్స్‌లో పాల్గొన్న అందరికి వ్యాక్సిన్ ఇవ్వరు. సగం మందికి వ్యాక్సిన్ ఇచ్చి.. మిగతావారికి సెలైన్ ఇస్తారు. ప్రస్తుతం దీపక్కి ఇచ్చింది వ్యాక్సిన్ డోసా లేకా.. సెలైనా అనే విషయం తెలియాలి. ఇక ట్రయల్స్‌లో పాల్గొన్న అందరిని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపించాం.. ఆ తర్వాత ఎనిమిది రోజులు వారిని అబ్జర్వేషన్లో ఉంచాం’ అని తెలిపారు. (చదవండి: టీకాపై ఎటూ తేల్చుకోలేక..) ఇక మరవి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్ తీసుకుని ఇంటికి వచ్చాక.. అతడు కొంత ఇబ్బంది పడ్డాడు. అనారోగ్య సమస్యలు తలెత్తాయి. డిసెంబర్ 17న భుజం నొప్పితో బాధపడ్డాడు. రెండు రోజుల తర్వాత నోటి నుంచి నురగ వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్దాం అంటే వినలేదు. రెండు మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందని తెలిపాడు. ఇలా ఉండగానే అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇక డిసెంబర్ 21న ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మధ్యలోనే చనిపోయాడు’ అని తెలిపారు. ఇక రజనా ధింగ్రా అనే సామాజిక కార్యకర్త దీపక్ మరవి ట్రయల్స్‌లో పాల్గొన్నాడనే దానికి రుజువుగా అతడికి ఎలాంటి రసీదు, లెటర్ లాంటిది ఇవ్వలేదని తెలిపారు. -
టీకాపై ఎటూ తేల్చుకోలేక..
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంపై ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నవారు 69 శాతం మంది ఉన్నారని లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో తేలింది. ఆన్లైన్ మాధ్యమం ద్వారా మీరు టీకా తీసుకుంటారా? అని 8,723 మందిని ప్రశ్నించగా 26 శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కాగానే తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ సంస్థ ప్రజల్లో టీకా ఆమోదంపై సర్వే చేçస్తూ ఫలితాల్ని ఆన్లైన్లో ఉంచుతోంది. రోజులు గడుస్తున్నప్పటికీ టీకాపై ఎటూ తేల్చుకోలేని వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్టోబర్‌లో 61 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోవడం గురించి ఇంకా ఆలోచిస్తున్నామని చెబితే నవంబర్ నాటికి వారి సంఖ్య 59 శాతానికి తగ్గింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) టీకాలకి పచ్చజెండా ఊపాక టీకాపై సందేహాలు వ్యక్తం చేసే వారి సంఖ్య కూడా పెరిగిందని ఆ సర్వే వెల్లడించింది. ఇక పిల్లలకి టీకా ఇవ్వడానికి 26% తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. వ్యాక్సిన్ సామర్థ్యంపై నెలకొన్న అనుమానాలు, హడావుడిగా అనుమతులివ్వడం, దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఆందోళన నెలకొని 69 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోతున్నారని లోకల్‌సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, మరణాల రేటు చాలా తక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్న వారు కూడా ఉన్నారు. -
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నర్స్ మృతి
లిస్బన్/పోర్టో/పోర్చుగీసు : సాధారణంగా 100 శాతం సామార్థ్యం గల వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే రెండుమూడేళ్ల సమయం పడుతుంది. అయితే కరోనావైరస్ వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వాలు కొన్ని నిబంధనలను పక్కకు పెట్టి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మూడు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతిచ్చారు. మన దేశంలో డీసీజీఐ భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటి సామార్థ్యం పట్ల ఇప్పటికే జనాల్లో పలు అనుమానాలు తలెత్తుతుండగా.. వీటిని మరింత పెంచే సంఘటన ఒకటి పోర్చుగల్‌లో చోటు చేసుకుంది. ఓ నర్స్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల తర్వాత చనిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడమే కాక వ్యాక్సిన్ పనితీరు పట్ల మరిన్ని అనుమానాలను, భయాలను పెంచుతుంది. వివరాలు.. సోనియా అసేవెడో(41) అనే మహిళ పోర్టోలోని పోర్చుగీసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీలో పిడియాట్రిక్ అసిస్టెంట్ నర్స్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైజర్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగంలో భాగంగా సోనియా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మృత్యువాత పడ్డారు. (చదవండి: వివాదంలో ‘అనుమతులు’) ఈ సందర్భంగా సోనియా తండ్రి అబిలియో అసేవెడో మాట్లాడుతూ.. ‘నా కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. రెండు రోజుల క్రితం తను కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకుంది. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. కానీ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా తను మరణించింది. నా కుమార్తె ఎందువల్ల మరణించిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. అంతేకాక సోనియాకు మద్యం అలవాటు లేదని.. ఈ మధ్య కాలంలో ఎలాంటి కొత్త ఆహార పదార్థాలను తీసుకోలేదని.. అంతా సాధారణంగానే ఉందని ఆమె తండ్రి తెలిపారు. ఇక పోర్చుగీసు ఆరోగ్య శాఖ అధికారులు సోనియా మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోర్చుగీసులో 538 ఆరోగ్య కార్యకర్తలు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక పది మిలియన్ల జనాభా గల పోర్చుగీసులో 4,27,000 కరోనా కేసులు నమోదు కాగా.. 7,118 మంది మరణించారు. -
‘క్లినికల్’ తరహాలో కోవాగ్జిన్ టీకా
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసిన తొలి టీకా కోవాగ్జిన్ వినియోగానికి ఇచ్చిన అనుమతులు కేవలం క్లినికల్ ట్రయల్ మోడ్‌లో వినియోగానికేనని ప్రభుత్వం తెలిపింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌కు ఇచ్చిన అనుమతుల్లో తేడాఉందని, కోవాగ్జిన్‌ను కేవలం క్లినికల్ ట్రయిల్ మోడ్‌లో మాత్రమే వినియోగిస్తామని కేంద్రమంత్రి హర్షవర్థన్ వివరణ ఇచ్చారు. అంటే కోవాగ్జిన్ ఇచ్చిన వారిని ట్రయిల్స్‌లో చేసినట్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. దీంతోపాటు కోవాగ్జిన్‌ను ఫేజ్ 3 ట్రయిల్స్‌లో 12 సంవత్సరాలు నిండినవారికి ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతించింది. గత ట్రయిల్స్‌లో ఈ టీకాను 12 ఏళ్ల పైబడినవారికి ఇచ్చిన సందర్భంలో సురక్షితమనే తేలింది. కోవాగ్జిన్‌తో పాటు కోవిషీల్డ్‌కు ఆదివారం అత్యవసర వినియోగానుమతులు లభించాయి. రెండు టీకాలను రెండు డోసుల్లో ఇస్తారని డీసీజీఐ అనుమతి పత్రంలో పేర్కొంది. ఒకపక్క ఫేజ్ 3 ట్రయిల్స్ కొనసాగిస్తూనే అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకాలను వాడేందుకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 3 కోట్ల మందికి టీకా అందిస్తారు. రెండు టీకాలు అత్యవసర అనుమతికి తయారుగా ఉన్నా, ఇంకా ఫేజ్ 3 ట్రయిల్స్‌ను పూర్తి చేసుకోలేదు. -
48,000 పైకి సెన్సెక్స్
ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే రెండు వ్యాక్సిన్లకు కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలపడంతో దేశీయ ఈక్విటీ సూచీలు తొమ్మిదోరోజూ లాభాలతో ముగిశాయి. డాలర్ మారకంలో రూపాయి బలపడటం ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలూ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే ఇటీవల వెలువడిన స్థూల ఆర్థిక గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా సోమవారమూ సూచీల ఇంట్రాడే, ముగింపు రికార్డు ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్ 308 పాయింట్ల లాభంతో తొలిసారి 48 వేలపై 48,177 వద్ద ముగిసింది. నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 14,133 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో నిఫ్టీ 194 పాయింట్లు, సెన్సెక్స్ 626 పాయింట్ల పరిధిలో ట్రేడయ్యాయి. ఒక్క ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. మెటల్, ఐటీ షేర్లు అత్యధికంగా లాభపడటమే కాకుండా సూచీలు రికార్డు ర్యాలీకి అండగా నిలిచాయి. ప్రధాన దేశాల్లో కోవిడ్–19 వ్యాక్సిన్‌కు అనుమతులు లభించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. విదేశీ పెట్టుబడులు వెల్లువలా కొనసాగుతుండటంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు బలపడి 73.02 వద్ద స్థిరపడింది. 626 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్... కోవిడ్–19 కట్టడికి భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి ఒకేసారి కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు అనుమతులు లభించిన నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్ 48,000 పాయింట్లపైన, నిఫ్టీ 14,100 స్థాయిపైన మొదలయ్యాయి. కొద్దిసేపటికే ఇన్వెస్టర్లు గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పూనుకోవడంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఒక దశలో నిఫ్టీ 14వేల స్థాయిని కోల్పోయి 13,954 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ సైతం 48 వేల మార్కును కోల్పోయి 47,594 వద్దకు దిగివచ్చింది. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలకు డిసెంబర్ పీఎంఐ గణాంకాలు ఊరటనిచ్చాయి. ఐహెచ్ఎస్ మార్కిట్ డిసెంబర్ మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డాటా 56.4 పాయింట్లుగా నమోదైంది. మరోవైపు యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం నుంచి కూడా సూచీలు సానుకూల సంకేతాలను అందుకున్నాయి. దీంతో మిడ్‌సెషన్ నుంచి మళ్లీ కొనుగోళ్ల పర్వం మొదలవడంతో సూచీలు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ కనిష్టం నుంచి 626 పాయింట్లు లాభపడి 48,220 వద్ద, నిఫ్టీ ఇంట్రాడేలో నుంచి 194 పాయింట్లను ఆర్జించి 14,147 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. 3.50% లాభపడ్డ బీఈఎంఎల్ షేరు రక్షణరంగానికి చెందిన ప్రభుత్వరంగ కంపెనీ బీఈఎంఎల్ షేరు బీఎస్ఈలో 3.50 శాతం లాభపడింది. ఈ కంపెనీలో 26 శాతం వాటా ఉపసంహరించడంతో పాటు మేనేజ్మెంట్ నియంత్రణ కూడా బదిలీ చేసేందుకు కేంద్రం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను (ఈఓఐ) ఆహ్వానించడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో 8 శాతం లాభపడి రూ.1,050 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 3.50 శాతం లాభంతో రూ.1,008 వద్ద ముగిసింది. -
వివాదంలో ‘అనుమతులు’
బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరోనా వ్యాక్సిన్‌కు ‘రాజకీయ వైరస్’ అంటింది మొదలు దానిచుట్టూ రాజకీయాలు షికారు చేస్తున్నాయి. తాజాగా మన దేశంలో అనుమతులు లభించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు కూడా ఆ సమస్యలో చిక్కుకున్న జాడలు కనబడుతున్నాయి. తగిన డేటా లేకుండా కోవాగ్జిన్‌కు ఎలా అనుమతించారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తుంటే... కోవిషీల్డ్‌కు సైతం మన దేశం డేటాకాక, వేరే దేశాలకు సంబంధించిన డేటా మాత్రమే వుందని నిపుణులు పెదవి విరుస్తున్నారు. పైగా కోవిషీల్డ్‌తోపాటు పారాసిటమాల్ కూడా ఇవ్వాల్సివుంటుందన్న సూచన వారికి సంతృప్తికలిగించటం లేదు. గత ఏడాది జనవరి 30న కేరళలో తొలి కరోనా వైరస్ కేసు బయటపడ్డాక అది దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ స్వైరవిహారం చేసింది. ఇంతవరకూ మొత్తంగా కోటి 3 లక్షల మందికిపైగా దాని బారినపడగా, 1,49,756 మంది మరణించారు. ఇలాంటి సమయంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు అనుమతులు లభించాయన్న వార్త అందరికీ ఉప శమనం కలిగించాలి. హర్షామోదాలు వ్యక్తం కావాలి. కానీ అందుకు భిన్నమైన స్పందనలు వినబడ్డాయి. ఈ వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించింది కాగా... ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంస్థ ఉమ్మడిగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసుకుని పూణేలోని సీరం సంస్థ కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తోంది. పాత కరోనా ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. ఈలోగా అది సరికొత్త వేషంతో అందరిలో భయాందోళనలు కలిగిస్తోంది. దాని తీవ్రత ఎంతో, అది కలగజేయగల నష్టమేమిటో ఇంకా పూర్తిగా నిర్ధారణకాని సమయంలో వివాదం రేగటం ఆందోళనకరమే. అందరూ టీకాలు తీసుకుంటే వైరస్ పీడ త్వరలో సమసిపోతుందన్న ఆశ వుంటుంది. అదే సమయంలో ఆ వైరస్ వల్ల కరోనా బెడద మాయంకావటం మాట అటుంచి దుష్పరిణామాలేవీ కలగవు కదా అన్న సందేహాలుంటాయి. వ్యాక్సిన్లు అన్నివిధాలా సురక్షితమైనవని, భద్రమైనవని నిపుణులు నిర్ధారించుకున్నాకే సాధారణంగా వాటికి అనుమతులు లభిస్తాయి. దానికితోడు రాజకీయ నాయకులు సైతం స్వయంగా ఆ టీకాలు తీసుకుంటే జనంలో మరింత విశ్వాసం పెరుగు తుంది. జరగాల్సింది ఇది కాగా... అందుకు భిన్నమైన రీతిలో పలువురిలో ఎన్నెన్నో సందేహాలు తలెత్తు తున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్లనూ ‘అత్యవసర పరిస్థితుల్లో, కొన్ని షరతులకు లోబడి’ వాడొచ్చునని భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) ఆదివారం ప్రకటించింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) నిపుణుల సంఘం సిఫార్సు ఆధారంగా ఈ అనుమతి ఇస్తున్నట్టు వివరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ తక్షణావసరమే. అలాగని వ్యాక్సిన్ల సమ ర్థతకు సంబంధించిన డేటా అందుబాటులో వుంచకుండా అనుమతులివ్వటం వల్ల జనంలో అయోమయం ఏర్పడుతుంది. ‘అత్యవసర పరిస్థితుల్లో, కొన్ని షరతులకు లోబడి’ అంటూ అనుమ తులివ్వటం వల్ల వాటిని నిర్ణయించేదెవరన్న సమస్య తలెత్తుతుంది. దానికితోడు వైద్యులు ప్రధానంగా కోవిషీల్డ్ టీకానే ఇస్తారని, అది పనిచేయకపోతే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మాత్రమే కోవాగ్జిన్‌ను ఉపయో గిస్తారని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా చేసిన ప్రకటన మరింత గందరగోళానికి దారితీసింది. ప్రత్యామ్నాయం అంటే ఏమిటి... దాన్ని నిర్ణయించేదెవరువంటి ప్రశ్నలన్నీ సహజం గానే తలెత్తాయి. తమ టీకాను కేవలం ప్రత్యామ్నాయం మాత్రమేనని చెప్పటం కోవాగ్జిన్ ఉత్పత్తి దారైన భారత్ బయోటెక్‌కు ఆగ్రహం కలిగించింది. ఇక దీనిపై రాజకీయ రగడ సరేసరి. భారత్ బయోటెక్తోసహా మన ఫార్మసీ సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలున్నాయి. ప్రాణావసర ఔషధాలను చవగ్గా ఉత్పత్తి చేయగలగటం వాటి సుగుణాల్లో ఒకటి. బ్రిటన్ గత నెల 3న అనుమతులిచ్చిన ఫైజర్ వ్యాక్సిన్ సంగతే చూస్తే అది బాగా ఖరీదైనది. పైగా దాన్ని మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలోనే పంపిణీ చేయటం, టీకా వేయటం కూడా పూర్తి చేయాలి. అందుకు ప్రత్యేక రిఫ్రిజిరేటర్లు సమకూర్చుకోవాలి. కానీ కోవిషీల్డ్, కోవాగ్జిన్ అందుకు విరుద్ధం. వాటిని 2–8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలో భద్రపరిస్తే సరిపోతుంది. పైగా ధర కూడా దాంతో పోలిస్తే చాలా తక్కువ. ఇవి స్వాగతించదగ్గ అంశాలే అయినా టీకాతో ముప్పు వుండబోదన్న హామీయే కీలకమైనది. ఈ రెండూ 110 శాతం సురక్షితమైనవని డీసీజీఐ సోమాని చెబుతున్నారు. బాధ్యతాయుత స్థానంలో వున్న ఆయనకు ఆ రెండు వ్యాక్సిన్లూ అంత విశ్వాసం కలగజేశాయంటే సంతోషించాల్సిందే. కానీ ఆ విశ్వాసానికి ప్రాతిపదికగా వున్న డేటాను కూడా విడుదల చేసివుంటే ఇన్ని సమస్యలు తలెత్తేవి కాదు. అందుబాటులో వున్న సమాచారాన్నిబట్టి కోవిషీల్డ్ నిబంధనల ప్రకారం మూడు దశల ప్రయోగాలనూ పూర్తి చేసుకోగా, కోవాగ్జిన్ నిర్వహించిన మూడో దశ ప్రయోగ ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడాల్సివుంది. ఇంతవరకూ రెండు వ్యాక్సిన్లకూ సంబంధించి క్లినికల్ ప్రయోగాలు మాత్రమే జరిగాయి. అంటే ఎంపికచేసినవారికి టీకాలందించి, వారిని వైద్యుల నిశిత పర్యవేక్షణలో వుంచి పరిశీలించే ప్రక్రియ. ఇలా ఇచ్చే టీకాల సామర్థ్యాన్ని నిర్ణయించేదెవరన్న ప్రశ్న వస్తుంది. అందుకనుసరించే ప్రోటోకాల్ ఏమిటో, ఆ ప్రోటోకాల్‌కు తగినట్టే ఫలితాలున్నాయని తేల్చేదెవరో తెలిస్తే తప్ప ఈ క్లినికల్ ప్రయోగాల ఫలితాలను విశ్వసించటం కష్టమే. వాస్తవానికి మన దేశంలో మాత్రమే కాదు...బ్రిటన్‌లో ఫైజర్ వ్యాక్సిన్‌ను అనుమతించినప్పుడూ ఇలాంటి ప్రశ్నలే తలెత్తాయి. తగినంత సమయం తీసుకుని నిశితంగా పరీక్షించకుండా జనంలోకి వదిల్తే దుష్పరిణామాలకు దారితీస్తుందని ఫైజర్ మాజీ సైంటిస్టు మైకేల్ ఈడెన్ హెచ్చరించారు. కనుకే ఎలాంటి అనుమ తులైనా పారదర్శకంగా వున్నప్పుడే ప్రజానీకం సాదరంగా ఆహ్వానించగలుగుతుంది. అప్పుడే కరోనా వంటి ప్రమాదకర వ్యాధులను శాశ్వతంగా తరమగలం. -
కరోనా: 11న తొలి టీకా?
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమ యం వచ్చేసింది..! వారంలోనే రాష్ట్రంలో కరోనా టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం కానుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం నుంచి అందిన సంకేతాల మేరకు ఈ నెల 11న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఒక కీలకాధికారి సోమవారం తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కరోనా టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే వ్యాక్సినేషన్‌కు సంబంధించి అధికారికంగా ఇంకా ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదన్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ టీకా, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర అనుమతులు మంజూరు చేసిన విష యం తెలి సిందే. ఇదిలా వుంటే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లను వేగవంతం చేసేందుకు సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా వైద్యాధికారులకు హైదరాబాద్‌లో రెండ్రోజుల శిక్షణను ప్రారంభిం చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ముందుగా 10 లక్షల డోసులు... రాష్ట్రానికి ముందుగా 10 లక్షల డోసుల కరోనా టీకాలు రానున్నాయి. మొదటి విడతలో వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వేసేందుకు కోవిషీల్డ్ టీకా రాష్ట్రానికి రానుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ముందుగా రాష్ట్రంలో 2.88 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి మాత్రమే టీకా వేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు గాంధీ ఆసుపత్రి వరకు అన్నిచోట్లా వైద్య సిబ్బందికి టీకాలు వేస్తారు. మొదటి రోజు ప్రతి కేంద్రంలో 50 మందికి చొప్పున మాత్రమే టీకా వేస్తారు. ఆ తర్వాత రోజు నుంచి ప్రతీ కేంద్రంలో 100 మందికి వేస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా కార్యక్రమం ఉంటుంది. వైద్య సిబ్బంది మొత్తానికి టీకా వేయడానికి రెండు వారాల సమయం పడుతుంది. ఆ తర్వాత మళ్లీ రెండో డోసును 28 రోజుల తర్వాత వేస్తారు. టీకా ఎవరెవరికి ఎప్పుడు వేస్తారో ప్రతీ ఒక్కరికీ ఒక టైం స్లాట్ కేటాయిస్తారు. ఉదాహరణకు రాహుల్ అనే డాక్టర్‌కు ఉదయం 9 గంటలకు టైం స్లాట్ ఇస్తే, శకుంతల అనే నర్సుకు ఉదయం 9.10 గంటల స్లాట్ టైం ఇస్తారు. ఇలా ఒక్కో వ్యక్తికి ఒక్కో సమయం కేటాయించి ఆ ప్రకారం వారి మొబైల్ ఫోన్లకు టైం స్లాట్ మెసేజ్‌లు పంపిస్తారు. ముందుగా వేచి ఉండే గది, తర్వాత టీకా గది, టీకా తీసుకున్నాక సైడ్ ఎఫెక్టŠస్ను పరిశీలించేందుకు అరగంట వేచి ఉండేలా మరో గది ఉంటాయి. ఆయా గదుల్లో ఎక్కువమంది గుమికూడకుండా ఉండేందుకే టైం స్లాట్లను పెడుతున్నారు. వారంలో నాలుగు రోజులే కరోనా వ్యాక్సిన్ వారానికి నాలుగు రోజులు మాత్రమే వేస్తారు. బుధ, శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ ఉండదని అధికారులు వెల్లడించారు. బుధ, శనివారాల్లో ఇతర టీకాల ప్రక్రియ నిలిచిపోకూడదన్న ఉద్దేశంతో ఆ రెండు రోజులు విరామం ఇచ్చారు. ఇక ఆదివారం సెలవు ప్రకటించారు. టీకాను జాబితా ప్రకారం, ఇచ్చిన టైం స్లాట్ ప్రకారమే ఇస్తారు. టీకా లబ్దిదారులు గుర్తింపు కార్డు తీసుకొని కేంద్రానికి రావాల్సి ఉంటుంది. దాన్ని సరిచూసుకున్న తర్వాతే టీకా వేస్తారు. ఒకవేళ ఎవరైనా వారికి కేటాయించిన రోజు రాకపోతే అటువంటి వారికి ప్రత్యేకంగా మరో రోజు కేటాయిస్తారు. అలాగే ఎవరైనా వేయించుకోకూడదని నిర్ణయించుకుంటే ఒత్తిడి చేయరు. అంటే టీకా వేసుకోవాలా వద్దా అనేది స్వచ్ఛందమేనని అధికారులు వెల్లడించారు. రెండు వారాలు వైద్య సిబ్బందికి టీకా వేశాక... మూడు లేదా నాలుగో వారంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేస్తామని అధికారులు వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూకు సంబంధించిన నిర్ణీత సిబ్బంది, పోలీసులు వంటి ఫ్రంట్‌లైన్ వర్కర్ల జాబితా ఇంకా తయారుకాలేదు. వారి జాబితాను ఆయా శాఖలు తయారు చేసి కేంద్రానికి పంపించిన తర్వాత, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు వారికి టీకాలు వేస్తారు. 50 ఏళ్లు పైబడిన వారికి, 50 ఏళ్లలోపు అనారోగ్యంతో బాధపడే వారికి ఎప్పుడు టీకా వేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే వారి జాబితా తయారు కాలేదు సరికదా కేంద్రం నుంచి కూడా ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 90 శాతం మంది వైద్య సిబ్బంది టీకా వేసుకునేందుకు ముందుకు వస్తారని చెబుతున్నారు. 1,200 కేంద్రాల్లో.. గురు, శుక్రవారాల్లో భారీ డ్రైరన్ వ్యాక్సినేషన్ ఎలా వేయాలో ట్రయల్స్ కోసం ఇప్పటికే రాష్ట్రంలో రెండు జిల్లాల్లో ఆరు చోట్ల డ్రైరన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో మూడు చోట్ల, మహబూబ్‌నగర్‌లోనూ మూడు చోట్ల డ్రైరన్ నిర్వహించారు. అయితే ఈ ఆరు చోట్ల డ్రైరన్ నిర్వహించగానే సరిపోదని, మిగిలిన ప్రాంతాల్లోని సిబ్బందిలో కొంత గందరగోళంఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ భావించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోయినా వచ్చే గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో 1,200 కేంద్రాల్లో డ్రైరన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటే వ్యాక్సినేషన్ మొదలయ్యాక ప్రక్రియ సాఫీగా సాగిపోతుందని భావిస్తున్నారు. -
12 ఏళ్లు పైబడిన పిల్లలపై క్లినికల్ ట్రయల్స్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకుగాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌కు సంబంధించి కేంద్రం మరో కీలక విషయాన్ని ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం అత్యవసర వినియోగానికి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో టీకా మూడో దశ ప్రయోగాలను 12 సంవత్సరాలకు పైన వయసు పిల్లలపై జరిపేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కోవాక్సిన్ చాలా సురక్షితమైందనీ, బలమైన రోగ నిరోధక శక్తి ప్రతిస్పందనను అందిస్తోందని డీసీజీఐ విజి సోమాని చెప్పారు. (వ్యాక్సిన్ కోసం యాప్: రిజిస్ట్రేషన్ ఎలా అంటే?) అయితే ఇప్పటివరకు పిల్లల్లో తొలి, రెండో దశ ప్రయోగాలను భారత్ బయోటెక్ పూర్తిచేసింది. ఇప్పటివరకు జరిపిన ప్రయోగాల్లో వ్యాక్సిన్ సురక్షితమని తేలడంతో మూడో దశ ప్రయోగాలకు అనుమతి సాధించింది. దీంతో 12 ఏళ్ల వయసువారిపై భారత్ బయోటెక్ ప్రయోగాలను చేపట్టనుంది. అయితే, వ్యాక్సిన్ సమర్థత, సురక్షితమని నిర్ధారించే తొలి, రెండు, మూడో దశ ప్రయోగాల తాజా సమాచారాన్ని అందించాలని డీసీజీఐ కోరింది. వ్యాక్సిన్ తొలి, రెండో దశలో 800 మందిపై ప్రయోగించింది. ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై ప్రారంభించినట్లు డీసీజీఐ వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపు 22,500 వేల మందికి ప్రయోగించగా సురక్షితంగా తేలిందని సోమానీ తెలిపారు. కాగా భారత్‌బయెటక్ టీకా కుసంబంధించి తన ఫేజ్ 1, 2 ట్రయల్స్‌ను పూర్తి చేసింది. ఇందులో టీకా ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన పిల్లలపై సురక్షితంగా ఉందని తేలింది. దీంతో మూడో దశ ప్రయోగాలకు అనుమతినిస్తున్నట్లు డీసీజీఐ తాజాగా వెల్లడించింది -
వ్యాక్సిన్ ఫస్ట్ మోదీనే తీసుకోవాలి: కాంగ్రెస్
పట్నా: కరోనా వైరస్ పని పట్టే వ్యాక్సిన్ అభివృద్ధిలో ప్రపంచ దేశాలు తలమునకలయ్యి ఉన్నాయి. ఇప్పటికే స్పూత్నిక్ వి, ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మన దగ్గర కూడా డీసీజీఐ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆదివారం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు డీసీజీఐ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత త్వరగా వ్యాక్సిన్ వినియోగానికి అనుమతివ్వడం సరైంది కాదని.. వ్యాక్సిన్ సామార్థ్యం పట్ల జనాల్లో సందేహాలున్నాయని తెలిపాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. (చదవండి: వచ్చే వారం నుంచీ మనకూ వ్యాక్సిన్! ) ఈ సందర్భంగా బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజీత్ శర్మ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనావైరస్ వ్యాక్సిన్‌కి అత్యవసర అనుమతివ్వడంతో.. ప్రజల్లో తలెత్తిన సందేహాలు తొలగించడానికి రష్యా, అమెరికా ప్రధానులు బహిరంగంగా తొలి డోస్ వ్యాక్సిన్‌ని తీసుకున్నారు. వారిలానే మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా కోవాగ్జిన్ తొలి డోస్‌ని జనం మధ్యలో తీసుకోవాలి. అప్పుడే వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో నెలకొన్న సందేహాలు తొలగిపోతాయి’ అన్నారు. అంతేకాక మోదీతో పాటు మరి కొందరు సీనియర్ బీజేపీ నాయకులు తొలుత వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
టీకాకు అటు..ఇటు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో నిర్ణయాత్మక ముందడుగు పడింది. కోవిడ్–19పై చేస్తున్న యుద్ధంలో భారతీయులకు సునిశిత ఆయుధం లభించింది. దేశంలో కరోనా టీకా అత్యవసర, నియంత్రిత వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆదివారం ఆమోదం తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన స్వదేశీ టీకా ‘కోవాగ్జిన్’, బ్రిటన్‌కి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’లకు షరతులతో డీసీజీఐ అనుమతించింది. ఈ రెండు టీకాలకు అనుమతివ్వాలని జాతీయ ఔషధ ప్రామాణికాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తొలి అడుగు పడినట్లయింది. అలాగే, జైడస్ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న టీకా ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్‌కు కూడా డీసీజీఐ అనుమతించింది. ఈ టీకా అభివృద్ధి కోసం జైడస్ క్యాడిలాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్ వెల్లడించారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు అనుమతి లభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతించారు. కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేలి మలుపు అని అభివర్ణించారు. ‘భారత్ ఆరోగ్యకర, కోవిడ్ రహిత దేశంగా మారే ప్రయాణం దీంతో మరింత వేగవంతం కానుంది. కంగ్రాచ్యులేషన్స్ ఇండియా. టీకా కోసం అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు’అని ప్రధాని ట్వీట్ చేశారు. భారత్‌లో కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు, ఈ టీకాలను ఆగమేఘాలపై అభివృద్ధి చేసిన నేపథ్యంలో.. వాటి సమర్ధత, భద్రతలపై పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణ అధ్యయనం తరువాతే అనుమతి.. ఆయా సంస్థలు ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా విశ్లేíషించిన అనంతరం, నిపుణుల సిఫారసుల మేరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు అత్యవసర పరిస్థితుల్లో నియంత్రిత వినియోగానికి అనుమతినివ్వాలని నిర్ణయించామని డీసీజీఐ వీజీ సోమానీతెలిపారు. ఈ రెండు టీకాలను రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వీటిని 2 నుంచి 8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉంటుందని వివరించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 70.42% సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపారు. 23,745 మంది వలంటీర్లపై చేసిన ‘కోవిషీల్డ్’ప్రయోగ ఫలితాల సమగ్ర వివరాలను సీరమ్ ఇన్స్టిట్యూట్ తమకు అందించిందన్నారు. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అత్యంత సురక్షిత వీరోసెల్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిందని తెలిపారు. ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని, ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని సోమానీ వెల్లడించారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్‌ను దేశవ్యాప్తంగా 22,500 మంది వలంటీర్లపై నిర్వహించారని, ఫలితాలు సానుకూలంగా వచ్చాయన్నారు. కోవాగ్జిన్ ప్రత్యామ్నాయమే! భారత్ బయోటెక్ చేసినకోవాగ్జిన్ను ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమేనని ఎయిమ్స్ డైరెక్టర్, జాతీయ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యుడు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ తొలిదశలో ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా సాయంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకానే వాడుతామన్నారు. ‘వీటికి అనుమతులు లభించడం కొత్త ఏడాది ప్రారంభంలో చోటుచేసుకున్న శుభ పరిణామం. ఈ రెండు టీకాలు చౌకైనవి. భద్రపరచడం, పంపిణీ సులువు. దేశీయంగా తయారైన వీటితో త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రారంభించవచ్చు. కోవిషీల్డ్ పనితీరు ఎంతమేర పనిచేస్తుందనేది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కానందున, సైడ్ ఎఫెక్ట్స్ కనిపించిన అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌కు కోవాగ్జిన్‌ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు’అని ఆయన అన్నారు. యూకే కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో అదుపుతప్పినా, లేదా మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ పూర్తయినా.. కోవాగ్జిన్‌ను పూర్తిస్థాయిలో వాడే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. సీరం సంస్థ 5 కోట్ల డోసులు సిద్ధం చేసినందున, తొలి విడత వ్యాక్సినేషన్లో 3 కోట్ల మందికి కోవిషీల్డ్ వాడుతామన్నారు. సమర్థతపై అనుమానాలు.. కరోనా విజృంభణను అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసిన టీకాల సామర్ధ్యం, భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిషీల్డ్ సమర్ధత 70.42%గా డీసీజీఐ ప్రకటించింది. కానీ కోవాగ్జిన్ సమర్ధతపై స్పష్టమైన వివరణ రాలేదు. అలాగే, ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు పూర్తిగా వెలువడకముందే, టీకా సమర్ధతపై, సురక్షితమేనా అన్న విషయంపై పూర్తిస్థాయి సమాచారం అందకముందే కోవాగ్జిన్‌కు అనుమతినివ్వడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా టీకా వినియోగం ప్రారంభమైన తరువాత దుష్ప్రభావాలు వెల్లడైతే, పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, యూకేలో గుర్తించిన కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్‌పై ఈ టీకాలు ఎంతవరకు సమర్ధంగా పనిచేస్తాయనే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తు చేస్తున్నారు. కోవాగ్జిన్ ఫేజ్ –3 క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైన సామర్ధ్యం, భద్రతలకు సంబంధించిన డేటా ఇంకా తమ వద్దకు రాలేదని ఆదివారం ఐసీఎంఆర్ కూడా స్పష్టం చేసింది. అయితే, కోవాగ్జిన్ అత్యున్నత సామర్థ్య, భద్రత ప్రమాణాలతో రూపొందుతున్న సంకేతాలున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ నివేదిక మరి కొన్ని వారాల్లో అందనుందన్నారు. కోవాగ్జిన్ ఫేజ్ 1, 2 ట్రయల్స్ ఫలితాలు సామర్ధ్యం, భద్రత పరంగా సానుకూలంగా ఉన్నాయన్నారు. ట్రయల్స్‌లో కోవాగ్జిన్ సమర్థతను నిరూపించుకుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. కోవాగ్జిన్‌కు అనుమతి ఎలా ఇచ్చారు: కాంగ్రెస్ కోవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతులు ఇవ్వడంపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టీకా మూడో దశ ప్రయోగాలు ముగియకుండానే అనుమతులివ్వడం ప్రమాదకరమని కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్ హెచ్చరించారు. అత్యంత కీలక అంశాన్ని రాజకీయం చేయడం అవమానకరమంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి ఎదురుదాడికి దిగారు. ఇప్పటివరకు ఏ దేశం కూడా వ్యాక్సిన్ సామర్థ్యం ఎంతో తెలుసుకోకుండా అనుమతులు ఇవ్వలేదని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. తొలి విడతలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకి టీకాలు ఇస్తున్నారని, వారి ఆరోగ్యానికి ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా కోవాగ్జిన్‌కు అనుమతులివ్వడాన్ని తప్పు పట్టారు. అంతవరకు కోవిషీల్డ్‌ను వాడుకోవాలని సూచించారు. కోవాగ్జిన్ టీకా అంశంలో నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చిందని మరో నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్వదేశీ టీకాకి అనుమతులివ్వడాన్ని స్వాగతించారు. శాస్త్రవేత్తల కృషిని ఆయన కొనియాడారు. కీలక అంశాల్లో రాజకీయాలా ? కాంగ్రెస్ నేతల ప్రశ్నలకి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. ఇలాంటి కీలక అంశాల్ని రాజకీయం చేయడం అత్యంత అవమానకరమని అన్నారు. ‘కళ్లు తెరిచి చూడండి ఇలా మాట్లాడి మీకు మీరే అభాసు పాలవుతున్నార’ని మంత్రి అన్నారు. బీజేపీ ఎదురు దాడి కోవాగ్జిన్ అనుమతులపై కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని నిలదీయడంతో బీజేపీ ఎదురు దాడికి దిగింది. కాంగ్రెస్ ప్రతీది రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ విమర్శించారు. ఒకప్పుడు సైనికుల త్యాగాలను ప్రశ్నించారని, ఇప్పుడు స్వదేశీ టీకాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భారత్ సాధించిన ఘనతలు ఎప్పటికీ కాంగ్రెస్‌కి గర్వకారణంగా అనిపించవని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేలి మలుపు. ‘భారత్ ఆరోగ్యకర, కోవిడ్ రహిత దేశంగా మారే ప్రయాణం దీంతో మరింత వేగవంతం కానుంది. కంగ్రాచ్యులేషన్స్ ఇండియా. అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు. – ప్రధాని మోదీ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా యూకేలో గుర్తించిన వేరియంట్ సహా కొత్త కరోనా వైరస్ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేసే అవకాశాలున్నాయి. – హర్షవర్ధన్ , ఆరోగ్య శాఖ మంత్రి మూడో దశ ప్రయోగాలు ముగియకుండానే వ్యాక్సిన్‌కు ఎలా అనుమతినిచ్చారు? ప్రొటోకాల్ నిబంధనలు పాటించకుండా, మూడో దశ ప్రయోగాలపై ఫలితాలు తేలకుండా అనుమతులు ఇవ్వడం ప్రమాదకరం. – కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమే. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ తొలిదశలో ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సాయంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకానే వాడతాం. కోవిషీల్డ్ పనితీరు ఎంతమేర పనిచేస్తుందనేది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కానందున సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌కు కోవాగ్జిన్‌ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. – డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్, జాతీయ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యుడు భద్రత పరంగా ఏ చిన్న సమస్య ఉన్నా అనుమతించేవాళ్లం కాదు. ఈ టీకాలు 110% సురక్షితం. స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు, అలర్జీ కనిపించవచ్చు. ఏ వ్యాక్సిన్‌కైనా అది సాధారణమే. – వి.జి. సోమానీ, డీసీజీఐ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా యూకేలో గుర్తించిన వేరియంట్ సహా కొత్త కరోనా వైరస్ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేసే అవకాశాలున్నాయి. – హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి -
తెలంగాణకు కరోనా వ్యాక్సిన్ వస్తుందిలా..
రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ వస్తుందిలా.. 5 steps ►ప్రత్యేక ఇన్సులేటెడ్ కార్గో విమానాల్లో టీకాలు ముందుగా కోఠిలోని స్టేట్ వ్యాక్సిన్ సెంటర్‌కు చేరిక ►స్టేట్ వ్యాక్సిన్ సెంటర్లో కోటిన్నర వ్యాక్సిన్ల నిల్వకు నాలుగు వాక్ ఇన్ కూలర్లు ►స్టేట్ వ్యాక్సిన్ సెంటర్ నుంచి 10 రీజినల్ వ్యాక్సిన్ సెంటర్లకు తరలింపు ►రీజినల్ వ్యాక్సిన్ సెంటర్ల నుంచి జిల్లాల్లోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు చేరవేత ►అక్కడి నుంచి 10 వేల వ్యాక్సిన్ కేంద్రాలకు పంపిణీ సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ సిద్ధమైంది. టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు కూడా వచ్చేశాయి. వీలైనంత త్వరలో టీకా పంపిణీ కూడా మొదలు కానుంది. పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో తయారయ్యే కోవిషీల్డ్ టీకాను దేశం నలుమూలలకు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనితో పాటు మరేదైనా టీకా అందుబాటులోకి వస్తే ఈ రెండింటినీ కూడా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తారని చెబుతున్నారు. అందుబాటులో ఉన్న టీకాల సంఖ్య, లాజిస్టిక్స్... చూసుకొని రాష్ట్రాలకు పంపిణీని కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. అయితే టీకాలను ఎక్కడ నిల్వ చేస్తారు? ఎలా పంపిణీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. కోవిడ్ టీకాలు ప్రస్తుతం అందరికీ కొత్తగా కనిపించినా, ఇతరత్రా టీకాల నిర్వహణ మనకు అనుభవమే. వేర్వేరు వ్యాధుల కోసం టీకాలను నిత్యం వేస్తూనే ఉన్నారు. మన దేశంలో ఏటా దాదాపు 2.5 కోట్ల మంది నవజాత శిశువులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాలు అందిస్తున్నారు. వీటన్నింటి ఉత్పత్తి, పంపిణీలకు సంబంధించి పక్కా ప్రణాళిక, వ్యవస్థలు ఇప్పటికే సిద్దంగా ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సిద్ధం చేసి... పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకాకు కూడా ఇదే వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లతో పోలిస్తే కోవిషీల్డ్ నిల్వ, రవాణాకు అతిశీతల పరిస్థితుల అవసరం లేదు. రెండు నుంచి ఎనిమిది డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనే చాలాకాలం నిల్వ ఉంచవచ్చు. ►మొదటగా పుణే నుంచి కోవిషీల్డ్ టీకాలు ఇన్సులేటెడ్ కార్గో విమానాల్లో రాష్ట్రానికి వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాక అక్కడి నుంచి ప్రత్యేక ఇన్సులేటెడ్ కంటెయినర్లలో స్టేట్ వ్యాక్సినేషన్ సెంటర్‌కు ప్రత్యేకంగా చేరతాయి. ఒకవేళ స్థానిక టీకా వాడకానికి అనుమతిస్తే... తయారీ కేంద్రం నుంచి ప్రత్యేక ఇన్సులేటెడ్ వాహనాల్లో తరలిస్తారు. ► కోఠిలోని స్టేట్ వ్యాక్సినేషన్ సెంటర్ నుంచి రీజినల్ వ్యాక్సినేషన్ సెంటర్లకు టీకాలు వెళతాయి. 10 పూర్వ జిల్లా కేంద్రాల్లో ఈ రీజినల్ వ్యాక్సినేషన్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ 40 క్యూబిక్ మీటర్లు కలిగిన వాక్ ఇన్ కూలర్లు ఉన్నాయి. ఒక్కో రీజినల్ సెంటర్లో ఒక్కో వాక్ ఇన్ కూలర్ చొప్పున సిద్ధం చేశారు. ► రీజినల్ కేంద్రాల నుంచి జిల్లాల్లోని 950 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు, 55 సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లకు టీకాలను సరఫరా చేస్తారు. అందుకోసం ప్రతీ కొత్త జిల్లాకు ఒకటి చొప్పన ఇన్సులేటెడ్ వ్యాన్లను అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం 16 జిల్లాల్లో ఇన్సులేటెడ్ వాహనాలు సిద్దంగా ఉండగా, మరో 17 వాహనాలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ వాహనాల్లోనే టీకాలను పీహెచ్సీ, సీహెచ్‌సీలకు సరఫరా చేస్తారు. ►రాష్ట్రంలో 10 వేల కేంద్రాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లు పెట్టాలన్నది లక్ష్యం. అయితే ముందుగా వ్యాక్సిన్లు తక్కువగానే వస్తాయి కాబట్టి ప్రస్తుతం వెయ్యి సెంటర్లను సిద్దం చేశారు. పీహెచ్సీ, సీహెచ్‌సీల నుంచి ఈ సెంటర్లకు టీకాలను వ్యాక్సినేషన్ ఐస్‌బాక్సుల్లో తరలిస్తారు. అందుకోసం స్థానికంగా ఉండే ప్రస్తుత వ్యాక్సిన్ సరఫరా వాహనాలను ఉపయోగిస్తారు. మున్ముందు వ్యాక్సిన్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తే కమ్యూనిటీ సెంటర్లు, పాఠశాల భవనాలను కూడా ఉపయోగించుకుంటారు. ►వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకంగా మూడు గదులు ఉండేలా చూస్తారు. ఒక గదిలో వ్యాక్సిన్ కోసం వచ్చేవారు వేచి ఉండేందుకు సిద్ధం చేస్తారు. రెండో గదిలో వ్యాక్సిన్ వేస్తారు. మూడో గదిలో వాక్సిన్ తీసుకున్నవారు అరగంటపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ సైడ్ ఎఫెక్టŠస్ వస్తే వారికి అవసరమైన చికిత్స చేస్తారు. సైడ్ ఎఫెక్టŠస్ వస్తే వారికి చికిత్స చేసేలా 14 రకాల వైద్య సంబంధిత వస్తువులతో మెడికల్ కిట్‌ను అందుబాటులో ఉంచుతారు. గుండె కొట్టుకునే వేగం తగ్గినా, బీపీ హెచ్చుతగ్గులు ఉన్నా, కళ్లు తిరిగి పడిపోయినా... ఇలా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా చికిత్స చేసేలా మెడికల్ కిట్‌లో మందులు ఉంటాయి. ►హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్ ప్రాంగణంలో స్టేట్ వ్యాక్సినేషన్ సెంటర్ ఉంది. ఇక్కడ కోటిన్నర వ్యాక్సిన్లను భద్రపరిచేలా ఏర్పాట్లు చేశారు. అందుకోసం నాలుగు వాకిన్ కూలర్లు ఇప్పటికే సిద్ధం చేశారు. 40 క్యూబిక్ మీటర్లతో ఈ వాక్ ఇన్ కూలర్లు ఉంటాయి. -
డీసీజీఐ ప్రకటనపై కాంగ్రెస్ అభ్యంతరం
సాక్షి, న్యూఢిల్లీ: సీరం అభివృద్ధి చేస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి డీజీసీఐ ఆదివారం ఆమోదం తెలిపింది. అదే విధంగా హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకి కూడా డీజీసీఐ ఆమోదం ప్రకటించింది. అయితే డీసీజీఐ ఆమోద నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌లో కొవాగ్జిన్ మూడో దశ క్లినికల ట్రయల్స్ కొనసాగుతున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం కరోనా టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలపడం సరికాదని విమర్శించింది. దానిపై కాంగ్రెస్ నేత, పార్లమెంటరీ ప్యానల్‌కు నాయకత్వం వహించిన ఆనంద్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మూడో దశ క్లినికల ట్రయల్స్ కొనసాగిస్తున్న భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కొవాగ్జిన్ టీకా అనుమతిపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్యానల్‌కు సమర్సించిన వివరాల ప్రకారం కొవాగ్జిన్ టీకా ఇంకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోలేదని భద్రత, సమర్థతపై పూర్తి సమీక్ష జరగలేదని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతలు, ఎంపీ శశిథరూర్, ఆనంద్ శర్మ కూడా డీసీజీఐ కరోనా టీకా అమోద ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేశారు. మరో వైపు కాంగ్రెస్ నాయకుల అభ్యంతరాన్ని బీజేపీ ఖండించింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన రెండు టీకాలపై కాంగ్రెస్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు సైనికులను శౌర్యాన్ని ప్రశ్నించారని, అదీ కాక డీసీజీఐ ఆమోదం పొందిన రెండు టీకాలు భారత్‌లో అభివృద్ధి చెందడంతో వారు సంతోషంగా లేరని దుయ్యబట్టారు. టీకాల ఆమోదంపై రాజకీయం చేస్తున్నారిని మండిపడ్డారు. డీసీజీఐ అనుమతితో వారంలోనే భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌లో కొవాగ్జిన్ మూడో దశ క్లినికల ట్రయల్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని డీసీజీఐ పేర్కొంది. డీజీసీఐ ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులు, ప్రజలకు ఊరట కలిగిస్తోంది. -
భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు లైన్ క్లియర్
ఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారత్‌కు డీసీజీఐ ఆదివారం శుభవార్త చెప్పింది. కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర అనుమతికి డిసీజీఐ ఆమోదం తెలిపింది. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా.. కోవిషీల్డ్‌ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి. (చదవండి: 3 కోట్ల మందికి ఉచిత టీకా) ఈ సందర్భంగా డీసీజీఐ డైరెక్టర్ విజి సోమాని మాట్లాడుతూ.. కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ అన్ని అంశాలు పరిశీలించాకే రెండు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇచ్చిందని తెలిపారు. డిసీజీఐ అనుమతితో మరో వారం రోజుల్లోనే భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డీజీసీఐ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ అభివృద్దికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు. -
దేశంలో మరో వ్యాక్సిన్‌కు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: సుమారు గత ఏడాది కాలంగా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి అంతానికి మార్గం సుగమవుతోంది. కరోనా వాక్సిన్లు త్వరలోనే దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ వాక్సిన్‌కు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం కోసం వేచి చూస్తోంది. తాజాగా తుది ఆమోదానికి ఒక అడుగు దూరంలో భారతదేశంలో రెండవ టీకాగా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాక్సిన్ అవతరించింది. (వ్యాక్సిన్: సుబ్రమణియన్ స్వామి కీలక వ్యాఖ్యలు) స్వదేశీ తొలి వ్యాక్సిన్‌గా భావిస్తున్న కోవాక్సిన్ ఆమోదానికి సంబంధించి శనివారం కీలక అడుగు పడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన స్వదేశీ కోవిడ్-19 టీకా అత్యవసర ఉపయోగం కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, సబ్జెక్ట్ నిపుణుల ఆమోదం తెలిపింది. ఈ మేరకు కమిటీ డీసీజీఐకి కూడా సిఫారసు చేసింది. కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి కూడా నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు అనుమతి కమిటీ లభించినట్టయింది. భారత్ బయోటెక్ గత నెల(డిసెంబర్) 7న మొదట అత్యవసర వినియోగ అధికారం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి మరింత డేటా సమర్పించాలని నిపుణుల కమిటీ కోరింది. (కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్) కాగా దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పర్యవేక్షణలో డ్రైరన్ చేపట్టిన రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు కోవిడ్-19కు నాలుగు టీకాలు దాదాపు సిద్ధంగా ఉన్నది భారతదేశం మాత్రమేనని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు యూకే అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. త్వరలోనే దేశంలో అత్యవసర ఉపయోగం కోసం ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉందని మంత్రి సూచించారు.(తొలి విడతలో 3 కోట్ల మందికి టీకా ఉచితం : కేంద్ర మంత్రి) -
వచ్చే వారం నుంచీ మనకూ వ్యాక్సిన్!
న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశీయంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్‌కు వచ్చే వారం అనుమతి లభించే వీలున్నట్లు ఫార్మా వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు వీలుగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు తాజాగా మరింత క్లినికల్ డేటాను అందించినట్లు తెలుస్తోంది. దీంతో దేశీ ఔషధ నియంత్రణ సంస్థలు అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించనున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెరసి కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను అనుమతించిన తొలి దేశంగా భారత్ నిలిచే వీలున్నట్లు పేర్కొంటున్నాయి. (భారత్ బయోటెక్‌తో యూఎస్ కంపెనీ జత) దేశీయంగా.. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో కరోనా వైరస్ కట్టడికి బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా కోవీషీల్డ్ పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌పై దేశీయంగా క్లినికల్ పరీక్షలు, తయారీలను సీరమ్ ఇన్స్టిట్యూట్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యాక్సిన్‌ను అత్యవసర ప్రాతిపదికన అనుమతించమంటూ డీసీజీఐకు సీరమ్ ఇన్స్టిట్యూట్ దరఖాస్తు చేసింది. ఈ బాటలో ఫైజర్, భారత్ బయోటెక్ తదితర కంపెనీలు సైతం అనుమతులు కోరాయి. వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగంపై సీడీఎస్‌సీవో ఈ నెల 9న ఈ కంపెనీల దరఖాస్తులను సమీక్షించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిలో భాగంగా క్లినికల్ పరీక్షలపై మరింత సమాచారాన్ని కోరినట్లు తెలియజేశాయి. దీంతో సీరమ్ తాజాగా మరింత డేటాను అందించినట్లు పేర్కొన్నాయి. ఇదే విధంగా ఫైజర్, భారత్ బయోటెక్ సైతం అదనపు సమాచారాన్ని అందించవలసి ఉన్నట్లు వెల్లడించాయి. (సీరమ్ నుంచి 5 కోట్ల డోసేజీలకు రెడీ) 5 కోట్ల డోసేజీలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై యూకే, బ్రెజిల్ తదితర పలు దేశాలలో మూడో దశ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. రెండు పూర్తి డోసేజీల వల్ల 62 శాతం ఫలితాలు వెలువడగా.. ఒకటిన్నర డోసేజీలతో 90 శాతం మెరుగైన ఫలితాలు లభించినట్లు ఇటీవల కంపెనీ వెల్లడించింది. అయితే రెండు పూర్తి డోసేజీల అంశంపైనే దేశీ ఔషధ నియంత్రణ సంస్థలు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కాగా.. తొలి దశలో 5-6 కోట్ల డోసేజీలను అందించేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ సంసిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీ జులైకల్లా 40 కోట్ల డోసేజీలను రెడీ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశాయి. -
తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్- పరీక్షలకు రెడీ
ముంబై, సాక్షి: కోవిడ్-19 కట్టడి కోసం దేశీయంగా తొలిసారి మెసెంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా వ్యాక్సిన్ అభివృద్ధికి బీజం పడింది. తొలి, రెండు దశల క్లినికల్ పరీక్షలకు దేశీ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. యూఎస్ సంస్థ హెచ్‌డీటీ బయోటెక్ కార్పొరేషన్ సహకరాంతో పుణే కంపెనీ జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ ఇందుకు అనుమతిని పొందింది. జెన్నోవా అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్రభావంతో ఎలుకలు, చింపాజీలు తదితర జంతువులలో కనిపించిన యాంటీబాడీలు, ఇమ్యునాలజీ తదితర అంశాల డేటా ఆధారంగా డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. (అలర్జీలు ఉన్న వారికి వ్యాక్సిన్లు వాడొద్దు) షరతులతో.. హెచ్‌జీసీవో19 పేరుతో జెన్నోవా రూపొందించిన వ్యాక్సిన్‌కు మానవులపై క్లినికల్ పరీక్షల నిర్వహణకు డీసీజీఐ కొన్ని షరతులతో ఆమోదముద్ర వేసింది. వ్యాక్సిన్ డేటా పరిశీలించిన సంబంధిత నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) సలహామేరకు ఇందుకు అనుమతించింది. దీంతో కోవిడ్-19 కట్టడికి తొలిసారి ఎంఆర్ఎన్ఏ సాంకేతికతో దేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న కంపెనీగా జెన్నోవా నిలవనుంది. అయితే తొలి దశ క్లినికల్ పరీక్షల మధ్యంతర ఫలితాలను జెన్నోవా కమిటీకి దాఖలు చేయవలసి ఉంటుంది. వీటి ఆధారంగా రెండో దశ పరీక్షలకు అనుమతించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. జెన్నోవా అభివృద్ధి చేస్తున్న కొత్తతరహా వ్యాక్సిన్‌కు మద్దతుగా బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ప్రాథమిక నిధులను(సీడ్ ఫండింగ్) అందించినట్లు తెలుస్తోంది. (జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!) -
డిసెంబర్ 31కల్లా 30 కోట్ల డోస్‌లు రెడీ
న్యూఢిల్లీ: భారత్‌లో ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి దాదాపు 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు సిద్ధమవుతాయని పుణేలోని ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ జాదవ్ చెప్పారు. డీసీజీఐ నుంచి లైసెన్స్ రాగానే ఈ వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందుతాయని పేర్కొన్నారు. చివరి పరీక్ష జరుపుకున్న వ్యాక్సిన్ 2021 మార్చిలో అందుబాటులోకి వస్తుందన్నారు. కరోనా వైరస్ నివారణకు సీరమ్ సంస్థ ఐదు రకాల వ్యాక్సిన్లతో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. సీరమ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ వచ్చే ఏడాది తొలి త్రైమాసికం తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని అనుమతులు పొందాకే వ్యాక్సిన్‌ను విక్రయిస్తామన్నారు. తాము నెలకు దాదాపు 7 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తామన్నారు. భారత్‌లో స్పుత్నిక్–వీ పరీక్షలు కరోనా నివారణకు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వీ వ్యాక్సిన్ రెండు/మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను భారత్‌లో నిర్వహించేందుకు తమకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతి లభించిందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్)తో కలిసి తాము ఈ ట్రయల్స్ నిర్వహిస్తామంది. సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను తేవడమే తమ సంకల్పమని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కో–చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. రష్యాలో స్పుత్నిక్–వీ టీకా మానవ ప్రయోగాలు జరుగుతున్నాయని ఆర్డీఐఎఫ్ సీఈఓ కిరిల్ చెప్పారు. భారత్‌లోనూ ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైందన్నారు. భారత్‌లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు, వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్ గత నెలలో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా ఆర్డీఐఎఫ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు 10 కోట్ల్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందజేయనుంది. కేసులు @ 74 లక్షలు దేశంలో గత 24 గంటల్లో 62,212 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 74,32,680కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 837 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,12,998 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 65,24,595కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,95,087గా ఉంది. దాదాపు నెలన్నర తర్వాత తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షల దిగువకు వచ్చింది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 10.70 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 87.78 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.52గా నమోదైంది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. -
రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అంతానికి రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కు మన దేశంలో అనుమతి లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్)లకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. తాజా అనుమతి మేరకు భారతదేశంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించ నున్నామని ఇరు సంస్థలు శనివారం ప్రకటించాయి. (రెండో వాక్సిన్ : పుతిన్ కీలక ప్రకటన) 2020 సెప్టెంబరులో, డాక్టర్ రెడ్డీస్, ఆర్‌ఈఐఎఫ్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ని భారతదేశంలో పంపిణీ చేసేందుకు ఒక ఎంఓయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, భారతదేశంలో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కి 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయనుంది. మొదట భారత్ లో 3వ దశ ట్రయల్ మాత్రమే నిర్వహించాలని అనుకున్నా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్కో) నిపుణుల కమిటీ (ఎస్ఇసి) ఆదేశాల మేరకు వరుసగా 2,3 దశల క్లినికల్ ట్రయల్ నిర్వహిచనుంది. 1500 మందితో అడాప్టివ్ ఫేజ్ 2,3 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు సన్నద్ధమవుతున్నామని టీకాను విదేశాలలో మార్కెటింగ్ చేస్తున్న ఆర్డిఐఎఫ్ తెలిపింది. సురక్షిత, సమర్థవంతమైన వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు కట్టుబడిఉన్నామని డాక్టర్ రెడ్డీస్కో-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. డీసీజీఐ సానుకూల సహకారం సంతోషానిచ్చిందని ఆర్డిఐఎఫ్ సీఈఓ కిరిల్ డిమిత్రివ్ పేర్కొన్నారు. భారతీయ క్లినికల్ ట్రయల్ డేటాతో పాటు, రష్యాలోమూడో దశ క్లినికల్ ట్రయల్ డేటా, వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధకతపై విదేశాల్లో నిర్వహించిన అధ్యయనాలను కూడా అందిస్తామన్నారు. కాగా రష్యాకు చెందిన స్పుత్నిక్-వి కొవిడ్-19 వ్యాక్సిన్‌పై భారత్‌లో భారీ స్థాయిలో ట్రయల్స్ నిర్వహించాలనుకున్న డాక్టర్ రెడ్డీస్‌కు అనుతిమిని నిరాకరించిన సంగతి తెలిసిందే. -
రష్యా వ్యాక్సిన్ వయా డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 వ్యాక్సిన్ విషయంలో భారత్‌లో పెద్ద ముందడుగు పడింది. ఈ ఏడాదే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ దేశంలో అడుగు పెట్టనుంది. ఈ వ్యాక్సిన్ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్డీఐఎఫ్ సరఫరా చేయనుంది. పరీక్షలు విజయవంతం అయి, వ్యాక్సిన్ నమోదు ప్రక్రియ పూర్తి అయితే.. ఈ ఏడాది చివరి నుంచే దేశంలో వ్యాక్సిన్ల డెలివరీ ఉండే అవకాశం ఉందని రెడ్డీస్ బుధవారం ప్రకటించింది. రష్యాకు చెందిన గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ స్పుత్నిక్–వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. నమ్మదగిన ఎంపిక... రష్యాలో 25 ఏళ్లుగా డాక్టర్ రెడ్డీస్‌కు సుస్థిర, గౌరవప్రద స్థానం ఉందని ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రీవ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. హ్యూమన్ ఎడినోవైరస్ డ్యూయల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని, ఇది సురక్షితమైందని వివరించారు. వ్యాక్సిన్‌ను భారత్‌కు తీసుకు వచ్చేందుకు ఆర్డీఐఎఫ్తో భాగస్వామ్యం సంతోషంగా ఉందని డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్, ఎండీ జి.వి.ప్రసాద్ అన్నారు. మొదటి, రెండవ దశ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని గుర్తు చేశారు. భద్రత, సమర్థత తెలుసుకునేందుకు, అలాగే భారత నియంత్రణ సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా మూడవ దశ ఔషధ పరీక్షలు దేశంలో జరుపనున్నట్టు వెల్లడించారు. భారత్‌లో కోవిడ్–19పై పోరులో స్పుత్నిక్–వి వ్యాక్సిన్ నమ్మదగిన ఎంపిక అని చెప్పారు. ఈ ఏడాది చివరిలో భారత్‌లో టీకా సరఫరా జరగవచ్చునని, మానవ ప్రయోగాలు వచ్చే నెల నుంచి మొదలుకావచ్చునని ఆర్డీఐఎఫ్ అధ్యక్షుడు దిమిత్రీవ్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ చెప్పారు. ప్రయోగాల ఫలితాల ఆధారంగా భారత్‌లో టీకా పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. స్పుత్నిక్–విపై ప్రస్తుతం రష్యాలో సుమారు 40 వేల మందిపై మూడో దశ మానవ ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటి ఫలితాలు అక్టోబర్/నవంబర్ నెలల్లో తెలిసే అవకాశం ఉంది. వయో వృద్ధులు, కోవిడ్–19 బారిన పడేందుకు అవకాశమున్న వారికి అత్యవసర పరిస్థితుల్లో స్పుత్నిక్–వి టీకా అందించే ఆలోచన చేస్తున్నట్లు భారత్ గత వారమే తెలిపిన నేపథ్యంలో తాజా పరిణామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా టీకాపై ఇప్పటివరకూ జరిగిన ప్రయోగాలు మెరుగైన పలితాలే ఇచ్చినట్లు మెడికల్ జర్నల్ ద లాన్సెట్ ఇటీవలే స్పష్టం చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. దూసుకెళ్లిన షేరు.. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో భాగస్వామ్యం వార్తల నేపథ్యంలో రెడ్డీస్ షేరు ధర దూసుకెళ్లింది. క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం షేరు ధర బీఎస్ఈలో 4.24 శాతం అధికమై రూ.4,631.55 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర 4.69 శాతం ఎగసి రూ.4,651.95 వరకు వెళ్లింది. ఎన్ఎస్ఈలో కంపెనీ షేరు ధర 4.17 శాతం అధికమై రూ.4,442.35 వద్ద స్థిరపడింది. మళ్లీ మొదలైన ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలు కరోనా కట్టడికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాలు భారత్‌లో మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాల తరఫున భారత్‌లో సీరమ్ ఇన్స్టిట్యూట్ (సీఐఐ) నిర్వహిస్తున్న ఈ ప్రయోగాలకు అనుమతి ఇస్తూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) డాక్టర్. వి.జి.సోమాని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. టీకా తీసుకున్న ఓ యూకే మహిళ అస్వస్థతకు గురైన నేపథ్యంలో సెప్టెంబ ర్ 11న ప్రయోగాలపై తాత్కాలిక నిషేధం విధించడం తెలిసిందే. అనారోగ్యానికి గురైన మహిళ సమాచారాన్ని మొత్తం సమీక్షించిన తరువాత యూకేలోనూ ప్రయోగాలను పునరుద్ధరించేందుకు అనుమతి లభించగా.. డీసీజీఐ కొన్ని నిబంధనలతో టీకాలు చేపట్టవచ్చునని సీఐఐకు ఆదేశాలు ఇచ్చారు. సీఐఐ ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని మంగళవారమే డీసీజీఐకి అందించగా అదే రోజుల ప్రయోగాల పునరుద్ధరణకు ఆదేశాలూ జారీ అయ్యాయి. కాకపోతే మరింత క్షుణ్ణంగా పరిశీలించాకే టీకా ఎవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని, కార్యకర్తల అనుమతి పత్రాల్లో కొన్ని మార్పులు సూచించింది. -
షరతులతో సీరంకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్‌ను తిరిగి ప్రారంభించడానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆక్స్ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ పరీక్షలకు అనుమతినిచ్చింది. అయితే ఈ సమయంలో ప్రోటోకాల్ ప్రకారం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికపుడు సంబంధిత సమాచారాన్ని కచ్చితంగా అందించాలని స్పష్టం చేసింది. రోజుకు 90 వేలకు పైగా కేసులతో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వాక్సిన్ ప్రయోగాలు తిరిగి మొదలు కావడం కాస్త ఊరటనిచ్చే అంశం. (కరోనా భారత్: 50 లక్షలు దాటిన కేసులు) ఇటీవల ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్‌ను బిట్రన్‌లో నిలిపివేసిన నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వ్యాక్సిన్ రెండు, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిలిపి వేయాలని డీసీజీఐ ఈ నెల 11న సీరంను ఆదేశించింది. విదేశాల్లో అనుమతి లభించిన నేపథ్యంలో తాజా అనుమతిని డా.వి.జి.సొమానీ మంగళవారం మంజూరు చేశారు. అయితే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీరం ఇన్స్టిట్యూట్కు సూచించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వినియోగించాల్సిన మందుల జాబితాతో పాటు ఇతర చికిత్సా వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించారు. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షలు మళ్లీ షురూ!) కాగా బ్రిటిష్-స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా కోవిడ్ వాక్సిన్ను అభివృద్ధి చేసింది. దేశీయంగా ఆ వాక్సిన్ ఉత్పత్తికి పుణేకు చెందిన సీరం ఒప్పందం చేసుకుంది. మూడవ దశ ఫలితాల్లో సమస్యల కారణంగా ఇండియా సహా, బిట్రన్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసింది. ఇటీవల బ్రిటన్ మెడిసిన్ హెల్త్ రెగ్యులేటరీ అధారిటీ అనుమతి లభించడంతో ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లోనూ రెండు, మూడో దశ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతినిచ్చింది. -
ఆస్ట్రాజెనెకా ట్రయల్స్‌కు డీసీజీఐ బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కోవిడ్-19 వ్యాక్సిన్ పై తాజా పరిణామాలు నీళ్లు చల్లాయి.ఇప్పటికే ఈ వ్యాక్సిన్ పరీక్షల్లో సమస్యల కారణంగా కొన్ని దేశాల్లో తుది దశ క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయాయి. దీంతో మన దేశంలో కూడా క్లినికల్ పరీక్షలకు బ్రేక్ పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో భద్రతా సమస్యల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులకు వరకు పరీక్షలను నిలిపి వేయాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సీరంను ఆదేశించింది. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగాలకు డ్రగ్ రెగ్యులేటర్ డీసీజీఐ తాత్కాలిక బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలవరకు నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు షోకాజ్ నోటీసులిచ్చింది. ఇతర దేశాలలో ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ సమస్యలు, నిలిపివేతపై కేంద్ర లైసెన్సింగ్ అథారిటీకి తెలియజేయలేదని వ్యాఖ్యానించింది. ఎందుకు సమాచారం ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో దేశంలోని 17 సైట్లలో నిర్వహిస్తున్న దశ 2/3 ట్రయల్స్ నిలిచిపోయాయి. తాజా షో-కాజ్ నోటీసుపై స్పందించిన సీరం ఇప్పటివరకు ట్రయల్స్ పాజ్ చేయమని తమకు చెప్పలేదని పేర్కొంది. అయితే డీసీజీఐ జారీ చేసిన ఆదేశాలను అనుసరిస్తామని తెలిపింది. వారి సూచనలు, ప్రామాణిక ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కాగా తుది దశ పరీక్షలలో భాగంగా బ్రిటన్‌లో ఒక వ్యక్తిపై ప్రయోగం సందర్భంగా సమస్యలు తలెత్తడంతో తాత్కాలికంగా నిలిపి వేసినట్టు బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా నిన్న(బధవారం) వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశంపై దృష్టిసారించామని, డేటాను విశ్లేషించాక తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘బయోఫోర్’ నుంచి కొవిడ్-19 ఔషధం
సాక్షి, హైదరాబాద్ : ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన జెనరా ఫార్మా.. కోవిడ్ చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ట్యాబ్లెట్స్ తయారీకై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందింది. ఫావిజెన్ పేరుతో ఈ ట్యాబ్లెట్లను కంపెనీ తయారు చేయనుంది. హైదరాబాద్‌లో యూఎస్ఎఫ్డీఏ అనుమతి పొందిన కంపెనీ ఫెసిలిటీలో వీటిని ఉత్పత్తి చేస్తున్నామని జెనరా కో–ఫౌండర్, ఎండీ జగదీశ్ బాబు రంగిశెట్టి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. (కరోనా : తక్కువ ధరలో మరో ఫావిపిరవిర్ డ్రగ్) ‘ధర విషయంలో ఆసుపత్రులు, పలు సంస్థలతో మాట్లాడుతున్నాం. రోగులకు అందుబాటులో ధర ఉండాలన్నదే మా ధ్యేయం. డబ్బులు వెచ్చించలేని వారికి తగ్గింపు ధరలో లేదా ఉచితంగా సరఫరా చేసేందుకూ మేం సిద్ధం. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్‌తయారీకి కావాల్సిన ముడి పదార్థాలన్నీ దేశీయంగా ఉత్పత్తి చేశాం. మా వద్ద ఉన్న నిల్వలతో నాలుగు లక్షల మంది రోగులకు సరిపడ ట్యాబ్లెట్లను తయారు చేయవచ్చు’ అని వివరించారు. (ఫావిపిరవిర్‌కి ఆవ్రా ల్యాబ్‌కు అనుమతి) కొత్త విభాగాల్లోకి బయోఫోర్..: న్యూట్రాస్యూటికల్స్, ఇమ్యూన్ బూస్టర్స్ విభాగాల్లోకి బయోఫోర్ త్వరలో ఎంట్రీ ఇస్తోంది. తొలుత ఆరు రకాల ఉత్పత్తులను విడుదల చేయనున్నామని జగదీశ్ బాబు వెల్లడించారు. వీటి ధర రూ.100–200 శ్రేణిలో ఉంటుందని వివరించారు. బయోఫోర్‌కు చెందిన హైదరాబాద్ ప్లాంటులో వీటిని ఉత్పత్తి చేస్తామన్నారు. -
ఆక్స్ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్.. సీరమ్‌కు అనుమతివ్వండి
న్యూఢిల్లీ: బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కు అనుమతి ఇవ్వాలని కోవిడ్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ శుక్రవారం డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. హ్యూమన్ ట్రయల్స్ అనుమతి కోరుతూ సీరమ్ సంస్థ గురువారం నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేసింది. అదనపు సమాచారం జోడి స్తూ సవరించిన ప్రతిపాదనలను అందజేసింది.సీరమ్ దరఖాస్తుపై నిపుణుల కమిటీ శుక్రవారం చర్చించింది. దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో 1,600 మందిపై ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తామని సీరమ్ కంపెనీ తెలిపింది. ఇందులో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ కూడా ఉంది. -
ఆప్టిమస్ కోవిడ్ ఔషధానికి అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 చికిత్సలో ఉపయోగించే ఫావిపిరావిర్ ట్యాబ్లెట్ల తయారీకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి లభించిందని హైదరాబాద్ కంపెనీ ఆప్టిమస్ ఫార్మా వెల్లడించింది. ఫావిపిరావిర్ యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్ తయారీకి తమ అనుబంధ కంపెనీ ఆప్ట్రిక్స్ ల్యాబొరేటరీస్ లైసెన్సు దక్కించుకుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ట్యాబ్లెట్లను ఫావికోవిడ్ పేరుతో మార్కెట్ చేయనున్నారు. ట్యాబ్లెట్ల విక్రయ ధరను ఒకట్రెండు రోజుల్లో నిర్ణయిస్తామని ఆప్టిమస్ డైరెక్టర్ పి.ప్రశాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘అందుబాటులో ఉండే విధంగా ఈ ధర ఉంటుంది. ఇతర కంపెనీలకు కూడా ఈ ట్యాబ్లెట్లను తయారు చేసి సరఫరా చేస్తున్నాం. నెలకు ఒక కోటి ట్యాబ్లెట్లకు డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం. ఔషధానికి కావాల్సిన స్టార్టింగ్ మెటీరియల్, కాంప్లెక్స్ ఇంటర్మీడియేట్స్ను సొంతంగా ఉత్పత్తి చేశాం. 2004లో కంపెనీ ప్రారంభమైంది. మూడు ఏపీఐ ప్లాంట్లు, ఒకటి ఫార్ములేషన్స్ తయారీ యూనిట్ ఉంది. ఏపీఐలు 10 దేశాలకు, ఫార్ములేషన్స్ 15 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ.500 కోట్లకుపైగా పెట్టుబడి చేశాం. 1,100 మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. 2019–20లో రూ.700 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలోనే టర్నోవర్ ఆశిస్తున్నాం. మార్కెట్లో చాలా ఉత్పత్తుల వినియోగం పడిపోవడమే ఇందుకు కారణం’ అని వివరించారు. -
కరోనా : మరో చౌక ఔషధానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకు సంబంధించి యాంటీ వైరల్ డ్రగ్ 'ఫావిపిరవిర్' విక్రయాలకు అనుమతి లభించిందని పుణెకు చెందిన బ్రింటన్ ఫార్మా ప్రకటించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చిందని బ్రిటన్ ఫార్మాస్యూటికల్స్ గురువారం వెల్లడించింది. 'ఫావిటన్' బ్రాండ్ పేరుతో 200 మి.గ్రా టాబ్లెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఈ టాబ్లెట్లను 59 రూపాయల చొప్పున విక్రయిస్తామని బ్రింటన్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్లెన్‌మార్క్‌కు చెందిన ఫాబిఫ్లూ తరువాత, చవకగా లభించనున్న డ్రగ్ ఇదే కావడం విశేషం. ఫావిటన్ టాబ్లెట్ ధర 59 రూపాయలు. కాగా ఫ్యాబిఫ్లూ టాబ్లెట్ ధర 75 రూపాయలు. తేలికపాటి నుండి మధ్యస్థ లక్షణాలున్న కోవిడ్-19 రోగుల చికిత్సలో ఫావిపిరవిర్ సమర్థవంతమైన అనుకూలమైన ఫలితాలిస్తోందని, ఇందుకు క్లినికల్ సాక్ష్యాలున్నాయని బ్రింటన్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో అత్యవసర వినియోగానికి అనుమతి లభించిందనీ వెల్లడించింది. తమ స్ట్రాటజీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా ఈ ఔషధ లభ్యతను మెరుగుపరచడమే తమ ఉద్దేశమనీ, అన్ని కోవిడ్ కేంద్రాల్లో ఫావిటన్ను అందుబాటులో ఉంచనున్నామని బ్రింటన్ ఫార్మా సీఎండీ రాహుల్ కుమార్ దర్దా చెప్పారు. అలాగే దీన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామన్నారు. కాగా జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థగా ఉన్న ఫుజిఫిల్మ్ టొయమా కెమికల్ కంపెనీ ఫావిపిరవిర్ ను ‘అవిగాన్’ బ్రాండ్‌తో విక్రయిస్తోంది. ఫావిటన్ అనేది అవిగాన్ జెనరిక్ వెర్షన్. -
కరోనాకు సోరియాసిస్ మందు
న్యూఢిల్లీ: చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేసే ఇటోలిజుమాబ్ అనే సూదిమందును అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఇవ్వొచ్చని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) డాక్టర్ వి.జి.సోమానీ పేర్కొన్నారు. ఈ మేరకు అనుమతి ఇచ్చారు. ఒక మోస్తరు నుంచి తీవ్రమైన దశలో ఉన్న బాధితులకు మాత్రమే ఈ సూదిమందును ఆయన సిఫార్సు చేశారు. క్లినికల్ ట్రయల్స్ డేటా ఆధారంగానే ఈ మందును సూచిస్తున్నట్లు తెలిపారు. ఇటోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను బయోకాన్ అనే దేశీయ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. అల్జూమాబ్ అనే బ్రాండ్ నేమ్‌తో విక్రయిస్తోంది. సోరియాసిస్ చికిత్సకు 2013 నుంచి ఈ సూదిమందును ఉపయోగిస్తున్నారు. బయోకాన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల పట్ల డీసీజీఐ సంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా బాధితులకు ఇటోలిజుమాబ్‌ను ఇచ్చేందుకు ఆమోదం తెలియజేసింది. ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సూదిమందు ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశించింది. ఇతర ఔషధాలతో పోలిస్తే ఇటోలిజుమాబ్ వ్యయం చాలా తక్కువ. -
కరోనా : శుభవార్త చెప్పిన మైలాన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దేశీయ ఫార్మా సంస్థ మైలాన్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ నెలలోనే రెమ్‌డెసివిర్‌కు తమ జనరిక్ వెర్షన్ ఔషధాన్ని విడుదల చేయనున్నామని సోమవారం ప్రకటించింది. (రెమ్‌డెసివిర్ : మైలాన్‌కు అనుమతి) దేశంలో వినియోగానికి ‘డెస్రెం’ పేరుతో ఈ ఔషధాన్ని విడుదల చేయనున్నట్లు మైలాన్ తెలిపింది. గిలియడ్ సైన్సెస్ కుచెందిన యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ జనరిక్ వెర్షన్ డ్రగ్‌ను 100 మిల్లీగ్రాముల డోస్‌కు 4,800 రూపాయలు (64.31డాలర్లు) చొప్పున ఈ నెలలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. ‘డెస్రెం’ పేరుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని మైలాన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (కరోనా కీలక మందు : అమెరికా అద్భుత డీల్) కాగా సిప్లా లిమిటెడ్, హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ రెమ్‌డెసివిర్ జనరిక్ వెర్షన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సిప్లాకు చెందిన సిప్రెమిని 5,000 రూపాయల కన్నా తక్కువ ధరకే అందివ్వనుండగా, హెటెరో కోవిఫోర్ ఔషధం ధరను 5,400 రూపాయలకు నిర్ణయించింది. మరోవైపు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ప్రపంచంలోని కరోనా ప్రభావానికి గురైన దేశాల్లో మూడవ స్థానంలో ఉన్న ఇండియాలో సోమవారం నాటికి 697,413 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, మరణించిన వారి సంఖ్య 20వేలకు చేరువలో ఉంది. -
రెమ్‌డెసివిర్ : మైలాన్‌కు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నివారణకు ఉపయోగించే యాంటీ వైరల్ ఔషధం ‘రెమ్‌డెసివిర్’ తయారీ, మార్కెట్ చేయడానికి ఫార్మాస్యూటికల్ మేజర్ మైలాన్ లాబ్స్‌కు అనుమతి లభించింది. అమెరికా పార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్‌కు చెందిన ఈ ఔధషం తయారీకి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) మైలాన్‌కు అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. (కరోనా టీకా: మరో కీలక అడుగు) కరోనాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు అత్యవసర వినియోగానికి మాత్రమే ఉపయోగించాలన్న ఆంక్షలతో యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ తయారీకి, మార్కెటింగ్‌కు మైలాన్‌కు అవకాశం దక్కింది. తాజా అనుమతితో ఔషధ తయారీకి మైలాన్ శరవేగంగా సన్నద్ధమవుతోంది. దీంతో దేశంలో మూడు కంపెనీలకు ఈ ప్రయోగాత్మక ఔషధాన్ని తయారు చేసి విక్రయించే అధికారం లభించింది. మిగతా రెండు కంపెనీలు హెటిరో, సిప్లా. (కరోనా కీలక మందు : అమెరికా అద్భుత డీల్) కాగా గిలియడ్ సైన్సెస్ యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ మార్కెటింగ్‌కు సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. దీంతో రెమ్‌డెసివిర్‌ను తయారు చేసి పంపిణీ చేయడానికి మైలాన్‌తో పాటు సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటిరో, బీఆర్డీ అనే ఐదు ఫార్మా సంస్థలతో గిలియడ్ నాన్-ఎక్స్‌క్లూజివ్ స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
కరోనా టీకా: మరో కీలక అడుగు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కరోనా మహమ్మారి వ్యాక్సిన్ తయారీలో మరో కీలక ముందడుగు వేసింది. తొలి స్వదేశీ వ్యాక్సిన్ ‘కో వ్యాక్సిన్’ ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలకు అనుమతులను సాధించింది. జూలైలో దేశవ్యాప్తంగా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులిచ్చింది. కోవిడ్ నియంత్రణకు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్), నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)సహకారంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారత్ బయోటెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ ‘కో వ్యాక్సిన్’. కరోనా కట్టడికి మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్‌ను ప్రకటించినందుకు గర్విస్తున్నామని, ఇదొక మైలురాయి లాంటిదని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా ప్రకటించారు. ఈ టీకా అభివృద్ధిలో ఐసీఎంఆర్, ఎన్ఐవి సహకారం కీలక పాత్ర పోషించాయనీ, అలాగే తమ ఆర్‌అండ్‌డి, తయారీ బృందాలు అవిశ్రాంతంగా కృషి చేశాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నఔషధ తయారీదారులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రేసులో భారత్, వ్యాక్సిన్లు, జెనెరిక్ ఔషధాల తయారీలో కీలక పాత్ర పోషించనుంది. టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు 30 గ్రూపులు పనిచేస్తున్నాయని మేలో ప్రభుత్వం తెలిపింది. కాగా భారతదేశంలో 16,475 మంది సహా ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మంది ఈ మహమ్మారికి బలి కాగా, భారతదేశంలో దాదాపు 5.5 లక్షలతో సహా ప్రపంచవ్యాప్తంగా 1.01 కోట్లకు పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. కరోనాకు భారీగా ప్రభావితమైన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. -
మనుషులపై ప్రయోగానికి 'భారత్' వ్యాక్సిన్
న్యూ ఢిల్లీ: కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకున్న కొన్నింటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. త్వరలోనే ఈ లిస్టులో చేరేందుకు భారత్ బయోటెక్ చర్యలను వేగవంతం చేసింది. భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతిచ్చింది. ఇప్పటికే కో వ్యాక్సిన్ పేరుతో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి పరిచింది. దీన్ని మనుషులపై ప్రయోగించేందుకు అనుమతులు లభించడంతో జూలై నుంచి దేశంలో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. (ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ వాక్సిన్) దీన్ని రెండు ఫేజుల్లో చేసుకునేందుకు అనుమతి లభించిన తొలి కంపెనీ భారత్ బయోటెక్ కావడం విశేషం. హైదరాబాద్‌లోని జివోమ్ వ్యాలీలో బయోసేఫ్టీ లెవల్-3తో కలిసి కో వ్యాక్సిన్‌ను అభివృద్ధి పరిచింది. జూలైలో మానవ ప్రయోగాలు మొదలైనందున ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే కరోనా చికిత్స కోసం గ్లెన్‌మార్క్ ‘ఫాబిఫ్లూ’తో పాటు మరో దేశీయ ఔషధ సంస్థ హెటిరో ‘కోవిఫర్’ ఔషధాలకు డీసీజీఐ అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. (కరోనా మందు! ) -
కోవిడ్‌కు మరో ఔషధం..
న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. గ్లెన్‌మార్క్ ‘ఫాబిఫ్లూ’ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే మరో దేశీయ ఔషధ సంస్థ హెటిరో ‘కోవిఫర్’ అనే తమ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని తెలిపింది. పిల్లలు, పెద్దల్లో కోవిడ్ అనుమానిత, నిర్ధారిత కేసుల చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్‌గా రెమ్‌డెసివిర్‌ను ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమతి మంజూరు చేసిందని హైదరాబాద్ సంస్థ హెటిరో ఎండీ వంశీ కృష్ణ బండి ఆదివారం వెల్లడించారు. ‘కోవిఫర్’తో కోవిడ్–19 చికిత్సకు కీలక మలుపు కానుందన్నారు. రెమ్‌డెసివిర్ జనరిక్ వెర్షన్ ‘కోవిఫర్’ అనే పేరుతో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. కోవిఫర్ ఔషధం 100 మిల్లీగ్రాముల వయల్‌లో ప్రవేశపెడుతున్నామనీ, ఈ ఇంజెక్షన్‌ను ఆస్పత్రిలో వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ధర రూ.5–6 వేల మధ్య..: ఒక్కో డోస్ ధర రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్య ఉంటుందని వంశీ కృష్ణ అన్నారు. ప్రస్తుతం రిటైల్‌గా దీనిని విక్రయించడం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం, ఆస్పత్రుల ద్వారానే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ఉత్పత్తిని దేశవ్యాప్తంగా వెంటనే అందుబాటులోకి తెస్తున్నట్లు హెటిరో చైర్మన్ బి.పార్థసారధి రెడ్డి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన గిలియాడ్ సైన్సెస్ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు స్వల్ప, మధ్య ఆదాయ దేశాల్లో దీనిని కోవిడ్ చికిత్సలో వాడేందుకు అనుమతి పొందినట్లు హెటిరో వెల్లడించింది. ఈ ఔషధానికి అమెరికాలో కోవిడ్–19 రోగులకు అత్యవసర ఉపయోగం (ఎమర్జెన్సీ యూజ్) కోసం యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డీఏ) అనుమతినిచ్చింది. కాగా, భారత్‌కు చెందిన మరో ఫార్మా కంపెనీ సిప్లా సైతం రెమ్‌డెసివిర్ ఔషధం తయారీ, విక్రయానికి డీసీజీఐ అనుమతి పొందింది. సిప్లా ఈ ఔషధాన్ని సిప్రెమి పేరుతో ప్రవేశపెట్టనుంది. -
కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్ ఔషధం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 చికిత్సకు ఔషధం తయారు చేసినట్టు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రకటిం చింది. యాంటీ వైరల్ ఔషధం ‘ఫవిపిరవర్’ కోవిడ్ చికిత్సకు బాగా పనిచేస్తోందని, దీనిని ‘ఫాబిఫ్లూ’ అనే బ్రాండ్ నేమ్‌తో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించినట్టు ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ శనివారం వెల్లడించింది. తాము చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో ఫవిపిరవర్ మందు రోగులపై బాగా పనిచేస్తోందని కంపెనీ చైర్మన్, ఎండీ గ్లెన్ సల్దాన్హా తెలిపారు. (ప్రాణవాయువుకే ప్రాధాన్యం ) ఫాబీఫ్లూ టాబ్లెట్ 200ఎంజీ ఒక్కోటి రూ.103కి మార్కెట్లో లభిస్తుందన్నారు. 34 టాబ్లెట్లు ఉన్న స్ట్రిప్ రూ.3,500లకు మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని వివరించారు. మొత్తం 14 రోజులు ఈ మందుని రోగులు వాడాల్సి ఉంటుంది. మొదటి రోజు 1800ఎంజీ పరిణామం కలిగిన ఫాబిఫ్లూని రెండుసార్లు, ఆ తర్వాత నుంచి 14 రోజుల వరకు రోజుకి 800ఎంజీ రోగులు తీసుకోవాలి. అయితే వైద్యుల ప్రిస్క్రిప్షన్ ద్వారానే ఈ ఔషధాన్ని విక్రయిస్తారు. ప్రస్తుతానికి మొదటి నెలలో 82,500 మంది రోగులకి సరిపడా ఫాబిఫ్లూ టాబ్లెట్ల తయారీకి సన్నద్ధంగా ఉన్నామని, దేశంలో వైరస్ పరిస్థితిని బట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళతామని సల్దాన్హా అన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్న వారు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చునని గ్లెన్‌మార్క్ తెలిపింది. (ప్రపంచం పెను ప్రమాదంలో ఉంది) -
కరోనా చికిత్స: మార్కెట్లోకి ఫబిఫ్లూ ఔషదం
న్యూఢిల్లీ: కరోనా చికిత్సలో మెరుగైన ఫలితాలు ఇస్తున్న యాంటి వైరల్ ఔషదం ఫవిపిరవిర్‌ను మార్కెట్లోకి విడుదల చేసినట్టు ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ శనివారం ప్రకటించింది. తమ ఔషదానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం మార్కెటింగ్ అనుమతులు ఇచ్చిందని తెలిపింది. ఫబిఫ్లూ పేరిట ఫవిపిరవిర్ ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసినట్టు వెల్లడించింది. కోవిడ్ బాధితుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వైరస్ తీవ్రత ఉన్నవారికి ఫబిప్లూతో చికిత్స మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పింది. దేశీయంగా కరోనా రోగులకు చికిత్స అందించే మందుల్లో ఫబిఫ్లూ తొలి ఔషదమని కంపెనీ పేర్కొంది. ఇక భారత్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో డీసీజీఐ అప్రూవల్ రావడం శుభపరిణామమని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దాన్హా చెప్పారు. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఆరోగ్య రంగంపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, ఫబిఫ్లూతో ఉపశమనం లభించనుందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం, మెడికల్ కమ్యునిటీతో కలిసి బాధితులకు సేవలందిస్తామన్నారు. (చదవండి: స్మార్ట్‌ఫోన్‌తో కరోనాను గుర్తించవచ్చు!) ఒక్కో టాబ్లెట్ ధర 103 రూపాయలుగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 1800 ఎంజీ మాత్రలు రోజు ఒకటి చొప్పున, 800 ఎంజీ మాత్రలు రోజూ రెండు చొప్పున 14 రోజుల వరకు వైద్యుల సలహామేరకు వాడితే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. కాగా, జపాన్‌లో ఇన్ఫ్లుయంజా వ్యాధిగ్రస్తులకు చికిత్స కోసం తొలుత ఈ ఔషధాన్ని కనుగొన్నారు. కొవిడ్-19 వెలుగుచూశాక చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో బాధితులకు ఫవిపిరవిర్ ఔషధాన్ని ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు. దీనివల్ల బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇదిలాఉండగా.. శనివారం దేశవ్యాప్తంగా మరో 14,516 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,95,048కి చేరింది. తాజాగా 375 మంది మృతి చెందడంతో మొత్తం మరణాలు 12,948 కి చేరాయి. (చదవండి: నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్!) -
ఆన్లైన్లో మందుల విక్రయంపై నిషేధం
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఇకపై మందుల విక్రయాన్ని నిలిపివేయాలని సెంట్రల్ డ్రగ్స్ రెగ్యులేటర్ సంస్థ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇ–ఫార్మసీ సంస్థలన్నీ తక్షణమే ఇంటర్నెట్లో మందుల విక్రయాన్ని నిలిపివేయాలని కోరినట్టు ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారి బుధవారం చెప్పారు. ఇ–ఫార్మసీ సంస్థల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిబంధనల్ని రూపొందించే పనిలో ఉంది. కేంద్ర నిబంధనలు అమల్లోకి వచ్చినంత వరకు ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను నిలిపివేయాలంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వి.జి.సోమాని ఇటీవలే∙ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ కోర్టు తీర్పు అమలయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ డీసీజీఐ అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఆదేశించారు. ఎలా జరిగిందంటే.. చట్టవిరుద్ధంగా, అనుమతుల్లేకుండా ఆన్లైన్లో యథేచ్ఛగా కొనసాగుతున్న మందుల విక్రయానికి అడ్డుకట్ట వెయ్యాలని జహీర్ అహ్మద్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో గత ఏడాది పిల్ వేశారు. ఇష్టారాజ్యంగా ఆన్లైన్లో మందులు కొనుగోలు చేసి వాడడం వల్ల రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రజలు జీవించే హక్కుని కోల్పోతారని, వారి ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిల్‌ను విచారించిన హైకోర్టు 2018 డిసెంబర్లో ఆన్లైన్లో మందుల అమ్మకం నిలిపివేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో జహీర్ మళ్లీ కోర్టుకెళ్లారు. దీనిపై హైకోర్టు కేంద్రానికి, ఇ–ఫార్మసీ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు గత సెప్టెంబర్‌లో స్పందించిన ఇ–ఫార్మసీ కంపెనీలు ఆన్లైన్ విక్రయాలకు ఎలాంటి అనుమతులు, ప్రిస్క్రిప్షన్లు అవసరం లేదని కోర్టుకు చెప్పారు. స్విగ్గీలో ఆహార పదార్థాలు ఎలా ఇంటికి అందిస్తున్నారో తాము కూడా మందుల్ని డోర్ డెలివరీ చేస్తున్నట్టు వింత వాదన వినిపించారు. ఆ కంపెనీలు 8 లక్షలు! ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 కంపెనీలు ఆన్లైన్లో మందులు విక్రయిస్తున్నాయి. వీటికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. దేశవ్యాప్తంగా హోల్‌సేల్, రిటైల్ ఫార్మసీ కంపెనీలు 8 లక్షల వరకు ఉన్నట్టు ఒక అంచనా. ఆన్లైన్ అమ్మకాలతో తమ వ్యాపారాలకు దెబ్బ పడుతోందని ఫార్మసీ కంపెనీలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నాయి. ఇ–ఫార్మసీ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లతో తాము వ్యాపారాలు మూసుకోవాల్సిన పరిస్థితులున్నాయని అంటున్నాయి. స్విగ్గిలో ఆహార పదార్థాల సరఫరా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల డోల్ డెలివరీ ఒకటి కాలేదని కేంద్రం స్పష్టం చేసింది. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కాస్మొటిక్స్ అమ్మకాలు : షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్లలో సౌందర్య ఉత్పత్తులను కొంటున్నారా? అయితే మీకో విభ్రాంతికర వార్త. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి దిగ్గజ ఈ కామర్స్సంస్థలు నకిలీ, కల్తీ కాస్మొటిక్ ఉత్పత్తులను వినియోగదారులకు అంటకడుతున్నాయి. ఈ విషయాలను దేశీయ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) స్వయంగా ప్రకటించింది. ఈ మేరకు పలు ఇ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. దిగుమతి చేసుకున్న బ్రాండ్లతో సహా, పలు సౌందర్య ఉత్పతులను నకిలీవి, కల్తీవి విక్రయిస్తున్నారని మండిపడింది. తమ నోటీసులపై స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. అక్టోబర్ 5-6 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు నిర్వహించిన దాడుల్లో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దేశీయంగా తయారు చేసిన కాస్మొటిక్స్‌ను చెల్లుబాటు అయ్యే ఉత్పత్తి లైసెన్స్ లేకుండానే, అవసరమైన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు లేకుండా దిగుమతి చేసుకున్న వాటిని ఇ-కామర్స్ వేదికలపై విక్రయిస్తున్నారని అధికారులు తేల్చారు. 1940 డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ ప్రకారం లైసెన్స్‌లేని ఉత్పత్తులను విక్రయంచడం నేరమని, తమ నోటీసులపై పదిరోజుల్లోగా సమాధానాలు ఇవ్వాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని డిసిజిఐ ఎస్ ఈశ్వర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. చట్ట ప్రకారం, భారతదేశంలో సౌందర్య సాధనాల దిగుమతి కోసం నమోదు సర్టిఫికేట్ పొందటం తప్పనిసరి, దేశంలో తయారయ్యే అన్ని సౌందర్య సాధనాలు విక్రయానికి సరైన లైసెన్స్ కలిగి ఉండాలి. అంతే కాకుండా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా కాస్మెటిక్స్ ఉండాలి, దాని ప్రతికూల జాబితాలో పేర్కొన్న ఏ ఒక్క పదార్ధాన్ని కలిగి ఉండకూడదు. -
బయోకాన్ ‘క్యాన్సర్’ ఔషధానికి డీసీజీఐ ఆమోదం
న్యూఢిల్లీ: రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే బయోసిమిలర్ ట్రాస్టుజుమాబ్ను బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ భారత్‌లో మార్కెటింగ్ చేసేందుకు ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఆమోదముద్ర వేసింది. ఇది ఔషధ దిగ్గజం రోషెకి చెందిన హెర్సెప్టిన్ ఔషధానికి మొట్టమొదటి బయోసిమిలర్ వెర్షన్ అని బయోకాన్ తెలిపింది. మైలాన్‌తో కలిసి బయోకాన్ దీన్ని అభివృద్ధి చేస్తోంది. క్యాన్మాబ్ పేరుతో ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నుంచి అందుబాటులోకి తేనున్నట్లు బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తెలిపారు. 2012లో అంతర్జాతీయంగా ట్రాస్టుజుమాబ్ అమ్మకాలు 6.4 బిలియన్ డాలర్లు కాగా, దేశీయంగా 21 మిలియన్ డాలర్లు. కెనడా తదితర దేశాల్లో మైలాన్ ఈ ఔషధాన్ని హెర్ట్రాజ్ పేరుతో విక్రయిస్తుంది.