ముంబై : బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహరంలో నిందితులకు సహాయం చేశారనే ఆరోపణలతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో( ఎన్‌సీబీ) ముంబై జోనల్ యూనిట్‌కి చెందిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. హాస్యనటి భారతీ సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాలయాలు డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. నటి దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌పై కూడా డ్రస్ కేసుకి సంబంధించి కేసు నమోదైంది. అయితే వీరికి బెయిల్ లభించడంలో ఇద్దరు ఎన్‌సీబీ అధికారులు సహా ప్రాసిక్యూటర్ పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీపికా మేనేజర్ కరిష్మాకు సమన్లు అందించానా, గైర్హాజరు కావడంతో మరోసారి గతనెలలో ఆమెకు నోటీసులు జారీ చేశామని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కరిష్మా ఇంటిలో సోదాలు నిర్వహించగా ఆమె ఇంట్లో 1.7 కిలోగ్రాముల చరాస్, మూడు సీసాల సీబీడీ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కరిష్మా ఎన్సీబీ విచారణకు హాజరుకాకుండా, ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. (సోవిక్ చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన ముంబై కోర్టు)
అయితే ఈ కేసు విచారణలో ప్రాసిక్యూటర్ హాజరుకాకపోవడంతో ఎన్సీబీ నుంచి బలమైన వాదనలు వినిపించలేదు. దీంతో కోర్టు కరిష్మా సహా మిగతా ఇద్దరికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తుకు సహకరించాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 21న హస్య నటి భారతి సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియాలు స్వయంగా తాము గంజాయి తీసుకుంటామని విచారణలో పేర్కొన్నారు. అయినప్పటికీ డ్రగ్స్ వ్యవహరంలో సంబంధం ఉన్న ఈ ముగ్గురికి బెయిల్ లభించడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీరికి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ వాంఖడే సహా ఇద్దరు ఐఓఓలు సహకరించినట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. భారతీసింగ్ దంపతులకు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్‌బిపి కోర్టును ఆశ్రయించారు. కాగా ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారిని విచారణకు పలిచిన ఎన్‌సీబీ ఆ తర్వాత వారికి డ్రగ్స్ ఎటువంటి సంబంధాలు లేవని క్లీన్‌చిట్ ఇచ్చింది. (గాబ్రియెల్లాను విచారించనున్న ఎన్సీబీ)
నిందితులకు బెయిల్ వచ్చేలా సహకరించి..
Published Thu, Dec 3 2020 12:26 PM | Last Updated on Thu, Dec 3 2020 12:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment