సాక్షి, నల్గొండ జిల్లా: కేటీఆర్, హరీష్ రావులది తన స్థాయి కాదని.. వాళ్లు కేవలం కేసీఆర్ కుమారుడు, అల్లుడు మాత్రమేనంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘‘బంగారు తెలంగాణ అంటూ అప్పులు చేసి కేసీఆర్ ఫాంహౌస్లో పడుకున్నాడు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు అవుతున్నాయా?. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేస్తాం’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
మోదీ సొంత రాష్ట్రంలో పదమూడు వందలకు గ్యాస్ సిలిండర్ విక్రయిస్తున్నారు. తెలంగాణలో రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రధాన మోదీ, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి’’ అని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తారిలా మార్చారు. ఒక ఇళ్లు కట్టకుండా కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేశాడు
కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటే మోదీ విదేశాల్లో తిరుగుతున్నారు. డిసెంబరు మొదటి వారంలో సీఎం రేవంత్ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారు’’ అని కోమటిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment