Drug trafficking
-
ఇదీ మన సంస్కృతి
డ్రగ్స్, డిజిటల్ డిస్ట్రాక్షన్స్ నుంచి టీనేజర్స్‌ని బయటపడేసే ప్రయత్నానికి పయనీర్‌గా నిలిచింది హైదరాబాద్‌కి చెందిన పద్నాలుగేళ్ల అమ్మాయి.. డిజిటల్ సేఫ్టీ వెల్నెస్, డ్రగ్స్ ఫ్రీ– వెల్నెస్ ఆన్లైన్ కోర్స్‌లను డిజైన్ చేసి! వాటికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సర్టిఫికెట్స్నీ అందిస్తోంది! ఆమె పేరు సంస్కృతి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతోంది.డిజిటల్ డిస్ట్రాక్షన్, డ్రగ్ అడిక్షన్.. అందరినీ కలవరపరుస్తున్నా వాటికి వల్నరబుల్గా ఉంటోంది మాత్రం టీనేజర్సే అని గ్రహించింది సంస్కృతి.. తన వాలంటీరింగ్ అనుభవాల ద్వారా, తోటి పిల్లల ద్వారా. వాటి బారిన వాళ్లెందుకు, ఎలా పడుతున్నారు? ఆ ప్రభావానికిలోనై ఎలా ప్రవర్తిస్తున్నారు? అసలా ఊబిలో పడకుండా ఉండేందుకు ఏం చేయాలి? అని ఆలోచించి, ఓ ప్రశ్నావళిని తయారుచేసి మానసిక వైద్యులు, మానసిక విశ్లేషకులు, సామాజిక వేత్తల ముందుంచింది. వాళ్ల చర్చల సారాన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సహాయంతో ‘డిజిటల్ సేఫ్టీ వెల్నెస్’, ‘డ్రగ్స్ ఫ్రీ వెల్నెస్’ అనే రెండు ఆన్లైన్ కోర్స్‌లను డిజైన్ చేసింది. ఫీడ్‌బ్యాక్ కోసం వంద మంది టీనేజ్ స్టూడెంట్స్‌కి ఆ కోర్స్ మాడ్యూల్స్‌ని చూపించింది. కంటెంట్ బాగుంది, కానీ చెప్పే విధానం ఆసక్తికరంగా లేదన్న అభిప్రాయాలు వచ్చాయి. సమీక్షించుకుంటే తనకూ అదొక కౌన్సెలింగ్లా అనిపించింది. టీనేజర్స్కెప్పుడూ ఎదుటివాళ్లు జడ్జ్ చేస్తారేమోనన్న భయం ఉంటుంది. ఆ జంకుతో మనసువిప్పి మాట్లాడరు. అంతేకాదు వద్దన్నదే చేయాలన్న కుతూహలమూ జాస్తే! ఈ కోణంలోనూ ఆలోచించి, మొత్తం కోర్స్ మాడ్యూల్స్‌ని నిజ జీవిత సంఘటనలకు అన్వయించి చాట్ ఫార్మాట్లో రీడిజైన్ చేసింది. వాటికి ఆన్లైన్ ΄్లాట్‌ఫామ్ కావాలి కాబట్టి అక్క ప్రకృతి సహాయంతో ‘క్రియేట్ ఎడ్యుటెక్’ అనే వెబ్‌సైట్‌ను స్టార్ట్‌చేసింది. ఈ మొత్తం ప్రక్రియకు ఎనిమిది నెలలు పట్టింది. ఆఫ్‌లైన్ లోనూ సేవలందించడానికి ‘ఎడిస్టిస్ ఫౌండేషన్ ’ అనే స్వచ్ఛంద సంస్థతో పనిచేస్తోంది సంస్కృతి. యాప్స్ అవసరం లేని ఈ కోర్సులకు మొబైల్ డేటా ఉంటే చాలు. వీటిని పూర్తి చేసినవారికి సర్టిఫికెట్స్ ఇవ్వడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు స్కూల్స్, కాలేజీల్లో ఈ కోర్సులు లాంచ్ అయ్యాయి. ఇప్పటివరకు పదివేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కోర్స్‌లను సర్కారు బడుల్లోని విద్యార్థులకు ఉచితంగా అందిచాలనేది సంస్కృతి లక్ష్యం. కార్పొరేట్ స్కూల్స్‌కి మాత్రం నామమాత్రపు రుసుముంటుందని చెబుతోంది. టీనేజర్స్‌కి ‘రెసిస్టెన్స్.. రెజిలియెన్స్’ కల్పించడమే ఈ కోర్సుల ముఖ్య లక్ష్యం. డిజిటల్ డిస్ట్రాక్షన్, డ్రగ్స్ అడిక్షన్.. దేన్నయినా అవగాహనతో తిరస్కరించడం మొదటిదైతే, ఆ అడిక్షన్ నుంచి విజయవంతంగా బయటకు వచ్చి, ఆరోగ్యకర జీవితాన్ని గడపడం రెండవది. ఆ వలలో పడకుండా ఉండటమే కాదు, అలాంటి వాతావరణాన్ని వ్యాపించకుండా చూసే బాధ్యతనూ ఎలా తీసుకోవాలో కూడా చేతన కల్పిస్తాయీ కోర్సులు అని చెబుతుంది సంస్కృతి.నేపథ్యం.. అంత చిన్న వయసులో ఆమె చేసిన ఇంత పెద్ద ప్రయత్నానికి ఆమె నేపథ్యం చాలా తోడ్పడింది. అందులో తల్లిదండ్రులు సుమతి(ఐజీ, ఇంటెలిజెన్స్, తెలంగాణ), శ్రీనాథ్ (బిజినెస్‌మన్), తాతయ్య తిరుపతి రెడ్డి, అక్క ప్రకృతిల పాత్ర ఎంతో ఉంది. ఎలాగంటే.. సుమతి సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నప్పుడు సైబర్ వరల్డ్‌లో జరుగుతున్న వాటి గురించి ఇంట్లో చర్చించేవారు. వాటికి చెవొగ్గేది సంస్కృతి. అవి అర్థమయ్యీ.. కాక ఆ చిన్నబుర్రలో కలవరం రేపేవి. సైబర్ సెక్యూరిటీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ కాస్తున్న పహారా, దానిమీద పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల గురించి అమ్మ ద్వారా తెలుసుకుంది. ఆ ఎన్జీవోల్లో వాలంటీరింగ్ మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఎంతోమందిని కలిసింది, మాట్లాడింది. పెద్దవాళ్లు సమస్యల్ని ఎలా చూస్తున్నారు, ఎలా పరిష్కరిస్తున్నారో పరిశీలించింది. అలా కూతురికి సామాజిక స్పృహను కలిగించి, సామాజిక బాధ్యతనూ తెలియజేసింది సుమతి.నాన్న.. శ్రీనాథ్.. ఐఐఎమ్ అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్. బిజినెస్‌లో వినూత్న ఆలోచనలను ఆయన ప్రోత్సహస్తున్న తీరు, అందిస్తున్న సపోర్ట్‌ను గమనించేది సంస్కృతి. కొత్త విషయాలు, సరికొత్త స్కిల్స్ గురించి ఆయన ఆన్ లైన్ లో టీచ్ చేస్తుంటే, కరెంట్ అఫైర్స్‌ను ‘వాట్–వై–హౌ’ పద్ధతిలో వివరిస్తుంటే శ్రద్ధగా వినేది. వాటన్నిటినీ తన వాలంటీరింగ్లో అమలుచేసేది. అలా తండ్రి ఆంట్రప్రెన్యూర్షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కూడా ఒంటబట్టించుకుంది సంస్కృతి. తాతయ్య.. ఆంజనేయుడిని పరిచయం చేసి!తిరుపతిరెడ్డి ప్రతిరోజూ మననవరాలికి పురాణేతిహాసాల్లోని ఒక్కో పాత్రను పరిచయం చేసేవారు. ప్రతి పాత్రకు సహానుభూతి, సహాయం చేసే గుణం, జడ్జ్ చేయని తత్వాలను అద్దుతూ ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని వర్ణించేవారు. అవన్నీ ఆ అమ్మాయి మనసులో ముద్రపడిపోయాయి. ఆ లక్షణాలతో పాటు, తెగువ, అచీవ్మెంట్, డెడికేషన్ కూడా ఉన్న ఆంజనేయుడు ఆమెకు ఫేవరిట్ అయ్యాడు. ఆ పాత్రలో తనను చూసుకోవడం మొదలుపెట్టింది. చదువుతో పాటు ఆర్ట్, మ్యూజిక్ వంటి కళల్లోనూ సంస్కృతి ప్రతిభ మెచ్చుకోదగ్గది. పోటీల్లో మనవరాలు ప్రైజ్ తెచ్చుకున్న ప్రతిసారి చాకోబార్తో ఆమెనుప్రోత్సహిస్తునే ‘గెలుపు కన్నా కూడా మన పనితో ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నామనే దాని మీద దృష్టి పెట్టాల’ని చెప్పేవారు. ఆ విలువనే తన ఫిలాసఫీగా మలచుకుంది సంస్కృతి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అక్క ప్రకృతి, సైకాలజీ స్టూడెంట్. చెల్లికి మంచి ఫ్రెండ్, గైడ్! సంస్కృతి ఈ కోర్స్‌లను డిజైన్ చేయడంలో ఆమె సహాయం ఎంతో ఉంది. టెన్త్ బర్త్‌డేకి అమ్మ, నాన్న ఇచ్చిన గిఫ్ట్‌నూ సంస్కృతి ఓ టర్నింగ్ పాయింట్‌గా చెబుతుంది. అదేంటంటే..ఒక నోట్ బుక్‌లో అమ్మ, నాన్న ‘నీ జీవితం ఈ ఎమ్టీ–బుక్ లాంటిది. నీ గురించి ఎవరూ ఏదీ రాయరు. నువ్వేం నేర్చుకుంటున్నావ్, నీకోసమే కాకుండా, ఇతరుల కోసమూ నువ్వేం చేయగలుగుతున్నావ్ అన్న క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ దొరికినప్పుడల్లా ఒక్కో పేజీ ఫిల్ చేయాలి. అలా ఈ పుస్తకం నీ విశిష్ట వ్యక్తిత్వంతో నిండిపోవాలని ఆశిస్తూ అమ్మ.. నాన్న!’ అని రాసిన నోట్. ఈ ఆన్లైన్ కోర్స్ల డిజైన్ ఆ పుస్తకంలోని మొదటి పుటకు శుభారంభమని చెప్పపచ్చు. ఇలాంటి ఇంకెన్నో ప్రయత్నాలతో ముందుకు సాగాలనుకుంటున్న ఆ చిరంజీవికి ఆల్ ద వెరీ బెస్ట్! వై, వై నాట్, వాట్, హూ, వేర్, వెన్ లాంటి ఇంగ్లిష్ డబ్ల్యూసే నా బెస్ట్ ఫ్రెండ్స్. వాటితోనే నా లెర్నింగ్, గ్రోత్, అచీవ్మెంట్! ఏబీసీడీఈ.. అంటే అంబీషస్, బోల్డ్, క్రియేటివ్ అండ్ క్యూరియస్, డిటర్మైండ్, ఎంపథిటిక్గా నన్ను నేను డిస్క్రైబ్ చేసుకుంటాను. శరీర నిర్మాణంలో తేడాలుండొచ్చు కానీ, చేసే పనికి, ప్రయత్నానికి బాయ్స్, గర్ల్స్ అనే తేడా ఉండదని, పదిమందికి మేలు చేయగలగడమే నిజమైన అచీవ్మెంట్ అని చె΄్తారు మా పెద్దవాళ్లు. ఆ స్ఫూర్తితోనే నేనీ కోర్స్‌లను డిజైన్ చేశాను!’– సరస్వతి రమ, ఫొటోలు @ నోముల రాజేష్‌రెడ్డి -
మరణశిక్ష నుంచి ఎట్టకేలకు విముక్తి
మనీలా: డ్రగ్స్ తరలించారన్న ఆరోపణలపై అరెస్టయి గత 15 సంవత్సరాలుగా జైళ్లో మగ్గిపోతున్న అమాయక ఫిలిప్పీన్స్ మహిళకు ఎట్టకేలకు ఇండోనేసియా జైలు నుంచి తాత్కాలిక విముక్తి లభించింది. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇకపై ఆమె జీవితకాల జైలు శిక్షను ఇండోనేసియాకు బదులు సొంతదేశం ఫిలిప్పీన్స్‌లోని మహిళల కారాగా రంలో అనుభవించనుంది. ఇండోనేసియా విధించిన శిక్ష ప్రకారం 2015 ఏడాదిలోనే ఫిలిప్పీన్స్ పోలీసుల తుపాకీ గుళ్లకు బలికావాల్సిన మేరీ జేన్ వెలోసో అనూహ్యంగా ఆ దారుణ శిక్ష అమలు నుంచి తప్పించుకున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో తనకు క్షమాభిక్ష పెట్టాలని త్వరలో దేశాధ్యక్షుడిని వేడుకుంటానని 39 ఏళ్ల మేరీ చెప్పారు. బుధవారం ఉదయం ఆమె ఇండోనేసియా నుంచి బయల్దేరి స్వదేశం ఫిలిప్పీన్స్‌లోని మనీలా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తమ తల్లి రాకతో ఇద్దరు కుమారులు, మేరీ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎనిమిది మందిపై బుల్లెట్ల వర్షం2010లో బతుకుదెరువు కోసం పనిమనిషిగా ఇండోనేసియాలో అడుగుపెట్టిన ఆమెను ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు అరెస్ట్‌చేశారు. వెంట తెచ్చిన సూట్‌కేసులో 2.6 కేజీల నిషేధిత హెరాయిన్ మాదకద్రవ్యం ఉండటంతో ఆమెపై కఠిన డ్రగ్స్ ట్రాఫికింగ్ చట్టాలు మోపి మరణశిక్ష విధించారు. ఆ సూట్‌కేసుతో తనకేం సంబంధం లేదని, ఇండోనేసియాలో ఇంటి పనిమనిషిగా పని కుదిర్చిన ఏజెంట్ మారియా క్రిస్టినా సెర్గీ ఆ సూట్‌కేసు ఇచ్చాడని, అందులో ఏముందో తనకు నిజంగా తెలీ దని ఆమె ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. ఐదే ళ్ల తర్వాత షూట్ చేసి చంపేయాలని తీర్పు వెలువడింది. అక్రమంగా డ్రగ్స్ తెచ్చారంటూ మేరీసహా ఆస్ట్రే లియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఘనా, నైజీరియాలకు చెందిన మొత్తం తొమ్మిది మందిని 2015 ఏడాదిలో ఒక ద్వీపకారాగారానికి తీసుకెళ్లారు. మేరీ తప్ప మిగతా ఎనిమిది మందిపై ఫైరింగ్ స్క్వాడ్ పోలీసులు తుపాకీ గుళ్ల వర్షం కురిపించి చంపేశారు. ఈమెను కూడా చంపేసేవారే. కానీ ఈమెను ఇండోనేసియాకు పంపిన ఏజెంట్ సెర్గీ కేవలం రెండ్రోజుల ముందు ఫిలిప్పీన్స్‌లో అరెస్టవడం, తానే ఆమెకు ఆ సూట్‌కేసు ఇచ్చి పంపాన ని ఒప్పుకోవడంతో ఈమె శిక్ష అమలు ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. అయితే ఎవరు తెచ్చినా డ్రగ్స్ తమ భూభాగానికి తేవడం మాత్రం నేరమే కాబట్టి ఈమెను నిర్దోషిగా వదిలేది లేదని ఇండోనేసియా కరాఖండీగా చెప్పింది. దీంతో మేరీ విడుదలకు ఫిలిప్పీన్స్‌లో పెద్ద ఉద్యమమే మొదలైంది. చివరకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఖైదీల బదిలీ ఒప్పందం చేసుకుంది. మేరీ మిగతా శిక్షాకాలం సొంత దేశంలో అనుభవించేలా డీల్ కుదిరింది. ఈ ఒప్పందం మేరకు ఆమెను ఇండోనేసియా బుధవారం వదిలేసింది. -
భార్యాభర్తల డ్రగ్స్ దందా!
సాక్షి, సిటీబ్యూరో: ఈశాన్య రాష్ట్రమైన అసోం నుంచి మాదకద్రవ్యం ఏంఫెటమైన్తో నగరానికి వచ్చి, విక్రయానికి ప్రయత్నించినా భార్యా భర్తల్ని వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షలు విలువైన 254 గ్రాముల డ్రగ్, ద్విచక్ర వాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర శనివారం వెల్లడించారు. అసోంలోని లాల్పానీ గ్రామానికి చెందిన ఆతిఫ్ అస్లం ఖాన్ గతంలో నగరానికి వలసవచ్చి నిమ్స్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. దాదాపు ఐదారేళ్లు ఇక్కడ ఉండటంతో ఇతడిలా వచి్చ, సిటీలో నివసిస్తున్న పలువురు అసోం వారితో పరిచయం ఏర్పడింది. అసోంలోని మొరాంగా గ్రామానికి చెందిన సుభానీ బేగంను వివాహం చేసుకున్న అస్లం ఖాన్ స్వస్థలానికి వలసవెళ్లాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం మార్గాలు అన్వేషించాడు. అసోంలో తయారయ్యే మాదకద్రవ్యం ఏంఫెటమైన్ను ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది వినియోగిస్తూ ఉంటారు. దీంతో ఆ డ్రగ్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్‌పెడ్లర్ ప్రణోయ్ దాస్‌కు రూ.2 లక్షలు చెల్లించిన అస్లం ఖాన్ 300 గ్రాముల ఏంఫెటమైన్ ఖరీదు చేశాడు. భార్య సుభానీ బేగంతో కలిసి మాదకద్రవ్యం తీసుకుని అస్లం ఖాన్ గత నెల్లో రైలు మార్గంలో నగరానికి చేరుకున్నాడు. బేగంపేటలోని ప్రకాష్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఓ బైక్ ఖరీదు చేశాడు. దీనిపై సంచరిస్తూ నగరంలో ఉన్న అసోం వాసులకు ఏంఫెటమైన్ విక్రయించడం మొదలెట్టాడు. డిమాండ్‌ను బట్టి రేటు నిర్ధారిస్తూ తమ వద్ద ఉన్న 300 గ్రాములు అమ్మడం ద్వారా రూ.25 లక్షలు సంపాదించాలని, ఆ మొత్తంతో స్వస్థలానికి తిరిగి వెళ్లిపోవాలని పథకం వేశారు. ఇప్పటి వరకు 11 మంది అసోం వాసులకు 46 గ్రాములు విక్రయించారు. వీరి దందాపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ ఇ.జంగయ్య నేతృత్వంలో ఎస్సై జి.నవీన్ తమ బృందంతో వలపన్నారు. శనివారం ఇద్దరితో పాటు 11 మంది వినియోగదారులను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని బేగంపేట పోలీసులకు అప్పగించారు. -
అండమాన్‌లో 6 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత
పోర్ట్ బ్లయర్: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత తీర రక్షక దళం(ఐసీజీ) ఈ నెల 23న భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఓ పడవలో అక్రమంగా రవాణా అవుతున్న 6 వేల కిలోల నిషేధిత మెథాంఫెటమైన్ అనే మాదక ద్రవ్యంతోపాటు ఆరుగురు మయన్మార్ దేశస్తులను పట్టుకుంది. రెండు కిలోల చొప్పున బరువున్న 3 వేల ప్యాకెట్లలో ఉన్న ఈ డ్రగ్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలోనే ఉంటుందని సోమవారం అధికారులు వెల్లడించారు. పోర్ట్ బ్లయర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని బారెన్ ఐలాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న మత్స్యకారుల పడవను గస్తీ విమానంలో గమనించి, తీరానికి తీసుకువచ్చామన్నారు. మన దేశంతోపాటు పొరుగుదేశాలకు చేరవేసేందుకు దీనిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. -
కెనడాలో డ్రగ్స్ సూపర్‌ల్యాబ్ గుట్టురట్టు
వాంకోవర్: కెనడాలో మాదక ద్రవ్యాల తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏకంగా 485 మిలియన్ డాలర్ల (రూ.4,076 కోట్లు) కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రయోగశాలలో డ్రగ్స్ తయారు చేసి, విక్రయిస్తున్న భారత సంతతి వ్యాపారవేత్త గగన్‌ప్రీత్ రంధవాను అరెస్టు చేశారు. కెనడాలో బ్రిటిష్ కొలంబియాలోని కామ్లూప్స్కు 50 కిలోమీటర్ల దూరంలో ఫాల్క్ ల్యాండ్ అనే గ్రామీణ ప్రాంతంలో ఈ సూపర్ ల్యాబ్ ఏర్పాటుచేశారు. ఇక్కడ ఫెంటానైల్, మెథ్, కొకైన్, కన్నబీస్ తదితర డ్రగ్స్ పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. సూపర్ ల్యాబ్ గురించి సమాచారం అందుకున్న రాయల్ కెనడియన్ మౌంట్ పోలీసులు దాడి చేశారు. అక్కడి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అత్యాధునికంగా ఉన్న ల్యాబ్‌లో నిషేధిత మాదక ద్రవ్యాలు తయారవుతుండడం చూసి అవాక్కయ్యారు. ఈ దాడిలో 500 కిలోలకుపైగా డ్రగ్స్ లభించాయి. అంతేకాదు కొన్ని ఆయుధాలు, పేలుడు పదార్థాలు సైతం లభ్యమయ్యాయి. ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ల్యాబ్ నిర్వహణలో, డ్రగ్స్ దందాలో గగన్‌ప్రీత్ రంధవా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తేల్చారు. -
మస్తాన్ సాయి అరెస్ట్‌తో కదులుతున్న డ్రగ్స్ డొంక
సాక్షి, హైదరాబాద్: డ్రగ్ పెడ్లర్ రావి మస్తాన్ సాయి కేసులో సంచనల విషయాలు వెలుగుచూస్తున్నాయి. గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి అరెస్ట్‌తో డ్రగ్స్ డొంక కదులుతోంది. హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా, కస్టమర్ల వ్యవహారంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. తాజాగా మస్తాన్ సాయి స్నేహితురాలు ప్రీతి వ్యవహారం బయటకొచ్చింది. ప్రీతి, ఉదయ్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియోలు బయటపడ్డాయి. అమ్మాయితో మస్తాన్‌సాయి అసభ్యంగా ఫొటోలు, వీడియోలు రికార్డు చేసినట్లు తేలింది. డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న సమయంలో ప్రీతి, ఉదయ్ వీడియోలు తీసుకోగా.. డ్రగ్స్ కవాలి, తీసుకురావలిన వాట్పాప్‌లో ప్రీతి చాటింగ్ చేసినట్లు వెల్లడైంది.కాగా గుంటూరులో సోమవారం రావి మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం అతడికి హైదరాబాద్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్, గుంటూరు, విజయవాడల్లో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి సెల్ ఫోన్లో భారీగా పలువురు యువతుల ప్రైవేటు వీడియోలు, ఫొటోలు ఉన్నట్లు సమాచారం. వాటిని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మస్తాన్ సాయి తండ్రి రావి రామ్మోహనరావు గుంటూరులోని మస్తానయ్య దర్గాకు వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నారు. వీరి కుటుంబానికి ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు అడ్డుపెట్టుని మస్తాన్ సాయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.గతంలోనూ అతడిపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. కాగా కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంలో కూడా మస్తాన్ సాయి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. అప్పట్లో హైదరాబాద్ పోలీసులు కొందరిని అరెస్టు చేయగా..వారిలో వరలక్ష్మి టిఫిన్స్ నిర్వాహకుడు కూడా ఉన్నారు. వారితో కలిసే మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారాలు నడిపేవారని తేలింది. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలిస్తుండగా సెబ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలోనూ మస్తాన్‌సాయి పోలీసుల నుంచి తప్పించుకుపోయాడు. అప్పటి నుంచి పోలీసులకు పట్టుబడకుండా తిరుగుతున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు పోలీసులకు చిక్కాడు. సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్‌సాయి పేరు వెలుగులోకి వచ్చింది. -
మెక్సికో డ్రగ్ లార్డ్ అరెస్ట్
వాషింగ్టన్: మెక్సికోలో మాదకద్రవ్యాల వ్యాపారంతో వేలకోట్ల రూపాయల నేరసామ్రాజ్యాన్ని విస్తరించిన డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడా గార్షియా ఎట్టకేలకు అమెరికా పోలీసులకు చిక్కాడు. 76 ఏళ్ల జంబాడా వాస్తవానికి విమానంలో వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా అతనికి తెలీకుండా చాకచక్యంగా ప్రైవేట్ విమానాన్ని అమెరికాలో ల్యాండ్ చేశారు. గురువారం టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసో సిటీ శివారులోని చిన్న ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన అదే విమానంలో ఉన్న డ్రగ్ లార్డ్ ఎల్‌చాపో కుమారుడు జోక్విన్ ‘ఎల్ చాపో’ గుజ్మాన్(38)నూ పోలీసులు అరెస్ట్‌చేసి గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. దశాబ్దాలుగా జంబాడా అరెస్ట్‌కోసం అమెరికా ప్రయతి్నస్తోంది. అతని జాడ చెప్తే రూ.125 కోట్ల నజరానా ఇస్తామని గతంలో ప్రకటించింది. ‘అమెరికాలోకి వందల కోట్ల డాలర్ల విలువైన ఫెంటానిల్, మెథాంఫెటమైన్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ అమెరికా యువతను మాదకద్రవ్యాల మత్తులో ముంచేసిన నేరానికి వీరికి కఠిన శిక్ష పడనుంది’ అని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ అన్నారు. రియల్ఎస్టేట్ వ్యాపార నిమిత్తం వెళ్తున్నామని అబద్దం చెప్పి జంబాడాను జోక్విన్ గుజ్మానే విమానం ఎక్కించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అత్యంత హింసాత్మక, శక్తివంత ‘ సినోలా కార్టెల్’ మాదకద్రవ్యాల అక్రమ తయారీ, ఎగుమతికి ప్రపంచ కేంద్రస్థానంగా నిలిచే మెక్సికోలో అత్యంత హింసాత్మక, శక్తివంతమైన డ్రగ్స్ ముఠాల్లో సినోలా కార్టెల్ కూడా ఒకటి. దీనిని ఎల్ చాపో గుజ్మాన్, జంబాడా, మరొకరు సంయుక్తంగా స్థాపించి డ్రగ్స్‌ను విచ్చలవిడిగా అమ్మడం మొదలెట్టారు. వందల కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగిన జాక్విన్ అర్చివాల్డో గుజ్మాన్ లోయెరా (ఎల్‌చాపో)ను 2019లో మెక్సికో ప్రభుత్వం అరెస్ట్‌చేసి అమెరికాకు అప్పగించడంతో అక్కడే జీవితకాలకారాగార శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో ఎల్ చాపో కుమారులు రంగంలోకి దిగి అక్రమ వ్యాపారాన్ని మరింత విస్తరించారు. అమెరికా సహా విదేశాలకు సరకు అక్రమ రవాణా మొత్తం జంబాడా కనుసన్నల్లో జరుగుతోంది. ప్రత్యర్థి డ్రగ్స్ ముఠా సభ్యులు చిక్కితే వారి తల నరకడం, చర్మం ఒలిచేయడం, శరీరాన్ని ముక్కలుగా నరకడం వంటి హేయమైన నేరాలకు పాల్పడటం అక్కడి ముఠాలకు మామూలు విషయం. -
ఏపీ పరువు తీసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి : తెలంగాణ ప్రభుత్వంతో చర్చల పేరుతో వీసమెత్తు ప్రయోజనాన్ని కూడా సాధించలేకపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రజల పరువు తీశారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం సంగతి అటుంచితే అసలు రాష్ట్రంలో పెద్దగా లేని డ్రగ్స్.. ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నట్లు ఒప్పుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు బృందం తెలంగాణ రాష్ట్రంతో చర్చించేందుకు వెళ్లిన ఉద్ధేశం ఏమిటి? చివరికి ఏం సాధించారు? వంటి ప్రశ్నలు సాధారణ ప్రజలు నుంచి వస్తున్నాయి. ఒక్క విభజన సమస్య గురించి కూడా గట్టిగా మాట్లాడకుండా డ్రగ్స్ గురించి చర్చించడం, హైదరాబాద్‌లో ఉన్న డ్రగ్స్ దందా అంతటికీ ఏపీయే మూలమని స్వయంగా అంగీకరించడం విడ్డూరం. టీడీపీ రెండు రోజుల నుంచి రెండు రాష్ట్రాల మధ్య చర్చలు పేరుతో నానా హడావుడి చేసింది రాష్ట్రం పరువు తీసేందుకేనా అనే చర్చ మొదలైంది. బాబు గురించి అంత బిల్డప్ ఇచ్చింది ఇందుకేనా?విభజన సమస్యల పరిష్కారానికి చంద్రబాబు చొరవ తీసుకని తన శిష్యుడిగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చర్చలకు వెళుతున్నారని, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని టీడీపీ శ్రేణులు ఊదరగొట్టాయి. ఎల్లో మీడియా అయితే చంద్రబాబు దార్శనికత, సుదీర్ఘ అనుభవంతో రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారంటూ బీభత్సమైన బిల్డప్ ఇచ్చింది. కానీ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన నెలకొన్న ప్రధాన సమస్యల గురించి లోతుగా చర్చించలేదు. హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్‌పై, అక్కడ డ్రగ్స్ సంస్కృతి పెరగడానికి ఏపీలో గంజాయి ఉత్పత్తి అవడమే కారణమని చర్చించడం విస్మయ పరుస్తోంది. స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉమ్మడి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఒప్పుకోవడం దారుణం అని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేరుగా ఏపీ పేరు చెప్పకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని చెప్పగా, టీడీపీ మంత్రి అనగాని మాత్రం ఏపీలో డ్రగ్స్ ఉత్పత్తి అయి హైదరాబాద్‌కి వస్తున్నాయని.. తమ రాష్ట్రంలో 8వ తరగతి పిల్లల స్కూల్ బ్యాగులో గంజాయి దొరుకుతోందని చెప్పి రాష్ట్రం పరువును తెలంగాణ రాష్ట్ర బజారులో నిలబెట్టారు. హైదరాబాద్ డ్రగ్ సంస్కృతికి ఏపీకి సంబంధం ఏమిటి? హైదరాబాద్ డ్రగ్ కల్చర్‌కి, ఏపీలో అక్కడక్కడా దొరుకుతున్న గంజాయికి సంబంధమే లేదని అనేకసార్లు తేటతెల్లమైంది. హైదరాబాద్‌లో కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ విరివిగా దొరుకుతాయి. ఏపీలో వాటి జాడే లేదు. కొకైన్, హెరాయిన్ వంటి విదేశాల నుంచి దిగుమతయ్యే డ్రగ్స్ కూడా ఏపీ నుంచే వస్తున్నాయని స్వయంగా మంత్రి చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో గంజాయి పెరిగిందని ఎప్పటి నుంచో చేస్తున్న దుష్ప్రచారాన్నే పక్క రాష్ట్రంతో చర్చల్లో కూడా వల్లె వేయడం రాజకీయ స్వప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో గంజాయి ఉందని చెప్పడం.. పక్క రాష్ట్రంలోని వేదికపై అంగీకరించడం ఆత్మహత్యాసదృశంగా మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని మూసీలో కలిపేసిన చంద్రబాబు చర్చల ద్వారా ఏపీకి సంబంధించి ఎటువంటి సానుకూలత సాధించలేకపోగా, మన గౌరవానికి భంగం కలిగించేలా చంద్రబాబు, ఆయన మంత్రుల బృందం వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఏపీలోని పోర్టులు, టీటీడీ ఆస్తుల్లో వాటా ఇవ్వాలని, పోలవరం విలీన గ్రామాలను తిరిగి ఇచ్చేయాలని తెలంగాణ పెట్టిన డిమాండ్లపైనా నోరు మెదపక పోవడం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినట్లేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రేవంత్‌రెడ్డి, చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తప్ప రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఈ చర్చలు జరిగినట్లు ఎక్కడా కనిపించలేదంటున్నారు. అందులోనూ రేవంత్ పైచేయి సాధించి ఏపీ నెత్తిన డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నారనే అపవాదు మోపారు. దీనికి అంగీకరించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని హైదరాబాద్ మూసీ నదిలో కలిపేశారనే సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.గంజాయి దందాపై గత సర్కారు ఉక్కుపాదంరాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలని అప్పటి సీఎం వైఎస్ జగన్ పోలీసు యంత్రాంగాన్ని విస్పష్టంగా ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను నెలకొల్పి విస్తృత అధికారాలు కల్పించారు. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ పరివర్తన్’ అనే కార్యక్రమం ద్వారా గంజాయి సాగు వల్ల అనర్థాలపై ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో విస్తృత అవగాహన కల్పించారు. ఆ తర్వాత శాటిలైట్ ఫొటోలతో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు పాంత్రాన్ని జీయో మ్యాపింగ్ చేశారు. ప్రత్యేక యంత్రాలతో రెండు దశల్లో ఏకంగా 11,550 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఏకంగా 4.50 కోట్ల గంజాయి మొక్కలను తొలగించి దహనం చేశారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, ఇతర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. మొత్తం 4.50 లక్షల కేజీల గంజాయి, 131 లీటర్ల ద్రవ రూప గంజాయిని స్వాధీనం చేసుకుంది. 13,210 మందిని అరెస్ట్ చేయడంతోపాటు 2,950 వాహనాలను జప్తు చేసింది. గిరిజనులకు ప్రత్నామ్నాయం చూపింది. రూ.144కోట్లతో ఆపరేషన్ నవోదయం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. వివిధ పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. కాగా, గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్ఛగా కొనసాగింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీ కీలక నేతలు నర్సీపట్నం కేంద్రంగా గంజాయిసిండికేట్ను నిర్వహించారు. -
ముంబైలో రూ.3 కోట్ల డ్రగ్స్ సీజ్
ముంబై: గత నెల రోజుల వ్యవధిలో రూ.3.25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్‌ను స్వా«దీనం చేసుకుని, 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీస్ శాఖ యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) ఆదివారం తెలిపింది. సహర్ గ్రామం, నల్లసొపార, శాంటాక్రుజ్, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలకు చెందిన పెడ్లర్ల నుంచి హెరాయిన్, గంజాయి, ఎండీని స్వా«దీనం చేసుకున్నట్లు వివరించింది. 2023లో 106 కేసుల్లో 229 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి, రూ.53.23 కోట్ల డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు ఏఎన్సీ వివరించింది. -
Narcotics Control Bureau: తమిళ నిర్మాత సూత్రధారిగా డ్రగ్స్ రాకెట్
న్యూఢిల్లీ: తమిళ సినీ నిర్మాత సూత్రధారిగా ఉన్న భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేసియాల్లో విస్తరించిన డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. ఢిల్లీలో ఇటీవల జరిపిన సోదాల్లో డ్రగ్స్ తయారీకి వాడే 50 కిలోల సూడో ఎఫెడ్రిన్ రసాయనాన్ని స్వాధీనం చేసుకుని, తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరు డ్రగ్స్‌ను ఓడలు, విమానాల్లో హెల్త్ మిక్స్ పౌడర్, కొబ్బరి పొడిలో డబ్బాలో దాచి రవాణా చేస్తున్నట్లు తేలిందని పేర్కొంది. కిలో రూ.1.5 కోట్లుండే సూడో ఎఫెడ్రిన్‌తో మెథాంఫెటమైన్ అనే ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్‌ను తయారు చేస్తారు. న్యూజిలాండ్ కస్టమ్స్, ఆస్ట్రేలియా పోలీసుల సమాచారం మేరకు డ్రగ్స్ రాకెట్‌పై విచారణ చేపట్టినట్లు ఎన్సీబీ వివరించింది. ఇవి ఢిల్లీ నుంచే రవాణా అవుతున్నట్లు అక్కడి బసాయ్దారాపూర్లోని గోదాం నుంచి వస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. పట్టుబడిన వారిని విచారించగా గత మూడేళ్లలో రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడో ఎఫెడ్రిన్‌ను 45 దఫాలుగా పంపించినట్లు తేలింది. సదరు నిర్మాత పరారీలో ఉన్నట్లు వివరించింది. అతని కోసం గాలింపు ముమ్మరం చేశామని తెలిపింది. -
జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కోసం ప్రత్యేక పరికరాలు న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల ఆంక్షలు విధించారు. డ్రగ్స్‌ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదీ చదవండి: Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్! -
కట్టు తప్పితే కఠిన చర్యలే !
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని, లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్ట మైన హెచ్చరికలు జారీ చేసింది. శాసనసభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏమాత్రం నిర్లిప్తత, నిర్లక్ష్యంగా ఉండరాదని, మైండ్‌సెట్ మార్చుకోవా లని తేల్చి చెప్పింది. ఎన్నికల్లో నామమాత్రంగానే డబ్బు, మద్యం జప్తు చేస్తున్నారని, చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. డ్రగ్స్ రవాణాకు హైదరాబాద్ ప్రధానమార్గంగా మారిందని, గోవా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గుజరాత్‌కు పెద్దఎత్తున డ్రగ్స్ రవాణా జరుగుతుంటే ఎందుకు పట్టుకోవడం లేద ని పోలీస్‌శాఖను ప్రశ్నించింది. శాసనసభ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించడానికి రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎలక్ష న్ కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన బృందం బుధవారం రెండోరోజు నగరంలోని ఓ హోటల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల కలె క్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లతో సమీక్ష నిర్వహించింది. గుజరాత్, మహారాష్ట్రలో టన్నుల కొద్దీ డ్రగ్స్ పట్టుపడితే, ఇక్కడ మాత్రం 10, 20 గ్రా ము లే పట్టు బడడం పట్ల అనుమానాలు వ్యక్తం చేసింది. మాఫియాతో కుమ్మక్కయ్యారా? అని సూటి గా ఓ ఎస్పీని ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక పై ని ఘా ఉంచి జప్తు చేస్తామని ఆ ఎస్పీ వివరణ ఇచ్చు కున్నారు. ఓటర్లకు బంగారం, వెండి, వస్త్రాలు వంటి కానుకలు పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలున్నా, ఎందుకు జప్తు కావడం లేదని ప్రశ్నించింది. సిద్దిపేటలో నగదు దొరకలేదా ? గత శాసనసభ సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో ఎలాంటి నగదు జప్తు చేయకపోవడం పట్ల ఎన్నికల సంఘం తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జిల్లాల వారీగా గత ఎన్నికల్లో పట్టుబడిన నగదు, మద్యం, ఇతర కానుకలను పరిశీలించి పెదవి విరిచింది. ఇటీవల జరిగిన కర్ణాటక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోలి్చతే దాదాపు ఐదారు రేట్లు అధికంగా నగదు జప్తు చేశారని, త్వరలో జరి గే శాసనసభ ఎన్నికల్లో సైతం అలాంటి ఫలితాలు ఆశిస్తున్నామని స్పష్టం చేసింది. ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ ఎందుకు పట్టుకోవడం లేదని ఆబ్కారీ, పోలీస్‌శాఖను ప్రశ్నించింది. ఇకపై డబ్బులు, మద్యం, ఇతర కానుకల జప్తుపై ప్రతివారం నివేదిక సమర్పించాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో గతంలో జప్తు చేసిన నగదు, మద్యం చాలా తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలో లోపాలుంటే కలెక్టర్లదే బాధ్యత బుధవారం ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో లోపాలున్నా, ఓట్లు గల్లంతైనట్టు ఫిర్యాదులొచి్చనా కలెక్టర్లదే బాధ్యత అని, తీవ్రమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం హెచ్చరించింది. శేరిలింగంపల్లిలో పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నట్టు వచి్చన ఫిర్యాదుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏం చర్యలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించింది. -
మాదాపూర్ డ్రగ్స్ కేసు విచారణలో కీలక సమాచారం
హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో అరెస్టైన సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ, మురళిలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వీరివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిపారు. మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినివ్వడంతో బాలాజీ, వెంకట రత్నారెడ్డి, మురళిలను గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలు బయటపడినట్టు చెబుతున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ సందర్భంగా ఫైనాన్షియర్ వెంకట్ నుంచి 18 మందికి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి డ్రగ్స్ అందుకున్న వారు పరారీలో ఉన్నారని వారంతా ఫోన్లను స్విచాఫ్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ నలుగురిని విచారించనున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రాథమిక వివరాలను బట్టి ఆ 18 మందిని కస్టమర్లుగా గుర్తించామని వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వారితోపాటు పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దించినట్లు తెలిపారు. వెంకట రత్నారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకురాగా వారు కూడా ఆ అపార్ట్మెంట్లోనే పోలీసులకు చిక్కారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు రెండు హత్యలు -
20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళను ఉరితీయనున్న సింగపూర్
మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించిన కేసులో ఇద్దరు దోషులను సింగపూర్ ప్రభుత్వం ఈ వారం ఉరితీయనుంది. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. కాగా గత 20 ఏళ్లలో సింగపూర్‌లో మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి. అయితే ఈ ఉరిశిక్షల అమలును నిలిపివేయాలని అక్కడి హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్ కలెక్టివ్(టీజేపీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. 50 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా తేలిన 56 ఏళ్ల వ్యక్తిని జులై 26(బుధవారం)ఆగ్నేయాసియా నగరమైన చాంగీ జిల్లా జైలులో ఉరితీయనున్నట్లు తెలిపింది. అదే విధంగా 45 ఏళ్ల మహిళ సారిదేవి దామనికి జులై 28న (శుక్రవారం) ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు పేర్కొంది. 30 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా తరలించిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో 2018లో ఆమెకు ఉరిశిక్ష విధించారని.. ఉరిశిక్ష అమలు తేదీలపై ఇప్పటికే వారి కుటుంబాలకు నోటీసులు పంపించారని టీజేసీ పేర్కొంది. కానీ దీనిపై జైలు అధికారులు ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. చదవండి: చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్ 20 ఏళ్లలో తొలిసారి ఈ ఉరిశిక్ష అమలైతే దాదాపు గత 20 ఏళ్లలో సింగపూర్‌లో ఓ మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి కానుంది. చివరిసారి 2004లో డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో దోషిగా తేలిన 36 ఏళ్ల మహిళా హెయిర్ స్టైలిష్ యెన్ మే వుయెన్‌కు ఉరిశిక్ష పడినట్లు టీజేసీ కార్యకర్త కోకిల అన్నామలై తెలిపారు. ఇదిలా ఉండగా సింగపూర్‌లో హత్యలు, కిడ్నాప్‌ల వంటి తీవ్రమైన నేరాలకు మరణ శిక్షలు విధిస్తారు. అత్యంత కఠిన చట్టాలు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసే వారికి మరణశిక్ష విధిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల పాటు మరణశిక్షల అమలును సింగపూర్ నిలిపి వేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు 13 మందిని ఉరితీసింది. -
పాకిస్తాన్ అండతో హాజీ సలీం భారీ దందా .. తాజాగా రూ.25 వేల కోట్ల డ్రగ్స్
అతనిది అత్యంత విలాసవంతమైన జీవన శైలి. అడుగు కదిలితే చుట్టూ అత్యాధునిక ఏకే ఆయుధాలతో అంగరక్షకుల భారీ భద్రత. ఎటు వెళ్లాలన్నా ముందే పలు అంచెల తనిఖీలు, దారి పొడవునా మూడో కంటికి అగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఇది ఏ దేశాధ్యక్షుని పరిచయమో కాదు. భారత్‌తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న డ్రగ్ కింగ్ హాజీ సలీం జల్సా లైఫ్ స్టైల్! శనివారం కోచి సమీపంలో అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారీగా డ్రగ్స్ మోసుకెళ్తున్న ఓ నౌకను పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడ్డగించి ముంచేయడం తెలిసిందే. అందులో ఏకంగా 2.5 టన్నుల మెథంఫెటామిన్ దొరకడం అధికారులనే విస్మయపరిచింది. ఇది ఎన్సీబీకి మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ అయిన హాజీదేనని దాడిలో పట్టుబడ్డ 29 ఏళ్ల పాక్ జాతీయుడు వెల్లడించాడు. భారత్, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాల్లో సరఫరా నిమిత్తం దీన్ని పాక్ దన్నుతో దొంగచాటుగా తరలిస్తున్నట్టు విచారణలో అంగీకరించాడు. మన దేశంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి! అంతేగాక పలు దేశాల్లో సరఫరా నిమిత్తం అత్యంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను మోసుకెళ్తున్న మదర్ షిప్ ఎన్సీబీకి చిక్కడమూ ఇదే మొదటిసారి! దాని విలువను రూ.12 వేల కోట్లుగా అధికారులు తొలుత పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా దొరికిన డ్రగ్స్లోకెల్లా ఇదే అత్యంత హెచ్చు నాణ్యతతో కూడినదని తాజాగా పరీక్షల్లో తేలింది. దాంతో దీని విలువను సవరించి ఏకంగా రూ.25,000 కోట్లుగా తేల్చారు! పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటుకు హాజీ ముఠా అన్నిరకాలుగా సాయపడుతున్నట్టు కూడా తేలింది. పాక్ అడ్డాగా... పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా అండదండలతో అరేబియా సముద్రంలో హాజీ విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. పాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్ అతని అడ్డాలు! ఎక్కడా స్థిరంగా ఉండకుండా తరచూ స్థావరాలు మార్చడం హాజీ స్టైల్. అతని ప్రస్తుత అడ్డా పాకిస్తాన్. బలూచిస్తాన్‌లో మకాం వేసి కథ నడుపుతున్నాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ హాజీకి దగ్గరి లింకులున్నట్టు ఎన్సీబీ అనుమానం. గమ్మత్తైన సంకేతాలు.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్, కొమ్ముగుర్రం, 555, 777, 999. ఇవన్నీ డ్రగ్స్ సరఫరాలో హాజీ ముఠా వాడే సంకేతాల్లో కొన్ని. డ్రగ్స్ ప్యాకెట్లపై ఉండే ఈ ప్రత్యేకమైన గుర్తులు వాటిలోని డ్రగ్స్, దాని నాణ్యతకు సంకేతాలు. కొనుగోలుదారులు మాత్రమే వీటిని గుర్తిస్తారు. హాజీ మనుషులు డ్రగ్స్‌ను ఏడు పొరలతో పటిష్టంగా ప్యాక్ చేస్తారు. నీళ్లలో పడ్డా దెబ్బతినకుండా ఈ జాగ్రత్త. ఇలా డ్రగ్స్ సరఫరా, విక్రయంలో హాజీది విలక్షణ శైలి. హాజీ అప్పుగానే డ్రగ్స్ సరఫరా చేస్తాడు. తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెబుతాడు. వ్యాపారానికి శ్రీలంక పడవలు వాడుతుంటాడు. అవి పాక్, ఇరాన్ సముద్ర తీరాల్లో మదర్ షిప్ నుంచి డ్రగ్స్ నింపుకొని రహస్యంగా భారత్‌కు చేరుకుంటాయి. క్వింటాళ్ల కొద్దీ ఉన్న నిల్వను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గమ్యానికి తరలిస్తారు. -
ఆర్యన్‌ఖాన్‌ను వదిలేసేందుకు రూ.25 కోట్లు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను మాదకద్రవ్యాల కేసులో ఇరికించకుండా ఉండడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖేడెపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శుక్రవారం ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో మొత్తం 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 2021, అక్టోబర్ 2న ఒక క్రూయిజ్ షిప్లో డ్రగ్స్‌ని సేవించాడన్న ఆరోపణలపై ఆర్యన్‌ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. వాంఖెడే దర్యాప్తు చేసిన ఈ కేసులో తప్పులుతడకలు ఉన్నాయని సిట్ దర్యాప్తులో ఇప్పటికే తేలింది. ఆర్యన్‌ను కేసు నుంచి వదిలేయడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. వాంఖేడె అడ్వాన్స్ కింద రూ.50 లక్షలు తీసుకున్నారని తమకు సమాచారం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. -
డ్రగ్స్ నేరగాళ్లకు జైలే గతి
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగస్వాములైన బడా నేరగాళ్లను రాబోయే రెండేళ్లలో కచ్చితంగా జైలుకు తరలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. డ్రగ్స్ దందాలో సంపాదించిన డబ్బును దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ పాపపు సొమ్ము దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా తయారవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ సమస్యపై బుధవారం లోక్‌సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అమిత్ షా మాట్లాడారు. మాదక ద్రవ్యాల కట్టడికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ వ్యాపారం చేసేవారిపై కేసుల నమోదు అధికారాన్ని బీఎస్ఎఫ్, సీమా సురక్షాబల్, అస్సాం రైఫిల్స్‌కు కట్టబెట్టామని అమిత్ షా గుర్తుచేశారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. 2014 నుంచి 2022 వరకూ రూ.97,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. 2006 నుంచి 2013 దాకా రూ.23,000 కోట్ల విలువైన సరుకును స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. -
T20 World Cup 2022: అహో హేల్స్...
‘నేను మళ్లీ ప్రపంచకప్ ఆడతానని అనుకోలేదు’... సెమీస్ ముగిసిన తర్వాత అలెక్స్ హేల్స్ వ్యాఖ్య ఇది. బహుశా భారత అభిమానులు కూడా అదే జరిగి ఉంటే బాగుండేదని అనుకొని ఉంటారు! మూడేళ్ల పాటు ఆటకు దూరమై పునరాగమనంలో మళ్లీ చెలరేగుతున్న హేల్స్ కథ కూడా ఎంతో ఆసక్తికరం. ► ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీలలో ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చినా మూడేళ్ల పాటు అతనికి టీమ్‌లో చోటు దక్కలేదు. ఆ బాధను అధిగమించి అతను ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్‌లలో ఆడుతూ వచ్చాడు. చివరకు ఈ ఏడాది జూన్‌లో మోర్గాన్ రిటైర్ అయ్యాడు... సెప్టెంబర్‌లో హేల్స్‌కు టీమ్‌లో స్థానం లభించింది. పాకిస్తాన్ పర్యటనలో ఆకట్టుకున్న అతను వరల్డ్ కప్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో తానేంటో నిరూపించాడు. ► పాక్ టూర్ తర్వాత కూడా ఇంగ్లండ్ వరల్డ్ కప్ జట్టులో హేల్స్‌కు స్థానం దక్కలేదు. అయితే బెయిర్‌స్టో అనూహ్యంగా గాయపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో హేల్స్‌ను టీమ్‌లోకి తీసుకోవాల్సి వచ్చింది. అది ఎంత సరైన నిర్ణయమో ఇంగ్లండ్‌కు ఇప్పుడు తెలిసింది. ఈ టోర్నీలో నాలుగు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, భారత్‌లతో జరిగిన మ్యాచ్‌లలో అతను 84, 52, 47, 86 నాటౌట్ పరుగులు సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. –సాక్షి క్రీడావిభాగం -
విచారణ సమయంలో నిందితుడి ఆత్మహత్య
సాక్షి, చెన్నై: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విభాగం అధికారుల విచారణ సమయంలో ఓ నిందితుడు మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తెలంగాణ వాసిగా గుర్తించారు. వివరాలు.. తమకు అందిన సమాచారం మేరకు శుక్రవారం చోళవరంలో చెన్నై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో రాయప్పరాజు అనే వ్యక్తిని ఆ విభాగం సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 8 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అయపాక్కంలోని ప్రధాన కార్యాలయానికి తరలించి శుక్రవారం రాత్రంతా ప్రశ్నించారు. శనివారం వేకువ జామున రాయప్పరాజు హఠాత్తుగా మూడో అంతస్తులోని విచారణ గది నుంచి బయటకు పరుగులు తీసి అనంతరం కిందకి దూకేశాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న రాయప్పరాజును అక్కడి సిబ్బంది ఆవడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో రాయప్ప రాజు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తిరుముల్లైవాయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతుడు తెలంగాణ రాష్ట్రం రామకృష్ణాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబం పరువు పోతుందనే వేదనతో రాయప్పరాజు ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ, చెన్నై నుంచి మాదక ద్రవ్యాలను తెలంగాణకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. తాను మాదక ద్రవ్యాలతో పట్టుబడడంతో కుటుంబం తీవ్ర అవమానం పాలవుతుందనే వేదనతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఇతని వద్ద పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు విమానాశ్రయంలో సీజ్ చేసినవి కావడం గమనార్హం. అక్కడి అధికారులు, సిబ్బంది ఎవరో సీజ్ చేసిన మాదకద్రవ్యాలను ఇతని ద్వారా బయటకు పంపిస్తున్నట్టు తేలింది. దీంతో ఈ కేసును మరింత సమగ్రంగా విచారించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. మృతుడు 48 కేజీల మేరకు సీజ్ చేసిన మాదక ద్రవ్యాలను తెలంగాణకు తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. (చదవండి: దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..) -
రూ.120 కోట్ల మెఫెడ్రోన్ స్వాధీనం
ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తాజాగా రూ.120 కోట్ల విలువైన 60 కిలోల మెఫెడ్రోన్ అనే డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అంతర్రాష్ట్ర డ్రగ్స్ మాఫియా సూత్రధారి ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నావల్ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సోమవారం సోదాలు జరిపి 10 కిలోల మెఫెడ్రోన్‌ను పట్టుకున్నామని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి జామ్‌నగర్‌కు చెందిన ఒకరు, ముంబైకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. వీరిచ్చిన సమాచారంతో గురువారం దక్షిణ ముంబైలోని ఎస్బీ రోడ్డులో ఉన్న ఓ గోదాముపై దాడి చేశామన్నారు. 50 కిలోల మెఫెడ్రోన్‌ను పట్టుకుని, డ్రగ్స్ మాఫియా సూత్రధారి, ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. -
డ్రగ్స్ ముఠాలపై సీబీఐ దాడులు, 175 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో సీబీఐ మాదకద్రవ్యాల ముఠాలపై దాడులు చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఇంటర్‌పోల్, రాష్ట్రాల పోలీసు యంత్రాంగం సహకారంతో గురువారం పకడ్బందీగా దాడులు నిర్వహించింది. డ్రగ్స్ విక్రేతలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 175 మందిని అరెస్ట్ చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వారి పని పట్టడానికి ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్రాలలో మాదకద్రవ్యాల అక్రమ సరఫరా చేస్తున్న 6,600 అనుమానితుల్ని సీబీఐ గుర్తించింది. వారిలో 175 మందిని అరెస్ట్ చేసి, 127 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
డ్రగ్స్ విక్రయిస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అరెస్ట్
హైదరాబాద్‌లొ మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా తరుచుగా గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. హఫీజ్‌పేట్ గోకుల్ ఫ్లాట్స్‌లో నిందితుడు గోపీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 10గ్రాముల డ్రగ్స్, రూ55వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అరబిక్ ట్యూటర్ అష్రఫ్ బేగ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 13 గ్రాముల కొకైన్, రూ 65 వేల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల ఫోన్స్‌ను సీజ్ చేశారు. -
అమిత్‌షా చూస్తుండగా.. 30,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం
చండీగఢ్: దేశవ్యాప్తంగా ఒక్కరోజే 30వేల కిలోల డ్రగ్స్‌ను తగలబెట్టారు అధికారులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. పంజాబ్ చండీగఢ్‌లో డ్రగ్ ట్రాఫికింగ్, నేషనల్ సెక్యూరిటీ అంశంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే సమయంలో అధికారులు ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతాలో మొత్తం 30వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 75వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేయాలని ప్రతిజ్ఞ చేశామని అమిత్‌షా వెల్లడించారు. ఇప్పటికే 81వేల కిలోల డ్రగ్స్‌ను తగలబెట్టామని వెల్లడించారు. ఆగస్టు 15నాటికి లక్ష కిలోల డ్రగ్స్ ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. Visuals of incineration of seized drugs by the NCB. On PM @narendramodi Ji’s call to celebrate #AmritMahotsav, we took a pledge to destroy about 75000 kg of drugs. Glad to share that till today we have already incinerated 82000 kg and will reach the 1 lakh kg mark by 15th Aug. pic.twitter.com/zx1anMJrV4 — Amit Shah (@AmitShah) July 30, 2022 డ్రగ్స్ ధ్వంసం చేసే కార్యక్రమాన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జూన్ 1న మొదలుపెట్టింది. జులై 29నాటికి దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 51,217 కిలోల డ్రగ్స్‌ను తగలబెట్టింది. తాజాగా అమిత్‌షా కార్యక్రమంలో మరో 30వేల కిలోల డ్రగ్స్‌ను నిర్వీర్యం చేసింది. చదవండి: ఐఐటీ మద్రాస్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు! 300 మంది ఫోటోలతో విచారణ -
పొట్ట విప్పి చూడ డ్రగ్స్ ఉండు!
శంషాబాద్: మాదకద్రవ్యాలను క్యాప్సుల్స్ రూపంలో ప్యాక్ చేసి, కడుపులో దాచుకుని స్మగ్లింగ్ చేస్తున్న విదేశీయులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా పట్టుబడుతున్నారు. గత నెల 21న ఒకరిని టాంజానియా జాతీయుడిని పట్టుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.11.57 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26న టాంజానియాకు చెందిన మరో వ్యక్తిని పట్టుకున్నామని, ఆరు రోజుల చికిత్స అనంతరం రూ.11.53 కోట్ల విలువైన హెరాయిన్ క్యాప్సుల్స్ రికవరీ చేశామని కస్టమ్స్ అధికారులు బుధవారం ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా వాళ్లు 1.38 కేజీల హెరాయిన్‌ను పారదర్శకంగా ఉండే టేప్‌తో 108 క్యాప్సుల్స్‌గా మార్చారన్నారు. టాంజానియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తిని క్యారియర్‌గా మార్చుకుని అతడికి భారత్ రావడానికి టూరిస్ట్ వీసా ఇప్పించారని చెప్పారు. అతడితో హెరాయిన్ క్యాప్సుల్స్‌ను మింగించి ఎథిహాద్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో అబుదాబి మీదుగా హైదరాబాద్ పంపినట్లు తెలిపారు. ప్రయాణికుల జాబితా వడపోసి.. కస్టమ్స్ అధికారులు అనునిత్యం విదేశాల నుంచి ప్రధానంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల జాబితాను సేకరించి ప్యాసింజర్స్ ప్రొఫైలింగ్ విధానంతో వడపోస్తారు. గత నెల 26న వచ్చిన ప్యాసింజర్స్ జాబితాను ఇలాగే వడపోయగా టాంజానియా జాతీయుడిపై అనుమానం వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రాథమిక విచారణ చేసింది. తాను హెరాయిన్ క్యాప్సుల్స్ మింగి వస్తున్నానని, రెండు మూడు రోజుల్లో వీటిని తన వద్దకు వచ్చే రిసీవర్లకు అందించాల్సి ఉందని అంగీకరించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఆరు రోజులు ఆస్పత్రిలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో 108 క్యాప్సుల్స్ బయటకు వచ్చేలా చేశారు. వీటిలో ఉన్న 1.38 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ డ్రగ్స్ ఉత్తరాదికి వెళ్లాల్సి ఉందని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. శంషాబాద్ లో గత 15 రోజుల్లోనే మొత్తం రూ.113.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. -
ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుపై సౌత్ హీరో సంచలన వ్యాఖ్యలు
Hero Tovino Finally Open Up On Aryan Khan Drug Case: గతేడాది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ సంచలనం సృష్టించింది. 2021 అక్టోబర్ 3న క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో అరెస్టయిన ఆర్యన్ అక్టోబర్ 30న బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పట్లో ఈ కేసు బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఎంతో బాలీవుడ్ నటీనటులు, ప్రముఖులు ఆర్యన్, షారుక్‌లకు మద్ధతుగా నిలిచారు. చదవండి: నన్ను నమ్మినందుకు థ్యాంక్స్, నాకింకా గుర్తుంది.. అది 2012: సమంత కానీ సౌత్ ఇండస్ట్రీలకు చెందిన ఏ ఒక్కరు ఈ కేసుపై నోరు విప్పలేదు. ఈ క్రమంలో తాజాగా ఆర్యన్ కేసుపై మలయాళ హీరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగాక, ఈకేసు గురించి సెలబ్రెటీలతో పాటు ప్రజలు కూడా మరిచిపోయారు. ఈ తరుణంగా సౌత్ హీరో టోవినో థామస్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీంతో ఆర్యన్ డ్రగ్స్ కేసు వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. అసలు ఏం జరిగిందంటే.. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ఇటీవల నటించిన మిన్నాళ్ మురళి చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. చదవండి: సుధీర్ ఎంగేజ్మెంట్!, ఇంతకీ ఎవరా అమ్మాయి? పేరేంటి.. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో టోవినో థామస్ ఆర్యన్ డ్రగ్ కేసుపై స్పందించాడు. ఈ సందర్భంగా టోవినో మాట్లాడుతూ.. ఈ కేసు సమంయలో షారుక్ ఖాన్ పేరును డ్యామేజ్ చేయడానికి రాజకీయంగా కుట్ర జరిగిందని, దీనిని కొంతమంది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా ఈ కేసులో ముంబై హైకోర్టు ఆర్యన్‌కు మూడు సార్లు బెయిల్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకంగా బాలీవుడ్ బడా హీరో షారుక్ ఖాన్ కుమారుడికి బెయిల్ దొరక్కపోవడం ఏంటని అంతా షాక్‌కు గురయ్యారు. అంటే దీని వెనక ఎదైన కుట్ర జరుగుతుందా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు.