Aryan Khan Drugs Case: NCB Seeks 90 More Days For File Charge Sheet: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కస్టడికీ వెళ్లడంతో బీటౌన్ షాక్ అయింది. గతేడాది అక్టోబర్ 2న క్రూయిజ్ షిప్‌లో జరిగిన పార్టీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తర్వాత ఆర్యన్‌ను అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్ జైలుకు తరలించగా సుమారు 20 రోజులు గడిపాడు ఈ స్టార్ కిడ్. ఆర్యన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా పలుమార్లు తిరస్కిరించింది. దీంతో ఆర్యన్ ముంబై హైకోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ కేసును ఎన్సీబీ సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం) దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే.
చదవండి: 2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే..
ఈ కేసులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసేందుకు తమకు 90 రోజుల అదనపు సమయం కావాలని కోర్టును ఎన్సీబీ కోరింది. ముంబై సెషన్స్ కోర్టులో మార్చి 28న పిటిషన్ వేసింది. అయితే ఏదైనా కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 180 రోజుల్లోగా ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయాలి. దీని ప్రకారం చూస్తే ఆర్యన్ డ్రగ్స్ కేసులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు ఏప్రిల్ 2 చివరి తేది అవుతుంది. ఈ లెక్కన మరో 90 రోజుల అదనపు సమయం అంటే ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు జూలై 2 తేది చివరి తేది కానుంది. గతేడాది అక్టోబర్ 2న పార్టీ జరగగా.. అక్టోబర్ 3న ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. ఈ కేసులో సుమారు 20 మందిని ఎన్సీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 18 మంది బెయిల్‌పై బయట ఉన్నారు.
చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుపై సౌత్ హీరో సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment