
ఏపీ కొత్త డీజీపీగా సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ కొత్త పోలీస్ డెరైక్టర్ జనరల్(డీజీపీ)గా ప్రస్తుతం ఏపీఎస్సార్టీసీ ఎండీగా ఉన్న నండూరి సాంబశివరావు నియమితులు కానున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న డీజీపీ రాముడు ఈనెల 23వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు సాంబశివరావు ఇన్‌చార్జి డీజీపీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత డీజీపీ ర్యాంకు అధికారుల జాబితాను ఏపీ సర్కారు కేంద్రానికి పంపిస్తుంది. అందులో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ కమిటీ ఎంపిక చేసి ఏపీ సర్కారుకు సిఫారసు చేస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఏపీ సర్కారు డీజీపీగా నియమించుకుంటుంది.