
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అవినీతిని ప్రశ్నించినందుకే సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని హత్యచేశారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో బీఆర్‌ఎస్ హత్యా రాజకీయాలకు తెర లేపింది. లింగమూర్తి హత్య వెనుక గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ హయాం నుంచి తెలంగాణలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నించినందుకు లింగమూర్తిని చంపేశారు. కాళేశ్వరం అవినీతిపై రాజలింగం అనేక కేసులు వేసి పోరాడుతున్నారు. కేసీఆర్, హరీష్ రావుపై రాజలింగం కేసులు వేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోంది. అడ్వకేట్ సంజీవరెడ్డి మృతి అనేక అనుమానాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి చంపించారని లింగమూర్తి భార్య చెబుతున్నారు. కేసీఆర్, హరీష్ రావుపై కేసు వేసినందుకే చంపేశారని లింగమూర్తి కూతురు అంటున్నారు. గండ్ర వెంకట రమణారెడ్డిని పోలీసుల ముందు లొంగిపోవాలని కేసీఆర్ ఆదేశించాలి. అవినీతి బయటపడుతుందనే హత్యలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే నడిరోడ్డుపై వామన్ రావు దంపతులను హత్య చేశారు. నిందితుడు ఎవరో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలిసినా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. లగచర్ల దాడి సూత్రదారుడితో కేటీఆర్ 72 సార్లు మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేతల రాజకీయం ఇలా ఉంటుంది.

హరీష్ రావుకు అసలు మానవత్వం ఉందా?. కృష్ణా నీటిని ఏపీకి ఎక్కువ దోచిపెట్టిందే బీఆర్‌ఎస్. ఈ ఘటనను డైవర్ట్ చేయడానికే ఇలా మాట్లాడుతున్నారు. 15 నెలలుగా బయటకు రాని కేసీఆర్‌కు కాంగ్రెస్ గ్రాఫ్ గురించి ఏం తెలుసు?. ఎవరిని అడిగి కాంగ్రెస్ గ్రాఫ్ గురించి చెప్తున్నారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతూ.. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని చెబుతున్నారా?. బీఆర్‌ఎస్ హత్యలు చేయడం తప్ప ఇంకా ఏం చేయగలదు?. ఈ హత్యను సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సీబీసీఐడీతో విచారణ జరపాలని సీఎంను కోరుతాను. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి దోషులను శిక్షించాలి. ఈ కేసును న్యాయమూర్తి సుమోటోగా తీసుకోవాలి.
గండ్ర కౌంటర్..
మరోవైపు.. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కౌంటరిచ్చారు. తాజాగా గండ్ర మీడియాతో మాట్లాడుతూ.. లింగమూర్తి హత్యను మాకు చుట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ ఆధారాలతో మాపై నిందలు వేస్తున్నారు. బీఆర్‌ఎస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహించదు. ఈ విషయంపై కోర్టులోనే మేం చట్టపరంగా ఎదుర్కొంటాం. భూ వివాదాలతోనే హత్య జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. లింగమూర్తి హత్యకు నాకు, బీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment