సిడ్నీలో లంగరు వేసి ఉన్న మేజిస్టిక్ ప్రిన్సెస్ క్రూయిజ్
సిడ్నీ: న్యూజిలాండ్ నుంచి వస్తున్న విలాసవంత పర్యాటక నౌక ‘మేజిస్టిక్ ప్రిన్సెస్’లోని 3,300 మంది ప్రయాణికులు, 1,300 మంది సిబ్బందిలో శనివారం మొత్తంగా 800 మందికి కోవిడ్ సోకింది. మెల్‌బోర్న్‌కు వెళ్లాల్సిన ఈ నౌక ప్రస్తుతం సిడ్నీలోని సర్క్యులర్ క్వేలో ఆగింది. కోవిడ్ తొలినాళ్లలో ఇదే తరహాలో రూబీ ప్రిన్సెస్ భారీ విలాసవంత పర్యాటక నౌకలో 900 మందికి కోవిడ్‌సోకి 28 మంది మహమ్మారికి బలయ్యారు.
ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్న వేళ మేజిస్టిక్ నౌకలో కోవిడ్ ఉధృతిపై ఆందోళనలు పెరిగాయి. అయితే, ‘ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన వారికి కోవిడ్ లక్షణాలు లేవు. కొద్ది మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయి. పరిస్థితి అదుపులోనే ఉంది. వారిని ఐసొలేషన్‌లో ఉంచాం’ అని క్రూయిజ్ ఆపరేటర్ అయిన కార్నివాల్ ఆస్ట్రేలియా అధ్యక్షురాలు మార్గరేట్ ఫిట్జ్‌గెరాల్డ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment