'కేసీఆర్ పాలన చంద్రబాబు పాలనను తలపిస్తోంది'
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పట్ల కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం హైదరాబాద్లో మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రైతులకను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే... కరెంట్ బకాయిలు చెల్లించలేదంటూ... రైతుల మోటార్లు, స్టాటర్లు లాక్కుంటున్నారని ఆరోపించారు.
కేసీఆర్ పాలన గతంలో చంద్రబాబు హయాంలో రైతులను వేధించిన ఉదంతాన్ని గుర్తుకు తెస్తోందన్నారు. రైతుల కరెంట్ బకాయిలను వెంటనే మాఫీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వానికి సూచించారు. తుది దశలో ఉన్న మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తక్షణమే రూ. 1000 కోట్లు విడుదల చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.