సాక్షి, యాదాద్రి: పార్టీలో తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని.. బతుకు తెలంగాణే తన అభిమతమని అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. భువనగిరిలో బుధవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరగ్గా.. ఎంపీ కోమటిరెడ్డి హజరయ్యారు.
ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి.. నాకు ఏ పదవీ అవసరం లేదు.. నాకు బతుకు తెలంగాణ కావాలి. ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 సీట్లు కచ్చితంగా బీసీలకు కేటాయించాలని సోనియా, రాహుల్‌ను కోరాను. బలహీనవర్గాలను అవమానపరిస్తే ఖబడ్దార్. కాంట్రాక్టర్లు, రియల్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోండి. సామాజిక తెలంగాణ ఇంకెప్పడొస్తుంది కేసీఆర్? అని అధికార పక్షాన్ని నిలదీశారాయన. కేసీఆర్ కేబినెట్‌లో ఎక్కువమంది ఓసీలే.
..నాకు వ్యాపారాలు లేవు, గుట్టలు, కొండలు అమ్ముకోను అంటూ పరోక్ష విమర్శలు చేశారాయన. గుత్తా సుఖేందర్ రెడ్డి వియ్యంకుడికి గందమల్ల రిజర్వాయర్ పనులు అప్పగించారని, ఔటర్ రింగ్ రోడ్డును కాంట్రాక్టర్లు అప్పగించి ఆ డబ్బులతో రుణమాఫీ చేస్తున్నామంటున్నారని కేసీఆర్ సర్కార్‌పై ఆరోపణలు చేశారాయన. కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ అని విమర్శించారు. పంట నష్టం పది వేల రూపాయలు ఎక్కడని? ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment