last rituals
-
నోయెల్ టాటాకు మోదీ ఫోన్.. అంత్యక్రియలకు అమిత్‌షా
రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పి.. విలువలు, దాతృత్వానికి పెట్టింది పేరు. విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలవడంతోపాటు మంచి స్వభావం గల వ్యక్తిగా కూడా పేరు సంపాదించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇక మన మధ్యలేరనే నిజాన్ని అంగీకరించడం ఎవరి వల్ల అవ్వడం లేదు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు భారత్ నుంచే కాకుండా ప్రపంచ దేశాల ప్రముఖుల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి. రతన్ టాటా మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటాతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. ముంబైలో జరగబోయే ఆయన అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని నోయెల్‌కు మోదీ తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం రెండు రోజుల లావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో రతన్ టాటా అంత్యక్రియలను అమిత్ షా పర్యవేక్షిస్తారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. కాగా రతన్ టాటా మృతికి గౌరవ సూచికంగా మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సగానికి ఎగురవేస్తామని సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. నేడు జరగాల్సిన అన్ని వినోదాత్మక కార్యక్రమాలను రద్దు చేశారు.#WATCH | Mumbai | Mortal remains of veteran industrialist Ratan N Tata being taken to NCPA lawns for the public to pay their last respectsHe will be accorded state funeral this evening. pic.twitter.com/6JUgirUqkG— ANI (@ANI) October 10, 2024మరోవైపు టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పార్దివదేహాన్ని కోల్బాలోని నివాసానికి తరలించారు. అనంతరం ఉదయం ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ) గ్రౌండ్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 4 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. అధికారిక లాంఛనాలతో సాయంత్రం వర్లీ ప్రాంతంలో రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. వ్యాపార దిగ్గజానికి కడసారి వీడ్కోలు పలికేందుకు సామాన్య ప్రజలు, ప్రముఖులు బారులు తీరనున్నారు.అంతకముందు రతన్ టాటా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త అని, ఎంతో దయగల అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. భారత్‌లోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు రతన్ టాటా స్థిరమైన నాయకత్వం అందించారని, మెరుగైన సమాజం కోసం ఆయన తనవంతు కృషి చేశారని పేర్కొన్నారు.ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆయన ధోరణి ఆచరణాత్మకమని, దయార్ద్ర హృదయంతో మెరుగైన సమాజం కోసం అనుక్షణం తపించే వారిని ప్రధాని కొనియాడారు. -
తండ్రికి అంత్యక్రియలు చేసిన కుమార్తెలు
మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. సంప్రదాయం పేరిట కొనసాగుతున్న తరతరాల ఆచారాన్ని కాదంటూ తొమ్మిదిమంది కుమార్తెలు తమ తండ్రి చితికి నిప్పంటించారు. ఈ ఘటన స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే బుందేల్‌ఖండ్ పరిధిలోని సాగర్‌లో రిటైర్డ్ పోలీసు హరిశ్చంద్ర అహిర్వార్ ఉంటున్నారు. అతనికి తొమ్మిది మంది కుమార్తెలు. కొడుకులు లేరు. వీరిలో ఏడుగురికి వివాహాలయ్యాయి. మరో ఇద్దరు కుమార్తెలకు వివాహం జరగాల్సివుంది. అయితే హరిశ్చంద్ర అహిర్వార్ అకస్మాత్తుగా బ్రెయిన్ హెమరేజ్‌కు గురై ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఈ నేపధ్యంలో అతని కుమార్తెలు తమ తండ్రికి తామే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారందరూ అంతిమయాత్రలో పాల్గొని, ముక్తిధామ్‌లో తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థానికులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. హరిశ్చంద్ర అహిర్వార్ బంధువు ఛోటాలాల్ అహిర్వార్ మాట్లాడుతూ కుమార్తెలు తమ తండ్రికి హిందూ ఆచార సంప్రదాయాలను అనుసరిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. హరిశ్చంద్ర అహిర్వార్ తన ఏడుగురు కుమార్తెలకు వివాహాలు చేశారని, ఇంకా రోష్ని, గుడియాలకు వివాహాలు చేయాల్సివుందని అన్నారు. -
ముగిసిన గద్దర్ అంత్యక్రియలు
►గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి.. రాత్రి 8గంటల ప్రాంతంలో అధికారిక లాంఛనాలతో బౌద్ధ మత ఆచారంలో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించారు. ► గద్దర్ అంత్యక్రియల్లో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గద్దర్‌కు అత్యంత ఆప్తుడిగా పేరున్న జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. ► బౌద్ధ ఆచారాల ప్రకారం గద్దర్ అంత్యక్రియలు.. ► గద్దర్ అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం.. అభిమానులను అదుపుచేయలేక పోతున్న పోలీసులు.. ► గద్దర్ ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఘనంగా నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ► అల్వాల్‌కి చేరుకున్న అంతిమ యాత్ర ► పార్టీలకు అతీతంగా అంతిమ యాత్రలో పాల్గొన్న నేతలు ► సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్‌కు గద్దర్ అంతిమయాత్ర చేరుకుంది. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. ►మధ్యాహ్నం 2.30 నిమిషాల తరువాత సీఎం కేసీఆర్ గద్దర్ ఇంటికి చేరుకోనున్నారు. ►కాసేపట్లో మహా భోది విద్యాలయ లో గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. పోలీసులు పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నారు. రిహార్సల్ నేపథ్యంలో సెట్ రైట్ అయిన పోలీసులు. ప్రభుత్వ లాంచనాలతో మధ్యాహ్నం గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ►అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న గద్ధర్ అంతిమ యాత్ర ► గద్దర్ అంతిమ యాత్రలో కళాకారులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అంతిమ యాత్ర సందర్భంగా పోలీసులు అల్వాల్ భూదేవినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ► గద్దర్ అంతిమ యాత్ర వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. ►ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. గన్‌పార్క్, అసెంబ్లీ, నెక్లెస్‌రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం, ట్యాంక్‌బండ్, జేబీఎస్, తిరుమల మీదుగా అల్వాల్ చేరనుంది. గద్దర్ ఇంటివద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంతో తెలంగాణ పాట మూగబోయింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. గద్దర్ పార్థివ దేహాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులు ఘటించారు. ► అల్వాల్ భూదేవి నగర్‌లోని మహాభోది విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాభోధి విద్యాలయంలోని గ్రౌండ్ వెనకాల సమాధి కోసం చేస్తున్న ఏర్పాట్లను గద్దర్ కూతురు వెన్నెల దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏర్పాట్లను డీసీపీ సందీప్‌రావు పరిశీలిస్తున్నారు. ►గద్దర్ పార్థివదేహానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే, జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజనీ కుమార్ యాదవ్, అజారుద్దీన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, బూర న్సయ్య గౌడ్, గరికపాటి నర్సింహరావు నివాళులు అర్పించారు, ►గద్దర్ అంతిమ యాత్ర వాహానాన్ని జీహెచ్ఎంసీ అధికారులు. సిద్ధం చేశారు. వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను ఏర్పాటు చేశారు. గద్దర్ పార్దివదేహానికి వీచ్ హనుమంతరావు నివాళులు అర్పించారు ►రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఖమ్మం సభలో దివించారు: వీహెచ్ ►గద్దర్ మరణం పట్ల రాహుల్ తన ఆవేదన తెలియజేశారు. ►గద్దర్ చనిపోయినా గద్దర్ కోరుకున్నట్లు గా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. గద్దర్ చనిపోవడం బాధాకరం: మాజీమంత్రి జానారెడ్డి ► గద్దర్‌కు ఉన్న స్ఫూర్తి యువత నేర్చుకోవాలి. ►నేను హోం శాఖామంత్రిగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన్నప్పుడు గద్దర్ సూచనలు సేకరించాం. ►తన సూచనాలతోనే అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను హైదరాబాద్‌కు రప్పించాం. ►మావోయిస్టులతో ప్రభుత్వం చర్చల్లో గద్దర్ మధ్యవర్తిత్వం వహించారు. ►అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు నన్ను ఆనాడు కలిశాడు ►గద్దర్ పార్థివ దేహానికి సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీరమణ నివాళులు అర్పించారు. గద్దర్ తన రూమ్ మెట్ అని, రిటైర్మెంట్ తర్వాత తనను రాజకీయాల్లో రావాలని గద్దర్ కోరారని చెప్పారు. ► ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులు అర్పించారు. ►గద్దర్ పార్ధివదేహానికి తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. ►ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివ దేహానికి టీపీసీ రేవంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు నివాళులు అర్పించారు. ►నటుడు మోహన్ బాబు, బండ్ల గణేష్, మంచు మనోజ్, సింగర్ మధు ప్రియ గద్దర్‌కు నివాళులు అర్పించారు. ►అల్వాల్‌లోని గద్దర్ నివాసం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. ►తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. 74 ఏళ్ల వయసులో కూడా గోష్టిగొంగడితో సమాజాన్ని మేల్కొలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా: స్పీకర్ పోచారం ►గద్దర్ అంటే మెదక్.. మెదక్ అంటే ఉద్యమాలు: ఎమ్మెల్యే రఘునందన్ రావు ►వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ కోరుకున్నారు. ►4 దశాబ్దాల ఆశయ సాధక కోసం పోరాటం చేసి.. దానికి దూరం అయ్యారు. ►గద్దర్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా. గద్దర్ మృతి బాధాకరం: కిషన్ రెడ్డి గద్దర్ పార్ధివ దేహానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. గద్దర్ మృతి బాధాకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యలపై తిరుగులేని పోరాటం చేసిన ఉద్యమకారుడని కొనియాడారు. తన గొంతు ద్వారా తెలుగు సమాజానికే కాకుండా యావత్ భారతదేశానికి రోల్‌మాడల్‌గా నిలిచారని ప్రశంసించారు. గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించిన విషయమని అన్నారు. ‘నాకు గద్దర్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధం ఉంది. నేను లేకున్నా మా ఇంటికి వచ్చి భోజనం చేసే వాళ్ళు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఉండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి. * ఆయన కలగన్న రాజ్యం రాకముందే స్వర్గస్తులయ్యారు. చివరి కోరిక తిరకముందే కాలం చెల్లించారు. గద్దర్ మనల్ని విడిచి వెళ్లిపోవడం దూరంగా మరి వెళ్లిపోవడం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజాని, కవులు, కళాకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు ఎంతో బాధాకరం. గద్దర్ ఆకస్మిక మృతికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం’ అని తెలిపారు సాక్షి, హైదరాబాద్: గద్దర్ అంతిమయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్ స్టేడియం నుంచి ప్రారంభం కానుంది. కళాకారులతో భారీ ర్యాలీగా గద్దర్ పార్థివదేహాన్ని తీసుకెళ్లనున్నారు. కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీ నేతలు ఈ అంతిమయాత్రలో పాల్గొననున్నారు. స్టేడియం నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా, జగ్జీవన్‌రామ్ విగ్రహం మీదుగా.. గన్‌పార్క్ వైపు సాగనుంది. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు గద్దర్ పార్ధివ దేహం చేరుకోగా.. కాసేపు అక్కడ పాటలతో కళాకారులు నివాళులు అర్పించనున్నారు. అనంతరం అమరవీరుల స్థూపం నుంచి సికింద్రాబాద్ మీదుగా భూదేవినగర్‌లోని తన నివాసానికి చేరుకోనుంది. అల్వాల్్ మహాబోధి గ్రౌండ్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. -
మహాప్రస్థానంలో సంగీత దర్శకుడు రాజ్ అంత్యక్రియలు
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(68) ఇక లేరు. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంపై చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా సోమవారం ఉదయం రాజ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి మహాప్రస్థానం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. మహా ప్రస్థానంలో కోటి ,శివాజిరాజా , కాశీ విశ్వనాథ్ , జయంత్ , నల్లమల్లపు బుజ్జి తదితరులు రాజ్ మృతదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితమే మహాప్రస్థానంలో రాజ్ అంత్యక్రియలు ముగిశాయి. రాజ్ పెద్దల్లుడు కృష్ణంరాజు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాజ్ సినీప్రస్థానం మొదలైందిలా.. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు, సావిత్రి దంపతుల రెండో సంతానమే రాజ్. 1954 జూలై 7న జన్మించారు. చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలో, ముఖ్యంగా సంగీత నేపథ్యంలో పెరగడంతో రాజ్‌కు సంగీతంపై ఓ అవగాహన ఉండేది. చిన్నప్పటి నుంచే తండ్రి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఓవైపు ఇంటర్ చదువుతూ మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి హనుమంతరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు. అ సమయంలో తన తండ్రి మరణించడంతో కొద్దిరోజులు ఏం చేయకుండా ఉండిపోయిన రాజ్ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ఓ ఏడాది అవగానే సాలూరి రాజేశ్వరరావు వద్ద అసిస్టెంట్‌గా చేరి ఆరేళ్లు పని చేశారు. సాలూరి రాజేశ్వరరావు కుమారుల్లో ఒకరైన కోటితో రాజ్‌కు మంచి స్నేహం ఏర్పడింది. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు సంగీతం అందించి రాజ్-కోటి ద్వయంగా పేరు తెచ్చుకున్నారు.. సోలో మ్యూజిక్ డైరెక్టర్‌గానూ రాజ్ పలు చిత్రాలకు పని చేశారు. చదవండి: మమ్మల్ని కాలమే కలిపింది, కాలమే విడదీసింది: కోటి -
జోహార్ నటశేఖరా! హీరో కృష్ణకు కన్నీటి వీడ్కోలు
హఫీజ్‌పేట్ (హైదరాబాద్): లక్షలాది మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం రాయదుర్గంలోని వైకుంఠ మహా ప్రస్థానం మోక్షఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అభిమానులు, ఆత్మీయుల అశ్రునయనాల మధ్య తెలుగు తెరపై ‘ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్’ భువి నుంచి దివికేగారు. అంతకుముందు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. సీనియర్ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయ క్రతువును నిర్వహించారు. కృష్ణ చితికి ఆయన కుమారుడు మహేశ్‌బాబు నిప్పంటించారు. కుటుంబసభ్యులు, సినీ, రాజకీయరంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిమంది ప్రజలు అశ్రునయనాలతో తమ అభిమాన నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కృష్ణ పార్థివదేహాన్ని ఉంచి పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖులు బారులు తీరిన కార్లలో ఊరేగింపును అనుసరించారు. పెద్దసంఖ్యలో ప్రజలు జేజేలు పలుకుతూ మహాప్రస్థానానికి చేరుకున్నారు. పరిమిత సంఖ్యలో లోపలికి అనుమతి వైకుంఠ మహాప్రస్థానంలోకి వెళ్లేందుకు పోలీసులు తొలుత పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. మహేష్‌బాబు, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, కుమార్తెలు మంజుల, ప్రియదర్శిని, పద్యావతితో పాటు నటుడు నరేష్, సుధీర్‌బాబు, సంజయ్, గల్లా జయదేవ్ తదితర సమీప బంధువులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణలతో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నందిగామ ఎమ్మెల్సీ అరుణ్, కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు, సినీ ప్రముఖులు మురళీమోహన్, దిల్‌రాజు, శివపార్వతి తదితరులు కూడా లోనికి వెళ్లారు. అభిమానులు, సామాన్య ప్రజలను మాత్రం క్రతువు ముగిసే వరకు అనుమతించలేదు. దీంతో మహాప్రస్థానం పరిసరాలన్నీ జనçసంద్రంగా మారి పోయాయి. నినాదాలతో మారుమ్రోగిన పరిసరాలు భారీగా గుమిగూడిన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘కృష్ణ అమర్ రహే, సూపర్‌స్టార్ కృష్ణ అమర్ రహే, జోహర్ కృష్ణ, జై కృష్ణ..జైజై కృష్ణ ’ అంటూ హోరెత్తించారు. ఒక దశలో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కుటుంబసభ్యులు, ప్రముఖులు వెళ్లిపోయిన తర్వాత అభిమానులను అనుమతించారు. ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి తలసాని కృష్ణ అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఆయన ముందుగానే మహాప్రస్థానానికి చేరుకుని పోలీసులు, అధికారులకు పలు సూచనలు చేశారు. గవర్నర్ సహా ప్రముఖుల నివాళులు కృష్ణ పార్థివ దేహానికి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధర, కుమార్తె బ్రాహ్మణి నివాళులర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిర్మాత అల్లు అరవింద్, నటుడు కోట శ్రీనివాసరావు, సినీ నటి జయప్రద, ఏపీ మంత్రి రోజా, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు కృష్ణ భౌతికకాయయాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంతిమయాత్ర మొదలైంది. సాయంత్రం 4 గంటల సమయంలో అంత్యక్రియలు ముగిసాయి. ఇదీ చదవండి: సీఎంకు కాల్చేసి నా కుమార్తె పెళ్లికి రావొద్దన్న కృష్ణ.. అసలు విషయం ఏంటంటే.. -
అశ్రునయనాల మధ్య ముగిసిన కృష్ణ అంత్యక్రియలు
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలో కృష్ణకు ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. గౌరవ వందనం అనంతరం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక ఆయన అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. చివరి సారిగా తమ అభిమాన నటుడిని చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. బుధవారం పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి కృష్ణ అంతిమయాత్ర జరిగింది. కాగా ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్ ఆస్ప్రతిలో చేరిన కృష్ణ చికిత్స పొందుతూ మంగళవారం(నవంబర్ 15న) తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణాన్ని ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాడె మోసి మాట నిలబెట్టుకున్న నటుడు.. ఎమోషనల్‌గా పోస్ట్..
Randeep Hooda Performs Last Rites Of Sarabjit Singh Sister Dalbir Kaur: బాలీవుడ్ ప్రముఖ నటుల్లో రణ్‌దీప్ హుడా ఒకరు. తాజాగా పంజాబ్‌కు చెందిన సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ పాడెను మోసి, అంత్యక్రియలు నిర్వహించాడు. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణల కింద సరబ్జిత్ సింగ్‌కు పాకిస్తాన్ సుప్రీం కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అతని బయోపిక్‌గా 2016లో తెరకెక్కిన 'సరబ్జిత్' సినిమాలో సరబ్జిత్ సింగ్ పాత్రలో రణ్‌దీప్ హుడా నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్‌కు రణ్‌దీప్ హుడాకు మంచి అనుబంధం ఏర్పడింది. రణ్‌దీప్ హుడాలో తన సోదరుడు సరబ్జిత్ సింగ్‌ను చూసుకుంటున్నట్లుగా ఆమె అతనితో చెప్పింది. ఈ క్రమంలోనే రణ్‌దీప్ హుడాను దల్బీర్ కౌర్ ఒక కోరిక కోరింది. తాను చనిపోయినప్పుడు ఆమెకు 'కంధ' (అంత్యక్రియలకు తీసుకువెళ్లేటప్పుడు భుజంపై పాడెను మోయడం) ఇవ్వాల్సిందిగా అడిగింది. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లుగా ఒక సోదరుడిలా దల్బీర్ కౌర్ దహన సంస్కరాలు నిర్వహించాడు రణ్‌దీప్. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) ఈ విషయంపై తన ఇన్‌స్టాలో ఆమె చివరిసారిగా చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ 'నన్ను త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. కానీ నేను వెళ్లేసరికి ఆమె వెళ్లిపోయింది. దల్బీర్ కౌర్‌జీ ఇంత త్వరగా మమ్మల్ని విడిచి పెడతారని అనుకోలేదు. ఆమె తన ప్రియమైన సోదరుడు సరబ్జిత్ సింగ్‌ను కాపాడుకునేందుకు ఎంతో పోరాటం చేసింది. ఆమె ప్రేమ, ఆశీర్వాదం నాపై ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని. ఆమె కట్టిన రాఖీని నా జీవితంలో మర్చిపోలేను.' అని ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు. కాగా దల్బీర్ కౌర్ పంజాబ్‌లోని అమృత్సర్ సమీపంలో ఉన్న భిఖివింద్‌లో ఆదివారం (జూన్ 26) గుండెపోటుతో మరణించింది. -
ముంబైలో బప్పి లహరి అంత్యక్రియలు, హాజరైన సినీ ప్రముఖులు
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పి లహిరి అంత్యక్రియలు ముంబైలో ప్రారంభమయ్యాయి. చివరి సారి ఆయనకు నివాళులు అర్పించేందుకు సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు అంత్యక్రియలకు తరలి వచ్చారు. ముంబైలో ఓ శ్మశాన వాటికలో బప్పి లహిరి అంత్యక్రియలు జరుగనున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన. ముంబైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
కూతురు ప్రేమ పెళ్లి.. బతికుండగానే పిండం పెట్టిన తండ్రి.. వైరల్
సాక్షి, మహబూబ్‌నగర్: ఎంతో ప్రేమగా చూసుకున్న కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె బతికుండగానే పిండం పెట్టాడు. గుండు గీయించుకుని దినకర్మలు కూడా నిర్వహించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లాలోని చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అదే గ్రామానికి చెందని వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సమీప బంధువులే కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ జంట.. తాము ప్రేమించుకున్నామని, పెళ్లి చేయాలని పెద్దలను కోరారు. అందుకు వారు ఒప్పుకోకపోవడంతో ఈ నెల 13న పెద్దలను ఎదురించి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే తమను కాదని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందని భార్గవి తండ్రి ఆమెపై కోపం పెంచుకున్నాడు. కూతురితో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. చదవండి: మైనర్‌పై 56 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం.. 7 నెలల గర్భిణి అంతటితో ఆగకుండా తన కూతురు చనిపోయిందంటూ గుండు గీయించుకుని ఆమెకు కర్మకాండలు జరిపించాడు. కూతురి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాడు. కూతురి ప్రేమ వివాహాన్ని భరించలేక తండ్రి చేసిన పని గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలాఉండగా.. కూతురి ఇష్టం మేరకు పెళ్లి చేస్తానని సదరు తండ్రి చెప్పినా.. ఆ యువతీ, యువకుడు వినలేదని స్థానికంగా ప్రచారం సాగుతోంది. తండ్రి మాటపై నమ్మకం లేకనే ఆ యువతి గుడిలో ప్రేమ పెళ్లి చేసుకుందని కొందరు చెప్తున్నారు. అందుకనే తన మాటకు విలువ ఇవ్వని బిడ్డపై అతను పిండ ప్రదానం చేసి ఆక్రోషం వెళ్లగక్కాడని అంటున్నారు. చదవండి: Hyderabad City Bus: ‘ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడం లేదు. ఇబ్బందిగా ఉంది’ -
తల్లికి తలకొరివి పెట్టిన కూతురు
ఇచ్ఛాపురం రూరల్: తల్లి మరణించడంతో కూతురే కొడుకై తలకొరివి పెట్టిన ఘటన బుధవారం ఇచ్ఛాపురం మండలం కేశుపురంలో చోటుచేసుకుంది. తెలుకల బృందావతి కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఈమె ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరు దివ్యాంగులు. భర్త హడ్డీ సాహూ కుటుంబాన్ని వెళ్లిపోవడంతో కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. బుధవారం తీవ్ర అస్వస్థత కారణంగా బృందావతి మృతి చెందింది. చిన్న కుమార్తె, దివ్యాంగురాలు శాంతి అన్నీ తానై తల్లికి తలకొరివి పెట్టింది. ముగ్గురు అవివాహిత కుమార్తెల్లో ఇద్దరు దివ్యాంగులు కావడంతో ప్రభుత్వం చేయూతనందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
తల కొరివి పెట్టకుండా పరారైన కొడుకు
సాక్షి, కృష్ణా : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లికి తల కొరివి పెట్టకుండా ఓ కొడుకు భార్యా బిడ్డలతో ఇంటినుంచి పరారయ్యాడు. ఈ సంఘటన మచిలీపట్నం జిల్లా కోర్టు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నానికి చెందిన రాజారత్నం అనే మహిళ గత కొద్దిరోజులుగా బంటుమిల్లులోని కూతురు దగ్గర ఉంటోంది. నిన్న రాత్రి ఆమె మరణించింది. దీంతో కూతురు, అల్లుడు శవాన్ని బందరులోని కుమారుడు నాగ వర ప్రసాద్ ఇంటి వద్దకు తీసుకువచ్చారు. ( వేడి వేడి ఉల్లి పకోడిలో కప్ప) తాను మృతదేహాన్ని ఖననం చేయనంటూ నాగ వర ప్రసాద్ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. ఏఆర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అతడు.. తమ అక్క, బావలు డబ్బుల కోసం తన తల్లిని చంపారని చిలకపూడి స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తల కొరివి పెట్టాల్సిన కుమారుడు ఇంటికి తాళం వేసి, కుటుంబసభ్యులతో వెళ్లిపోవడటంతో స్థానిక ప్రజలు విస్తుపోతున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ కలుగ జేసుకోవటంతో నాగ వర ప్రసాద్ తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నాడు. -
ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
-
ముగిసిన ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అంతిమ యాత్ర ముగిసింది. లోధి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సైనిక లాంఛనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం పరిమిత సంఖ్యలో జనాభాను అనుమతించారు. అంతకు ముందే రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆశ్రునయనల మధ్య ఆయనకు వీడ్కోలు పలికారు. కరోనాతో పోరాడి ప్రణబ్ ముఖర్జీ సోమవారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రణబ్‌కు ప్రముఖుల నివాళి -
నేను ఆ బాధను వర్ణించలేను: పవర్ లిఫ్టర్
బెంగళూరు: ఎవరైనా కరోనాతో చనిపోతే వారిని కడసారి చూడటానికి కుటుంబ సభ్యులకు, బంధువులకు సైతం వీలులేకుండా పోతుంది. కొన్ని చోట్ల అయితే మృతదేహాన్ని తమ గ్రామంలో ఖననం చేయడానికి వీల్లేదనే సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు కూడా ముందుకు రాని పరిస్థితి చాలాచోట్ల నెలకొంది. దీంతో మున్సిపాలిటీ వాళ్లో, ఆస్పత్రి సిబ్బందో అంత్యక్రియలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సోకి మరణించిన వారి సంఖ్య పెరిగిపోతుండటంతో చనిపోయిన వారిని ఖననం చేసే పనిలో కొన్ని ఎన్జీవోలు కూడా పాల్గొంటున్నాయి. అలా పనిచేస్తున్న మెర్సీ మిషన్‌తో ప్రఖ్యాత పవర్ లిఫ్టర్ మొహమ్మద్ అజ్మతుల్లా భాగస్వామ్యులయ్యారు. అయిన కోవిడ్ 19తో మరణించిన మృతదేహాలను మోసుకువెళ్లి అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కరోనా వైరస్ కారణంగా మరణించిన వ్యక్తి మృతదేహాన్ని మోస్తున్నప్పుడు నేను అనుభవించిన బాధను మాటలతో చెప్పలేను’ అని పేర్కొన్నారు. చదవండి: కరోనా బూచి చూపి ఇతర రోగులపై నిర్లక్ష్యం ఐటీ సంస్థ డిఎక్స్ సి టెక్నాలజీలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పని చేస్తున్న అజ్మతుల్లా వారాంతాలలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లాక్డౌన్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన జూలై నెలలో కరోనా మరణాలు ఎక్కువ కావడంతో ఖననంలో కూడా పాలుపంచుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ ‘మరణం ఎవరికైనా ఎప్పుడైనా వస్తుంది. కరోనాతో మరణించిన వారిని చూసి అందరూ భయపడుతున్నారు. వారి దగ్గరకు కూడా రావడం లేదు. కరోనా వచ్చి 20ఏళ్ల వయసులోనే మరణించిన వారిని నేను చూశాను. అదేవిధంగా 80 ఏళ్ల వయసులో కూడా కరోనాను జయించిన వారిని కూడా చూశా. కరోనా మనకు కూడా ఎప్పుడొ ఒకసారి రావచ్చు. నాకు దాని గురించి భయం లేదు. కానీ నేను అన్ని జాగ్రత్తలు తీసుకొని మృతదేహాలను ఖననం చేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా కుటుంబం ఉంది’ కదా అని అజ్మతుల్లా పేర్కొన్నారు. చదవండి: కరోనా భయం.. కొరవడిన మానవత్వం -
రియా చక్రవర్తిని విచారించిన పోలీసులు
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై హీరోయిన్ రియా చక్రవర్తిని పోలీసులు సోమవారం ప్రశ్నించారు. ఆదివారం ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు సుశాంత్ మృతదేహాన్ని ముంబైలోని కూపర్ ఆసుపత్రికి తరలించారు. దీంతో సుశాంత్‌ను చూసేందుకు రియా కూపర్ ఆసుపత్రికి సోమవారం చేరుకున్నారు. అక్కడ ఆమెను చూసిన పోలీసులు సుశాంత్ ఆత్మహత్యకు తనకు సంబంధం ఉందా అనే కోణంలో విచారించారు. (సుశాంత్ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ) దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ఆత్మహత్యకు సంబందించి ఎలాంటి సుసైడ్ నోట్ దొరకకపోవడంతో దర్యాప్తులో భాగంగానే రియాను విచారించామని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ముంబైలోని విలే పార్లే వద్ద పవన్ హన్స్ శ్మశానవాటికలో సుశాంత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా గతంలో రియా, సుశాంత్‌లు ప్రేమలో ఉన్నారంటూ బిటౌన్లో వీరిద్దరూ చక్కర్లు కొడుతున్న ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతేగాక సుశాంత్ పుట్టిన రోజున రియా వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి ప్రత్యేకంగా శుభకాంక్షలు తెలిపారు. (ఆ ‘దెయ్యమే’ సుశాంత్‌ను పీడించింది!) అయితే వారిద్దరి ప్రేమాయణం నిజమా..?! Mumbai: Actor and #SushantSinghRajput's friend Rhea Chakraborty visited Cooper Hospital, where his body has been kept, earlier today. She will be questioned by the Police in connection with the case. pic.twitter.com/SxE4jturor — ANI (@ANI) June 15, 2020 -
తండ్రి మృతి.. చివరిచూపు 3 నిమిషాలే!
ఇంపాల్: మరణించిన తండ్రిని చూడటం కోసం అంజలి హమాంగ్టే(22) స్వగ్రామం కాంగ్పోక్పి వచ్చింది. దూరం నుంచే తండ్రి శవపేటికను చూస్తూ ఏడుస్తుంది. తల్లి, తోబుట్టువులు, స్నేహితులు ఎవరు ఆమెను దగ్గరకి తీసుకుని ఓదార్చలేదు. సరిగ్గా మూడు నిమిషాలు గడవగానే ఓ పిలుపు వినిపించింది. వెంటనే అంజలి అక్కడ నుంచి వెళ్లి పోయింది. 3 నిమిషాల్లో వెళ్లడం.. తల్లి సైతం పలకరించకపోవడం వంటివి చూసి ఆమె ఎంత పెద్ద నేరం చేసిందో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అంజలి వచ్చింది క్వారంటైన్ నుంచి. అందుకే ఎవరు ఆమె దగ్గరకి వెళ్లలేదు. ప్రస్తుతం ఈ దృశ్యాలు అందరిని కలచి వేస్తున్నాయి. గత నెల 25న అంజలి చెన్నై నుంచి శ్రామిక్ రైలులో మణిపూర్ వచ్చింది. అయితే ఆమెతో పాటు ప్రయాణించిన మరో స్త్రీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అంజలి ప్రస్తుతం క్వారంటైన్లో ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తీవ్రమైన అనారోగ్యంతో ఆమె తండ్రి మరణించాడు. కడసారి తండ్రిని చూడటం కోసం వైద్యాధికారుల అనుమతితో.. పీపీఈ కిట్ ధరించి క్వారంటైన్ సెంటర్ నుంచి వచ్చింది అంజలి. అందరికి దూరంగా నిల్చూని.. శవపేటిక మీదుగానే తండ్రిని చూసి.. మూడు నిమిషాల్లో వెనుదిరిగింది. -
తండ్రి చివరిచూపుకు రిద్దిమాకు అనుమతి
న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు రిషీకపూర్ గురువారం ఉదయం అనారోగ్యంతో ముంబైలోని హాస్పిటల్లో కన్నుమూశారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన కుమార్తె రిద్దిమా కపూర్ తండ్రి చివరిచూపు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో విమాన సర్వీసులతోపాటుగా అంతరాష్ట్ర ప్రజా రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రిద్దిమా తనకు ముంబై వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం ఆమె అధికారులకు దరఖాస్తు కూడా అందజేశారు. దీనిపై స్పందించిన అధికారులు రోడ్డు మార్గంలో ఆమె ముంబై వెళ్లేందుకు అనుమతిచ్చారు. (24 గంటల్లోనే ఇలా జరిగితే ఎలా.. ?) దీంతో రిద్దిమా రోడ్డు మార్గంలో 1400 కి.మీ ప్రయాణించి ముంబై చేరుకోనున్నారు. ఇందుకు దాదాపు 18 గంటలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. రిద్దిమా ముంబై చేరకున్నాకే.. రిషీకపూర్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, ప్యాషన్ డిజైనర్‌గా ఉన్న రిద్దిమా.. వ్యాపారవేత్త భరత్ సాహ్నిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి ఆమె ఢిల్లీలో నివాసం ఉంటున్నారు.మరోవైపు రిషీకపూర్‌కు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం నటి ఆలియా భట్ ఆస్పత్రికి వెళ్లి రిషికపూర్‌కు నివాళులర్పించారు. ( ప్రముఖ నటుడు రిషీకపూర్ కన్నుమూత) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కరోనా విలయం: విదారక ఘటన
భోపాల్: కరోనా మహమ్మారి విజృంభణతో చేటు కాలం దాపురించింది. కోవిడ్-19 సోకి చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అయినవారు కూడా భయపడేంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనాతో చనిపోయిన తండ్రికి అంతిమ సంస్కారాలు చేసేందుకు కొడుకు నిరాకరించిన విదారక ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వెలుగు చూసింది. స్థానిక తహశీల్దార్ గులాబ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి కోవిడ్ సోకి ఈనెల 20న మృతి చెందాడు. హిందూ సంప్రదాయం ప్రకారం అతడికి అంత్యక్రియలు నిర్వహించాలని భార్య, కుమారుడు, తోడల్లుడు అనుకున్నారు. తర్వాత ఏమైందో వారు వెనుకడుగు వేశారు. (‘కోట’ నుంచి విద్యార్థులను తీసుకొచ్చినట్టుగా..) ‘వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ) ధరించి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ప్రేమ్ సింగ్ కుమారుడికి నచ్చజెప్పినా అతడు ముందుకు రాలేదు. కరోనా వైరస్ సోకుతుందన్న భయంతో అతడు వెనుకడుగు వేశాడు. ప్రేమ్ సింగ్ భార్య కూడా కొడుకు నిర్ణయాన్ని సమర్థించింది. చేసేది లేక కొంత మంది సాయంతో మేమే అంత్యక్రియలు నిర్వహించాం. ఆ సమయంలో ప్రేమసింగ్ కుటుంబ సభ్యులు శ్మశానంలోనే దూరంగా నిలుచున్నారు. వారి ఆచార వ్యవహారాల ప్రకారమే అంత్యక్రియలు పూర్తి చేశాం. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరుగుతోంద’ని తహశీల్దార్ గులాబ్ సింగ్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కోవిడ్-19 సోకి ఎవరైనా మరణిస్తే శవాన్ని చూసేందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులు చూసేందుకు అనుమతి ఉంది. అయితే మృతదేహాన్ని తాకడం, హత్తుకోవడం, ముద్దుపెట్టడం వంటివి చేయరాదు. ఇది చదవండి: క్వారంటైన్ రుణం తీర్చుకున్నారు.. ఇలా! -
విజయనిర్మల అంత్యక్రియలు పూర్తి
సాక్షి, హైదరాబాద్ : గురువారం మృతి చెందిన సినీ దిగ్గజం విజయనిర్మల అంత్యక్రియలు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్లో ముగిశాయి. కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు సమక్షంలో కుమారుడు నరేష్.. విజయనిర్మల చితికి నిప్పటించారు. శుక్రవారం ఉదయం వరకు అభిమానుల సందర్శనార్థం నానక్‌రామ్ గూడ నివాసంలో విజయనిర్మల పార్థివ దేహాన్ని ఉంచారు. ఆమె ఇంటి నుంచి పార్థి దేహాన్ని ఫిలిం చాంబర్‌కు తీసుకువచ్చి అక్కడ కాసేపు ఉంచి తరువాత విజయకృష్ణ గార్డెన్‌కు తరలించారు. తమ అభిమాన నటి కడసారి చూపు కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు అశ్రునయనాలతో విజయనిర్మలకు తుది వీడ్కోలు పలికారు. -
అమర వీరుడికి భార్య అరుదైన నివాళి
-
భర్తకు ముద్దిచ్చి.. ఐ లవ్ యూ చెప్పి...
‘నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. మేమంతా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. ఎందుకంటే ప్రతిఒక్కరినీ నువ్వు ప్రేమించే పద్ధతి భిన్నంగా ఉంటుంది. కనీసం ఎప్పుడూ నిన్ను కలవని వారి కోసం ప్రాణత్యాగం చేశావంటే నువ్వు ఎంత గొప్ప ధైర్యశాలివి? నిన్ను భర్తగా పొందడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా జీవితం నీకే అంకితం. నిజమే.. నువ్వు మాకు దూరం కావడం బాధగానే ఉంది. కానీ నువ్వెప్పుడూ మా చుట్టూనే ఉంటావు. ఆయన మరణంపై సానుభూతి చూపించొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనమంతా ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. మనల్ని మరింత దృఢంగా ఉంచేందుకే ఆయన ప్రాణాలు ఫణంగా పెట్టారు. ఆయనకు సెల్యూట్ చేయండి. జైహింద్’... ఆర్మీ మేజర్ విబూది శంకర్ ధొండ్యాల్ భార్య నితిక కౌల్ ఉద్వేగంగా అన్న మాటలివి. దేశం కోసం అమరుడైన భర్తకు ఆమె అరుదైన నివాళి అర్పించారు. తన భర్త నిజమైన హీరో అంటూ కొనియాడారు. కొండంత బాధను గుండెల్లో దాచుకుని భర్తకు చివరిసారిగా ముద్దిచ్చి ‘ఐ లవ్ యూ’ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు జాతియావత్తును కదిలించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విస్తృతంగా తిరుగుతోంది. సోమవారం కశ్మీర్‌లోని పింగ్లాన్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో విబూది ధొండ్యాల్ వీర మరణం చెందారు. ఆయన భౌతిక కాయానికి హరిద్వార్‌లోని గంగా నది తీరంలో మంగళవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. (ఎన్కౌంటర్లో కమ్రాన్ హతం) డెహ్రడూన్‌కు చెందిన విబూది ధొండ్యాల్తో నితికకు 10 నెలల క్రితమే పెళ్లైంది. మొదటి పెళ్లిరోజును భర్తతో కలిసి సంతోషంగా జరుపుకోవాలన్న నితికకు పుల్వామా ఉగ్రదాడి రూపంలో ఊహించని ప్రమాదం ఎదురైంది. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులైన ముష్కరులకు మట్టుబెట్టే క్రమంలో నికిత భర్త నేలకొరిగారు. తీవ్రవాదం పెచ్చరిల్లడంతో 90వ దశకంలో నితిక తల్లిదండ్రులు కశ్మీర్‌ను వదిలి వచ్చేశారు. ఏదైతే జరగకూడదని భావించారో చివరకు అదే జరిగింది. ముష్కర మూకలు నితిక భర్త ప్రాణాలను బలితీసుకున్నాయి. అయితే క్లిష్టసమయంలో ఆమె చూపిన గుండెనిబ్బరం, పోరాట స్ఫూర్తికి ప్రజలు సలాం చేస్తున్నారు. -
రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు ప్రారంభం
ఖమ్మం: పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు శనివారం ప్రారంభమైనాయి. జిల్లాలోని ఆయన స్వగ్రామమైన పాత లింగాలలో పూర్తి అధికార లాంఛనాలతో వెంకటరెడ్డి అంత్యక్రియలు జరుగుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారుతోపాటు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. అలాగే జిల్లాలోని ఆయన అభిమానులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట్‌రెడ్డి(72) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... శుక్రవారం రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. -
ప్రియుడి ఇంటి ముందే ప్రియురాలి శవం ...
నల్గొండ: ప్రేమించిన అమ్మాయిని వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనతో ఆగ్రహంతో ఉన్న వారు ప్రేమికుడి ఇంటి ముందే శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ సంఘటన శనివారం నల్గొండ జిల్లా చౌచటుప్పల్ మండలం తాళ్ల సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికల కథనం ప్రకారం.... తాళ్ల సింగారం గ్రామానికి చెందిన నల్ల వసంత(21), ఎర్రగాని రమేష్ (24)లు ఓ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం ఇంటిలో తెలియడంతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇరువురి కుటుంబాలు వీరి వివాహం చేసేందుకు అంగీకరించారు. అయితే ప్రేమికుడు రమేష్‌కు అన్న ఉన్నాడు. దాంతో అతడికి వివాహాం చేసిన తర్వాతే రమేష్ వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. కాగా శుక్రవారం వసంత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రహించిన అమ్మాయి తల్లిదండ్రులు రమేష్ వేధింపులు భరించలేకే చనిపోయిందని ఆరోపించారు. అంతేకాకుండా ఆమె మృతదేహాన్ని శనివారం రమేష్ ఇంటి ముందే పూడ్చిపెట్టారు.