ఖమ్మం: పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు శనివారం ప్రారంభమైనాయి. జిల్లాలోని ఆయన స్వగ్రామమైన పాత లింగాలలో పూర్తి అధికార లాంఛనాలతో వెంకటరెడ్డి అంత్యక్రియలు జరుగుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారుతోపాటు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. అలాగే జిల్లాలోని ఆయన అభిమానులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట్‌రెడ్డి(72) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల కేన్సర్‌తో
బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... శుక్రవారం రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే.
రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు ప్రారంభం
Published Sat, Mar 5 2016 1:36 PM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM
Advertisement
Advertisement