cruise ship
-
అంబానీ ప్రేయసి: ఈ ఒక్క లుక్ విలువ రూ. 1002కోట్లు! నమ్ముతారా?
అనంత్ అంబానీకి కాబోయే భార్య, రాధికా మర్చంట్ ఫ్యాషన్ ఔట్ఫిట్స్ ఫ్యాన్స్‌ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. రిలయన్స్ వ్యాపార వారసుడు అనంత్ అంబానీ ప్రేయసిగా తన ఫ్యాషన్ స్టయిల్‌తో కాబోయే అత్తగారు నీతా అంబానీని మించి అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా అనంత్- రాధిక ఇటలీ - ఫ్రాన్స్ లగ్జరీ క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో అంబానీ కోడలిగా కాబోయే వదువు రాధిక మెస్మరైజ్ చేసింది. వేలకోట్ల రూపాయలతో నిశ్చితార్థ వేడుక, మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగాయి. తాజాగా రెండో ప్రీ-వెడ్డింగ్ బాష్ థీమ్ 'లా వీటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం), ఫ్యాషన్ స్టేట్మెంట్లతో ప్రతీ ఈవెంట్, దుస్తులు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. అంబానీ ఫ్యాన్ పేజీ అందించిన డ్రెస్ ధలు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి.వైట్ డ్రెస్ మహారాణిలా, ధర రూ.1002 కోట్లురాధికా మర్చంట్ తెల్లటి తమరా రాల్ఫ్ డ్రెస్, డైమండ్ ఆభరణాలతోరాయల్లుక్లో అందంగా మెరిసి పోయింది. స్ప్రింగ్-సమ్మర్ 2024 కలెక్షన్‌కు చెందిన శాటిన్ గౌనులో రాణిలా కనిపించింది. పట్టు , క్రిస్టల్‌తో చేసిన గులాబీలు మెడ, నడుముపైనా, తలకు కిరీటంగా అమిరాయి. ఈ మొత్తం లుక్ ధర రూ. 1002కోట్లుక్రూయిజ్ బాష్‌లో స్టార్రి నైట్ పార్టీ కోసం రాధిక ధరించిన డైమండ్ ఇయర్‌కఫ్‌లు, లావెండర్ డ్రెస్, మొత్తం లుక్ ఖర్చు రూ. 896 కోట్లు.రెండో రోజు, టోగా పార్టీకోసం ఏరోస్పేస్ టెక్నాలజీతో తయారు చేసిన డ్రెస్, బంగారు ఆభరణాలతో డైమండ్ నగలు, బ్యాంగిల్స్ , వాచ్‌తో సహా మొత్తం లుక్ రూ. 697 కోట్లు.అనంత్ ప్రేమను చుట్టుకున్న ఈ లుక్ ధరఅనంత్ తన ప్రేమంతా కురిపించిన లవ్‌లెటర్‌తో రాబర్ట్ వున్ డిజైన్ చేసిన గౌను ధరించింది. లేయర్డ్ డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు ధరించింది. ఈమొత్తం లుక్ ఖర్చు రూ. 478 కోట్లు.పాతకాలపు డియోర్ డ్రెస్‌లో ఖరీదైన యాక్సెసరీస్‌తో రాధిక అందంగా కనిపించిన మరో డ్రెస్ విలువ రూ. 26 లక్షలు రాధిక మర్చంట్ చిక్ బాల్మైన్ గౌను రూ. 5.43 లక్షలు. ఇంకా చెప్పాలంటే ఈ లిస్ట్ చాలా పెద్దదే. -
ప్రీ వెడ్డింగ్ కోసం అంబానీ ఫ్యామిలీ బుక్ చేసుకున్న క్రూయిజ్ షిప్ (ఫోటోలు)
-
అంబానీ బుక్ చేసుకున్న క్రూయిజ్‌లో వెళ్తారా.. ఒక్కరోజుకి అన్ని లక్షలా?
జులైలో పెళ్లి చేసుకోబోతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గతంలో జామ్‌నగర్‌లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇటీవలే మరోసారి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ క్రూయిజ్ షిప్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుక 29 మే నుంచి జూన్ 1 వరకు జరిగింది.ఇటలీ నుంచి సౌత్ ఫ్రాన్స్ వరకు సుమారు 4,380 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విలాసవంతమైన క్రూయిజ్ లైనర్‌లో సుమారు 800 మంది ప్రముఖులు పాల్గొన్నారు. అంబానీ ఫ్యామిలీ బుక్ చేసుకున్న ఈ క్రూయిజ్ షిప్ విలాసవంతమైన సదుపాయాలను కలిగి ఉంటుంది.గతంలో జామ్‌నగర్ వేడుకలకు అంబానీ కుటుంబం రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది. ఈ సారి క్రూయిజ్ షిప్లో జరిగిన వేడుకలకు ఎంత ఖర్చు చేశారనేది అధికారికంగా వెల్లడి కాలేదు. దీనికి కూడా వేలకోట్లు ఖర్చు చేసి ఉంటారని తెలుస్తోంది.క్రూయిజ్ షిప్లో బస చేయడానికి అయ్యే ఖర్చుఅంబానీ ఫ్యామిలి బుక్ చేసుకున్న సెలబ్రిటీ అసెంట్ క్రూయిజ్ షిప్లో ఒక రాత్రి బస చేయాలనంటే ఒక గదికి 1849 డాలర్ల నుంచి 2879 డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 153705 నుంచి రూ. 239328 ఖర్చు అవుతుందని సమాచారం. సెలబ్రిటీ క్రూయిసెస్ ప్రకారం, ఓషన్-వ్యూ స్టేట్‌రూమ్ అండ్ సూట్ కోసం 5,736 డాలర్లు లేదా దాదాపు రూ. 4,76,828 వెచ్చించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. 👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎవ్వరూ ఊహించని రీతిలో అనంత్ అంబానీ పెళ్ళి
-
ఆనంద్ మహీంద్రా సండే ట్వీట్.. 'సిటీ ఆఫ్ సీ' వీడియో
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆదివారం విశ్రాంతి వీక్షణ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో అతి పెద్ద 'ఐకాన్ ఆఫ్ ది సీస్' షిప్ సముద్రం మీద ఉండటం చూడవచ్చు.వీడియోను షేర్ చేస్తూ.. సండే విశ్రాంతిగా వీక్షించడం కోసం. ఇది 2026 వరకు బుక్ అయిపోయింది. ప్రపంచంలోని అతిపెద్ద పర్యాటక జనాభాలో భారతీయులు ఒకరు. సొంత క్రూయిజ్ షిప్‌లను ఎక్కువగా డిమాండ్ చేస్తాము.. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఐకాన్ ఆఫ్ ది సీస్ఐకాన్ ఆఫ్ ది సీస్ విషయానికి వస్తే.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్. ఇది రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ కోసం నిర్మించబడినట్లు తెలుస్తోంది. దీని బరువు సుమారు 248663 టన్నులు. ఇందులోనే రిసార్ట్స్, రెస్టారెంట్స్, స్విమ్మింగ్ పూల్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇది టైటానిక్ షిప్ కంటే కూడా పరిమాణంలో ఐదు రెట్లు పెద్దగా ఉందని చెబుతారు. కాబట్టి దీన్ని 'సిటీ ఆఫ్ సీ' అని పిలుస్తారు.For Sunday leisure viewing. It’s booked till ‘26. But Indians will be one of the two largest tourist populations in the world…And we will most likely demand—and get—our own cruise ships… pic.twitter.com/IgxW4YhyWZ— anand mahindra (@anandmahindra) May 19, 2024 -
ఏడాదికిపైగా ఆ జంట నీటిపైనే జీవనం! ఎందుకో తెలుసా
ఏడాదికి పైగా ఆ జంటే నీటిపైనే జీవనం సాగించారు. ఆమె వంటగదిలోకి అడుగుపెట్టడం, వాషింగ్ మెషిన్ వినియోగించటం వంటివి చేయలేదట. పైగా అన్ని రోజులు నీటిపైనే ఎలా జీవించారు. ఎందుకంటే.. మోనికా బ్రజోస్కో, ఆమె భర్త జోరెల్ కాన్లీ ప్రత్యకమైన జీవనశైలిని ప్రారంభించారు. టేనస్సీలోని మెంఫిస్‌కు చెందిన ఈ జంట వారు ఆస్తులను విక్రమయించి మరీ క్రూయిజ్ షిప్ల్లోనే పయనిస్తున్నారు. వారికి కొత్త ప్రదేశాలను చుట్టి రావడమంటే మహా సరదా. అందుకోసం అని 9 టు 5 ఉద్యోగాలను కూడా వదిలేశారు. పైగా వారి ఇంటిని కూడా అమ్మేసి వచ్చిన డబ్బులతో కొత్త కొత్త ప్రదేశాలను చుట్టోస్తున్నారు. ఇలా ఏడాదికిపైగా షిప్ల్లోనే ప్రయాణాలు చేశారు ఈ జంట. పైగా మోనికా తాను వంటగదిలోకి అడుగుపెట్టి ఏడాదికి పైగా అయ్యిందని చెబుతోంది. ఆఖరికి వాషింగ మెషిన్ వినియోగించ లేదంటోంది. ఆ షిప్ సిబ్బందే తమ అవసరాలన్నీ చూసుకునేవారని చెప్పింది. అలాగే ఈ క్రూయిజ్ షిప్‌ల్లో ప్రయాణించేందుకు చక్కటి ఆర్థిక ప్రణాళికతో సాగుతున్నారు. ఏడాదికి సుమారు రూ. 8 లక్షలకు మించకుండా ఖర్చులు చూసుకుంటూ చక్కెర్లు కొడుతోంది ఈ జంట. తాము ఈ క్రూయిజ్ షిప్‌ల్లో ప్రయాణించేలా చక్కటి ఆఫర్లను ఉపయోగించుక్నుట్లు తెలిపింది. అలాగే భూమిపై జీవితాన్ని విడిచిపెట్టడాన్ని విముక్తిగా అభివర్ణించారు. అంతేగాదు మాకు రోజులన్నీ విశ్రాంతిగా అన్యప్రదేశాలను అన్వేషించడంతో బిజీగా ఉన్నాయని ఆనందంగా చెబుతున్నారు. ఈ నీటిపై జీవనం ప్రతిక్షణం ఓ మాయజాలంలా అద్భుతంగా ఉంటుందని అంటోంది ఆ జంట. అలాగే ప్రపంచ అన్వేషణ గురించి సాగుతున్న తమ కల కూడా నిజం అవుతోందని ఆనందంగా చెబుతోంది ఆ జంట. (చదవండి: గుడ్లు ఎక్కువగా తింటున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!) -
ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్‌షిప్.. ప్రత్యేకతలివే..
సముద్ర అలలతో పోటీపడేలా ఆశలు ఉప్పొంగేవారికి ఇదో అద్భుతమైన అవకాశం. సముద్ర జలాల్లో ప్రయాణానికి ప్రపంచంలోనే అతి పెద్ద నౌక సిద్ధమైంది. టైటానిక్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దది. ఈ నౌకలోనే సకల సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచంలోని నౌకల్లో స్వర్గధామంగా మారిన ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామీ పోర్టు నుంచి బయలుదేరి వారం రోజులపాటు సముద్ర జలాలాపై విహరిస్తూ తూర్పు కరేబియన్ దీవులగుండా ప్రయాణించి ఫిబ్రవరి 3న తిరిగి మయామీకి చేరుకోనుంది. రకరకాల ధరల శ్రేణుల్లో ఈ విలాసనౌకలో అద్భుత ప్రయాణానికి ఏర్పాట్లున్నాయి. ప్రత్యేకతలివీ.. ఫిన్లాండ్లో మెయర్ తుర్కు షిప్‌యార్డ్ ఈ నౌకని నిర్మించింది. రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ఈ నౌక పేరు ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’. నౌక పొడవు 1200 అడుగులు, బరువు 2,50,800 టన్నులు. ఈ నౌకలో 2,350 మంది సిబ్బంది ఉంటారు. 7,600 మంది ప్రయాణించగలరు. ప్రపంచ వ్యాప్తంగా 40 ప్రాంతాలకు చెందిన విభిన్న ఆహార పదార్థాలు ఈ షిప్లో లభిస్తాయి. నౌకలో వాటర్‌పార్క్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, ఫ్యామిలీలు ఎంజాయ్ చేసే సకల సదుపాయాలున్నాయి. ఈ నౌకలో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్క్ ఉంది. దీన్ని ‘కేటగిరీ 6’ అని పిలుస్తారు. ఈ వాటర్ పార్కులో ఆరు స్లైడ్లు ఉన్నాయి. ఒక వాటర్ స్లయిడ్ నుంచి నేరుగా సముద్రంలోకి డైవ్ చేసేలా పెట్టారు. కానీ ప్రయాణికుల భద్రత రీత్యా దీనిని వారికి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాల్లేవు. 2023 జూన్ 22న ఈ నౌక విజయవంతంగా మొదటి ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. నౌకలో ఉద్యానవనాలు ఉన్నాయి. పార్కుల్లోనూ ప్రయాణికులు సేద తీరవచ్చు. కాలుష్య నివారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)ను ఇంధనంగా వాడుకుంటూ ఈ నౌక ప్రయాణం కొనసాగిస్తుంది. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియెనల్ మెస్సీ ఈ నౌకకు పేరుపెట్టడం విశేషం. వివిధ రకాల ప్యాకేజీల కింద ధరలున్నాయి. అన్నింటికంటే తక్కువగా ఏడు రాత్రులు ఓడలో గడపాలంటే 3 వేల పౌండ్ల (కనిష్టంగా దాదాపు రూ.3.2 లక్షలకు పైన) వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదీ చదవండి: ఈ దేశాల్లో డబ్బులన్నీ వ్యాపార కుటుంబాలవే.. కరేబియన్‌లో అత్యంత అందమైన దీవులైన బహమాస్, కొజుమెల్, ఫిలిప్స్బర్గ్, సెయింట్ మార్టెన్, రోటన్, హోండురస్ వంటి వాటి మీదుగా ఈ నౌక ప్రయాణిస్తుంది. -
సాగర విలాసం.. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నౌక
అది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద విహార నౌక. పేరు ఐకాన్ ఆఫ్ ద సీస్. పొడవు 365 మీటర్లు. బరువు 2.5 లక్షల టన్నుల పై చిలుకు. 20 డెక్కులు, ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వాటర్ పార్కు, స్విమింగ్ పూల్స్ వంటి లెక్కలేనన్ని ఆకర్షణలు దాని సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే అదో మినీ ప్రపంచం. కళ్లు చెదిరే స్థాయిలో సర్వ సదుపాయాలున్న ఈ లగ్జరీ క్రూయిజ్ ఆదివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 10న అమెరికాలో మియామీ బీచ్‌లో అంగరంగ వైభవంగా జలప్రవేశం చేసింది. ఆదివారం నుంచే వారం రోజుల పాటు తొలి పర్యటనకు బయల్దేరుతోంది. కరీబియన్ దీవుల్ని చుడు తూ ప్రయాణం సాగనుంది. ఈ ట్రిప్‌కు టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైనట్టు నిర్మాణ సంస్థ రాయల్ కరేబియన్ ప్రకటించింది. ఈ భారీ నౌకలో విశేషాలెన్నో... ► ఈ నౌక నిర్మాణానికి 200 కోట్ల డాలర్లకు పైగా ఖర్చయిందట. ఫిన్లండ్‌లోని మెయర్ తుర్క్ షిప్‌యార్డులో దీని నిర్మాణం జరిగింది. ► ఈ విలాస నౌక టైటానిక్ కంటే ఏకంగా ఐదు రెట్లు పెద్దది. ► ఇందులో ఏకంగా 7,960 మంది హాయిగా ప్రయాణించవచ్చు. 2,350 మంది సిబ్బందితో కలిపి దాదాపు 10 వేల మందికి పైగా పడతారు! ► 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్కు ఈ నౌక సొంతం. ► 16, 17 అంతస్తులను పూర్తిగా వాటర్ పార్కుకే కేటాయించారు. ► వాటిలో లెక్కలేనన్ని వాటర్ గేమ్స్‌ను ఆస్వాదించవచ్చు. ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయట. ఇక ఏడు సువిశాలమైన స్విమ్మింగ్ పూల్స్ అదనపు ఆకర్షణ. ► మరీ గుండెలు తీసిన బంట్లయితే 20వ అంతస్తు నుంచి నేరుగా సముద్రంలోకి డైవింగ్ చేయడం వంటి పలు సాహసాలు కూడా చేయవచ్చు. ► ప్రత్యేకంగా రూపొందించిన ఐస్ ఎరీనాలో స్కేటింగ్ కూడా చేయవచ్చు! మినీ గోల్ఫ్ కోర్సూ ఉంది. ► పలు థీమ్ పార్కులు, సువిశాలమైన 40 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత రుచులన్నింటినీ ఆస్వాదించవచ్చు. వీటిలో 21 కాంప్లిమెంటరీ తరహావి. వాటిలో ఏం తిన్నా, తాగినా అంతా ఉచితమే. ► అత్యాధునిక సినిమా థియేటర్లలో సినిమాలు మొదలుకుని లైవ్ మ్యూజిక్ షోల దాకా అన్నీ అందుబాటులో ఉంటాయి. ► 55 అడుగుల ఎత్తైన ఇండోర్ జలపాతం నౌకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ► ఈ నౌకను పూర్తిగా కలియదిరిగి చూసేందుకే కనీసం 10 రోజులు పడుతుందట! ► ఆదివారం మొదలయ్యే తొలి ప్రయాణం కరేబియన్ దీవుల్లో బహమాస్, హోండురస్ల గుండా ఏడు రాత్రులు, ఆరు పగళ్లు సాగుతుంది. ► ఈ నౌక ప్రధానంగా లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)తో నడుస్తుంది. ► 90 శాతానికి పైగా తాగునీటి అవసరాలను ఆర్వో పద్ధతిలో సముద్ర జలాల ద్వారానే తీర్చుకుంటుంది. ► ఐకాన్ ఆఫ్ ద సీస్లో ప్రయాణానికి ఔత్సాహికులు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. 2022 అక్టోబర్‌లో దీని తొలి ఫొటోలు బయటికి వచి్చనప్పటి నుంచే జనాలు విపరీతంగా ఆసక్తి చూపడం మొదలైంది. టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో పెట్టీ పెట్టడంతోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ► నిజానికిది రెండేళ్ల క్రితమే అందుబాటులోకి రావాల్సిందట. కరోనా కారణంగా ఆలస్యమైంది. ► ఇందులో రకరకాల ప్యాకేజీల్లో 2,805 గదులు, విశాలమైన లగ్జరీ కుపేలు అందుబాటులో ఉంటాయి. ► వాటి ఖరీదు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! అతి తక్కువ ప్యాకేజీయే 3 వేల డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల) నుంచి మొదలవుతుంది. 2 లక్షల డాలర్లు, అంతకు మించిన ప్యాకేజీలూ ఉన్నాయి! ► ఐకాన్ ఆఫ్ ద సీస్‌ను కూడా తలదన్నే స్థా యిలో స్టార్ ఆఫ్ ద సీస్ పేరుతో మరో అతి విలాసమైన నౌకను నిర్మిస్తామని రా యల్ కరేబియన్ ఇప్పటికే ప్రకటించింది. ► దీనికి ముందు అతి పెద్ద లగ్జరీ నౌకగా రికార్డుకెక్కిన వండర్ ఆఫ్ ద సీస్‌ను కూడా రాయల్ కరేబియనే నిర్మించింది. దాని బరువు 2.35 లక్షల టన్నులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చెన్నై టూ సింగపూర్.. వయా వైజాగ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విహార ప్రపంచానికి విశాఖ సరికొత్తగా కనిపించబోతోంది. విశాఖ మీదుగా పర్యాటక రంగంలో సేవలందించేందుకు రెండు క్రూయిజ్ షిప్పులు క్యూ కడుతున్నాయి. సాగర జలాల్లో హాయిగా విహరిస్తూ.. విశాఖ నుంచి ప్రపంచంలోని పలు నగరాలకు సర్విసులు నడిపేందుకు లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సిద్ధమవుతోంది. విశాఖలో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ మీదుగా డిసెంబర్ నుంచి తొలి సర్విస్ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. చెన్నై నుంచి సింగపూర్‌కి తొలి సర్విసు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన లిట్టోరల్.. ఈ క్రూయిజ్‌ని విశాఖ మీదుగా నడపాలని నిర్ణయించింది. మరోవైపు భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో విహరించేలా మరో క్రూయిజ్ సర్విస్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే టూరిస్ట్ క్రూయిజ్ షిప్‌ల ప్రతినిధులు విశాఖపట్నం పోర్టు అథారిటీ అధికారులతోపాటు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖతో సంప్రదింపులు జరిపారు. అనుమతులు ఇచ్చేందుకు పోర్టు అంగీకారం తెలిపింది. త్వరలోనే సర్విసుల వివరాల్ని ప్రకటించేందుకు చెన్నైకి చెందిన లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర పర్యాటక శాఖతో చర్చలు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, విశాఖ పోర్టు అథారిటీ సంయుక్తంగా విశాఖలో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. టెర్మినల్ అందుబాటులోకి రావడంతో.. క్రూయిజ్‌లో విహరించే వారికి సౌకర్యాలుంటాయన్న కారణంతో ఈ సర్విస్‌ని విశాఖ మీదుగా నడపాలని భావించారు. ముంబైలో ఇటీవల ముగిసిన గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ (జీఎంఐఎస్)–2023లో లిట్టోరల్ క్రూయిజెస్ లిమిటెడ్ ప్రమోటర్ రాజా వైజ్‌తోపాటు చెన్నైకి చెందిన వోక్ పోర్టు అథారిటీ, ట్యుటికోరిన్ పోర్టు ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి సంబంధించి విశాఖపట్నం పోర్టు ప్రతిని«ధులతో సంప్రదింపులు కూడా జరిగాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాతో లిట్టోరల్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. చెన్నైని హోం పోర్ట్‌గా చేసుకుని రెండు విలాసవంతమైన నౌకలకు సంబంధించిన నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత్–శ్రీలంక– మాల్దీవులకు మరో సర్విసు రూ.1,200 కోట్ల పెట్టుబడితో భారత్–శ్రీలంక–మాల్దీవుల మధ్య మరో లగ్జరీ క్రూయిజ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సర్విసును కూడా లిట్టోరల్ సంస్థ నడపనుంది. వీలైనంత త్వరగా ఈ సర్విసు కూడా విశాఖ మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు షిప్పులు పూర్తి లగ్జరీగా ఉంటాయని విశాఖపట్నం పోర్టు ప్రతినిధులు చెబుతున్నారు. ఒక్కొక్కటి 10 అంతస్తులుండే ఈ భారీ షిప్లో ఒకేసారి 1,200 నుంచి 1,500 మంది వరకూ ప్రయాణించవచ్చు. ఫుడ్ కోర్టులు, స్పెషాలిటీ రెస్టారెంట్లు, బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్‌షో ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న వారందరికీ షిప్‌లోని క్యాసినో వరల్డ్‌కు ఎంట్రీ ఉచితం. దీంతో పాటు లిక్కర్, ఇతర సర్విసులకు అదనపు చార్జీలు ఉంటాయి. -
సంప్రదాయం పేరిట సముద్రంలో దారుణం..
డెన్మార్క్: అంబాసిడర్ లైన్ అనే బ్రిటీష్ నౌక ఫరో ద్వీప సందర్శన సందర్బంగా అందులోని ఒక బృందం వారి ప్రాచీన సంప్రదాయమని చెబుతూ 70కి పైగా తిమింగలాలను అత్యంత క్రూరంగా వేటాడి చంపేశారు. ఆ సమయంలో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ అంబాసిడర్ నావికుడు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరారు. మనిషి కంటే క్రూరమైన జంతువు భూమ్మీద లేదు. దీన్ని నిజం చేస్తూ ఫరో ద్వీపాల్లో మనిషి అమానుషత్వం మరోసారి బయటపడింది. ఈ నెల 9న ఫరో ద్వీప రాజధాని టోర్శావ్న్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిండు సందర్శకులతో ఫరో ద్వీపాల సందర్శనకు బయలుదేరిన అంబాసిడర్ లైన్ అనే ఒక పెద్ద ఓడలోని కొందరు అనాగరికులు వందల ఏళ్ల నాటి సంప్రదాయమని చెబుతూ 70కి పైగా పెద్ద రెక్కలున్న తిమింగలాలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అలా వేటాడిన తిమింగలాలను తినడం వారి సాంప్రదాయమట. ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో అందులోని ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, వేటగాళ్ళ ఆకృత్యాలను ప్రత్యక్షంగా చూసిన వారు భయభ్రాంతులకు గురైయ్యారని క్రూజ్ సిబ్బంది తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి తెలుకుసుకున్న సముద్ర సముద్రజీవుల పరిరక్షణ సంస్థ (ఓ.ఆర్.సి.ఏ) దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వేట సమయంలో ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు కూడా ఓడలో ఉన్నట్లు సమాచారం. ఓడ నావికుడు ట్విట్టర్ వేదికగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ తెలిపారు. ఇది కూడా చదవండి: 40 అస్తిపంజరాలతో ఇల్లు డెకరేషన్.. తీగలాగితే.. -
చంపుతామంటూ బెదిరిస్తున్నారు
ముంబై: తనను చంపుతానంటూ బెదిరింపులు వస్తున్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముంబై మాజీ చీఫ్ సమీర్ వాంఖడే ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనను, తన భార్యను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతూ చంపుతామంటూ గత నాలుగు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని వాంఖడే పేర్కొన్నారు. వాంఖడే తన ప్రతినిధి ద్వారా ఈ మేరకు ఒక లేఖను దక్షిణ ముంబై పోలీస్ కమిషనరేట్‌కు పంపినట్లు ఒక అధికారి తెలిపారు. ‘క్రూయిజ్ డ్రగ్స్’ కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌ను ఇరికించకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమీర్ వాంఖడేను శని, ఆదివారాల్లో సీబీఐ ప్రశ్నించింది. -
కలల అలలపై... అలలు అలలుగా
అలలు అలలుగా తెరలు తెరలుగా తరగలు తరగలుగా ఎగిసిపడిన కెరటాలుగా నల్ల సముద్రం , నీలి సంద్రం ఎర్ర సముద్రం మొత్తంగా సప్త సముద్రాలు వాటి లోతు తెలిసేలా , వాటి ఆటుపోట్లను అర్థం చేసుకునేలా అన్నింటిని చుట్టేస్తూ ఆమె తన కలల ప్రయాణానికి సిద్ధమైంది. పాఠాలు చెప్పే ఆ పంతులమ్మ జీవిత చరమాంకంలో సముద్ర ఘోష వింటూ తన అనుభూతులకి అక్షరరూపమివ్వాలని ఆశపడుతోంది. హాయిగా మనవలు, మనవరాళ్లతో కాలం గడిపే వయసు. ఏ బాదర బందీ లేకుండా ఎవరో వండిపెడితే తింటూ కాలం గడిపే వయసు. అయినా ఆమెలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. సర్వస్వతంత్రంగా వ్యవహరించే ఆమె తనకున్న ఆస్తుల్ని అమ్మకానికి పెట్టారు. ఎం.వి.జెమిని అనే నౌకలో ప్రపంచ యాత్ర చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆమే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షరాన్ లేన్. ఇప్పుడు ఆమె వయసు 75 ఏళ్లు. హైస్కూలు రిటైర్డ్ టీచర్. చిన్నప్పట్నుంచి ప్రయాణాలంటే ఆమెకు చాలా ఇష్టం. అడ్వంచర్స్ అంటే చెప్పలేనంత థ్రిల్. స్కూల్లో విదేశీ భాషలు బోధించేవారు. స్కూలు పిల్లల్ని తీసుకొని యూరప్ దేశాలన్నీ చుట్టేసి వచ్చారు. అయినా ఆమెకు లైఫ్‌లో ఏదో అసంతృప్తి. ఇంకొన్ని దేశాలు తిరగాలి. అక్కడ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తెలుసుకోవాలి. సరికొత్త రుచులు చవి చూడాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. జీవితంలో అనుక్షణం కొత్తదనం కోసం పరితపించే లేన్‌కు ఎంవి.జెమిని అనే నౌక ప్రయాణం ఒక చుక్కానిలా కనిపించింది. ఈ నౌక ప్రపంచాన్ని చుట్టి వస్తుందని సన్నిహితులు చెబితే తెలుసుకున్నారు. ఒక రోజు కాదు రెండ్రోజులు కాదు ఏకంగా మూడేళ్లు నౌక ప్రయాణం. ఆ నౌకలో అత్యంత తక్కువ ధరకి లభించే ఒక చిన్న కేబిన్లాంటి గదికి ఏడాదికి 30 వేల డాలర్లు చెల్లించాలి. తన ఆస్తిపాస్తుల్ని అమ్మేస్తే మూడేళ్లకి సరిపడా డబ్బులు వచ్చేస్తాయని ఆ గది బుక్ చేసుకున్నారు. ఆ చిన్న గదికి కనీసం కిటికీ కూడా ఉండదు. కానీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక చిన్న స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. అదే మహద్భాగ్యంగా భావించారు. నవంబర్ 1 నుంచి ఈ నౌక ప్రయాణం ప్రారంభమవుతుంది. కూతురికి చెబితే ఏమంటుందోనని ఆమెకి మాట మాత్రంగానైనా చెప్పలేదు. గాలి, ఎండ సోకని ఆ గదిలో కేవలం రాత్రి పూట మాత్రమే గడిపి మిగిలిన సమయమంతా తనకెంతో ఇష్టమైన సముద్రాన్ని చూస్తూ గడిపేస్తానని చెబుతున్నారు. నౌకలో తోటి ప్రయాణికులతో మాటలు కలపడం, కొత్త స్నేహితుల్ని చేసుకోవడం కూడా ఆమెకు ఇష్టమే. మొత్తం మూడేళ్ల పాటు సాగే ప్రయాణంలో ఎంవి జెమిని నౌక 375 రేవు పట్టణాల్లో ఆగుతుంది. ఇండియా నుంచి చైనా, మాల్దీవ్స్, ఆస్ట్రేలియా ఇలా అన్ని దేశాలు తిరుగుతుంది. ‘‘నాకున్న లక్ష్యం ఒక్కటే. ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నా బ్లాగ్‌లో రాయాలి. కలం పేరుతో ఒక బ్లాగ్‌ను ఏర్పాటు చేసి అందులో నా అనుభవాలన్నీ కథలుగా రాస్తాను. ఎవరైనా నాలుగ్గోడల మధ్య మగ్గిపోతూ ఇంట్లో కూర్చుంటే ఏం వస్తుంది. పది మందిలో తిరిగితేనే జీవితంపై అవగాహన వస్తుంది. అందులోనూ సముద్రాన్ని చూస్తూ ప్రయాణమంటే అదో అవధుల్లేని అనుభూతి. ఇల్లంటే మన మనసుకి ఎంతో ఇష్టమైన ప్రదేశమే కావొచ్చు. కానీ విమానమో, పడవో, రైలో ఏదో ఒకటి ఎక్కి బయట ప్రపంచాన్ని చూడండి. అదెంత అద్భుతంగా ఉంటుందో’’ అని లేన్ తన మనసులో మాట వెల్లడించారు. మూడేళ్లంటే తక్కువ కాలం ఏమీ కాదు. అందులోనూ కరోనా సోకిన తర్వాత ఆమె శ్వాసకోశ సంంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అయినా కూడా ఆమె దేనికీ భయపడట్లేదు. ఇల్లు కంటే పడవే పదిలమంటున్నారు. తాను ప్రయాణించే పడవలో కూడా అనారోగ్యం వస్తే చికిత్స అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇలా ఒంటరి ప్రయాణం ఆమెకు కొత్తేం కాదు. చాలా కాలంగా ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. ఇప్పుడీ ప్రయాణం ఆమెలో ఉత్సాహాన్ని నింపి వయసుని మరింత తగ్గించింది. మరి మనమూ లేన్‌కి హ్యాపీ జర్నీ చెప్పేద్దాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత పర్యాటకంలో కొత్త యుగం ఆరంభం: ప్రధాన మోదీ
వారణాసి: అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి ప్రాంతాల మధ్య బలమైన అనుసంధానం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం సాగించే నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్’కు ఆయన శుక్రవారం వర్చువల్‌గా జెండా ఊపారు. ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక నగరం వారణాసి నుంచి నౌక ప్రయాణం ఆరంభమైంది. అలాగే వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన టెంట్ సిటీని ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాంలో రూ.1,000 కోట్లకుపైగా విలువైన పలు ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నింటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. కాశీ–దిబ్రూగఢ్ నదీ పర్యాటక నౌకతో ఉత్తర భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలకు ఇక ప్రపంచ టూరిజం పటంపై ప్రత్యేక స్థానం లభిస్తుందని ఉద్ఘాటించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. నమామి గంగా, అర్థ్ గంగా.. ‘‘భారతీయుల జీవితాల్లో పవిత్ర గంగా నదికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గంగానది పరిసర ప్రాంతాలు అభివృద్దిలో వెనుకబడ్డాయి. అభివృద్ధి లేక ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరిగాయి. సమస్య పరిష్కారానికి రెండంచెల వ్యూహం అమలు చేస్తున్నాం. అందులో ఒకటి గంగా నది ప్రక్షాళన కోసం ఉద్దేశించిన ‘నమామి గంగా’ పథకం. మరొకటి ‘అర్థ్ గంగా’. నదీ తీర రాష్ట్రాల్లో ఆర్థిక ప్రగతిని పెంపొందించే వాతావరణం సృష్టిస్తున్నాం. గంగా విలాస్ నౌకలో విహరించేందుకు 32 మంది స్విట్జర్లాండ్ వాసులు ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరం. అన్ని దేశాల నుంచి పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పర్యాటకంలో కొత్త యుగానికి ఆరంభం గంగా నదిలో పర్యాటక నౌక ప్రయాణం ప్రారంభం కావడం ఒక మైలురాయి లాంటి సందర్భం. భారతదేశ పర్యాటక రంగంలో కొత్త యుగానికి ఇదొక ఆరంభం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలోని నదులు జల శక్తికి, వాణిజ్యానికి, పర్యాటకానికి కొత్త ఊపును తీసుకురానున్నాయి. 2014 కంటే ముందు జలమార్గాలపై పాలకులు దృష్టి పెట్టలేదు. 2014 తర్వాత జల మార్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. జాతీయ జలమార్గాలను ఐదు నుంచి 111కు పెంచాం. జల మార్గాల్లో సరుకు రవాణా 30 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి మూడింతలు పెరిగింది’’ అని మోదీ అన్నారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ..
ఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ క్రూయిజ్ వారణాసి నుంచి 3,200 కిలోమీటర్లు ప్రయాణించనుంది. అస్సాంలోని దిబ్రూగర్ వద్ద తొలి పర్యటన ముగియనుంది. తొలి బ్యాచ్ లో 52 మంది స్విస్ టూరిస్టులు పాల్గొంటున్నారు. మొత్తం 51 రోజుల ప్రయాణానికి రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక ప్రయాణికుడికి ఒక రోజుకు రూ. 25,000- 50,000 ఖర్చు అవుతుంది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ. ఇందులో భాగంగానే వారణాసిలో టెంట్ సిటీకి మోదీ శ్రీకారం చుట్టారు. గంగ ఘాట్ వద్ద 200 టెంట్ల ఏర్పాటుతో పాటు రూ.1000 కోట్ల ఖర్చుతో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ను ప్రారంభించారు. క్రూయిజ్ ప్రత్యేకతలు.. ► వారణాసి నుంచి బయల్దేరే గంగా విలాస్ మొత్తం 3,200 కి.మీ. ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అసోంలో దిబ్రుగఢ్‌కు చేరుకుంటుంది. ► ఈ మొత్తం ప్రయాణానికి 51 రోజులు సమయం పడుతుంది. 27 నదుల్ని దాటుకుంటూ ప్రయాణం సాగుతుంది. ► మూడు అంతస్తులు ఉండే గంగా విలాస్‌లో 18 సూట్స్ ఉన్నాయి. ► antara luxury river cruises సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ► 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు , సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుగా 1.4 మీటర్ల డ్రాఫ్ట్ ఉంది . ► ప్రయాణికుల కోసం అత్యంత విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతీ రోజూ నౌకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జిమ్, స్పా వంటి సదుపాయాలతో పాటు వ్యక్తిగతంగా బట్లర్ సర్వీసు, నౌకపైకి వెళ్లి ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ► ప్రపంచ వారసత్వ కట్టడాలు, జాతీయ ఉద్యానవనాలు, నదుల ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పట్టణాలు వంటి 50 పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ► బిహార్‌లో పట్నా, జార్ఖండ్‌లో సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్లో కోలకతా, బంగ్లాదేశ్‌లో ఢాకా, అసోంలో గౌహతి పట్టణాలను గంగా విలాస్ కవర్ చేస్తుంది. ► బీహార్ స్కూల్ ఆఫ్ యోగ, విక్రమశిల యూనివర్సిటీలను విజ్ఞానం పంచే ప్రాంతాలు, సుందర్బన్స్, బెంగాల్ డెల్టా ప్రాంతాలు, కజిరంగ నేషనల్ పార్క్ వంటి జాతీయ ఉద్యానవనాలను సందర్శించవచ్చు. ► మొదటి రోజు వారణాసిలో గంగా హారతిని సందర్శించిన అనంతరం ఈ నౌక బయల్దేరుతుంది. ఎనిమిదో రోజు పట్నాకి, 20వ రోజు కోల్‌కతాకి 35వ రోజున బంగ్లాదేశ్‌లో ఢాకాకి చేరుకుంటుంది. ఇక 50వ రోజు అంటే మార్చి 1న తిరిగి అసోంలోని దిబ్రుగఢ్‌కి చేరుకుంటుంది. చదవండి: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు -
గంగా నదిలో హైలెస్సా..
ప్రపంచంలో నదుల మీదుగా సాగే అరుదైన, అత్యంత సుదీర్ఘమైన నౌకా ప్రయాణానికి పుణ్యక్షేత్రం వారణాసి వేదిక కానుంది. ఎంవీ గంగావిలాస్ అని పిలిచే ఈ నౌకా ప్రయాణం 27 నదుల మీదుగా సాగుతుంది. సాధారణంగా నౌక ప్రయాణాలంటే సముద్ర జలాల మీదుగా సాగుతాయి. కానీ ఇలా నదుల మీదుగా సాగే అరుదైన నౌకా ప్రయాణం భారత్‌లో ప్రారంభం కావడం ఇదే తొలిసారి. భారత్ ఘనమైన సంస్కృతి, చరిత్రలను తెలుసుకుంటూ, మన దేశ వారసత్వ పరంపరని అవగాహన చేసుకుంటూ, జాతీయ ఉద్యాన వనాల అందాలను తిలకిస్తూ ఈ ప్రయాణం సాగుతుంది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్ చారిత్రక, సాంస్కృతిక మూలాలను తెలుసుకునే అద్భుతమైన అవకాశం ఈ ప్రయాణం ద్వారా లభిస్తుంది. భారత్‌లో పర్యాటక రంగానికి పెరుగుతున్న ఆదరణని దృష్టిలో ఉంచుకొని ఈ నౌక ప్రయాణాన్ని తీర్చి దిద్దారు. ఈ నెల 13, శుక్రవారం నాడు ఈ నౌక ప్రయాణాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నౌకా ప్రయాణం విశేషాలేంటో తెలుసుకుందాం. ► వారణాసి నుంచి బయల్దేరే గంగా విలాస్ మొత్తం 3,200 కి.మీ. ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అసోంలో దిబ్రుగఢ్‌కు చేరుకుంటుంది. ► ఈ మొత్తం ప్రయాణానికి 51 రోజులు సమయం పడుతుంది. 27 నదుల్ని దాటుకుంటూ ప్రయాణం సాగుతుంది. ► మూడు అంతస్తులు ఉండే గంగా విలాస్‌లో 18 సూట్స్ ఉన్నాయి. ► గంగావిలాస్ మొదటి జర్నీ కోసం 32 మంది న్యూజిలాండ్ పర్యాటకులు ఏకంగా నౌక మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. ► ఇందులో ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి రోజుకి రూ.25,000 టిక్కెట్ ధరగా నిర్ణయించారు. అంటే మొత్తం ప్రయాణానికి 12 లక్షల 50 వేలు ఖర్చు అవుతుంది. ► antara luxury river cruises సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ► 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు , సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుగా 1.4 మీటర్ల డ్రాఫ్ట్ ఉంది . ► ప్రయాణికుల కోసం అత్యంత విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతీ రోజూ నౌకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జిమ్, స్పా వంటి సదుపాయాలతో పాటు వ్యక్తిగతంగా బట్లర్ సర్వీసు, నౌకపైకి వెళ్లి ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ► ప్రపంచ వారసత్వ కట్టడాలు, జాతీయ ఉద్యానవనాలు, నదుల ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పట్టణాలు వంటి 50 పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ► బిహార్‌లో పట్నా, జార్ఖండ్‌లో సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్లో కోలకతా, బంగ్లాదేశ్‌లో ఢాకా, అసోంలో గౌహతి పట్టణాలను గంగా విలాస్ కవర్ చేస్తుంది. ► బీహార్ స్కూల్ ఆఫ్ యోగ, విక్రమశిల యూనివర్సిటీలను విజ్ఞానం పంచే ప్రాంతాలు, సుందర్బన్స్, బెంగాల్ డెల్టా ప్రాంతాలు, కజిరంగ నేషనల్ పార్క్ వంటి జాతీయ ఉద్యానవనాలను సందర్శించవచ్చు. ► మొదటి రోజు వారణాసిలో గంగా హారతిని సందర్శించిన అనంతరం ఈ నౌక బయల్దేరుతుంది. ఎనిమిదో రోజు పట్నాకి, 20వ రోజు కోల్‌కతాకి 35వ రోజున బంగ్లాదేశ్‌లో ఢాకాకి చేరుకుంటుంది. ఇక 50వ రోజు అంటే మార్చి 1న తిరిగి అసోంలోని దిబ్రుగఢ్‌కి చేరుకుంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వారం రోజులుగా ఓడలోనే.. న్యూ ఇయర్ ప్లాన్ రివర్స్.. తీవ్ర ఆగ్రహం..
న్యూజిలాండ్‌కు చెందిన ఓ క్రూజ్ షిప్ వారం రోజులుగా ఎక్కడా ఆపకుండా సముద్రంలోనే ఉండిపోయింది. జనవరి 1న ఆస్ట్రేలియా చేరుకోవాల్సిన ఈ ఓడ.. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ముందుకు వెళ్లే పరిస్థితి లేక ఆగిపోయింది. దీంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ గ్రాండ్‌గా ప్లాన్ చేసిన వందల మంది ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సదరు ఓడను నిర్వహిస్తున్న సంస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు ఆపారు? అయితే ఈ ఓడ హల్(అడుగు భాగం)పై ఫంగస్ పేరుకుపోయింది. బ్యాక్టిరీయా, సూక్ష్మ జీవలు, మొక్కలు వంటి బయోఫౌల్ పెరిగింది. ఇది తమ జలాల్లోలోకి ప్రవేశిస్తే హానికరం అని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఓడను లంగర్లు వేసుకునేందుకు అనుమతించలేదు. దీంతో గజ ఈతగాళ్లను పెట్టి ఆ ఫంగస్‌ను మొత్తం తొలగించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఓడ కదిలింది. అయితే ఈ కారణంగా జనవరి1న గమ్యానికి చేరుకోవాల్సిన క్రూజ్ షిప్ జనవరి 2న చేరుకుంటోంది. ఈ ఓడలో ఎక్కువమంది ప్రయాణికులు ఆస్ట్రేలియాకు చెందిన వారే ఉన్నారు. డిసెంబర్ 23న ఈ క్రూజ్ షిప్ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ పోర్టు నుంచి బయలుదేరింది. చివరిసారి డిసెంబర్ 26న వెల్లింగ్టన్ పోర్టులో ఆగింది. ఆ తర్వాత వారం రోజుల పాటు ఇందులోని ప్రయాణికులు భూమిపై కాలు పెట్టలేకపోయారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఓడలోనే ఉన్నారు. ఈ కారణంగా నాలుగు స్టాపుల్లో క్రూజ్ షిప్ ఆగలేదు. తమ జలాల్లోకి ప్రవేశించే ప్రతి ఓడను చెక్ చేశాకే అనుమతిస్తామని ఆస్ట్రేలియా చెప్పింది. ఫంగస్ ఉన్నందునే న్యూజిలాండ్ ఓడను ఆపినట్లు స్పష్టం చేసింది. దిద్దుబాటుగా క్యాష్‌బ్యాక్.. మరోవైపు ప్రయాణికుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో వికింగ్ ఓరియన్ ఓడ నిర్వాహకులు దిద్దుబాటు చర్యలకు దిగారు. అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు కోరారు. పరిహారంగా టికెట్ ఖరీదులో కొంత వెనక్కి ఇస్తామన్నారు. చదవండి: ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. అందులో ఒకటి..! -
ఓడంటే ఓడా కాదు.. లక్ష మంది ఒకేసారి ప్రయాణించేలా..
ఓడంటే అలాంటిలాంటి ఓడ కాదు. ఇది తేలియాడే నగరం. అతి భారీ నౌకల కంటే పరిమాణంలో ఐదురెట్లు పెద్దదైన ఈ ఓడ పేరు ‘ఫ్రీడమ్ షిప్’. దీని పొడవే ఒక మైలు ఉంటుంది. ప్రస్తుతం ఇది తయారీ దశలో ఉంది. దీని తయారీ పూర్తయితే, ప్రపంచంలోని అతిపెద్ద ఓడలు కూడా దీనిముందు మరుగుజ్జుల్లాగానే కనిపిస్తాయి. ఈ ఓడను తయారు చేయాలని ముప్పయ్యేళ్ల కిందటే ఫ్లోరిడాకు చెందిన ఇంజినీరు నార్మన్ నిక్సన్ సంకల్పించాడు. అతడు 2012లో మరణించాడు. దీని తయారీ మొదలయ్యాక చాలా కంపెనీల చేతులు మారాక, 2020లో ప్రస్తుత యాజమాన్య సంస్థ ఫ్రీడమ్ క్రూయిజ్ లైన్ ఇంటర్నేషనల్ చేతికి చేరింది. సింగపూర్, ఇండోనేసియాలలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఫ్రీడమ్ క్రూయిజ్ లైన్ ఇంటర్నేషనల్ సీఈవో రోజర్ గూష్ చెబుతున్నారు. అయితే, దీని డిజైన్‌కు రూపకల్పన చేసింది తామేనని భారత్‌కు చెందిన కనేతారా మెరైన్ సంస్థ చెబుతోంది. ఈ ఓడ తయారీ పూర్తయితే, ఇందులో ఏకంగా లక్షమంది ఒకేసారి ప్రయాణించే వీలు ఉంటుంది. ఇందులో నలభైవేల మంది శాశ్వత నివాసులు, ముప్పయివేల మంది వచ్చిపోయే జనాలు, పదివేల మంది హోటల్ అతిథులు, ఇరవైవేల మంది సిబ్బంది ఉంటారని చెబుతున్నారు. నిర్మాణం పూర్తయ్యాక ఈ ఓడ నిరంతరాయంగా సముద్రంలో ప్రపంచయాత్ర సాగిస్తూనే ఉంటుందని, సరుకులు నింపుకోవడానికి మాత్రమే అనుకూలమైన రేవుల్లో నిలుస్తుందని కూడా చెబుతున్నారు. చదవండి: Christmas 2022: క్రీస్తు జననం.. విశ్వానికి పర్వదినం -
Majestic Princess: విలాస నౌకలో 800 మందికి కరోనా
సిడ్నీ: న్యూజిలాండ్ నుంచి వస్తున్న విలాసవంత పర్యాటక నౌక ‘మేజిస్టిక్ ప్రిన్సెస్’లోని 3,300 మంది ప్రయాణికులు, 1,300 మంది సిబ్బందిలో శనివారం మొత్తంగా 800 మందికి కోవిడ్ సోకింది. మెల్బోర్న్కు వెళ్లాల్సిన ఈ నౌక ప్రస్తుతం సిడ్నీలోని సర్క్యులర్ క్వేలో ఆగింది. కోవిడ్ తొలినాళ్లలో ఇదే తరహాలో రూబీ ప్రిన్సెస్ భారీ విలాసవంత పర్యాటక నౌకలో 900 మందికి కోవిడ్సోకి 28 మంది మహమ్మారికి బలయ్యారు. ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్న వేళ మేజిస్టిక్ నౌకలో కోవిడ్ ఉధృతిపై ఆందోళనలు పెరిగాయి. అయితే, ‘ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన వారికి కోవిడ్ లక్షణాలు లేవు. కొద్ది మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయి. పరిస్థితి అదుపులోనే ఉంది. వారిని ఐసొలేషన్‌లో ఉంచాం’ అని క్రూయిజ్ ఆపరేటర్ అయిన కార్నివాల్ ఆస్ట్రేలియా అధ్యక్షురాలు మార్గరేట్ ఫిట్జ్‌గెరాల్డ్ చెప్పారు. -
లాహిరి లాహిరి ‘క్రూయిజ్’లో..!
సముద్రం.. ఎవరినైనా చిన్న పిల్లాడిలా మార్చేస్తుంది! ఎగసిపడే కెరటాల్లా మనసును కేరింతలు కొట్టిస్తుంది!! మరి అలాంటి సముద్రంపై ప్రయాణమంటే... అది కూడా 11 అంతస్తుల కదిలే లగ్జరీ హోటల్లాంటి క్రూయిజ్‌లో విహరిస్తే? తేలియాడే నగరంలో చక్కర్లు కొడితే? పోలా... అదిరిపోలా... తలుచుకుంటేనే ఎప్పుడెప్పుడా అనిపిస్తోంది కదా! నాదీ సేమ్ ఫీలింగ్. ఎక్కడో విదేశాల్లో ఉండే క్రూయిజ్ విహారం మనక్కూడా అందుబాటులోకి వచ్చిందన్న విషయం తెలియగానే నాలోని ‘ప్రయాణాల పక్షి’ నిద్రలేచాడు. అందులోనూ నేను పుట్టిపెరిగిన వైజాగ్ నుంచి క్రూయిజ్‌లో బయలుదేరడం అనగానే, ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి... అంటూ ఆనంద‘సాగరం’లో మునిగిపోయాను. మన దేశంలో ఏకైక, తొలి లగ్జరీ క్రూయిజ్లైనర్ కార్డీలియా క్రూయిజెస్ ‘ఎంప్రెస్’లో సముద్ర ప్రయాణం ఎలా ఉంటుంది? అందులో ఉన్న విందు వినోదాలు.. వింతలు విశేషాలేంటి? అసలు అంతపెద్ద షిప్లో చూడ్డానికి ఏమేమి ఉన్నాయి? ఇందులో వెళ్లాలంటే ఎంత ఖర్చవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే లాహిరి లాహిరి ‘క్రూయిజ్’లో అంటూ విశాఖ నుంచి చెన్నైకి నాతో పాటు జర్నీ చేసేయండి మరి! కమాన్.. లెట్స్ క్రూయిజ్!! దేశంలో తొలిసారిగా అమెరికా, యూరప్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి చోట్ల నడిపే అతిపెద్ద లగ్జరీ క్రూయిజ్ ఏడాది క్రితం పశ్చిమ తీరంలోని ముంబైలో జర్నీ స్టార్ట్ చేసింది. దీన్ని వాటర్‌వేస్ లీజర్ టూరిజమ్‌కు చెందిన కార్డీలియా క్రూయిజెస్.. ‘ఎంప్రెస్’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం, చొరవతో ఈ ఏడాది జూన్‌లో తూర్పు తీరంలో వైజాగ్–చెన్నై మధ్య వర్షాకాల సీజన్ ట్రిప్పులు మొదలయ్యాయి. దీంతో నేను, మరో ఇద్దరం కలిసి నాలుగు రోజులు (సెప్టెంబర్ 14–17) టూర్ ప్లాన్ చేశాం. ఎదురుచూపులకు తెరపడే రోజు రానే వచ్చింది. సన్నగా చిరుజల్లులు కురుస్తున్నాయి. క్రూయిజ్ కంపెనీ ప్రతినిధులు విశాఖలోని ఒక హోటల్లో బోర్డింగ్ పాస్‌లు, ఆధార్ కార్డు వెరిఫికేషన్ పూర్తి చేసి గెస్ట్ పేరు, రూమ్ నంబర్ తదితర వివరాలతో ఉన్న యాక్సెస్ కార్డులను అందించారు. కోవిడ్ నేపథ్యంతో రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి. లేదంటే జర్నీకి 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో నెగటివ్ వచ్చిన రిపోర్ట్‌ను చూపాల్సి ఉంటుంది. విశాఖ కంటైనర్ టెర్మినల్‌లోని బెర్త్ వద్దకు చేరుకోగానే... రాజహంసలా సేదతీరుతున్న క్రూయిజ్ ‘ఎంప్రెస్’ను చూడగానే ‘వాట్ ఎ బ్యూటీ’ అనుకుంటూ చూస్తుండిపోయాం!! క్లిక్‌మనిపించి సెక్యూరిటీ చెక్‌లో లగేజీ స్కానింగ్ పూర్తి చేసుకున్నాం. క్రూయిజ్ చెక్–ఇన్ ఎయిర్పోర్టులానే ఉంటుంది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది లగేజీని అణువణువునా స్కాన్ చేశాకే పంపిస్తారు. తీసుకెళ్లకూడని జాబితాలో ఉన్న వస్తువులను సెక్యూరిటీకి అప్పగించాల్సిందే. వాటిని భద్రంగా ఒక కవర్లో పెట్టి, షిప్ దిగాక తిరిగిస్తారు. ఎలాంటి డ్రింక్స్, ఆహార పదార్థాలనూ లోనికి అనుమతించరు. ఈ తతంగం పూర్తయ్యాక యాక్సెస్ కార్డును చెక్ చేసి, షిప్‌లోకి చేరుస్తారు. ఇది చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఏటవాలుగా ఉన్న పొడవాటి నిచ్చెనపై జాగ్రత్తగా నడుస్తూ అయిదో అంతస్తులోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. కళ్లు జిగేల్మనే ఏట్రియం... లోపలికి ప్రవేశించగానే ప్రతిఒక్కరూ కళ్లప్పగించి చూసే సెంట్రల్ కోర్ట్ (ఏట్రియం) నిజంగా హైలైట్. గాజు పైకప్పుతో, అద్దాల లిఫ్ట్‌లు, మిరుమిట్లుగొలిపే లైట్లతో అదొక మయసభను తలపిస్తుంది. దాన్ని తనివితీరా ఓ లుక్కేసి, లగేజీతో రూమ్‌కు వెళ్లాం. విండో, బాల్కనీ నుంచి సీన్ చూస్తే.. మైమరచిపోవాల్సిందే. మధ్యాహ్నం ఒంటిగంట నుంచే షిప్‌లోకి ఎంట్రీ మొదలవడంతో... పదో డెక్‌లోని ఫుడ్ కోర్టులో అతిథుల కోసం లంచ్ సిద్ధంగా ఉంది. క్రూయిజ్ మైకంలో ఆకలి లేకపోయినా.. ఫుడ్డు అదిరిపోవడంతో దండిగానే లాగించేశాం. లక్కీగా చిరుజల్లులు ఆగిపోయి సూర్యుడు దర్శనమివ్వడంతో సన్‌సెట్‌ను చూసే అవకాశం చిక్కింది. సముద్రం మీద నుంచి ఆ సీన్ నిజంగా ప్రకృతి ప్రేమికులకు కనులవిందే! షిప్ బయలుదేరడానికి ముందే ఎమర్జెన్సీ డ్రిల్ ఉంటుంది. బ్లాస్టింగ్ శబ్దం వినబడగానే ప్రయాణికులందరూ ఎక్కడున్నాసరే యాక్సెస్ కార్డుపై ఉన్న ‘మస్టర్ స్టేషన్’ నంబర్ ఆధారంగా ఆయా ప్రదేశాలకు చేసుకోవాలి. అక్కడ లైఫ్ జాకెట్ ఎలా ధరించాలి... అత్యవసర పరిస్థితుల్లో లైఫ్ బోట్లలోకి ఎలా తీసుకెళ్తారు వంటి సూచనలన్నీ సిబ్బంది వివరిస్తారు. షిప్లో 14 లైఫ్ బోట్లు ఉంటాయి. ఎట్టకేలకు సాయంత్రం ఆరు గంటలకు వైజాగ్‌కు గుడ్‌బై చెబుతూ కార్డీలియా ‘ఎంప్రెస్’ నిండుకుండలా నెమ్మదిగా కదిలింది. సంధ్యవేళ లైట్ల వెలుగులో మిలమిల మెరిసిపోతున్న సిటీ అందాలను చూస్తే.. ఎవరైనా సరే వావ్ వైజాగ్ అనాల్సిందే! సెయిల్ ఎవే పార్టీ సూపర్బ్... క్రూయిజ్ జర్నీ స్టార్ట్ అవ్వగానే తొలిరోజు సాయంత్రం 6 నుంచి 8 వరకూ పదో డెక్‌లో సెయిల్ ఎవే పార్టీ ఉందనడంతో అక్కడికి చేరుకున్నాం. అప్పటికే అక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన ‘డీజే టిల్లు కొట్టు.. కొట్టు’ అంటూ చిన్నాపెద్దా తేడాలేకుండా చేస్తున్న డ్యాన్సులతో ఫ్లోర్ మొత్తం పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది. సరదాగా మేం కూడా రెండు స్టెప్పులేసి పూల్ బార్లో చిల్ అవుతూ డీజే పార్టీని ఎంజాయ్ చేశాం. ఎంటర్టైన్మెంట్ క్రూ ఆడించే ఆటపాటల్లో అంతా తలమునకలైపోయారు. ఇక అక్కడి నుంచి చిమ్మచీకట్లో వెలుగులీనుతూ సముద్రాన్ని చీల్చుకుంటూ గుంభనంగా సాగుతున్న క్రూయిజ్‌ను చూస్తూ టెర్రస్ అంతా ఒకసారి కలియదిరిగాం. 4వ డెక్‌లో ఉన్న స్టార్‌లైట్ రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని చైర్మన్స్ క్లబ్ బార్ లాంజ్‌లో నడుస్తున్న లైవ్బ్యాండ్లో మాంచి హిందీ, ఇంగ్లీష్ సాంగ్స్‌ను ఆస్వాదించాం. అక్కడి నుంచి రాత్రి 12 తర్వాత డోమ్ బార్లో మిడ్నైట్ డీజే మొదలైంది. దాదాపు ఒంటి గంట వరకూ అక్కడ ఫుల్ జోష్‌లో డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లింది. ఇక రూమ్‌కు చేరుకుని బాల్కనీలోకి వెళ్లేసరికి ఒక్క క్షణం ఇది కలా నిజమా అనిపించింది. చిమ్మచీకట్లో నిండు చందమామ కనువిందు చేస్తూ.. సముద్రంతో దోబూచులాడుతున్న వేళ... వెన్నెల్లో షిప్ కదులుతూ ఉంటే... దాన్ని చూసేందుకు రెండుకళ్లూ చాలవు!! కాసేపు మూన్స్కేప్ను ఎంజాయ్ చేస్తూ.. 2 గంటలకు బెడ్డెక్కాం. మార్క్యూ థియేటర్... మరో లోకం! మతిపోగొట్టే క్రూయిజ్ ప్రత్యేకతల్లో మార్క్యూ థియేటర్ నిజంగా అద్భుతం. దీనిలోకి వెళ్తుంటే ఆ గ్రాండ్ లుక్ అబ్బురపరుస్తుంది. రెండు అంతస్తుల్లో (5, 6 డెక్‌లు), 900 మందికిపైగా కూర్చునే వీలుంది. తొలిరోజు రాత్రి 10.30కి దక్షిణాదికి చెందిన పాత, కొత్త తరం సినిమా స్టార్స్ బ్లాక్‌బస్టర్ సాంగ్స్‌తో గుదిగుచ్చిన ‘సౌత్ ఎక్స్ట్రావెగాంజా‘ డ్యాన్స్ షో దీనిలో ప్రదర్శించారు. అరగంటపాటు చూపుతిప్పుకోనివ్వని నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్తో గెస్ట్‌లను ఉర్రూతలూగించింది. రెండో రోజు సాయంత్రం 6 గంటలకు పంజాబీ భారీ పెళ్లి సందడి థీమ్‌తో డ్యాన్స్ అండ్ డ్రామా షో ‘బల్లేబల్లే’ మరో హైలైట్. మూడో రోజు రాత్రి 7 గంటలకు ’కార్డీలియాస్ మ్యూజిక్ ఫియస్టా‘లో హాలీవుడ్, బాలీవుడ్‌తో సహా సౌత్ హిట్స్‌ను లైవ్ ఆర్కెస్ట్రాతో సింగర్స్ పాడుతుంటే.. ఈలలు, చప్పట్లు, డ్యాన్సులతో హాలంతా దద్దరిల్లింది!! ఇక విదేశాల్లోని ఫేమస్ డ్యాన్స్ అండ్ మ్యూజికల్ షో ‘బర్లెస్క్’ మూడో రోజు రాత్రి 10.30కి ప్రదర్శించారు. బాలీవుడ్ థీమ్‌తో హాట్ హాట్ దేశ విదేశీ భామలు చేసే హంగామా కనువిందు చేస్తుంది!! ఇది పెయిడ్ షో, 18+ వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. సన్‌రైజ్, సన్‌సెట్.. మాటల్లేవ్!! క్రూయిజ్ జర్నీలో ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడనివి సన్‌రైజ్, సన్‌సెట్. వేకువజామున లేలేత సూర్యకిరణాలు సాగరంపై పడుతూ.. పసిడి వర్ణంలో ధగధగమంటూ కనువిందు చేసే ఆ దృశ్యాన్ని చూస్తే మనసు ఆకాశంలో అలా తేలిపోతుంది! బాల్కనీలో చీర్స్ కొట్టి కడలిపై అరుణోదయ అందాలను కెమెరాల్లో బంధించాం. ఇక సాయంత్రం అయ్యేసరికి 11వ అంతస్తుపై సూర్యాస్తమయం కోసం గెస్ట్‌ల ఎదురుచూపులు మొదలయ్యాయి. ఎరుపు వర్ణంలో కాంతులీనుతూ సాయం సంధ్య వేళ భానుడు అస్తమించే సన్‌సెట్ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు!! చుట్టూ సముద్రం మధ్యలో మనం జర్నీ చేస్తున్న క్రూయిజ్ తప్ప ఇంకేమీ కనబడని చోట సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూస్తే.. నేచర్ లవర్స్ గుండెజారి బంగాళాఖాతంలో గల్లంతవ్వాల్సిందే!! నిజంగానే ‘ఎంప్రస్‘... పేరుకు తగ్గట్టే ‘ఎంప్రస్’ది నిజంగా మహారాణి దర్పమే. దీని పొడవు 210 మీటర్లు (దాదాపు 692 అడుగులు) కాగా, వెడల్పు 36 మీటర్లు, ఎత్తు 47 మీటర్లు. మొత్తం బరువు 48,500 టన్నుల పైనే. 11 డెక్‌లు (అంతస్తులు) ఉన్న ఈ క్రూయిజ్‌లో మొత్తం 796 గెస్ట్ క్యాబిన్లు (రూమ్స్) ఉంటాయి. సుమారు 2,000 మంది ప్రయాణికులకు అతిథ్యం ఇస్తుంది. ఇక ఇందులో 600–700 మంది సిబ్బంది ఉంటారు. నాలుగు ఇంజిన్లుండే దీని గరిష్ట వేగం 19 నాటికల్ మైళ్లు (గంటకు 35 కిలోమీటర్లు). మేము ‘బ్రిడ్జ్ టూర్’కు కూడా వెళ్లాం. దీనికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కచ్చితంగా అందరూ చూసితీరాలి. 6వ డెక్‌లో షిప్ ముందు భాగంలో కెప్టెన్ ఇతరత్రా సిబ్బంది ఉండే ఆపరేషనల్ ప్రదేశం ఇది. ఇక్కడ మాకు ఫ్రాన్స్‌కు చెందిన థర్డ్ ఆఫీసర్ ‘లూసియన్’ షిప్ గురించి బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. నిజానికి చాలా కొత్తగా కనిపిస్తున్న ఈ షిప్‌ను రాయల్ కరీబియన్ క్రూయిజెస్ కోసం ఫ్రాన్స్ కంపెనీ దాదాపు 32 ఏళ్ల క్రితం 1990లో తయారు చేసిందట. అక్కడి నుంచి చేతులు మారుతూ చివరికి కార్డీలియా చెంతకు చేరింది. అయితే, ప్రతి రెండేళ్లకోసారి పూర్తిగా దీని రూపురేఖలను మార్చేస్తుంటారు, అందుకే ఎప్పుడూ కొత్తగా అలరిస్తుంది. ఇక బ్రిడ్జ్ టూర్లో అన్నింటికంటే అబ్బురపరిచే అంశం షిప్ స్టీరింగ్. కేవలం ఒక అంగుళం పొడవున్న వీడియోగేమ్ తరహా జాయ్ స్టిక్‌తో అంత పెద్ద ఐరావతంలాంటి క్రూయిజ్‌ను అలవోకగా ఎటుకావాలంటే అటు తిప్పొచ్చని లూసియన్ చెబుతుంటే.. అంతా అవాక్కయ్యారు!! ఈ ట్రిప్‌లో ఎంప్రెస్ గంటకు 12–14 కిలోమీటర్ల వేగంతో.. తీరం వెంబడి 80–120 కిలోమీటర్ల దూరంలో జర్నీ చేసింది. అక్కడ సముద్రం లోతు 2 కిలోమీటర్ల పైమాటే!! అన్నీ పూసగుచ్చినట్లుగా... నగరాన్ని తలపించే క్రూయిజ్‌లో ఏది ఎక్కడ ఉంది.. ప్రోగ్రామ్‌లు, ఈవెంట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవడం కాస్త కష్టమే. అయితే, గెస్ట్‌లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ వివరాలన్నింటితో చిన్న బ్రోచర్‌ను ఏరోజుకారోజు ప్రతి రూమ్‌లో ఉంచుతారు. దీన్ని కచ్చితంగా మన వెంట ఉంచుకోవడం లేదంటే ఫోన్లో పిక్ తీసుకోవడం బెటర్. ఇక అయిదో డెక్‌లో రిసెప్షన్ పక్కన ఉన్న బాక్సాఫీస్‌లో పెయిడ్ ఈవెంట్లు, షోలకు సంబంధించిన టిక్కెట్లు లభిస్తాయి. రూమ్స్ ఎన్ని రకాలంటే..? ఇంటీరియర్ స్టేట్‌రూమ్, ఓషన్ వ్యూ, మినీ సూట్, సూట్, చైర్మన్స్ సూట్ అనే 5 రకాల రూమ్స్ ఉంటాయి. 63 మినీ సూట్లు, 5 సూట్లు ఉండగా, చైర్మన్ సూట్ మాత్రం ఒకేఒక్కటి ఉంది. ఇక మిగతావన్నీ ఇంటీరియర్ (విండో ఉండదు), ఓషన్ వ్యూ (విండో ఉంటుంది) స్టేట్ రూమ్‌లే. వీటిలో కూడా మళ్లీ స్టాండర్డ్, ప్రీమియం అని రెండు రకాలున్నాయి. స్టాండర్డ్ రూమ్‌లన్నీ 3, 4 డెక్స్‌లో, ప్రీమియం రూమ్స్ 8, 9 డెక్స్‌లో ఉంటాయి. అంతేకాదు, ఈ గెస్ట్‌లకు అన్నిరకాల షోలు, ఏరియాలు, ఈవెంట్లకూ యాక్సెస్ ఉండటంతో పాటు ‘హ్యాపీ అవర్’ మరో బోనస్. మినీ సూట్‌కు బాల్కనీ ఉంటుంది. సూట్ రూమ్‌లో పేద్ద బాల్కనీ, లివింగ్ రూమ్, బెడ్రూమ్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. ఇక అల్టిమేట్ లగ్జరీతో, సకల సదుపాయాలన్నీ చైర్మన్స్ సూట్ సొంతం. భారీ బాల్కనీ, ప్రత్యేక డైనింగ్, లివింగ్ రూమ్, బెడ్రూమ్, ఇలా అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను తలపిస్తుంది. రేట్లు ఎంతెంత? క్రూయిజ్ అనగానే వామ్మో టూర్ ప్యాకేజీ లక్షల్లో ఉంటుందనే అపోహ మీకే కాదు నాక్కూడా ఉండేది. అయితే, సాధారణ మధ్యతరగతి కుటుంబం సైతం లగ్జరీ క్రూయిజ్ జర్నీ చేసేలా రూమ్‌లు, డిస్కౌంట్లు, గ్రూప్ ప్యాకేజీలను కార్డీలియా అందిస్తోంది. ఇద్దరు పెద్దవాళ్లకు 2 నైట్స్, 3 డేస్ ప్యాకేజీ ప్రారంభ ధరలు చూస్తే (పన్నులతో)... ఇంటీరియర్ స్టేట్‌రూమ్ స్టాండర్డ్: రూ. 44,174 ఓషన్ వ్యూ స్టాండర్డ్: రూ.54,120 మినీ సూట్: రూ.85,413 సూట్: రూ.1,42,846 చైర్మన్ సూట్: రూ.2,37,831 అంటే ఇంటీరియర్ స్టాండర్డ్ స్టేట్రూమ్కు ఒక్కో వ్యక్తికి రూ.22,000 చార్జీ(ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అన్నీంటితో) పడుతుంది. మూడు రోజుల పాటు ఫైఫ్స్టార్ లగ్జరీతో పాటు సముద్ర ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ రేట్లు విమాన టిక్కెట్ల మాదిరిగా డైనమిక్‌గా మారుతుంటాయి. ముందుగా బుక్ చేసుకుంటే చాలా తక్కువకు లభించవచ్చు. 3, 5 నైట్స్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. నలుగురు కలిసి ఒక రూమ్ బుక్ చేసుకుంటే మిగతా ఇద్దరికీ క్యాబిన్ ధరలో సగం డిస్కౌంట్(స్పెషల్ ఆఫర్స్), 12 ఏళ్ల లోపు చిన్నారులకు షరతులకు లోబడి ఉచిత జర్నీ (పన్నులు కాకుండా), గ్రూప్ బుకింగ్స్‌లో ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. https://www.cordeliacruises.com/cruise-routes వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు లేదా వెబ్‌లోని కాంటాక్ట్ నంబర్లకు కాల్ చేస్తే మొత్తం వివరాలన్నీ చెప్పడంతో పాటు బుకింగ్ కూడా చేసేస్తారు. గమ్య స్థానాల్లో ఆన్‌షోర్ సిటీ టూర్ ఆప్షన్ కూడా ఉంది. తూర్పు తీరంలో ‘ఎంప్రెస్’ మాన్సూన్ టూర్ సీజన్ సెప్టెంబర్‌తో పూర్తయింది. ఇక పశ్చిమ తీరంలోని ముంబై, కొచ్చి, లక్షద్వీప్, గోవాలో వచ్చే ఏడాది మే వరకూ ఆతిథ్యం ఇస్తుంది. మళ్లీ జూన్ తర్వాత చెన్నైకి చేరుకుని తూర్పు యాత్రకు సిద్ధమవుతుంది. అంతేకాదు, 2023 జూన్ కల్లా ఎంప్రెస్–2 (దాదాపు 3,500 ప్రయాణికుల సామర్థ్యం) కూడా కార్డీలియా చెంతకు చేరే అవకాశం ఉంది. ఫుడీస్‌కు పండగే... కార్డీలియా ‘ఎంప్రెస్’లో ఫుడ్... భోజనప్రియులకు పండగే! రూమ్ స్టేతో పాటు ఉదయం బ్రేక్ పాస్ట్ నుంచి లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్, అర్థరాత్రి శాండ్విచ్ల వరకూ అన్నీ ఉచితమే. తిన్నోళ్లకు తిన్నంత అనేలా రకరకాల వెరైటీలతో చూస్తేనే కడుపునిండిపోయే రేంజ్లో మెనూ ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటు నోరూరించే రకరకాల స్వీట్స్, డెసర్ట్స్, ఫ్రూట్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా దక్షిణాది వంటకాలనూ వడ్డిస్తున్నారు. రెండంతస్తుల స్టార్‌లైట్ రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్‌లో ఫుడ్ అందరికీ కామన్ ఇంకా ఫ్రీ కూడా. చాప్‌స్టిక్స్ పెయిడ్ రెస్టారెంట్ మాత్రం హైలైట్. దీనిలో ఆసియాలోని అన్ని దేశాలకు చెందిన క్యుజీన్స్ (వంటకాలు)తో పాటు.. షెఫ్స్ టేబుల్ అనే ప్రత్యేకత కూడా ఉంది. కనీసం ఆరుగురు బుక్ చేసుకుంటే.. స్వయంగా చీఫ్ షెఫ్ పర్యవేక్షణలో మన టేస్ట్‌కు అనుగుణంగా వంటకాలను వండి వడ్డిస్తారు. కాక్టెయిల్స్ (హాట్ డ్రింక్స్), మాక్టెయిల్స్ వంటి పానీయాల కోసం క్రూయిజ్‌లో అనేక బార్ లాంజ్‌లు ఉన్నాయి. ఇది పూర్తిగా పేమెంట్ సర్వీస్. ఫుడ్ తినే చోటే కాకుండా, ఎంటర్టైన్మెంట్ షోలు, స్విమ్మింగ్ పూల్ ఇలా మనం ఎక్కడున్నా వీటిని సర్వ్ చేస్తారు. ప్రీమియర్ క్యాబిన్ గెస్ట్‌లకు ‘హ్యాపీ అవర్’ ప్రత్యేకం. గంటపాటు ఏది తాగినా 1+1 ఆఫర్‌తో కుమ్మేయొచ్చన్నమాట!! సిబ్బందితో కలిపి దాదాపు 2,600 మందికి ఘుమఘుమలాడే వంటకాలను సిద్ధం చేసేందుకు ఇందులో ఏకంగా ఫుడ్ ఫ్యాక్టరీ ఉంది. తెలంగాణకు చెందిన షెఫ్ శ్రీనివాస్, చీఫ్ షెఫ్ అశ్విన్ కుమార్ ఫుడ్ తయారీ నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ వరకూ అన్నీ చూపించి, వివరించారు. ఫ్రీగా ఇచ్చేవి కాకుండా, మనం ఏది కొనుక్కున్నా రేటు ఘాటుగానే ఉంటుంది. పూల్.. సముద్రంలో ఈదినట్లే! క్రూయిజ్ స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేయడం అనేది మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. ఈత రాకపోయినా పర్లేదు. లైఫ్ జాకెట్లు వేసుకొని జలకాలాటల్లో.. అంటూ తేలిపోవచ్చు. పిల్లల కోసం ప్రత్యేకంగా పూల్ ఉంది, మూడేళ్లలోపు బుడుగులకు సైతం పాండ్స్ ఉండటం విశేషం. దీనిలో సముద్రపు నీటిని నింపుతారు. షిప్ కదులుతుండటం వల్ల పూల్‌లో నీరు అలల మాదిరిగా పైకి, కిందికి కదులుతుంది. దీనివల్ల మనం సముద్రం నీటిలో ఉన్నట్లే ఫీల్ అవుతాం. అన్ని రూమ్స్ వాళ్లకూ పూల్ యాక్సెస్ ఉంటుంది. ఫన్.. అన్లిమిటెడ్! అరే, రోజు అప్పుడే అయిపోయిందా అనిపించేలా క్రూయిజ్‌లో అన్లిమిటెడ్ వినోదం మనల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. ప్రత్యేక డ్యాన్స్, మ్యూజిక్ షోలతో పాటు లైవ్ బ్యాండ్స్ సైతం సంగీత ప్రియులను మైమరపిస్తాయి. ‘డోమ్’ నైట్ క్లబ్ డీజేలో డ్యాన్స్ ఫ్లోర్ దద్దరిల్లిపోతూ.. పార్టీ ఫ్రీక్స్లో ఫుల్ జోష్ నింపుతుంది. షిప్ మొత్తం ఎక్కడికెళ్లినా మాంచి మ్యూజిక్‌తో ఏదో తెలియని వైబ్ మనల్ని ఉరకలేయిస్తుంది. 24 గంటలూ జనాల కోలాహలంతో క్రూయిజ్‌లో ఉన్నంతసేపూ ఏదో జాతరలో ఉన్నామన్న ఫీలింగ్ కలిగింది. ఇక మెగా హౌసీ, ట్రెజర్ హంట్... మినీ ఒలింపిక్స్... మ్యాజిక్ షో.. వీడియో గేమ్స్.. ఇంటర్నెట్ కేఫ్.. కార్డ్స్ ప్లే ఏరియా... లైబ్రరీ.. కిడ్స్ అకాడమీ... ఫోటో గ్యాలరీ అండ్ స్టూడియో.. టేబుల్ టెన్నిస్.. జిమ్.. స్పా.. పూల్ బార్.. ఇలా ఒకటేంటి చిన్నాపెద్దా అందరికీ అంతులేని ఆటవిడుపే!! ఇంటర్నెట్ కోసం శాటిలైట్ వైఫై (పే చేయాలి) కూడా ఉంది. అడ్వెంచర్ లవర్స్ కోసం రాక్ క్లయింబింగ్ ప్రత్యేకం. దేశంలో సముద్రంపై అత్యంత ఎత్తయిన రాక్ క్లయింబింగ్ కూడా ఇదే. క్రూయిజ్ కదులుతుంటే.. దీన్ని ఎక్కడం అనేది అదిరిపోయే థ్రిల్!! ఇక జూద ప్రియులను ‘కేసినో రాయల్’ రారమ్మంటుంది. సరదాగా మేము కూడా దీన్ని కాసేపు ఎంజాయ్ చేశాం. అయితే, తీరం నుంచి అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి అంటే, 12 నాటికల్ మైళ్ల (22 కి.మీ) దూరం క్రూయిజ్ వెళ్లాకే కేసినో తెరుస్తారు. ఇందులో ఆడకపోయినా .. కనీసం ఆ యాంబియెన్స్ కోసమైనా దీన్ని చూసితీరాల్సిందే. జాక్‌పాట్ కొట్టినవాళ్లు చేసే హంగామా మామూలుగా ఉండదు మరి!! అంతా డాలర్లలోనే... ఒక్కసారి క్రూయిజ్‌లోకి ఎక్కామంటే మనం విదేశంలో ఉన్నట్లే లెక్క. చెల్లింపులన్నీ డాలర్లలో ఉంటాయి. రిసెప్షన్ దగ్గర మన రూపాయలను క్యాష్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తే డాలర్లు ఇస్తారు. అదీకూడా క్యాష్ కాదు.. మనకిచ్చిన యాక్సెస్ కార్డులో వేస్తారు. ఇక ఎక్కడ ఏది చెల్లించాలన్నా ఈ కార్డు ఇస్తే చాలు. రేట్లన్నీ డాలర్లలోనే ఉంటాయి. డబ్బులు అయిపోతే, మళ్లీ లోడ్ చేసుకోవచ్చు. 24 గంటలూ ఈ సర్వీస్ ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ మిగిలితే క్రూయిజ్ దిగే ముందు క్యాష్ రూపంలో తిరిగి ఇచ్చేస్తారు. ఇలా... టన్నులకొద్దీ మధుర స్మృతులను నింపుకుని చెన్నైలో క్రూయిజ్ దిగుతుంటే.. నాలుగు రోజుల టూరు నాలుగు నిమిషాల్లో అయిపోయినట్టు అనిపించింది. విందు వినోదం.. సాహసం.. ప్రకృతిలో పరవశించిపోవడం.. వీటి కోసం హాలిడే ట్రిప్ వేయాలంటే జర్నీ చేయాల్సిందే. మరి ఆ ప్రయాణమే ఒక గమ్య స్థానం అయితే, ఇవన్నీ కూడా జర్నీ చేస్తూనే ఎంజాయ్ చేస్తే.. క్రూయిజ్ ప్రయాణంతో ఈ అనుభూతులన్నీ సొంతం చేసుకోవచ్చు. నడిసంద్రంలో సకల సౌకర్యాలున్న కదిలే దీవిలో అలా చక్కర్లు కొడుతూ నేచర్‌ను ఆస్వాదించడం అనేది జీవితాంతం గుర్తుండే జ్ఞాపకంగా నిలిచిపోతుంది! మరింకేం లగేజీ సర్దేయండి.. గెట్ సెట్ క్రూయిజ్!! -శివరామకృష్ణ మిర్తిపాటి ఫోటోల సహకారం: సూర్య చైతన్య వానపల్లి -
భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల నౌక ఇది. ఇరవై అంతస్తులతో, ఒకేసారి తొమ్మిదివేల మంది ప్రయాణించేందుకు వీలుగా ఆరుబయటి స్విమ్మింగ్ పూల్. విశాలమైన సినిమా థియేటర్ వంటి భారీ హంగులతో అట్టహాసంగా ‘గ్లోబల్ డ్రీమ్–2’ పేరిట దీని నిర్మాణం చేపట్టారు. అయితే, తొలి ప్రయాణానికి ముందే ఇది తునాతునకలుగా తుక్కు కానుంది. Photo Courtesy: Mv Werften జర్మన్–హాంకాంగ్ నౌకా నిర్మాణ సంస్థ ‘ఎంవీ వెర్ఫ్‌టెన్’ ఈ భారీ నౌక నిర్మాణం చేపట్టింది. దీని నిర్మాణానికి 120 కోట్ల పౌండ్ల (రూ.11,090 కోట్లు) అంచనా వేయగా, నిర్మాణ సంస్థ దీనికోసం ఇప్పటికే 90 కోట్ల పౌండ్లు (రూ.8,318 కోట్లు) ఖర్చు చేసింది. నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది. సంస్థ వద్ద నిధులన్నీ పూర్తిగా ఖర్చయిపోయాయి. Photo Courtesy: Mv Werften తుదిమెరుగులు పూర్తి చేసి, నౌకను ప్రయాణం కోసం సముద్రంలోకి దించాలంటే, మరో 30 కోట్ల పౌండ్లు (రూ.2,772 కోట్లు) కావాల్సి ఉంటుంది. ఎంవీ వెర్ఫ్‌టెన్ సంస్థ ఇంతవరకు ఆ నిధులను సమకూర్చుకోలేకపోయింది. దీనిని యథాతథంగా అమ్మాలని నిర్ణయించుకున్నా, దీనిని కొనుగోలు చేయడానికి కూడా ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. Photo Courtesy: Mv Werften దీంతో, ఈ నౌకను, దీంతో పాటు దీనికి ముందు నిర్మించిన ‘గ్లోబల్ డ్రీమ్’ నౌకను కూడా తునాతునకలు చేసి, విడిభాగాలను విడగొట్టి తుక్కుగా అమ్ముకుని కొంతైనా నష్టాల నుంచి బయటపడాలని ఎంవీ వెర్ఫ్‌టెన్ సంస్థ నిర్ణయించుకుంది. చదవండి: రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..! -
అర్ధరాత్రి పార్టీలో ఫైటింగ్.. లవర్స్ హల్చల్
ప్రేమ జంటలు ఒకరినొకరు చితకబాదుకున్నారు. తమ పార్టనర్స్ మోసం చేశారని ఆరోపిస్తూ పొట్టు పొట్టు తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. న్యూయార్క్‌లోని ఓ క్రూయిజ్ షిప్‌లోని ఐదో అంతస్తులో అర్ధర్రాతి ఫుల్ జోష్‌లో పార్టీ జరుగుతోంది. ఆ పార్టీలో దాదాపు 60-70 మంది ప్రయాణికులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు ప్రేమికులు.. తమ పార్టనర్స్ తమను మోసం చేశారని ఆరోపిస్తూ కేకలు వేశారు. దీంతో, వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా దాడులకు దారి తీసింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రేమికులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. బట్టలు చింపుకుంటూ.. జుట్టు పట్టుకుని పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఒకరిపై మరోకరు పడిపోయి పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. దాదాపు గంట పాటు ఇలా కొట్టకున్నారు. దీంతో, షిప్ సిబ్బంది నోరెళ్లబెట్టారు. చేసేదేమీ లేక చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదేం ఫైట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. last nights festivities on my carnival cruise 🥳🛳 pic.twitter.com/uehhfmCfaC — naim (@nyeem0) June 28, 2022 -
గ్లోబల్ డ్రీమ్ క్రూయిజ్ షిప్.. టైటానిక్ కంటే దారుణంగా..
వందేళ్ల కిందట టైటానిక్ షిప్ ప్రపంచంలోనే అతి పెద్ద పడవగా రికార్డు సృష్టించింది. కానీ తొలి ప్రయాణం మధ్యలోనే సముద్రంలో ఓ మంచు పర్వతాన్ని ఢీ కొట్టి మునిగిపోయింది. తాజాగా వరల్డ్ రికార్డు సాధించే దిశగా మరో భారీ షిప్‌ను నిర్మించడం మొదలెట్టారు. అయితే తొలి ప్రయాణం చేయడానికి ముందే ఈ భారీ నౌక కూడా అప్పుల భారంలో మునిగి నామ రూపల్లేకుండా కనుమరుగు కానుంది. జర్మనీకి చెందిన వెర్ఫ్‌టెన్ సంస్థ గ్లోబల్ డ్రీమ్ పేరుతో భారీ నౌకలను తయారు చేస్తోంది. ఇందులో గ్లోబల్ డ్రీమ్ 1 పూర్తిగా సిద్ధం అవగా దాన్ని కంటే పెద్దదిగా గ్లోబల్ డ్రీమ్ 2 నిర్మాణ పనులు గత కొన్నేళ్లుగా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పడవలో ఏకకాలంలో 9,000ల మంది ప్రయాణించేంత పెద్దగా దీని నిర్మాణం మొదలు పెట్టారు. ప్రపంచ రికార్డు లక్ష్యంగా ఎక్కడగా వెనక్కి తగ్గలేదు. బ్యాంకుల నుంచి ఎడాపెడా రుణాలు తీసుకున్నారు. కరోనా కాటు షిప్ నిర్మాణం సగం పూర్తైన తర్వాత ప్రపంచాన్ని కరోనా సంక్షోభం చుట్టేసింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడిన తర్వాత షిప్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే కరోనా తెచ్చిన కష్టాల కారణంగా ప్రస్తుతం జనం సాధారణ జీవితానికి అలవాటుపడ్డా ఇంకా జనాల్లో పూర్తిగా కలిసేందుకు జంకుతున్నారు. దీంతో గ్లోబల్ డ్రీమ్ వంటి భారీ క్రూయిజ్షిప్లకు డిమాండ్ అస్సలు లేకుండా పోయింది. దివాళా కరోనాకి ముందు మేం కొంటామంటే మేం కొంటామంటూ ముందుకు వచ్చిన కంపెనీలు ఆ తర్వాత పత్తాలేకుండా మాయం అయ్యాయి. దీంతో వెర్ఫ్‌టెన్ సంస్థ దిక్కు తోచని స్థితిలో పడింది. ఓవైపు నిర్మాణం పూర్తి చేసుకుని అమ్ముడుపోని షిప్ మరోవైపు అప్పులిచ్చిన బ్యాంకుల నుంచి ఒత్తిడి. చివరకు ఒత్తిడి తట్టులోకే తాను దివాళా తీస్తున్నట్టు వెర్ఫ్‌టెన్ కంపెనీ 2022 జనవరిలో ప్రకటించింది. అడ్డుగా డ్రీమ్‌లైనర్ దివాళా ప్రక్రియ మొదలైన తర్వాత వెర్ఫ్‌టెన్‌కి చెందిన నౌకల తయారీ కర్మాగారాన్ని తైసన్క్రూప్ అనే నావల్ యూనిట్ దక్కించుకుంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం యుద్ధ నౌకలకు డిమాండ్ పెరిగింది. దీంతో వెర్ఫ్‌టెన్‌కి చెందిన షిప్‌యార్డులో యుద్ధ నౌకలు 2024 నుంచి తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గ మార్పులు షిప్‌యార్డులో చేయాల్సి వచ్చింది. అయితే అందుకు అడ్డుగా ఆ షిప్‌యార్డులో అమ్ముడుపోని గ్లోబల్ డ్రీమ్ 2 క్రూయిజ్ షిప్ ఉంది. చివరికి తుక్కే దిక్కు వెర్ఫ్‌టెన్‌కి అప్పులిచ్చిన బ్యాంకులు గ్లోబల్ డ్రీమ్ 2ను వేలం పాటలో వేసినా కొనేందుకు ఏ కంపెనీ ముందుకు రాలేదు. మరోవైపు యుద్ధ నౌకల కోసం ఈ షిప్‌యార్డులో మార్పులు చేయాల్సి వస్తోంది. దీంతో అమ్ముడుపోని భారీ క్రూయిజ్ షిప్‌ని కనీసం తుక్కుగా అయినా అమ్మేయాలనే ప్లాన్‌లో ఉన్నాయి బ్యాంకులు. కల్లలైన కలలు వేలకోట్లు పోసి అత్యాధుని సౌకర్యాలతో విలాసవంతంగా తయారైన గ్లోబల్ డ్రీమ్ 2 చివరకు తన కలల ప్రయాణం ప్రారంభించకుండానే అప్పులు ఊబిలో కూరుకుపోయి తుక్కుగా మారనుంది. చదవండి: స్టార్టప్‌లకు గడ్డుకాలం.. ఉద్యోగాలన్నీ హుష్ కాకి.. -
కార్డీలియా క్రూయిజ్‌కు పుదుచ్చేరి సర్కార్ బ్రేక్.. అసలేం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: విలాసవంతమైన నౌక కార్డీలియా క్రూయిజ్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం బ్రేక్ వేసింది. పుదుచ్చేరిలో హాల్ట్‌కి నిరాకరించింది. క్రూయిజ్‌లో కేసీనో, గ్యాంబ్లింగ్ ఉండటంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు. తెల్లవారు జామున 4 గంటల నుంచి షిప్ ఆగిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో క్రూయిజ్ ఆపరేట్లు చర్చలు జరుపుతున్నారు. పాండిచ్చేరి అనుమతించకపోతే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని కడులూరు పోర్ట్‌లో నౌకను ఆపేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి.. -
Cordelia Cruise Ship: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి..
దొండపర్తి(విశాఖ దక్షిణ): మూడు రోజుల పాటు సముద్రంలో ప్రయాణం.. సెవెన్ స్టార్ హోటల్‌కు మించి విలాసవంతమైన నౌకలో విహారం.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 24 గంటలు వినోదం.. విభిన్న వంటకాలతో రుచికరమైన ఆహారం.. ఆరోగ్యానికి జిమ్, ఫిట్నెస్ సెంటర్ల సౌకర్యం.. స్విమ్మింగ్ పూల్స్‌లో జలకాలాటలు.. రాక్ క్లైంబింగ్ విన్యాసాలు.. హ్లాదపరిచే డ్యాన్స్ షోలు.. అబ్బురపరిచే మ్యాజిక్ ప్రదర్శనలు.. సినిమా థియేటర్లు.. ఇలా ఎటువంటి ఒత్తిడి లేకుండా.. సమయం తెలియకుండా 24/7 ఎంజాయ్ చేసే లగ్జరీ విహార యాత్ర విశాఖ నుంచి ప్రారంభమైంది. విశాఖ వాసులను ఎంతో కాలంగా ఊరిస్తున్న విహార నౌక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు విదేశాలతో పాటు దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కార్డీలియా ఎంప్రెస్ విహార నౌక ఇప్పుడు విశాఖ తీరానికి వచ్చేసింది. ఈ నెల 6వ తేదీన చెన్నై నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 8 గంటలకు విశాఖ పోర్టులో నూతనంగా నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్‌కు చేరుకుంది. నగరానికి 1,200 మంది పర్యాటకులతో.. చెన్నై నుంచి 36 గంటల పాటు ప్రయాణించిన ఈ కార్డిలియా నౌకలో 1,200 మంది పర్యాటకులు విశాఖకు చేరుకున్నారు. ఇందులో సుమారు 800 మంది ప్రయాణికులు ఇక్కడ దిగిపోయారు. మిగిలిన వారు పుదుచ్చేరి మీదుగా చెన్నైకు అదే క్రూయిజ్‌లో ప్రయాణించనున్నారు. విశాఖకు చేరుకున్న తరువాత వీరికి ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కల్పించి నగరంలో వివిధ సందర్శనీయ ప్రదేశాలకు తీసుకువెళ్లారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి వీరిని క్రూయిజ్ టెర్మినల్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. విశాఖ నుంచి 1,345 మంది పర్యాటకులు విశాఖ నుంచి బుధవారం రాత్రి 8 గంటలకు ఈ కార్డీలియా నౌక విశాఖ నుంచి బయలుదేరింది. ఉదయం 8 గంటలకే పోర్టులో క్రూయిజ్ టెర్మినల్‌కు నౌక చేరుకున్నప్పటికీ.. సాయంత్రం 4 గంటల నుంచి పర్యాటకులను అనుమతించారు. ఇక్కడి నుంచి 1,345 మంది బయలుదేరారు. వారందరిని తనిఖీ చేసి క్రూయిజ్‌లోకి అనుమతించారు. చాలా మంది విశాఖ నుంచి టికెట్లు దొరక్కపోవడంతో చెన్నై నుంచి టికెట్లు కొనుగోలు చేశారు. ముందుగానే చెన్నై వెళ్లిపోయి అక్కడ నుంచి క్రూయిజ్‌లో విశాఖకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో విశాఖకు క్రూయిజ్ కార్డీలియా క్రూయిజ్ సర్వీసు వాస్తవానికి విశాఖకు లేదు. ముంబయి, చెన్నై, గోవా, అండమాన్, లక్షద్వీప్ వంటి ప్రాంతాల్లో ఉండేది. దేశంలోనే కాకుండా శ్రీలంకకు కూడా ఈ నౌకా యాత్ర ఉండేది. అయితే శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో క్రూయిజ్ యాజమాన్యం శ్రీలంక సర్వీసును నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఇతర ప్రాంతానికి క్రూయిజ్ సర్వీస్ నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో విశాఖ నుంచి సర్వీసు నడిపేందుకు అంగీకరించింది. అది కూడా ముందు మూడు సర్వీసులు నడిపి డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాలని భావించింది. రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ఈ విహారయాత్రకు విస్తృతంగా ప్రచారం కల్పించింది. అద్భుత స్పందన చెన్నై–విశాఖ–పుదుచ్చేరి–చెన్నై సర్వీసు నడుపుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసిన వెంటనే విక్రయాలు జోరుగా సాగాయి. ఈ నెలలో మూడు సర్వీసులకు ఇప్పటికే 90 శాతం మేర టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న మాదిరిగానే సెప్టెంబర్ వరకు విశాఖ నుంచి సర్వీసు నడపాలని నిర్వాహకులు నిర్ణయించారు. విశాఖలో ఈ క్రూయిజ్ నిర్వహణ బాధ్యతలను విశాఖ పోర్టు అథారిటీ అధికారులు జేఎం భక్షీ అనే సంస్థకు అప్పగించారు. విశాఖ నుంచి ప్రతీ బుధవారం సర్వీసు కార్టీలియా క్రూయిజ్‌కు విపరీతమైన డిమాండ్ రావడంతో ప్రతీ బుధవారం విశాఖ నుంచి చెన్నైకు సర్వీసును నడపనున్నారు. ప్రతీ సోమవారం చెన్నై నుంచి నౌక బయలుదేరి బుధవారం విశాఖకు చేరుకుంటుంది. ఇక్కడ అదే రోజు రాత్రి 8 గంటలకు బయలుదేరి పుదుచ్చేరి మీదుగా చెన్నైకు వెళుతుంది. ఈ నెల 10వ తేదీ ఉదయం 7 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11వ తేదీన చెన్నైకు వెళుతుంది. తిరిగి ఈ నెల 13వ తేదీన చెన్నై నుంచి బయలుదేరి 15వ తేదీ ఉదయం 8 గంటలకు విశాఖ పోర్టుకు చేరుకుంటుంది. విశాఖ నుంచి చెన్నై వరకు ముందు ఒకవైపు టికెట్ తీసుకున్నప్పటికీ.. అటునుంచి కూడా విశాఖకు ప్రయాణాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఈ క్రూయిజ్‌లో ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ అవసరం లేదు. అయితే ఎయిర్‌పోర్టు తరహా తనిఖీలు చేసి పర్యాటకులను క్రూయిజ్‌లోకి అనుమతిస్తున్నారు. పర్యాటకంగా విశాఖ మరో అడుగు క్రూయిజ్ రాకతో విశాఖ పర్యాటకంగా మరో అడుగు ముందుకేసినట్టయింది. ఈ విలాసవంతమైన నౌక రాకతో విశాఖలో పర్యాటక సందడి మరింత పెరిగే అవకాశముంది. ఈ నౌకలో విహరించేందుకు విశాఖవాసులే కాకుండా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు విశాఖకు వస్తారని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో విశాఖ నుంచి విదేశాలకు క్రూయిజ్ విహార యాత్రకు ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు. నెరవేరిన కల చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్రూయిజ్ విహారయాత్ర అందుబాటులోకి రావడంతో విశాఖవాసుల కల నెరవేరినట్టయింది. విశాఖ వాసులే కాకుండా పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్గడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు విశాఖ నుంచి క్రూయిజ్ విహార యాత్రకు పోటీ పడ్డారు. తొలి సర్వీసుకు పూర్తి స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ నెల 15వ తేదీన మరో సర్వీసుకు 90 శాతం టికెట్ల విక్రయాలు జరగగా.. 22వ తేదీకి పూర్తిస్థాయిలో ఫుల్ అయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అలాగే జూలై, ఆగస్టు, సెపె్టంబర్ మాసాల్లో సర్వీసులకు అప్పుడే 60 శాతం టికెట్లు అమ్ముడైనట్లు తెలిపారు. మూవింగ్ స్టార్ హోటల్ కార్డీలియా క్రూయిజ్ ఒక మూవింగ్ స్టార్ హోటల్. మొట్టమొదటిసారిగా విలాసవంతమైన క్రూయిజ్‌లో విహారయాత్ర సరికొత్త అనుభూతిని ఇచ్చింది. బయట ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ అన్ని సదుపాయాలు, సౌకర్యాలను బాగా ఎంజాయ్ చేయవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ సంతోషంగా, విలాసవంతంగా గడిపే మంచి యాత్ర ఇది. – జయకర్, విశాఖపట్నం క్రూయిజ్‌లో సదుపాయాలు ► కార్డీలియా ఎంప్రెస్ క్రూయిజ్ నౌక ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. ► మొత్తం 11 అంతస్తులతో ఉండే ఈ క్రూయిజ్ మొదటి ఫ్లోర్లో ఇంజిన్, రెండో ఫ్లోర్లో కార్గో ఉంటుంది. ► మూడో ఫ్లోర్ నుంచి పాసింజర్ లాంజ్ మొదలవుతుంది. ► అక్కడి నుంచి ఎలివేటర్ ద్వారా పదో అంతస్తు వరకు చేరుకోవచ్చు. ► పదో ఫ్లోర్లో డెక్ లాంటి పెద్ద టెర్రస్ ఉంటుంది. ► పదకొండో అంతస్తులో ఉండే ప్రత్యేక సెటప్ ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది. ► లగ్జిరీ సూట్(8వ ఫ్లోర్) మినహా మిగిలిన అన్ని రకాల రూమ్స్ దాదాపుగా అన్ని ఫ్లోర్లలో ఉంటాయి. ► ఫుడ్‌కోర్టులు, మూడు స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్ అందుబాటులో ఉన్నాయి. ► చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఈ నౌకలో కార్డీలియా కిడ్స్ అకాడమీ పేరితో విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ► జిమ్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, కేసినో, డ్యాన్సులు, కామెడీ, మ్యాజిక్ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను వీక్షించడానికి థియేటర్, నైట్ క్లబ్, 24 గంటల సూపర్ మార్కెట్, ల్రైబరీ ఇలా క్షణం కూడా బోర్ కొట్టకుండా అనేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ► డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ► అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్‌మాల్స్, లైవ్ షోలు కూడా అలరిస్తాయి. ► టికెట్ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ క్యాసినోలో ఎంట్రీ ఉచితం. ► లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్యాసినో ఆడాలంటే.. రాష్ట్రంలో క్యాసినో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి లేదు. ఇందుకు కొంత సమయం వేచి ఉండాల్సిందే. నౌక ప్రయాణం ప్రారంభమై 20 మైళ్లు వెళ్లిన తరువాత క్యాసినో ఆడేందుకు అవకాశం ఉంటుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విహార ప్రేమికుల కోసం విశాఖ నుంచి కార్డీలియా షిప్ ఫోటోలు చూస్తే వావ్ అంటారు
-
విశాఖలో క్రేజీ క్రూయిజ్
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కార్డీలియా క్రూయిజ్ షిప్ ప్రారంభంతో విశాఖ ప్రజల కోరికే కాకుండా రాష్ట్ర ప్రజల కోరికా నేరవేరిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. విశాఖ పోర్టు నుంచి పాండిచ్చేరి మీదుగా చెన్నైకి బయలుదేరిన మొదటి క్రూయిజ్ షిప్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. కోవిడ్ తర్వాత విహార యాత్ర కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఇదో మంచి అవకాశమన్నారు. నౌక లోపల చూస్తే అలలపై ఇంద్రభవనంలా ఉందన్నారు. నౌకలో ప్రయాణికులతో మాట్లాడుతున్న మంత్రి రోజా ఈ షిప్ మొదటి ట్రిప్‌నకు 1200 మంది బుక్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 786 క్యాబిన్స్ కలిగిన ఈ షిప్లో 600 మంది పనిచేస్తున్నారని, వారిలో 92 శాతం భారతీయులేనన్నారు. 900 సీట్లు కలిగిన పెద్ద థియేటర్, స్విమ్మింగ్ పూల్స్ చాలా బాగున్నాయన్నారు. రుషికొండను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కోర్టులకు వెళ్లి స్టేల ద్వారా అడ్డుకుంటోందని మంత్రి రోజా విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుద కల్యాణి, పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. కుటుంబంతో వెళ్తున్నా.. నా కుటుంబం మొత్తం 9 మంది ఈ నౌకలో విహార యాత్రకు వెళ్తున్నాం. ఎప్పుడు లోపలకు వెళ్తామా అని ఆత్రుతగా ఉంది. కుటుంబం మొత్తానికి రూ.1.8 లక్షలు వెచ్చించాం. – కాశీ, విశాఖ వాసి అన్ని సౌకర్యాలు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. అత్యవసర సమయంలో వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. ఈ నెల 22 మినహా సెప్టెంబర్ వరకూ ప్రతి బుధవారం విశాఖ నుంచి షిప్ బయలుదేరుతుంది. – అల్థాఫ్, నిర్వాహకుడు -
అలలపై కలల నావ..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విహార ప్రపంచానికి విశాఖ నగరం స్వాగతం పలుకుతోంది. పర్యాటక రంగంలో అద్భుతమైన క్రూయిజ్ సేవలకు భారీ క్రూయిజ్ నౌక వస్తోంది. సాగర జలాల్లో మూడు రోజులు కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేందుకు సకల సౌకర్యాలతో 11 అంతస్తుల క్రూయిజ్ షిప్ ఎంప్రెస్ విశాఖకు రాబోతోంది. జూన్ 8వ తేదీన తొలి సర్వీస్ మొదలవుతుంది. ఈ నౌక వైజాగ్ నుంచి పుదుచ్చేరి, చెన్నై మీదుగా తిరిగి వైజాగ్ చేరుకుంటుంది. ఈ క్రూయిజ్ షిప్ నిర్వహణకు జేఎం భక్షి సంస్థకు విశాఖపట్నం పోర్టు అధికారులు అనుమతులు ఇచ్చారు. పాస్‌పోర్ట్ అవసరం లేదు ఎంప్రెస్ విదేశీ విహార నౌక అయినప్పటికీ భారత్‌లో మాత్రమే తిరిగేలా నిర్వాహకులు అనుమతులు పొందారు. ఈ కారణంగా షిప్ ఎక్కాలంటే పాస్‌పోర్ట్ అవసరం లేదు. కస్టమ్స్ తనిఖీలు ఉండవు. గతంలో వైజాగ్‌కు ఒకట్రెండు క్రూయిజ్ షిప్‌లు ఒక్కసారి మాత్రమే వచ్చి వెళ్లాయి. అవి రెగ్యులర్ సర్వీసులు కావు. ఎంప్రెస్ మాత్రం ప్రస్తుతం రెగ్యులర్ సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది. డిమాండ్‌ను బట్టి సర్వీసులు కొనసాగించాలా వద్దా అన్నది ఆలోచిస్తారు. షిప్లో స్విమ్మింగ్ పూల్ ఎంప్రెస్‌లో విహరించాలనుకునే పర్యాటకులకు వివిధ సర్వీసులు, ప్యాకేజీలు ఉంటాయి. పర్యాటకులు ఎంచుకునే సర్వీస్, ప్యాకేజీల ప్రకారం చార్జీలు నిర్ణయించారు. ప్రస్తుతం విశాఖ – చెన్నై టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీలో ముగ్గురు ప్రయాణించాలంటే మొదటి ఇద్దరికీ ఒకే విధమైన టికెట్ ధర ఉంటుంది. మూడో వ్యక్తికి కాస్త తగ్గుతుంది. జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు. ఈ క్రూయిజ్‌లో 796 క్యాబిన్లున్నాయి. 313 ఇన్సైడ్ స్టేట్ రూమ్స్, 414 ఓషన్ వ్యూ రూమ్స్, 63 బాల్కనీ రూమ్స్, 5 సూట్ రూమ్‌లతో పాటు ఒక లగ్జరీ సూట్ రూమ్ ఉంటుంది. 11 అంతస్తులు.. 1,840 మంది ప్రయాణికులు ఎంప్రెస్ ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. మొత్తం 11 అంతస్తులున్న ఈ భారీ నౌకలో ఒకేసారి 1,840 మంది ప్రయాణించవచ్చు. ఇందులో ఫుడ్ కోర్టులు, 3 స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్‌షోలు ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న అందరికీ షిప్‌లోని క్యాసినో వరల్డ్‌కు ఎంట్రీ ఉచితం. లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు చార్జీలు ఉంటాయి. షిప్లో సూట్ రూమ్ జూన్ 8న విశాఖకు రాక వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులతో జూన్ 8వ తేదీన ఎంప్రెస్ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంటుంది. ఆరోజు నౌకలో వచ్చిన వారికి నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలు, సందర్శనీయ స్థలాలను చూపిస్తారు. అదే రోజు రాత్రి 8 గంటలకు కొత్త పర్యాటకులతో విశాఖ పోర్టు నుంచి బయల్దేరుతుంది. జూన్ 10 వ తేదీ ఉదయం 7 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. 10వ తేదీ రాత్రి 7 గంటలకు బయల్దేరి 12వ తేదీన చెన్నైకి చేరుకుంటుంది. 13వ తేదీ ఉదయం చెన్నైలో బయల్దేరి 15వ తేదీన తిరిగి విశాఖ చేరుకుంటుంది. మళ్లీ 15వ తేదీన విశాఖ నుంచి బయల్దేరుతుంది. అదే విధంగా 22వ తేదీన కూడా విశాఖ నుంచి సర్వీసు నడిపేలా టూర్ ప్లాన్ సిద్ధం చేశారు. విశాఖ నుంచి చెన్నై వరకు ఒకవైపు టిక్కెట్ ఇస్తారు. చెన్నై నుంచి నౌకలోనే తిరిగి రావాలనుకొనేవారికి అదనపు చార్జీలు వసూలు చేస్తారు. -
Aryan Khan: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఎన్సీబీ క్లీన్ చిట్..
Narcotics Control Bureau Has Given Clean Chit To Aryan Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) యు టర్న్ తీసుకుంది. ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్సీబీ. ఆర్యన్ ఖాన్ అమాయకుడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో లేదని స్పష్టం చేసింది. 2021, అక్టోబర్ 3న ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్లో ఎన్సీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో ఇదొక హై ప్రొఫైల్ కేసుగా వార్తల్లో నిలిచింది. డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో.. ఆర్యన్‌తో పాటు మరో 19మందిపై కేసు నమోదు అయ్యాయి. వీళ్లలో ఆర్యన్‌తోపాటు మరో 17 మందికి బెయిల్ దొరికింది. కాగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారుల్ని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇటీవల పక్కకు తప్పించిన విషయం తెలిసిందే. విశ్వ విజయ్ సింగ్, అశిష్ రాజన్ ప్రసాద్‌లు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇన్చార్జిగా, డిప్యూటీ ఇన్వెస్టిగేషన్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే వీళ్లిద్దరూ అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, అందుకే వీళ్లను తప్పించినట్లు యాంటీ డ్రగ్ ప్రొబ్ ఏజెన్సీ (ఎన్సీబీ) స్పష్టం చేసింది. చదవండి:👇 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ 12 ఏళ్ల లవ్.. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ -
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: అందుకు అదనంగా 90 రోజులు..
Aryan Khan Drugs Case: NCB Seeks 90 More Days For File Charge Sheet: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడికీ వెళ్లడంతో బీటౌన్ షాక్ అయింది. గతేడాది అక్టోబర్ 2న క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తర్వాత ఆర్యన్‌ను అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్ జైలుకు తరలించగా సుమారు 20 రోజులు గడిపాడు ఈ స్టార్ కిడ్. ఆర్యన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా పలుమార్లు తిరస్కిరించింది. దీంతో ఆర్యన్ ముంబై హైకోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ కేసును ఎన్సీబీ సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం) దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే. చదవండి: 2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే.. ఈ కేసులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసేందుకు తమకు 90 రోజుల అదనపు సమయం కావాలని కోర్టును ఎన్సీబీ కోరింది. ముంబై సెషన్స్ కోర్టులో మార్చి 28న పిటిషన్ వేసింది. అయితే ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 180 రోజుల్లోగా ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయాలి. దీని ప్రకారం చూస్తే ఆర్యన్ డ్రగ్స్ కేసులో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు ఏప్రిల్ 2 చివరి తేది అవుతుంది. ఈ లెక్కన మరో 90 రోజుల అదనపు సమయం అంటే ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు జూలై 2 తేది చివరి తేది కానుంది. గతేడాది అక్టోబర్ 2న పార్టీ జరగగా.. అక్టోబర్ 3న ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. ఈ కేసులో సుమారు 20 మందిని ఎన్సీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 18 మంది బెయిల్‌పై బయట ఉన్నారు. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుపై సౌత్ హీరో సంచలన వ్యాఖ్యలు -
షిప్లో ఇల్లు కావాలా? 24 ఏళ్ల వరకు అద్దెకు అపార్ట్మెంట్లు .. ప్రారంభ ధరెంతో తెలుసా?
నేల మీద ఉండీ ఉండీ బోర్ కొట్టిందా. కాస్త వెరైటీగా సముద్రంలో ఇల్లు కట్టుకొని ఉంటే భలే ఉంటుందని అనుకుంటున్నారా. అయితే మీ కోసం ఓ గుడ్ న్యూస్! సముద్రంలో ఉండటమే కాదు. బోర్ కొడితే నీళ్లలో అలా ఓ చుట్టు చుట్టేసి కూడా వచ్చేలా ఇళ్లు సిద్ధమవుతున్నాయి. అదెలా.. అనుకుంటున్నారా. ఓ లగ్జరీ క్రూయిజ్ షిప్లో ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ రూ. 2.7 కోట్ల నుంచి మొదలు ఫ్లోరిడాకు చెందిన స్టోరీ లైన్స్ కంపెనీ ‘ఎంవీ నరేటివ్’పేరుతో లగ్జరీ క్రూయిజ్ షిప్‌ను నిర్మిస్తోంది. 2024 కల్లా ఇది అందుబాటులోకి రానుంది. షిప్లో ఒకటి నుంచి నాలుగు బెడ్రూమ్ల అపార్ట్మెంట్లు, స్టూడియోలు కలిపి మొత్తం 547 నిర్మిస్తోంది. వీటినే తాజాగా అమ్మకానికి పెట్టింది. వీటి ధర రూ.2.7 కోట్ల నుంచి మొదలవుతుంది. ఇంటి పరిమాణం, ఇంట్లోని వస్తువులను బట్టి ధర పెరుగుతుంటుంది. ఇళ్లను 12, 24 ఏళ్లకు అద్దెకు కూడా ఇస్తారు. వీలైనంత తక్కువ ధరకు ప్రజలకు ఇళ్లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ చెబుతోంది. (చదవండి: కేసులు పెరుగుతున్నా.. మరణాలు తక్కువే!) ఇంటికి కావాల్సినవన్నీ అందుబాటులో.. ప్రతి అపార్ట్మెంట్లో ఇంట్లో ఉండటానికి కావాల్సిన ఫర్నిచరంతా ఉంటుంది. ఇటాలియన్ ఇంటీరియర్ డిజైన్లతో అద్భుతంగా కనిపిస్తుంది. కిచెన్, టీవీలు, ఇంట్లో వేడి, చలి నియంత్రణ వ్యవస్థలు, మూడ్‌కు తగ్గట్టు కాంతి రంగులను మార్చుకునే వెసులుబాటు ఉంది. షిప్లో మొత్తం 20 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఎప్పుడైనా ఆర్డర్ చేసుకునేలా 24 గంటల హోమ్ డెలివరీ వెసులుబాటు ఉంది. వినోదం కోసం ఓ సినిమా హాలు, బీర్లు అమ్మే చిన్న మైక్రో బ్రూవరీ, 3 స్విమ్మింగ్ పూల్స్, 10 వేల పుస్తకాలున్న లైబ్రరీ, స్పా, వెల్నెస్ సెంటర్, యోగా స్టూడియో కూడా ఉన్నాయి. అలాగే గోల్ఫ్ సిములేటర్, డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఉన్నాయి. షిప్లో ఉండే వాళ్లు చెస్, ఫొటోగ్రఫీలాంటి క్లబ్‌లుగా ఏర్పడి ఆడుకోవచ్చు. ఈ షిప్ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అక్కడి పోర్టుల్లో దాదాపు 5 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి అక్కడి ప్రదేశాలను తిరిగి రావొచ్చు. షిప్ ఎక్కడికెళ్లాలి, ఎక్కడ ఆగాలో షిప్‌లోని వాళ్లు ముందే నిర్ణయించుకోవచ్చు కూడా. (చదవండి: వారిని విడుదల చేయండి!) -
మతి పోయేలా.. ‘మలేనా’.. ఖర్చు రూ.2500 కోట్లు, మరెన్నో విశేషాలు
పేద్ద.. క్రూయిజ్ ఓడ నీళ్లలో వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఓ బిల్డింగే అలా కదిలిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. ఆ ఓడలను అంతలా అద్భుతంగా నిర్మిస్తుంటారు. రోడ్రిగ్యుయెజ్ డిజైన్ అనే కంపెనీ కూడా తామేం తీసిపోలేదంటూ కళ్లు చెదిరే ఓ ఓడ డిజైన్‌ను రూపొందించింది. 110 మీటర్ల పొడవు.. 26 మీటర్ల ఎత్తున్న అతిపెద్ద ఈ ఓడను పక్కనుంచి చూస్తే ఓ లగ్జరీ హోటలేనా అనిపించేట్టు ఉంటుంది. ఈ డిజైన్‌తో ఓడను నిర్మించాలంటే ఓడలో వాడే వస్తువులు, నిర్మించే కంపెనీని బట్టి దాదాపు రూ.2,500 కోట్ల వరకు ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. ఓడకు ‘మలేనా’ అని పేరు పెట్టింది. ఓడలో మొత్తం 11 క్యాబిన్లు ఉంటాయి. వీటన్నింటిలో కలిపి 24 మంది ప్రయాణించొచ్చు. ఓడ ప్రధాన డెక్‌లో 6 వీఐపీ క్యాబిన్లు ఉంటాయి. లోయర్ డెక్‌లో 4 డబుల్ క్యాబిన్ డెక్‌లు, ఒక యజమాని అపార్ట్మెంట్ ఉంటాయి. ఇందులో హాట్ టబ్, డైనింగ్ ప్రాంతం ఉంటుంది. లోయర్ డెక్లోనే 9 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పుతో రెండు ఇన్ఫినిటీ పూల్స్, వీటితో పాటు సన్ బెడ్స్ ఉంటాయి. అలాగే ఏడుగురు కూర్చునేలా బార్ ఉంటుంది. లోయర్ డెక్ నుంచి మెట్లెక్కి పైకి వెళ్తే అప్పర్ డెక్ వస్తుంది. ఇక్కడ ఓ పెద్ద డైనింగ్ ఏరియా ఉంటుంది. 24 మంది కలిసి కూర్చొని తినవచ్చు. అప్పర్ డెక్‌లో ఒక హెలిప్యాడ్ కూడా ఉంటుంది. ఏసీహెచ్ 160 లేదా అలాంటి పరిమాణంలోని హెలికాప్టర్లు దీనిపై ల్యాండ్ చేయవచ్చు. (చదవండి: వామ్మో ! కుక్కపిల్ల మాదిరి సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చేసింది!!) నిర్మాణానికే నాలుగైదేళ్లు ఓడలో అన్నింటికన్నా పైన సన్ డెక్ ఉంటుంది. దీన్నే పార్టీ డెక్ అని కూడా అంటారు. ఇక్కడ మరో హాట్ టబ్, కూర్చునేందుకు ఓ ప్రాంతం, ఓ బార్ కూడా ఉంటాయి. బోటు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది. డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఇంధనాలతో కలిసి నడుస్తుంది. బోటును నిర్మించడానికి దాదాపు 4 నుంచి 5 ఏళ్లు పడుతుందని కంపెనీ యజమాని చెప్పారు. ప్రస్తుతానికి ఇది డిజైన్ మాత్రమే అయినా ఓడ నిర్మాణానికి ఓ షిప్ యార్డ్‌తో, నిర్మించాలనుకుంటున్న వ్యక్తితో సంప్రదింపులు జరుపుతున్నామని డిజైన్ కంపెనీ చెప్పింది. (చదవండి: లాక్‌డౌన్‌తో ఆగమాగం .. చైనీయుల ఆకలి కేకలు, అయినా తగ్గేదే లే!) – సాక్షి సెంట్రల్ డెస్క్ -
నా ఇంటిపై రెక్కీ: మాలిక్
ముంబై: ముంబై క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), సంస్థ ఉన్నతాధికారి సమీర్ వాంఖెడేలపై కొంతకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఈసారి కొత్త ఆరోపణలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తన ఇల్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారని శనివారం ముంబైలో ఆరోపించారు. ‘ గత వారం నేను దుబాయ్‌లో ఉన్నపుడు ముంబైలో నా ఇంటి వద్ద ఇద్దరు రెక్కీ నిర్వహించారు. కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. ఇల్లు, ఆఫీస్, మనవళ్ల పాఠశాలల వద్ద కెమెరాలతో ఫొటోలు తీశారు. మా సమాచారం సేకరించారు. నా దగ్గర సాక్ష్యాలున్నాయి. తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు చేసిన వాట్సాప్ చాట్స్ నా వద్ద ఉన్నాయి. నాపై కేసులు పెడితే ఊరుకోను. ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలేలకు ఫిర్యాదుచేస్తా’ అని నవాబ్ మాలిక్ హెచ్చరించారు. -
ఆర్యన్ కుట్ర చేశారనడానికి ఆధారాల్లేవ్
ముంబై: ముంబైలో క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ నేరానికి సంబంధించి ముందస్తు కుట్ర పన్నాడనడానికి ప్రాథమిక ఆధారాలు లభించలేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్యన్‌ఖాన్, సహ నిందితులైన అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు బెయిల్ మంజూరు చేసినప్పుడు ఇచ్చిన తీర్పు పూర్తి పాఠాన్ని బాంబే హైకోర్టు శనివారం విడుదల చేసింది. డ్రగ్స్ కేసులో జడ్జి జస్టిస్ ఎన్.డబ్ల్యూ. సాంబ్రే అక్టోబర్ 28న నిందితులందరికీ బెయిల్ మంజూరు ఇచ్చారు. ఆర్యన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో లింకులున్నాయని అతని వాట్సాప్ చాట్ల ద్వారా తెలుస్తోందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఆర్యన్ వాట్సాప్ సంభాషణల్లో అభ్యంతరకరమైన అంశాలేవీ లేవని జడ్జి తీర్పులో స్పష్టం చేశారు. అధికారులు రికార్డు చేసిన ఆర్యన్ నేరాంగీకారాన్ని విచారణ కోసమే వినియోగించాలన్నారు. ఎన్డీపీసీ చట్టం కింద అతను నేరం చేశాడని చెప్పలేమని జడ్జి పేర్కొన్నారు. ఆర్యన్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని చెప్పడానికి తగిన ఆధారాలులేవని వెల్లడించారు. ఆర్యన్, అర్బాజ్, మున్మున్ కుట్ర చేశారని చెప్పడానికి ఎన్సీబీకి ఆధారాలు లభించలేదని ఆ తీర్పులో వివరించారు. -
మరో రోజు జైల్లోనే
-
ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు షరతులు
ముంబై: ఎట్టకేలకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. గురువారం ఆర్యన్ బెయిల్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు అతడికి బెయిల్ మంజురూ చేస్తూ కొన్ని షరతులు కూడా విధించింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు ఆర్యన్ హాజరుకావాల్సి ఉంటుంది. దేశం వదిలి వెళ్లకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ నెల అక్టోబర్ 2వ తేదీన క్రూయిజ్ ఓడరేవులో జరుగుతున్న డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడి జరపగా, అందులో ఆర్యన్‌తో పాటు మరో 8మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 23 రోజుల అనంతరం ఆర్యన్‌కు గురువారం బెయిల్ రావడంతో షారుక్ కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: Aryan Khan Drugs Case : విట్నెస్, డిటెక్టివ్ కిరణ్ గోసవిని అరెస్ట్.. -
ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్
ముంబై: ముంబై తీరంలోని క్రూయిజ్‌లో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆర్యన్‌ఖాన్ అరెస్టయిన 25 రోజులు తర్వాత అతనికి బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ డబ్ల్యూ సాంబ్రే గురువారం తీర్పు చెప్పారు. ఆర్యన్ సహ నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేశారు. ‘‘వారి ముగ్గురి బెయిల్ విజ్ఞప్తిని ఆమోదిస్తున్నాను. శుక్రవారం సాయంత్రానికి వివరంగా ఉత్తర్వులు జారీ చేస్తాను’’ జస్టిస్ సాంబ్రే చెప్పారు. ఇంకా పూర్తి ఉత్తర్వులు రాకపోవడంతో శుక్రవారం లేదంటే శనివారంనాడు ఆర్యన్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. వాదనలు సాగిందిలా.. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో మూడు రోజుల పాటు వాదనలు సాగాయి. ఇప్పటికే రెండుసార్లు ఆర్యన్‌కు కింది కోర్టుల్లో చుక్కెదురు కావడంతో మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని లాయర్‌గా నియమించారు. క్రూయిజ్‌పై ఎన్సీబీ అధికారులు దాడి చేసినప్పుడు ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. ఈ విషయాన్నే ఆయన తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ పదే పదే ప్రస్తావించారు. వైద్య పరీక్షల్లో కూడా ఆర్యన్ డ్రగ్స్ సేవించాడనేది రుజువు కాలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. అలాంటప్పుడు ఆర్యన్‌ను అదుపులోనికి తీసుకోవడం అర్థరహితమని వాదించారు. రెండేళ్ల క్రితం నాటి వాట్సాప్ సంభాషణలను ఆధారం చేసుకొని ఆర్యన్ చుట్టూ ఉచ్చు బిగించాలని చూశారని, కానీ ఆ సంభాషణల్లో కూడా ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. అర్బాజ్ ధరించిన షూలో డ్రగ్స్ లభిస్తే ఆర్యన్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని రోహత్గీ తన వాదనల్లో గట్టిగా ప్రశ్నించారు. మరోవైపు ఎన్సీబీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ ఆర్యన్ ఖాన్ మాదకద్రవ్యాలను తరచుగా సేవిస్తారని చెప్పారు. గత రెండేళ్లుగా ఆర్యన్ అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేసి సేవిస్తున్నారని తన వాదనల్లో పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రేతలతో ఆర్యన్‌కి సంబంధాలున్నాయని అనిల్ సింగ్ ఆరోపించారు. డ్రగ్స్‌తో వ్యాపారం చేసే స్థాయిలో పెద్ద మొత్తంలో ఆర్యన్ కొనుగోలు చేస్తున్నాడని అతని వాట్సాప్ సంభాషణల ద్వారా తేటతెల్లమవుతోందని, ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతోందని అందుకే అతనికి బెయిల్ ఇవ్వొద్దని అనిల్ సింగ్ వాదించారు. క్రూయిజ్‌పై దాడి జరిగిన సమయంలో ఎక్కువమంది దగ్గర వివిధ రకాల మాదకద్రవ్యాలు లభించాయని వీటన్నింటినీ చూస్తుంటే ఆర్యన్ డ్రగ్స్ విషయం గురించి పూర్తిగా తెలుసునని ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం అన్నీ తెలిసి కూడా అక్కడ ఉండడం నేరపూరితమైన చర్యేనని వాదించారు. దీనికి రోహత్గీ గట్టిగా కౌంటర్ ఇస్తూ క్రూయిజ్‌లో 1,300 మంది ఉన్నారని గుర్తు చేశారు. తాజ్ హోటల్లో 500 గదులుంటే, రెండు గదుల్లో ఉన్న వారు డ్రగ్స్ సేవిస్తే మొత్తం హోటల్లో ఉన్న వారందరినీ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఆర్యన్ ఎలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడలేదని, ఒక నవ యువకుడ్ని ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ పకడ్బందీగా వాదనలు వినిపించారు. లాయర్ రోహత్గీ వాదనలు విన్న న్యాయమూర్తి ముగ్గురికీ బెయిల్ ఇస్తానని ప్రకటించి, తీర్పు పూర్తి పాఠాన్ని శుక్రవారం వెల్లడిస్తానని స్పష్టం చేశారు. కాగా ఆర్యన్‌కు బెయిల్‌పై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ‘‘సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రమా’’..అంటూ స్పందించగా, ‘‘నాకిది చాలా సాధారణమైన కేసు. కొన్ని గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం. కానీ ఆర్యన్‌కు బెయిల్ రావడం సంతోషంగా ఉందని సీనియర్ లాయర్ ముకుల్ రొహత్గీ అన్నారు. న్యాయం జరగాల్సిన సమయం వస్తే, సాక్ష్యాలతో పని ఉండదు అని నటుడు సోనూసూద్ పేర్కొనగా ‘‘అంతా దేవుడి దయ. ఒక తండ్రిగా ఊపిరిపీల్చుకుంటున్నాను. ఇక వాళ్లకి అంతా మంచే జరగాలి’’అని మరో నటుడు ఆర్.మాధవన్ ఆకాంక్షించారు. 2018 నాటి చీటింగ్ కేసులో గోసవి అరెస్ట్ పుణె: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సాక్షిగా ప్రవేశపెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ కిరణ్ గోసవిని గురువారం మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో అతడిపై నమోదైన చీటింగ్ కేసుకు సంబంధించి అదుపులోనికి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కొన్నాళ్లుగా పరారీలో ఉన్న గోసవి పోలీసులకు లొంగిపోకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తలదాచుకుంటూ వస్తున్నారని పోలీసు అధికారులు చెప్పారు. ఆ తరవాత అతనిని పుణె కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్ కేసులో నిందితుడైన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్ కుమారుడే ఆర్యన్‌తో కలిసి గోసవి దిగిన సెల్ఫీలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 2018లో గోసవిపై నమోదైన చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నట్టు పుణె పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్తా వెల్లడించారు. కత్రజ్ ప్రాంతంలోని ఒక లాడ్జిలో తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. సచిన్ పాటిల్ పేరుతో అతడు ఆ హోటల్లో ఉంటున్నాడు. నోటీసులివ్వకుండా వాంఖెడేని అరెస్ట్ చేయం ఆర్యన్ ఖాన్ విడుదలకు ముడుపులు డిమాండ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి మూడు రోజుల ముందుగా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయమని ముంబై పోలీసులు హైకోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు తనని అరెస్ట్ చేస్తారన్న భయం వెంటాడుతోందంటూ వాంఖెడే కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వాంఖెడే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ ఎస్వి కొత్వాల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని, ముంబై పోలీసులు ఈ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించే అవకాశం ఉందని వాంఖెడే ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసుల తరఫున కోర్టుకు హాజరైన చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ ముందస్తు నోటీసు లేకుండా వాంఖెడేని అరెస్ట్ చేయరని స్పష్టం చేశారు. మరోవైపు తమ కుటుంబంపైనా, వ్యక్తిగత జీవితంపైనా దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ వాంఖెడే భార్య క్రాంతి రేడ్కర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. తమకు న్యాయం చెయ్యాలంటూ ఆమె ఆ లేఖలో కోరారు. -
ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
Kiran Gosavi, NCB Witness In Aryan Khan Case, Arrest: ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విట్నెస్, డిటెక్టివ్ కిరణ్ గోసవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ని పూణె పోలీసులు విచారిస్తున్నారు. ఆర్యన్ అరెస్ట్ తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కారణ్ గోసవి ఇటీవలె ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 2న క్రూయిజ్ నౌకపై దాడి జరిగిన కిరణ్ గోసవి సహా ఆయన వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్‌ని సాక్షులుగా చేర్చి విచారించింది. చదవండి: ఆర్యన్‌కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే.. ఆర్యన్‌ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు కిరణ్ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాతో తెగ వైరల్ అయ్యింది. అయితే తర్వాత గోసవి కనిపించకుండాపోవడం, అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా ఇటీవలె మీడియాతో మాట్లాడుతూ ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్లో ఆరోపించారు. చదవండి: Aryan Khan: ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు? వాంఖెడే X నవాబ్ మాలిక్ -
‘రూ.25 కోట్ల డిమాండ్’పై విజిలెన్స్ దర్యాప్తు
న్యూఢిల్లీ: ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో నిందితుడైన ఆర్యన్ ఖాన్‌ను విడిచిపెట్టడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారంటూ ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి సమర్పించిన అఫిడవిట్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) వేగంగా స్పందించింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేతోపాటు మరికొందరు అధికారులపై ప్రభాకర్ సాయిల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విజిలెన్స్ దర్యాప్తు కోసం ఎన్సీబీ ఉత్తర రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలో త్రిసభ్య బృందం ఏర్పాటయ్యింది. జ్ఞానేశ్వర్ సింగ్ ఎన్సీబీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీఓ)గానూ పనిచేస్తున్నారు. ఆర్యన్ ఖాన్‌ను విడిచిపెట్ట్టడానికి రూ.25 కోట్లు ఇవ్వాలంటూ ఎన్సీబీ కీలక అధికారులతోపాటు ఈ కేసులో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారని ప్రభాకర్ సాయిల్ ఆదివారం బాంబు పేల్చాడు. ఈ మేరకు ముంబై పోలీసులకు అఫిడవిట్ అందజేశాడు. డ్రగ్స్ కేసులో మరో సాక్షి అయిన కె.పి.గోసవికి ప్రభాకర్ సాయిల్ బాడీగార్డుగా పనిచేస్తున్నాడు. ప్రభాకర్ సాయిల్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని డ్రగ్స్ కేసులో మరో సాక్షి కిరణ్ గోసవి పేర్కొన్నాడు. క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ దాడులు జరిగిన అక్టోబర్ 2 నుంచి పరారీలో ఉన్న అతడు సోమవారం గుర్తుతెలియని ప్రాంతం నుంచి టీవీ చానళ్లతో మాట్లాడాడు. తాను అతి త్వరలో లక్నో పోలీసుల ఎదుట లొంగిపోతానని చెప్పాడు. పారదర్శకంగా దర్యాప్తు ప్రభాకర్ సాయిల్ సమర్పించిన అఫిడవిట్, కేసు రిపోర్టు ముంబైలోని తమ అధికారుల నుంచి అందిందని జ్ఞానేశ్వర్ సింగ్ సోమవారం ఢిల్లీలో చెప్పారు. ఈ రిపోర్టును ఎన్సీబీ డైరెక్టర్ జనరల్పరిగణనలోకి తీసుకున్నారని, విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారని వెల్లడించారు. సిబ్బందిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా పారదర్శకంగా, నిజాయతీగా దర్యాప్తు జరుపుతామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ వాంఖెడేను డ్రగ్స్‌కేసు విచారణ నుంచి తప్పించడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాలను బట్టి చర్యలుంటాయన్నారు. విజిలెన్స్ దర్యాప్తులో భాగంగా వాంఖెడేను, ఇతర అధికారులను, సాయిల్‌ను నిశితంగా ప్రశ్నించనున్నట్లు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. కాగా, సమీర్ వాంఖెడే సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్సీబీ ఉన్నతాధికారులెవరూ తనను పిలిపించలేదని, వేరే పని కోసం ఇక్కడికి వచ్చానన్నారు. సాయిల్‌కు పోలీసు భద్రత ముంబై డ్రగ్స్ కేసులో సాక్షి అయిన ప్రభాకర్ సాయిల్‌కు పోలీసు భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్‌వాల్సే పాటిల్ ప్రకటించారు. సాయిల్ సోమవారం ముంబై పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. జాయింట్ కమిషనర్(క్రైమ్) మిలింద్‌ను కలిసి మాట్లాడాడు. అనంతరం ముంబై శివారులోని సహర్ పోలీసులను కలిశాడు. తనకు భద్రత కల్పించాలని కోరాడు. విచారణకు అనన్య పాండే డుమ్మా డ్రగ్స్ కేసులో నటి అనన్య పాండే సోమవారం ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఇంతకుముందే రెండు రోజులపాటు ఎన్సీబీ ఆమెను ప్రశ్నించింది. సోమవారం మళ్లీ రావాలని సూచించినప్పటికీ రాలేదు. వాంఖెడే ఫోర్జరీ సర్టిఫికెట్లు: నవాబ్ మాలిక్ ఎన్సీబీ జోనల్ డెరెక్టర్ సమీర్ వాంఖెడే పుట్టినతేదీ సహా సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి, ఉద్యోగంలో చేరారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరో పించారు. సోమవారం సదరు సర్టిఫికెట్లను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఆరోపణలను వాంఖెడే కొట్టిపారేశారు. ఈ కేసులో నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌ను వాంఖెడే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వాంఖెడేకు ఉపశమనం సాధ్యం కాదు: ప్రత్యేక కోర్టు ముంబై: డ్రగ్స్ కేసులో సాక్షి ప్రభాకర్ సాయిల్ అఫిడవిట్ ఆధారంగా న్యాయస్థానాలు తనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించిన సమీర్ వాంఖెడేకు నిరాశే ఎదురయ్యింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఎన్సీబీ, సమీర్ వాంఖెడే సోమవారం ప్రత్యేక కోర్టులో రెండు వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేశారు. డ్రగ్స్ కేసులో విచారణకు అడ్డంకులు సృష్టించడానికి ప్రభాకర్ సాయిల్ ప్రయత్నిస్తున్నాడని, అందులో భాగంగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఎన్సీబీ, వాంఖెడే తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై పెద్ద కుట్ర జరుగుతోందని వాంఖెడే చెప్పారు. తమను నైతికంగా దెబ్బతీసే యత్నం జరుగుతోందన్నారు. అందుకే తమపై న్యాయస్థానాలు చట్టపరమైన చర్యలు ప్రారంభించకుండా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. అయితే, ఈ కేసులో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రత్యేక జడ్జి వి.వి.పాటిల్ స్పష్టం చేశారు. -
మా నాన్న హిందు, అమ్మ ముస్లిం..
ముంబై: తన మతంపై రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబై జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడే స్పందించారు. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న సమీర్ వాంఖెడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ పలు ఆరోపణలు చేశారు. సమీర్.. ముస్లిం మతానికి చెందినవారని పేర్కొంటూ ఒక డాక్యుమెంట్‌ను ట్విటర్లో షేర్ చేశారు. ‘ఫోర్జరీ ఇక్కడ నుంచి ప్రారంభమైంది’ అంటూ క్యాప్షన్ తగిలించారు. అంతేకాదు సమీర్, ఆయన మాజీ భార్య షబానా ఖురేషీ పెళ్లి నాటి ఫొటో కూడా ట్విటర్లో పెట్టారు. దీనిపై సమీర్ దీటుగా స్పందించారు. నవాబ్ మాలిక్ ట్విటర్లో షేర్ చేసిన ఫొటోలు అనవసర విషయాల్లో తనను ఇరికిస్తున్నారని, తనకు సంబంధించిన ఏ వివరాలైనా పరిశీలించుకోవచ్చని సమీర్ వాంఖెడే స్పష్టం చేశారు. ‘నా తండ్రి పేరు ద్యాన్ దేవ్ కచ్రుజీ వాంఖెడే. 2007 జూన్ 30న స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్గా ఆయన పదవీ విరమణ చేశారు. నా తండ్రి హిందువు. నా తల్లి దివంగత శ్రీమతి జహీదా ముస్లిం. బహుళ మత, లౌకిక కుటుంబానికి చెందినవాడిగా.. నా వారసత్వం గురించి నేను గర్విస్తున్నాను. నేను డాక్టర్ షబానా ఖురేషీని 2006లో ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం వివాహం చేసుకున్నాను. మేమిద్దరం 2016లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. 2017లో, నేను షిమాతి క్రాంతి దిననాథ్ రెడ్కార్ను వివాహం చేసుకున్నాను’ అని సమీర్ వాంఖెడే ఒక ప్రకటనలో తెలిపారు. చాలా బాధపడ్డాను నవాబ్ మాలిక్ ఆరోపణలు తనను, తన కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేశాయని సమీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా వ్యక్తిగత పత్రాలను ప్రచురించడం పరువు నష్టం కలిగించేది మాత్రమే కాదు నా కుటుంబ గోప్యతపై అనవసరమైన దాడి కూడా. ఇది నన్ను, నా కుటుంబాన్ని, నా తండ్రిని, చనిపోయిన నా తల్లిని కించపరచడానికి ఉద్దేశపూర్వకంగా చేసింది. గత కొన్ని రోజులుగా గౌరవ మంత్రి చర్యలు నన్ను, నా కుటుంబాన్ని విపరీతమైన మానసిక, మానసిక ఒత్తిడికి గురి చేశాయి. వ్యక్తిగత, పరువు నష్టం కలిగించే దాడులతో నేను బాధపడ్డాను’ అని సమీర్ వాంఖెడే ట్విటర్లో పేర్కొన్నారు. Me n my Husband Sameer r born Hindus.We hv never converted to any other religion.V respect all religions.Sameer’s father too is hindu married to my Muslim Mom in law who is no more.Sameer’s ex-marriage ws under special marriage act,divorced in 2016.Ours in hindu marriage act 2017 pic.twitter.com/BDQsyuvuI7 — Kranti Redkar Wankhede (@KrantiRedkar) October 25, 2021 మతం మారలేదు: సమీర్ భార్య తన భర్తపై మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలపై సమీర్ వాంఖెడే భార్య షిమాతి క్రాంతి దిననాథ్ రెడ్కార్ ట్విటర్లో స్పందించారు. తాను, తన భర్త జన్మతః హిందువులమని, మరో మతంలోకి మారలేదని స్పష్టం చేశారు. అన్ని మతాలను గౌరవిస్తామని పేర్కొంటూ తమ పెళ్లినాటి ఫొటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. కాగా, తప్పుడు ఆరోపణలతో తనపై కుట్రకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, చట్టబద్ద రక్షణ కల్పించాలంటూ సమీర్ వాంఖెడే ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ముంబై పోలీసు కమిషర్ హేమంత్ నగ్రాలేకి ఆయన లేఖ రాశారు. అయితే డ్రగ్స్ కేసులతో మహారాష్ట్ర పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని శివసేన, ఎన్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. (చదవండి: ముంబై డ్రగ్స్ కేసు.. ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు?) -
ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు?
ముంబై: ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి సంచలన ఆరోపణలు చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్లో ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన ఆదివారం మీడియాకి చెప్పారు. ప్రైవేట్ డిటెక్టివ్ కె.పి. గోసవికి వ్యక్తిగత అంగరక్షకుడినని చెప్పుకుంటున్న ప్రభాకర్ అక్టోబర్ 2న క్రూయిజ్ నౌకపై దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్‌ని సాక్షులుగా చేర్చి విచారించింది. ఈ అరెస్ట్‌ల తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని శామ్ డిసౌజా అనే వ్యక్తితో కేపీ గోసవి ఫోన్లో ఈ డీల్ గురించి మాట్లాడుతుంటే తాను అదే కారులో ఉండి విన్నానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత షారూక్‌ఖాన్ మేనేజర్ పూజా దడ్లానితో కారులోనే ఈ డీల్ గురించి 15 నిముషాల సేపు చర్చించారంటూ ప్రభాకర్ తెలిపారు. ఎన్సీబీ అధికారులు తనని తొమ్మిది నుంచి 10 ఖాళీ కాగితాలపై సంతకం చేయాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. మరోవైపు కేపీ గోసవితో ఆర్యన్ ఖాన్ దిగిన సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం గోసవి కనిపించకుండా పోవడం, అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం చూస్తుంటే ఈ కేసు ఇంకా అనూహ్య మలుపులు తిరగడం ఖాయంగా అనిపిస్తోంది. అక్టోబరు 3న అరెస్టయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని అర్థర్ రోడ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అతని బెయిల్ పిటిషన్ మంగళవారం బాంబే హైకోర్టులో విచారణకు రానుంది. గట్టి జవాబు ఇస్తాం: సమీర్ ప్రభాకర్ సాయిల్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తోసిపుచ్చినట్టుగా ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. వారికి సరైన రీతిలో జవాబు చెబుతానని వాంఖెడే హెచ్చరించారు. సాక్షి అడ్డం తిరిగాడని, ఎన్సీబీ ప్రతిష్టను మంట కలిపేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నాడని, కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని అలాంటి మీటింగ్లేవీ జరగలేదని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రభాకర్ ఆరోపణల్ని తోసిపుచ్చుతూ ఎన్సీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రభాకర్ ఈ కేసులో సాక్షి మాత్రమే. ఈ కేసు విచారణ జరుగుతోంది. ఆయన చెప్పుకునేది ఏమైనా ఉంటే కోర్టులు ఉన్నాయి. సోషల్ మీడియాలో చెప్పుకునే బదులు న్యాయమూర్తి సమక్షంలోనే తన గోడు చెప్పుకోవాల్సింది. అతని అఫిడవిట్‌ను ఎన్సీబీ డైరెక్టర్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. మహారాష్ట్ర పరువు తీస్తారా?: శివసేన ఫైర్ ఆర్యన్‌ఖాన్ విడుదలకు ఎన్సీబీ ముడుపులు డిమాండ్ చేసిందన్న ఆరోపణలు షాకింగ్‌గా ఉన్నాయని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర పరువు తీయడానికే ఈ కేసులు పెట్టారని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భావిస్తున్నారని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో పాటుగా సంజయ్ రౌత్ ఒక వీడియో క్లిప్పింగ్ షేర్ చేశారు. ఆ వీడియోలో ఎన్సీబీ కార్యాలయంలో గోసవి ఫోన్ చేతిలో పట్టుకొని (స్పీకర్ ఆన్ చేసి) ఉండగా... ఆర్యన్ ఖాన్ ఎవరితోనో మాట్లాడుతున్న దృశ్యాలున్నాయి. ఈ ముడుపుల వ్యవహారంపై మహారాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టాలని రౌత్ డిమాండ్ చేశారు. మరోవైపు మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ఎన్సీబీ జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడేపై సిట్‌తో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్సీబీపై తరచుగా విమర్శలు చేస్తోంది. నాపై కుట్ర జరుగుతోంది: పోలీసుల్ని ఆశ్రయించిన వాంఖెడే తప్పుడు ఆరోపణలతో తనపై కుట్రకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్సీబీ ముంబై జోనల్ చీఫ్ సమీర్ వాంఖెడే ఆందోళన వ్యక్తం చేశారు. తనపై చట్టపరమైన చర్యలు చేపట్టకుండా రక్షణ కల్పించాలంటూ నగర పోలీసు కమిషర్ హేమంత్ నగ్రాలేకి లేఖ రాశారు. ‘‘ముడుపుల ఆరోపణలకు సంబంధించి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు నాపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇప్పటికే ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ ఈ అంశాన్ని ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ పరిశీలనకు పంపారు. దురద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి నుంచి రక్షణ కావాలి’’ అని కోరారు. -
ఆర్యన్ ఖాన్‌కు సాయం చేయలేదు: అనన్య పాండే
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాలను తాను ఎప్పుడూ తీసుకోలేదని బాలీవుడ్ నటి అనన్య పాండే ఎన్సీబీ అధికారులకు చెప్పారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ కొనుగోలు కోసం తాను ఎప్పుడూ సహాయం చేయలేదని పేర్కొన్నారు. ముంబై క్రూయిజ్‌లో మాదక ద్రవ్యాలు పట్టుబడిన కేసులో వరుసగా రెండోరోజు శుక్రవారం అనన్య పాండే ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్‌తో రెండేళ్ల క్రితం నాటి వాట్సాప్ సంభాషణల ఆధారంగా అనన్య పాండేను ఎన్సీబీ విచారిస్తోంది. 2018–19లో డ్రగ్స్ డీలర్ల నంబర్లు ఇవ్వడంలో అనన్య సహకరించినట్టుగా వారి వాట్సాప్ సంభాషణల ద్వారా తెలుస్తోందని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. స్టార్ హీరోల పిల్లల గెట్ టుగెదర్ పార్టీలలో ఆర్యన్ ఖాన్‌కి అనన్య డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా వారి సంభాషణల ద్వారా అవగతమవుతోందని ఎన్సీబీ వెల్ల డించింది. అనన్య సమాధానాలు సంతృప్తిగా లేకపోవడంతో మళ్లీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. -
రెగ్యులర్‌గా డ్రగ్స్ వాడుతాడేమో
ముంబై: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తరచుగా మత్తు పదార్థాలను వినియోగిస్తాడనే భావన కలుగుతోందని ముంబైలోని స్పెషల్ కోర్టు వ్యాఖ్యానించింది. ముంబైలోని క్రూయిజ్ నౌకలో మత్తు పదార్థాలు పట్టుబడిన కేసులో అరెస్టయిన ఆర్యన్, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, ఫ్యాషన్ మోడల్ మున్మున్ ధమేచల బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్యన్ వాట్సాప్ చాట్స్‌ను పరిశీలిస్తే డ్రగ్స్ విక్రేతలను తరచూ కలుస్తాడనే విషయం స్పష్టమవుతోందని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టాల సంబంధ కేసులను విచారించే కోర్టు స్పెషల్ జడ్జి వీవీ పాటిల్ వ్యాఖ్యానించారు. ‘కేసులో ఆధారాలుగా కోర్టుకు ఎన్సీబీ సమర్పించిన ఆర్యన్ వాట్సాప్ చాట్స్‌ను గమనిస్తే ఇతనికి రెగ్యులర్‌గా డ్రగ్స్ వాడే అలవాటుందని తెలుస్తోంది. ఆర్యన్‌కు బెయిల్ ఇస్తే బయటికొచ్చాక మళ్లీ ఈ తప్పు చేయబోడని మేం ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాం. అందుకే బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం’ అని కోర్టు ఉత్తర్వులో జడ్జి వ్యాఖ్యానించారు. ‘నౌకలో సోదాల సమయంలో ఆర్యన్ వద్ద డ్రగ్స్ లేవు. కానీ స్నేహితులు అర్బాజ్, మున్మున్ల వద్ద డ్రగ్స్ ఉన్నాయనే విషయం ఆర్యన్‌కు తెలుసు. సరదా కోసం, వినియోగం కోసం డ్రగ్స్ వెంట తెచ్చుకుంటామని అరెస్ట్ అయ్యాక ఇచ్చిన వాంగ్మూలాల్లో ఆర్యన్, అర్బాజ్ ఒప్పుకున్నారు. డ్రగ్స్‌ను సరఫరా చేసే, విక్రయించే వ్యక్తులతో ఆర్యన్‌కు మంచి పరిచయాలు ఉన్నాయి. ఆర్యన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. నిషేధిత డ్రగ్స్‌తో సంబంధమున్న ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు కుదరదు’ అని జడ్జి తేల్చిచెప్పారు. దీంతో ఆర్యన్ తరఫు లాయర్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జస్టిస్ ఎన్ డబ్ల్యూ సాంబ్రే నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ ముందు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది. గత 18 రోజులుగా ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోనే గడుపుతున్నారు. -
డ్రగ్స్ ముఠాతో ఆర్యన్‌కు లింకు?
ముంబై: ముంబై తీరంలోని క్రూయిజ్ షిప్లో మాదక ద్రవ్యాల పట్టివేత కేసులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ బెయిల్‌పై ముంబైలోని స్పెషల్ కోర్టులో వాడిగా వేడిగా వాదనలు జరిగాయి. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ వి.వి. పాటిల్ సమక్షంలో ఇరుపక్షాలు బుధవారం రోజంతా తమ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగిసిపోవడంతో విచారణను గురువారానికి జడ్జి వాయిదా వేశారు. ఆర్యన్ గత కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నాడని, పంపిణీ సైతం చేస్తాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కోర్టుకి వెల్లడించింది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాతో ఆర్యన్‌కి సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలిందని, ఇక ఆర్యన్ విదేశాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించనున్నట్టు ఎన్సీబీ వెల్లడించింది. ఆర్థిక అంశాలపై విచారణకు మరి కొంత సమయం పడుతుందని పేర్కొంది. ఎన్సీబీ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ ఒక్క నిందితుడిని విడుదల చేసినా విచారణపై ప్రభావం చూపిస్తుందని వాదించారు. ఆర్యన్, సహనిందితుడు అర్బాజ్ వాట్సాప్ చాట్స్‌ని పరిశీలిస్తే విదేశస్తులకు భారీగా మాదక ద్రవ్యాలను పంపిణీ చేసిన విషయం వెల్లడవుతోందని వాదించారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరిగిపోయిందని, ముఖ్యంగా కళాశాల విద్యార్థులు మత్తుకు బానిసలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్యన్ తరఫున హాజరైన అమిత్ దేశాయ్ ఎన్సీబీ చేసిన వాదనలు అర్థరహితమని కొట్టిపారేశారు. నిందితులు డ్రగ్స్ విక్రేతలు కాదని వాదించారు. -
జ్యుడీషియల్ కస్టడీకి ఆర్యన్
ముంబై: క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ స్వాధీనం కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌తోపాటు మరో ఏడుగురిని 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ముంబై మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆర్యన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతని న్యాయవాది సతీష్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది. నిందితులను తమ కస్టడీకి అప్పగిస్తూ ఇచ్చిన గడువును ఈ నెల 11 దాకా పొడిగించాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కోరింది. డ్రగ్స్ స్వాధీనం కేసులో కుట్రలను వెలికి తీయాల్సి ఉందని, ఈ వ్యవహారంలో అచ్చిత్ కుమార్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశామని(సరఫరాదారు కావొచ్చని అనుమానం).. అతడిని, నిందితులను కలిపి విచారించాల్సి ఉందని వెల్లడించింది. అయితే, ఎన్సీబీ విజ్ఞప్తిని న్యాయస్థానం కొట్టిపారేసింది. అస్పష్టమైన ఆధారాలను బట్టి నిందితులను మళ్లీ ఎన్సీబీ కస్టడీకి అప్పగించలేమని పేర్కొంది. ఈ నెల 3న ముంబై నుంచి గోవాకు పయనమైన పర్యాటక నౌకలో డ్రగ్స్‌తో కొందరు పార్టీ చేసుకుంటున్న సమాచారం అందడంతో ఎన్సీబీ దాడి చేసింది. వివిధ రకాల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, అర్బాజ్ మర్చంట్‌ను అరెస్టు చేసింది. షారుక్ మేనేజర్ పూజా దద్లానీ గురువారం కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆమె రోదించారు. 8 మంది నిందితులకు కోవిడ్ నెగటివ్ టెస్టు రిపోర్టు లేకపోవడంతో అధికారులు వారిని జైలుకు తరలించకుండా గురువారం రాత్రి ఎన్సీబీ ఆఫీస్‌లోనే∙ఉంచారు. నిందితులను కలిసి, మాట్లాడేందుకు వారి కుటుంబ సభ్యులను అనుమతించారు. పూజా దద్లానీ ఎన్సీబీ ఆఫీసుకు వచ్చి ఆర్యన్‌ను కలిశారు. -
‘కోవిడ్’ మృతులు 1,115
బీజింగ్: రోజులు గడుస్తున్నా చైనాలో కోవిడ్–19 (కరోనా వైరస్) కల్లోలానికి అంతం లేకుండా పోతోంది. గత ఏడాది డిసెంబర్లో తొలికేసు నమోదైన నాటి నుంచి చూస్తే మంగళవారం నాటికి వైరస్ బాధితుల మరణాల సంఖ్య 1,115కు చేరింది. ప్రస్తుతం 44,763 మంది వ్యాధి బారినపడినట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం తెలిపారు. జపాన్ తీరంలో లంగరేసిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలో తాజాగా 39 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో నౌకలో వైరస్ బాధితుల సంఖ్య 174కు చేరింది. మొత్తం 3700 మంది ప్రయాణీకులు ఉన్న ఈ నౌకలో ఇంకా వందలాది మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉందని జపాన్ ఆరోగ్య మంత్రి కట్సునోబూ కాటో తెలిపారు. కోవిడ్ బారిన పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు మహిళలు రష్యాలోని ఆసుపత్రి నుంచి పరారైనట్లు రష్యా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు సరిగా సహకరించకపోవడం, ఆసుపత్రిలోని పరిస్థితులు, వైరస్ సోకుతుందేమో అన్న భయం కారణంగానే తాము పారిపోయినట్లు ఆ మహిళలు చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇద్దరు భారతీయులకు కోవిడ్ టోక్యో: జపాన్‌లో క్రూయిజ్ నౌకలో చిక్కుకున్న 138 మంది భారతీయుల్లో ఇద్దరికి కోవిడ్ సోకినట్లు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. వ్యాధి సోకిన వారిని ఆస్పత్రులకు తరలించి జపనీస్ నియమనిబంధనల ప్రకారం చికిత్స అందిస్తున్నామని జపాన్ అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ వైరస్ ఉన్నందున ఈ నెల 19 వరకూ క్రూయిజ్ నౌకను తమ అదుపులోనే ఉంచుకోనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలు తెలుకునేందుకు భారత రాయబార అధికారులు జపాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
సముద్ర తీరంలో 3711 మందిని ఆపేశారు..
టోక్యో: కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ వైరస్ రోజు రోజుకు ఖండాలు, దేశాలను దాటేస్తోంది. తాజాగా కరోనా వైరస్ సోకి హాంకాంగ్‌లో ఓ వ్యక్తి మరణించాడు. చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని 25 దేశాలను గజగజలాడిస్తోంది. కరోనావైరస్ బారిన పడి చైనాలో ఇప్పటి దాకా 425 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 20 వేల మందికి పైగా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. దీంతో చైనా నుంచి ఎవరైనా తమ దేశంలోకి వస్తే ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. ప్రయాణికులకు అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల సోమవారం అర్థరాత్రి నుంచి చైనా భూభాగంతో ఉన్న 13 సరిహద్దు క్రాసింగ్స్‌ను హాంకాంగ్ మూసివేసింది. పలు విమానయాన సంస్థలు కూడా చైనాకు సర్వీసులను నిలిపివేశాయి. ('కరోనాను అంతమొందించాకే ఊపిరి పీల్చుకుంటా') తాజాగా.. జపాన్‌కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలో ప్రయాణిస్తున్న వారికి కూడా కరోనా వైరస్ బాధ తప్పలేదు. నౌకలో ప్రయాణిస్తున్న 3711 మందిలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. దీంతో జపాన్ ప్రభుత్వం యొకోహామా తీరంలోనే నౌకను ఆపేసింది. జపాన్ నిర్ణయంతో ప్రయాణికులంతా 24 గంటలపాటు నౌకలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రయాణికులందరికీ వైద్యపరీక్షలు పూర్తయ్యాక మాత్రమే అక్కడ నుంచి అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న వైద్యులు నౌకలోని 80 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. (కరోనా: ఇది హృదయ విదారక ఘటన!) -
షిప్ 11వ అంతస్తునుంచి పడిపోయిన పాప..!
ప్యూర్టో రికో : హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేద్దామనుకున్న ఓ కుటుంబంలో విషాదం నిండింది. షిప్లో ప్రయాణం చేస్తుండగా.. అనూహ్యంగా ఏడాది వయసున్నవారి గారాలపట్టి ప్రాణాలు కోల్పోయింది. వివరాలు.. వారంరోజుల పర్యటనలో భాగంగా అలన్ వేగండ్ తన కుటుంబంతో కలిసి సముద్రయానం చేద్దామనుకున్నాడు. ఆ క్రమంలో కుటుంబ సభ్యులందరూ ‘ఫ్రీడమ్ ఆఫ్ సీస్’ ఓడలో గత ఆదివారం ప్యూర్టో రికోలోని పాన్అమెరికా నౌకశ్రయం మీదుగా ప్రయాణిస్తున్నారు. భోజనం చేసేందుకు ఓడ 11వ అంతస్తుకు చేరుకున్నారు. లంచ్ చేసేందుకు అందరూ సిద్దమయ్యారు. ఆ సమయంలో వేగండ్ ఏడాది కూతురు అతని తండ్రి సాల్వటోర్ అనెల్లో చేతుల్లో ఉంది. అతను కిటీకీ పక్కనే కూర్చుని ఉన్నాడు. అయితే, అలల ఉధృతికి ఓడ కొద్దిగా కుదుపులకు లోనైంది. అందరూ చూస్తుండానే అనెల్లో చేతుల్లోంచి చిన్నారి కిటికీలోంచి బయటపడి ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
నడిసముద్రంలో చిక్కుకున్న నౌక
ఓస్లో: నార్వేతీరంలోని సముద్రంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ఆదివారం కూడా కొనసాగాయి. ఇప్పటివరకు 397 మంది ప్రయాణికులను హెలికాప్టర్ల ద్వారా తరలించారు. దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ట్రోంసో నుంచి స్టావంగర్‌కు వెళ్తున్న విలాసవంతమైన ఓడలో 1,373 మంది ఉన్నారు. శనివారం ఓడలోని ఇంజిన్లలో సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడింది. కెప్టెన్ అప్రమత్తమై అధికారులకు సమాచారమిచ్చారు. ప్రయాణికులను సముద్రం ఒడ్డుకు తీసుకువచ్చేందుకు అధికారులు హెలికాప్టర్లు పంపారు. ఇప్పటిదాకా 397 మందిని తరలించారు. బలమైన గాలులు వీస్తున్నా, ప్రమాదకర వాతావరణపరిస్థితులు ఉన్నా హెలికాప్టర్ ద్వారా ప్రయాణికుల చేరవేత కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఓడలోని నాలుగు ఇంజిన్లలో మూడింటిని సిబ్బంది మరమ్మతు చేశారు. ఓస్లోకు వాయవ్య దిశలో సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోల్డె పోర్టుకు ప్రయాణికుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. లైఫ్ జాకెట్లతో నౌకలో బిక్కుబిక్కుమంటున్న ప్రయాణికులు -
ఇంట్లోకి టైటానిక్‌లాంటి షిప్ దూసుకొస్తుందని..
-
ఇంట్లోకి టైటానిక్‌లాంటి షిప్ దూసుకొస్తుందని..
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ జంట తీవ్రంగా భయపడింది. ఒక భారీ షిప్ తమ ఇంట్లోకి దూసుకొస్తుందని భయపడుతూ గట్టిగా కేకలు వేసింది. వాళ్ల ఇంటి ముందున్న కుక్కలు కూడా ఆ సీన్ చూసి బెంబేలెత్తిపోయాయి. బిల్ తోడాంటర్ అనే వ్యక్తి లాడర్డేల్ అనే పోర్టు నుంచి ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా పెద్ద వైరల్ అయింది. లాడర్ డేల్ పోర్ట్ సమీపంలోని బీచ్‌లోని ఓ నివాసంలో ఓ జంట ఏడేళ్లుగా నివసిస్తోంది. ఆ ఇళ్లు బీచ్ ఒడ్డునే కావడంతో కాస్తంత సముద్రంలోకి ఉంటుంది. అయితే, ఇటీవలె దాదాపు ఒక ఎనిమిది అంతస్తుల పెద్ద జిగ్నాటిక్ క్రూయిజ్ లైనర్ అనే భారీ నౌక వారి ఇంటివైపుగా వచ్చింది. ఆ సీన్ చూసి ఇంట్లోని మహిళ బెంబేలెత్తిపోయింది. తన భర్తను వెళ్లి ఆ షిప్‌ను ఆపించండి అని చెప్పడంతో అతడు చేతులు ఊపుతూ హలో అంటూ గట్టిగా అరిచాడు. ‘మీరు చాలా దగ్గరగా వస్తున్నారు. పరిమితి దాటవొద్దు. ఇక్కడ నుంచి వెళ్లిపోండి’ ఆమె కేకలుపెట్టింది. ఆ సమయంలో నౌక మా ఇంట్లోకి వస్తుంది. నేను నిజంగా భయపడిపోయాను. నేను మా ఇంట్లో కుక్కల గురించి.. నా ఇల్లు గురించి చాలా బాధపడ్డాను. మా ఏడేళ్ల జీవితంలో ఎప్పుడు ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు. సరిగ్గా 100 మీటర్ల దూరంలోనే నౌక ఆగిపోయింది’ అంటూ ఆ వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు. -
ప్రయాణికులకు షాకిచ్చిన భారీ నౌక
ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ' హర్మనీ ఆఫ్ ది సీస్' లో తొలిసారి ప్రయాణించాలన్న కోరికతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎక్కడెక్కినుంచో వచ్చిన వారికి నిరాశే మిగిలింది. ఇంకాపూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తవకుండానే తమకు టికెట్లు అమ్మి యాజమాన్యం సోమ్ము చేసుకుందని అందులో ప్రయాణించిన కొందరు ప్రయాణికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టాయిలెట్లు జామ్ అయిపోయి దుర్వాసన వస్తుందని.. ఓ ప్రయాణికుడు తన ట్విట్టర్ అకౌంట్లో ఓ ఫోటోను ట్విట్ చేశాడు. తన కొత్త డ్రెస్‌కు నౌకకు వేసిన పెయింట్ అంటుకుందని మరో ప్రయాణికుడు తెలిపారు. నౌకలో ఇంకా రిపేర్ పనులు చేస్తుండటంతో శబ్ధాలకు చిర్రెత్తుకొస్తోందంటూ మరొకరు. కొన్ని చోట్ల నీరు లీక్ అవ్వడంతో బయటకు వచ్చి చేరిందంటూ హర్మనీ ఆఫ్ ది సీస్ తొలి ప్రాయణికులు తమ ఛేదు అనుభవాలను తెలిపారు.. ఇంకా నౌకలోని కొన్ని చోట్ల పనులు పూర్తవకపోడంతో వాటిని మూసివేసి పనులు చేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రయాణికులు చాలా మంది ఒక చోట చేరి ఇంకా పూర్తి కాని నౌక టికెట్లు ఎలా అమ్ముకుంటారని ధ్వజమెత్తారు. మా టికెట్ల డబ్బు తిరిగి ఇచ్చే వరకు అక్కడి నుంచి వెళ్లమంటూ తమ నిరసన తెలిపారు. హర్మనీ ఆఫ్ ది సీస్ 362 మీటర్లతో ఏకంగా ఈఫిల్ టవర్ ఎత్తుకన్నా పొడవుతో ప్రపంచంలోనే విశాలమైన నౌకగా గుర్తింపుపొందింది. 16 అంతస్తులు, విశాలమైన 20 డైనింగ్ రూంలు, 23 స్విమ్మింగ్ పూల్స్, ఓ పార్కు, 10వేల మొక్కలు, 50 వృక్షాలు, వినోదాల కోసం ప్రత్యేకంగా థియేటర్లతోపాటూ 2500 రూములతో నగరమే కదులుతుందా అనే రీతిలో ఉన్న ఈ నౌక 6,360 మంది ప్రయాణికులను తీసుకు వెళ్లే సామర్థ్యం కలిగిఉంది. దీన్ని తయారుచేయడానికి దాదాపు 660 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. హాలిడే ను ఆస్వాదించాలని వచ్చిన ఓ వ్యక్తి తాను పోచ్డ్ ఎగ్స్ ఆర్డర్ చేస్తే వాళ్లు మరోటి తీసుకు వచ్చారు అంటూ ఫోటోను ట్విట్ చేశారు. -
అది ఓ కదిలే నగరమే..
ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ' హర్మనీ ఆఫ్ ది సీస్' సముద్రంలో దూసుకుపోతోంది. ఫ్రెంచ్ షిప్ యార్డులో దీన్ని తయారు చేయడానికి 32 నెలలు సమయం పట్టింది. ఫ్రాన్స్‌లోని వెస్టర్న్ పోర్టు టౌన్ లోని సెయింట్-నజైర్ నుంచి యూకేకు బయలుదేరిన హర్మనీ ఆఫ్ ది సీస్‌కు వేలాది మంది ఫ్రెంచ్ అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. దీన్ని తయారుచేయడానికి దాదాపు 660 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. హర్మనీ ఆఫ్ ది సీస్ 362 మీటర్లతో ఏకంగా ఈఫిల్ టవర్ ఎత్తుకన్నా పొడవుతో ప్రపంచంలోనే విశాలమైన నౌకగా గుర్తింపుపొందింది. 16 అంతస్తులు, విశాలమైన 20 డైనింగ్ రూంలు, 23 స్విమ్మింగ్ పూల్స్, ఓ పార్కు, 10వేల మొక్కలు, 50 వృక్షాలు, వినోదాల కోసం ప్రత్యేకంగా థియేటర్లతోపాటూ 2500 రూములతో నగరమే కదులుతుందా అనే రీతిలో ఉన్న ఈ నౌక 6,360 మంది ప్రయాణికులను తీసుకు వెళ్లే సామర్థ్యం కలిగిఉంది. మే22న అధికారిక తొలి ప్రయాణానికి బార్సిలోనాలో ఏర్పాట్లు చేస్తున్నారు. -
భారత్ అబ్బాయి.. బెల్జియం అమ్మాయి.. ఓ చిక్కు
నమక్కల్: ఇద్దరిది వేర్వేరు దేశాలు..అయితేనేం ప్రేమించుకున్నారు. కుటుంబసభ్యులను కూడా ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ మన నిబంధనలు వారి వివాహాన్ని ఆమోదించక పోవడంతో ప్రస్తుతం వారిద్దరు ఆందోళనలో ఉన్నారు. తమిళనాడులోని నమక్కల్ దగ్గర్లోని కొళ్లి హిల్స్‌కు చెందిన గిరిజన యువకుడు సురేష్ కుమార్ (28) షిప్ లో చెఫ్‌గా పని చేస్తున్నాడు. తన కన్నా వయసులో రెండేళ్లు పెద్దదైన బెల్జియం యువతి సారాని....అతడు మొదటిసారి షిప్లో చూశాడు. తొలి చూపులోనే వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. కుటుంబసభ్యులను కూడా వారి వివాహానికి ఒప్పుకునేలా చేశారు. కొళ్లి హిల్స్ లోని వినాయకుడి ఆలయంలో సోమవారం సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహమైంది. అయితే వీరిద్దరూ కలిసి ఉండేందుకు మాత్రం ప్రభుత్వ నిబంధనలు ఆటంకంగా మారాయి. సారా విదేశీయురాలు కావడంతో పెళ్లి రిజిస్ట్రేషన్‌కు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. సారా విదేశీ యువతి కావడం వల్ల ధ్రువపత్రం ఇవ్వడం కుదరదని అభ్యంతరం తెలిపారు. ' పెళ్లి రిజిస్ట్రేషన్ అయ్యి...మ్యారేజ్ సర్టిఫికెట్ వస్తేనే సారాకు లాంగ్ టర్మ్ వీసా వస్తుంది. అప్పుడే తను నాతో కలిసి ఇక్కడే జీవితాన్ని ప్రారంభించే అవకాశం లభిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఆమె వీసా గడువు ముగుస్తుంది. కాబట్టి సారా బెల్జియం తిరిగా వెళ్లాల్సి ఉంటుంది' అని సురేష్ వాపోయాడు. సారాకి భారతీయ సంస్కృతి అన్నా, ఇక్కడి విలువలన్నా చాలా ఇష్టమని అతడు తెలిపాడు.