
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి మండిపడ్డారు. ప్రధానంగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. తమ ఇళ్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తి నోరు మొత్తుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు.
ఈ మేరకు అనేక ప్రశ్నలు సంధించారు కేటీఆర్. ‘ కొడంగల్లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు.. మీ అన్న తిరుపతిరెడడఇకి దుర్గం చెవురు ఎఫ్‌టీఎల్‌లో ఇల్లు ఉండవచ్చు. మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్‌లో ప్యాలసులు కట్టవచ్చు. మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు.
కేవీపీ లాంటి పెద్దలు చెరువు బఫర్ లో గెస్ట్ హౌసులు కట్టుకోవచ్చు. పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి మూసి నదిలోనే అపార్ట్‌మెంట్ కట్టుకోవచ్చు. ఇవేమీ మీకు, మీ హైడ్రాకు కనబడవు’ అని ప్రశ్నించారు.
మిస్టర్ రేవంత్ రెడ్డి,
⭕️ నువ్వు కొడంగల్లో రెడ్డికుంటని పూడ్చి మహల్ కట్టవచ్చు
⭕️ మీ అన్న తిరుపతి రెడ్డికి దుర్గం చెరువు FTLలో ఇల్లు ఉండవచ్చు
⭕️ మీ రెవిన్యూ మంత్రి హిమాయత్ సాగర్ లో ప్యాలసులు కట్టవచ్చు
⭕️ మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు నడుమ గెస్ట్ హౌస్ కట్టవచ్చు
⭕️… pic.twitter.com/Vnuqyfb6i2— KTR (@KTRBRS) July 1, 2025