సాక్షి, నల్గొండ: హైదరాబాద్‌లోని కుషాయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన నరేశ్, అతడి భార్య సుమ, కుమారుడు జస్విత్ మృతదేహాలకు సోమవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. నరేశ్ స్వగ్రామం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు సోదరుడిని కోల్పోయిన నరేశ్ పెద్ద కుమారుడు హాత్విక్‌ను దత్తత తీసు కుంటానని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.
ఢిల్లీలో ఉన్న ఆయన తన పీఏ సైదులుతో హాత్విక్ పేరిట బ్యాంకులో రూ. లక్ష డిపాజిట్ చేయించారు. ఖర్చుల నిమిత్తం నరేశ్ తల్లిదండ్రులకు రూ.25వేలను అందజేయించారు. నరేశ్ తల్లిదండ్రులను ఫోన్‌లో ఓదార్చారు. కొడుకు పోయిన బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని, అధైర్య పడొద్దని, అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. నరేశ్ కొడుకును ఇంటర్నేషనల్ స్కూ ల్‌లో చదివిస్తానని, పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని, ఢిల్లీ నుంచి రాగానే, గ్రామానికొచ్చి కలుస్తానని నరేష్ కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించారు.
చదవండి: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై మాణిక్‌రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment