ముంబై: బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్‌కు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మరోసారి సమన్లు ఇచ్చింది. సుశాంత్ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ కేసుపై ఎన్‌సీబీ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ డ్రగ్ ప్లెడర్‌లతో ఆర్జున్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో గత నవంబర్‌లో ఎన్‌సీబీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 6 గంటల పాటు అర్జున్ విచారించి అధికారులు తాజాగా తదుపరి విచారణకు ఆదేశిస్తూ మరోసారి మంగళవారం సమన్లు అందజేసింది. రేపు(డిసెంబర్ 16) ఎన్‌సీబీకి కార్యాలయానికి విచారణకు హాజరకావాల్సిందిగా ఎన్‌సీబీ పేర్కొంది. (చదవండి: అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్‌సీబీ దాడులు)
అంతేగాక గతనెలలోనే ఎన్‌సీబీ అధికారులు అర్జున్ ఇంటిలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటలపాటు అర్జున్ ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు పలు డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నవంబర్ 9న అర్జున్‌కు నోటీసులు అందజేస్తూ.. 11వ తేదీన విచారణకు హజరుకావాల్సిందిగా ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. అలాగే ఆయన ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌కు కూడా అదే సమయంలో ఎన్‌సీబీ సమన్లు ఇచ్చి విచారించింది. (చదవండి: అర్జున్‌ను ఆరు గంటలు విచారించిన ఎన్‌సీబీ)
Comments
Please login to add a commentAdd a comment