komatireddy venkat reddy
-
మంత్రి కోమటిరెడ్డి Vs జగదీష్ రెడ్డి.. రాజ్‌భవన్ వద్ద సీఎం చేసిందేంటి?
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు తాజాగా జగదీష్ రెడ్డి కౌంటిరచ్చారు. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కేటీఆర్‌ను చూస్తేనే ముఖ్యమంత్రి, మంత్రులు భయపడిపోతున్నారంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణభవన్(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో రైతులను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. కేటీఆర్‌ను చూసి సీఎం, మంత్రులు భయపడుతున్నారు. పోలీసుల సూచన మేరకు 12వ తేదీన జరగాల్సిన నల్గొండ రైతు దీక్షను వాయిదావేశాం. ఎక్కడి నుండి ఒత్తిడి వచ్చిందో పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. కోమటిరెడ్డి వలనే పోలీసులు అనుమతి రద్దు చేశారు. నల్గొండ సభకు పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్ళాము. హైకోర్టు సూచనతో ముందుకు వెళ్తాం.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారు. పోలీసులు లేకుండా, సెక్యూరిటీ లేకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఎక్కడికైనా వెళ్లి రాగలరా?. ఎప్పుడు దొరుకుతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రైతుల ధాన్యం కొనే వరకు మేము కల్లాల్లోనే ఉన్నాం. మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి రైతులను దళారులకు కాంగ్రెస్ నేతలు అప్పచెప్పారు.కేటీఆర్ నల్గొండ వస్తుంటే కోమటిరెడ్డికి ఎందుకు అంత భయం?. నల్గొండ క్లాక్ టవర్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేస్తాయి. సీఎం, మంత్రులు హైదరాబాద్ నగరంలో ఈడీ ఆఫీసు, రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగలేదా?. కోమటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపై నాతో చర్చ చేసే దమ్ము కోమటిరెడ్డికి ఉందా?. కాంగ్రెస్ పాపాలతోనే జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి పుట్టింది. నేను జిల్లాలో చేసిన అభివృద్ధి చూడటానికి కోమటిరెడ్డి జీవిత కాలం సరిపోదు. సొంత నియోజకవర్గాలను కోమటిరెడ్డి అభివృద్ధి చేసుకోలేదు.యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఆపేస్తా అని కోమటిరెడ్డి చెబుతున్నారు. ఆయన స్పృహలో ఉండి మాట్లాడటం లేదు. సరైన పోటీ లేక నల్గొండలో కోమటిరెడ్డి గెలిచారు. భూపాల్‌రెడ్డి దెబ్బకు నల్గొండలో ఓటమి తప్పలేదు. మంత్రి ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారో అన్ని విషయాలు నా దగ్గర ఉన్నాయి. చేతగాక పోలీసుల చేత పర్మిషన్ రద్దు చేయించారు. మీరు 20,30 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఆస్తులు పెంచుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతకుముందు, మంత్రి కోమటిరెడ్డి.. నల్లగొండలో బీఆర్ఎస్ ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేసిన నేతలు జిల్లాకు ఎలా వస్తారు?. రేసుల మొనగాడు దీక్ష చేస్తే రైతులు నమ్మే పరిస్థితిలో లేరు. మూడు ఫీట్లు ఉన్న వ్యక్తి మూడువేల ఓట్లతో గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీ బొందలగడ్డ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
చిట్యాల: రోడ్డు ప్రమాదాలకు గల కారణాల్లో డ్రైవర్లకు దృష్టిలోపం ఉండటం కూడా ఒకటి. చాలామంది డ్రైవర్లకు అవగాహన లేక కంటి పరీక్షలు చేయించుకోరు. దాంతో వారికి దృష్టిలోపం ఉన్న విషయం వారికే తెలియదు. ఈ విషయాన్ని గుర్తించిన రోడ్డు రవాణా, పోలీస్ శాఖల అధికారులు.. వైద్యారోగ్య సహకారంతో డ్రైవర్లకు రహదారుల వెంట ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి వెంటనే కళ్లద్దాలు అందిస్తున్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమంలో రాష్ట్రంలో మొదటిసారి నల్లగొండ జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ‘నల్లగొండ దృష్టి’పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ దాబా వద్ద ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. వెంటనే అద్దాలు.. కంటి పరీక్షల శిబిరంలో పరీక్ష చార్ట్‌ను ఆహార పదార్థాల మెనూ కార్డు మాదిరిగా ఏర్పాటు చేశారు. రోటి, పరోటా, తందూరి, దాల్ వంటి పేర్లను హిందీలో రాశారు. ఆదివారం వివిధ రాష్ట్రాలకు చెందిన 82 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 32 మందికి కంటి అద్దాలు అందజేశారు. వీరిలో చాలామంది మొదటిసారి కంటి పరీక్షలు చేయించుకోవటం విశేషం. రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారుల వెంట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అవసరమైన సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
‘ఆ మాటలు మేము చెప్పం..’
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తరహా ‘బంగారు తెలంగాణ’ అనే మాటలు తాము చెప్పమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy). ఈరోజు(మంగళవారం) సాక్షి టీవీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ‘నాల్గో తేదీన క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది. సంక్రాంతికి రైతు భరోసా(Rythu Bharosa)నిధులు రైతులకు అందిస్తున్నాం, రైతులకు, తెలంగాణ ప్రజలకు ఇప్పటికే చేయాల్సింది చాలా చేశాం. రాబోయే ఐదేళ్లు మరింత కష్టపడి పనిచేస్తాం. ఆరువేల కోట్ల రూపాయలు పెట్టి ఔటర్ రింగ్ రోడ్డు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కడితే.. ఏడు వేల కోట్లకు కేసీఆర్ అమ్ముకున్నాడు. డ్రగ్స్ నిర్మూలన కోసం సాక్షి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమానికి అభినందనలు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే హైదరాబాద్ కు సినీ ఇండస్ట్రీ వచ్చింది
-
ఇకపై నో బెనిఫిట్ షోస్
రాంగోపాల్‌పేట్: తెలంగాణలో ఇకపై ఎంత పెద్ద బడ్జెట్‌తో రూపొందించే సినిమాలకైనా బెనిఫిట్ షోలను అనుమతించబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అలాగే టికెట్ రేట్ల పెంపుపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సందేశాత్మక చిత్రాలతోపాటు తెలంగాణ పోరాటం, ఉద్యమం, చారిత్రక అంశాలపై రూపొందించే సినిమాలకు నామమాత్రంగా టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తామని తెలిపారు.సంధ్య థియేటర్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను శనివారం సాయంత్రం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్‌కు గొంతులో పైపులు వేసి ఆహారం అందిస్తున్నారని.. ప్రస్తుతం చాలా బలహీనంగా ఉన్నాడన్నారు. అతను కోలుకోవడానికి ఏడాదికిపైగా సమయం పట్టొచ్చని వైద్యులు అంటున్నారన్నారు.బాలుడు కోలుకొనే వరకు ప్రభుత్వం ఆస్పత్రి ఖర్చులు భరిస్తుందని చెప్పారు. ‘కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్’ ద్వారా రూ. 25 లక్షల చెక్కును బాలుడి తండ్రి భాస్కర్‌కు అందించారు. భాస్కర్‌కు ఆత్మస్థైర్యం అందించడంతోపాటు ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేందుకు సీఎం రేవంత్ ఆదేశాలతో తాను వచి్చనట్లు తెలిపారు. సంధ్య థియేటర్‌కు రావొద్దని పోలీసులు రాతపూర్వకంగా సూచించినప్పటికీ హీరో అల్లు అర్జున్ వచ్చారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కొద్దిగా మెరుగుపడ్డ శ్రీతేజ్ ఆరోగ్యం బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగుపడినట్లు కిమ్స్ ఆస్పత్రి శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. వెంటిలేటర్ సాయం లేకుండానే అతను శ్వాస తీసుకోగలుగుతున్నాడని పేర్కొంది. -
ధరణి పేరుతో లక్షల ఎకరాల స్కామ్
నల్లగొండ: ధరణి పేరుతో గత ప్రభుత్వం లక్షల ఎకరాల స్కామ్ చేసిందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లకు తగ్గకుండా సంపాదించుకుని రాష్ట్రాన్ని లూటీ చేశారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణిని తీసుకురావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్కామ్‌లు చేసి దోచుకున్నారని మండిపడ్డారు. ధరణితో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో భూభారతిని తీసుకొచ్చామన్నారు. ప్రతి రైతుకు గుంట భూమి ఉన్నా భూధార్ కార్డు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఇచి్చన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్, రూ.500కు గ్యాస్, ఉచిత కరెంట్‌తో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. సంక్రాంతికి రైతు భరోసాను అందిస్తామని తెలిపారు. వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు. సంక్రాంతికే ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోయడంతో పాటు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నామని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్సార్ మహిళలను లక్షాధికారులను చేస్తే ప్రస్తుత సీఎం మహిళలను కోటీశ్వరులను చేసే ఉద్దేశంతో ముందుకు పోతున్నారని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి రక్తదానం తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నల్లగొండ ఎన్జీ కళాశాల వద్ద శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో.. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రక్తదానం చేశారు. శిబిరంలో 200 మంది రక్తదానం చేసినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. -
మరోసారి కోమటిరెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం
-
మరోసారి కోమటిరెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం
-
టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా దిల్ రాజు.. సీనీ ప్రముఖుల అభినందనలు (ఫొటోలు)
-
హరీశ్‌రావు ఏమైనా డిప్యూటీ లీడరా?: కోమటిరెడ్డి
ాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి, హరీష్‌రావు మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. హరీష్‌రావు ఏ హోదాలో ప్రశ్నలు అడుగుతున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో, పొలిటికల్ హీట్ నెలకొంది.తెలంగాణలో ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం సభ ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు చెప్పారు. అనంతరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందిస్తూ.. ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీదే మూసీ పాపం. కాళేశ్వరం జలాలను నల్లగొండకు అందించామన్నారు. దీంతో, కోమటిరెడ్డి.. హరీష్ వ్యాఖ్యలు మండిపడ్డారు. Are You a Deputy Leader or an MLA?-- Harish Rao Questioned by Minister Komatireddyమీకు LP లీడర్ లేడుహరీష్ రావు.. నువ్వు డిప్యూటీ లీడర్ వా..?లేక శాసనసభ్యుడిగా...??అసలు ఏ హోదాలో నువ్వు మైక్ అడుగుతున్నావ్-- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి#TelanganaAssembly •… pic.twitter.com/zjt3SUAHEG— Congress for Telangana (@Congress4TS) December 19, 2024అనంతరం, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అసలు హరీష్‌రావు ఎవరు?. డిప్యూటీ లీడర్నా? ఎమ్మెల్యేనా? ఏ హోదాలో మాట్లాడుతున్నారు?. ఆయనకు అడిగే హక్కు లేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నారు? తెలంగాణ ప్రజలను ఆయన అవమానపరచడమే అవుతుంది. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పాను. డబ్బున్న వాళ్లు హైదరాబాద్ వచ్చారు. లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు నల్గొండ గురించి, నా గురించి మాట్లాడే హక్కు లేదు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ మూసీని పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం కూడా సభలో వీరద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అంతకుముందు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. రైతు సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేతలు ఎడ్ల బండ్లపై అసెంబ్లీకి వచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. -
గుంతల రోడ్లపై సభలో రచ్చ రచ్చ
-
హరీష్ రావును ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు
-
సభలో పొలిటికల్ రచ్చ.. అసెంబ్లీ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పెట్టాలన్న హరీష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడీవేడిగా కొనసాగుతున్నాయి. నేడు సభలో మంత్రులు వర్సెస్ మాజీ మంత్రి హరీష్ అన్నట్టుగా వాతావరణం నెలకొంది. సభలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు రోడ్ల అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘హరీష్‌రావుకు దబాయించడం తప్ప పని చేయడం తెలియదు. నేను మాట్లాడుతుండగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూర్చోవడం లేదు. ఆయనకు కూలిపోయే కాళేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం మాత్రమే తెలుసు. హరీష్.. 10వేల కోట్లు దోచుకున్నాడు. రోడ్లు వేయడం బీఆర్ఎస్ నేతలకు చేతకాదు.. కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు. లక్ష కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్ అమ్ముకున్నారు. ఏడేళ్లు అయినా ఉప్పల్‌లో ఉన్న ఫ్లై ఓవర్ పూర్తి చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్ కోసం మాత్రం నాలుగు లైన్ల రోడ్లు ఫామ్ హౌస్ వరకు వేసుకున్నారు. వచ్చే మార్చి నాటికి రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాము. వచ్చే నాలుగు ఎండ్లలో ఆర్ఆర్ఆర్ను పూర్తి చేస్తాం అన్నారు.ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డికి హరీష్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ మాట్లాడుతూ..‘వ్యక్తిగతమైనటువంటి విమర్శలు సభలో చేయకూడదని కొద్దిసేపటి క్రితమే మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. సిద్ధులు మాకే కాదు తమ మంత్రులకు కూడా చెప్పాలి. సభలో ఎవరు తప్పు మాట్లాడినా వారికి రూల్స్ వర్తిస్తాయా. కమీషన్ గురించి మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్టాలు అన్ని వరుసగా చదువుతాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాపై చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి. నేను కమీషన్ తీసుకున్నట్టు నిరూపించాలి అని సవాల్ విసిరారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి. కొంతమంది సభ్యులు మద్యం తాగి సభకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సభ్యులు తాగొచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హరీష్ రావు మాట్లాడిన మాటలు బాధిస్తున్నాయి. సభ్య సమాజం ఇబ్బంది పడే విధంగా హరీష్ రావు మాటలున్నాయి. హరీష్ రావు వెంటనే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.విప్ బీర్ల ఐలయ్య కామెంట్స్.. హరీష్‌రావుకు వాళ్ళ మామ గుర్తుకు వచ్చినట్టు ఉన్నాడు. అందుకు గుర్తుకొచ్చి సభలో మాట్లాడుతున్నారు. ఫామ్ హౌస్‌లో పడుకునే మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడేది. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం డ్రామాలు ఆడిందన్నారు. అనంతరం, స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..‘హరీష్ రావు, బీర్ల ఐలయ్య మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
‘కేటీఆర్ చేసింది పెద్ద తప్పు.. జైలుకు వెళ్లక తప్పదు’
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నగరంలో నిర్వహించిన ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. కేటీఆర్ చేసింది పెద్ద తప్పు అని, దానికి శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. ఆ కేసులో ఏడేళ్ల వరకూ జైల్లో ఉండాల్సి వస్తుందంటూ కోమటిరెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ చేసిన తప్పిదానికి బెయిల్ కూడా రాదని, ఆయనకు బెయిల్ రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి రావడం పట్ల మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ కేటీఆర్‌కు బెయిల్ రావాలని మొక్కుతున్నారు.ఎమ్మెల్యేలు శబరిమల వెళ్లడానికి నల్లదుస్తులు ధరించారు. కేటీఆర్ అరెస్టు అయితే శబరిమల వెళ్లి బెయిల్ రావాలని మొక్కుతారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు బెయిల్ వచ్చే చాన్స్ కూడా లేదు.’ అని కోమటిరెట్టి పేర్కొన్నారు. ఇవీ చదవండి: ‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్కేటీఆర్ ‘ఈ-కార్ రేస్’ కేసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు -
ఉత్తర ‘రింగు’కు అటవీ అనుమతులు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి అటవీ అనుమతులు మంజూరయ్యాయి. ఈ నెలాఖరుకు గాని జనవరి మొదటి వారంలో గాని ఈ రోడ్డుకు టెండర్లు పిలిచేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతున్న సమయంలో అటవీ అనుమతులకు సంబంధించిన ఇబ్బంది తొలగిపోయినట్టయ్యింది. ఇక పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. అవి కూడా వస్తే ఈ రోడ్డుకు ఎక్స్‌ప్రెస్ వే నంబర్ కేటాయింపు సులభవుతుంది. ఆ నంబర్ వస్తేనే టెండర్లు తెరిచేందుకు వీలుంటుంది. మెదక్ జిల్లా పరిధిలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లా పరిధిలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి జిల్లాలో 8.511 హెక్టార్లు .. వెరసి 72.3536 హెక్టార్ల అటవీ భూమిని ఉత్తర రింగు అలైన్మెంటులో భాగంగా సేకరించనున్నారు. ఇందుకు ప్రతిగా అటవీ శాఖకు వేరే ప్రాంతంలో అంతే మొత్తం భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. సేకరించే అటవీ భూమిలో కోల్పోయే చెట్లకు పరిహారంతో పాటు, కొత్తగా పొందే భూమిలో అటవీ శాఖ చెట్ల పెంపకానికి అయ్యే ఖర్చును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ భాగానికి కావాల్సిన భూమిలో 90 శాతం సేకరణ ప్రక్రియ పూర్తయింది. త్వరలో అవార్డులు పాస్ చేయటం ద్వారా భూ యజమానులకు పరిహారం చెల్లించనున్నారు.అనుమతి లేఖ అందింది: మంత్రి కోమటిరెడ్డిట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 72.3536 హెక్టార్ల అటవీ భూమి స్వాధీనానికి అనుమతిస్తూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కైలాష్ భీమ్రావ్ భవర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తర భాగం రీజినల్ రింగురోడ్డు నిర్మాణానికి భారతమాల పరియోజన కింద అనుమతి ఇస్తున్నట్టుగా లేఖలో పేర్కొనట్టు వెల్లడించారు. పర్యావరణ నిబంధనలకు లోబడి భూసేకరణ చేస్తామని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు తెలిపామని పేర్కొన్నారు. -
కేటీఆర్, హరీష్ రావులది నా స్థాయి కాదు: కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ జిల్లా: కేటీఆర్, హరీష్ రావులది తన స్థాయి కాదని.. వాళ్లు కేవలం కేసీఆర్ కుమారుడు, అల్లుడు మాత్రమేనంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘బంగారు తెలంగాణ అంటూ అప్పులు చేసి కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నాడు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు అవుతున్నాయా?. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేస్తాం’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.మోదీ సొంత రాష్ట్రంలో పదమూడు వందలకు గ్యాస్ సిలిండర్ విక్రయిస్తున్నారు. తెలంగాణలో రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రధాన మోదీ, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి’’ అని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తారిలా మార్చారు. ఒక ఇళ్లు కట్టకుండా కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేశాడుకేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకుంటే మోదీ విదేశాల్లో తిరుగుతున్నారు. డిసెంబరు మొదటి వారంలో సీఎం రేవంత్ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారు’’ అని కోమటిరెడ్డి తెలిపారు. -
పరిహారం చెల్లించాకే భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేసే ప్రయత్నం సరికాదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ముందుగా పరిహారం చెల్లించాకే భూములు సేకరించాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఎన్హెచ్ఏఐ అధికారులతో జరిపిన సమీక్షలో పలు సూచనలు చేశారు. మంచిర్యాల–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారికి సంబంధించి ఎన్హెచ్ఏఐ వద్ద పరిహారానికి సంబంధించి డ్రాఫ్ట్ అవార్డులు 1,023 వరకు పెండింగులో ఉండటంపై ప్రశ్నించారు. 15 రోజుల్లో వాటిని క్లియర్ చేస్తామని అధికారులు పేర్కొనే క్రమంలో.. భూమిని సేకరించి పరిహారం చెల్లిస్తామంటూ ఎన్హెచ్ఏఐ అధికారులు పేర్కొనటాన్ని మంత్రి తప్పుపట్టారు.భూముల విలువ ఆధారంగా పరిహారాన్ని ఖరారు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. మన్నెగూడ రోడ్డు విస్తరణ పనులను వచ్చేవారం ప్రారంభించాలని, తాను ఇప్పటికే పదిసార్లు ఆదేశించినా పనులు మొదలుపెట్టకపోవటమేంటని ప్రశ్నించారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి డిసెంబర్/జనవరిలో టెండర్లు పిలవాలని సూచించారు. శ్రీశైలం దారిలో మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్నందున తుక్కుగూడ నుంచి డిండి వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి నిర్ణయించామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.దీని ఆమోదంపై తాను సీఎంతో మాట్లాడతానని మంత్రి పేర్కొన్నారు. రూ.7 వేల కోట్లు ఖర్చయ్యే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఎంతో ఉపయుక్తమైందని, ఈ పనుల్లో వేగం పెరగాలని సూచించారు. భద్రాచలానికి 3 గంటల్లో వెళ్లేలా చేసే గౌరెల్లి–వలిగొండ రోడ్డు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మం–దేవరపల్లి రోడ్డులో సరీ్వసు రోడ్డు ఆప్షన్ ఉండాలని సూచించారు. విపక్షాల వికృత చేష్టలు.. రైతులకు లాభదాయక పరిహారం ఇచ్చి కీలక ప్రాజెక్టులకు భూసేకరణ కోసం యత్నిస్తుంటే విపక్షాలు కలెక్టర్లపై కూడా దాడులు చేసి చంపేందుకు కుట్రచేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత రాజకీయాల కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని బలిపశువును చేశారని విమర్శించారు. -
ధరణితో రైతులకు అన్యాయం
యాదగిరిగుట్ట: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో నిజమైన రైతులకు అన్యాయం చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిన భూములను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు మల్లన్నసాగర్ నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు కోసం యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ పైలాన్ పనులకు శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సీతక్క శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు భారీగా కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు రైతుల భూములు అడుగుతుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డుకొంటున్నారని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదలకు పంచిన 20 వేల ఎకరాల భూములను బీఆర్ఎస్ పాలనలో కేవలం రూ.5 లక్షలు, రూ.6 లక్షలకు ఎకరం చొప్పున గుంజుకున్నారని ధ్వజమెత్తారు. నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులను ఉత్సవాల్లాగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మేడిగడ్డలాగే బీఆర్ఎస్ సర్కారు కూలింది: కోమటిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని, వారికి మతి భ్రమించిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డ కూలినట్టే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందని చురకలంటించారు. డిసెంబర్ 6వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా బ్రాహ్మణ వెల్లంల డి్రస్టిబ్యూటరీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం పాల్గొన్నారు. -
మార్కులు కొట్టి... ‘మార్కెట్’ పట్టి...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అనుకోకుండా లభించిన అవకాశాన్ని ఓ మహిళ సద్వినియోగం చేసుకున్నారు. అడిగిన ప్రశ్నలకు మెప్పించేలా సమాధానం ఇచ్చారు. ఏకంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవిని చేజిక్కించుకున్నారు. మార్కెట్ కమిటీ పదవికి ప్రశ్నలేంటి? జవాబులేంటి? చైర్ పర్సన్‌ను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది కదా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయా? అలాంటి సందేహాలు నిజమే..అలాగే ప్రశ్నలకు సరైన జవాబులివ్వడం ద్వారా చైర్ పర్సన్ పదవికి ఎంపికైంది కూడా వాస్తవమే. కామారెడ్డి జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఈ వినూత్న ప్రయోగం చేశారు. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎంపికకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన యువతిని పదవికి ఎంపిక చేశారు. ప్రశ్నపత్రం రూపొందించి.. పరీక్ష నిర్వహించి.. సాధారణంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పేరు ను అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేనో లేదా ఆ పార్టీ ముఖ్య నాయకులో ప్రభుత్వానికి ప్రతిపాదించి నామినేట్ చేయిస్తారు. కానీ లక్ష్మీకాంతారావు ఇందుకు భిన్నంగా ఈ పదవికి మౌఖిక పరీక్ష నిర్వహిస్తామని, అందులో ఎక్కువ మార్కులు సాధించిన వారినే చైర్మన్‌గా నియమిస్తామని ప్రకటించారు. దీనికి మార్కెట్ కమిటీ పరిధిలోని మద్నూర్, జుక్కల్, డోంగ్లీ మండలాల నాయకులు కూడా సరే అన్నారు. ఎస్సీ మహిళకు కేటాయించిన ఈ పదవికి నిర్వహించిన మౌఖిక పరీక్షకు స్థానిక నేతల కుటుంబాలకు చెందిన 15 మంది మహిళలు సిద్ధమయ్యారు. దీంతో ఎమ్మెల్యే స్థానిక పార్టీ నేతలతో కలిసి ఓ ప్రశ్నపత్రం రూపొందించారు. మార్కెట్ కమిటీల విధులు, బాధ్యతలు, అభివృద్ధికి సంబంధించిన 15 ప్రశ్నలను పొందుపరిచారు. సెప్టెంబర్ 29న నిర్వహించిన ఈ పరీక్షకు ఆ 15 మందీ హాజరయ్యారు. వీరిలో జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన అయిల్వార్ సౌజన్య అత్యధిక మార్కులు సాధించారు. దీంతో ఆమె పేరును ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రభుత్వానికి పంపించారు. ఆ మేరకు ప్రభుత్వం తాజాగా సౌజన్యను చైర్ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15 ప్రశ్నలకు 12 సరైన జవాబులిచ్చిన సౌజన్య సౌజన్య ఎంఎస్సీ బీఈడీ చదివారు. పరీక్షలో 15 ప్రశ్నలకు గాను 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారు. ఈ పరీక్షకు ఆయా మండలాలకు చెందిన పూజా సందే, నమేవార్ పద్మ, జి.పార్వతి, వాగ్మారే ప్రియాంక, నమేవార్ అనిత, వాగ్మారే సోని, సంగీత తుకారాం, గైక్వాడ్ రాజాబాయి, కర్మల్కార్ సంగీత, అర్పిత అంజనీకర్, ఎడికే రాంబాయితో పాటు మరో ముగ్గురు హాజరయ్యారని సమాచారం. కాగా రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును, చైర్ పర్సన్‌గా నియమితులైన అయిల్వార్ సౌజన్యను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, నాయకులు మంత్రిని కలిశారు. ప్రతి ఎమ్మెల్యే ఇదే విధంగా ప్రయతి్నస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం: సీఎం మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా సౌజన్య ఎంపిక కావడంపై సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం.. పదవుల ఎంపికలో నయా దృక్పథం..ప్రజా పాలనకు తిరుగులేని సాక్ష్యం..ఈరోజు నిరుపేద కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మన ఆడబిడ్డ సౌజన్య మద్నూర్ మార్కె ట్ కమిటీ చైర్ పర్సన్‌గా ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయం. తొలిసారిగా ఇంటర్వ్యూ పద్ధతిలో, ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ, మహిళల చదువుకు.. ఆత్మస్థైర్యానికి ప్రోత్సాహమిచ్చేలా జరిగిన ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించింది..’అని సీఎం పేర్కొన్నారు. పారదర్శక విధానంలో ఈ పదవికి సౌజన్యను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు. -
కేటీఆర్ అలా మాట్లాడటం సిగ్గుచేటు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,సంగారెడ్డి జిల్లా: ప్రజా ఆశీర్వాదంతో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జహీరాబాద్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేళ్లు పాలించి రాష్ట్రంలో వందేళ్ళ ఆర్థిక విధ్వంసం సృష్టించారు. అభివృద్ధిని విస్మరించి స్నో, పౌడర్ ఖర్చులకు 50 వేల కోట్లు అప్పులు చేశారు. అధికారం పోయిన రెండో రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం మొదలు పెట్టారు. మాజీలమని మరిచి కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు. లగచర్ల ప్రజాభిప్రాయ సేకరణ రణరంగం వెనక బీఆర్ఎస్ శ్రేణులు కుట్ర ఉంది. కలెక్టర్‌పై దాడి చేసిన సురేష్ తన మనిషేనని కేటీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటు. ప్రజా ఆశీర్వాదంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరు.పైసా పైసాకు కూడబెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. జహీరాబాద్‌లో అధునాతన మోడల్ ప్రభుత్వ అతిథి గృహం నిర్మిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న అన్ని రహదారులకు మరమ్మత్తులు పూర్తి చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. -
Komatireddy: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వద్దంటే కాంగ్రెస్ లోకి వస్తున్నారు
-
‘గుంతలు లేని రోడ్లు కోసం వ్యూహాత్మక ప్రణాళిక’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల కోసం వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేండ్లు రోడ్లను నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్ర రహదారులను నిర్మించలేదని, జాతీయ రహదారుల మంజూరుకు ప్రయత్నించలేదన్నారు.గాలికి దీపంపెట్టి దేవుడా అని మొక్కినట్లు కేసీఆర్ రూలింగ్ చేశారని, తాము ఇప్పుడు రహదారుల మరమ్మత్తుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో 9 వేల కిలో మీటర్ల మేర రహదారులపై గుంతలు పూడుస్తామన్నారు. -
రోజుకో స్కామ్ బయటకి..కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
-
కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల అంశంపై ఈఆర్సీ వద్దకు కేటీఆర్ వెళ్ళడం ఒక పెద్ద జోక్ అని, ఆయన ఒక జోకర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం(అక్టోబర్22) మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ‘పార్లమెంట్లో ఒక్క సీటు రాకున్నా,అసెంబ్లీలో ఓడించినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటును పేదవాళ్ళకు మా ప్రభుత్వం ఇస్తోంది. కేంద్ర మంత్రులు సంజయ్,కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కి ఎంత నిధులు తెచ్చారు’అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.పార్లమెంట్ సెంట్రల్‌హాల్ తరహాలో అసెంబ్లీ..‘రూ.49కోట్ల అంచనాతో అఘాఖాన్ ట్రస్ట్ అసెంబ్లీని ఆధునికీకరిస్తోంది. ఈ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నిజాం తరహాలో ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నారు.పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహలో అసెంబ్లీ,కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు వెళ్లాలంటే వెహికిల్‌లో సీఎం మంత్రులు వెళ్లాల్సి వస్తుంది. రెండూ ఒకే దగ్గర ఉంటే టైం సేవ్ అవుతుంది’అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. -
‘జీహెచ్ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని నాలుగు కార్పొరేషన్లుగా విభజించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. ఈ విషయమై శనివారం(అక్టోబర్ 5) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ మహా నగరంలో జనాభా కోటిన్నరకు చేరింది.జీహెచ్ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా చేసిన తర్వాత నలుగురు మేయర్లు ఉంటారు.రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలుగురు మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.ఈ నగరాన్ని ప్రపంచ పటంలో ఉంచేందుకు రూ.30వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)ను నిర్మిస్తాం.అమెరికా తర్వాత అత్యధికంగా ఎంఎన్సీ కంపెనీల హెడ్‌క్వార్టర్స్ హైదరాబాద్‌లోనే ఉండనున్నాయి’అని కోమటిరెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: హోం మంత్రి పదవి ఇవ్వాలని..