► ప్రభుత్వ నిర్ణయంపై ఐపీఎస్ విమర్శలు
► ‘ఐపీఎస్ ఫోరం’వాట్సాప్ గ్రూపులో అదనపు డీజీపీ పోస్ట్
► ‘పరిధి’దాటారంటూ అధికారుల మధ్య చర్చ
► డైరెక్ట్, ప్రమోటీల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహారం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐపీఎస్ అధికారుల్లో అసహనం మొదలైందా? కొత్త జిల్లాలకు ఎస్పీలుగా నాన్ క్యాడర్ అదనపు ఎస్పీలను నియమించడం ఐపీఎస్‌లకు మింగుడుపడ ట్లేదా..? ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం పైనే విమర్శలు చేయడం దేనికి సంకేతం? ఇప్పుడీ చర్చ పోలీస్ శాఖలో హాట్ టాపిగ్గా మారింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు నాన్‌క్యాడర్ అద నపు ఎస్పీలను ఎస్పీలుగా నియమించడంపై ఓ అదనపు డీజీపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పోలీస్ శాఖకు వాహనాలు, భవ నాలు ఇవ్వగానే మారిపోదు. జిల్లా బాధ్యులుగా ఐపీఎస్ అధికారులుంటేనే క్రమ శిక్షణతో పోలీస్ శాఖ అభివృద్ధిలోకి వస్తుంది’ అంటూ ఐపీఎస్ ఫోరం వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాలకు ఐపీఎస్ హోదా ఉన్న ఎస్పీని నియమించాలని ప్రభుత్వం మొదట భావించింది. అనుకున్న ట్టుగానే జిల్లాల ఏర్పాటు సమయంలో జూని యర్ స్కేల్‌లో ఉన్న ఆరుగురు ఐపీఎస్‌లకు సీనియర్ స్కేల్ ఇస్తూ జిల్లా ఎస్పీలుగా బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు వివాదాస్పదం కావడంతో వారిని బదిలీ చేయడం, అదనపు ఎస్పీలకు ఇన్‌చార్జి ఎస్పీలుగా/ఓఎస్డీలుగా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఎస్పీ హోదాలో ఉన్న ఐపీఎస్ అధికారులను పెద్దగా ప్రాధాన్యం లేని ట్రాఫిక్, అడ్మిన్, సీఐడీ, వంటి విభాగాల్లో నియమించారు. ఈ విషయంలోనే అదనపు డీజీపీ తన లిమిట్ క్రాస్ చేశారా అన్న చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదించొచ్చా..?
అదనపు డీజీపీ పోస్టు చేసిన వాట్సాప్ వ్యాఖ్యలు ఒక విధంగా కరెక్ట్ అయినా, ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదించడం ఎంత వరకు సమంజసమన్నది ఇప్పుడు పోలీస్ శాఖలో భారీ చర్చకు తెరలేపింది. ఐపీఎస్ అధికారుల సంఖ్య తక్కువ ఉండటంతో డీఎస్పీ నుంచి ఐపీఎస్ కావడానికి సిద్ధంగా ఉన్న నాన్‌క్యాడర్ అధికారులకు జిల్లా ఎస్పీల బాధ్యతలు అప్పగించడం పెద్ద వివాదమేమీ కాదు. కానీ తమ క్యాడర్ పోస్టుల్లో నాన్‌క్యాడర్ అధికారులు కూర్చోవడం ఐపీ ఎస్‌లకు మింగుడుపడటం లేదన్నది నాన్ క్యాడర్ అధికారుల్లో చర్చ జరుగుతోంది.
డైరెక్ట్ వర్సెస్ స్టేట్..
అదనపు డీజీపీ వ్యాఖ్యలు డైరెక్ట్ రిక్రూటీస్ ఐపీఎస్‌లు, స్టేట్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్‌ల మధ్య అగాథాన్ని పెంచే ప్రమాదం ఉందని సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పోలీస్ శాఖలో ఏ విషయంలోనైనా మొదటి ప్రాధాన్యం డైరెక్ట్ రిక్రూటీస్ ఐపీఎస్‌లకే ప్రభుత్వం ఇస్తుంది. తర్వాతి ప్రాధాన్యం గ్రూప్–1 నుంచి పదోన్నతి పొందిన వారికి ఇస్తుంది. మరి అదనపు డీజీపీ వ్యాఖ్యలు ఎంత వరకు వెళతాయో వేచి చూడాల్సిందే.
నాన్ క్యాడర్ వారికి జిల్లా బాధ్యతలా?
Published Sat, Sep 16 2017 2:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement