NCB
-
గుజరాత్ తీరంలో 700 కిలోల డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పోర్బందర్ తీరంలో 700 కిలోల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్నారు. ఈ మెథాంఫెటామైన్ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. అలాగే 8 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ‘సాగర్ మంథన్–4’ అనే కోడ్నేమ్లో ఎన్సీబీ, భారత నావికాదళం, గుజరాత్ పోలీసు శాఖకు చెందిన యాంటీ–టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. గుజరాత్ తీరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన రిజిస్టర్ కాని ఓ పడవను అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 700 కిలోల డ్రగ్స్ లభించాయి. పడవలో ఉన్న 8 మంది ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవు. భారీ ఎత్తున డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్న అధికారులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. ‘మాదక ద్రవ్యాల రహిత భారత్’ తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. డ్రగ్స్ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3,500 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో 11 మంది ఇరాన్ పౌరులను, 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం ఇండియా జైళ్లలో ఉన్నారు. ఢిల్లీలో 80 కిలోల కొకైన్ స్వాధీనం దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన 80 కిలోల కొకైన్‌ను ఎన్సీబీ శుక్రవారం స్వా«దీనం చేసుకుంది. ఓ కొరియర్ సెంటర్లో ఆ డ్రగ్స్ లభించినట్లు అధికారులు చెప్పారు. -
డ్రగ్ గుట్టు రట్టు 95 కిలోలు స్వాధీనం
-
భారీగా డ్రగ్స్ పట్టివేత.. తిహార్ జైలు వార్డెన్‌తో సహా నలుగురి అరెస్ట్
లక్నో:ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నోయిడాలోని మెక్సికన్ డ్రగ్ కార్టెల్ నిర్వహిస్తున్న మెథాంఫేటమిన్ తయారీ ల్యాబ్‌లో వందల కోట్ల విలువైన 95 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ డ్రగ్స్ తయారీ ల్యాబ్‌ను తిహార్ జైలు వార్డెన్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, ముంబై కెమిస్ట్ రహస్యంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. భారత్‌తోపాటు విదేశాలకు డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.ఈ ల్యాబ్‌లో దేశీయ వినియోగానికి, అంతర్జాతీయ ఎగుమతుల కోసం సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా డ్రగ్స్ తయారీ చేపడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఘన, ద్రవ రూపాల్లో ఉన్న సుమారు 95కిలోల మెథాంపేటమిన్(డ్రగ్స్), వివిధ రసాయనాలు, ఆధునాతన తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. మూడురోజల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.ఈ ఫ్యాక్టరీలో ముంబయికి చెందిన కెమిస్ట్ మాదక ద్రవ్యాలను తయారు చేయగా.. వాటి నాణ్యతను ఢిల్లీలో ఉండే మెక్సికన్ ముఠా సభ్యుడు పరీక్షించేవాడని ఎన్సీబీ తెలిపింది. ల్యాబ్‌లో పట్టుబడిన ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను గతంలో కూడా ఒక ఎన్డీపీఎస్ కేసులో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఆ సమయంలో అతడిని తిహార్ జైల్లో ఉంచగా.. అక్కడ వార్డెన్‌తో పరిచయం పెంచుకొని అతడిని కూడా ఈ మత్తు వ్యాపారంలోకి దించాడు. -
ఆ ఆరోపణలతో నాకు సంబంధం లేదు: నటుడు
దర్శకుడు, నటుడు అమీర్ ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన సినీ నిర్మాత జాఫర్ సాధిక్తో దర్శకుడు అమీర్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో మంగళవారం నాడు ఎన్సీబీ, ఈడీ అధికారులు అమీర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సంఘటన కోలీవుడ్‌లో తీవ్ర కలకలానికి దారి తీసింది. కాగా బుధవారం మధురైలో జరిగిన రంజాన్ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఇంట్లో అధికారులు 11 గంటలపాటు సోదాలు నిర్వహించిన విషయం నిజమేనన్నారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించాయన్నది వారే చెప్పాలన్నారు. ఈ వ్యవహారంలో తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. అలాగే తనను లక్ష్యంగా చేసుకుని విచారణ జరుపుతున్నారా? అన్న ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదన్నారు. అయితే ఈ విషయమై ఒక రోజు కచ్చితంగా వివరంగా మాట్లాడతానన్నారు. ఈ వ్యవహారం గురించి తాను ఒక నెలరోజులుగా మాట్లాడలేని పరిస్థితి అని.. ఆ దేవుడు చూసుకుంటాడనే మౌనంగా రోజులు గడిపానన్నారు. చదవండి: మీకు నచ్చకపోతే అలా చేస్తారా?.. ట్రోల్స్‌పై మండిపడ్డ నటి! -
ఆర్యన్‌ఖాన్‌ను వదిలేసేందుకు రూ.25 కోట్లు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను మాదకద్రవ్యాల కేసులో ఇరికించకుండా ఉండడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖేడెపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శుక్రవారం ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో మొత్తం 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 2021, అక్టోబర్ 2న ఒక క్రూయిజ్ షిప్లో డ్రగ్స్‌ని సేవించాడన్న ఆరోపణలపై ఆర్యన్‌ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. వాంఖెడే దర్యాప్తు చేసిన ఈ కేసులో తప్పులుతడకలు ఉన్నాయని సిట్ దర్యాప్తులో ఇప్పటికే తేలింది. ఆర్యన్‌ను కేసు నుంచి వదిలేయడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. వాంఖేడె అడ్వాన్స్ కింద రూ.50 లక్షలు తీసుకున్నారని తమకు సమాచారం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. -
డీజే ముసుగులో డ్రగ్ పెడ్లింగ్.. సినీనటి భర్త అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఘరానా ఈవెంట్ల డీజే సప్లయర్ మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరోన్ మోహిత్‌ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ) అధికారులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆయన భార్య నేహా దేశ్‌పాండే పలు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. అతడు డీజే నిర్వాహకులతోపాటు ఈవెంట్లలో మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడని, గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్ నుంచి వీటిని ఖరీదు చేసేవాడని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన మోహిత్ 2014లో ‘ది అన్‌స్క్రిప్టెడ్’పేరుతో సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్, ముంబై, గోవా, బెంగళూరుల్లో జరిగే అనేక ఈవెంట్లు, పబ్స్‌కు డీజేలు సరఫరా చేస్తున్నాడు. గోవాలో సన్‌బర్న్ బీచ్ క్లబ్ సహా అనేక భారీ ఈవెంట్స్ నిర్వహించాడు. ఆయా పబ్స్ నిర్వాహకులతో కలిసి వాటిలో ప్రత్యేకంగా రేవ్ పార్టీలు నిర్వహించే వాడు. దీనికోసం ఎడ్విన్‌సహా దాదాపు 50 మంది డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి నుంచే కొకైన్ ఖరీదు చేసి సరఫరా చేసేవాడు. ‘క్రూయిజ్’లో ఆధారాల్లేక.. గతేడాది అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు ముంబై క్రూయిజ్ డ్రగ్ పార్టీపై దాడి చేసి షారూఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ సహా పలువురిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోహిత్ కూడా అదే క్రూయిజ్‌లో ఉన్నా ఇతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరక్కపోవడం, ఆర్యన్‌తో సంబంధాలపై ఆధారాలు లేకపోవడంతో అధికారులు విడిచిపెట్టారు. గోవాకు చెందిన డ్రగ్స్ డాన్ ఎడ్విన్‌ను హెచ్–న్యూ అధికారులు గతేడాది నవంబర్ 5న అరెస్టు చేసి విచారించగా మోహిత్ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడు గోవా, ముంబైల్లో తలదాచుకున్నాడు. హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్ నేతృత్వంలోని బృందం అతడి కోసం వివిధ ప్రాంతాల్లో గాలించింది. మోహిత్ ‘డిసెంబర్ 31’న గోవాలో రూ.2 కోట్లు వెచ్చించి భారీ ఈవెంట్ నిర్వహించినట్లు సమాచారం అందుకున్న హెచ్–న్యూ బృందం అక్కడికి వెళ్లగా త్రుటిలో తప్పించుకుని విమానంలో హైదరాబాద్ వచ్చేశాడు. వేట కొనసాగించిన హెచ్–న్యూ ఎట్టకేలకు అతడిని పట్టుకుంది. అతడి వద్ద నుంచి గ్రాము కొకైన్ స్వాధీనం చేసుకుంది. రామ్‌గోపాల్‌పేట ఠాణాలో ఉన్న ఎడ్విన్ కేసులోనూ రిమాండ్‌కు తరలించింది. విచారణలో నగరానికి చెందిన అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులతో అతడికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. అయితే వారిలో ఎందరు డ్రగ్స్ ఖరీదు చేశారు? ఏఏ పబ్స్ నిర్వాహకులతో అతడికి ఒప్పందాలు ఉన్నాయనే వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికోసం వారం రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ దందాలో మోహిత్ భార్య నేహా దేశ్‌పాండేకు ఏమైనా లింకు ఉందా? అనే అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేహా దేశ్‌పాండే ‘ది కిల్లర్, దిల్ దివానా, బెల్స్’తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ఇదీ చదవండి: సర్వం ‘త్రిమూర్తుల’ కనుసన్నల్లోనే! -
ఆర్యన్ ఖాన్‌ను ఇరికించారు: ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ పేర్కొంది. దీనికి సంబంధించి ఒక సీనియర్ అధికారితో పాటు ఎనిమిది మందిపై చర్యలకు సిఫార్సు చేసింది. ఓ క్రూయిజ్ పడవలో పార్టీ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆర్యన్‌తో పాటు 15 మందిని గతేడాది అక్టోబర్‌లో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేయడం తెలిసిందే. కానీ ఆర్యన్‌ను కేసు నుంచి తప్పించేందుకు అధికారులు లంచం డిమాండ్ చేశారని అనంతరం ఆరోపణలొచ్చాయి. ఆర్యన్‌తో పాటు ఇతర కేసుల్లో వచ్చిన ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిటీ గత ఆగస్టులో మొత్తం 8 మంది అధికారులపై 3,000 పేజీల సుదీర్ఘ చార్జ్‌షీట్ నమోదు చేసింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు కమిటీ గత మేలో క్లీన్చిట్ ఇచ్చింది. ఇప్పుడు సొంత అధికారులే ఆర్యన్‌ను కావాలని ఇరికించారని తేల్చడం ఎన్సీబీకి మరోసారి తలవంపులు తెచ్చింది. -
అమిత్ షా సమక్షంలో 40,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం
గువాహటి: మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 40,000 కిలోల వివిధ రకాల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో శనివారం ధ్వంసం చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా గువాహటి నుంచి వర్చువల్‌గా డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షించినట్లు ట్వీట్ చేసింది. అస్సాంలో 11,000 కిలోలు, అరుణాచల్ ప్రదేశ్‌లో 8,000 కిలోలు, మేఘాలయలో 4,000 కిలోలు, నాగాలాండ్‌లో 1600 కిలోలు, మణిపుర్లో 398 కిలోలు, మిజోరాంలో 1900కిలోలు, త్రిపురలో 13,500 కిలోలు పట్టుకున్నట్లు వెల్లడించింది. అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా.. డ్రగ్ అక్రమ రవాణా, జాతీయ భద్రత అంశంపై ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈశాన్య ప్రాంతంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, నియంత్రణపై సమీక్షించారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఎన్సీబీ ఆధ్వర్యంలో 75,000 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంతకు రెండింతలు 150,000 కిలోలు ధ్వంసం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద విజయం.’ అని తెలిపారు షా. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎన్సీబీ జూన్ 1 నుంచి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మత్తు పదార్థాలను పట్టుకుంటోంది. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మారుస్తామన్న మోదీ ప్రభుత్వ ఆశయానికి తగినట్లుగా డ్రగ్స్‌ను ధ్వంసం చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. గత జులై 30న సుమారు 82వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన అమిత్ షా.. 31 వేల కిలోల డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను వర్చువల్‌గా పర్యవేక్షించారు. #WATCH | Union Home Minister Amit Shah conducts a meeting on Drug Trafficking and National Security in Guwahati in the presence of Assam CM Himanta Biswa Saram and Union Minister G Kishan Reddy. pic.twitter.com/yAvXXDvTsn — ANI (@ANI) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
ఆపరేషన్ గరుడ: డ్రగ్స్ ముఠాలపై సీబీ‘ఐ’.. 175 మంది అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: మత్తుపదార్థాల(డ్రగ్స్) దందా నిర్వహిస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతోంది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఇంటర్‌పోల్, రాష్ట్రాల పోలీసుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు నెరుపుతూ దేశంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిపై కేసులు, అరెస్టులు చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 127 కేసులు నమోదు చేసి 175 మందిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ గరుడ ఏమిటి? అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని డ్రగ్స్ దందా చేస్తున్న నెట్‌వర్క్‌లను నిరోధించేందుకు ఆపరేషన్ గరుడ పేరుతో పలు దఫాలుగా తనిఖీలు చేపట్టింది సీబీఐ. ఇంటర్‌పోల్ ద్వారా క్రిమినల్ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి డ్రగ్ ట్రాఫికింగ్లను గుర్తించేందుకు ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది. ఇంటర్‌పోల్ ద్వారా అంతర్జాతీయ చట్టాల పరిధిలోనూ ఈ తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీబీఐ తెలిపింది. ఇంటర్‌పోల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)ల సమన్వయంతో గ్లోబల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ముఠాలతో లింక్స్ ఉన్న నెట్వర్క్లే లక్ష్యంగా ఈ ఆపరేషన్ గరుడ కొనసాగిస్తోంది సీబీఐ. దీని ద్వారా డ్రగ్స్ నిర్వహణ, సరఫరా, తయారీ జోన్స్, వారికి మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు బలగాల సమన్వయంతో సమాచారం సేకరించి డ్రగ్స్ ముఠాలపై చర్యలు చేపట్టింది. 6600 అనుమానితులపై.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ దాడులు నిర్వహించింది సీబీఐ. సుమారు 6600 అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసింది. 127 కొత్త కేసులు నమోదు చేసి.. 175 మందిని అరెస్ట్ చేసింది. అందులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులు సైతం ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 5.1 కిలోల హెరాయిన్, 33.4 కిలోల మరిజున, 3.29 కిలోల చరాస్, 1365 గ్రాముల మెఫెడ్రోన్, 33.8 గ్రాముల స్మాక్, బుప్రెనోర్ఫిన్కు చెందిన 87 సిరంజీలు, 122 ఇంజెక్షన్లు, 87 ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకుంది. అలాగే 946 అల్ప్రాజోలమ్ ట్యాబ్లెట్లు, 106 కిలోల ట్రామడోల్, 10 గ్రాముల హాష్ ఆయిల్, 0.9 గ్రాముల ఎక్స్టాసీ పిల్స్, 1.15 కిలోల ఓపియమ్, 30 కిలోల పప్పీ హక్, 1.43 కిలోల ఇటోక్సికాంట్ పౌండర్, 11039 పిల్, క్యాప్సల్స్ సీజ్ చేసింది. ఇదీ చదవండి: పెళ్లితో సంబంధం లేదు.. అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్చిట్
అందరికీ ఎన్నడో అర్థమైన ఒకానొక సత్యం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం (ఎన్సీబీ)కి ఆలస్యంగా తలకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మాదక ద్రవ్యాలతో ఏవిధమైన సంబంధమూ లేదని ఆ సంస్థ తేల్చిచెప్పింది. నిరుడు అక్టోబర్ మొదటివారంలో ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్సీబీ బృందం దాడి చేసి ఆర్యన్‌తోపాటు అనేకుల్ని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్‌తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్సీబీ ప్రకటించింది. ఇంకేం? సామాజిక మాధ్యమాలూ, టీవీ చానెళ్లూ హోరెత్తిపోయాయి. మాదకద్రవ్యాలు తీసుకుం టుండగా ఆర్యన్‌ను స్వయంగా చూసినంత హడావుడి చేశాయి. అందులోనూ పట్టుబడింది బీజేపీకి అయిష్టుడిగా ముద్రపడిన షారుఖ్ తనయుడు కావడంతో కొన్ని చానెళ్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అవి రోజంతా నిర్వహించిన చర్చల్లో పాల్గొన్నవారు ఈ కేసులో తీర్పులిచ్చేశారు. సెలబ్రిటీల పిల్లల పెంపకంపై విరుచుకుపడ్డారు. దేశభక్తి లేనివారి సంతానం ఇలాగే ఉంటారని దెప్పిపొడిచారు. కొందరు ఆ అరెస్టు వెనకున్న పరమార్థమేమిటో అంచనా వేశారు. ఆ సమయంలో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్‌నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి. నిజానికి ‘ఫలానా హీరో తనయుడు లేదా తనయ’ అనే విశేషణం అవసరం లేకుండానే స్టార్ హీరోల పిల్లలు వారికై వారు సెలబ్రిటీలుగా మారిపోతున్న కాలమిది. గతంలో ఎంత పేరు ప్రఖ్యాతులున్న నటులైనా తమ వారసులను వెండితెరపై వెలిగించాలనుకున్నప్పుడు చేయితిరిగిన దర్శకులను ఆశ్రయించేవారు. దీటైన పబ్లిసిటీ కోసం వెంపర్లాడేవారు. ఇవాళ ఏ చిత్రంలోనూ నటించకపోయినా, కనీసం నలుగురి దృష్టినీ ఆకర్షించే పనులేమీ చేయకపోయినా ఆర్యన్ నుంచి ఆరాధ్య వరకూ ఎవరు ఎవరి వారసులో అందరికీ తెలుసు. ఎవరినైనా రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మార్చే చిట్కాల్లో ఆరితేరిన పీఆర్ మేనేజర్ల పుణ్యమిది. ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ట్విటర్‌లోనో లక్షల మంది అనుచరగణాన్ని సృష్టించి ఆ పిల్లల ఫొటోలు పెడితే చాలు... బహుభాషా మాధ్యమాల్లో అవి చిలవలు, పలవలుగా అల్లుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అటుపై వారి గురించి తెలియ దంటే అలా అన్నవారి అజ్ఞానమే బయటపడుతుంది. అయితే ఈ మాదిరి ప్రచారం కూడా వికటించే ప్రమాదం లేకపోలేదు. ఆర్యన్‌ఖాన్‌కు జరిగింది అదే. అతను షారుఖ్ కుమారుడు కాకపోయివుంటే కథ వేరేలా ఉండేది. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ ఆత్మహత్య కేసులో అతడి స్నేహితురాలు నటి రియా చక్రవర్తికి చుక్కలు చూపించిన అప్పటి ముంబై జోన్ ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేనే ఆర్యన్ ను కూడా కటకటాల్లోకి నెట్టగలిగారు. ఏలికల ఆదేశాలను శిరసావహించి ఎవరినైనా కేసుల్లో ఇరికించగల నైపుణ్యంగల అధికారుల్లో ఒకరిగా ఆయనకున్న అపకీర్తి ఎవరికీ తెలియనిది కాదు. రోజంతా మోతమోగే చానెళ్ల కారణంగా హఠాత్తుగా వచ్చిపడిన గ్లామర్ ఆయనను మరింత వ్యామోహంలోకి నెట్టింది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆర్యన్‌ఖాన్ కేసును సవాలుగా తీసుకొని రోజుకొక కొత్త కోణంతో వాంఖడే చరిత్రను ఏకరువు పెట్టడంతో ఈ మొత్తం వ్యవహారంపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ కేసులో మధ్యవర్తులుగా ఉన్నవారికి వాంఖడేతో ఉన్న సంబంధాలు వెల్లడి కావడంతో ముందు ఎన్సీబీ విజిలెన్సు విభాగం దర్యాప్తు, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు జరిగాయి. ఈ రెండు విభాగాలూ వాంఖడేను గుచ్చి గుచ్చి ప్రశ్నించి నిజాలు నిగ్గు తేల్చాయి. ఆర్యన్‌తోపాటు ఆరుగురిపై ఆధారాల్లేవని నిర్ధారణ కావడంవల్ల కేసులు ఉపసంహరిస్తున్నామని సిట్ ప్రకటించింది. ఉగ్రవాదం తర్వాత ప్రపంచ దేశాలన్నిటికీ మాదకద్రవ్యాల వాడకమే కొరకరాని కొయ్యగా మారింది. అంతటి పెను రక్కసి ఆరా తీసి, దాన్ని దుంపనాశనం చేయాల్సిన కర్తవ్య నిర్వహణలో నిమగ్నం కావాల్సిన ఎన్సీబీ వంటి సంస్థ స్వప్రయోజనాపరులైన నేతల చేతుల్లో కీలుబొమ్మయితే, దాని అధికారులు బానిస మనస్తత్వంతో అడుగులేస్తుంటే జరిగేదేమిటో తెలియంది కాదు. యువతను మత్తులో ముంచెత్తి మొత్తం సమాజాన్నే సర్వనాశనం చేయగల సత్తా మాదకద్రవ్యాల కుంటుంది. వాటివల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నమవుతాయి. ఏదో ఒక ముసుగులో ప్రపంచం నలుమూలల నుంచీ మాదకద్రవ్యాలు ఇక్కడికొస్తున్నాయి. మరెన్నో దేశాలకు చడీచప్పుడూ లేకుండా పోతున్నాయి. గట్టి నిఘా ఉంటే తప్ప వీటిని అరికట్టడం అసాధ్యం. మనం ఆ పని చేయలేకపోతే ప్రపంచంముందు చులకనవుతాం. దర్యాప్తు సంస్థలు దీన్ని గుర్తెరిగి వృధా కేసులతో పొద్దుపుచ్చడం మానుకోవాలి. ప్రచారయావను తగ్గించుకోవాలి. అవకాశం దొరికిందే తడవుగా వెనకా ముందూ చూడకుండా తీర్పులీయటం అలవాటైన చానెళ్లకూ ఈ కేసు గుణపాఠం కావాలి. వాంఖడే ఆర్యన్ జోలికి పోయాడు గనుక ఈ కేసు దేశంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో దర్యాప్తు సక్రమంగా సాగి నిజానిజాలేమిటో వెల్లడయ్యాయి. మరి అమాయకుల మాటో?! ఎన్‌సీబీతోసహా అన్ని దర్యాప్తు సంస్థలనూ ప్రక్షాళన చేయడం ముఖ్యమనీ, అవి స్వతంత్రంగా మెలిగేందుకు తోడ్పాటునందించడం అవసరమనీ కేంద్రం గుర్తించాలి. -
Aryan Khan: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఎన్సీబీ క్లీన్ చిట్..
Narcotics Control Bureau Has Given Clean Chit To Aryan Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) యు టర్న్ తీసుకుంది. ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్సీబీ. ఆర్యన్ ఖాన్ అమాయకుడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో లేదని స్పష్టం చేసింది. 2021, అక్టోబర్ 3న ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్లో ఎన్సీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో ఇదొక హై ప్రొఫైల్ కేసుగా వార్తల్లో నిలిచింది. డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో.. ఆర్యన్‌తో పాటు మరో 19మందిపై కేసు నమోదు అయ్యాయి. వీళ్లలో ఆర్యన్‌తోపాటు మరో 17 మందికి బెయిల్ దొరికింది. కాగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారుల్ని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇటీవల పక్కకు తప్పించిన విషయం తెలిసిందే. విశ్వ విజయ్ సింగ్, అశిష్ రాజన్ ప్రసాద్‌లు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇన్చార్జిగా, డిప్యూటీ ఇన్వెస్టిగేషన్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే వీళ్లిద్దరూ అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, అందుకే వీళ్లను తప్పించినట్లు యాంటీ డ్రగ్ ప్రొబ్ ఏజెన్సీ (ఎన్సీబీ) స్పష్టం చేసింది. చదవండి:👇 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ 12 ఏళ్ల లవ్.. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ -
ఎన్సీబీ అదుపులో డీకే శ్రీనివాస్‌నాయుడు
బనశంకరి(బెంగళూరు): మాదకద్రవ్యాల కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన దివంగత పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవుల నాయుడు కుమారుడు, పారిశ్రామికవేత్త డీకే శ్రీనివాస్‌నాయుడును ఎన్సీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. బుధవారం నగర కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి కస్టడీకి ఆదేశించారు. బెంగళూరు సదాశివనగరలోని ఒక అపార్టుమెంటులో పార్టీ చేసుకుంటుండగా ఎస్సీబీ అధికారులు దాడి చేశారు. అక్కడ నిషేధిత మత్తు పదార్థాలు పట్టుబడటంతో శ్రీనివాస్‌నాయుడును అదుపులోకి తీసుకున్నారు. -
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి మృతి
ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఓ ప్రధాన సాక్షి మృతిచెందాడు. ఈ కేసులో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ గుండెపోటుతో కన్నుమూశాడు. శుక్రవారం మధ్యాహ్నం ముంబై పరిధిలోని చెంబూర్‌లోని మహుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో అతను చనిపోయినట్లు తెలుస్తోంది. 2021లో నమోదు అయిన ఆర్యన్ ఖాన్ కేసులో ప్రభాకర్ ఇండిపెండెంట్ విట్నెస్గా ఉన్నాడు. ప్రభాకర్ మృతిలో ఎలాంటి అనుమానాలు లేవని అతని కుటుంబం ధృవీకరించిన విషయాన్ని ప్రభాకర్ తరపు న్యాయవాది తుషార్ ఖాండేర్ వెల్లడించారు. ప్రభాకర్‌కు తల్లి, భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేపీ గోసావీ అనే వ్యక్తి దగ్గర ప్రభాకర్ సెయిల్ సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు. ముంబై క్రూయిజ్ పార్టీలో గోసావీ కూడా పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరో సాక్షి సామ్ డీసౌజా, గోసావీ-ప్రభాకర్‌ల మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. వాళ్లు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపించాడు. అయితే ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేతో పాటు ఎన్సీబీ పైనా అవినీతి ఆరోపణలు చేశాడు ప్రభాకర్. ఈ నేపథ్యంలో అన్ని ఆరోపణల మీద విచారణ జరుగుతోంది. ఈలోపే ప్రభాకర్ గుండె పోటుతో చనిపోవడం.. కేసును మలుపు తిప్పే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ముంబైలో చోటు చేసుకున్న ఈ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ముంబై తీరంలో కార్డీలియా క్రూయిజ్ లైనర్ అనే నౌకపై ఎన్సీబీ అధికారులు దాడులుచేశారు. రేవ్ పార్టీ జరుగుతోందని, విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నారని సమాచారం అందడంతో సోదాలు చేశారు. క్రూయిజ్‌లో డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తొలి అరెస్ట్ ఆర్యన్ ఖాన్‌దే కావడం విశేషం. -
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: అందుకు అదనంగా 90 రోజులు..
Aryan Khan Drugs Case: NCB Seeks 90 More Days For File Charge Sheet: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడికీ వెళ్లడంతో బీటౌన్ షాక్ అయింది. గతేడాది అక్టోబర్ 2న క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తర్వాత ఆర్యన్‌ను అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్ జైలుకు తరలించగా సుమారు 20 రోజులు గడిపాడు ఈ స్టార్ కిడ్. ఆర్యన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా పలుమార్లు తిరస్కిరించింది. దీంతో ఆర్యన్ ముంబై హైకోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ కేసును ఎన్సీబీ సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం) దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే. చదవండి: 2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే.. ఈ కేసులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసేందుకు తమకు 90 రోజుల అదనపు సమయం కావాలని కోర్టును ఎన్సీబీ కోరింది. ముంబై సెషన్స్ కోర్టులో మార్చి 28న పిటిషన్ వేసింది. అయితే ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 180 రోజుల్లోగా ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయాలి. దీని ప్రకారం చూస్తే ఆర్యన్ డ్రగ్స్ కేసులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు ఏప్రిల్ 2 చివరి తేది అవుతుంది. ఈ లెక్కన మరో 90 రోజుల అదనపు సమయం అంటే ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు జూలై 2 తేది చివరి తేది కానుంది. గతేడాది అక్టోబర్ 2న పార్టీ జరగగా.. అక్టోబర్ 3న ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. ఈ కేసులో సుమారు 20 మందిని ఎన్సీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 18 మంది బెయిల్‌పై బయట ఉన్నారు. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుపై సౌత్ హీరో సంచలన వ్యాఖ్యలు -
ఎన్సీబీ నుంచి తిరిగి డీఆర్ఐకి సమీర్ వాంఖడే
న్యూఢిల్లీ: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై జోనల్ డైరెక్టర్‌గా కొనసాగిన సమీర్ వాంఖడే తిరిగి మాతృసంస్థ అయిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) పరిధిలోకి వెళ్లిపోయారు. 2008 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారి అయిన సమీర్ వాంఖడే ఎన్సీబీ ముంబై విభాగం చీఫ్‌గా 2020 ఆగస్ట్ నుంచి కొనసాగుతున్నారు. 2021అక్టోబర్‌లో ముంబై తీరంలో క్రూయిజ్ నౌకలో సోదాలు జరిపి డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ సహా కొందరిని అదుపులోకి తీసుకోవడంతో వాంఖడే పేరు మార్మోగింది. డిసెంబర్ 31వ తేదీతో ఎన్సీబీలో వాంఖడే పదవీ కాలం ముగిసింది. కేంద్రం పదవీ కాలాన్ని పొడిగించకపోవడంతో తిరిగి వాంఖడే డీఆర్ఐకు వెళ్లిపోయారు. -
డ్రగ్ కేసులో ఇరికిస్తామని బెదిరింపులు, యువ నటి ఆత్మహత్య
ఫేక్ ఎన్సీబీ అధికారుల రైడింగ్‌తో కలత చెందిన యువ నటి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటు చేసుకుంది. డ్రగ్ కేసులో ఇరికిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 20న నటి స్నేహితులతో కలిసి హుక్కా పార్లర్‌కు వెళ్లింది. అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎన్సీబీ అధికారులమంటూ రైడ్ చేశారు. కేసు పెట్టకూడదంటే 40 లక్షల రూపాయలివ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. దీంతో సదరు నటి అతికష్టం మీద రూ.20 లక్షలు సర్దగలిగింది. అయినప్పటికీ వారు మరింత డబ్బు కావాలని వేధింపులకు గురి చేశారు. ఈ వ్యవహారంతో కలత చెందిన నటి డిసెంబర్ 23న తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రైడ్ జరిపింది ఫేక్ ఎన్సీబీ అధికారులని గుర్తించారు. ఎన్సీబీ అధికారులమని చెప్పుకున్న నిందితులు సూరజ్ పర్దేశి, ప్రవీణ్ వాలింబేను అరెస్ట్ చేశారు. అయితే ఆమె దగ్గర డబ్బు గుంజడానికి నటి స్నేహితులే ఆమెను పార్టీకి తీసుకెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎన్సీబీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్సీబీ అధికారులు ప్రైవేట్ ఆర్మీని సృష్టించి సెలబ్రిటీలను పనిగట్టుకుని వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. అయితే అధికారులు మాత్రం నటి ఆత్మహత్యలో అరెస్టయిన ఇద్దరు వ్యక్తులతో ఎన్సీబీకి ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు. -
బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్‌కు ఊరట
Aryan Khan Gets Relief From Weekly Attendance At NCB Mumbai Office: క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసులో బెయిల్‌పై విడుదలైన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ప్రతి శుక్రవారం ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో హాజరు కావాలన్న బెయిల్ షరతు నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం జరిగిన విచారణలో బాంబే హైకోర్టు ఆర్యన్‌కు సంబంధించిన బెయిల్ షరతు నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. దీంతో ఇకపై ప్రతి శుక్రవారం ఆర్యన్.. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఢిల్లీ ఎన్సీబీ కార్యాలయం ఎప్పుడు సమన్లు పంపినా 72 గంటల్లోగా హాజరు కావాలని ఆర్యన్‌కు సూచించింది. అంతేకాకుండా ముంబై వదిలి వెళ్లేటప్పుడు అధికారులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. -
బాంబే హైకోర్టుకు నవాబ్ మాలిక్ క్షమాపణ
ముంబై: మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత నవాబ్ మాలిక్ బాంబే హైకోర్టుకు శుక్రవారం క్షమాపణ చెప్పారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖెడే, ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తాను హామీ ఇచ్చినప్పటికీ బహిరంగంగా విమర్శలు చేసినందుకు గాను ఈ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు నవాబ్ మాలిక్ తరపు న్యాయవాది అస్పీ చినోయ్ కోర్టులో అఫిడవిట్ వేశారు. నవంబర్ 29న కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు క్షమాపణ చెబుతున్నట్లు మాలిక్ పేర్కొన్నారు. కోర్టును అగౌరవపర్చడం తన ఉద్దేశం కాదన్నారు. వాంఖెడేపై తన క్లయింట్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని చినోయ్ వివరించారు. మాలిక్ క్షమాపణను హైకోర్టు అంగీకరించింది. మాలిక్‌పై వాంఖెడే తండ్రి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ దావా విచారణకు వచ్చేదాకా వాంఖెడే కుటుంబంపై విమర్శలు చేయనంటూ మాలిక్ హామీ ఇచ్చారు. కానీ, విమర్శలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బెయిల్ నిబంధనలు మార్చండి: ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ విధించిన నిబంధనలు మార్చాలని షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బాంబే శుక్రవారం హైకోర్టును ఆశ్రయించాడు. ప్రతి శుక్రవారం దక్షిణ ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కార్యాలయంలో హాజరు కావాలంటూ విధించిన నిబంధనను మార్చాలని అభ్యర్థించాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు వచ్చేవారం విచారణ చేపట్టనుంది. -
కొత్త బాడీగార్డ్ కావాలంటున్న బాలీవుడ్ బాద్షా.. కారణం ఇదే
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ డిసెంబరులో తన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అక్టోబర్ 3న అరెస్ట్ చేసింది. దీంతో షారుఖ్ తన మూవీ షూట్లకు బ్రేక్ ఇచ్చాడు. కుమారుడి అరెస్టుతో అతని కుటుంబంతో కలిసి ముంబై తిరిగి రాక తప్పలేదు. అనేక పరిణామల తర్వాత అక్టోబర్ 28న ఆర్యన్‌కు బెయిల్ రావడంతో షారుఖ్ ఊపిరిపీల్చుకున్నాడు. దీంతో మళ్లీ బాద్షా పనిలో నిమగ్నమయ్యేముందు కుటుంబంతో కొంత సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆర్యన్ కోసం షారుఖ్ కొన్ని మార్పులు చేశారు. ఆర్యన్‌కు ఒక నమ్మదగిన బాడీగార్డ్‌ను నియమించాలను చూస్తున్నారని సమాచారం. చాలా కాలం పాటు తనతో ఉండి, తన కుటుంబంలో వ్యక్తిగా భావించే షారుఖ్ బాడీగార్డ్ రవి సింగ్‌ను ఆర్యన్‌తో ముంబైలో ఉండమని అడిగారట. ప్రస్తుతం తన కోసం కొత్త బాడీగార్డును నియమించుకోవాలని చూస్తున్నారట షారుఖ్. బెయిల్ షరతుల ప్రకారం ఆర్యన్ ప్రతి శుక్రవారం ఎన్సీబీ కార్యాలయంలో హాజరవ్వాలి. కేసు దర్యాప్తు చేస్తున్న కొత్త బృందంతో తరచుగా సమన్లు రావొచ్చు. ఇలాంటి సందర్భంలో ఆర్యన్ వెంట షారుఖ్‌కు తెలిసిన, నమ్మదగిన వ్యక్తి ఉండటం ఉత్తమమని భావించారు. ముందుగా షారుఖ్ పఠాన్ సినిమా షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లాల్సి ఉంది. అన్ని సక్రమంగా జరిగితే వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమవుతుంది. షారుఖ్ ఖాన్ పఠాన్‌లో జాన్ అబ్రహం, దీపికా పదుకొనేతో కలిసి నటించనున్నారు. అలాగే అట్లీ తదుపరి చిత్రం కూడా చేయనున్నారు. -
బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. మరో కొత్త విషయం వెలుగులోకి..
ముంబై: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శామ్ డిసౌజా మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు నౌకపై దాడి చేసిన తర్వాత ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టడానికి ఆ కేసులో సాక్షి అయిన కిరణ్ గోసావి షారూక్‌ఖాన్ మేనేజర్ పూజ దాడ్లాని దగ్గర నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. అయితే ఎన్సీబీ ఆర్యన్‌ను అరెస్ట్ చేయడంతో తిరిగి ఆ డబ్బులు ఇచ్చేశారని ఈ డీల్‌కి మధ్యవర్తిత్వం వహించినట్టుగా అనుమానాలున్న శామ్విల్లి డిసౌజా ఆరోపించారు. ఆర్యన్‌ను విడిచిపెట్టడానికి ఎన్సీబీ అధికారుల తరఫున మధ్యవర్తులు రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గుతేల్చడానికి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ విషయాలన్నీ తెలిసిన తనని సిట్ అరెస్ట్ చేస్తుందన్న భయంతో బాంబే హైకోర్టులో శామ్ డిసౌజా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. దీన్ని హైకోర్టు తిరస్కరించింది. కిరణ్ గోసవి, ప్రభాకర్ సాయిల్ ఈ కేసులో సాక్షులు కారని, వారే అసలు సిసలైన కుట్రదారులని డిసౌజా ఆరోపించారు. చదవండి: (చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?) -
డ్రగ్స్ కట్టడిలో ఏపీ భేష్.. వాస్తవాలు ఇవే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లిస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది. డ్రగ్స్ కేసులతోపాటు దేశంలో అన్ని రకాల నేరాలకు సంబంధించి ఎన్సీబీ నివేదికే ప్రామాణికం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థంగా డ్రగ్స్‌ను కట్టడి చేస్తోందని ఆ నివేదిక స్పష్టం చేస్తుండగా చంద్రబాబు మాత్రం రాష్ట్రంపై బురద చల్లుతుండటాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. ఎన్సీబీ నివేదికలే వాస్తవాలను వెల్లడిస్తున్నాయని పేర్కొంటున్నారు. టాప్‌లో యూపీ, పంజాబ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర 2020లో దేశంలో నేరాలకు సంబంధించి ఎన్సీబీ ఇటీవల నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం గతేడాది డ్రగ్స్ కేసుల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ 10,852 కేసులు నమోదయ్యాయి. 6,909 కేసులతో పంజాబ్ రెండో స్థానంలో ఉంది. 5,403 కేసులతో తమిళనాడు మూడో స్థానంలో, 4,968 కేసులతో కేరళ నాలుగు, 4,714 కేసులతో మహారాష్ట్ర ఐదో స్థానంలో నిలిచాయి. 2020లోనే కాదు గత కొన్నేళ్లుగా ఆ ఐదు రాష్ట్రాలే అటూ ఇటూగా డ్రగ్స్ కేసుల్లో అగ్ర స్థానాల్లో ఉన్నాయి. 2018, 2019లో మహారాష్ట్ర, పంజాబ్, యూపీ, కేరళ, తమిళనాడు వరుసగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 2017లో మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, యూపీ, తమిళనాడు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. సమర్థంగా కట్టడి.. 18వ స్థానంలో ఏపీ 2020లో డ్రగ్స్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది. 28 రాష్ట్రాలున్న జాబితాలో మన రాష్ట్రం 18వ స్థానంలో ఉందంటే ప్రభుత్వం డ్రగ్స్ దందాను ఎంత సమర్థంగా కట్టడి చేస్తోందన్నది స్పష్టమవుతోంది. దేశంలో ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కేసుల్లో అంత చివరిలో ఉండటం ప్రభుత్వ సమర్థతకు నిదర్శమని నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ వ్యవహారాలను మరింత సమర్థంగా కట్టడి చేస్తోంది. దీంతో ఏపీ ట్రాక్ రికార్డ్ 2020లో మరింత మెరుగైంది. టీడీపీ హయాంలో 2017లో మన రాష్ట్రం డ్రగ్స్ కేసుల్లో 16వ స్థానంలో ఆ తరువాత ఏడాది 17వస్థానంలో నిలిచింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరింత సమర్థంగా డ్రగ్స్ వ్యవహారాలను కట్టడి చేసింది. దీంతో 2020లో మన రాష్ట్రం డ్రగ్స్ కేసుల్లో దేశంలో 18వ స్థానానికి తగ్గిపోయింది. అంటే రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాలను ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసినట్లేనన్నది స్పష్టమవుతోంది. -
జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై NCB విచారణ
-
డ్రగ్స్ కేసు: ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్‌లో అనన్య పేరు.. ఎవరీ భామ?
బాలీవుడ్లో డ్రగ్స్ కేసుల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండేళ్ల క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య టైమ్‌లో ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. అప్పటినుండి ఎన్సీబీఐ చూపు మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీల పైనే ఉంది. తాజాగా క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టై జైల్లో ఖైదీగా ఉన్న విషయం తెలిసింది. (చదవండి: షారుక్ నాకు తండ్రిలాంటి వాడు.. వైరల్ అవుతున్న పాత ఇంటర్వ్యూ) ఈ కేసుకు సంబంధించి తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఇంటిలో ఎన్సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.అక్కడ ఆమె ఫోన్‌ను స్వాదీనం చేసుకున్న అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని తెలిపారు. అంతేకాదు ఆమె ఫోన్, ల్యాబ్టాప్నీ సీజ్ చేశారు కూడా. . రేవ్ పార్టీ జరుగుతన్న సమయంలో ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ కోసం ఒక నటికి వాట్సప్ మెసేజ్ పంపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ సమయంలో ఆర్యన్ చాట్ చేసింది అనన్య పాండేతోనే అని తేలింది. అలా అనన్య కూడా ఈ డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. ఎవరీ అనన్య పాండే? ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న అనన్య పాండే.. బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే తనయ అనే విషయం తెలిసిందే. 2019లో `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్ వాహ్’తో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ భామ ఒక హిందీ మూవీతో పాటు.. తెలుగులో 'లైగర్' లో నటిస్తోంది. హీరోయిన్గా ఇప్పటివరకు పెద్ద హిట్ కొట్టకపోయినా.. పార్టీ, పబ్బుల్లో మాత్రం ఈ భామ జోరు ఓ రేంజ్లో ఉంటుంది. షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, సైఫ్ కుమార్తె సారా అలీ ఖాన్, అమితాబ్ మనవరాలు నవ్య నవేలి నందా, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. అనన్యకు మంచి స్నేహితులు. వీళ్లంతా కలిసే పబ్లకి వెళ్తుంటారు. అర్యన్ ఖాన్‌తో సహా మరికొంతమంది కూడా ఈ గ్యాంగ్‌తో కలిసి పార్టీలకు వెళ్తుంటారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ పోలీసులకు పట్టుబడడంతో వీరి బాగోతం అంతా బయటపడుతోంది. -
అనన్యపాండే మొబైల్, ల్యాప్‌టాప్ సీజ్
Ananya Pandays Mobile, Laptop Seized : బాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు కుదిపేస్తుంది. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ అనన్య పాండే ఎన్సీబీ ఎదుట హాజరయ్యింది. తండ్రి, నటుడు చంకీ పాండేతో కలిసి ఆమె ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది. ఈరోజు ఉదయం అనన్య ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు ఆమె ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. ఈనెల 2న జరిగిన క్రూయిజ్ రేవ్ పార్టీలో డ్రగ్స్ కావాలని ఆర్యన్.. అనన్యకు వాట్సప్ చాట్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చాట్‌లో లైగర్ భామ అనన్యతో పాటు ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా స్టార్ హీరోల పిల్లలు కావడంతో అందరికి ఓ కామన్ వాట్సాప్ గ్రూప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే అనన్య బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది. తెలుగులోనూ విజయ్ దేవరకొండ సరసన లైగర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. చదవండి: నన్ను క్షమించండి డాడీ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్! బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత -
రేవ్ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్
ముంబై: డ్రగ్స్ దందాను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, కేటుగాళ్లు సరికొత్త దారులు ఎంచుకుంటూ సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో ఓ మహిళ ఏకంగా శానిటరీ న్యాప్కిన్లో డ్రగ్స్ తీసుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలడంతో షాక్ గరయ్యారు. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం 19మందిని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా అక్టోబర్ 11న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ప్రొడ్యూసర్ ఇంతియాజ్ ఖత్రీకి ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చేందుకు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే ప్రయత్నించగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ముంబై మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆర్యన్ ఖాన్ సహా ఏడుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్యన్ ఖాన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టులో.. ఆర్యన్ ఖాన్‌ను క్రూయిజ్ పార్టీకి ఆహ్వానించారు. అయితే, అతనికి బోర్డింగ్ పాస్ కూడా లేదు. రెండవది, పోలీసులు అర్యాన్ని అదుపులోకి తీసుకుంది కూడా కేవలం అతని చాట్ ఆధారంగా మాత్రమేనని మరే ఇతర బలమైన అధారాలు లేవని తెలిపారు. చదవండి: భార్యే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..?