
సాక్షి, మహబూబ్‌నగర్: ఎంతో ప్రేమగా చూసుకున్న కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె బతికుండగానే పిండం పెట్టాడు. గుండు గీయించుకుని దినకర్మలు కూడా నిర్వహించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లాలోని చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అదే గ్రామానికి చెందని వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
ఇద్దరూ సమీప బంధువులే కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ జంట.. తాము ప్రేమించుకున్నామని, పెళ్లి చేయాలని పెద్దలను కోరారు. అందుకు వారు ఒప్పుకోకపోవడంతో ఈ నెల 13న పెద్దలను ఎదురించి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే తమను కాదని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందని భార్గవి తండ్రి ఆమెపై కోపం పెంచుకున్నాడు. కూతురితో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు.
చదవండి: మైనర్‌పై 56 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం.. 7 నెలల గర్భిణి
అంతటితో ఆగకుండా తన కూతురు చనిపోయిందంటూ గుండు గీయించుకుని ఆమెకు కర్మకాండలు జరిపించాడు. కూతురి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాడు. కూతురి ప్రేమ వివాహాన్ని భరించలేక తండ్రి చేసిన పని గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలాఉండగా.. కూతురి ఇష్టం మేరకు పెళ్లి చేస్తానని సదరు తండ్రి చెప్పినా.. ఆ యువతీ, యువకుడు వినలేదని స్థానికంగా ప్రచారం సాగుతోంది. తండ్రి మాటపై నమ్మకం లేకనే ఆ యువతి గుడిలో ప్రేమ పెళ్లి చేసుకుందని కొందరు చెప్తున్నారు. అందుకనే తన మాటకు విలువ ఇవ్వని బిడ్డపై అతను పిండ ప్రదానం చేసి ఆక్రోషం వెళ్లగక్కాడని అంటున్నారు.
చదవండి: Hyderabad City Bus: ‘ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడం లేదు. ఇబ్బందిగా ఉంది’
Comments
Please login to add a commentAdd a comment