సాక్షి, యాదాద్రి భువనగిరి: తెలంగాణలో హైడ్రా కారణంగా ప్రజలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు. ఒక్కొక్కరూ ఒక్కో గ్రూపు తయారు చేశారని ఎద్దేవా చేశారు. అలాగే, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బుధవారం యాదగిరిగుట్ట వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘హైడ్రా ప్రజలను హైరానా చేస్తోంది. ప్రజల దృష్టిని మరల్చడానికే హైడ్రా పనిచేస్తోంది. ఇళ్లను కూలగొట్టి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ఏం వచ్చింది?. యుద్ధం చేసినట్టుగా ఇళ్లను కూల్చివేస్తున్నారు. హైడ్రా కారణంగా ప్రజలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదు. అందరి ఇళ్లకు నోటీసులు ఇచ్చినట్టే నాకు కూడా నోటీసులు ఇచ్చారు. నేను కట్టిన కాలేజీలు అన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే.
కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే హస్తం పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నా. కేసీఆర్ పాలనలో పండించిన పంట కంటే ఎక్కువ పంట పండిస్తే కాంగ్రెస్ వాళ్లు పాలాభిషేకం చేస్తా. రేవంత్ సర్కార్ పాలనలో రైతుభరోసా లేదు. రుణమాఫీ పూర్తిగా కాలేదు. మంత్రుల మధ్య కూడా సఖ్యత సరిగాలేదు. ఒక్కొక్కరూ ఒక్కో గ్రూపు తయారు చేశారు. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు. కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: పాక్ కంపెనీలతో కలిసి రేవంత్ సర్కార్ భారీ స్కామ్: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment