ఫోన్లో ప్రేమ.. ఆలయంలో పెళ్లి | Love Marriage Couple Request to Police From Family Threats | Sakshi
Sakshi News home page

ఫోన్లో ప్రేమ.. ఆలయంలో పెళ్లి

Jun 22 2020 12:14 PM | Updated on Jun 22 2020 12:14 PM

Love Marriage Couple Request to Police From Family Threats - Sakshi

పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

ఉండవెల్లి(అలంపూర్‌): మండలంలోని బైరాపురానికి చెందిన బోయ రాముడు(21), గత కొంతకాలంగా ఫోన్లో పరిచయమైన బెంగుళూరుకు చెందిన ధనలక్ష్మి(22)తో ప్రేమలో పడ్డాడు. నిత్యం ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి దాకా వచ్చింది. ఈనెల 19న ఆ ప్రేమ జంట కర్నూల్‌ జిల్లాలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నట్లు ఏఎస్‌ఐ అయ్యన్న తెలిపారు. వివాహమైన రెండు రోజుల అనంతరం భద్రత కోసం ప్రేమ జంట  పోలీస్‌లను ఆశ్రయించారు. అయితే రాముడు తాండ్రపాడులోని ఆల్కలిస్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని, ధనలక్ష్మి బెంగుళూరు పట్టణం రాంనగర్‌ కాలనీలో ఉంటుందన్నారు. యువతి తల్లితండ్రులు దాడికి పాల్పడకుండా రక్షించాలని పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించినట్లు వారు పేర్కొన్నారు. యువకుడి తల్లి అనుసూయమ్మ ఫిర్యాదు మేకు ప్రేమ జంటకు రక్షణ కల్పిస్తామని ఏఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement