Ramudu
-
తుపాకి రాముడుతో.. సరదా సంక్రాంతి
-
ఆ దివ్య దరహాసం వెనుక..
రెండు రోజులుగా దేశమంతా ఎటు చూసినా బాలరాముడే. ఎక్కడ విన్నా అతన్ని గురించిన చర్చే. సోషల్ మీడియాలోనూ అయోధ్యలో కొలువుదీరిన రామ్ లల్లా ముచ్చట్లే. అతని ఫొటోలే. అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నది బాలరాముని మందస్మిత వదనం. సమ్మోనమైన ఆ నవ్వుకు సెలబ్రిటీలు మొదలుకుని సామాన్యుల దాకా అందరూ ముగ్ధులవుతున్నారు. అమితమైన కరుణతోపాటు అంతులేని దివ్యత్వాన్ని వర్షిస్తున్న ఆ కళ్లు నిజంగా అద్భుతమంటూ కొనియాడుతున్నారు. అదే సమయంలో బాలలకు సహజమైన అమాయకత్వంతో చూస్తున్న ఆ నయనాల సొగసు వర్ణనాతీతమని ముక్త కంఠంతో చెప్తున్నారందరూ. బాలరాముని కళ్లను అంత అందంగా తీర్చిదిద్దినందుకు మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ ప్రతిభను ఎంత పొడిగినా తక్కువేనంటున్నారు. విగ్రహ రూపకల్పనకు, ముఖ్యంగా కళ్లను అంతలా తీర్చిదిద్దేందుకు ఆయన అక్షరాలా తపస్సే చేశారు. చిన్నపిల్లల ముఖ కవళికలను దగ్గరగా ఒడిసిపట్టేందుకు ఎన్నోసార్లు స్కూళ్లకు వెళ్లారు. శిల్ప శాస్త్రాన్ని ఆమూలాగ్రం పదేపదే అధ్యయనం చేశారు. అరుణ్ దీక్ష, శ్రమ, పట్టుదలకు రాముని కరుణ తోడైందని భార్య విజేత చెబుతున్నారు. విగ్రహ రూపకల్పనకు అనువైన కృష్ణ శిలను ఎంచుకోవడం వంటివాటి వెనక దాగున్న సాంకేతికత మొదలుకుని దాన్ని అత్యంత అందంగా చెక్కేదాకా ప్రతి దశలోనూ అరుణ్ ఎదుర్కొన్న సవాళ్లు తదితరాలను ఆమె మీడియాతో వివరంగా పంచుకున్నారు. శాస్త్ర ప్రమాణాల మేరకు... విగ్రహ తయారీలో అరుణ్ పూర్తిగా శిల్ప శాస్త్ర ప్రమాణాలను అనుసరించారు. ఆ మేరకే బాలరాముని ముఖారవిందపు స్వరూప స్వభావాలను ఖరారు చేశారు. ముఖ్యంగా కళ్లు, ముక్కు, చుబుకం, పెదాలు, చెంపల నిష్పత్తి తదితరాలను శాస్త్రంలో నిర్దేశించిన మేరకు నిర్ణయించారు. ‘‘అరుణ్ చేతిలో నిజంగా అద్భుతమైన కళ దాగుంది. విగ్రహం ఎలా ఉండాలో రామ జన్మభూమి ట్రస్టు ప్రతినిధులు క్లుప్తంగా చెప్పారు. నవ్వుతున్న ముఖం, దివ్యత్వం, ఐదేళ్ల స్వరూపం, రాకుమారుని రాజసం... ఇవీ అరుణ్‌తో పాటు మరో ఇద్దరు శిల్పులు జీఎల్భట్, సత్యనారాయణ పాండేకు వాళ్లు నిర్దేశించిన ప్రాతిపదికలు. అవి మినహా మిగతాదంతా అరుణ్ ఊహ, భావుకతల ఫలమే. ఇందుకోసం చిన్నపిల్లల స్కూళ్లకు వెళ్లి గంటల కొద్దీ గడిపాడు. వాళ్ల ముఖ కవళికలు, అవి పలికించే భావాలను లోతుగా పరిశీలించాడు. వాటిని పేపర్‌పై ఎప్పటికప్పుడు స్కెచ్‌లుగా గీసుకున్నాడు. అవయవాల పొందిక నిమిత్తం శరీర నిర్మాణ శాస్త్ర పుస్తకాలు తిరగేశాడు. అందుకే విగ్రహం అంత వాస్తవికంగానూ, అదే సమయంలో ఎంతో ముగ్ధమనోహరంగానూ రూపుదిద్దుకుంది’’ అని విజేత వివరించారు. ‘‘అరుణ్ నిజంగా అత్యంత అదృష్టశాలి. మా ఆయనతో రాముడే ఇంతటి మహత్కార్యం చేయించుకున్నాడు’’ అంటూ మురిసిపోయారు. గుండ్రని ముఖమండలం... ఉత్తరాది సంప్రదాయంలో రూపొందే శిల్పాల ముఖం, ముఖ లక్షణాలు కాస్త కొనదేరి ఉంటాయి. అయోధ్య బాలరాముని ముఖమండలం గుండ్రని రూపుతో కనువిందు చేస్తోంది. ఇది దక్షిణాదిలో శిల్పాల రూపకల్పనలో ఎక్కువగా కని్పస్తుందని ఢిల్లీలోని ప్రముఖ చరిత్రకారుడు, రచయిత విక్రం సంపత్ అన్నారు. ‘‘కానీ కాస్త చక్కని చుబుకం, ఉబ్బెత్తు చెంపలు, బుల్లి పెదాలు, వాటిపైనే గాక ముఖమంతటా పరుచుకున్న మార్మిక మందహాసం... ఇలాంటి దివ్య లక్షణాలన్నీ బాలరాముని ముఖంలో ప్రస్ఫుటమవుతున్న తీరు మాత్రం నిజంగా అద్భుతమేనని చెప్పారాయన. ఈ విషయంలో శిల్పిగా అరుణ్ పనితనాన్ని ఎంత పొగిడినా తక్కువేనన్నారు. 51 అంగుళాల వెనక... రామ్ లల్లా విగ్రహం ఎత్తును 51 అంగుళాలుగా నిర్ణయించడం వెనక కూడా శాస్త్రీయ కారణాలున్నట్టు విజేత చెప్పారు. ‘‘ఏటా రామనవమి రోజున సూర్య కిరణాలు సరిగ్గా బాలరాముని నుదిటిపై పడాలన్నది ట్రస్టు నిర్ణయం. ఆలయ నిర్మాణం తదితరాల దృష్ట్యా విగ్రహం సరిగ్గా 51 అంగుళాల ఎత్తుంటేనే అది సాధ్యం’’ అన్నారు. అవసరమైన మేరకు పలు విషయాల్లో పలురకాల సాఫ్ట్వేర్ల సాయమూ తీసుకున్నా అంతిమంగా కేవలం సుత్తి, ఉలి ఉపయోగించి విగ్రహాన్ని ఆసాంతం అరుణ్ తన చేతులతోనే చెక్కారని వివరించారు. కృష్ణ శిలే ఎందుకు? విగ్రహ రూపకల్పనకు కృష్ణ శిలనే ఎంచుకోవడం వెనక శాస్త్రీయ కారణాలున్నాయి. ఆమ్లాలతో ఈ శిల ప్రతి చర్య జరపదు. వేడి, తీవ్ర వాతావరణ చర్యలకు కూడా స్పందించదు. ‘‘కనుక పాలు తదితరాలతో అభిషేకం చేసినప్పుడు వాటితో చర్య జరపదు. దాంతో రెండు లాభాలు. వాటిని ప్రసాదంగా తీసుకున్నా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావమూ ఉండదు. ఈ లక్షణం వల్ల విగ్రహం కనీసం వెయ్యేళ్ల దాకా చెక్కుచెదరదు. దానిపై కనీసం గీత కూడా పడదు’’ అని విజేత వివరించారు. అత్యున్నత నాణ్యతతో కూడిన కృష్ణ శిలలు కొన్నిచోట్ల మాత్రమే దొరుకుతాయి. బాలరామున్ని రూపొందించేందుకు వాడిన కృష్ణ శిల ఆ కోవలోదేనని విజేత చెప్పారు. ఇది మైసూరు సమీపంలోని హెచ్డీ కోటె దగ్గర లభ్యమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Bharat Jodo Yatra: వారివి రాముని ఆదర్శాలు కావు: రాహుల్
అగర్ మాల్వా(మధ్యప్రదేశ్): ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు శ్రీరాముడి నైతిక జీవనాన్ని అనుకరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన అగర్‌మాల్వాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘మహాత్మాగాంధీ తరచూ ఉచ్ఛరించే ‘హే రామ్’అంటే ఒక జీవన విధానమని అర్థం. ప్రేమ, సోదరభావం, గౌరవం, తపస్సు అర్థాన్ని ప్రపంచానికి నేర్పింది’ అని ఒక సాధువు తనకు చెప్పారని రాహుల్ చెప్పారు. అదేవిధంగా, జై సియా రామ్ అర్థం సీత, రాముడు ఒక్కరేనని, శ్రీరాముడు సీత గౌరవం కోసం పోరాడారని ఆ సాధువు చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు మాత్రం శ్రీరాముని అడుగుజాడల్లో నడవడం లేదని, ఆయన ఆదర్శాలను పాటించడం లేదని విమర్శించారు. మహిళలకు గౌరవం కల్పించేందుకు బీజేపీ నేతలు పాటుపడటం లేదని అన్నారు. -
ఫోన్లో ప్రేమ.. ఆలయంలో పెళ్లి
ఉండవెల్లి(అలంపూర్): మండలంలోని బైరాపురానికి చెందిన బోయ రాముడు(21), గత కొంతకాలంగా ఫోన్లో పరిచయమైన బెంగుళూరుకు చెందిన ధనలక్ష్మి(22)తో ప్రేమలో పడ్డాడు. నిత్యం ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి దాకా వచ్చింది. ఈనెల 19న ఆ ప్రేమ జంట కర్నూల్ జిల్లాలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నట్లు ఏఎస్ఐ అయ్యన్న తెలిపారు. వివాహమైన రెండు రోజుల అనంతరం భద్రత కోసం ప్రేమ జంట పోలీస్‌లను ఆశ్రయించారు. అయితే రాముడు తాండ్రపాడులోని ఆల్కలిస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని, ధనలక్ష్మి బెంగుళూరు పట్టణం రాంనగర్ కాలనీలో ఉంటుందన్నారు. యువతి తల్లితండ్రులు దాడికి పాల్పడకుండా రక్షించాలని పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించినట్లు వారు పేర్కొన్నారు. యువకుడి తల్లి అనుసూయమ్మ ఫిర్యాదు మేకు ప్రేమ జంటకు రక్షణ కల్పిస్తామని ఏఎస్ఐ తెలిపారు. -
800 ఏళ్ల క్రితమే ‘జై శ్రీరామ్’
సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభకు ఎన్నికైన ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారానికి వెళుతున్నప్పుడు జూన్ 18వ తేదీన పాలకపక్ష బీజేపీ సభ్యులు ‘జై శ్రీరామ్’ అంటూ వారిని హేళన చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా ముస్లిం ఎంపీలు ప్రమాణ స్వీకారానికి వెళుతున్నప్పుడు వారిలా అనుచితంగా ప్రవర్తించారు. అదే రోజు అస్సాంలో ఓ ముస్లిం బృందంపై, జార్ఖండ్‌లో ఓ ముస్లిం యువకుడిపై అల్లరి మూకలు దాడులు చేసి వారి చేత ‘జై శ్రీరామ్’ అనిపించారు. ఆ దాడిలో గాయపడ్డ జార్ఖండ్ యువకుడు మరణించారు. ఆ తర్వాత రెండు రోజులకు కోల్‌కతాలో సహృఖ్ హాల్దర్ అనే 26 ఏళ్ల యువకుడిపై కూడా ఓ మూక దాడి చేసి ఆయన చేత కూడా ‘జై శ్రీరామ్’ అనిపించారు. ఇంతకు ఈ ‘జై శ్రీరామ్’ ఏ భాషా పదం, దాని అర్థం ఏమిటీ ? ఎప్పటి నుంచి అది వాడుకలోకి వచ్చింది ? రాజకీయాల్లోకి ఎప్పుడు చొరబడింది? ‘జై శ్రీరామ్’ అనేది హిందీ పదం. ‘శ్రీరాముడికి జయము కలగాలి’ అన్నది అర్థం. హిందూ దేవుళ్లలో ప్రసిద్ధి చెందిన దేవుళ్లలో రాముడు ఒకరు. గత మూడు దశాబ్దాలుగా హిందూత్వ రాజకీయాల్లో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. హిందువుల సమీకరణకు ఓ చిహ్నంగా, ఓ నినాదంగా ‘జై శ్రీరామ్’ను ఉపయోగిస్తున్నారు. సంస్కృత పండితుడు షెల్డాన్ పొలాక్ 1993లో రాసిన ‘రామాయణ అండ్ పొలిటికల్ ఇమాజినేషన్ ఇన్ ఇండియా’ అధ్యయన పత్రం ప్రకారం క్రీస్తు శకం 12వ శతాబ్దానికి ముందు రాముడు కేవలం పూజించడానికే పరిమితం అయ్యారు. 12వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా రాముడి గుళ్లు వెలిశాయి. వాటిని సందర్శించిన భక్తులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభమైంది. క్రీస్తు శకం 1001లో మొహమ్మద్ ఘజనీ దాడులు చేయడం, దాని పర్యవసానంగా ఢిల్లీలో 1206లో తొలి సుల్తాన్ రాజ్యం ఏర్పడింది. అందుకని ఆ కాలంలో రాముడి గుళ్లు పెరిగాయి. అంటే 800 ఏళ్ల క్రితమే ‘జై శ్రీరామ్’ పుట్టిందన్నమాట. 16వ శతాబ్దంలో అన్ని ప్రాంతీయ భాషల్లోకి రామాయణం పుస్తకాలు అనువాదం అవడంతో రాముడు మరింతగా ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయారు. దాదాపు అదే సమయంలో ‘రామచరిత్మానస్’ అవధి భాషలో వెలువడింది. దుష్ట శక్తులను ఎదుర్కొనగల శక్తి రాముడికి మాత్రమే ఉందనే నమ్మకం ప్రజల్లో పెరిగింది. సమాజంలోని దుర్మార్గులను రావణుడితో పోల్చడం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో మరాఠీలో వచ్చిన రెండు రామాయణం పుస్తకాల్లో ఒకదాట్లో అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబును రావణుడితో పోల్చగా, మరో పుస్తకంలో ఔరంగజేబును రావణుడి సోదరుడు కుంభకర్ణుడితో పోల్చారు. ఆధునిక రాజకీయాల్లోకి బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ తమకు ‘రామరాజ్యం’ కావాలన్నారు. కానీ రాజకీయంగా రాముడి ప్రస్తావన అంతకుముందే ప్రారంభమైంది. 1920లో అవద్‌లో బాబా రామచంద్ర నాయకత్వాన జరిగిన రైతు ఉద్యమంలో రామ పదం మరింత ప్రాచుర్యం పొందింది. సీతా–రామ్ పేరిట అభివాదం మహారాష్ట్రకు చెందిన బాబా రామచంద్ర ఫిజీలో పారిశ్రామిక కార్మికుడిగా పనిచేసి భారత్‌కు వచ్చారు. ఆయన అసలు పేరు శ్రీధర్ బల్వంత్ జోధపుర్కార్. ఆయన తులసీదాస్ రామాయణాన్ని చదవి స్ఫూర్తి పొందారు. రైతుల సమస్యలు ఆలకిస్తూ ఆయన ఆ రమాయణంలోని అంశాలను వారికి చెబుతుండేవారు. దాంతో ఆయనకు బాబా రామచంద్ర అనే పేరు వచ్చింది. ఆయన వద్దకు వచ్చే రైతులందరూ ఆయనకు సలాం చెప్పేవారు. సలాం అంటే దిగువ స్థాయి వారు, ఎగువ స్థాయి వారికి చెప్పేదని, తమందరం సమానం కనుక ఇక నుంచి కలుసుకున్నప్పుడు ‘సీతా–రామ్’ అని చెప్పుకుందామని చెప్పారు. అది అప్పట్లో పెను తుపానులా రైతులందరికి పాకింది. రైతులెవరు కలుసుకున్నా ‘సీతా–రామ్’ అంటూ అభివాదం చేసుకునేవారు. నాడు రైతుల సమీకరణకు కూడా అది ఎంతో ఉపయోగపడింది. రైతులను సమీకరించాలన్నా ‘సీతా–రామ్’ అంటూ గట్టిగా అరచేవారు. దాని నుంచి ‘జై సియా–రామ్’ నినాదం పుట్టుకొచ్చింది. అది కాస్త బీజేపీ చేపట్టిన రామజన్మ భూమి ఆందోళన సందర్భంగా ‘జై శ్రీరామ్’గా మారిందని జర్నలిస్ట్, రచయిత అక్షయ ముకుల్ తాను రాసిన ‘రైజ్ ఆఫ్ హిందూత్వ’ పుస్తకంలో పేర్కొన్నారు. 1980 దశకంలో ఈ నినాదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా ‘జై శ్రీరామ్’ నినాదాలతో మత ఘర్షణలు చెలరేగాయి. 1987లో రామానంద సాగర్ తీసిన ‘రామాయణ్’ టెలివిజన్ సీరియల్ బాగా పాపులర్ అవడమూ తెల్సిందే. -
అభిమాని చెంతకు.. వైఎస్ జగన్
-
రాముడు–భీముడు.. గంగ–మంగ
ఒకేలాంటి రూపురేఖలున్న మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. అయితే, ఒకే ఇంట్లో అచ్చుగుద్దినట్లుగా ఇద్దరూ ఒకేలా ఉంటే? అలాంటి కవలలు జంటలు జంటలుగా ఒక ఊరంతా సందడి చేస్తే..? భలే గమ్మత్తుగా ఉంటుంది కదా. ఆ గమ్మత్తు చూడాలంటే వరంగల్ రూరల్ జిల్లా పెర్కవేడు వెళ్లాల్సిందే. ఈ గ్రామంలో మొత్తం పదహారుమంది కవల జంటలు కనువిందు చేస్తుంటారు. ఊళ్లో ఎక్కడైనా కనిపించవచ్చు పెర్కవేడులో అడుగుపెట్టగానే కనిపించే ఓ మనిషి పోలిన వ్యక్తి మరికొంత దూరం వెళ్లగానే కనిపించవచ్చు. ఇలా ఎందరైనా కనిపించే వీలుంది. పెర్కవేడు గ్రామం 960 గడపలతో ఉంటుంది. ఆ గ్రామ జనాభా 3420 మంది. కారణాలేమిటో తెలియకున్నా కొన్నేళ్లుగా ఇక్కడ కవలలు జన్మించడం సాధారణ విషయంగా మారింది. గ్రామంలో ఇంతమంది కవలలు ఒకేవిధంగా ఉండటంతో ఆ గ్రామం వారు కవలలను పేరు పెట్టి పిలవడంలో చాలా తికమక అవుతుంటారు. గ్రామం తీరో, నీటితీరో మరి ఈ ఒక్క గ్రామంలో ఇంతమంది కవలల జంటలు ఉండడం అన్నది విశేషంగా మారింది. పుల్లూరు పవన్‌కుమార్, ప్రవీణ్‌కుమార్; ఆకారపు లావణ్య, రామకృష్ణ; నిఖిత్, నిఖిల; దురిశెట్టి రామ్, లక్ష్మణ్; దొడ్డ మానస వీణ, వాణి; ఊగ రాము, లక్ష్మణ్; లక్కం అనిత, సునీత; ప్రవీణ్, ప్రదీప్; ప్రమోద్, వేదప్రకాశ్, వేదవిద్య (ముగ్గురు); నిమ్మల రాము, లక్ష్మణ్; పుల్లూరు వినయ్, శివ; అంగిరేకుల నరేష్, సురేష్; ఐత రాంబాబు, ఐత రమ; గొల్లపల్లి రామయ్య, లక్ష్మయ్య; గేర ఆశీర్వాదం, రాధిక; రాజు, సువార్త కవలల్ని కనిన దంపతులు.మొత్తానికి ఇదంతా చూస్తుంటే పాత సిని మాల్లో రాముడు–భీముడు; గంగ– మంగ; చిక్కడు– దొరకడు చూసినట్టు లేదూ..? గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, వరంగల్ ఫోటోలు: బిర్రు నాగరాజు, సాక్షి, రాయపర్తి మమ్మల్ని చూస్తే అందరికీచిన్నప్పటినుంచీ తికమకే.. నేను హైద్రాబాద్‌లో ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. మా తమ్ముడు ప్రవీణ్‌కుమార్ జాబ్సెర్చ్లో ఉన్నాడు. పాఠశాల, కళాశాల స్థాయిలోనూ మమ్మల్ని చూసి తికమక పడేవారు. కాకపోతే నేను లావుగా ప్రవీణ్ సన్నగా ఉండేది. ప్రస్తుతం ఇద్దరం ఒకేలా అయ్యాము. నేను మొదటిసారిగా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నాను. తర్వాత మా తమ్ముడు ప్రవీణ్‌కుమార్ దరఖాస్తు చేసుకున్నాడు. వెరిఫికేషన్‌కు వచ్చినప్పుడు నీకు ఆల్రెడీ వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అయ్యారు ఆఫీసర్లు. కానీ సర్టిఫికెట్ లను ఇద్దరివి చూపించడంతో ఇచ్చి వెళ్లారు. మమ్మల్ని గుర్తుపట్టాలంటే నా కంటిపై గాటు ఉంటుంది ప్రవీణ్‌కు ఉండదు అంతే. పుల్లూరు పవన్‌కుమార్, ప్రవీణ్ కుమార్ మా ఊరిలో ఇంతమంది కవలలు ఉండడం సంతోషం మా ఊరిలో కవల జంటలు ఉండడంతో సంతోషంగా ఉంది. పండగ సమయాల్లో వీరు వచ్చినప్పుడు తికమకగా ఉంటుంది. వేరే ఊర్లలో ఒక్కరూ లేదా ఇద్దరు ఉంటారు. కానీ మా ఊరు కవలలకు స్పెషల్. చిన్నాల తారశ్రీ, గ్రామ సర్పంచ్ -
సైకో వీరంగం
కోసిగి: ఉపాధ్యాయుడిని చంపుతానంటూ అగసనూరులో ఓ సైకో వీరంగం సృష్టించాడు. చివరకు గ్రామస్తులంతా కలిసి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల కథనం మేరకు..గ్రామానికి చెందిన రాముడు నిత్యం మద్యం సేవించి అందరినీ బెదిరించేవాడు. చివరకు ఇంట్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములను కూడా కొడుతుండడంతో వారు గ్రామం విడిచివెళ్లారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం పాఠశాల వదిలిన సమయంలో సైకో పూటుగా మద్యం తాగి పాఠశాల ప్రహరీ బండలను వేటకొడవలితో పగులగొడుతుండగా ఉపాధ్యాయుడు శరత్ అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన రాముడు ఉపాధ్యాయుడి గొంతుపై వేటకొడవలి పెట్టి చంపేస్తానని బెదిరించాడు. ఉపాధ్యాయుడు అతడి నుంచి తప్పించుకుని వెంటనే తరగతి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఉపాధ్యాయుడు గ్రామంలోని యువకులకు ఫోన్ చేయడంతో వారంతా వచ్చి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోద చేసుకున్నట్లు ఏఎస్ఐ ఫజిల్ఖాన్ తెలిపారు. -
రాముని విగ్రహం ధ్వంసం.. నిర్మల్ బంద్
సాక్షి, నిర్మల్: శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రాముని విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాముని విగ్రహాన్ని పగలగొట్టడాన్ని నిరసిస్తూ హిందూవాహిని నాయకులు, కార్యకర్తలు నిర్మల్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ ఘటనతో నిర్మల్, ఖానాపూర్, భైంసాలో బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మిమ్మల్ని సస్పెండ్ చేయకపోతే.. సీఎండీకి ఉంటది!
‘‘సిమ్‌లు వెనక్కిస్తామని నన్నే బెదిరిస్తారా? అశాంతి నెలకొల్పుతున్నారంటూ మీ మీద సీఎండీకి లెటర్ పెట్టానంటే వెంటనే సస్పెండ్ అవుతారు జాగ్రత్త! ఒకవేళ చేయకపోతే సీఎండీకి మళ్లీ వేరే విధంగా ఉంటుంది. వీరేష్ మీద నేనే ఏసీబీ వారికి చెప్పి నిలబెట్టాను. ఇలాగైతే నేనే మళ్లీ చెప్పాల్సి వస్తుంది.. పోయి పడిపోండని. సిమ్‌కార్డు తిరిగిచ్చి చూడండి!’’అంటూ ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) కర్నూలు జిల్లా ఎస్ఈ భార్గవరాముడు కిందిస్థాయి ఉద్యోగితో ఫోన్లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ భార్గవరాముడు వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. ఏకంగా సీఎండీని ఉద్దేశించి..తాను చెప్పినట్లు చేయకపోతే ‘వేరే విధంగా ఉంటుంద’ని వ్యాఖ్యానించడం ఆయన తీరుకు అద్దం పడుతోంది. కిందిస్థాయి అధికారిపై ఏసీబీ దాడులు చేయకుండా తానే ఆపానని, మళ్లీ తాను చెబితే దాడులు చేస్తారని చెప్పడం కూడా కలకలం రేపుతోంది. ఏసీబీ తన చెప్పుచేతల్లో ఉందనే రీతిలోఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె సమయంలో ఆదోని డివిజన్‌కు చెందిన ఒక ఇంజినీరుతో ఎస్ఈ చేసిన ఫోన్ సంభాషణ ఆడియో బయటకు రావడం.. అందులోనూ ఆయన వ్యాఖ్యల తీరుపై ఆ శాఖలో తీవ్ర చర్చ సాగుతోంది. మేం పనిచేయలేం! ఎస్ఈ భార్గవరాముడు తమను సాటి ఇంజినీర్లని కూడా చూడకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటూ ఆదోని డివిజన్‌కు చెందిన డీఈతో పాటు ఏడీఈ, ఏఈలు సెలవులో వెళ్లాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై నేరుగా సీఎండీతో పాటు వివిధ ఇంజినీర్ల సంఘాలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన చేస్తున్న వ్యక్తిగత విమర్శలను సహించడం తమ వల్ల కాదని, మరీ బూతు పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తాము పనిచేయలేమంటూ సెలవుపై వెళ్లాలని భావిస్తున్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె సమయంలో డీఈ, ఏడీఈలు సెలవులో వెళ్లాలని భావిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఈ ఒక ఇంజినీరుకు ఫోన్ చేశారు. మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తానంటూ బెదిరింపులకు దిగారు. అందులో భాగంగా ఏసీబీ పేరు కూడా వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. తన మాట విని ఏసీబీ అధికారులు మీరు అవినీతి చేస్తున్నా చూడకుండా వదిలేశారనే అర్థంలో మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఈ ఆడియోటేపు ఇప్పుడు బయటకు వచ్చిన నేపథ్యంలో సదరు అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. వేధింపుల పర్వం విద్యుత్ శాఖ ఎస్ఈ వ్యవహారశైలి మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంటోంది. ఉద్యోగులతో ప్రవర్తించే తీరు సరిగా లేదని, వారితో మాట్లాడే భాష చాలా అసహ్యంగా ఉంటోందనే విమర్శలున్నాయి. ఆయన వాడిన బూతు పదాలను కూడా పేర్కొంటూ ఈ ఎస్ఈ కింద తాను పనిచేయలేనని, బదిలీ చేయాలంటూ ఆదోని డివిజన్ డీఈ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఇదే తరహాలో పలువురు ఇంజినీర్లు కూడా ఎస్ఈ వ్యవహారశైలిపై లోలోపల కుమిలిపోతున్నట్టు తెలుస్తోంది. చెప్పడానికి వీలులేని భాషలో తిడుతూ తమను కించపరుస్తున్నారని వారు వాపోతున్నారు. మొత్తమ్మీద ఎస్ఈ భార్గవరాముడు మాట్లాడిన ఆడియోటేపు ఇప్పుడు ఈ శాఖలో కలకలం రేపుతోంది. -
మూర్తీభవించిన ధర్మస్వరూపం
రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపం. అందుకే మానవుడిగా పుట్టినా, దేవుడయ్యాడు. ఆయన ఏలుబడిలో ధర్మం నాలుగుపాదాలా నడిచింది. రామరాజ్యమంటే శాంతి, సౌఖ్యాలకి ప్రతిరూపం అనేవిధంగా పాలన సాగింది. రాముని ధర్మనిరతికి ఎన్నో ఉదాహరణలున్నాయి కానీ, శత్రువుల విషయంలో కూడా ధర్మాన్ని తప్పకపోవడం రాముని గొప్పతనానికి నిలువెత్తు ఉదాహరణ. అరివీరభయంకరంగా జరిగిన రామరావణ యుద్ధం ముగిసింది. మహాబలవంతుడైన రావణుడు యుద్ధంలో రాముడి చేతిలో హతుడయ్యాడు. రాజును పోగొట్టుకున్న లంకానగరం శోభను కోల్పోయి, శోక సంద్రంలో కూరుకుపోయింది. రావణుడితో రాముడు చేసిన యుద్ధం పరమోత్కృష్టమైనదేగాక రావణ వధ అన్ని లోకాలకూ సంతోషాన్ని కలిగించింది. అయితే రావణుడి అధర్మవర్తనకు కోపించి, అతనిపై యుద్ధం చేశాడు కానీ, రామునికి అతనిపై ప్రత్యేకమైన ద్వేషం, పగ లేవు. రావణుని సంహరించిన తర్వాత రామునికి అతనిపై అపారమైన జాలి, దయ కలిగాయి. అన్నగారి మరణం విభీషణుడికి సంతోషాన్నే కాదు, బాధను కూడా కలిగించింది. మహాపండితుడు, అపార బలపరాక్రమవంతుడు అయిన అన్నగారు ఆనాడు తాను ఇచ్చిన సలహా విని, ఆ మేరకు నడుచుకుని ఉండి ఉంటే, ఇప్పుడు ఈ విధంగా రాముడి చేతిలో హతుడై ఉండి ఉండేవాడు కాదు కదా, ఇప్పుడు ఈ యుద్ధంలో రావణునికి చితిపేర్చి, ఆ చితికి నిప్పంటించడానికి ఎవరూ మిగలలేదు. రావణుని కుమారులు, సోదరులు, మనుమలు, బంధువులు, సేనానులు, సైన్యం.... ఒకరేమిటి స్త్రీలు తప్ప రావణుని బలగమంతా తుడిచిపెట్టుకుపోయింది. చివరకు మిగిలిందల్లా తనొక్కడే. విభీషణునికి అన్నగారంటే భయం, భక్తి, ద్వేషం, ప్రేమ అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ, ఆయనకు అంత్యక్రియలు జరిపించడం మాత్రం ఎందుకనో ఇష్టం లేకపోయింది. బహుశా రాముడు ఏమైనా అనుకుంటాడేమో అనే శంక వల్ల కావచ్చు, తాను చెప్పిన మాటను అన్నగారు పెడచెవిన పెట్టి, చివరికిలా శత్రువు చేతిలో కుప్పకూలిపోయాడే అనే కోపం వల్ల కావచ్చు. అలాగని ఆయన పార్థివ కాయాన్ని అలా యుద్ధభూమిలో వదిలేసి వెళ్లడానికి మనస్కరించడం లేదు. దూరంగా ఉండి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు రామచంద్రుడు. విభీషణుని వద్దకు వచ్చి, అతని భుజంపై చేయివేశాడు. విభీషణుని చేతులను తన చేతిలోకి తీసుకుని, ఆప్యాయంగా నొక్కుతూ, ‘‘ఎవరిపైన అయినా ద్వేషం, పగ పెంచుకుంటే, అది వారు మరణించేంతవరకే ఉండాలి. మరణించిన తర్వాత కూడా వారిపైన ద్వేషం చూపడం మంచిది కాదు. శాస్త్రప్రకారం మరణించిన వారు దాయాదులు అయితే, వారి అంత్యక్రియలకు వెళ్లకపోవడం, కర్మకాండలలో పాలుపంచుకోకపోవడం, వారి కర్మభోజనం చేయకపోవడం అధర్మం. అంతేకాదు, మరణించిన వారిపై బురద జల్లడం, వారిని విమర్శించడం, వారి ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా మాట్లాడటం కూడా అధర్మమే. నీ సోదరుడైన రావణుడు మరణించాడు కాబట్టి అతనిపై నీకే కాదు, నాకు కూడా ఇప్పుడు ఎటువంటి ద్వేషభావమూ ఉండకూడదు. ఆ మరణంతో అతనిపై ఉన్న పగ, ప్రతీకారం, ద్వేషభావం కూడా నశించినట్లే భావించు’’ అంటూ హితవు పలికాడు. ఆ మాటలు విన్న తర్వాత కూడా విభీషణుని మనస్సు పరిపరివిధాల పోనారంభించింది. దాంతో ఇలా ప్రయోజనం లేదనుకుని రాముడు ‘‘మీ అన్నగారి అంత్యక్రియలు నువ్వు చేస్తావా? లేక నన్ను చెయ్యమంటావా? ఎందుకంటే నా శత్రువైన రావణుడు మరణించాడు. ఇప్పుడు నాకతను శత్రువు కాదు... సోదర సమానుడు. కనుక నా చేతులతోనే అతని అంత్యక్రియలు జరిపిస్తాను’’అన్నాడు రాముడు. ఆ మాటలు విన్న తర్వాత విభీషణుడి మనస్సు స్థిమితపడి శాస్త్రోక్తంగా తన అన్నకు అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధపడ్డాడు. రాముడు అన్నివిషయాలలోనూ తోడుగా ఉండి, విభీషణుని చేత ఉత్తరక్రియలన్నీ జరిపించాడు. అంతకుమునుపు వాలి మరణానంతరం కూడా ఇదేవిధమైన సూత్రాన్ని సుగ్రీవుడికి బోధించి, అంగదుడి చేత వాలికి ఉత్తరక్రియలు జరిపించి, అనంతరం సుగ్రీవుని చేతనే అంగదునికి కిష్కిందానగరానికి యువరాజుగా పట్టాభిషిక్తుని చేయించాడు రాముడు. సీతాపహరణ సమయంలో రావణుని నిలువరించి, అతని చేతిలో ప్రాణాలు కోల్పోయిన జటాయువుకు కూడా రాముడు శాస్త్రోకంగా అంత్యక్రియలు, యధావిధిగా కర్మకాండలు జరిపించాడు రాముడు. ఇన్ని సుగుణాలున్నాయి కాబట్టే లోకులు రాముణ్ణి సుగుణాభిరాముడన్నారు. శత్రువులు కూడా ‘‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని కొనియాడారు మరి. అందుకే కదా మనం ఇప్పటికీ లోకంలో ఎవరైనా మంచివారుంటే, వారిని రాముడితో పోలుస్తారు. -
పట్టాభి రాముడు
శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం పులకించిన భక్తజనం భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామి వారికి మంగళవారం పుష్యమి నక్షత్రం సందర్భంగా వైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం నిర్వహించి, గోదావరి తీర్థ జలాలతో భద్రుని గుడిలో అభిషేకం చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారి మూర్తులను ఆలయ బేడా మండపంలోకి చేర్చి..వేద మంత్రోచ్ఛరణల మధ్య నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం ఘనంగా పట్టాభిషేకం చేశారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రామాలయ ప్రాంగణంలోని ఆంజేయ స్వామికి ఘనంగా అభిషేకం నిర్వహించారు. లక్ష తమలపాకులతో పూజలు చేశారు. భజనలు..పూజలు భద్రాచలం : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భక్తులు మంగళవారం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భజనలు చేశారు. ఉదయమే ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి..ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీతాయారమ్మ వారిని, ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. భజనలతో తరలించారు. -
నిత్యకల్యాణ రాముడు
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి బుధవారం వైభవంగా నిత్యకల్యాణం జరిపారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం గావించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ, యోత్రధారణ చేశారు. వేదపండితులు విన్నపాలిచ్చారు. గోత్రనామాలను చదివి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. – భద్రాచలం -
ఏపీ కొత్త డీజీపీగా సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ కొత్త పోలీస్ డెరైక్టర్ జనరల్(డీజీపీ)గా ప్రస్తుతం ఏపీఎస్సార్టీసీ ఎండీగా ఉన్న నండూరి సాంబశివరావు నియమితులు కానున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న డీజీపీ రాముడు ఈనెల 23వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు సాంబశివరావు ఇన్చార్జి డీజీపీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత డీజీపీ ర్యాంకు అధికారుల జాబితాను ఏపీ సర్కారు కేంద్రానికి పంపిస్తుంది. అందులో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ కమిటీ ఎంపిక చేసి ఏపీ సర్కారుకు సిఫారసు చేస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఏపీ సర్కారు డీజీపీగా నియమించుకుంటుంది. -
శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ రాముడు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు దర్శించుకున్నారు. అనంతరం పాపవినాశనం రోడ్డులో నూతనంగా ఏర్పటు చేయనున్న ఆక్టోపస్ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ. 5 కోట్ల టీటీడీ నిధులతో భవనం పనులను ఈవో సాంబశివరావుతో కలిసి ఏపీ డీజీపీ ప్రారంభించారు. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
అప్పుల బాధతో తాళలేక కర్నూలు జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోనెగండ్ల మండలం గాజులదిన్నెకు చెందిన కె.రాముడు(60) తనకున్న పదెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడవరు. వరుస కరువులతో పాటు చేతికొచ్చిన కాస్త పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో బ్యాంకులో రూ.1.30 లక్షలు, ప్రైవేట్‌గా రూ.2 లక్షల అప్పు చేశాడు. ఈ నేపథ్యంలో రుణదాతల నుంచి ఒత్తిళ్లు అధికమవ్వడంతో మనస్తాపం చెందిన రాముడు ఆదివారం రాత్రి పొలానికి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆలస్యంగా గుర్తించిన కుటుంబసభ్యులు అతన్ని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. సోమవారం ఉదయం మరణించాడు. కుటుంబసభ్యులు అతని రెండు కళ్లను ప్రభుత్వ కంటి ఆస్పత్రికి దానం చేశారు. మరో ఘటనలో గూడురుకు చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన గొల్ల రాముడు(45) కొన్నేళ్లుగా 4 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితులతో రెండేళ్ల నుంచి పంటలు సక్రమంగా పండక నష్టపోయాడు. కుమారుడు, ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేయడం.. మరోవైపు వ్యవసాయం కలిసి రాకపోవడంతో రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ నేపథ్యంలో రుణదాతల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో మనస్తాపానికి గురైన రాముడు సోమవారం పొలానికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమీపంలో ఉన్న రైతులు గమనించి అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందాడు. -
నీరు చెట్టు కార్యక్రమంలో ప్రమాదం
చాపాడు: వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం బద్రిపల్లె గ్రామంలో జరుగుతున్ననీరు చెట్టు కార్యక్రమ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో కాల్వలో పూడికతీత పనులు చేస్తుండగా ఓ జేసీబీ బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రాముడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాముడు కర్నూలు జిల్లా ఢోన్ నివాసి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
పోలీస్ జీప్ నుంచి దూకి వ్యక్తి మృతి
మద్యం తాగి ఇంటి దగ్గర గొడవ చేస్తున్నాడని కన్న తల్లిదండ్రులే కొడుకు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని పోలీస్ జీప్‌లో స్టేషన్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో జీపులో నుంచి దూకేశాడు. దీంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా బందరు కోట సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బందరు మండలం గరాలదిబ్బ గ్రామానికి చెందిన ఒడుగు రాముడు(38) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసై తరచు గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. ఆదివారం రాత్రి పూటుగ మద్యం తాగి ఇంటి దగ్గర నానా రబస చేశాడు. దీంతో విసిగిపోయిన అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని జీపులో తీసుకెళ్తుండగా.. అందులో నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించి జీపు బందరు కోట సమీపానికి రాగానే అందులో నుంచి దూకేశాడు. దీంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. -
కౌలు రైతు ఆత్మహత్య
గుత్తి: అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్మ చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం ఉబిచర్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాముడు(44) పంట కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కల్తీ మద్యంపై సిట్ ఏర్పాటు
-
కల్తీ మద్యంపై సిట్ ఏర్పాటు
విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం ఘటనపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జెవి రాముడు తెలిపారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, డీఐజీ లడ్హా నేతృత్వంలో 9 మంది కమిటీ విజయవాడ కల్తీ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. కల్తీ మద్యం ఘటనకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత కల్తీ మద్యం కేసులో స్పష్టత వస్తుందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కల్తీ మద్యం మరణాల కేసులు కూడా సిట్ దర్యాప్తులో పరిగణనలోకి తీసుకుంటుందని రాముడు చెప్పారు. ఇక ఈ కేసులో తొమ్మిది మంది బార్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
మన జాతీయాలు
రామబాణం! రాముడు మహా వీరుడు. ఆయన తన బాణం వేస్తే గురి తప్పడం అంటూ జరిగేది కాదు. అందుకే ‘రాముడు మాట తప్పడు, గురి తప్పడు’ అంటుంటారు. రామబాణానికి ఉన్న విశేషం ఏమిటంటే, వరుసగా ఏడు తాటిచెట్లను పడగొట్టే శక్తి దానికుంటుందట. అలాగే... ఆయన వేసిన బాణం, పాతాళలోకం దాకా వెళ్లి తిరిగి వచ్చి మళ్లీ ఆయన అమ్ముల పొదిలో చేరుతుందట. ఇది వాస్తవమా? కావ్య అతిశయోక్తా అనేదాన్ని పక్కన పెడితే... జనాలు ‘రామబాణం’ అనే మాటను ‘తిరుగులేని మాట’ అనేదానికి పర్యాయపదంగా వాడుతుంటారు. ‘ఆయన మాట ఇవ్వడు. ఇస్తే మాత్రం తిరుగులేదు. అది రామబాణమే’ అని అంటుంటారు. విలువిద్య కౌశలానికి సంబంధించి....‘ఎలాంటి పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని చేధిస్తాడు’ అని చెప్పడానికైనా, నైతికతకు సంబంధించి ‘ఆరు నూరైనా నూరు ఆరైనా మాట తప్పడు’ అని చెప్పడానికైనా ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఏనుగు మీద ఎలుక! ‘‘బాబోయ్... ఈ పని భారం మోయలేక పోతున్నాను’’ ‘‘చాల్లే... ఏనుగు మీద ఎలుకను పెట్టినట్లుగా ఈ పని అప్పగించాం. అసలు నీ శక్తితో పోల్చితే ఈ పని ఎంత చిన్నదని!’’ ఇలాంటి మాటలు వినే ఉంటారు కదా! ఏమాత్రం కష్టం కానీ, భారంగా కానీ అనిపించని పని విషయంలో వాడే జాతీయం ఇది. ఏనుగు మీద ఎలుక కూర్చుంటే, ఏనుగుకు భారమని అనిపిస్తుందా! లేదు కదా! అందుకే నీకా పని భారం కాదు అనడానికి ఈ పోలిక. కుక్కొచ్చింది... ఉట్టి తెగింది! యాదృచ్ఛికంగా అదృష్టం కలిసి వచ్చి, పని సులభమయ్యే సందర్భాల్లో వాడే మాట ఇది. ఒక కుక్క బాగా ఆకలితో ఒక ఇంట్లోకి దూరింది. పైన ఉట్టి తప్ప ఏమీ కనిపించలేదు. ఆ ఉట్టిలో ఏదైనా ఉందేమోనని దాన్ని అందుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. చివరికి విఫలమై తిరుగుముఖం పట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే ఇంకో కుక్క ఇంట్లోకి దూరింది. దాని అదృష్టం ఎలా ఉందంటే, అది ఇంట్లో అడుగుపెట్టే సమయానికి ఉట్టి తాడును ఓ ఎలుక కొరికింది. దాంతో ఉట్టి తెగి కిందపడింది. ‘ఆహా, ఏమి నా అదృష్టం’ అనుకుంటూ ఆ కుక్క హాయిగా పొట్ట నింపుకుంది. అలా ఈ కథ నుంచి పుట్టిందే ‘కుక్కొచ్చింది... ఉట్టి తెగింది’ అనే జాతీయం. కొందరు ఎంత కష్టపడినా ఫలితం చేతికి అందదు. కొందరికి మాత్రం అస్సలు కష్టపడకుండానే అన్నీ కలిసొస్తాయి. అప్పటికప్పుడు అదృష్టం తలుపు తట్టి లబ్ధి పొందుతుంటారు. వారి గురించి చెప్పేదే ఈ మాట. తోక పద్యం! ‘అయ్య బాబోయ్ తోక పద్యం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి జారుకుంటే మంచిది.’ ‘తోక పద్యం చదవడం కాదు... ఏదో ఒకటి తేల్చు.’ ఇలాంటి మాటలు నిత్యజీవితంలో తరచూ వినిపిస్తుంటాయి. అర్థం, పరమార్థం అనేది లేకుండా కొందరు, చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పి విసుగిస్తుంటారు. ఇక కొందరేమో... ఒక సమస్య గురించి మాట్లాడుతుంటారే గానీ ఒక పట్టాన తేల్చరు. నాన్చుతూనే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించే జాతీయమే ఈ తోకపద్యం. నిజానికి తోక పద్యం అనేది కల్పిత పదం కాదు. అది ఒక సాహిత్య ప్రకియ. ఒకరు ఒక పద్యం చెప్పడం పూర్తవ్వగానే, వేరొకరు చివరి పదంతోగానీ, చివరి అక్షరంతోగానీ ఒక పద్యం చెప్పాలి. అలా అని అప్పటికప్పుడు సొంత పద్యాలేమీ చెప్పకూడదు. గతంలో కవులు రాసిన పద్యాలను మాత్రమే చదవాలి. పద్యం పూర్తయిన తరువాత అది ఏ పుస్తకంలో ఉంది, కవి ఎవరు తదితర వివరాలు కూడా చెప్పాలి. ఇలా తోకపద్యం అనేది వినోద సాహిత్య ప్రక్రియ మాత్రమే కాదు, పద్యజ్ఞానాన్ని, జ్ఞాపకశక్తి, ధారణ తదితర విషయాలను పరీక్షించేది కూడా. అయినప్పటికీ జాతీయం విషయానికి వచ్చేసరికి మాత్రం... ఏదీ తేల్చకుండా, అభిప్రాయం తెగేసి చెప్పకుండా సాగతీసే సందర్భాల్లో ‘తోక పద్యం’ అన్న మాటను వాడడం పరిపాటిగా మారింది! -
రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన సుజనాచౌదరి
ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్‌తో శుక్రవారం కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ హరిబాబు, ఏపీ డీజీపీ రాముడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని సుజనా చౌదరి వివరించారు. వరదసాయంగా 1000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి అందిచాలని కోరారు. అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. వరద తీవ్రతను అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి త్వరగా పంపాలని విశాఖ ఎంపీ హరిబాబు హోం మంత్రిని కోరారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ ఏర్పాటుకు సహాయం అందిచాల్సిందిగా కేంద్ర హోంమంత్రిని డీజీపీ రాముడు కోరాడు. -
'ఇక మంగళగిరి నుంచే పాలన'
గుంటూరు: వచ్చే నెల నుంచి మంగళగిరి నుంచే పాలన కొనసాగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు తెలిపారు. గురువారం మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌లో టెక్నోటవర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరుకు బెటాలియన్ ఆవరణలో డీజీపీ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నామని డిసెంబర్ నుంచి మంగళగిరి నుంచే పాలన నడుస్తుందని తెలిపారు. -
'ఎర్ర' స్మగ్లింగ్‌లో పోలీసుల పాత్ర: డీజీపీ
కర్నూలు: త్వరలో కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వెంకటరాముడు తెలిపారు. శుక్రవారం ఆయన కర్నూలు నగరంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో బ్రౌన్ షుగర్‌పై పూర్తి విచారణ జరుపుతామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. నిందితులతో చేతులు కలిపిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ రాముడు ఈ సందర్భంగా తెలియజేశారు. -
పత్తి రైతు ఆత్మహత్య
వెల్దుర్తి (గుంటూరు): అప్పుల బాధతో ఓ పత్తి రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన రైతు ఎం.రాముడు (40) మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి అతడు విగతజీవిగా కనిపించాడు. రాముడు తనకున్న పొలంతోపాటు పక్క గ్రామంలోనూ ఆరెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అయితే, గత కొన్నేళ్లుగా నష్టాలు వస్తుండడంతో చేసిన అప్పు రూ.10 లక్షలకు చేరిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల బాధతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వారు విలపిస్తున్నారు. -
రాముడు మెచ్చిన గోదావరి
ఆరు రుతువులలోనూ గోదావరి శోభ సీతాసౌందర్యంతో పోల్చి చెప్పాడు వాల్మీకి. నిండు గోదావరి, శరత్కాల గోదావరి, ఇసుక మేటలు వేసిన గోదావరి ఇలా అన్ని కాలాల్లోనూ గోదావరి ఎలావుందో సీత అలా కనిపించింది శ్రీరాముడి కంటికి. మాయాగోవును తిరిగి బ్రతికించిన నది కాబట్టి గౌతమీ గంగను గోద అని కూడా పిలిచారు. శబరి కలసిన గోదానదినే గోదాశబరి అన్నారు. కాలగతిలో ‘శ’వర్ణం లుప్తమైపోగా, ‘బ-వ’లకు మధ్య అభేదం వల్ల గోదావరి అయ్యింది. అలా శ్రీరామ భక్తురాలైన శబరి పేరును కలుపుకున్న గోదావరిని స్మరించినప్పుడల్లా శ్రీరామ తారక మంత్రాన్ని జపించిన ఫలితం లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్కర శుభ సందర్భంలో గోదావరితో శ్రీరామునికి గల అనుబంధాన్ని మననం చేసుకుందాం. ‘ఏషా గోదావరీ రమ్యా ప్రసన్న సలిలా శుభా’ అంటాడు శ్రీరాముడు. పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వెళుతూ, ‘‘సీతా! ఆ గోదావరీ మాతకు నమస్కరించు’’ అని చెబుతాడు. ఆనాడు వనవాస కాలంలో గోదావరీ సైకత సీమల్లో తామిద్దరూ పంచుకున్న మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటాడు. వాల్మీకి రామాయణంలో సీత కోరిక మేరకు శ్రీరాముడు పుష్పక విమానాన్ని అత్రి మహాముని ఆశ్రమం వద్ద అనసూయా సాధ్విని చూడటానికి మాత్రమే ఆపినట్టు రాశాడు. అయితే దక్షిణ భారతదేశంలో గోదావరీ తీర ముక్తేశ్వర తీర్థంతో పాటు అనేక శివప్రతిష్ఠలు శ్రీరామ చరితంతో ముడిపడి ఉన్నాయి. చిత్రకూట పర్వతం వద్ద శ్రీరామ పాదుకలను భరతుడు తీసుకువెళ్లింది మొదలు, అత్రి ఆశ్రమంతో మొదలుపెట్టి అగస్త్య ఆశ్రమం వరకూ అనేక ముని ఆశ్రమాలను సందర్శించాడు రాఘవుడు. తాపసుల తపస్సులకు విఘాతం కలిగించే నిశాచరుల వినాశకరునిగా వినుతికెక్కాడు. పద్నాలుగేళ్ల వనవాస దీక్షలో పన్నెండేళ్ల కాలం పాటు అనునిత్యం యుద్ధాలతో దండకారణ్యమంతటా సంచరించాడు. చివరిగా అగస్త్య మహాముని ఆశ్రమాన్ని దర్శించాడు. ‘‘శ్రీరామా! నిరంతర ప్రయాణాలతో సీతమ్మ అలిసిపోయిందయ్యా. ఇప్పుడు ఆమెకు కొంత విశ్రాంతి అవసరం. ఇక్కడికి దగ్గరలో పవిత్ర గోదావరీ తీరం ఉంది. అక్కడ ఫలసమృద్ధి గల వృక్షాలు ఉంటాయి. సాధు జంతువులు నిర్భీతిగా సంచరిస్తూ ఉంటాయి. మనుష్య సంచారం ఉండదు. సీత కూడా ఆ ప్రదేశాన్ని మెచ్చుకుంటుంది. ఆ పంచవటి వద్ద ఒక పర్ణశాల నిర్మించుకుని మిగిలిన నీ వనవాస దీక్షను నిర్వహించు’’ అని బోధించి దివ్యాస్త్రాలను అనుగ్రహించి పంపిస్తాడు అగస్త్య ముని. అక్కడి నుంచి దక్షిణంగా బయలుదేరిన సీతారామ లక్ష్మణులు పంచవటి ప్రాంతానికి రాగానే శ్రీరాముడు అంటాడు కదా... ‘‘లక్ష్మణా! అదిగో రమ్యమైన గోదావరి. తీరమంతా విరగబూచిన చెట్లతో నిండివుంది. హంసలు, కారండవాలు, చక్రవాకాల వంటి జలపక్షులతో శోభస్కరంగా ఉంది. లేళ్లు మందలు మందలుగా, నిర్భయంగా తిరుగుతున్నాయి. ఈ ప్రాంతం గోదావరికి అతి దూరంలోనూ లేదు. అతి సమీపంలోనూ లేదు. కనుక ఇక్కడ మనం పర్ణశాల నిర్మించుకోవచ్చు’’ అని. లక్ష్మణుడు పర్ణశాల నిర్మించిన తరువాత శ్రీరాముడు ముందుగా గోదావరీ స్నానం చేశాడు. రామలక్ష్మణులు భక్తితో దేవతలకు, పితృదేవతలకు తర్పణలు సమర్పించారు. ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరించి సర్వదేవతలనూ స్తోత్రం చేశారు. గోదావరీ మాతకు పసుపు, కుంకుమలతో పాటు పువ్వులు సమర్పించి సీత పూజించింది. గోదావరీ తీరంలో సుమారు ఏడాది కాలం పాటు కొనసాగిన సీతారామ వనవాసాన్ని విస్తృతంగా వర్ణించాడు వాల్మీకి కవి. ఆరు రుతువులలోనూ గోదావరి శోభ సీతాసౌందర్యంతో పోల్చి చెప్పాడు. నిండు గోదావరి, శరత్కాల గోదావరి, ఇసుక మేటలు వేసిన గోదావరి... ఇలా అన్ని కాలాల్లోనూ గోదావరి ఎలావుందో సీత అలా కనిపించింది శ్రీరాముడి కంటికి. కవి సామ్రాట్ విశ్వనాథ గోదావరికి, శ్రీరామునికి గల అనుబంధాన్ని మరోమెట్టు పైకి చేర్చారు. ఏ నది అయినా సాగరునికి ఇల్లాలే అవుతుంది. సూర్యవంశంలో ఉపవంశమైన సగరవంశానికి చెందిన శ్రీరాముడు తనకు వరుసకు మరిది అవుతాడని అనుకుంటుంది గోదావరి. అటువంటి మరిదికి నేరుగా ఎదురుపడలేక హేమంత రుతువులో మంచుతెరలు అడ్డుపెట్టుకుందని వర్ణిస్తారు. గులకరాళ్లు పైకి కనిపించేలా సీలమండల లోతుగా ఉండే గోదావరిలో విహరించడం సీతారాములకు ఇష్టమైన దినచర్యగా చెబుతారు. గాలికి ఊగులాడే రెల్లుపూలతో, సాయంత్రపు సూర్యకాంతికి వైఢూర్య కాంతితో మెరిసిపోయే ఇసుక తిన్నెలలో కబుర్లు చెప్పుకోవడం తరచుగా వారికిష్టం. అలా ఆనందంగా సాగిపోతున్న సమయంలో శూర్పణఖ రాక శ్రీరామావతార పరమార్ధ ఘట్టానికి తెర తీస్తుంది. మాయాజంగమ వేషధారియై వచ్చి రావణుడు ఎత్తుకుపోతున్న వేళ సీతమ్మ తన బాధను గోదావరితో చెప్పుకుంటుంది. ‘హంసకారండవాకీర్ణం వందే గోదావరీం నదీం క్షిప్రం రామాయశం సత్వం సీతాం హరతి రావణః’ అని వేడుకుంటుంది. మారీచుడి గుట్టు బయటపడి వెనక్కి వచ్చిన శ్రీరాముడు కూడా పర్ణశాల వద్ద సీత లేకపోవడం చూసి... ‘గోదావరీయం సరితాం వరిష్ఠా ప్రియా యా మమ నిత్యకాలం అప్యత్రగచ్ఛేదితి చింతయామ్యైకినీ యాతిహిసాకదాచితం’ అంటాడు. సీత నీటికోసం గోదావరికి వెళ్లిందేమో, తామరపూల కోసం వెళ్లిందేమో! అయినా నేను లేకుండా ఒంటరిగా వెళ్లదు కదా! అనుకుంటూనే గోదావరి ఒడ్డున సీతకోసం వెతుకుతాడు. ‘‘అమ్మా! గోదావరీ నా సీత ఏది?’’ అని గోదావరిని ప్రశ్నిస్తాడు. అక్కడినుంచి సీతాన్వేషణలో గోదావరి ముఖ్య ఉపనదిగా మారిన శబరిని కలుసుకోవడం మనసు పులకించే కథా సంవిధానం. రావణ వధ అనంతరం, పట్టాభిషేకం తరువాత కూడా గోదావరితో శ్రీరాముని అనుబంధం కొనసాగింది. సీతాపరిత్యాగం తరువాత అడవులకు చేరిన సీతమ్మ, రాముడు ఒకరికి తెలియకుండా ఒకరు గోదావరీ తీర ప్రదేశాల్లో తిరిగి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. సీతావియోగ బాధ భరించలేని రాజారాముడు గోదావరీ తీరానికి తప్పకుండా వెళతాడని తమసానది ఊహిస్తుంది. తన స్నేహితురాలైన మురళానది వద్దకు వెళ్లి, ఆ సంగతి చెప్పి శ్రీరాముని కాస్త కనిపెట్టుకుని ఉండమని చెబుతుంది. అప్పుడు మురళానది గోదావరి వద్దకు వచ్చి, ‘‘గోదావరీ! నువ్వు అప్రమత్తురాలివై ఉండు. రాముణ్ని నీ అలల గాలుల చేత, ఎగిసే వలితుంపరల చేత, తమ్మిపూల కమ్మతావుల చేత, చల్లని గాలుల చేత సేదతీర్చు’’ అని చెబుతుంది. భవభూతి రచించిన ఉత్తర రామచరితంలోని ఈ నాటకీయమైన ఘట్టం స్త్రీ హృదయ ఔన్నత్యాన్ని, నదుల గొప్పతనాన్ని తెలియచెపుతుంది. లవకుశులకు రాజ్యం అప్పగించి, అవతార పరిసమాప్తి చేసిన శ్రీరాముడు వింధ్యాసుతుడైన భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసి సతత రామదాస పోషకుడై వెలుగొందుతున్నాడు. ప్రతి నిత్యం రమ్య గోదావరీ ప్రసన్న సలిలాలతో అభిషేక, అర్చనలు జరిపించుకుంటూ ముచ్చటపడుతున్నాడు. - తెన్నేటి సత్య శ్రీనివాస్ -
రాముడు నా పాలి దేవుడు..
పొట్ట ఓ చేత పట్టుకుని.. మరో చేత రాముడ్ని పట్టుకుని దుర్గయ్య పట్నం వచ్చాడు. కుటుంబాన్ని సొంతూరు మెదక్‌లోనే వదిలేసి రాముడి పై భారం వేసి ఇక్కడొచ్చిపడ్డాడు. సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు రాముడు రోజూ పెందరాలే ముస్తాబవుతాడు. దుర్గయ్య వెంట ఇంటింటికీ తిరుగుతాడు. అందరికీ దండాలు పెడతాడు. తన యజమానితో కలసి విన్యాసాలు చేస్తాడు. పంచెలతో తను సన్మానం పొంది.. దుర్గయ్యకు ఇన్ని పైసలు గిట్టుబాటు అయ్యేలా చూస్తాడు. అందుకే రాముడు నా పాలి దేవుడు అంటాడు దుర్గయ్య. తాతల నాటి నుంచి వచ్చిన వృత్తిని స్వీకరించిన దుర్గయ్య.. రాముడు తన పెద్దకొడుకని చెబుతాడు. రాముడు సంపాదనతోనే తన నలుగురు పిల్లలను చదివిస్తున్నానని చెబుతాడు. ‘రాముడు చెప్పిన మాట ఇంటడు. మా కడుపు నిండకపోయినా వీడ్ని మంచిగ జూస్కుంటం. పానం బాగోకపోయినా.. నా ఎంటొస్తడు. సంక్రాంతి అయిపోయినాంక మాకు అంత డిమాండ్ ఉండది. అయితే కొందరు వాళ్లింట్ల ఏ కార్యాలైనా పిలుస్తుంటరు. అట్ల ఏడాదంతా నడుస్తది. వారానికోపారి మెదక్ పోయి మా వోళ ్లకు పైసలిచ్చొస్తుంట. రాముడు ఉన్నంతకాలం బేఫికర్. ఆడు లేకపోతే ఎట్లనో’ అని చెమర్చిన కళ్లతో చెబుతాడు దుర్గయ్య. ..:: శిరీష చల్లపల్లి -
ఆంధ్రా డిజిపి టిడిపి ఏజెంట్లా పనిచేస్తున్నారు
-
తొలగింపులపై తిరుగుబావుటా
ఎమ్మిగనూరు రూరల్: స్మార్ట్ కార్డు లేదనే సాకుతో పింఛన్లను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తమపై రుద్దడం భావ్యం కాదని వారు వాపోతున్నారు. ప్రతి నెలా లబ్ధిదారుల్లో కోత పెట్టడం ఆందోళనకు కారణమవుతోంది. ఎమ్మిగనూరు మండలంలో ఒక్క జూన్ నెలలోనే 410 పింఛన్లను తొలగించడంతో బాధితులు రోడ్డెక్కారు. సోమవారం గుడేకల్ గ్రామానికి చెందిన 170 మంది లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు సోమప్ప సర్కిల్లో రాస్తారోకో చేపట్టారు. పింఛన్లను పునరుద్ధరించే వరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించారు. వీరికి వివిధ ప్రజా సంఘాల నేతలు రాముడు, జబ్బార్ మద్దతు పలికారు. మూడు నెలలుగా పింఛన్లు ఇవ్వకపోగా.. ఏకంగా తొలగించడం పట్ల వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పట్టణ, రూరల్ ఎస్ఐలు ఇంతియాజ్‌బాషా, నల్లప్పలు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరినా వారు ససేమిరా అన్నారు. ఎంపీడీఓ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఎంపీడీఓ పద్మజ అక్కడికి చేరుకుని పింఛన్లను పునరుద్ధరించే విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పడంతో బాధితులు శాంతించారు. -
నివృత్తం: రామాయణమంతా విని, రాముడికి సీతేమౌతుందన్నట్టు...
ఒక ఊళ్లో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు రాత్రీపగలూ కష్టపడి పని చేస్తుండేవాడు. ఓసారి ఆ ఊళ్లో రామాయణ కథాశ్రవణం ఏర్పాటు చేశారు. దానికి ఇతగాడు కూడా వెళ్లాడు. అయితే బాగా అలసిపోయి ఉండటంతో ఏమీ వినకుండా నిద్రపోయాడు. వారం రోజుల పాటు అలా వెళ్తూనే ఉన్నాడు, నిద్రపోతూనే ఉన్నాడు. చివరి రోజున శ్రవణం ముగిశాక ఓ ఆసామి... ‘‘అసలు నువ్వు ఒక్కరోజైనా రామాయణం విన్నావా, నిద్రపోతూనే ఉన్నావ్’’ అని అన్నాడు. దానికి ఇతడు... ‘‘ఎందుకు వినలేదూ... బాగా విన్నాను. చక్కగా అర్థం చేసుకున్నాను. కానీ ఒక్కటే సందేహం. రాముడికి సీతేమవుతుంది?’’ అన్నాడు. దాంతో అందరూ ఘొల్లుమన్నారు. అప్పట్నుంచీ ఈ మాట వాడుకలోకి వచ్చింది. చెప్పినదంతా విని కూడా ఎవరైనా అర్థం లేని ప్రశ్నలు అడిగినప్పుడు ఈ సామెత వాడుతుంటారు. సీమంతం ఎందుకు చేస్తారు? కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. ఆమెను అలా ఉంచేందుకుగాను భర్త రెండు నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిలో ఒకటి దోహదం. అంటే గర్భిణి అయిన భార్య కోరికలను తెలుసుకుని తీర్చడం. రెండోది సీమంతం. అంటే తల్లి కాబోతున్న భార్యను అపురూపంగా చూసుకోవడం. గర్భిణిగా ఉన్నకాలంలో ఐదు లేక ఏడో నెలలో సీమంతాన్ని జరుపుతారు. సీమంతం రోజున గర్భవతికి చేతినిండా గాజులు వేస్తారు. ఎందుకంటే... గర్భం ధరించిన స్త్రీ గర్భకోశంలోని జీవనాడుల మీద తగినంత ఒత్తిడి పడాలి. దానివల్ల సుఖప్రసవం అవుతుంది. చేతుల్లోని నరాలకి, గర్భకోశానికి సంబంధం ఉండటం వల్ల గాజులు తొడగడం ద్వారా తగినంత ఒత్తిడి కలిగించవచ్చని ఓ నమ్మకం. -
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
భద్రాచలం : సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి కళ్యాణ శోభతో కళకళలాడింది. ఆకాశమంత పందిరి ... భూదేవంత పీట ...పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా.. మంగళవాయిద్యాల నడుమ పల్లకిలో శ్రీరామ చంద్రుడ్ని కల్యాణమండపానికి తరలించారు. మండపానికి చేరుకున్న సీతమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. విష్ణు స్వరూపుడైన శ్రీరామునికి ..శ్రీమహాలక్ష్మి ప్రతిరూపమైన సీతమ్మనిచ్చి కన్యాదానం నిర్వహించారు. వేద మంత్రాల మధ్య శ్రీరాముడు సీతమ్మకు మంగళ సూత్రధారణ చేశాడు.. రాముని కళ్యాణానికి గవర్నర్ నరసింహన్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. -
రామరాజ్యం
రాముడు మంచి బాలుడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అందరినీ చిరునవ్వుతో పలుకరిస్తాడు. ‘రామం’ అంటేనే ఆనందమని అర్థం కదా! అలాగే ఉంటాడు. ఆయనలో ఈర్ష్య, అసూయ, గర్వం వంటివి మచ్చుకైనా లేవు. ఎవరైనా ఉపకారం చేస్తే సంతోషిస్తాడు. అపకారం చేస్తే, పోన్లే, వాడి పాపాన వాడే పోతాడనుకుంటాడు. చప్పున ఆయనకు కోపం రాదు. వచ్చిందా అది కాలాగ్నే. ధర్మమూర్తి. తాను ధర్మం తప్పడు. ఇతరులను తప్పనివ్వడు. అలాంటి రాముడికి దశరథుడు పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ప్రజాభిప్రాయం కూడా తెలుసుకోవాలని పెద్దసభ ఏర్పాటు చేశాడు. అందరూ వచ్చారు. దశరథ మహారాజు ఏమి చెబుతాడోనని ఎదురు చూస్తున్నారు. రాజుగారు సభ ముందుకు వచ్చి ‘నేను పెద్దవాడినయ్యాను. రాజ్యం చేయలేకుండా ఉన్నాను. మీరంతా అంగీకరిస్తే నా పెద్దకుమారుడు రాముడిని పట్టాభిషిక్తుడిని చేయాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా చెప్పండి’ అన్నారు. అలా అనడమే తడవు. అయోధ్యవాసులంతా ఆనందంతో చప్పట్లు చరిచారు. ‘రాముడే మా దేవుడు. ఎప్పుడెప్పుడాయన సింహాసనం ఎక్కుతాడా అని మేమంతా ఎదురుచూస్తున్నాం. దయగల తండ్రి. మమ్మల్ని ఆయనే పాలించాలి’ అన్నారు. ఆ మాటలకు దశరథుడు సంతోషించాడు. ‘కానీ, మీరంతా రాముడే ప్రభువు కావాలని ఎందుకు కోరుకుంటున్నారో చెప్పండి. నా పాలన మీకు నచ్చడం లేదా?’ అని అడిగాడు ‘ఎప్పుడు ఎదురుపడ్డా చిరునవ్వుతో పలకరిస్తాడు. మా యోగక్షేమాలు విచారిస్తాడు. మాకు కష్టం వస్తే ఆదుకుంటాడు. సంతోషం కలిగితే ఆనందిస్తాడు. ప్రజలను ఎలా పాలించాలో ఆయనకు బాగా తెలుసు. తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఒప్పు చేస్తే మెచ్చుకుంటాడు. ఆయన ఏలుబడిలో మాకు సుఖసంతోషాలు, రక్షణ లభిస్తాయన్న నమ్మకం మాకుంది. అతడే మాకు రాజు’ అన్నారు. దశరథుడు ఆనందపడ్డాడు. కొడుకును దగ్గరకు పిలిచి ‘రామా! అయోధ్యవాసులందరికీ నువ్వంటే ఎంత ప్రేమో చూశావుగా, నీ సుగుణాలకు మెచ్చి, నిన్ను రాజుగా కోరుకుంటున్నారు. ఇంకా వినయం నేర్చుకో, కోపతాపాలను పూర్తిగా విడిచిపెట్టు. కోశాగారాన్నీ ఆయుధాగారాన్నీ ఎప్పుడూ సమృద్ధిగా ఉంచుకో. పెద్దల్నీ పిల్లల్నీ మిత్రుల్నీ సంతోషపెడుతూ ఉండు. యజ్ఞయాగాలు చేస్తూ ఉండు. ప్రజలను చక్కగా పాలించడం కన్నా ఏదీ ముఖ్యం కాదు. గుర్తుంచుకో’ అని కొడుకును గుండెలకు హత్తుకున్నాడు. తండ్రిని సత్యసంధుడిని చేసేందుకు రాముడు రాజ్యాన్ని త్యజించాడు. అరణ్యాలకు వెళ్లాడు. అప్పుడు అయోధ్య కన్నీరుమున్నీరైంది. రాముడు అయోధ్య వదిలి వెళ్లాక ఎవరి ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. ఆకలి లేదు, అన్నం లేదు, వ్యవసాయం లేదు, వ్యాపారం లేదు, పండగ లేదు, పబ్బం లేదు. రాముడిని వెనక్కి తీసుకురాలేకపోయినందుకు భర్తల్ని భార్యలు అసహ్యించుకున్నారు. ‘ఛీ! పాడు బతుకు. మా రాముడే లేకపోయాక ఈ ఇళ్లెం దుకు, వాకిళ్లెందుకు, భోగమెందుకు, భాగ్యమెందుకు?’ అని గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. అయోధ్యలో ప్రజలంతా ఇలా ఉంటే పశువులదీ ఇదే పరిస్థితి. పాలివ్వడం మానేశాయి. అయో ధ్య అంతా దీనంగా తయారయింది. బీడు పడ్డట్టుగా ఉంది. ఇదీ పాలకులకూ ప్రజలకూ మధ్య ఉండాల్సిన ప్రేమ బంధం. -ప్రయాగ రామకృష్ణ -
రాముడితో కలిసి సీత నడిచిన దూరం 2,322 కి.మీ..?!
తండ్రి మాటతో రాచరికాన్ని వదిలిపెట్టి భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు వెంట రాగా పద్నాలుగేళ్ల వనవాసానికి బయల్దేరాడు రాముడు. ఉత్తరభారతదేశం నుంచి దక్షిణభారతదేశమంతా వీరు ప్రయాణించినట్టు వాల్మీకి రామాయణం తెలియజేస్తుంది. అయోధ్య నుంచి మొదలైన సీతారామ లక్ష్మణుల ప్రయాణం నేటి ఉత్తరప్రదేశ్, బీహార్, నేపాల్‌లోని జనక్‌పూర్, మహారాష్ట్ర, కర్నాటక, హంపి, తమిళనాడుల మీదుగా సాగింది. గోదావరి తీరాన పంచవటి లో సీతను రావణుడు అపహరించాడని, అటునుంచి రాముడు సీతను వెదుకుతూ రామేశ్వరం చేరుకున్నాడని, వానరుల సాయంతో సము ద్రం మీద వారధి నిర్మించి, లంకను చేరి రావణుడిని హతమార్చి, సీతను తీసుకొని తిరిగి అయోధ్య చేరుకున్నాడని కథనం. ఈ రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్ - తమిళనాడుల మధ్య దూరం లెక్కిస్తే రోడ్డు మార్గం 2,322 కి.మీ. రైలుమార్గంలో ప్రయాణిస్తే 30-35 గంటల్లో ఉత్తరప్రదేశ్ నుంచి తమిళనాడు చేరుకోవచ్చు. కాని నాడు కాలినడకన అరణ్యాలు, కొండకోనలు దాటుకుంటూ నదీపరీవాహక ప్రాంతాలను సమీక్షిస్తూ... వేల యోజనాలు సీతారామ లక్ష్మణులు ప్రయాణించి ఉండవచ్చని, ఇంత అని నిర్ధారణ చేయలేని ప్రయాణం వీరిదని చరిత్రకారులు చెబుతున్నారు. రామలక్ష్మణులకు విశ్వామిత్రుని యాగసంరక్షణార్థం బాల్యం లోనే అడవులకు వెళ్లి, రాక్షసులతో పోరాడిన అనుభవం ఉంది. కాని, సీత.. తండ్రి ఇంట సుకుమారిగా పెరిగిన యువరాణి. పట్టు తివాచీల రహదారులే ఆమెకు సుపరిచితం. అలాంటిది అత్తింట అడుగుపెట్టడంతోనే ఆమె భర్త వెంట వనవాసం చేయడానికి ప్రయాణమైంది. రాముడితో పాటు దుర్భేధ్యమైన అడవి మార్గాల గుండా తనూ కాలినడకన ప్రయాణించింది. అడుగడుగునా ముళ్లూ, రాళ్లూ, క్రూరమృగాలు, విష సర్పాలు, రాక్షసులు.. ఎండావానలు.. వేటినీ లెక్కచేయక వేల యోజనాలు పాదయాత్ర చేసి భర్త వనవాస దీక్ష దిగ్విజయం కావడానికి తనూ పాటుపడింది మహిమాన్విత సీత. -
రామాలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవం
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వైకుంఠ రాముడు ప్రత్యేక వేదికపై కొలువుదీరగా భారీగా తరలివచ్చిన భక్తులు గోదావరి మాతకు హారతులతో నీరాజనం పలికారు. ఆదివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల హారతులతో గోదావరి మాత పులకించింది. జైశ్రీరామ్ , జైజై శ్రీరామ్ నామస్మరణలతో గౌతమీ తీరం మార్మోగింది. రాముడి పాదాల చెంత జీవనదిగా విరాజిల్లుతున్న గోదావరి వద్దకు సీతారామచంద్రస్వామి వేంచేయగా, ఆలయ అర్చకులు సమర్పించిన నదీహారతి కనువిందు చేసింది. గౌతమీ తీరాన రామయ్యకు ప్రత్యేక పూజలు.. కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి మాతకు నదీహారతి కార్యక్రమం నిర్వహించడం ఇది రెండోసారి. గత ఏడాది కూడా ఈ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. తొలుత ఆదివారం మధ్యాహ్నం మేళతాళాలు, భక్తుల కోలాటాలు, బాణసంచాల నడుమ స్వామివారిని గోదావరి ఒడ్డున ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కొలువుదీర్చారు. ఈ సందర్భంగా వేదపండితులు, ఆలయ అర్చకులు స్వామివారికి విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, అష్టోత్తర శతనామార్చన, మంగళవాయిద్యం, చతుర్వేద పారాయణం గావించారు. ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు స్వామివారికి ద్వయ, కుంభ, అష్ట, నక్షత్ర, ద్వాదశ, అష్టోత్తర శత హారతులు సమర్పించారు. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు ... నదీహారతి సందర్భంగా ఆలయ ఈవో రఘునాథ్ గోదావరి మాతకు పసుపు, కుంకుమ, పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిముఖంగా నది మధ్యలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పడవపై ఆలయ అర్చకులు గోదావరి మాతకు ద్వయ, కుంభ, అష్ట, నక్షత్ర, ద్వాదశ, అష్టోత్తర శత హారతులు సమర్పించారు. దేవస్థానం వారు అందచేసిన దీపాలతో భక్తులు నదీహారతులు సమర్పించారు. వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా స్వామివారి ప్రసాదం లడ్డూ, పులిహోర అందజేశారు. కార్యక్రమంలో ఏఈవో శ్రవణ్‌కుమార్, ఆలయ స్థానాచార్యులు స్థలశాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, సన్యాసిశర్మ, సీఐలు కె. శ్రీనివాసరెడ్డి, భోజరాజు, ఎస్సై ఎం.అబ్బయ్య, మాజీ ట్రస్ట్‌బోర్డు సభ్యులు బూసిరెడ్డి అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లలో అధికారులు విఫలం. తగ్గిన భక్తుల సంఖ్య.. రాష్టస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గోదావరి నదీహారతికి భక్తుల స్పందన కరువైంది. పదివేల మంది భక్తులను రప్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆలయ ఈవో, అధికారులు ఆది నుంచీ ప్రకటించినా, కార్యాచరణలో విఫలమయ్యారు. జిల్లా, డివిజన్ వ్యాప్తంగా ప్రచారం కరువవడంతో, గోదావరి స్నానానికి వచ్చిన భక్తులే పాల్గొన్నారు. నిర్వహణ ఏర్పాట్లు కూడా చాలా ఆలస్యంగా మొదలయ్యాయి. నదీహారతి వేదిక వద్దకు స్వామి వారిని తీసుకొచ్చిన సమయానికి కూడా వేదికను పూలతో అలంకరించకపోవటం గమనార్హం. గతేడాది రంగురంగుల, వైవిధ్యమైన బాణసంచా కాల్చగా, ఈ ఏడాది మొక్కుబడిగా తీసుకొచ్చారు. చాలా టపాసులు పేలనేలేదు. స్థానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం తో ఆలయ అధికారులు మమా అనిపించారు. రామాలయంలో కృత్తికా దీపోత్సవం... కార్తీక పౌర్ణమి సందర్భంగా రామాలయంలో ఆదివారం కృత్తికాదీపోత్సవాన్ని నిర్వహించారు. నదీహారతి అనంతరం ఆలయంలోని యాగశాలలో పూర్ణాహుతి, చొక్కాసుర దహన కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్వామివారికి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ గావించారు.