t cong mla
-
జీవన్‌రెడ్డికి ఫోన్ చేయించిన మంత్రి..
కలెక్టరేట్ చేరుకుని మంత్రితో మాట్లాడిన ఎమ్మెల్యే జగిత్యాల అర్బన్ : జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌ను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించేందుకు సోమవారం వచ్చారు. అయితే జిల్లాగా ఏర్పడుతున్న జగిత్యాలలో కార్యాలయూలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వాటిని సందర్శించిన దాఖలాలు లేవు. దీంతో స్పందించిన మంత్రి జీవన్‌రెడ్డికి ఫోన్ చేయమని డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు సూచించారు. డీఎస్పీ ఫోన్లో మాట్లాడగా..వెంటనే జీవన్‌రెడ్డి కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా ఏర్పాటుకు సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకున్నారు. -
'టీఆర్ఎస్ వినిపించుకోవడం లేదు'
హైదరాబాద్ : గద్వాల్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఏడాది నుంచి పోరాడుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వినిపించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ ఆరోపించారు. శనివారం టీ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిల పక్షంలో చర్చించాల్సిన అంశాలను ఈ సందర్భంగా టీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా డి.కె.అరుణ మాట్లాడుతూ...ఆలంపూర్, గద్వాల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే సదరు నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. నోటిఫికేషన్లో గద్వాల్ జిల్లా లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డీకే అరుణ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ ఈ అఖిల పక్ష సమావేశానికి హజరుకానున్నారు. -
'ఏ ప్రాంతం వారిని ఆ రాష్ట్రానికే కేటాయించాలి'
హైదరాబాద్ : న్యాయాధికారుల సస్పెన్షన్ సమంజసం కాదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆప్షన్ అడిగినప్పుడే సీఎం కేసీఆర్ స్పందించి ఉండాల్సిందని ఆయన అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో టి. జీవన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు సద్దుమణిగిన విధంగా హైకోర్టు విభజన సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆయుత చండీయాగానికి రావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానించిన సంగతి ఈ సందర్భంగా టి.జీవన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే హైకోర్టు విభజనపై చంద్రబాబుతో ఎందుకు మాట్లాడలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. హైకోర్టు విభజన జరిగేంత వరకు న్యాయాధికారుల విభజన ఆపాలని కేంద్రప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏ ప్రాంతం వారిని ఆ రాష్ట్రానికే కేటాయించాలన్నారు. కేసీఆర్ భేషజాలకు పోకుండా ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడకుండా హైకోర్టు విభజన సమస్య పరిష్కారం కోసం చంద్రబాబుతోనూ కేంద్రంతోనూ చర్చించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రాజేసే విధంగా ఇద్దరు సీఎంలు వ్యవహరించడం సరికాదని టి.జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. -
టి. కాంగ్రెస్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నాయకుడు, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని బాగు చేయాలంటే తక్షణమే సర్జరీ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. టి. కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయకపోతే పార్టీని పోస్ట్‌మార్టం చేసే పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను మించిన అసమర్థుడు ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని ఆయన ఆరోపించారు. పార్టీ వరుస ఓటములకు బాధ్యత వహించి... పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందని ఉత్తమ్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. పార్టీ నాయకులు సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైందన్నారు. నేనే పీసీసీ చీఫ్ అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేవాణ్ణి... లేదంటే రాజీనామా చేసేవాణ్ణి అని చెప్పారు. పొన్నాల, ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలోనే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత పార్టీ పరిస్థితిపై తక్షణమే పార్టీ అధ్యక్షురాలు సోనియాకు లేఖ రాస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పాలని ఆయన అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలోని 15, 20 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు తామే సీఎం అభ్యర్థి అని అనుకుంటున్నారని వెల్లడించారు. గాంధీభవన్‌లో ప్రెస్మీట్లతో కాంగ్రెస్ పార్టీ ఒలపడదని... ఓట్లు కూడా రావని ఆయన పేర్కొన్నారు. భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ గ్రూప్ రాజకీయాలే కారణమని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన నేతలకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ సందర్భంగా అధిష్టానానికి సూచించారు. -
'హరీష్‌రావుతో భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదు'
హైదరాబాద్ : తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావుతో భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. హరీష్ రావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకే ఆయనను కలసినట్లు ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను హరీష్ రావు సందర్శించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనను కలసి కృతజ్ఞతలు చెప్పినట్లు చెప్పారు. టీఆర్ఎస్లో చేరతారా ? అని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు... టీఆర్ఎస్లో చేరతానని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. అలాగే నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అని విలేకర్లు ప్రశ్నించగా... ఈ అంశంపై నో కామెంట్ అంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జవాబు దాటి వేశారు. -
'కేసీఆర్‌తోనే తెలంగాణకు దరిద్రం పట్టుకుంది'
హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణకు దరిద్రం పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జీవన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ...ఉత్తర తెలంగాణలో ఏనాడు దరిద్రం లేదన్నారు. కాళేళ్వరం ప్రాజెక్ట్ ఎన్ని మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారో చెప్పాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ్మడిహట్టి వద్ద 155 మీటర్ల ఎత్తున ప్రాజెక్ట్ నిర్మిస్తేనే తెలంగాణకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అలాకాకుండా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం నిర్మిస్తే తెలంగాణకు ప్రయోజనం ఉందన్నారు. మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. -
'కేసీఆర్‌కు ఓటు వేయమని... నేనే చెబుతా'
నల్గొండ : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చాలా బాగుందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దాన్ని ఆచరణలోకి తీసుకొస్తే ఇంచా బాగుంటుందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... డబుల్ బెడ్ రూం ఇళ్ల హైదరాబాద్‌లో లక్షతోపాటు గ్రామానికో 50 ఇళ్లు నిర్మిస్తే... కేసీఆర్‌కు ఓటు వేయమని... నేనే చెబుతానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. -
'పేరు మార్చి హడావుడి చేస్తున్నారు'
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులు కరువు కోరల్లో చిక్కుకుని కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... కరువు మండలాల ప్రకటనలో ఆలస్యం జరిగిందని ఆరోపించారు. ఒకేసారి రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో కొత్తదనం ఏమీ లేదని విమర్శించారు. పేరు మార్చి హడావుడి చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీని జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. -
తెలంగాణ ప్రయోజనాలకు తాకట్టుపెట్టారు
హైదరాబాద్ : మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం వల్ల తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ ఎత్తును 152 నుంచి 148 మీటర్లకు తగ్గించారని జీవన్‌రెడ్డి విమర్శించారు. అలాగే మేడిగడ్డ వద్ద 103 నుంచి 101 మీటర్లకు తగ్గించారన్నారు. రూ. 40 వేల కోట్ల అదనపు భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లు అయినా మిడ్‌మానేరు పూర్తి చేయకుండా పునరావాస ప్యాకేజీ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ అని జీవన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. -
ఆశ్చర్యంగా ఉంది: జానారెడ్డి
హైదరాబాద్ : టీటీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనమైనట్లు స్పీకర్ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జానారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై మేమిచ్చిన పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టి... విలీనంపై నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పెండింగ్ పిటిషన్లను విచారించకుండానే.. ఎర్రబెల్లి పిటిషన్‌ను ఆమోదించడం ఎంతవరకు సమంజసమన్నారు. స్పీకర్ తీరుపై మా వ్యతిరేకత, నిరసనను తెలియజేస్తున్నామని జానారెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ తీరుతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు ప్రారంభం
ఖమ్మం: పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు శనివారం ప్రారంభమైనాయి. జిల్లాలోని ఆయన స్వగ్రామమైన పాత లింగాలలో పూర్తి అధికార లాంఛనాలతో వెంకటరెడ్డి అంత్యక్రియలు జరుగుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారుతోపాటు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. అలాగే జిల్లాలోని ఆయన అభిమానులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ రాంరెడ్డి వెంకట్‌రెడ్డి(72) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... శుక్రవారం రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. -
ఇద్దరు సీఎంలు రాజీపడ్డట్టు ఉన్నారు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ జీవన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుల వ్యవహారం దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా ఉందని ఆయన శనివారమిక్కడ ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమయ్యాయో రెండు ప్రభుత్వాలు ప్రజలకు సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండు కేసుల్లో ఇద్దరు సీఎంలు పరస్పరం ఆరోపించుకుని ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు రాజీపడ్డట్లు ఉన్నారని, వారి మధ్య సఖ్యత కుదిర్చేందుకే ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చినట్లు ఉందని జీవన్ రెడ్డి అన్నారు. ఇద్దరు దోషులతో మోదీ చేయి కలపడం సరికాదని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్, చంద్రబాబుపై... కేంద్రం విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. -
అప్పటివరకూ సభను జరగనివ్వం: డీకే అరుణ
హైదరాబాద్ : రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేసే వరకు సభను జరగనివ్వమని టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో డీకే అరుణ మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలపై ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ముందుకు రావాలని ప్రభుత్వానికి డీకే అరుణ సూచించారు. లేకుంటే రైతుల ఆత్మహత్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏడాది కాలంలో రైతులు ఏ విధంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారో వీక్షిద్దామని చెప్పారు. అప్పుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మనస్సు కరిగి రైతు రుణాలు ఒకే దఫాలో మాఫీ చేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జల విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ఉభయ సభల సమావేశానికి అనుమతి ఇవ్వరాదని డీకే అరుణ ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. -
'స్వచ్ఛ హైదరాబాద్' కేవలం ప్రచార ఆర్భాటమే
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటమే అని తేలిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఎద్దేవా చేశారు. పరిశుభ్రతపై కేంద్రం నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నగరానికి 275వ స్థానం రావడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్తలో లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ స్పష్టం చేసిన విషయాన్ని డీకే అరుణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంటే ఉస్మానియా మరమ్మతులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా చారిత్రక కట్టడం దెబ్బతినకుండా బాగు చేయాలని ఆమె ప్రభుత్వానికి సూచించారు. గాంధీ కుటుంబంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. అవి తప్పుడు ఆరోపణలు అని అరుణ స్పష్టం చేశారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. -
కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. ఎన్నికల హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ కొత్త పథకాలు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. ఏడాది క్రితం మన ఊరు - మన ప్రణాళిక అంటూ ప్రకటించిన కేసీఆర్... ఇప్పుడు గ్రామజ్యోతి అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా వారికి మాత్రం కేసీఆర్ నష్ట పరిహారం ఇవ్వడం లేదని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ తాగునీటి సమస్య తలెత్తిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు. -
'కేసీఆర్ పాలన చంద్రబాబు పాలనను తలపిస్తోంది'
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పట్ల కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రైతులకను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే... కరెంట్ బకాయిలు చెల్లించలేదంటూ... రైతుల మోటార్లు, స్టాటర్లు లాక్కుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలన గతంలో చంద్రబాబు హయాంలో రైతులను వేధించిన ఉదంతాన్ని గుర్తుకు తెస్తోందన్నారు. రైతుల కరెంట్ బకాయిలను వెంటనే మాఫీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వానికి సూచించారు. తుది దశలో ఉన్న మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తక్షణమే రూ. 1000 కోట్లు విడుదల చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. -
స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి: జీవన్ రెడ్డి
హైదరాబాద్: నూతన ప్రారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రానికి రాబోయే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగా స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లలో మాట్లాడారు. పెద్ద పరిశ్రమల్లో స్థానిక రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని జీవన్‌రెడ్డి... కేసీఆర్ సర్కార్‌కు సూచించారు. -
'కేసీఆర్ గాల్లో తేలియాడుతున్నారు'
హైదరాబాద్: రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను విస్మరించి సీఎం కేసీఆర్ గాల్లో తేలియాడుతున్నారని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కరువు, అకాల వర్షాలకు తెలంగాణలో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... పంట నష్టం జరిగిన పండ్ల తోటలకు ఎకరాకు రూ. 50 వేలు, ఇతర పంటకు ఎకరాకు రూ. 20 వేలు చెల్లించాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు మండలాలను తక్షణమే ప్రకటించాలని కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
'తెలంగాణ ఎందుకు వచ్చిందా అనిపిస్తోంది'
-
'తెలంగాణ ఎందుకు వచ్చిందా అనిపిస్తోంది'
నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం నల్గొండలో నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలన చూస్తుంటే తెలంగాణ ఎందుకు వచ్చిందా అనిపిస్తోందని అన్నారు. ఎన్నికల హామీలు పేపర్లకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. అవి వాస్తవ రూపం దాల్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ హైదరాబాద్‌లో హడావిడి చేస్తున్నారన్నారు. సచివాలయాన్ని మార్చడం సరికాదు... ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోనే సచివాలయం ఉండగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు.