ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహరంలో నటుడు అర్జున్ రాంపాల్‌కు ఇటీవల ఎన్‌సీబీ మరోసారి సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. తదుపురి విచారణకు అర్జున్ హజరవ్వాల్సిందిగా ఎన్‌సీబీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో అర్జున్ సోమవారం మధ్యాహ్నం ఎన్‌సీబీ ఎదుట హజరయ్యాడు. అయితే ఈ విచారణలో అర్జున్ ఎన్‌సీబీకి ఇచ్చిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని తేలితే అతడు అరెస్టు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగుచూసిన బాలీవుడ్ డ్రగ్ కేసును ముంబై పోలీసులు ఎన్‌సీబీకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో విచారణ చేపట్టి ఎన్‌సీబీ దర్యాప్తులో డ్రగ్ ప్లెడర్‌లతో అర్జున్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గత నవంబర్ 9వ తేదిన అతడి ఇంటిలో దాడులు నిర్వహించిన ఎన్‌సీబీ కొన్ని అనుమానిత మందులతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను స్వాధీనం చేసుకుని సమన్లు అందజేశారు. (చదవండి: అర్జున్ రాంపాల్‌కు మరోసారి ఎన్‌సీబీ సమన్లు)
అయితే నవంబర్ నెలలో జరిగిన మొదటి విచారణలో అర్జున్ తన ఇంట్లో దొరికిన మందులు డాక్టర్ల సలహా మేరకు తీసుకుంటున్నట్లు చెప్పి దానికి సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను అధికారులకు ఇచ్చాడు. అయితే ఆ ప్రిస్క్రిప్షన్‌పై అనుమానం రావడంతో ఈ నెల 15న అర్జున్‌కు మరోసారి ఎన్‌సీబీ సమన్లు ఇచ్చి 16న విచారణకు హజరు కావాల్సిందిగా ఆదేశించింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను 21న విచారణకు హజరవుతానంటూ ఎన్‌సీబీని 16న గడువు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్జున్ ఈ రోజు మధ్యాహ్నం ఎన్‌సీబీ కార్యాలయానికి విచారణకు హజరయ్యాడు. అయితే ఈ విచారణలో అది నకిలీ ప్రిస్క్రిప్షన్ అని తేలితే అర్జున్ తప్పనిసరిగా అరెస్టును ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎందుకంటే అర్జున్ ఇంట్లో దొరికిన అనుమానిత మందులను ఎన్‌సీబీ చట్టం ప్రకారం షెడ్యూల్‌లో చేర్చినవిగా ఎన్‌సీబీ గుర్తించింది. (చదవండి: మరోసారి ఎన్‌సీబీ సమన్లు.. గడువు కోరిన నటుడు)
Comments
Please login to add a commentAdd a comment