Majestic
-
Majestic Princess: విలాస నౌకలో 800 మందికి కరోనా
సిడ్నీ: న్యూజిలాండ్ నుంచి వస్తున్న విలాసవంత పర్యాటక నౌక ‘మేజిస్టిక్ ప్రిన్సెస్’లోని 3,300 మంది ప్రయాణికులు, 1,300 మంది సిబ్బందిలో శనివారం మొత్తంగా 800 మందికి కోవిడ్ సోకింది. మెల్బోర్న్కు వెళ్లాల్సిన ఈ నౌక ప్రస్తుతం సిడ్నీలోని సర్క్యులర్ క్వేలో ఆగింది. కోవిడ్ తొలినాళ్లలో ఇదే తరహాలో రూబీ ప్రిన్సెస్ భారీ విలాసవంత పర్యాటక నౌకలో 900 మందికి కోవిడ్సోకి 28 మంది మహమ్మారికి బలయ్యారు. ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్న వేళ మేజిస్టిక్ నౌకలో కోవిడ్ ఉధృతిపై ఆందోళనలు పెరిగాయి. అయితే, ‘ పరీక్షలో పాజిటివ్గా తేలిన వారికి కోవిడ్ లక్షణాలు లేవు. కొద్ది మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయి. పరిస్థితి అదుపులోనే ఉంది. వారిని ఐసొలేషన్లో ఉంచాం’ అని క్రూయిజ్ ఆపరేటర్ అయిన కార్నివాల్ ఆస్ట్రేలియా అధ్యక్షురాలు మార్గరేట్ ఫిట్జ్గెరాల్డ్ చెప్పారు. -
వర్షానికి కారుతున్న మెట్రో స్టేషన్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో అతిపెద్ద మెట్రో రైల్ స్టేషన్గా ప్రసిద్ధిగాంచిన మెజిస్టిక్ స్టేషన్లో వాననీరు కారుతుండటం కలకలం రేపుతోంది. భూగర్భంలో ఉన్న ఈ మెట్రో పనులు నాసిరకంగా చేయడమే దీనికి కారణమని ఆరోపణలు వినవస్తున్నాయి. సోమ, మంగళవారం రాత్రి సమయాల్లో బెంగళూరులో ఓ మోస్తరు వర్షం కురిసింది. టికెట్ కౌంటర్ల వద్ద వాన నీరు కారుతుండటం గమనించిన అధికారులు ప్లాస్టిక్ బకెట్లను పెట్టారు. గురువారం ఉదయం దీన్ని గమనించిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. రైలు ప్రయాణించే సొరంగ మార్గంలో కూడా నీరు లీకవుతున్నట్లు అధికారులు గుర్తించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి ఇటీవలే నిర్మించిన మెట్రో స్టేషన్లో మామూలు వానలకే నీరు కారటం ఏమిటని సోషల్ మీడియాలో జనం ప్రశ్నిస్తున్నారు. నాసిరకం పనులు చేసిన కంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. -
12 నుంచి మెజిస్టిక్ నుంచి...ఏపీ బస్సుల రాకపోకలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరులోని శాంతి నగర (డబుల్ రోడ్డు) బస్సు స్టేషన్ నుంచి బయలుదేరే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఈ నెల 12 నుంచి గతంలో మాదిరే యథావిధిగా మెజిస్టిక్ నుంచి రాకపోకలు సాగిస్తాయని ఆ సంస్థ స్థానిక అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రవీంద్రనాథ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, కర్నూలు, మంత్రాలయం, నందికొట్కూరు, నంద్యాల, కోయిలకుంట్ల, మార్కాపురం (వయా అనంతపురం)ల వైపు వెళ్లే వోల్వో, సూపర్ లగ్జరీలన్నీ కెంపేగౌడ బస్సు స్టేషన్ (మెజిస్టిక్)లోని టెర్మినల్-1, ప్లాట్ఫాం నం-19 నుంచి (పాత సంగం టాకీసు ఎదురుగా) బయలుదేరుతాయని వివరించారు. నెల్లూరు, విజయవాడ, గుడివాడ, నూజివీడు, మచిలీపట్నం, ఒంగోలు, గుంటూరు, తెనాలి, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి వైపు వెళ్లే వోల్వో, సూపర్ లగ్జరీ బస్సులు కెంపేగౌడ బస్సు స్టేషన్ టెర్మినల్-1, ప్లాట్ఫాం నం-4 నుంచి బయలుదేరుతాయని ఆయన వెల్లడించారు. మెట్రో రైలు నిర్మాణ పనుల కోసం సుమారు మూడేళ్ల కిందట ఏపీఎస్ఆర్టీసీకి చెందిన వోల్వో, సూపర్ లగ్జరీ బస్సులను శాంతి నగర బస్సు స్టేషన్కు తరలించిన సంగతి తెలిసిందే.