సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరులోని శాంతి నగర (డబుల్ రోడ్డు) బస్సు స్టేషన్ నుంచి బయలుదేరే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు ఈ నెల 12 నుంచి గతంలో మాదిరే యథావిధిగా మెజిస్టిక్ నుంచి రాకపోకలు సాగిస్తాయని ఆ సంస్థ స్థానిక అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రవీంద్రనాథ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, కర్నూలు, మంత్రాలయం, నందికొట్కూరు, నంద్యాల, కోయిలకుంట్ల, మార్కాపురం (వయా అనంతపురం)ల వైపు వెళ్లే వోల్వో, సూపర్ లగ్జరీలన్నీ కెంపేగౌడ బస్సు స్టేషన్ (మెజిస్టిక్)లోని టెర్మినల్-1, ప్లాట్‌ఫాం నం-19 నుంచి (పాత సంగం టాకీసు ఎదురుగా) బయలుదేరుతాయని వివరించారు. నెల్లూరు, విజయవాడ, గుడివాడ, నూజివీడు, మచిలీపట్నం, ఒంగోలు, గుంటూరు, తెనాలి, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి వైపు వెళ్లే వోల్వో, సూపర్ లగ్జరీ బస్సులు కెంపేగౌడ బస్సు స్టేషన్ టెర్మినల్-1, ప్లాట్‌ఫాం నం-4 నుంచి బయలుదేరుతాయని ఆయన వెల్లడించారు. మెట్రో రైలు నిర్మాణ పనుల కోసం సుమారు మూడేళ్ల కిందట ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన వోల్వో, సూపర్ లగ్జరీ బస్సులను శాంతి నగర బస్సు స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
12 నుంచి మెజిస్టిక్ నుంచి...ఏపీ బస్సుల రాకపోకలు
Published Tue, Oct 7 2014 2:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM
Advertisement