‘కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే విద్వేషం ఉంది’ | MLC Kavitha Condemns Attack Of BRS Office In Bhuvanagiri | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే విద్వేషం ఉంది’

Published Sat, Jan 11 2025 6:23 PM | Last Updated on Sat, Jan 11 2025 6:50 PM

MLC Kavitha Condemns Attack Of BRS Office In Bhuvanagiri

యాదాద్రి: భువనగిరి బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంపై జరిగిన దాడిని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన దాడిగా ఆమె ఆరోపించారు. ‘ కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే విద్వేషం ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక దాడులు చేస్తున్నారు. ఏఐసీసీ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ వల్లించే మొహబ్బత్‌కి దుకాన్‌ ఒక బూటకం. కాంగ్రెస్‌ది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణం. కాంగ్రెస్‌ యువజన విభాగం గూండాల విభాగంగా మారింది. కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిద‌ర్శ‌నం. కాంగ్రెస్ గూండాల‌ను త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాలి.భౌతిక దాడుల‌తో గులాబీ సైనికుల‌ను భ‌య‌పెట్ట‌లేరు’ అని కవిత హెచ్చరించారు.

కాగా, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ కాస్తా తీవ్రంగా మారింది. . భువనగిరి బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎంపై బీఆర్‌ఎస్‌ నేత కంచర్ల వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల దాడిలో ఫర్నీచర్‌ ధ్వంసమైంది.

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

దాడులు చేయడం కాంగ్రెస్‌ పార్టీకి అలవాటే: కేటీఆర్‌
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

మరిన్ని పిచ్చి కేసులతో వేధిస్తారు: కేసీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement