హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నగరంలో నిర్వహించిన ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. కేటీఆర్ చేసింది పెద్ద తప్పు అని, దానికి శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. ఆ కేసులో ఏడేళ్ల వరకూ జైల్లో ఉండాల్సి వస్తుందంటూ కోమటిరెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ చేసిన తప్పిదానికి బెయిల్ కూడా రాదని, ఆయనకు బెయిల్ రావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి రావడం పట్ల మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ కేటీఆర్‌కు బెయిల్ రావాలని మొక్కుతున్నారు.ఎమ్మెల్యేలు శబరిమల వెళ్లడానికి నల్లదుస్తులు ధరించారు. కేటీఆర్ అరెస్టు అయితే శబరిమల వెళ్లి బెయిల్ రావాలని మొక్కుతారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు బెయిల్ వచ్చే చాన్స్ కూడా లేదు.’ అని కోమటిరెట్టి పేర్కొన్నారు.
ఇవీ చదవండి: ‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్
కేటీఆర్ ‘ఈ-కార్ రేస్’ కేసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment