సాక్షి, తెలంగాణ భవన్: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణకు రావాలంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో కేసులకు భయపడేది లేదంటూ ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ క్యాడర్‌లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కనిపిస్తోంది. కేసులకు భయపడేది లేదు. ఏసీబీ కేసులో బలం లేదని రేవంత్‌కు కూడా తెలుసు. నేను మాట మార్చలేదు.. చెప్పినదానికే కట్టుబడి ఉన్నా.ఈ కార్ రేసుకు మంత్రి హోదాలో నేనే డబ్బులు కట్టమన్నా. ప్రొసీజర్ ప్రకారం జరగకపోతే .. ఈసీ,ఆర్‌బీఐ దగ్గరకు ప్రభుత్వం ఎందుకు పోలేదు?.డబ్బులు ముట్టిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు?’అని ప్రశ్నించారు.
ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు తెలుసు
ఎప్పుడు బయటకు రావాలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలుసు. 24ఏళ్ళు కేసీఆర్ కష్టపడ్డారు. కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు. తెలంగాణ బిడ్డ పీవీపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ఢిల్లీలో పీవీకి మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరు? మరణంలో కూడా పీవీని కాంగ్రెస్ గౌరవించలేదు. పీవీకి గౌరవం దక్కేవరకు రాజ్యసభలో బీఆర్ఎస్ కొట్లాడుతుంది. రేవంత్‌కు బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా మారారు. అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్రం ఎందుకు విచారణ జరపదు. రాష్ట్ర ప్రభుత్వ కుంభకోణాలకు కేంద్రం సహకరిస్తుంది. 2025లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగత కమిటీ వేస్తాం. లోకల్ బాడీస్‌లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తాం’అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కీలక పరిణామం
తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్‌కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ.. కేటీఆర్ సహా అరవింద్ కుమార్‌కు సైతం నోటీసులు ఇచ్చింది.
వివరాల ప్రకారం.. ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి తాజాగా కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా వచ్చే నెల ఏడో తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేస్ కేటీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment