బయోకాన్ ‘క్యాన్సర్’ ఔషధానికి డీసీజీఐ ఆమోదం | Biocon gets nod for breast cancer drug | Sakshi
Sakshi News home page

బయోకాన్ ‘క్యాన్సర్’ ఔషధానికి డీసీజీఐ ఆమోదం

Published Wed, Nov 27 2013 1:28 AM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

బయోకాన్ ‘క్యాన్సర్’ ఔషధానికి డీసీజీఐ ఆమోదం - Sakshi

బయోకాన్ ‘క్యాన్సర్’ ఔషధానికి డీసీజీఐ ఆమోదం

న్యూఢిల్లీ: రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే బయోసిమిలర్ ట్రాస్టుజుమాబ్‌ను బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ భారత్‌లో మార్కెటింగ్ చేసేందుకు ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఆమోదముద్ర వేసింది. ఇది ఔషధ దిగ్గజం రోషెకి చెందిన హెర్సెప్టిన్ ఔషధానికి మొట్టమొదటి బయోసిమిలర్ వెర్షన్ అని బయోకాన్ తెలిపింది.  మైలాన్‌తో కలిసి బయోకాన్ దీన్ని అభివృద్ధి చేస్తోంది. క్యాన్‌మాబ్ పేరుతో ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నుంచి అందుబాటులోకి తేనున్నట్లు బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా తెలిపారు. 2012లో అంతర్జాతీయంగా ట్రాస్టుజుమాబ్ అమ్మకాలు 6.4 బిలియన్ డాలర్లు కాగా, దేశీయంగా 21 మిలియన్ డాలర్లు. కెనడా తదితర దేశాల్లో మైలాన్ ఈ ఔషధాన్ని హెర్‌ట్రాజ్ పేరుతో విక్రయిస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement